karate championship
-
కామన్వెల్త్ కరాటే చాంపియన్‌షిప్: కార్తిక్ రెడ్డికి పసిడి, రజతం, కాంస్యం
కామన్వెల్త్ కరాటే చాంపియన్‌షిప్-2024 పోటీలు ముగిశాయి. సౌతాఫ్రికాలోని డర్బన్ వేదికగా నవంబరు 28- డిసెంబరు 1 వరకు జరిగిన ఈ మెగా ఈవెంట్ విజయవంతంగా పూర్తైంది. ఇందులో భారత చాంపియన్ అరబండి కార్తిక్ రెడ్డి నాలుగు పతకాలు గెలవడం విశేషం.ఎలైట్, క్లబ్ కేటరిగీలలో వేర్వేరు విభాగాల్లో పోటీ పడిన కార్తిక్ రెడ్డి.. పసిడి, రజత(రెండు), కాంస్య పతకాలు కైవసం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో భారత హెడ్‌కోచ్ కీర్తన్ కొండ్రు కార్తిక్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. అత్యుత్తమ నైపుణ్యాలతో పాటు అంకితభావం కలిగి ఉన్నందుకే కార్తిక్ రెడ్డికి ఈ విజయాలు సాధ్యమయ్యాయని కొనియాడారు.తన ప్రతిభతో దేశాన్ని గర్వపడేలా చేసిన కార్తిక్ రెడ్డి.. భారత కరాటేకు గొప్ప పేరు తీసుకువచ్చాడని కీర్తన్ కొండ్రు అభినందించారు. కాగా సౌతాఫ్రికాలో జరిగిన కామన్వెల్త్ కరాటే చాంపియన్‌షిప్ పదకొండవ ఎడిషన్ విజయవంతం కావడం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.కామన్వెల్త్ కరాటే చాంపియన్‌షిప్-2024లో పతకాలు గెలిచిన మనోళ్లు వీరేకార్తిక్- స్వర్ణం, రజతం, రజతం, కాంస్యంమేసమ్- స్వర్ణం, కాంస్యంభువనేశ్వరి- స్వర్ణం, కాంస్యం, కాంస్యంనవీన్- స్వర్ణం, కాంస్యంరోహన్- స్వర్ణం, కాంస్యంఆరాధ్య- స్వర్ణంఆర్య- స్వర్ణం, రజతం, కాంస్యంసమిహాన్- స్వర్ణం, కాంస్యంసంకేత్- స్వర్ణం, కాంస్యంఆమేయ్- స్వర్ణంహాసిని- రజతంబిలహరి- రజతంరామానుజ- రజతంసాయిహర్ష్- రజతంఅమిత్- కాంస్యంభార్గవ్- కాంస్యంలిఖిత- కాంస్యం, కాంస్యంఅమిత్ ఆదిత్య- కాంస్యం.ఘె.చంద్రశేఖరరెడ్డి పుత్రోత్సాహంఆంధ్రప్రదేశ్ కు చెందిన అరబండి కార్తీక్ రెడ్డి కామన్ వెల్త్ కరాటే చాంపియన్ షిప్ 2024 పోటీలలో అంతర్జాతీయ వేదికలపై తెలుగు వారి ఖ్యాతిని నిలబెట్టాడు. భారత్ కు ప్రాతినిధ్యం వహించి నాలుగు పతకాలతో మెరిసి నిర్వాహకులు, క్రీడాభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాడు.ఈ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన మొత్తం 15 మంది క్రీడాకారులు ఈ కరాటే ఈవెంట్ లో పాల్గొనగా, వారిలో కార్తీక్ రెడ్డి కి మాత్రమే నాలుగు పతకాలు లభించటం విశేషం. ఈ నేపథ్యంలో... తన కుమారుడు అంతర్జాతీయ వేదికలపై రాణించడం పట్ల తండ్రి, సెంట్రల్ జిఎస్టీ కమిషనర్ ఎ.చంద్రశేఖరరెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేసారు. -
జూబ్లీహిల్స్ బరిలో కరాటే క్వీన్?
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ స్థానానికి మహిళా అభ్యర్థని రంగంలో దింపేందుకు మజ్లిస్ పార్టీ కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ నుంచి భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ బరిలో దిగుతుండటంతో ఈ స్థానం ప్రధాన రాజకీయ పక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారింది. తొలిసారిగా నగర అసెంబ్లీ ఎన్నికల్లో ఓ మహిళకు అవకాశం ఇచ్చేందుకు మజ్లిస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానాన్ని జాతీయ కరాటే చాంపియన్‌ను సాధించిన సయ్యదా ఫలక్ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తోంది. మూడేళ్ల క్రితమే సయ్యదా ఫలక్ మజ్లిస్ పారీ్టలో చేరారు. పార్లమెంట్లో ముస్లిం గొంతుకగా అసదుద్దీన్ ప్రజా అంశాలను లేవనెత్తే ఏకైక నాయకుడు’ అంటూ కొనియాడి పార్టీ అధిష్టానాన్ని ఆకట్టుకున్నారు ఆమె. ఉమ్మడి పౌరసత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌తో దేవబంద్, ఢిల్లీ, షాహీన్న్బాగ్లలో జరిగిన నిరసన కార్యక్రమాలకు నాయకత్వం వహించి పార్టీ దృష్టిని ఆకర్షించారు. దీంతో ఫలక్ అభ్యరి్థత్వం వైపు మజ్లిస్ మొగ్గు చూపి ఆమె పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. -
సీఎం జగన్‌ను కలిసిన అంతర్జాతీయ కరాటే ఛాంపియన్ కార్తీక్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో ఏపీకి చెందిన అంతర్జాతీయ కరాటే ఛాంపియన్ అరబండి కార్తీక్ రెడ్డి గురువారం కలిశారు. అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న క్రీడాకారులను సీఎం అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. క్రీడలకు మరింతగా ప్రాధాన్యతనిస్తున్నామని సీఎం అన్నారు. కరాటేను శాప్ క్రీడగా గుర్తిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. చదవండి: ఏపీలో సీఎం జగన్ పాలన అద్భుతం: మంత్రి కేటీఆర్ ఇటీవల జరిగిన కామన్వెల్త్ కరాటే చాంపియన్ షిప్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి, అండర్ 16 బాలుర 70 కేజీల కుమిటే విభాగంలో స్వర్ణపతక విజేతగా కార్తీక్ నిలిచాడు. అంతకుముందు ఏప్రిల్‌లో లాస్వేగాస్లో జరిగిన యూఎస్ఏ ఓపెన్ ఛాంపియన్ షిప్‌లోనూ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. దీంతో వరసగా రెండు స్వర్ణాలు నెగ్గిన తొలి ఇండియన్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. అక్టోబర్‌లో టర్కీలో వరల్డ్ కరాటే ఫెడరేషన్ ఆధ్వర్యంలో అఫిషియల్ వరల్డ్ ఛాంపియన్ షిప్లో పాల్గొని పతకం సాధిస్తానని కార్తీక్ తెలిపారు. తాను సాధించిన పతకాలను సీఎం జగన్‌కు చూపి, తనకు ప్రభుత్వం నుంచి సహకారం ఇవ్వాలని సీఎంని కార్తీక్ కోరగా, సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకం, మున్ముందు కార్తీక్ అవసరమైన పూర్తి ప్రోత్సాహాన్ని ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పర్యాటక, సాంస్కృతిక, క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా, కార్తీక్ తల్లిదండ్రులు శిరీషా రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఎస్‌కేడీఏఏపీ ప్రెసిడెంట్ డాక్టర్ మిల్టన్ లూథర్ శాస్త్రి, ప్రవీణ్ రెడ్డి, కృష్ణారెడ్డి ఉన్నారు. -
కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్ర కుర్రాడికి స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: కామన్వెల్త్ కరాటే చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ కుర్రాడు ఎ.కార్తీక్ రెడ్డి స్వర్ణ పతకంతో మెరిశాడు. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఈ పోటీల్లో కార్తీక్ రెడ్డి క్యాడెట్ బాలుర 70 కేజీల కుమిటే విభాగంలో విజేతగా నిలిచాడు. జారాలాంపౌస్ (సైప్రస్) రజతం, హారిసన్ లుకాస్ (స్కాట్లాండ్), జేకబ్ కట్లర్ (ఇంగ్లండ్) కాంస్య పతకాలు గెలిచారు. -
అలాంటి వాటికి నేనెప్పుడూ సహకరిస్తా: సుమన్
అనకాపల్లి: దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పహారా కాసే సైనికులకు మనందరమూ రుణపడి ఉండాలని, మన స్వేచ్ఛకోసం వారు పాటుపడుతున్నారని సినీ హీరో సుమన్ అన్నారు. పట్టణంలోని రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంలో రెండ్రోజులుగా నిర్వహిస్తున్న రెండో దక్షిణ భారత్ ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్ డీవీఆర్కప్–2022 పోటీల్లో విజేతలకు శుక్రవారం రాత్రి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ త్వరలోనే కరాటే అకాడమీని ప్రారంభిస్తానన్నారు. కరాటే ఆత్మరక్షణ కోసమే కాదని, వ్యాయామంగానూ పరిగణించాలన్నారు. ఇటువంటి క్రీడా పోటీలకు తానెప్పుడూ సహకరిస్తానన్నారు. నిర్వాహకుడు కాండ్రేగుల శ్రీరాంను అభినందించారు. ఎంపీ డాక్టర్ సత్యవతి మాట్లాడుతూ మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. పురుషులతోపాటు మహిళలూ స్వీయరక్షణ కోసం కరాటే శిక్షణ పొందాలన్నారు. దిశ వంటి చట్టాలను తీసుకొచ్చిన ప్రభుత్వం మహిళలకు అండగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకుడు దాడి రత్నాకర్ మాట్లాడుతూ అనకాపల్లిలో నిర్వహించిన పోటీలు విజయవంతమయ్యాయని తెలిపారు. ఓవరాల్ చాంపియన్ ఏపీ... ఐదు రాష్ట్రాలు పాల్గొన్న ఓపెన్ కరాటే పోటీల్లో చాంపియన్‌షిప్‌ను ఏపీ జట్టు కైవసం చేసుకుంది. గెలుపొందిన క్రీడాకారులకు సినీ హీరో సుమన్, ఎంపీ సత్యవతి, దాడి రత్నాకర్ బహుమతులు అందజేశారు. సినీ నటుడు ప్రసన్నకుమార్, కార్పొరేటర్లు కొణతాల నీలిమ భాస్కర్, పీలా లక్ష్మీసౌజన్య రాంబాబు, నేషనల్ బాడీబిల్డర్ శిలపరశెట్టి బాబీ, డాక్టర్ విష్ణుమూర్తి, డి.ఈశ్వరరావు, కోరిబిల్లి పరి, భీశెట్టి కృష్ణ అప్పారావు పాల్గొన్నారు. అనకాపల్లి విద్యార్థికి రజత పతకం అనకాపల్లి పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో దక్షిణ భారత ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్‌లో అండర్–10 కేటగిరీ విభాగంలో పి.వరుణ్సూర్యదేవ్ రజత పతకాన్ని సాధించాడు. పట్టణంలో ఏడీ పాఠశాలలో చదువుతున్న బాలుడిని పాఠశాల డైరెక్టర్ అనూషసుబ్రహ్మణ్యం శుక్రవారం అభినందించారు. (క్లిక్: సాఫ్ట్‌బాల్‌లో సిక్కోలు ఆశాకిరణం) -
కరాటే క్వీన్స్: చదువులో సరస్వతీ పుత్రిక.. కరాటేలో వండర్ కిడ్
‘నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులకు చెక్ పెట్టాలంటే ఆడపిల్లలకు కరాటే ఎంతో దోహదపడుతుంది. మా అమ్మానాన్నలు కరాటే నేర్చుకోవాలన్నప్పుడు మేం భయపడ్డాం. శిక్షణ పొందాక ఆ గొప్పతనం తెలిసింది. తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు కరాటే నేర్పించాలి.’ – కరాటే విజేతలు అగనంపూడి(గాజువాక): ఆత్మస్థైర్యం, స్వీయరక్షణతోపాటు అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటేందుకు బాలికలు కరాటేను ఎంచుకుని.. నిరంతర సాధన చేశారు. చదువుతో పాటు కరాటేలో శిక్షణ పొందుతూ.. సరిలేరు మాకెవ్వరూ అంటూ పతకాలు పంట పండిస్తున్నారు. వీరే కూర్మన్నపాలెం, దువ్వాడ, రాజీవ్‌నగర్ ప్రాంతాలకు చెందిన బాలికలు. వేపగుంటకు చెందిన చాంపియన్స్ కరాటే డోజో సారథ్యంలో జాతీయ కోచ్, బ్లాక్ బెల్ట్ ఫిప్త్ డాన్, జపాన్ కరాటే షోటోకై వి.ఎన్.డి.ప్రవీణ్‌కుమార్ పర్యవేక్షణలో వీరంతా శిక్షణ పొందుతున్నారు. వీరికి గంటా కనకారావు మెమోరియల్ సంస్థ సాయం అందిస్తోంది. నిర్వాహకుల చేతుల మీదుగా బంగారు పతకం అందుకుంటున్న మృదుల, హీరో సుమన్ నుంచి పసిడి పతకం అందుకుంటున్న రేష్మా వండర్ కిడ్..రేష్మా చదువులో సరస్వతీ పుత్రిక.. కరాటేలో తన పంచ్‌లతో ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించే వండర్ కిడ్.. పసిడి పతకాల పంట పండిస్తోంది పేడాడ రేష్మా. కూర్మన్నపాలెం సమీపంలోని మాతృశ్రీ లే అవుట్లో నివాసముంటున్న రేష్మా ఉక్కునగరంలోని ఓ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. 2019 నుంచి కరాటేలో శిక్షణ పొందుతోంది. ఇప్పటి వరకు రేష్మా తన పంచ్‌లతో రాష్ట్ర, జాతీయస్థాయిలో 8 బంగారు, 7 రజత, రెండు కాంస్య పతకాలు సాధించి ఈ ప్రాంత ప్రతిష్టను ఇనుమడింపజేసింది. తండ్రి పి.వరహాలరావు ఇండియన్ ఆర్మీ విశ్రాంత ఉద్యోగి. తల్లి ధనలక్ష్మి గృహిణి. అంతర్జాతీయ స్థాయిలో పసిడి పతకం సాధించి దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నదే ఆమె లక్ష్యం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతోపాటు కోచ్‌లు ఆమెను ప్రోత్సహిస్తున్నారు. చదవండి👉🏾 మానవత్వం చాటుకున్న హోంమంత్రి తానేటి వనిత మృదుల.. పతకాల వరద దువ్వాడ విజ్ఞాన్ పబ్లిక్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎం.మృదుల కరాటేలో 2018 నుంచి శిక్షణ పొందుతోంది. చిన్నప్పటి నుంచి కరాటేపై ఆసక్తి పెంచుకున్న మృదుల ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 26 పసిడి పతకాలు, 6 రజతం, 7 కాంస్య పతకాలు సాధించి.. పదునైన పంచ్‌లతో ప్రత్యర్థులకు తన పవర్ చూపించింది. తండ్రి ఎం.సుధాకర్ ప్రైవేట్ కర్మాగారంలో పనిచేస్తుండగా.. తల్లి పద్మజ గృహిణి. మృదులను ఆది నుంచి ప్రోత్సహిస్తుండడంతో మెరుపు పంచ్‌లతో పతకాల వేట సాగిస్తోంది. కరాటేలో ప్రపంచ చాంపియన్‌గా నిలవాలన్నదే తన లక్ష్యమని చెబుతోంది. జాతీయ కోచ్ చేతుల మీదుగా పసిడి పతకం అందుకుంటున్న లిఖిత చరిత్రలో ఓ పేజీ లిఖించుకుంది నేటి సమాజంలో బాలికలు, మహిళల ఆత్మ రక్షణకు కరాటే ఒక ఆయుధం అని భావించే టి.లిఖిత ఎన్ఏడీ కొత్తరోడ్డులోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. పాఠశాల విద్యార్థిగా ఉన్న రోజుల నుంచే కరాటేలో రాణిస్తోంది. చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొని పంచ్ విసిరితే పతకం వచ్చి తీరాల్సిందే. లిఖిత ఇప్పటివరకు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో 33 బంగారు పతకాలు, 3 రజతాలు, 4 కాంస్య పతకాలు తన ఖాతాలో జమచేసుకుంది. స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం పొందాలన్నది ఆమె లక్ష్యం. ఆమె తండ్రి వెంకట మహేష్ ప్రైవేట్ ఉద్యోగి. తల్లి గృహిణి. వీరిద్దరితోపాటు కోచ్‌లు కూడా తనకు ఆది నుంచి వెన్నంటి ప్రోత్సహిస్తున్నారని లిఖిత తెలిపింది. చదవండి👉 బుజ్జి పిట్ట.. బుల్లి పిట్ట.. పక్షి ప్రేమికుల విలక్షణ ఆలోచన సాయి కీర్తనకు పతకం అందిస్తున్న నిర్వాహకులు ‘కీర్తి’ ప్రతిష్టలు పెంచేలా.. నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సీహెచ్ వేద సాయి కీర్తన.. కుటుంబంతో నిర్వాసితకాలనీలో నివాసం ఉంటోంది. 2018 నుంచి డోజో ఇన్స్టిట్యూట్లో కరాటే శిక్షణ కొనసాగిస్తోంది. సమాజంలో మహిళలు పట్ల జరుగుతున్న అఘాయిత్యాలు, దాడులను ఎదుర్కొడానికి కరాటే ఒక్కటే శరణ్యమని భావించి.. దానిపై ఇష్టం పెంచుకుంది. స్వీయ రక్షణతో పాటు కరాటేలో ఉత్తమ ప్రదర్శనతో విశ్వవిఖ్యాతగా నిలవాలన్నది ఆమె లక్ష్యం. ఇప్పటి వరకు 15 బంగారు, మూడు రజతం, 9 కాంస్య పతకాలతో మెరుపులు మెరిపించింది. తండ్రి సీహెచ్.రమేష్ ప్రైవేట్ ఉద్యోగి. తల్లి అర్చనా దేవి స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తున్నారు. చదవండి👉🏻 వారి జీవితాల్లో వెలుగు రేఖలు.. బతుకు చూపిన ‘భారతి’ -
Syeda Falak: బరువు తగ్గడం కోసమే కరాటే క్లాసులో చేర్చారు... కట్‌చేస్తే!
Syeda Falak: ఆకాశమే హద్దుగా...రేపు (డిసెంబర్ 17) మొదలయ్యే ‘ఆసియా కరాటే చాంపియన్‌షిప్’ పోటీలకు వేదిక కజకిస్థాన్. మధ్య ఆసియా దేశంలో జరిగే ఈ కరాటే పోటీలకు మనదేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది సాయెదా ఫలక్. కరాటేలో 22 అంతర్జాతీయ పతకాలు, 20 జాతీయస్థాయి పతకాలను సాధించిన ఫలక్ ఈ రోజు కజకిస్థాన్‌కు బయలుదేరుతోంది. సాక్షితో మాట్లాడుతూ... భారత్‌కు మరో పతకాన్ని తీసుకు వస్తానని ఆత్మవిశ్వాసంతో చెప్పింది. అంతా కాకతాళీయం హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన సాయెదా ఫలక్ బీఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఇంగ్లిష్ లిటరేచర్ తర్వాత ఇప్పుడు ఎల్ఎల్బీ చేస్తోంది. తన పన్నెండేళ్ల వయసులో కాకతాళీయంగా మొదలైన కరాటే ప్రాక్టీస్ తన జీవితంలో భాగమైపోయిందని చెప్పింది. ‘‘నేను సెవెన్త్ క్లాస్‌లో ఉండగా మా స్కూల్లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో భాగంగా కరాటేని పరిచయం చేశారు. నేను బొద్దుగా ఉండడంతో బరువు తగ్గడం కోసమే కరాటే క్లాసులో చేర్చారు. ప్రాక్టీస్ మొదలైన పదిరోజుల్లోనే ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్‌కి పేరు ఇచ్చేశారు మా స్కూల్ వాళ్లు. ఆ పోటీల్లో సిల్వర్ మెడల్ వచ్చింది. ఆ తర్వాత ఏడాదే బ్లాక్ బెల్ట్ వచ్చింది. నా తొలి ఇంటర్నేషనల్ మెడల్ నేపాల్‌లో జరిగిన ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్‌లో వచ్చింది. అప్పుడు నాకు పదమూడేళ్లు. నిజానికి అప్పటి వరకు కరాటే పట్ల పెద్ద సీరియెస్‌గా లేను. కోచ్ చెప్పినట్లు ప్రాక్టీస్ చేయడం, అమ్మానాన్నలు పోటీలకు తీసుకువెళ్తే నా వంతుగా హండ్రెడ్ పర్సెంట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం వరకే ఉండేది. స్కూల్లో, బంధువుల్లో నన్ను ప్రత్యేకంగా గుర్తించడం, నా ప్రతి సక్సెస్‌నీ మా అమ్మానాన్న సంతోషంగా ఆస్వాదించడం, మీడియాలో కథనాలు రావడం... వంటివన్నీ నన్ను బాగా ప్రభావితం చేశాయి. కరాటేతో ఐడెంటిఫై అవ్వడం కూడా అప్పటి నుంచే మొదలైంది’’ అని గుర్తు చేసుకుంది ఫలక్. అడ్డంకులు లేవు కరాటే ప్రాక్టీస్ చేయడానికి మతపరమైన నిబంధనలు తనకు అడ్డుకాలేదని చెప్తూ ‘‘నాకంటే ముందు మా అక్క అయ్మాన్ స్పోర్ట్స్ ప్రాక్టీస్‌లో ఉంది. మా అమ్మానాన్నలిద్దరూ విశాల దృక్పథం ఉన్నవాళ్లే. దాంతో ఏ ఇబ్బందీ రాలేదు. కానీ, అప్పట్లో ‘కరాటే అనేది మగవాళ్ల రంగం, అమ్మాయి కరాటే ప్రాక్టీస్ చేయడం ఎందుకు’ అనే భావన మాత్రం వ్యక్తమయ్యేది. అది పద్నాలుగేళ్ల కిందటి మాట. ఇప్పుడు అలాంటిదేమీ లేదు. పైగా ఇది స్వీయరక్షణ సాధనం అని అందరూ గుర్తిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో షీ టీమ్‌తో కలిసి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ వివరిస్తూ వీడియో చేశాను. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో స్టూడెంట్స్‌కి కరాటే నేర్పిస్తున్నాను. పూర్తిస్థాయిలో కరాటే అకాడమీ స్థాపించి వీలయినంత ఎక్కువ మంది అమ్మాయిలకు స్వీయరక్షణ కోసం కరాటేలో శిక్షణ ఇవ్వాలనేది నా ఆకాంక్ష’’ అని చెప్పిందామె. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా ప్రధాన స్రవంతిలో ఆకాశమే హద్దుగా దూసుకుపోవాలని కోరుకుంటోంది సాయెదా ఫలక్. ఫలక్ అంటే ఆకాశం అని అర్థం. స్టార్ క్యాంపెయినర్ సాయెదా ఫలక్ తాను సాధించిన పతకాలను చూసుకుంటూ అన్నింటికంటే ఎక్కువ సంతోషాన్నిచ్చింది ‘యూఎస్ ఓపెన్ మెడల్’ అని 2016లో లాస్వేగాస్లో గెలుచుకున్న పతకాన్ని చూపించింది. క్రీడాకారిణిగా రాణిస్తున్న ఫలక్ అణగారిన వర్గాల మహిళల్లో చైతన్యం కలిగించడానికి రాజకీయరంగంలో అడుగుపెట్టి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎమ్ఐఎమ్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం చేసింది. ‘రాజకీయ రంగం అంటే మగవాళ్ల రంగం అనే భావన మహిళల్లో ఉందనే వాస్తవాన్ని ఆ ప్రచారం ద్వారానే తెలుసుకోగలిగాను. ఈ ధోరణిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను’ అని చెప్పింది సాయెదా ఫలక్. – వాకా మంజులారెడ్డి, ఫొటోలు : అనిల్ కుమార్ మోర్ల View this post on Instagram A post shared by Syeda Falak (@falaksyeda7) View this post on Instagram A post shared by Syeda Falak (@falaksyeda7) -
28 అంతర్జాతీయ రికార్డుల ‘సాహసపుత్రుడు’
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): చిన్నతనంలో స్నేహితులతో తరుచూ దెబ్బతినే చిన్నారిని ఆత్మస్థైర్యం కోసం కరాటే శిక్షణకు పంపింది తల్లి ఖాజాబీ. ఆ బాలుడు నేడు ఏకంగా 28 అంతర్జాతీయ కరాటే రికార్డులను సొంతం చేసుకున్నాడు. బాల్యం నుంచి క్రమం తప్పని సాధనతో పలువురికి స్పూర్తిదాయకంగా నిలిచాడు. అతనే కరాటే మాస్టర్ ఇబ్రహిం. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినేనిపల్లిలో వెల్డింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్న షేక్ మహబూబ్, ఖాజాబీల కుమారుడు షేక్ ఇబ్రహిం. చిన్నతనంలో ఆడుకునేటప్పుడు స్నేహితులతో గొడవలు, దెబ్బతిని ఇంటికి రావడం చూసి తల్లి ఖాజాబీ తట్టుకోలేకపోయింది. ధైర్యం నింపేందుకు కరాటే మాస్టర్ వద్ద చేర్చింది. నిరంతరం సాధనతో ఇబ్రహింలో ధైర్యంతో పాటు కరాటే పట్ల ఆసక్తి పెరిగింది. ప్రదర్శనలిస్తూ ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో 28 రికార్డులను సొంతం చేసుకున్నాడు. శ్రీలంక, నేపాల్‌లో ప్రదర్శనలు ఇచ్చాడు. తాను ప్రదర్శించడమే కాకుండా తాను శిక్షణనిచ్చిన వందలాదిమంది శిష్యులతో కలిపి భారీ కరాటే ప్రదర్శన ఇవ్వడం ఇతని ప్రత్యేకత. చిన్నప్పుడు ఆత్మస్థైర్యం కోసం మొదలైన కరాటే ప్రస్థానం రికార్డుల పరంపర సాగిస్తుంది. కరాటే విద్యే చిన్నారులకు నేర్పుతూ వారిలో ఆత్మస్థైర్యం నింపుతూ.... ఇబ్రహిం జీవనం సాగడం విశేషం. 2016 నుంచి ప్రారంభమైన రికార్డుల ప్రదర్శనలు 2020కి వచ్చేసరికి కరాటేలోని వివిధ రకాల విన్యాసాలతో ప్రదర్శనలతో సాధించిన పలు రికార్డులు.. 666 మందితో కటా ప్రదర్శన చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు (2016) 5220 మందితో కరాటే ప్రదర్శన (2017) 4250 మందితో కరాటే ప్రదర్శన లిమ్కా బుక్ఆఫ్ రికార్డు (2017) 600 మందితో కలాం వరల్డ్ రికార్డు (2018) 60 మందితో మెరాకిల్ వరల్డ్ రికార్డు (2018) ఆర్‌హెచ్ వరల్డ్ రికార్డు (2018) ఏఎస్ఎస్ వరల్డ్ రికార్డు ( ఒక్క నిమిషంలో మోచేత్తో 195 స్టిక్‌లను బల్లమీద కొట్టడం (2019) ఒక్క నిమిషంలో 60 మంది 2లక్షల 15 పంచ్‌లు (2019) రియల్ బుక్ఆఫ్ వరల్డ్ రికార్డు (2019) సాహసపుత్ర రికార్డు (2019) యూనివర్శల్ రికార్డు (2019) ఎక్స్‌లెన్సీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు (2020) వజ్రా వరల్డ్ రికార్డు (2020) అఫిషియల్ వరల్డ్ రికార్డు (2020) లిమ్కా బుక్ఆఫ్ రికార్డు (2020) గిన్నిస్‌బుక్ అటెంప్ట్ – (2020) గిన్నిస్ రికార్డు ఎల్బో స్ట్రైకింగ్స్ (2020) కలామ్స్ బుక్ఆఫ్ వరల్డ్ రికార్డు (2021) -
నాటి ప్రపంచ ఛాంపియన్.. నేడు ఛాయ్ అమ్ముకుంటున్నాడు
ఆగ్రా: పాతికేళ్లు కూడా నిండక ముందే 60కి పైగా పతకాలు సాధించి, కరాటేలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన హరిఓమ్ శుక్లా.. ప్రస్తుతం మథురలో రోడ్డు పక్కన టీ అమ్ముతున్నాడు. పదునైన పంచ్‌లతో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ప్రపంచ ఖ్యాతి గాంచిన శుక్లా.. నేడు కుటుంబ పోషణ నిమిత్తం రోడ్డెక్కాడు. దేశ, విదేశాల్లో జరిగిన అనేక పోటీల్లో పతకాలు సాధించిన ఆయన.. ఇల్లు గడవని ధీన స్థితిలో కాలం వెల్లబుచ్చుతున్నాడు. 2013లో థాయ్‌లాండ్‌లో జరిగిన జూడో కరాటే ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత్ తరఫున స్వర్ణ పతకాన్ని సాధించిన శుక్లా.. ఆరేళ్ల ప్రాయంలోనే కరాటేలో ఓనమాలు దిద్దుకున్నాడు. అతనికి 23 ఏళ్లు వచ్చేసరికి 60కి పైగా పతకాలు సాధించాడు. అయితే, ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం అందకపోవడంతో అతని ఆర్ధిక కష్టాలు మొదలయ్యాయి. టోర్నీల్లో గెలుచుకున్న ప్రైజ్ మనీ సైతం అడుగంటి పోయింది. ఈ క్రమంలో ఉద్యోగం కోసం ప్రభుత్వానికి ఎన్ని సార్లు మొర పెట్టినా ఫలితం లేకుండా పోయింది. రోజు రోజుకూ కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో ఓ టీ స్టాల్‌ను నడిపిస్తున్నాడు. లాక్‌డౌన్‌కు ముందు వరకు స్కూల్ పిల్లలకు కరాటే పాఠాలు నేర్పిన శుక్లా.. ప్రస్తుతం ఛాయ్ వాలాగా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. కరోనా కారణంగా పిల్లలెవరూ క్లాసులకు హాజరు కాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో టీ స్టాల్ నడుపుతున్నాని అతను వాపోతున్నాడు. ప్రస్తుతానికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా.. ఆ సర్టిఫికేట్ తీసుకోవడానికి కూడా తన వద్ద డబ్బు లేదని.. ఆ సర్టిఫికేట్ ఉంటే ఏదైనా ఉద్యోగం చూసుకునే వాడినని అంటున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి క్రీడాకారుల కోటాలో తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరుతున్నాడు. చదవండి: బీసీసీఐ పుణ్యమా అని అశ్విన్ బయటపడ్డాడు.. లేకపోతే..? -
ఛాయనిక, దర్శనలకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: యామగుచి కరాటే అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన వైఎంసీఏ కరాటే కప్ టోర్నీలో ఛాయనిక, కె. దర్శన ఆకట్టుకున్నారు. వైఎంసీఏ నారాయణగూడ వేదికగా జరిగిన ఈ టోర్నీలో వీరిద్దరూ స్వర్ణ పతకాలను గెలుచుకున్నారు. 17 ఏళ్లు పైబడిన బాలికల స్పేరింగ్ విభాగంలో ఛాయనిక విజేతగా నిలిచింది. పవిత్ర, నవ్యశ్రీ వరుసగా రజత, కాంస్యాలను అందుకున్నారు. 15 ఏళ్ల బాలికల స్పేరింగ్ ఈవెంట్లో దర్శన, టిషా మహంత్, మహేశ్వరి వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. పురుషుల బ్లాక్ బెల్ట్ ఈవెంట్లో విశ్వనాథ్ బంగారు పతకాన్ని అందుకున్నాడు. మహాదేవ్ రజతాన్ని గెలుచుకోగా... కృష్ణ కాంస్యాన్ని సాధించాడు. ఈ టోర్నీలో మొత్తం 800 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో సినీ నటి సుమయా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎంసీఏ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు పి. ధర్మరాజ్, రిటైర్డ్ కార్యదర్శి వినయ్ స్వరూప్, గ్రాండ్ మాస్టర్ ఆర్కే కృష్ణ, మాస్టర్స్ వంశీకృష్ణ, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
సలోమీ, నాగ తనిష్కలకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: జీఎస్‌కేడీఐ ఇంటర్నేషనల్ కరాటే చాంపియన్‌షిప్‌లో కురినెల్లి సలోమీ, జి. నాగ తనిష్కారెడ్డి ఆకట్టుకున్నారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి స్టేడియంలో రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో అండర్–11 బాలికల కటా విభాగంలో సలోమీ స్వర్ణాన్ని గెలుచుకుంది. అండర్–13 కటా ఈవెంట్లో తనిష్క చాంపియన్‌గా నిలిచి పసిడిన కైవసం చేసుకుంది. అనౌష్క రజతాన్ని గెలుచుకోగా... నిత్యారెడ్డి కాంస్యాన్ని అందుకుంది. నమ్రత నాలుగో స్థానంలో నిలిచింది. 14–15 వయో విభాగం బాలుర కటా ఈవెంట్లో టి. ఉదయ్, సర్వేశ్, గిరి శేషు వరుసగా తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. 16–17 వయో విభాగం బాలుర కుమిటే విభాగంలో రవీంద్ర పసిడిని సొంతం చేసుకోగా... గోపీ, భరత్, జై మహేశ్ వరుసగా తర్వాతి స్థానాలను సాధించారు. -
అంతర్జాతీయ కరాటే పోటీలకు సలోమీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కరాటే క్రీడాకారిణి కురునెల్లి సలోమీ బ్యాంకాక్ వేదికగా ఈనెల 10 నుంచి 14 వరకు జరిగే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. సలోమీ సెయిం ట్ థెరిస్సా స్కూల్లో ఆరో తరగతి చదువుతోంది. డ్రాగన్ పిష్టు కరాటే మాస్టర్ సత్య శంకర్ దగ్గర సలోమీ ఐదేళ్లుగా శిక్షణ పొందుతోంది. -
ఆదిల్ బాబాకు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ కరాటే చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారుడు సయ్యద్ ఆదిల్ బాబా ఆకట్టుకున్నాడు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో 55 కేజీల విభాగంలో ఆదిల్ విజేతగా నిలిచి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో ఆదిల్ 4–2తో ధరణి (తమిళనాడు)పై గెలుపొందాడు. ఈ సందర్భంగా ఆదిల్ బాబా శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డిని శుక్రవారం ఆయన చాంబర్లో కలిశాడు. ఆత్మవిశ్వాసాన్ని పెంచే క్రీడ కరాటే అని పేర్కొన్న శాట్స్ చైర్మన్ ఆత్మరక్షణకు ఉపయోగపడే కరాటేను అందరూ నేర్చుకోవాలని అన్నారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించి ఆదిల్ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈనెల 10, 11 తేదీల్లో చెన్నైలో జాతీయ కరాటే చాంపియన్‌షిప్ జరిగింది. ఆదిల్బాబా దోమలగూడలోని గ్రౌండ్లో కోచ్ షఫీ ఆధ్వర్యంలో 18 ఏళ్లుగా కరాటేలో శిక్షణ పొందుతున్నాడు. ప్రభుత్వం తనకు ఆర్థిక సహాయం అందిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించి తెలంగాణకు మంచి పేరు తీసుకువస్తానని ఆదిల్ బాబా అన్నాడు. -
కరాటేలో అక్కాచెల్లెళ్ల ప్రపంచ రికార్డు
కాచిగూడ: సాహసోపేతమైన క్రీడ కరాటేలో తెలంగాణకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు అబ్బురపరుస్తున్నారు. విస్మయానికి గురిచేసే సాహసకృత్యాలతో ఔరా అనిపిస్తున్నారు. ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలను అలవోకగా చేస్తూ రికార్డులను ఒడిసిపడుతున్నారు. వీరిద్దరూ చూపించిన తెగువకు వరల్డ్ రికార్డ్స్ వీరి చెంత చేరాయి. నగరానికి చెందిన అక్కాచెల్లెళ్లు అమృత రెడ్డి, సంతోషిణిల రికార్డు కరాటే ప్రదర్శనకు బర్కత్‌పురలోని కరాటే అకాడమీ వేదికైంది. రాష్ట్రావతరణ థీమ్‌తో... కరాటేలో అద్భుత ప్రదర్శనలతో అదరగొడుతున్న ఈ అక్కాచెల్లెళ్లు వరల్డ్ రికార్డు సృష్టించేందుకు తెలంగాణ రాష్ట్రావతరణ థీమ్‌ను తీసుకున్నారు. రాష్ట్రం ఏర్పడి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1827 రోజులకుగానూ 1827 మేకులను ఉపయోగించారు. 60 నెలలకు సూచకంగా 60 షాబాదు బండలను వినియోగించారు. 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విన్యాస ప్రదర్శనకు కేవలం 5 నిమిషాల సమయాన్ని వ్యవధిగా పెట్టుకున్నారు. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, విశ్వం వరల్డ్ రికార్డ్స్ ప్రతిని«ధుల సమక్షంలో వీరిద్దరూ గురువారం 1827 మేకులపై పడుకొని పొట్టపై 60 షాబాదు బండలను పగుల గొట్టించుకున్నారు. ఈ విన్యాసాన్ని కేవలం 3 నిమిషాల 10 సెకన్లలోనే పూర్తి చేసి కరాటేలో వరల్డ్ రికార్డు సాధించారు. వీరి తెగువను అభినందించిన ఆయా వరల్డ్ రికార్డ్స్ సంస్థల ప్రతినిధులు అమృత రెడ్డి, సంతోషిణి రెడ్డిలకు ధ్రువపత్రాలను, పతకాలను అందజేశారు. తదుపరి లక్ష్యం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కరాటేలో తదుపరి లక్ష్యం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించడమేనని ఈ అక్కాచెల్లెళ్లు పేర్కొన్నారు. వీరి ప్రతిభను గుర్తించిన జీవీఆర్ కరాటే అకాడమీ డైరెక్టర్ డాక్టర్ జీఎస్ గోపాల్ రెడ్డి... అమృత, సంతోషిణిల సాహస విన్యాసాలను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ పరిశీలన కోసం పంపిస్తామని తెలిపారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా కో ఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్, విశ్వం వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి అరుణ్ కుమార్, రిటైర్డ్ ఐఏఎస్ రఫత్ ఆలీ, ఏసీపీ శ్రీనివాస్, షర్మిష్టా దేవి, దేవికా రాణి, కిరణ్ కుమార్ రెడ్డి, అశోక్ కుమార్, దేవిరెడ్డి విజితా రెడ్డి, సమీర్, పద్మజ తదితరులు పాల్గొని అమృత, సంతోషిణిలను అభినందించారు. ఈ కార్యక్రమంలో జీవీఆర్ కరాటే అకాడమీ డైరెక్టర్ డాక్టర్ జీఎస్ గోపాల్‌రెడ్డి, బ్లాక్బెల్ట్స్ వి.నరసింహరావు, కీరం, సుభాష్, సంతోష్, మహేందర్, విప్లవ్, పాండు, స్నిగ్ధ, తుల్జారామ్ తదితరులు పాల్గొన్నారు. -
వైష్ణవికి స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఓపెన్ కరాటే టోర్నీలో శంకర్జీ స్మారక బాలికల హైస్కూల్‌కు చెందిన వైష్ణవి స్వర్ణాన్ని గెలుచుకుంది. కరీంనగర్లో జరిగిన ఈటోర్నీలో శంకర్ జీ విద్యార్థులు మొత్తం 11 పతకాలను కైవసం చేసుకున్నారు. ఇందులో 1 స్వర్ణం, 3 రజతాలు, 7 కాంస్యాలు ఉన్నాయి. సీహెచ్ వైష్ణవి (పసిడి), బి. కీర్తి, ఎస్. కీర్తన, సి. తులసి (రజతాలు), భూమిక, అశ్విత, శోభ, ఎన్. దిశ, లావణ్య, హర్షిత, లావణ్య (కాంస్యాలు) పతకాలను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పతకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ బి. శ్రీనివాస్, శంకర్ జీ స్కూల్ ప్రిన్సిపాల్ ఫహీమ్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రమోహన్‌కు రెండు పతకాలు
హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయి కరాటే, కుంగ్‌ఫూ చాంపియన్‌షిప్‌లో నగరానికి చెందిన కారు డ్రైవర్ మహంకాళి చంద్రమోహన్ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గోవా వేదికగా జరిగిన అంతర్జాతీయ బీచ్ కంబాట్ గేమ్స్‌లో కుత్బుల్లాపూర్ వాసి చంద్రమోహన్ రజత, కాంస్య పతకాలను గెలుచుకున్నాడు. స్పారింగ్ విభాగంలో రజతాన్ని సాధించిన చంద్రమోహన్, కటా విభాగంలో కాంస్యంతో మెరిశాడు. అనంతరం చంద్రమోహన్ మాట్లాడుతూ నగరంలో కారు డ్రైవర్‌గా ఉపాధి పొందుతూ... ఆసక్తిగలిగిన క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో రాణించడంతో సంతోషంగా ఉందన్నాడు. ఈనెల 17న సాక్షి సిటీ ఎడిషన్‌లో ‘కరాటే వీరుడు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి కొంతమంది దాతలు, ఔత్సాహికులు తనను సంప్రదించారని చంద్రమోహన్ తెలిపాడు. ఈ ప్రదర్శనతో త్వరలో జరుగనున్న అంతర్జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించానని పేర్కొన్నాడు. ఈ టోర్నీ షెడ్యూల్ ఇంకా విడుదల కానందున... ఈవెంట్ వేదికపై తన వద్ద సమాచారం లేదని తెలిపాడు. మరోసారి దాతలు, ఔత్సాహికులు ప్రోత్సహిస్తే స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగుతానన్నాడు. -
రోహిత్‌కు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్ గేమ్స్ సమాఖ్య (ఎస్జీఎఫ్ఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి కరాటే చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన రోహిత్ కుమార్ స్వర్ణ పతకం సాధించాడు. రాజస్తాన్‌లో జరిగిన ఈ టోర్నీలో అండర్–19 విభాగంలో బరిలోకి దిగిన రోహిత్ 75 కేజీల కేటగిరిలో అజేయంగా నిలిచాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన రోహిత్ తాను పోటీపడిన నాలుగు రౌండ్లలోనూ ప్రత్యర్థులను ఓడించాడు. 2017లో నిర్మల్‌లో జరిగిన ఎస్జీఎఫ్ఐ గేమ్స్‌లో రజత పతకం సొంతం చేసుకున్నాడు. -
కరాటేలో ‘యూనివర్సల్’కు పతకాలు
తల్లాడ ఖమ్మం : వరంగల్ మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 6న జరిగిన రాష్ట్ర స్థాయి షోటోకాన్ కరాటే చాంపియన్ షిఫ్‌లో స్థానిక యూనివర్సల్ విద్యాలయానికి చెందిన విద్యార్థులు ప్రథమ, ద్వితీయ స్థానాలు గెలుపొందారు. గురు షోటోకాన్ అకాడమి ఆధ్వర్యంలో జరిగిన కరాటే పోటీల్లో స్పారింగ్ విభాగంలో జే.విజయ్, డి.నవీణ్, ఎన్.తరుణ్, బి.అయ్యప్ప, డి.ఉపారాణి, పావని, నాగచరణ్ ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాలను గెలుపొందారు. నాగ చైతన్య, బి.కల్యాణి, డి.వరుణ్, కిషోర్, ప్రజ్ఞాన్, ఆదిత్య ద్వితీయ స్థానంలో నిలిచి వెండి పతకాలను కైవసం చేసుకున్నారు. కటాస్ విభాగంలో డి.ఉపారాణి, పావని, నాగచరణ్ ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించారు. కె.మణికంఠ, జే.ముఖేష్, ఎన్.రామ్‌చరణ్, డి.త్రినాగ్రెడ్డి, ప్రజ్ఞాన్ ఆదిత్య, బి.రేవంత్, జే.ఉపేందర్ ద్వితీయ స్థానంలో నిలిచి వెండి పతకాలను సాధించారు. గెలుపొందిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ టీ.కే.ప్రసన్నన్, డైరెక్టర్ టీ.కే.మేరిసోఫియా, ప్రిన్సిపాల్ జి.రవికాంత్, రాము, ప్రసాద్, యోహాన్, యాకోబు అభినందించారు. -
బరిలో దిగితే పతకమే
హైదరాబాద్: పదుల సంఖ్యలో జాతీయ, అంతర్జాతీయ పతకాలు. లెక్కకు మిక్కిలిగా ప్రతిభా, ప్రశంసా అవార్డులు. బరిలోకి దిగితే అవలీలగా ప్రత్యర్థులను మట్టికరిపించడం. ఇదీ కరాటేలో అద్భు త ప్రతిభ కనబరుస్తోన్న 18 ఏళ్ల తెలుగు అమ్మాయి సూరపనేని డింపుల్ సామర్థ్యం. ఇదంతా ఒకవైపు మాత్రమే. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు, పోటీలకు వెళ్లాలంటే ఇతరుల వద్ద చేతులు చాపాల్సిన పరిస్థితి. దాదాపుగా అన్ని స్థాయిల్లో విజయాలను సాధించిన ఆమె... ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆటకు స్వస్తి చెప్పాలనే నిర్ణయానికి వచ్చింది. అయితే కార్వీ సంస్థ అందించిన సహాయం ఆమె నిర్ణయాన్ని మార్చుకునేలా చేసింది. ఆ సంస్థ ఇచ్చిన ప్రో త్సాహంతోనే ‘యూఎస్ ఓపెన్ జూనియర్ ఇంటర్నేషనల్ కరాటే కప్’లో రెండు స్వర్ణాలు, ఒక రజతాన్ని సాధించింది. భవిష్యత్‌లో కరాటే చాంపియన్‌గా మారాలని దృఢంగా నిర్ణయించుకుంది. కుటుంబ నేపథ్యం... డింపుల్ స్వస్థలం విజయవాడ. ఆమె తల్లిదండ్రులు సూరపనేని రామోజి, సుజనశ్రీ. ప్రస్తుతం ఆమె ఆంధ్ర లయోలా కాలేజీలో బీటెక్ చదువుతోంది. ఏడేళ్ల వయస్సు నుంచే కరాటేలో ప్రతిభ కనబరుస్తోన్న డింపుల్‌కు స్కూల్ స్థాయిలో ఇచ్చిన శిక్షణే పునాది. అంతర్ పాఠశాల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో రాణిస్తూ ఆమె జాతీయ స్థాయి క్రీడాకారిణిగా మారింది. 2013లో జాతీయ స్థాయిలో తొలి కాంస్యాన్ని సాధించింది. అదే ఏడాది మలేసియాలో జరిగిన టోర్నీలో స్వర్ణంతో పాటు కాంస్యాన్ని గెలుచుకుంది. 2015లో క్రొయేషియాలో జరిగిన ‘వరల్డ్ ఫెడరేషన్ టోర్నమెంట్’, 2016లో ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ టోర్నీల్లోనూ డింపుల్ పాల్గొంది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగులేకపోవడంతో యూఎస్ ఓపెన్‌కు దూరమవ్వాలని నిర్ణయించుకున్నానని డింపుల్ చెప్పింది. కార్వీ సంస్థ చివరి క్షణంలో ఆదుకోవడంతోనే భారత్‌కు పతకాలు అందించగలిగానని తెలిపింది. డింపుల్ చిన్ననాటి కోచ్ వెంకటేశ్వరరావు కాగా ప్రస్తుతం జాతీయ కోచ్ కీర్తన్ కొండూరు ఆమెకు శిక్షకుడిగా వ్యవహరిస్తున్నారు. అమెరికాలోని లాస్‌వెగాస్‌లో జరిగిన ‘యూఎస్ ఓపెన్ జూనియర్ ఇంటర్నేషనల్ కరాటే కప్’లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిం చిన డింపుల్ మూడు పతకాలను సాధించింది. అండర్–65 కేజీల వెయిట్ కేటగిరీ మహిళల వ్యక్తిగత ‘కటా’ విభాగంలో స్వర్ణంతో పాటు ‘టీమ్ కుమిటీ అండ్ కటా’ కేటగిరీలో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. వ్యక్తిగత కుమిటీ విభాగంలో రన్నరప్‌గా నిలి చి రజతాన్ని గెలుచుకుంది. ఈ సందర్భంగా గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో డింపుల్‌కు అభినందన సభ జరిగింది. -
కరాటే ప్లేయర్ డింపుల్‌కు కార్వీ ప్రోత్సాహం
సాక్షి, హైదరాబాద్: కరాటే క్రీడలో ప్రతిభ కనబరుస్తోన్న క్రీడాకారిణి సూరపనేని డింపుల్‌ను ప్రోత్సహించేందుకు కార్వీ సంస్థ ముందుకొచ్చింది. అమెరికాలోని లాస్‌వెగాస్‌లో త్వరలో జరుగనున్న ఓపెన్, జూనియర్ ఇంటర్నేషనల్ కప్ టోర్నమెంట్లో డింపుల్ 65 కేజీల మహిళల విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. ఈ నేపథ్యంలో ఆమె శిక్షణ కోసం కార్వీ సంస్థ ఆర్థిక సహాయం అందించింది. బుధవారం కార్వీ ఎండీ ఎం. యుగంధర్ ఆమెకు లక్ష రూపాయల చెక్‌ను అందించారు. గతంలో మలేసియాలో జరిగిన నైట్ ఇంటర్నేషనల్ కరాటే కప్‌లో డింపుల్ స్వర్ణాన్ని సాధించింది. జాతీయ స్థాయిలోనూ పలు టోర్నీల్లో విజేతగా నిలిచిన డింపుల్... 13 ఏళ్ల వయసులోనే కరాటే షోడాన్ టైటిల్‌ను సాధించింది. ప్రస్తుతం విజయవాడలో బీఈ కంప్యూటర్స్ చదువుతోంది. -
రష్మికకు బ్లాక్‌బెల్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి కరాటే పోటీల్లో సత్తా చాటుతోన్న నగరానికి చెందిన పి. రష్మిక బ్లాక్‌బెల్ట్‌ను అందుకుంది. స్పార్క్స్ కుంగ్ఫు అకాడమీ ఆధ్వర్యంలో మెహదీపట్నంలోని ప్రభు త్వ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో అంతర్జాతీయ కుంగ్ ఫు మాస్టర్ జమీల్ ఖాన్ కరాటే క్రీడాకారులకు పురస్కారాలను అందజేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని 50 పతకాలను గెలుచుకున్న 14 ఏళ్ల రష్మికకు బ్లాక్‌బెల్ట్‌తో పాటు ధ్రువపత్రాన్ని అందించారు. రష్మికతో పాటు మాస్టర్ పీఎం మోహిత్ బ్లూ బెల్ట్, అనూష ఠాకూర్ ఆరెంజ్ బెల్ట్, టి. శాశ్వత్ ఆరెంజ్ బెల్ట్‌లను అందుకున్నారు. -
అవినాశ్, నందినిలకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ కరాటే చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన అవినాశ్, నందిని స్వర్ణాలతో మెరిశారు. ‘యునైటెడ్ షోటోకాన్ కరాటే ఆఫ్ ఇండియా’ ఆధ్వర్యంలో విశాఖపట్నం లో జరిగిన ఈ టోర్నీలో రాష్ట్రానికి 2 స్వర్ణాలు, 3 రజత పతకాలు లభించాయి. అండర్–14 బాలబాలికల విభాగంలో అవినాశ్, నందిని విజేతలుగా నిలిచారు. అనూష (అండర్–16), ఆదిత్య (అండర్–8), యండీ ఆర్ఫత్ (అండర్–9) రజత పతకాలను సాధించారు. -
తైక్వాండోలో సారాఖాన్కు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో రాష్ట్రానికి చెందిన మసీరా సారా ఖాన్ మెరిసింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ టోర్నీలో సారా పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. మహిళల 63–68 వెయిట్ కేటగిరీలో ఆమె విజేతగా నిలిచింది. ఈ విజయంతో ఆమె అంతర్జాతీయ తైక్వాండో చాంపియన్‌షిప్‌కు ఎంపికైంది. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో రాణించిన సారా ఖాన్‌ను బుధవారం శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఖాతాలో 9 పతకాలు... జాతీయ స్కూల్ గేమ్స్ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర బృందం ఆకట్టుకుంది. నల్లగొండలో జరిగిన ఈ టోర్నీలో 3 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 9 పతకాలను సాధించింది. నందీశ్వర్ (21–23కేజీలు), హన్షిక సింగ్ (24–26 కేజీలు), హిమాన్షు (50 కేజీలు) ముగ్గురూ రన్నరప్‌లుగా నిలిచి రజతాలను సాధించారు. శివ కిరణ్ (25–27 కేజీలు), నైనా బాయి (18–20 కేజీలు), రమ్య (22–24 కేజీలు), త్రిలోక్ (32 కేజీలు), అక్షిత (38 కేజీలు), సంతోష్ (అండర్–18కేజీలు) కాంస్యాలను గెలుచుకున్నారు. -
ముఖ్యమంత్రికి మహిళా మేయర్ పంచ్ : వైరల్ వీడియో
సాక్షి, బెంగళూరు : ఆమె.. కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డర్, మాజీ చాంపియన్ కూడా! ఆయన.. ‘ఎంటర్ ది డ్రాగెన్’ లాంటి సినిమాల్లో తప్ప కరాటే ఎరుగరు. కానీ వాళ్లిద్దరూ కలబడ్డారు. పరస్పరం పంచ్‌లు ఇచ్చుకున్నారు. ప్రస్తుతం వైరల్ అయిన ఆ వీడియోలోని ఆమె.. మంగళూరు మేయర్ కవితా సనిల్ కాగా, ఆయన.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. పంచ్ పడుద్ది : శనివారం మంగళూరులోని నెహ్రూ మైదానంలో ‘ఇండియన్ కరాటే చాంపియన్‌షిప్-2017’ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సీఎం సిద్దూ, మంగళూరు మేయర్ కవిత ముఖ్య అతిథులుగా హాయజర్యారు. పోటీల ప్రారంభసూచికగా సీఎం, మేయర్లు సరదాగా తలపడ్డారు. ఈ దృశ్యం అక్కడున్నవారిని ఆకట్టుకుంది. ఆ సినిమా చూసి తెల్సుకున్నా : కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా మహిళలకు ఆత్మస్థైర్యం పెరుగుతుందన్న సీఎం.. తనకు మాత్రం కరాటే రాదని, బ్రూస్ లీ ‘ఎంటర్ ది డ్రాగన్’ సినిమా చూసి కొద్దిగా తెల్సుకున్నానని సీఎం చెప్పుకొచ్చారు. మేయర్‌కు సీఎం పంచ్ వీడియో -
ముఖ్యమంత్రికి మహిళా మేయర్ పంచ్