సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ కరాటే చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన అవినాశ్, నందిని స్వర్ణాలతో మెరిశారు. ‘యునైటెడ్ షోటోకాన్ కరాటే ఆఫ్ ఇండియా’ ఆధ్వర్యంలో విశాఖపట్నం లో జరిగిన ఈ టోర్నీలో రాష్ట్రానికి 2 స్వర్ణాలు, 3 రజత పతకాలు లభించాయి. అండర్–14 బాలబాలికల విభాగంలో అవినాశ్, నందిని విజేతలుగా నిలిచారు. అనూష (అండర్–16), ఆదిత్య (అండర్–8), యండీ ఆర్ఫత్ (అండర్–9) రజత పతకాలను సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment