సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ కరాటే చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారుడు సయ్యద్ ఆదిల్ బాబా ఆకట్టుకున్నాడు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో 55 కేజీల విభాగంలో ఆదిల్ విజేతగా నిలిచి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో ఆదిల్ 4–2తో ధరణి (తమిళనాడు)పై గెలుపొందాడు. ఈ సందర్భంగా ఆదిల్ బాబా శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డిని శుక్రవారం ఆయన చాంబర్‌లో కలిశాడు.
ఆత్మవిశ్వాసాన్ని పెంచే క్రీడ కరాటే అని పేర్కొన్న శాట్స్ చైర్మన్ ఆత్మరక్షణకు ఉపయోగపడే కరాటేను అందరూ నేర్చుకోవాలని అన్నారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించి ఆదిల్ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈనెల 10, 11 తేదీల్లో చెన్నైలో జాతీయ కరాటే చాంపియన్‌షిప్ జరిగింది. ఆదిల్‌బాబా దోమలగూడలోని గ్రౌండ్‌లో కోచ్ షఫీ ఆధ్వర్యంలో 18 ఏళ్లుగా కరాటేలో శిక్షణ పొందుతున్నాడు. ప్రభుత్వం తనకు ఆర్థిక సహాయం అందిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించి తెలంగాణకు మంచి పేరు తీసుకువస్తానని ఆదిల్ బాబా అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment