10 జీపీఏ నావల్ల కాదు..
ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య
పెద్దపల్లి జిల్లా: ‘చదువుల్లో రాణించలేకపోతున్నా.. ఎంత చదివినా ఎక్కువ మార్కులు రావడం లేదు. టెన్త్‌లో 10 జీపీఏ సాధించాలనుకున్నా అది సాధ్యం అయ్యేలా లేదు. నా వల్ల కాదు.. నేను చనిపోతున్నా. అమ్మానాన్నా.. నన్ను క్షమించండి..’అంటూ చదువు ఒత్తిడిని తట్టుకోలేక పదో తరగతి విద్యార్థిని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది.
ఈ సంఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణం రాంనగర్‌లో శనివారం చోటుచేసుకుంది. సీసీసీ నస్పూర్ ఎస్సై సుగుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. చిలువేరి దేవేందర్, జ్యోతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలాపురంలో నివాసం ఉంటున్నారు. వీరి కూతురు యోగిత (15) చిన్నప్పటి నుంచి రాంనగర్‌లో ఉన్న అమ్మమ్మ వద్ద ఉంటోంది. స్థానిక ఆదిత్య స్కూల్‌లో టెన్త్ చదువుతోంది.
పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తుండటంతో ఆవేదన చెంది.. శనివారం తెల్లవారుజామున ఐదు గంటలకు వంట గదిలో ఉరేసుకుంది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. కూతురు మరణ వార్త తెలుసుకుని అమలాపురం నుంచి వచి్చ న తల్లిదండ్రులు మృతదేహంపై పడి బోరున విలపించడం అందరినీ కలచివేసింది.
Comments
Please login to add a commentAdd a comment