![young man ends life on love affairs](/styles/webp/s3/article_images/2025/02/16/15.jpg.webp?itok=HObiVZ55)
సంతోష్ నగర్: ప్రేమికుల రోజునే ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇన్‌స్పెక్టర్ కె.సత్యనారాయణ కథనం ప్రకారం... సంతోష్ నగర్ కళంధర్‌నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇమ్రాన్ (21) చాంద్రాయణగుట్ట జీఎం కాలనీకి చెందిన మహ్మద్ ఆబిద్ అలీ కూతురు రబియా ఫాతిమాలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
ఇది రబియా తండ్రి అబిద్ అలీకి తెలియడంతో ఆయన ఈ నెల 14న చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో తన కూతురును ఇమ్రాన్ వేధిస్తున్నాడని రబియాతో ఫిర్యాదు చేయించాడు. దీంతో పోలీసులు ఇమ్రాన్‌ను స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ పరిణామంతో మనస్తాపానికి గురైన ఇమ్రాన్ ఇంటికి వచ్చి.. తన మృతికి రబియా తండ్రి కారణమని సూసైడ్ నోట్ రాసి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment