కరాటేలో పతకాల పంట
జాతీయ కరాటే చాంపియన్‌షిప్
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు అద్భుతంగా రాణించారు. పుణేలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ మిలిటరీ స్కూల్‌లో జరిగిన ఈ టోర్నీలో మొత్తం 13 పతకాలను సొంతం చేసుకున్నారు. ఇందులో 4 స్వర్ణాలు, 3 రజతాలు, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ బుధవారం అభినందించారు.
విజేతల వివరాలు: సురేశ్, అక్షయ్, సారుుబాబా, రాకేశ్ చారి (స్వర్ణం), వెంకట్, రిత్విక, మహేశ్ (రజతం), దివ్య, పవన్, సాయి నిఖి ల్, రిహాన, శివాయ, యశ్వంత్ (కాంస్యం).