హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయి కరాటే, కుంగ్‌ఫూ చాంపియన్‌షిప్‌లో నగరానికి చెందిన కారు డ్రైవర్ మహంకాళి చంద్రమోహన్ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గోవా వేదికగా జరిగిన అంతర్జాతీయ బీచ్ కంబాట్ గేమ్స్‌లో కుత్బుల్లాపూర్ వాసి చంద్రమోహన్ రజత, కాంస్య పతకాలను గెలుచుకున్నాడు. స్పారింగ్ విభాగంలో రజతాన్ని సాధించిన చంద్రమోహన్, కటా విభాగంలో కాంస్యంతో మెరిశాడు. అనంతరం చంద్రమోహన్ మాట్లాడుతూ నగరంలో కారు డ్రైవర్‌గా ఉపాధి పొందుతూ... ఆసక్తిగలిగిన క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో రాణించడంతో సంతోషంగా ఉందన్నాడు.
ఈనెల 17న సాక్షి సిటీ ఎడిషన్‌లో ‘కరాటే వీరుడు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి కొంతమంది దాతలు, ఔత్సాహికులు తనను సంప్రదించారని చంద్రమోహన్ తెలిపాడు. ఈ ప్రదర్శనతో త్వరలో జరుగనున్న అంతర్జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించానని పేర్కొన్నాడు. ఈ టోర్నీ షెడ్యూల్ ఇంకా విడుదల కానందున... ఈవెంట్ వేదికపై తన వద్ద సమాచారం లేదని తెలిపాడు. మరోసారి దాతలు, ఔత్సాహికులు ప్రోత్సహిస్తే స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగుతానన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment