సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడంతో మరోసారి అల్లు అర్జున్ వివాదం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు అనుమతి నిరాకరించినా అల్లు అర్జున్ రోడ్ షో చేశాడని, అరెస్ట్ కోసం వెళితే దరుసుగా ప్రవర్తించారంటూ బన్నీపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆ వెంటనే అల్లు అర్జున్ మీడియా సమావేశం పెట్టి సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ..అవన్నీ నూటికి నూరు శాతం అబద్దాలేనని స్పష్టం చేశాడు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తూ.. మానవత్వం లేని వ్యక్తిగా చిత్రీకరించండం బాధించిందన్నారు.
(చదవండి: అల్లు అర్జున్ వివాదంపై స్పందించిన డీజీపీ)
ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఈ వివాదం గురించే చర్చిస్తున్నారు. ఇలాంటి సమయంలో నటి పూనమ్ కౌర్ పుష్ప 2 చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా చాలా బాగుందని చెబుతూ.. గంగమ్మ జాతర ఎపిసోడ్‌ని తెలంగాణలోని సమ్మక్క సారలక్క జాతరతో పోల్చుతూ ట్వీట్ చేశారు. ‘మొత్తానికి పుష్ప-2 సినిమా చూశాను. తెలంగాణలో సమ్మక్క సారలక్క జాతర ఎలాగో.. గంగమ్మ జాతరను అక్కడ అంత బాగా చూపించారు. మన ఆచార, సంస్కృతి, సంప్రదాయాలను చాలా బాగా చూపించారీ సినిమాలో. అల్లు అర్జున్ కంటే గొప్పగా ఇంకెవ్వరూ అలా నటించలేరు’ అని పూనమ్ కౌర్ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.
(చదవండి: పీలింగ్స్ సాంగ్‌లో అల్లు అర్జున్‌తో స్టెప్పులు.. మొదట అసౌకర్యంగా ఫీలయ్యా..)
ఇక పుష 2 విషయానికొస్తే.. సుకుమార్ దర్శకత్వం ఈ చిత్రంలో బన్నీకి జోడీగా రష్మిక నటించగా.. ఫహద్ ఫాజిల్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ.1600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Just completed watching #pushparaj , loved the Gangamma Jatra episode,refelects the #samakkasarakka like culture from #telangana , can’t imagine a talent other than #alluarjun adorning the character,thank you to the makers for reflecting our authentic Indian self so beautifully.
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) December 21, 2024
Comments
Please login to add a commentAdd a comment