Poonam Kaur
-
పోసాని ఆరోగ్యంపై పూనం కౌర్ ట్వీట్
సాక్షి, అమరావతి: పోసాని ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ సినీ నటి పూనం కౌర్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పరిస్థితులు ఇతర రాష్ట్రాల కంటే చాలా దారుణంగా ఉన్నాయంటూ దుయ్యబట్టారు. బలహీనమైన కేసులు పెట్టి ప్రతీకారం తీర్చుకోవడంలో వ్యక్తులను ఎత్తుకెళ్లడం చాలా బాధాకరం. ‘‘వ్యక్తిగతంగా నాకు భారీ నష్టం జరిగినప్పటికీ, సీనియర్ నటుడు పోసాని కృష్ణమురళి ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలి’’ అంటూ ఆమె ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు.కాగా, పోసాని కృష్ణమురళి విషయంలో అడుగడుగునా పోలీసుల వైఫల్యం కనిపిస్తోంది. పోసాని అనారోగ్యంతో ఉన్నా కానీ కూటమి సర్కార్ వేధింపుల పర్వం కొనసాగుతోంది. అరెస్టు సమయంలోనే తన అనారోగ్య సమస్యలు ఉన్నాయని పోసాని, ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. ఎంఆర్ఐ చేయించుకోవాలని చెప్పినా కూడా వినిపించుకోకుండా పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. తమ దగ్గర మంచి డాక్టర్లు ఉన్నారంటూ సంబేపల్లి ఎస్ఐ జీపులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. తెల్లారిందాకా జీపులోనే తిప్పుతూ పోసానిని ఖాకీలు తీవ్రంగా ఇబ్బందిపెట్టారు. 27న మధ్యాహ్నం ఓబులవారిపల్లె పీఎస్‌కు తరలించారు. అక్కడ ఏకంగా తొమ్మిది గంటల పాటు విచారించారు. -
త్రివిక్రమ్ వివాదంపై శివ బాలాజీకి కౌంటర్ ఇచ్చిన పూనమ్ కౌర్
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, సినీ నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) మధ్య వివాదం కొన్నేళ్లుగా నడుస్తోంది. తాజాగా ఆమె మా అసోసియేషన్‌ను తప్పు పడుతూ ఒక ట్వీట్ చేసింది. త్రివిక్రమ్ వేధింపుల వల్లే తన కెరీర్ నాశనమైందని ఆరోపించింది. ఈ విషయంపై మా అసోసియేషన్‌కు ఫిర్యాదు చేసి చాలా ఏళ్లు అయిందని తెలిపింది. తన ఫిర్యాదు గురించి ఎవరూ కూడా పట్టించుకున్నపాపాన పోలేదని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. త్రివిక్రమ్‌పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాసుకొచ్చింది. అందుకు కౌంటర్‌గా మా అసోసియేషన్ తరఫున నటుడు, కోశాధికారి శివ బాలాజీ (Siva Balaji) రియాక్ట్ అయ్యారు. ఆమె నుంచి తముకు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు రాలేదని అన్నారు. గతంలో ఆమె ఫిర్యాదు చేసినట్లు రికార్డుల్లో కూడా లేదని తెలిపారు. ఇందుకు సమాధానంగా పూనమ్ మరోసారి రియాక్ట్ అయింది.మా అసోసియేషన్ ట్రెజరర్ శివబాలాజీకి పూనమ్ కౌర్ కౌంటర్‌గా ఇచ్చింది. గతంలో త్రివిక్రమ్‌పై (Trivikram Srinivas) తాను చేసిన ఫిర్యాదుకు మా అసోసియేషన్ నుంచి గతంలో వచ్చిన మెసేజ్‌ని పూనమ్ కౌర్ పోస్ట్ చేసింది. తనను కలవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపిన మా అసోసియేషన్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదంటూ ఆమె పేర్కొంది. మా అసోసియేషన్ నుంచి పూనమ్‌కు వచ్చిన మెసేజ్‌లో ఇలా ఉంది. (ఇదీ చదవండి: రజనీకాంత్‌ను మెప్పించిన అభిమాని.. ఇంటికి పిలిచి గిఫ్ట్‌తో సత్కారం)'త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఫిర్యాదుకు సంబంధించి మీ మెయిల్ మాకు అందింది. మీ అభ్యర్థన మేరకు, తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రాంగణంలో అంగీకరించిన తేదీ, సమయానికి ఇద్దరు పరిశ్రమకు చెందిన మహిళా సభ్యులతో పాటు మరోఇద్దరు మహిళా పరిశ్రమేతర సభ్యులతో ఇక్కడి ప్యానెల్లో మిమ్మల్ని కలవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ సమావేశం మొత్తం మహిళా ప్యానెల్‌గా ఉండాలని మీరు అభ్యర్థించారు. ఈ విషయంలో మేము ఎలా కొనసాగించాలో మీ కేసును స్పష్టమైన పద్ధతిలో చెప్పగలరని ఆశిస్తున్నాము.'త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి పూనమ్ కౌర్ ఇప్పటికే చాలాసార్లు చెప్పుకొచ్చింది. సోషల్‌మీడియా వేదికగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆమె విమర్శలు చేస్తూనే ఉంది. సినిమా అవకాశాల పేరుతో తనను మోసం చేసేందుకు ప్రయత్నించారని.. తన కోరిక తీర్చకపోవడంతో ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేసారని పూనమ్ కౌర్ ఆరోపిస్తోంది. అయితే ఆమె ట్వీట్స్‌పై త్రివిక్రమ్ ఇంతవరకు స్పందించలేదు.అయితే, పూనమ్ బయటపెట్టిన ఆధారంతో ఇప్పుడు మా అసోసియేషన్ ఇరకాటంలో పడినట్లు అయింది. ఇదే క్రమంలో దర్శకుడు త్రివిక్రమ్‌కు కూడా కాస్త ఇబ్బందులు తప్పవనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. No proceeds after this - thank you 🙏 pic.twitter.com/cW8TiWax0Q— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) January 5, 2025 -
'వాటితో ఎలాంటి ఉపయోగం లేదు'.. పూనమ్ ట్వీట్‌పై మా అసోసియేషన్ రియాక్షన్
హీరోయిన్ పూనమ్ కౌర్ ట్వీట్‌పై మా అసోసియేషన్ స్పందించింది. మా తరఫున నటుడు కోశాధికారి శివబాలాజీ ఆమె చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. ఆమె నుంచి మాకు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు రాలేదని అన్నారు. మా కంటే ముందుగా కూడా ఆమె ఫిర్యాదు చేసినట్లు రికార్డుల్లో కూడా లేదని తెలిపారు.అంతేకాకుండా పూనమ్ కౌర్ కేవలం ట్విటర్లో పోస్టులు పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని శివబాలాజీ వెల్లడించారు. మా అసోసియేషన్‌ను, న్యాయ వ్యవస్థను కానీ ఆశ్రయిస్తే ఆమెకు న్యాయం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం పూనమ్ కౌర్ ఎపిసోడ్ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె పోస్ట్‌పై మా అధ్యక్షుడు మంచు విష్ణు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే.కాగా.. అంతకుముందు పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ వేధింపుల వల్లే తన కెరీర్ నాశనమైందని ఆరోపించింది. ఈ విషయంపై మా అసోసియేషన్‌కు ఫిర్యాదు చాలా ఏళ్లు అయిందని తెలిపింది. తన ఫిర్యాదు ఎవరూ కూడా పట్టించుకున్నపాపాన పోలేదని సోషల్ మీడియా వేదిక ఆవేదన వ్యక్తం చేసింది. త్రివిక్రమ్‌పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాసుకొచ్చింది. గతంలోనూ చాలాసార్లు తన బాధను వ్యక్తం చేసిన పూనమ్ కౌర్ మరో ట్వీట్‌తో చర్చకు దారితీసింది.గతంలోనూ పోస్టులు..టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు, సినీ నటి పూనమ్ కౌర్ వివాదం ఇప్పటిది కాదు. గతంలో త్రివిక్రమ్‌ను ఉద్దేశించి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో విమర్శలు చేస్తూనే ఉంది. సినిమా అవకాశాల పేరుతో తనను మోసం చేసేందుకు ప్రయత్నించారని.. తన కోరిక తీర్చకపోవడంతో ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేసారని పూనమ్ కౌర్ ఆరోపిస్తోంది. అయితే ఆమె ట్వీట్స్‌పై త్రివిక్రమ్ ఇంతవరకు స్పందించలేదు.పూనమ్ కౌర్ సినీ కెరీర్..ఇక పూనమ్ కౌర్ సినిమాల విషయానికొస్తే.. మాయాజాలం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే మంచి మార్కులు సంపాదించుకుంది. ఆ తర్వాత ఒక విచిత్రం, శౌర్యం, నిక్కి అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి?, గగనం లాంటి చిత్రాల్లో నటించింది. 2022లో వచ్చిన నాతిచరామి సినిమాలో చివరిసారిగా కనిపించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. -
త్రివిక్రమ్‌పై పూనమ్ మరోసారి సంచలన ట్వీట్
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు, సినీ నటి పూనమ్ కౌర్(Poonam Kaur) మధ్య ఎప్పటి నుంచో వివాదం ఉంది. త్రివిక్రమ్ ను ఉద్దేశించి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పూనమ్ విమర్శలు చేస్తూనే ఉంది. సినిమా అవకాశాల పేరుతో తనను మోసం చేసేందుకు ప్రయత్నించారని,కోరిక తీర్చకపోవడంతో ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేసారనేది పూనమ్ ఆరోపణ. అయితే ఆమె ట్వీట్స్‌పై త్రివిక్రమ్ ఇంతవరకు స్పందించలేదు. కానీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు మాత్రం నిజంగానే పూనమ్‌కి అన్యాయం జరిగిందంటారు. మరికొంత మంది ఏమో ఫేమ్ కోసమే ఇలాంటి ట్వీట్స్ చేస్తున్నారని విమర్శిస్తారు. అయితే పూనమ్ మాత్రం తన పోరాటం ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది. తివిక్రమ్‌పై చర్యలు తీసుకోవాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ని డిమాండ్ చేస్తునే ఉంది. కానీ ‘మా’ మాత్రం పట్టించుకోవట్లేదని పూనమ్ ఫైర్ అవోతుంది.తాజాగా మరోసారి ‘మా’పై తన అసంతృప్తిని వెల్లడిస్తూ పూనమ్ సంచలన ట్వీట్ చేసింది.(చదవండి: డాకు మహారాజ్'కు తారక్ ఫ్యాన్స్ అన్ స్టాపబుల్ వార్నింగ్)‘త్రివిక్రమ్(Trivikram Srinivas)పై నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేసి చాలా కాలమైంది. ఇప్పటి వరకు ‘మా’ దానిపై స్పందించలేదు. త్రివిక్రమ్‌ని ప్రశ్నించడం కానీ అతనిపై చర్యలు తీసుకోవడం కానీ జరగలేదు. నా జీవితాన్ని నాశనం చేసి ఆరోగ్యంగా, ఆనందంగా లేకుండా చేసిన అతన్ని ఇప్పటికీ ఇండస్ట్రీ పెద్ద మనిషిగానే ప్రోత్సహిస్తుంది’ అని పూనమ్ ట్వీట్ చేసింది. గతంలో కూడా పూనమ్ ఇలాంటి ట్వీట్స్ చాలానే చేసింది. త్రివిక్రమ్‌పై ‘మా’లో ఫిర్యాదు చేస్తే సినీ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదని, రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన త్రివిక్రమ్‌ని ప్రశ్నించాలని పూనమ్ డిమాండ్ చేసింది.పూనమ్ విషయానికొస్తే.. మాయాజాలం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే మంచి మార్కులు సంపాదించుకుంది. ఆ తర్వాత ఒక విచిత్రం, శౌర్యం, నిక్కి అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి?, గగనం లాంటి చిత్రాల్లో నటించింది. 2022లో వచ్చిన నాతిచరామి సినిమాలో చివరిసారిగా కనిపించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. No questioning or even action taken on director #Trivikramsrinivas for complaint give in maa association for very long , he rather is encouraged by the big wigs after damaging my life which has affected health and happiness .— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) January 5, 2025 -
' సినీ ఇండస్ట్రీలో ఏ ఒక్క మహిళకు సమస్య లేదు'.. పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్
హీరోయిన్ పూనమ్ కౌర్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రితో జరిగిన టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీపై స్పందించింది. సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ పెద్దలు భేటీ కావడంపై తనదైన శైలిలో పోస్ట్ చేసింది. ముఖ్యమంత్రితో కలిసేందుకు వెళ్లిన వారిలో ఇండస్ట్రీ నుంచి ఒక్క మహిళ కూడా లేకపోవడంపై ట్విటర్ వేదికగా ప్రశ్నించింది.మన టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మహిళలకు ఎలాంటి సమస్యలు లేవని పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. కేవలం హీరోలకు, బిజినెస్ గురించి సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే ఇండస్ట్రీ అండగా ఉంటుందని ట్విటర్లో రాసుకొచ్చింది. తాజా పరిస్థితి చూస్తే ఇండస్ట్రీలో ఏ ఒక్క మహిళకు ఎలాంటి సమస్యలు లేవని అర్థమవుతోందని వ్యంగ్యంగా ట్వీట్ చేసింది.కాగా.. సంధ్య థియేటర్ ఘటన తర్వాత టాలీవుడ్ సినీ పెద్దలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎంతో దిల్ రాజు, అల్లు అరవింద్, నాగార్జున, త్రివిక్రమ్, వెంకటేశ్ లాంటి ప్రముఖులంతా సమావేశమయ్యారు. ఈ భేటీలో సినీ ఇండస్ట్రీలో సమస్యలపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో ఇండస్ట్రీ తరఫున ఏ ఒక్క మహిళ డైరెక్టర్ కానీ, నటి కానీ పాల్గొనలేదు. దీన్ని ఉద్దేశించే నటి పూనమ్ కౌర్ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.No women was considered important enough to be taken for a meeting with CM , women have absolutely no issues , industry stands up when a hero has a issue or trade matters , no women has issue - none can have one .— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) December 26, 2024 -
అల్లు అర్జున్‌పై నటి పూనమ్ కౌర్ ఆసక్తికర ట్వీట్
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడంతో మరోసారి అల్లు అర్జున్ వివాదం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు అనుమతి నిరాకరించినా అల్లు అర్జున్ రోడ్ షో చేశాడని, అరెస్ట్ కోసం వెళితే దరుసుగా ప్రవర్తించారంటూ బన్నీపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆ వెంటనే అల్లు అర్జున్ మీడియా సమావేశం పెట్టి సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ..అవన్నీ నూటికి నూరు శాతం అబద్దాలేనని స్పష్టం చేశాడు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తూ.. మానవత్వం లేని వ్యక్తిగా చిత్రీకరించండం బాధించిందన్నారు. (చదవండి: అల్లు అర్జున్ వివాదంపై స్పందించిన డీజీపీ)ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఈ వివాదం గురించే చర్చిస్తున్నారు. ఇలాంటి సమయంలో నటి పూనమ్ కౌర్ పుష్ప 2 చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా చాలా బాగుందని చెబుతూ.. గంగమ్మ జాతర ఎపిసోడ్‌ని తెలంగాణలోని సమ్మక్క సారలక్క జాతరతో పోల్చుతూ ట్వీట్ చేశారు. ‘మొత్తానికి పుష్ప-2 సినిమా చూశాను. తెలంగాణలో సమ్మక్క సారలక్క జాతర ఎలాగో.. గంగమ్మ జాతరను అక్కడ అంత బాగా చూపించారు. మన ఆచార, సంస్కృతి, సంప్రదాయాలను చాలా బాగా చూపించారీ సినిమాలో. అల్లు అర్జున్ కంటే గొప్పగా ఇంకెవ్వరూ అలా నటించలేరు’ అని పూనమ్ కౌర్ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. (చదవండి: పీలింగ్స్ సాంగ్‌లో అల్లు అర్జున్‌తో స్టెప్పులు.. మొదట అసౌకర్యంగా ఫీలయ్యా..)ఇక పుష 2 విషయానికొస్తే.. సుకుమార్ దర్శకత్వం ఈ చిత్రంలో బన్నీకి జోడీగా రష్మిక నటించగా.. ఫహద్ ఫాజిల్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ.1600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. Just completed watching #pushparaj , loved the Gangamma Jatra episode,refelects the #samakkasarakka like culture from #telangana , can’t imagine a talent other than #alluarjun adorning the character,thank you to the makers for reflecting our authentic Indian self so beautifully.— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) December 21, 2024 -
పూనమ్ కౌర్ మరో సంచలన ట్వీట్.. ఆ వివాదం గురించేనా?
కొన్నిరోజుల క్రితం దర్శకుడు త్రివిక్రమ్‌ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసిన నటి పూనమ్ కౌర్.. తాజాగా మరో షాకింగ్ ట్వీట్ చేసింది. మరో సంచలన ట్వీట్‌తో ప్రకంపనలు సృష్టించింది. ఈసారి ఏకంగా టాలీవుడ్ హీరోపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. కోలీవుడ్‌లో ధనుశ్- నయనతార వివాదం కొనసాగుతున్న వేళ.. పూనమ్ కౌర్ ట్వీట్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.పూనమ్ తన ట్వీట్లో రాస్తూ..'నేను తెలుగులో చేసిన ఒక సోషియో ఫాంటసీ చిత్రంలో చేశా. నాతో పాటు ఓ అమ్మాయి కూడా నటించింది. ఆ తర్వాత తను హీరోయిన్గా కూడా చేసింది. అయితే కొన్నేళ్లుగా సినిమాలు చేయడం మానేసింది. అంతేకాదు ఎవరికీ కనిపించకుండా పోయింది. ఇటీవల తను ఓ డొమెస్టిక్ ఫ్లైట్‌లో కలిసింది. పెళ్లి షాపింగ్‌కు వచ్చానని.. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని అడిగింది. అంతేకాదు.. తాను యూఎస్ వెళ్లినప్పుడు అతను అదే ఫ్లైట్‌లో కనిపించాడని చెప్పింది. ఓ సినిమాలో ఇంటిమేట్ సీన్ టైమ్‌లో నాపై అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. అందువల్లే ఇండస్ట్రీ వదిలి యూఎస్ వెళ్లి చదువుకుంటున్నట్లు వివరించింది. అయినప్పటికీ ఆ హీరో వేధింపులు తగ్గలేదంటూ అమ్మాయి వివరించింది.' అని పూనమ్ తెలిపింది. దీంతో మరోసారి పూనమ్ కౌర్ ట్వీట్ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.అందులో తన ట్వీట్లో తమిళనాడు అంటూ ప్రస్తావించింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో ధనుశ్-నయనతార మధ్య వార్ నడుస్తోంది. ఈ సమయంలో పూనమ్ కౌర్ ట్వీట్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఆ హీరో ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. !! ॐ नमो हनुमते भय भंजनाय सुखम् कुरु फट् स्वाहा ।। !!⠀ TAMILNADU#womensupportingwomen pic.twitter.com/QgYxjfYA7I— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) November 17, 2024 -
టాలీవుడ్ దర్శకుడిదే తప్పు.. మానభంగం చేశాడు: పూనమ్ కౌర్
కొన్నిరోజుల క్రితం దర్శకుడు త్రివిక్రమ్‌ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసిన నటి పూనమ్ కౌర్.. ఇప్పుడు మరో షాకింగ్ ట్వీట్ చేసింది. ఓ తెలుగు దర్శకుడు.. ఒక అమ్మాయిని గర్భవతిని చేసి, ఆమె కెరీర్‌నే నాశనం చేశాడని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: మరో వివాదంలో నయనతార.. నిర్మాతలు ఎందుకు డబ్బులివ్వాలి?)'ఇండస్ట్రీలో ఓ డైరెక్టర్ ఒక అమ్మాయిని గర్భవతిని చేసి, ఆమె కెరీర్ నాశనం చేశాడు. మా(మూవీ ఆర్టిస్ట్ అసియేషన్) జోక్యంతో ఆ పంజాబీ నటికి కాస్త సహాయం దొరికింది. అతడు లీడర్‌గా మారిన నటుడు కాదు. అయితే ఈ విషయంలోకి తనను ఓ నటుడు/రాజకీయ నాయకుడు అనవసరంగా లాగారు' అని పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ పెట్టింది.పూనమ్ ట్వీట్ పెట్టింది కానీ ఒక్కరి పేరు కూడా ప్రస్తావించలేదు. ఇకపోతే గతంలో దర్శకుడు త్రివిక్రమ్‌పై తాను మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్‌లో ఫిర్యాదు చేశానని, కానీ అప్పుడు సరిగా పట్టించుకోలేదనే నిజాన్ని బయటపెట్టింది. తాజా ట్వీట్ చూస్తే త్రివిక్రమ్, పవన్ కల్యాణ్‌నే పరోక్షంగా టార్గెట్ చేసిందా అనిపించింది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' గేమ్ కాదు ట్రామా?) -
త్రివిక్రమ్‌ను ప్రశ్నించే దమ్ముందా? నిర్మాతపై పూనమ్ కౌర్ ఫైర్
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, సినీ నటి పూనమ్ కౌర్ గొడవ గురించి టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తానికి తెలిసిందే. సందర్భం వచ్చినప్పుడల్లా అటు త్రివిక్రమ్, ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ఆమె వరుస ట్వీట్స్ చేస్తారు. వారిద్దరు కలిసి తనకు చేసిన అన్యాయం గురించి బహిరంగానే వెల్లడిస్తారు. సినిమా అవకాశాల పేరుతో తనను మోసం చేసేందుకు ప్రయత్నించారని, వారి కోరిక తీర్చకపోవడంతో ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేసారనేది పూనమ్ ఆరోపణ. అయితే ఆమె ట్వీట్స్‌పై అటు త్రివిక్రమ్ కాని, ఇటు పవన్ కాని స్పందించలేదు కానీ, ఇండస్ట్రీ ప్రముఖుల్లో కొంతమంది పూనమ్‌కి నిజంగానే అన్యాయం జరిగిందని అంటారు. మరికొంతమంది ఏమో ఫేమ్ కోసమే వారిపై ఇలాంటి ఆరోపణలు చేస్తుందని అంటున్నారు. సినీ నిర్మాత చిట్టి బాబు కూడా పూనమ్ ట్వీట్స్‌పై స్పందించాడు. (చదవండి: నిర్మాతకు మూడేళ్ల జైలు శిక్ష.. న్యాయం గెలిచిందంటూ మాల్వీ మల్హోత్రా)తాజాగా ఆయన ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ..‘పూనమ్ ఫిర్యాదు ఇవ్వమని పిలిస్తే రాదు కానీ.. పిచ్చి పిచ్చిగా ట్వీట్స్ వేస్తారని’అన్నారు ఏం జరిగిందో కమిటికీ ఫిర్యాదు చేస్తే తెలుస్తుంది కానీ..ఇలా ట్వీట్స్ చేస్తే ఏం లాభం’అని చిట్టి బాబు అన్నారు. నిర్మాత వ్యాఖ్యలపై పూనమ్ కౌర్ మండి పడింది. మీకు త్రివిక్రమ్‌ను ప్రశ్నించే దమ్ముందా? అని నిలదీసింది.‘మీరు త్రివిక్రమ్‌ను ప్రశ్నించరు.. ప్రశ్నించలేరు.. నేను మీలా వెన్నుమొక లేని దాన్ని అయితే కాను. నా మీద కామెంట్ చేయడం కాకుండా.. త్రివిక్రమ్‌ను అడిగే దమ్ముందా? అంటూ నిర్మాతను ప్రశ్నించింది. దీనిపై చిట్టి బాబు ఎలా స్పందిస్తారో చూడాలి. పూనమ్ విషయానికొస్తే.. మాయాజాలం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది ఈ బ్యూటీ. ఆ తర్వాత ఒక విచిత్రం, శౌర్యం, నిక్కి అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి?, గగనం లాంటి చిత్రాల్లో నటించింది. 2022లో వచ్చిన నాతిచరామి సినిమాలో చివరిసారిగా కనిపించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. It’s trivikram Srinivas who doesn’t and will not be questioned- I am not spineless like these men who run their show to project their fake masculinity- I dare him to question the director rather than commenting on me .— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 7, 2024 -
పవన్ తిరుమల పర్యటన.. పూనమ్ ట్వీట్ వైరల్
హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు సినిమాల్లో నటించకపోయినా.. సోషల్ మీడియా ద్వార నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటునే..సమాజంలో జరుగుతున్న సంఘటనలపై తన అభిప్రాయాన్ని ధైర్యంగా తెలియజేస్తుంది. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్‌లపై ఆమె పెట్టే పోస్టులు వైరల్ అవుతుంటాయి. వారిద్దరిని విమర్శిస్తూ గత కొన్నాళ్లుగా ఆమె ట్వీట్స్ చేస్తోంది. కొన్ని ప్రత్యేక్షంగా, మరికొన్ని సార్లు పరోక్షంగా ట్వీట్లు చేస్తూ తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తు చేస్తుంటుంది. పవన్ కల్యాణ్‌పై ఆమె చేసిన ట్వీట్లు గతంలో దుమారం రేపాయి. తాజాగా మరోసారి పవన్‌ని విమర్శిస్తూ ట్వీట్ చేసింది పూనమ్. నిబంధనలకు విరుద్ధంగా పవన్ పర్యటనడిప్యూటీ సీఎం పనన్ కల్యాణ్ తన చిన్న కుమార్తె పొలెనా అంజనకి తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. అనంతరం ఇద్దరు కూతుళ్లతో కలిసి మహాద్వార ప్రవేశం చేశారు. వాస్తవానికి భార్యకు మాత్రమే మహా ద్వార ప్రవేశం ఉంటుంది. కానీ నిబంధనలకు విరుద్దంగా పవన్ కల్యాణ్ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి మహాద్వార ప్రవేశం చేశారు. అలాగే నిషేదంలో ఉన్న వావనాలను కొండపైకి అనుమతి ఇస్తూ అధికారులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించారు. డిప్యూటీ సీఎం హాదాలో తిరుమలకు వచ్చిన పవన్‌కు సీఎం స్థాయిలో ప్రోటోకాల్ కల్పించడంపై భక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు.(చదవండి: టీటీడీ నిబంధనలు తుంగలో తొక్కేసిన పవన్..)ప్రతి ఒక్కరికి కూతురు ముఖ్యమే: పూనమ్ కౌర్పవన్ తిరుమల పర్యటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిప్యూటీ సీఎం దర్శనం కోసం సాధారణ భక్తులను గంటల కొద్ది క్యూలో నిలబెట్టడం సరికాదంటున్నారు నెటిజన్స్. పవన్ ఆశిస్సుల కోసం అధికారులు అత్యత్సాహం ప్రదర్శించారని విమర్శిస్తున్నారు. మరోవైపు కూతుళ్లతో కూడా రాజకీయం చేస్తున్నాడని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇక పవన్‌పై తరచు విమర్శలు చేసే పూనమ్ కౌర్ కూడా పరోక్షంగా తిరుమల పర్యటనను తప్పుపట్టింది. ఇద్దరు కూతుళ్లతో కలిసి పవన్ తిరుమల పర్యటన చేసిన నేపథ్యంలో ‘ప్రతి ఒక్కరికి కుమార్తె ముఖ్యమే’ అంటూ పూనమ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించే పూనమ్ ఈ ట్వీట్ చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. పవన్ తన రాజకీయ ప్రయోజనాలకు కోసం కూతుళ్లను కూడా వాడుకుంటాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. Everyone’s daughter is important !!!— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 2, 2024 -
త్రివిక్రమ్ పై పిర్యాదు చేశా.. పరిష్కారం ఏది ..?
-
KSR Live Show: దర్శకుడు త్రివిక్రమ్ పూనమ్ కౌర్ ట్వీట్
-
జత్వాని కేసుపై పెట్టిన ఫోకస్.. పూనమ్ కౌర్ కేసుపై అదే స్పీడ్ ఉండాలి..
-
పూనమ్ కౌర్ ట్వీట్ పై కొమ్మినేని కామెంట్స్..
-
త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ ఆరోపణలు.. తమ్మారెడ్డి ఏమన్నారంటే?
స్టార్ దర్శకుడు త్రివిక్రమ్‌పై హీరోయిన్ పూనమ్ కౌర్ ఆరోపణలు ఇప్పటివీ కాదు. తాజాగా మరోసారి ట్విటర్ వేదికగా గురూజీపై పూనమ్ విమర్శలు చేసింది. ఇండస్ట్రీ పెద్దలు త్రివిక్రమ్‌ని గట్టిగా ప్రశ్నించాలని ఆమె ట్విటర్ వేదికగా కోరింది. కొరియోగ్రాఫర్ కమ్ జనసేన నాయకుడు జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో.. ప్రస్తుతం ఈ ట్వీట్ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.అయితే పూనమ్ కౌర్ ట్వీట్‌పై టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో దానిపై ప్రశ్న అడగ్గా.. ఆయన మాట్లాడారు. ఆమె 'మా'(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) కు ఫిర్యాదు ఎప్పుడు చేసిందో మాకు తెలియదు.. ఒకవేళ అప్పటికే కమిటీ ఏర్పడి ఉంటే.. ఫిర్యాదు బాక్స్‌లో తన కంప్లైంట్ వేసి ఉంటే సరిపోయేది.. ఎందుకంటే ఆ ఫిర్యాదును 'మా' వాళ్లు పంపించినా దానిపై మేము చర్చించేవాళ్లం. ఇప్పటికైనా మా వరకు ఫిర్యాదు వస్తే కచ్చితంగా స్పందిస్తామని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. కాగా.. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన పూనమ్ కౌర్ హీరోయిన్గా తెలుగులో పలు సినిమాలు చేసింది. త్రివిక్రమ్‌పై పూనమ్ ట్వీట్త్రివిక్రమ్ గురించి హీరోయిన్ పూనమ్ కౌర్ ఇవాళ ట్వీట్ చేసింది. 'త్రివిక్రమ్‌పై గతంలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశా. కానీ సినీ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదు. నన్ను రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. సినీ పెద్దలు ఈ విషయమై త్రివిక్రమ్‌ని ప్రశ్నించాలి.' అని పూనమ్ కౌర్ అని ట్విటర్(ఎక్స్)లో రాసుకొచ్చింది.Had maa association taken complaint on trivikram Srinivas , I and many wouldn’t have had the political suffering , I was rather silently ignored , I had given a call tand then complaint to the heads , I want industry big wigs to question Director Trivikram .— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 17, 2024 -
ఇండస్ట్రీ పెద్దలు.. డైరెక్టర్ త్రివిక్రమ్‌ని ప్రశ్నించాలి: పూనమ్ కౌర్
స్టార్ దర్శకుడు త్రివిక్రమ్‌తో హీరోయిన్ పూనమ్ కౌర్ గొడవ ఇప్పటిది కాదు. చాన్నాళ్ల నుంచి ఉన్నదే. వీలు చిక్కినప్పుడల్లా గురూజీపై పూనమ్ విమర్శలు చేస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి అలాంటి కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీ పెద్దలు త్రివిక్రమ్‌ని గట్టిగా ప్రశ్నించాలని కోరింది. కొరియోగ్రాఫర్ కమ్ జనసేన నాయకుడు జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో ఈ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది.హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన పూనమ్ కౌర్.. తెలుగులో పలు సినిమాలు చేసింది. అయితే త్రివిక్రమ్, పవన్ కల్యాణ్‌తో ఈమెకు ఏం గొడవ ఉందో తెలీదు గానీ ఎప్పటికప్పుడు వీళ్లని విమర్శిస్తూనే ఉంటుంది. తాజాగా జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో అతడిని మాస్టర్ అని పిలవొద్దు అని ట్వీట్ చేసింది.(ఇదీ చదవండి: జానీ మాస్టర్ కేసు.. బయటకొస్తున్న నిజాలు!?)ఇది పెట్టిన కాసేపటికే త్రివిక్రమ్ గురించి మరో ట్వీట్ చేసింది. 'త్రివిక్రమ్‌పై గతంలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశా. కానీ సినీ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదు. నన్ను రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. సినీ పెద్దలు ఈ విషయమై త్రివిక్రమ్‌ని ప్రశ్నించాలి.' అని పూనమ్ కౌర్ అని ట్విటర్(ఎక్స్)లో రాసుకొచ్చింది.మరి పూనమ్ కౌర్ చెప్పినట్లు త్రివిక్రమ్.. మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్‌లో ఫిర్యాదు చేసేంతలా ఏం చేశారు? ఈ విషయం సినీ పెద్దలు ఎందుకు బయటకు రానీయలేదు. పూనమ్ కౌర్‌ని రాజకీయంగా ఇబ్బంది పెట్టడం వెనక ఎవరెవరున్నారు? అనేది తెలియాల్సి ఉంది. ఇదంతా చూస్తుంటే కేరళ ఇండస్ట్రీలోని హేమ కమిటీలా ఇక్కడ కూడా ఒకటి ఏర్పాటు చేయాలేమో?(ఇదీ చదవండి: ప్రముఖ సింగర్ మనో కొడుకులు అరెస్ట్)Had maa association taken complaint on trivikram Srinivas , I and many wouldn’t have had the political suffering , I was rather silently ignored , I had given a call tand then complaint to the heads , I want industry big wigs to question Director Trivikram .— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 17, 2024 -
జానీని ‘మాస్టర్’ అని పిలవకండి: హీరోయిన్ పూనమ్ కౌర్
ప్రముఖ కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాష అలియా జానీ మాస్టర్‌పై ఓ యువతి లైంగిక ఆరోపణలు చేయడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్, చెన్నై, ముంబై తదితర నగరాల్లో ఔట్‌డోర్ షూటింగ్లకి వెళ్లినప్పుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అతని సహాయకురాలు(21) పోలీసులకు ఫిర్యాదు చేసింది.అలాగే నార్సింగిలోని తన నివాసానికి వచ్చి పలు మార్లు వేధింపులకు కూడా గురి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో నార్సింగి పోలీసులు జానీ మాస్టర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. (చదవండి: మైనర్‌గా ఉన్నప్పటి నుంచే 'జానీ' వేధించాడు: చిన్మయి)ఈ విషయం బయటకు రాగానే పలువురు టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా జానీ మాస్టర్‌పై ఫైర్ అవుతూ.. బాధితురాలికి అండగా నిలుస్తున్నారు. సింగర్ చిన్మయి స్పందిస్తూ.. యువతి మైనర్‌గా ఉన్నప్పుడే జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. తాజాగా నటి పూనమ్ కౌర్ కూడా జానీ మాస్టర్‌పై సీరియస్ అయింది. ఇకపై అతన్ని మాస్టర్ అనే పిలువొద్దని ఎక్స్ వేదికగా కోరింది. ‘నిందితుడు షేక్ జానీ ని ఇకపై ఎవరు జానీ మాస్టర్ అని పిలవకండి. మాస్టర్ అనే పదానికి విలువ ఇవ్వండి’ అని పూనమ్ ట్వీట్ చేసింది. Accused ‘shaik jani’ should not be called a master anymore ,Have some respect for the word ‘Master’ 🙏— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 16, 2024 -
'పవర్ రేపిస్ట్' అంటూ పూనమ్ కౌర్ ట్వీట్
టాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన పలు సంఘటనల్లో ఆమె వెంటనే రియాక్ట్ అవుతారు. సత్యవేడుకు చెందిన ఒక మహిళ టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం మీద తాజాగా పూనమ్ సంచలన ట్వీట్ చేశారు. ఆమె చేసిన కామెంట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది."పవర్ రేపిస్ట్"ని బయటపెట్టమని తన భాగస్వామిని ప్రోత్సహించిన భర్తను అభినందిస్తున్నానంటూ పూనమ్ కౌర్ ఒక ట్వీట్ చేశారు. అతను అలా తన భార్యకు అండగా లేకుండా ఉండుంటే ఇప్పుడు ఆ ఎమ్మెల్యే టీడీపీ నుంచి సస్పెండ్ అయ్యేవాడు కాదని ఆమె అభిప్రాయపడ్డారు. 'ఇలాంటి సంఘటన ఎదురైతే అధికారంలో ఉన్నవారితో గొడవ ఎందుకని చాలామంది మౌనంగా ఉండమని చెబుతారు.. కానీ, అతను తన భార్యను సపోర్ట్ చేస్తూ తప్పును బహిర్గతం చేశాడు.తన భార్య మీద అత్యాచారం చేసిన ఎమ్మెల్యే వ్యవహారాన్ని బట్టబయలు చేసేలా ఎంకరేజ్ చేసిన ఆ భర్తకు నా కృతజ్ఞతలు. అత్యాచారానికి గురైన మహిళ దైర్యంగా బయటికొచ్చి మాట్లాడిన ఆ మహిళను అభినందిస్తున్నాను.' అని పూనమ్ పేర్కొన్నారు.పూనమ్ కౌర్ చేసిన 'పవర్ రేపిస్ట్' అనే వ్యాఖ్యం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళ పట్ల వ్యవహరించిన తీరు నెట్టింట పెద్ద దుమారమే రేగుతుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట ట్రెండ్ అవుతుంది. సత్యవేడు నియోజకవర్గం టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా ఉన్న బాధిత మహిళ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై సంచలన ఆరోపణలతో పాటు వీడియోలను విడుదల చేసింది. ఆయన తనను లైంగికంగా వేధించడంతో పాటు అత్యాచారం చేశారని చెబుతూ ఆమె మీడియా ముందుకు వచ్చింది.Highly appreciative of the husband who encouraged his partner to expose the “ POWER RAPIST” - had he not done that - the MLA from #TDP wouldn’t have be suspended - many would just say they in power keep quiet - kudos to him 🙏 and the woman who exposed him - gives hope . 🙏— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 5, 2024 -
జరిగింది దారుణం.. ఐక్యంగా పోరాడితే నిజం బయటకు..
సాక్షి, మచిలీపట్నం/అమరావతి: విద్యార్థినుల వాష్ రూమ్‌లలో రహస్య కెమెరాల ఘటనపై సినీ నటి పూనమ్ కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ‘ఎక్స్’ వేదికగా ఓ లేఖ విడుదల చేశారు. ‘ప్రియమైన అమ్మాయిలారా. మీలో ఒకరిగా మీ అందరికీ ఈ లేఖ రాస్తున్నాను. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎన్నో ఆశలతో, నమ్మకంతో బయటకు పంపుతున్నారు. కానీ.. బయట మీకు జరుగుతున్న పరిణామాలు తెలిసి నేను బాధపడుతున్నాను. మీకు ఇటీవల జరిగిన ఈ పరిస్థితులు చాలా దారుణం. విద్యార్థి సంఘాలు ఐక్యంగా పోరాడితే నిజం బయటకు వస్తుందని నేను చెప్పాలనుకుంటున్నాను.‘నేరస్థులు ఎలా రక్షించబడతారు, బాధితులు ఎలా అవమానింపబడతారు’ అనేది నాకు బాగా అనుభవం. అటువంటి చర్యలతో నేను మానసికంగా అలసిపోయాను. వ్యక్తులు ఎంతశక్తిమంతమైన వారైనా.. వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఏ పార్టీకి చెందిన వారైనా మీరు వదలకండి. అమ్మాయిలు తమ కోసమే కాకుండా మనందరికీ తెలియని చాలామంది ఇతర విద్యార్థుల కోసం పోరాడుతున్నారు. ఒక అమ్మాయి చాలామంది అమ్మాయిలను ప్రమాదంలోకి నెట్టడం అనేది నాకు అసహ్యం కలిగించింది. నేరస్థులకు ఎంతటి శక్తిమంతులైనా.. ఎవరు సహకరిస్తున్నా.. ఎవరినీ విడిచిపెట్టకూడదు. వారికి గుణపాఠం చెప్పండి. మీరు చేసే పోరాటం చుట్టుపక్కల ఉన్న ఇతరులకు కూడా బలాన్ని ఇస్తుంది’ అని పూనమ్ కౌర్ ఆ లేఖలో పేర్కొన్నారు.నిందితులను శిక్షించాలి బాత్రూమ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వీడియోలు చిత్రీకరించారని తెలిసి భయపడిపోయాం. వీటిని ఎందుకు ఏర్పాటు చేశావని అడిగితే.. ఆ విద్యార్థిని నీ దిక్కు ఉన్నచోట చెప్పుకోమని బెదిరించింది. హాస్టల్, కళాశాల యాజమాన్యానికి తెలిపినా పట్టించుకోలేదు. నిందితురాలికి వత్తాసు పలుకున్నారు. ఇదెక్కడి న్యాయం. నిజాలు నిగ్గు తేల్చి నిందితులపై చర్యలు తీసుకోవాలి. – సుజన, హాస్టల్ విద్యార్థిని వణికిపోతున్నాంవాష్రూమ్లో కెమెరాలు పెట్టారని తెలిసినప్పటి నుంచి నాతో పాటు సహచర విద్యార్థినులు ఆందోళనలో ఉన్నారు. ఏ సమయంలో ఏ వార్త వినాల్సి వస్తుందోనని వణికిపోతున్నాం. రెండు రోజులుగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాం. న్యాయం చేస్తారనుకున్న పోలీసులు పట్టించుకోవాల్సింది పోయి మమ్మల్నే బెదిరిస్తున్నారు. అనుమానితురాలిగా ఉన్న విద్యార్థినికి సకల మర్యాదలు చేసి గదిలో ఉంచుతున్నారు. మమ్మల్ని పట్టించుకునే వారే కరువయ్యారు. మాకు న్యాయం చేయాలి. – స్వప్న, హాస్టల్ విద్యార్థిని బలవంతంగా హాస్టల్ ఖాళీ చేయమంటున్నారు న్యాయం చేయాలని విద్యార్థినులందరూ ఆందోళన చేస్తున్నా ఎవరికి తమ గోడు పట్టడం లేదు. నిజాలు నిగ్గు తేల్చి తమకు ఎటువంటి ఇబ్బంది ఉండదని భరోసా కలి్పంచాల్సింది పోయి హాస్టల్‌ను ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ తమను బెదిరిస్తున్నారు. పోలీసులే న్యాయం చేయాల్సింది పోయి వారే తమను బెదిరిస్తే తమకు న్యాయం చేసే వారు ఎవరూ. నిందితులను కఠినంగా శిక్షించి తమకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి. – సత్యరాణి, విద్యార్థిని బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో ఆడపిల్లల హాస్టల్ వాష్‌రూమ్స్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వారి చిత్రాలను చిత్రీకరించిన ఘటనలో ఎంతటి వారున్నా కఠినంగా శిక్షించాలి. ఇటువంటి ఘటనలు చాలా దారుణం. పిల్లల భవిష్యత్‌తో ఆటలాడే వ్యక్తుల్ని వదలకూడదు. ఈ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. – మైల రత్నకుమారి, చినగొల్లపాలెం, కృత్తివెన్ను మండలం నమ్మి పంపిస్తే ఇలాంటి మోసాలు చేయొచ్చా కాలేజీల యాజమాన్యాల మీద నమ్మకంతో పిల్లల్ని మీ దగ్గర వదిలిపెడుతున్నాం. కంటికి రెప్పలా కాపాడాల్సిన చోటే ఇటువంటి దుర్మార్గపు చర్యలు జరగడం అత్యంత హేయం. ముందుగా కాలేజీ యాజమాన్యం దీనికి బాధ్యత వహించాలి. ఈ ఘటనలో ఎటువంటి రాజకీయాలు లేకుండా ఎవరికి వారే మన ఇంటి పిల్లలు అనుకుని నిందితుల్ని పట్టుకుని శిక్షించాలి. – ఎ.సత్యవతి, కృత్తివెన్ను రాజకీయాలు కాదు వాస్తవాలు కావాలి గుడ్లవల్లేరు ఘటన చాలా దురదృష్టకరం. దీనికి భాద్యులు ఎవరైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇక్కడ అధికార యంత్రాంగంతో పాటు అధికార పార్టీ పెద్దలు సైతం రాజకీయాలు పక్కనపెట్టి వాస్తవాలను గుర్తించి న్యాయం జరిగేలా చూడాలి. ఇది ఆడపిల్లల భవిష్యత్, వారి జీవితాలకు సంబంధించిన విషయం. – జె.ఝాన్సీ, యండపల్లి, కృత్తివెన్ను మండలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యార్థినులకు ఈ దుస్థితి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులకు ఈ దుస్థితి దాపురించింది. వాష్ రూమ్స్‌లో హిడెన్ కెమెరాలు ఉన్నాయని విద్యార్థినులు ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదు. ఇంత జరుగుతున్నా అలాంటిదేమీ లేదని ప్రభుత్వం కితాబివ్వడం అత్యంత హేయం. విద్యార్థినులను కట్టడి చేస్తూ.. కాలేజీ యాజమాన్యం నిందితుల్ని రక్షించే ప్రయత్నం చేస్తోంది. విద్యార్థినుల సమక్షంలో విచారణ జరగాల్సి ఉండగా.. వారిని బలవంతంగా ఇళ్లకు పంపించడం దుర్మార్గం. – వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఏపీలో రక్షణ కరువైంది ఏపీలో మహిళలకు, ఆడపిల్లలకు రక్షణ కరువైంది. ఎక్కడ చూసినా అత్యాచారాలు, హత్యలు పెరిగాయి. బాత్ రూముల్లో హిడెన్ కెమెరాలు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. నేరస్తులకు ఇంత ధైర్యం రావడానికి కారణం ప్రభుత్వమే. గుడ్లవల్లేరు ఘటనకు ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. వైఎస్ జగన్ పాలనలో ఇలాంటి ఘటనలు చూడలేదు. 9 ఏళ్ల అమ్మాయిని చంపేసి ముక్కలు ముక్కలు చేసిన ఘటన జరిగి 60 రోజులు అవుతున్నా అమ్మాయి శవాన్ని తీసుకు రాలేకపోతున్నారు. ఇంత జరుగుతున్నా హోం మంత్రి ఏం చేస్తున్నట్టు. – ఆర్కే రోజా, మాజీ మంత్రి -
గుణపాఠం చెప్పండి. ఇంజినీరింగ్ కాలేజీ ఘటనపై పూనమ్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్‌లోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటన భయాందోళకు గురిచేస్తోంది. బీటెక్ నాలుగో ఏడాది చదువుతున్న ఓ అమ్మాయి-అబ్బాయి కలిసి.. లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు ఫిక్స్ చేశారని, ఏకంగా 300 మంది అమ్మాయిల అశ్లీల వీడియోలు చిత్రీకరించారనే విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వం దీనిపై సత్వర చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదలా ఉండగా హీరోయిన్ పూనమ్ కౌర్.. ఈ సంఘటనపై ట్వీట్ చేసింది. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.(ఇదీ చదవండి: ఏఆర్ రెహమాన్ కూతురికి విచిత్రమైన కష్టాలు)'ప్రియమైన అమ్మాయిలకు మీలో ఓ అమ్మాయిగా ఈ లెటర్ రాస్తున్నాను. మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు, నమ్మకంతో మిమ్మల్ని బయటకు పంపిస్తున్నారు. కానీ బయట జరుగుతున్న పరిణామాలు తెలిసి నేను బాధపడుతున్నాను. బయట ఎదుర్కొన్న పరిస్థితులు దారుణం. నేరస్థులని రక్షించడం, బాధితులకు అన్యాయం జరగడం లాంటి చాలా అనుభవాలతో నేను అలసిపోయాను. వ్యక్తులు ఎంత శక్తివంతులైనా, వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే వారు ఏ పార్టీకి చెందిన వారైనా మీరు బహిర్గతం చేస్తారని నిర్ధారించుకోండి''ఓ అమ్మాయి చాలామంది అమ్మాయిలని ఇలా ప్రమాదంలో నెట్టడం నాకు అసహ్యం కలిగిస్తోంది. నేరస్తులు ఎంతటి శక్తిమంతులైనా వారికి సహకరిస్తున్నా ఎవరినీ విడిచిపెట్టకూడదు. వారికి గుణపాఠం చెప్పండి. ఈ మాటలు మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీరు చేసే పోరాటం చుట్టుపక్కల ఉన్న వాళ్లకు కూడా బలాన్ని ఇస్తుంది. ప్రేమ, అభినందనలతో' అని పూనమ్ కౌర్ నోట్ రిలీజ్ చేసింది. (ఇదీ చదవండి: అమ్మ చిరకాల కోరిక తీర్చిన ఎన్టీఆర్)#AndhraPradesh pic.twitter.com/DgpWBaw1dO— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) August 31, 2024 -
చేనేత దినోత్సవం.. కేరళ చీరలో మెరిసిన పూనం కౌర్ (ఫొటోలు)
-
జీవితాలను నాశనం చేస్తారంటూ 'పూనమ్' డైరెక్ట్ ఎటాక్
పూనమ్ కౌర్.. సామాజిక బాధ్యతతో వివిధ అంశాలపై తన అభిప్రాయాన్ని చాలా క్లియర్‌గా స్పందించే హీరోయిన్. అప్పుడప్పుడు టాలీవుడ్ ప్రముఖులు ఇద్దరపై నర్మగర్భ ట్వీట్లు కూడా వేస్తుంటుంది. అయితే తాజాగా డైరెక్ట్‌గానే తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. పూనమ్ కౌర్ ట్వీట్ చేసిందంటే చాలు కొందరి గుండెల్లో రైళ్లు పరుగెత్తుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు కారణం కూడా ఉంది. కొందరి గురించి తాను నోరు విప్పితే వారికి పుట్టగతులు కూడా ఉండవ్ అనేలా రియాక్షన్ ఇచ్చింది. తాజాగా ఆమె మాటల రచయిత త్రివిక్రమ్ మీద విరుచుకుపడింది.ఏం జరిగింది..? డార్క్ కామెడీ పేరుతో సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతు పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలో జల్సా సినిమాలో బ్రహ్మానందంతో పవన్ కల్యాణ్ మాట్లుడుతున్న సీన్స్‌లో రేప్ డైలాగ్స్ రన్ అవుతాయ్. ఆ వీడియో చాలామంది నెటిజన్లు షేర్ చేస్తున్నారు. సాయిధరమ్ తేజ్ ఇలాంటి విషయాల మీద కూడా స్పందించాలంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పూనం కౌర్ ఇలా కామెంట్ చేసింది. 'త్రివిక్రమ్ నుంచి ఇంతకన్నా మంచి డైలాగ్స్ ఆశించడం తప్పే అవుతుంది' అని తెలిపింది. అయితే, విజయ్ నగేష్ అనే ఒక నెటిజన్ రియాక్ట్ ఇలా అయ్యాడు 'మీ వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉంటే సోషల్ మీడియాలో వ్యక్తపరచకండి' అని ఉచిత సలహా ఇవ్వడంతో పాటు త్రివిక్రమ్ టాలెంట్ ఏంటో అందరికీ తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు.జీవితాలను నాశనం చేస్తాడు: పూనమ్పూనమ్ కౌర్‌కు ఉచిత సలహా ఇచ్చిన సదరు వ్యక్తికి కౌంటర్ కూడా ఇచ్చింది. త్రివిక్రమ్ ఎలాంటి వాడో, ఆయన చెడు స్వభావం ఎంటో నాకు తెలుసు. మగవారి ఇగో కోసం ఆయన సపోర్ట్ చేస్తారని కూడా తెలుసు. నీవు నీ అనుభవంతో మాట్లాడుతుంటే.. నేను నా అనుభవంతో మాట్లాడుతున్నాను. ఇతరుల జీవితాలను త్రివిక్రమ్ నాశనం చేస్తారు. అని పూనమ్ మరోసారి ఫైర్ అయింది. Dialouges written by trivikram- don’t expect anything worthwhile .— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) July 8, 2024 -
మోసం, కుట్రలతో గెలవడం కంటే ఓటమే మేలు: టాలీవుడ్ హీరోయిన్ సంచలన పోస్ట్
నటి పూనమ్ కౌర్ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. మాయాజాలం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది బ్యూటీ. ఆ తర్వాత ఒక విచిత్రం, శౌర్యం, నిక్కి అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి?, గగనం లాంటి చిత్రాల్లో నటించింది. 2022లో వచ్చిన నాతిచరామి సినిమాలో చివరిసారిగా కనిపించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా పూనమ్ కౌర్ తాజాగా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ ట్వీట్ ఏముందో ఓ లుక్కేద్దాం పదండి.పూనమ్ కౌర్ తన ట్వీట్లో రాస్తూ.. కుట్రపూరితంగా, మోసం చేసి గెలవడం కంటే.. ఒక యోధుడిగా ఓడిపోవడమే మేలు' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ ఏపీలో జరిగిన ఎన్నికల గురించే పోస్ట్ చేసిందంటూ కామెంట్స్ పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఈవీఎంలపై చర్చ జరుగుతున్న సమయంలో ఇలాంటి పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. Loosing as a principled warrior is better than winning as conspiring cheater .#justthoughts— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) June 21, 2024 -
గీతాంజలికి న్యాయం జరగాలి.. ‘జల్సా’ తో కట్టుకథ అల్లారు: పూనమ్ కౌర్
టీడీపీ, జనసేన ట్రోలింగ్స్ తట్టుకోలేక గీతాంజలి అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పేరిట ఇంటి పట్టా ఇచ్చారని, పిల్లలను చదించడానికి అమ్మఒడి పథకం కింద డబ్బులు అందించారని, ఎన్నికల్లో కచ్చితంగా మళ్లీ వైఎస్సార్సీపీయే గెలుస్తుదని ఆమె చెప్పిన మాటలు వైరల్ కావడంతో.. ప్రతిపక్షాలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు గీతాజంలిపై అసత్యాలను ప్రచారం చేశారు. ఆమెను ట్రోల్ చేస్తూ మానసికంగా హింసించారు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా మూకల దాడికి తట్టుకోలేక గీతాంజలి రైలు కిందపడి చనిపోయింది. ఈ విషాదాకర ఘటనపై నటి పూనమ్ కౌర్ స్పందిస్తూ.. గీతాంజలికి న్యాయం జరగాలని డిమాండ్ చేసింది. అలాగే ‘జల్సా’ సినిమా సమయంలో తనపై వచ్చిన ఆరోపణలపై కూడా స్పందించింది. గీతాంజలికి న్యాయం జరగాలి ‘గీతాంజలికి న్యాయం జరగాలి. అసలు ఆమె విషయంలో ఏం జరిగింది? గీతాంజలి ఎందుకు సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది? ఓ పార్టికి చెందిన ఆన్లైన్ ట్రోలర్స్ కారణంగానే ఆమె చనిపోయిందా? అమ్మాయిల మీద పుకార్లు పుట్టించి, మానసికంగా వేధించడం వారికి బాగా అలవాటు. దయచేసి వారిని శిక్షించండి. ఆ పసి పిల్లలకు న్యాయం చేయండి’ అని పూనమ్ ట్వీట్ చేసింది. అవన్నీ పుకార్లు మాత్రమే సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారనే ఎక్కువ పాపులర్ అయ్యారు పూనమ్ కౌర్. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్‌లపై ఆమె చేసే ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతుంటాయి. వీరిద్దరి బాగోతాలను నిర్భయంగా బయటపెట్టే ఏకైక నటి పూనమ్ మాత్రమే. అందుకే పవన్ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేస్తుంటారు. అంతేకాదు ఆమెపై ఓ కట్టుకథను కూడా అల్లారు. జల్సా సినిమాలో అవకాశం అడిగే ఇవ్వలేదని.. అందుకే ఆమె వారిద్దరిని టార్గెట్ చేసిందని ప్రచారం చేశారు. (చదవండి: సోషల్ మీడియా సైకోలు.. గీతాంజలి చేసిన తప్పేంటి?) తాజాగా దీనిపై స్పందించింది పూనమ్ కౌర్. అవన్నీ పూకార్లు మాత్రమేనని.. తాను ఇంత వరకు ఎవ్వరినీ కూడా అవకాశాలు అడుక్కోలేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు నటన మీద మాత్రమే ఆదారపడకుండా ఎప్పుడూ ప్రత్యామ్నాయ జీవన మార్గాల కోసం వెతుకుతుంటానని చెప్పింది. తాను నటించిన సినిమాల కంటే తిరస్కరించిన సినిమాలే ఎక్కువని, దయచేసి అలాంటి రూమర్స్ నమ్మకండి అని మరోసారి తన అభిమానులను కోరింది పూనమ్. #JusticeForGeetanjali , I was confused about who led her to committing suicide , whether it’s online trollers of a particular party who are truly capable of physiologically abusing a woman or a volunteer who seems to go invisible. Please punish . Young girl kids deserve justice. — पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) March 12, 2024 -
పూనమ్ కౌర్ ట్వీట్.. సీఎం జగన్ సాయం మరోసారి తెరపైకి
నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంటారు. సామాజిక, రాజకీయ అంశాలపై ఎప్పటికప్పుడు తనదైన స్టైల్లో ఆమె స్పందిస్తూ ఉంటారు. కరోనా సమయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పనితీరుపై కొద్దిరోజుల క్రితం ఆమె ప్రసంశించారు. 'కోవిడ్ మహామ్మారి విజృభించిన సమయంలో చేనేత కార్మికులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతగానో అండగా నిలిచిందని ఆమె కొనియాడారు. చేనేత కార్మికుల సమస్యలపై క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తగా తాను ఈ మాటలు చెబుతున్నానని ఆమె తన ఎక్స్ పేజీలో పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో పేద ప్రజలను ఏపీ ప్రభుత్వం ఆదుకున్న తీరుపై నెటిజన్లు మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. ఏపీలో 2019 సార్వత్రిక ఎన్నికలయిపోయి, బంపర్ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి ఏడాదిలోనే కోవిడ్ రూపంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఏడాదిలోనూ పూర్తిగా కోవిడ్ ఆంక్షల మధ్యనే ఆయన పాలన సాగింది. అలా రెండేళ్ల పాటు కరోనాపై ఏపీ ప్రభుత్వం పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అన్నీ దేశాల ఆర్థిక స్థితిగతులు తలక్రిందులయ్యాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మాత్రం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎనలేని మేలు చేశాయి. ఆ పరిస్థితుల్లో ఎందరో ఉపాధి కోల్పోయి లక్షల మంది జీవితాలు రోడ్డున పడ్డాయి. పనిచేస్తున్న చోట కరోనా పేరుతో జీతాలలో కోతలు పడటమే కాకుండా ఉన్న ఉద్యోగాలను కూడా కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి సమయంలో అనేక మందికి సీఎం జగన్ ఇస్తున్న ఈ పథకాలు ఎంతో లబ్ధిని చేకూర్చాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. రైతులు, అమ్మ ఒడి లబ్ధిదారులు, చేతి వృత్తుల వాళ్లు, కుల వృత్తుల వాళ్లు, ఆటోలు నడుపుకునే వాళ్లు, పూజారులు, పాస్టర్లు, ఇమామ్ లు.. ఇలా వాళ్లూ వీళ్లూ అనే తేడాలు లేవు. కులాల వారీగా కూడా సంక్షేమ పథకాలు వేరే! ప్రజల క్షేమం కోరుకున్న ఆయనపై ప్రతి పక్షాల నుంచి విమర్శలు వచ్చినా, పంచుడు కార్యక్రమాలు అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నా.. సీఎం జగన్ తన దారిలో వెనక్కు తగ్గలేదు. అప్పు చేసైనా సరే ముందుగా ప్రజల ఆకలి తీర్చాలని జగన్ భావించారు. కరోనా సమయంలో కేవలం రేషన్ సరకులు పంపించి కేంద్రం చేతులు దులుపుకుంది. అలాంటి పరిస్థితిలో కూడా ప్రతి సామాజిక వర్గానికి ఏదో ఒక రూపంలో నగదు బదిలీ చేస్తూ ఆర్థికంగా ఆదుకున్నారు. అలాంటి సమయంలో వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి అండగా నిలిచింది. అప్పుడు ఆ వ్యవస్థ ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా కష్టకాలంలో అన్ని రాష్ట్రాల్లో పరిపాలన, సంక్షేమ పథకాలు కుంటుపడగా.. ఏపీలో మాత్రం ఇంటింటికి సంక్షేమ ఫలాలు, రేషన్, పింఛన్లు క్రమం తప్పకుండా అందాయి. దీనంతటికి కారణం సీఎం జగన్ తీసుకున్న డైనమిక్ నిర్ణయాలు అని చెప్పవచ్చు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థపై దేశవ్యాప్తంగా అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. కరోనా కష్టకాలంలో ఎవరు ఏంటి? అనే విషయం అప్పట్లో క్లియర్‌గా తేలిపోయింది. రోగానికి భయపడి చంద్రబాబు, పవన్ హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు. కానీ సీఎం జగన్ మాత్రం తన మంత్రుల సమీక్షలతో ప్రజలకు నిత్యం టచ్‌లో ఉన్నారు. అలాంటి కష్ట-నష్ట కాలంలో కూడా ప్రజల బాగోగులు పట్టించుకున్న ఏకైక సీఎంగా రికార్డులకెక్కారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అప్పట్లో పారాసెట్మాల్ వేసుకోమని జగన్ గారు చెబితే ప్రతిపక్ష నేత చంద్రబాబు కామెడీ చేశారు, కరోనాతో సహజీవనం చేయాల్సిందేనంటే ఎకసెక్కాలాడారు. అలా నోరు చేసుకున్నోళ్లంతా చివరకు సీఎం జగన్ చెప్పిన సూత్రాలనే ప్రపంచవ్యాప్తంగా పాటించారు. కోవిడ్ సమయంలో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న దశలోనూ ఎలాగైనా ప్రజలకు ఆర్థిక సాయం అందించడం కోసం ఆయన అనునిత్యం తపనపడ్డారు. మరోవైపు కరోనా కట్టడిపై ఏపీని దేశానికే ఆదర్శంగా మార్చారు జగన్. అత్యథిక వ్యాధి నిర్థారణ పరీక్షలు జరిపిన రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించిందంటే ఆ ఘనత జగన్‌ది కాక ఇంకెవరిది. కనీసం తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ టీకాలు కూడా దొరకకపోవడంతో బార్డర్ దగ్గరగా ఉన్న ప్రజలు ఏపీలోకి వచ్చి టీకాలు తీసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుని తమ ఇంటికి సంతోషంగా వెళుతున్న సమయంలో రూ. 2000 వారి జేబులో పెట్టి పంపించారు. లాక్డౌన్ సమయంలో వాహనాలు లేకపోవడంతో కాలినడక ద్వార తమ గమ్యానికి చేరుకోవాలని ఎందరో రోడ్డు బాట పట్టారు. వారిలో కొందరికి కనీసం చెప్పులు కూడా లేని పరిస్థితి. అలాంటి వారి కోసం పలు చోట్ల చెప్పుల స్టాండ్లను కూడా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏదేమైనా పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది లాగే సీఎం జగన్ కూడా అసలైన కరోనా వారియర్ అని అప్పట్లో నెటిజన్లు కామెంట్లు చేసేవారు. కరోనా కష్ట సమయంలో ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం ప్రజల పట్ల చూపిన అంకిత భావాన్ని పూనమ్ తాజాగా కొనియాడటంతో మరోసారి నెటిజన్లు కూడా ఆనాటి రోజులను ఇలా గుర్తు చేసుకుంటున్నారు. #ysrcp has done the best job for weavers during pandemic and I am as an activist extremely greatfull for this . — पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) March 6, 2024 -
సీఎం జగన్ పై నటి పూనమ్ ప్రశంసలు
-
వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై హీరోయిన్ పూనమ్ కౌర్ ప్రశంసలు
కరోనా సమయంలో చాలా రాష్ట్రాలు పేద ప్రజలకు ఇచ్చే పథకాలు అన్నీ ఆపేశాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమం ఆపకుండా ప్రజలకు అందించారు. ఎప్పటికప్పుడు ఆరోగ్యపరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ అధిక ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్త పడ్డారు. కోవిడ్ బారిన పడిన వారికి మెరుగైన చికిత్సను అందించి..దేశానికే ఆదర్శంగా నిలిచారు. అంతేకాదు కోవిడ్–19 , బ్లాక్ ఫంగస్ చికిత్సలనూ ఆరోగ్య శ్రీలోకి చేర్చి లక్షల మంది పేదల బతుకుల్ని ఆర్థిక మహమ్మారి కాటేయకుండా కాపాడారు. కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం చేసిన కృషి పట్ల దేశ ప్రధానితో పాటు పలు రాష్ట్రాల సీఎంలు ప్రశంసలు కురిపించారు. తాజాగా కరోనా సమయంలో వైఎస్సార్సీపీ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ సీఎం జగన్ ను ప్రశసించారు. ‘కోవిడ్ మహామ్మారి విజృభించిన సమయంలో చేనేత కార్మికులకు వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. వారి కోసం చాలా మంచి పనులు చేసింది. చేనేత కార్మికుల సమస్యలపై క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తగా చెబుతున్నా ఇది చాలా గొప్ప విషయం’ అని పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. పూనమ్ కౌర్ విషయానికొస్తే.. . మాయాజాలం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఒక విచిత్రం, నిక్కి అండ్ నీరజ్, ఆమె 3 దేవ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గత కొన్నేళ్లుగా అడపాదడపా చిత్రాలు మాత్రమే చేస్తున్నారు. అయితే సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియా ద్వారనే ఆమె ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ డైరెక్టర్, హీరో ను ఉద్దేశిస్తూ పూనమ్ పెట్టే పోస్టులు నెట్టింట తెగ వైరలవుతుంటాయి. #ysrcp has done the best job for weavers during pandemic and I am as an activist extremely greatfull for this . — पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) March 6, 2024 -
తెలుగు హీరోయిన్ టీనేజ్ ఫోటో.. ఎవరో గుర్తుపట్టారా?
టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్.. సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయింది. పూనమ్ తండ్రి సరబ్జిత్ సింగ్ పంజాబీ కాగా తల్లి సుఖ్ ప్రీత్ మాత్రం తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా. హైదరాబాద్‌లో జన్మించిన పూనమ్ స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఇక్కడే జరిగింది. ఆ తర్వాత ఢిల్లీలోని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తిచేసింది. తాజాగా పూనమ్ కౌర్ తన కాలేజ్ డేస్లోని యంగ్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ ఫోటోలో తన అమ్మగారు కూడా ఉండటం విశేషం. నేడు తన తల్లి పుట్టినరోజు కావడంతో ఆ మధుర క్షణాలు గుర్తు చేసుకుంటూ శుభాకాంక్షలు తెలిపింది. రేర్ ఫోటోను షేర్ చేసిన పూనమ్ ఇలా చెప్పుకొచ్చింది. 'అమ్మా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ మీద ఏదో ఒక రోజు పుస్తకం రాస్తాను.నీకు మహాసముద్రాలంటే ఇష్టం, నీ బలం శిఖరం లాంటిది. నాలో ఉన్న మంచి అంతా నీ నుంచే వచ్చింది. ఎందుకంటే నిన్ను చూస్తూనే పెరిగాను కాబట్టి. నువ్వు ఎంత బలంగా, అందంగా ఉంటావో నీకు తెలియదు. "కర్మ" సిద్ధాంతం నిజమైతే మిమ్మల్ని బాధపెట్టిన వారందరూ కూడా నరకంలోని చీకట్లలో కుళ్ళిపోతారు. దానిని మీరు కూడా చూస్తారని నేను ఆశిస్తున్నాను. అని పూనమ్ తెలిపింది. మొత్తానికి పూనమ్ కుటుంబం కొందరి వల్ల ఇబ్బందుల్లో పడటమో లేదా వారి వల్ల బాధించడమో జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా తన అమ్మగారితో ఉన్న ఫోటోను పూనమ్ షేర్ చేయడంతో నెట్టింట్ వైరల్ అవుతుంది. యంగ్ ఏజ్‌లో పూనమ్ మరింత అందంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. 2005లో మిస్ ఆంధ్రా టైటిల్ గెలుచుకున్న పూనమ్, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయాజాలంతో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది. View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) -
మంతెన ఆశ్రమంలో చేరిపోయిన పూనమ్ కౌర్ ఆమెకేమైంది..?
-
రెండేళ్లుగా ఆ వ్యాధితో ఇబ్బందులు.. ప్రముఖ డాక్టర్‌ను కలిసిన పూనమ్ కౌర్
ప్రముఖ సినీనటి పూనమ్ కౌర్‌ను ఫైబ్రోమైయాల్జీయా వ్యాధి గత రెండేళ్లుగా ఇబ్బంది పెడుతుంది. 2022 సమయంలో ఆమెకు వెన్ను నొప్పి రావడంతో చికిత్స నిమిత్తం కేరళ వెళ్లారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకునే క్రమంలో ఆమెకు ఫైబ్రో మయాల్జియా వ్యాధి నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని గతంలో ఆమె కూడా తెలిపింది. 2022 నుంచి ఈ వ్యాధితో ఇబ్బంది పడుతున్న పూనమ్ అప్పటి నుంచి చికిత్స కూడా తీసుకుంటుంది. కేరళలోని ఓ ఆయుర్వేద ఆస్పత్రిలో కూడా చికిత్స తీసుకుంది. తాజాగా పూనమ్ తన ఆరోగ్యంపై తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ చేసింది. నేచురోపతి వైద్యంలో ఎంతో గుర్తింపు పొందిన డా.మంతెన సత్యనారాయణ రాజును ఆమె కలుసుకున్నట్లు తెలిపింది. ఆయన్ను కలవడం ఎంతో ఆనందాన్ని కలిగించినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఫైబ్రోమైయాల్జియా వైద్యానికి సంబంధించి ఆయన ఇచ్చిన సూచనలు ఎంతో అమూల్యం. మంచి మనసుగల వ్యక్తితో ఒక కార్యక్రమంలో పాల్గొని ఈ వ్యాధి గురించి చర్చించే అవకాశం కలగడం తన అదృష్టమని ఆమె పేర్కొంది. ఫైబ్రోమైయాల్జియా వ్యాధితో చాలా ఇబ్బంది పడినట్లు పూనమ్ తెలిపింది. కనీసం దుస్తువులు కూడా వేసుకోలేకపోయానని అవి ధరిస్తున్నప్పుడు కూడా పెయిన్స్ వచ్చేవని వాపోయింది. దీంతో ఎప్పుడూ వదులుగా ఉన్న దుస్తువులే ధరించాల్సి వచ్చేదని చెప్పింది. ఫైబ్రోమైయాల్జియా లక్షణాలు ఫైబ్రోమైయాల్జియాతో బాధపడుతున్న చాలా మంది వ్యక్తులు నిద్రలేమితో భాదపడుతుంటారు. అలసటతో పాటుగా శరీరం మొత్తం విపరీతమైన నొప్పిని కలిగి ఉంటుంది. మెడ, భుజాలు, ఛాతీ, వీపు వద్ద ఎక్కువ పెయిన్ ఉంటుంది. జ్ఞాపకశక్తి తగ్గడంతో పాటుగా డిప్రెషన్, ఆందోళన ఎక్కువగా కనిపిస్తుంది. ఫైబ్రోమైయాల్జియా కోసం ఒకే పరిమాణానికి సరిపోయే మందులు లేవని వైద్యులు చెబుతున్న మాట. కానీ జీవనశైలి మార్పులతో దీనిని కంట్రోల్ చేయవచ్చని వారు చెబుతున్నారు. -
గురూజీ ఏదైనా చేయగల సమర్థుడు: హీరోయిన్
సూపర్ స్టార్ మహేశ్‌బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా అంటే బొమ్మ బ్లాక్‌బస్టరే! వీరి కలయికలో వచ్చిన అతడు, ఖలేజా మంచి ఆదరణ పొందాయి. ముచ్చటగా మూడోసారి వీరి కాంబోలో ఓ సినిమా వస్తోంది. అదే గుంటూరు కారం.. రిలీజ్‌కు ముందే మంటెక్కిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. ఆ విషయంలో సమర్థుడు అయితే ఈ సినిమా కథ త్రివిక్రమ్ ఒరిజినల్‌గా రాసుకోలేదని, యద్దనపూడి సులోచనారాణి రాసిన కీర్తి కిరీటాలు అనే నవలను కాపీ కొట్టాడని ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందించింది. 'ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. దాన్నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా ఆయనకు బాగా తెలుసు. తన తప్పుడు పనులు ప్రజలకు కనబడకుండా జాగ్రత్తపడే నైపుణ్యం ఉన్నవాడు. కొందరు గుడ్డిగా ఆయన్ను నమ్మేస్తారు. ప్రజల సమస్యలు తీర్చడానికి ముందుకు రాని గత ప్రభుత్వం ఆయనకు మాత్రం బాగా సాయం చేసింది. అదెందుకో నాకిప్పటికీ అర్థం కాదు మరి' అని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. చివరగా సినిమాలో కనిపించింది అప్పుడే! ఈ ట్వీట్‌కు గురూజీ థింగ్స్ అన్న హ్యాష్‌ట్యాగ్ జత చేసింది. ఇకపోతే మాయాజాలం సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైంది పూనమ్ కౌర్. ఒక విచిత్రం, శౌర్యం, నిక్కి అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి?, గగనం ఇలా అనేక చిత్రాల్లో నటించింది. 2022లో వచ్చిన నాతిచరామి సినిమాలో చివరిసారిగా కనిపించింది. చదవండి: ఫుడ్ పాయిజన్ తర్వాతే ఇలా.. క్రికెట్ ఆడేటప్పుడు అలా అవడంతో -
నాకెలాంటి సంబంధం లేదు.. పైశాచిక ఆనందం కోసమే: టాలీవుడ్ హీరోయిన్
టాలీవుడ్ హీరోయిన్, సామాజిక కార్యకర్త పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటారు. ఎప్పుడో ఏదో విషయంలో తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. అయితే తాజాగా పూనమ్ కౌర్ చేసిన కామెంట్స్ తెగ వైరలవుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆమె ఓ లేఖ విడుదల చేశారు. రాజకీయాల పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని.. ఏ రాజకీయ పార్టీ కండువా కప్పుకోలేదని అన్నారు. కొందరు కావాలనే వారి సొంత ప్రయోజనాల కోసం ఓ పావుగా వాడుకోవాలని చూస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. (ఇది చదవండి: 'గురువు' పేరుతో పూనమ్ కౌర్ సంచలన పోస్ట్) లేఖలో పూనమ్ కౌర్ రాస్తూ.. 'నేను ఏ రాజకీయ పార్టీ కండువా కప్పుకోలేదు. ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాను. సమస్య ఆధారంగానే నేను స్పందిస్తుంటాను. ఈ మధ్య కొందరు రాజకీయ నాయకులు వారి ప్రయోజనాల కోసం నన్ను ఓ పావుగా వాడాలనుకుంటున్నారు. గత ఎన్నికలలో కూడా ఇలాంటి వికృత చేష్టలు చేశారు. వీటి ద్వారా మరికొందరు పైశాచిక ఆనందం పొందాలనుకుంటున్నారు. ఒక మహిళపై ఇలాంటి కుట్రలు తగవు. నాయకులు సానుభూతి పేరుతో నాకు, నా కుటుంబ సభ్యులకు ఫోన్లు చేస్తున్నారు. నేను సిక్కుబిడ్డను. మాకు త్యాగాలు తెలుసు. పోరాటాలు తెలుసు. దయచేసి నన్ను మీ రాజకీయాల కోసం నన్ను లాగొద్దు. ప్రస్తుతం నేను చేనేత కళాకారుల కోసం పనిచేస్తున్నా. చేనేత, మహిళా ఉద్యమాలను జాతీయస్థాయిలో నిర్మించే క్రమంలో ఉన్నా. నా వైపు నుండి ఏదైనా అప్డేట్ ఉంటే నేనే స్వయంగా తెలియజేస్తా.' అని అన్నారు. (ఇది చదవండి: మళ్లీ రతిక ఎక్స్ గురించి రచ్చ.. నామినేషన్స్‌లో ఎవరెవరున్నారంటే?) -
పవన్‌కు అహం ఎక్కువ.. పూనమ్ కౌర్ టాపిక్‌పై రాజు రవితేజ కామెంట్
రాజు రవితేజ అంటే టక్కున ఎవరనే సందేహం రావడం సహజం. జనసేన, పవన్ అభిమానులకు మాత్రం ఆయన పేరు సుపరిచయమే. రాజు రవితేజ గతంలో పవన్‌కు అత్యంత సన్నిహితుడు, జనసేన మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా. దాదాపు 12 ఏళ్ల పాటు పవన్‌తో రాజు రవితేజ నడిచారు. తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2019లో పార్టీకి గుడ్‌బై చెప్పి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన జనసేనలోకి మళ్లీ వెళ్లడం వంటి విషయాలతో పాటు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మళ్లీ జనసేనలోకి వెళ్లే ఆలోచన లేదని రాజు రవితేజ పేర్కొన్నారు. పవన్ కూడా రమ్మని పిలవడని చెబుతూనే మరొకరితో ఆహ్వానం పంపుతాడని చెప్పారు. తన విషయంలో కూడా ఇదే జరిగిందని తెలిపారు. పవన్ ఒక అహంకారి అని చెబుతూ ఆయనలో టూ మచ్ అహం ఉందని రాజు రవితేజ చెప్పారు. చెప్పింది చేయడం.. చేసేది చెప్పడం ఈ రెండూ పవన్‌లో లేవన్నారు. పూనమ్ కౌర్ గొడవలో నేను లేను పూనమ్ కౌర్- పవన్ వివాదం మధ్యలో ఒక మీడియేటర్‌గా ఉన్నానని తనను చాలా మంది అనుకున్నారని రాజు రవితేజ చెప్పారు. కానీ అందులో నిజం లేదని, వారిద్దరి టాపిక్‌లోకి తాను ఎంట్రీ కాలేదని ఆయన తెలిపారు. వాళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో కూడా పూర్తిగా తెలియదని ఒకే ఒక్కసారి ఈ విషయంపై పవన్‌తో చర్చించానని చెప్పుకొచ్చారు. అప్పుడు జరిగిన విషయం ఏంటో పవన్ తనకు చెప్పారని.. కానీ అది వ్యక్తిగత విషయం కాబట్టి ఇప్పుడు బహిరంగంగా చెప్పకపోవడమే మంచిదని రాజు రవితేజ దాటవేశారు. కానీ పూనమ్ కౌర్‌తో వ్యక్తిగతంగా తాను ఇప్పటి వరకు మాట్లడనే లేదని తనతో ఎలాంటి పరిచయం కూడా లేదని ఆయన పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ పొలిటికల్ కెరియర్ ఇదే ఏపీ రాజకీయాలపై రాజు రవితేజ పలు వ్యాఖ్యలు ఇలా చేశారు. 'పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఉన్న ధోరణితో వెళ్తే రాజకీయాల్లో సక్సెస్ అవడం కష్టం. ఎందుకంటే ఏపీ పొలిటికల్ రేస్‌లో పవన్ థర్డ్ రన్నర్. మొదటి స్థానంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. ఒకవేళ ఈ పొలిటికల్ రేసులోకి జూనియర్ ఎన్టీఆర్, ఎవరైనా వస్తే పవన్ నాలుగో స్థానంలో ఉంటారు. పోలింగ్ రోజున మీరు సెంటర్‌కు వెళ్లి చూస్తే.. ఓటు వేసేందుకు భారీగా లైన్ ఉంటుంది. అందులో లేడీస్, ఫ్యామిలీ మెంబర్స్, యువకులు, ముసలి వారు, పేదలు ఇలా అందరూ ఉంటారు. కానీ ఆ లైన్లో పవన్ ఫ్యాన్స్ మాత్రం ఉండరు. వాళ్లు జెండాలు పట్టుకొని బైకులలో ఎక్కడో తిరుగుతుంటారు. వాళ్లతో పవన్‌కు ఏం లాభం ఉండదు. వాళ్లతో పవన్ ఈగో మాత్రమే సంతృప్తి చెందుతుంది. ఇది ఆయనలో మరింత అహంకారాన్ని పెంచుతుందే కానీ వాళ్లతో రియల్‌గా వచ్చేది ఏం లేదు. రియల్‌గా ఓటేసేది ఫ్యామిలీస్, పేదలు మాత్రమే. వాళ్ల జీవితాలను ఎవరైతే మారుస్తారో.. ఆ నమ్మకం ఎవరైతే కలిగిస్తారో వారికే ఓట్ వేస్తారు. పవన్ స్పీచ్‌కు, రియాలిటీకి సంబంధం ఉండదు. అని రాజు రవితేజ అన్నారు. వలంటీర్లపై పవన్ వ్యాఖ్యలు తప్పు వలంటీర్లపై పవన్ అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు అని రాజు రవితేజ అన్నారు. వాళ్లు కూడా ఈ సమాజంలో భాగమే కదా.. వాళ్లు కూడా సమాజం కోసమే పని చేస్తున్నారు. వలంటీర్లను పవన్ ఎందుకు శత్రువులుగా భావిస్తున్నారో తెలియదు. వాళ్లపై అంత ద్వేషం ఎందుకు ఉందో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. పవన్ ఫ్యాన్స్‌లో కూడా ఇలాంటి ద్వేషమే కనిపిపిస్తుంది. వారికి నచ్చకపోతే బూతులతోనే విరుచుకుపడుతారు. పార్టీని వీడి ఇన్ని రోజులు అయినా తనపై బూతు కామెంట్లు చేస్తూనే ఉన్నారని రాజు రవితేజ పేర్కొన్నారు. (ఇదీ చదవండి: బేబీ రనౌత్ రాక కోసం వెయిటింగ్: కంగనా రనౌత్) -
ఆ లీడర్లను నమ్మొద్దు.. ఏపీ పాలిటిక్స్‌పై పూనమ్ కౌర్ సంచలన ట్వీట్
నటి పూనమ్ కౌర్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. నటిగా కంటే కూడా సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న పలు వ్యాఖ్యలతో ఎక్కువగా పాపులర్ అయ్యారు. సమాజంలో జరిగే సంఘటనలు, రాజకీయ వ్యవహరాలపై స్పందిస్తూ ఆమె చేసే వ్యాఖ్యలు ఒక్కోసారి భారీగానే దుమారం రేపుతూ ఉంటాయి. వాటి వల్ల ఆమె కూడా ట్రోలింగ్‌కు కూడా గురవుతుంటారు కూడా.. తాజాగా పూనమ్ ఏపీ పాలిటిక్స్‌పై ఇలా ట్వీట్ చేసి మరోసారి వార్తల్లోకెక్కారు. (ఇదీ చదవండి: లిప్‌లాక్,బోల్డ్ సీన్స్‌పై మా ఇంట్లో ఏమన్నారంటే: బేబీ హీరోయిన్) ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య కొందరు ఫేక్ లీడర్లు మహిళల మీద ఎక్కడా లేని అభిమానాన్ని చూపుతూ రోడ్లపైకి వస్తున్నారు. అలాంటి వాళ్లను నమ్మోద్దు. మహిళలకు ఎదో జరిగిపోతుందని వారికి అంతగా అందోళన ఉంటే ఢిల్లీలో రెజ్లర్లు చాలా రోజుల పాటు నిరసన దీక్ష చేశారు. కనీసం వారికి అనుకూలంగా ఒక్కమాటైనా వీరు మాట్లడలేకపోయారే. వాళ్ల సొంత ప్రయోజనాల కోసం మాత్రమే ఏపీలో ఈ నకిలీ లీడర్లు ఎక్కడా లేని ప్రేమను కురిపిస్తున్నారు. ఇలాంటి లీడర్ల పట్ల జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. అంటూ నటి పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఆమె ఏ రాజకీయ నాయకుడిని ఉద్దేశించి చేశారనేది పేరు మాత్రం తెలుపలేదు. కానీ ఆమె ట్వీట్ కింద కొందరు బూతు పదాలతో పలు కామెంట్లు చేస్తున్నారు. మా నాయకుడు పవన్ కల్యాణ్‌ను అంటున్నావ్ కదా అంటూ.. కొందరు జనసేన, పవన్ ఫోటోలను డీపీలుగా పెట్టుకుని బూతు పదాలతో రెచ్చిపోతున్నారు. కొందరైతే ఏకంగా రాయలేని భాష ఉపయోగిస్తూ ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఇంకోసారి ఇలాంటి కామెంట్లు పెడితే ఏం జరుగుతుందో కూడా ఊహించలేవంటూ పూనమ్‌కు వార్నింగ్ ఇస్తూ పవన్ ఫోటోను డీపీగా పెట్టుకుని వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో ఆమె ఇన్‌స్టాలో మరో ట్వీట్ చేశారు. 'మీరందరూ నా గురించి ఒకటి గుర్తుపెట్టుకోండి. నా పేరు 'కౌర్' అని మీరు మర్చిపోతున్నారు. సూమారుగా 5 ఏళ్లు అవుతుంది. కొంచెం ఆలోచించండి.' అని పోస్ట్ చేశారు. The people who are shouting at the top of their voice about women issues , as if they are highly concerned are the one who did not speak a word for #Wrestlers , beware of fake leaders who concern when it’s to their benefit and convenience.#AndhraPradesh — पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) July 16, 2023 -
కంచె భామ స్టన్నింగ్ లుక్స్.. మరింత బొద్దుగా తయారైన పూర్ణ!
►హీరోయిన్ పూనమ్ కౌర్ బ్యూటిఫుల్ లుక్స్! ►కంచె భామ ప్రగ్యా జైశ్వాల్ స్టన్నింగ్ పోజులు! ►కలర్‌ఫుల్ శారీలో యాంకర్ లాస్య లుక్స్! ►మరింత బొద్దుగా తయారైన హీరోయిన్ పూర్ణ! View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) -
'గురువు' పేరుతో పూనమ్ కౌర్ సంచలన పోస్ట్
టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటారు. సినీ పరిశ్రమలో తనని పంజాబీ అమ్మాయినని వెలివేస్తున్నారని అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున, గవర్నర్ తమిళిసై ముందే కంటతడి పెట్టారు. తెలంగాణాలో పుట్టిన బిడ్డనని.. ఇక్కడే పెరిగానంటూ ఈ బ్యూటీ చేసిన వైరల్ కామెంట్లు అప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అవి మరిచిపోక ముందే సోషల్ మీడియాలో మరో పోస్ట్ చేశారు. (ఇదీ చదవండి: బాలీవుడ్ కింగ్ షారుఖ్‌ను ఢీ కొడుతున్న ప్రభాస్..) తాజాగా నటి పూనమ్ కౌర్ ఒక స్టోరీ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ అవుతుంది. గురుపూర్ణిమ సందర్భంగా ఇలా షేర్ చేశారు. 'మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను.. టామ్, డిక్ అండ్ హారీ అని ప్రతి ఒక్కరినీ గురువు అని పిలవద్దని... నీతులు చెప్పి స్టేజ్ మీద జీవితాలతో ఆడుకునే వాడు 'గురువు' కాదు, మీకు దారి చూపించేవారు 'గురువు' అవుతారు. గురువు మీ శ్వాస కావచ్చు, మీ హృదయ స్పందన కావచ్చు లేదా మీ విముక్తి కావచ్చు.' అని ఆమె రాసుకొచ్చింది. దీంతో ఆమె ఎవరి గురించి రాశారు..? ఎవరికి సలహాలిస్తున్నారు..? అంటూ పూనమ్ పోస్ట్‌పై రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. గతేడాదిలో 'నాతిచరామి' అనే చిన్న సినిమాలో నటించారు. ప్రస్థుతానికి పూనమ్ కౌర్ సినిమాలకు దూరంగా ఉన్నారు. View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) (ఇదీ చదవండి: అక్కడ మరొకరు ఉన్నా లిప్‌లాక్ చేసేదాన్ని:నటి) -
అజ్ఞానివా, మూర్ఖుడివా పవన్
-
పవన్ కళ్యాణ్ కాళ్ళ కింద భగత్ సింగ్ పేరు...!
-
అహంకారమా? అజ్ఞానమా? పవన్ పోస్టర్‌పై పూనమ్ ఫైర్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. ఇటీవల ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. అందులో పవన్ కల్యాణ్ కాళ్ల కింద ఉస్తాద్ భగత్ సింగ్ పేరు పెట్టారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది హీరోయిన్ పూనమ్ కౌర్. ఇది కచ్చితంగా భగత్ సింగ్‌ను కించపరచడమేనని, భగత్ సింగ్ యూనియన్‌కు దీన్ని రిపోర్ట్ చేయండని ట్వీట్ చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ నీకేం పనీపాటా లేదా? మధ్యలో ఎందుకు దూరుతున్నావని ఫైర్ అయ్యారు. తాజాగా పూనం కౌర్ మరో ట్వీట్ చేసింది. 'స్వాతంత్య్ర సమరయోధులను గౌరవించకపోయినప్పటికీ కనీస మర్యాద ఇవ్వాలి. అంతేకానీ ఇలా కించపర్చకూడదు. సినిమా పోస్టర్లో ఆయన పేరును నీ కాలి కింద పెట్టుకుంటావా? ఇది అహంకారమా? లేక అజ్ఞానమా?' అని మండిపడింది. ఇది చూసిన పవన్ ఫ్యాన్స్ కాంట్రవర్సీలు క్రియేట్ చేసి వార్తల్లో ఉందామనుకుంటున్నావా? అని మండిపడుతున్నారు. అసలు నీకు, పవన్ కల్యాణ్‌కు ఉన్న గొడవేంటి? అని ప్రశ్నిస్తున్నారు. నీ మీదకు దృష్టి మళ్లాలనే కదా ఇంత రాద్ధాంతం చేస్తున్నావంటూ ఆమెను తిట్టిపోస్తున్నారు. మొత్తానికి పూనమ్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. @ratnadeeep_ report this to #BhagatSingh union - this is such an insult to the name of revolutionary- huh !!! — पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) May 11, 2023 When u cannot respect revolutionaries atleast don’t insult them - a recent poster release for a movie - insults the name #bhagatsingh by placing it below foot - ego or ignorance ? — पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) May 11, 2023 చదవండి: పెళ్లికి ముందు నా భర్తకు, నాకు వేరేవాళ్లతో ఎఫైర్స్ ఉన్నాయి: హీరోయిన్ -
నేను తెలంగాణ బిడ్డనే.. వెలివేయకండి: పూనమ్ కౌర్ ఎమోషనల్
హీరోయిన్ పూనమ్ కౌర్.. సినిమాల కంటే వివాదాలతో ఎక్కువ ఫేమస్ అయింది. మాయాజాలం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఒక విచిత్రం, నిక్కి అండ్ నీరజ్, ఆమె 3 దేవ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమా విషయాలతో పాటు రాజకీయ అంశాలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తరచూ ట్రోలింగ్‌కు గురవుతుంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ స్టేజీపై కన్నీళ్లు పెట్టుకుంది. తనను తెలంగాణ నుంచి వేరు చేస్తున్నారంటూ ఎమోషనల్ అయింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాజ్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో పూనమ్ కౌర్ పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన మతం ద్వారా తనను వేరు చేసి చూస్తున్నారంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ‘నేను తెలంగాణలోనే పుట్టాను. ఇక్కడే పెరిగాను. కానీ నేను పంజాబీని అని, సిక్కు అని మతం పేరుతో దూరం చేస్తున్నారు. నన్ను తెలంగాణ నుంచి దూరం చేయకండి. మతం పేరుతో నన్ను వెలివేయకండి. నేను తెలంగాణ బిడ్డనే’అంటూ పూనమ్ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నేను తెలంగాణ బిడ్డనే.. పూనమ్ కౌర్ కంటతడి..#Poonamkaur#telangana #RajBhavan #poonamKaurCryingpic.twitter.com/gwagW0ipNE — yousaytv (@yousaytv) March 7, 2023 -
అరుదైన వ్యాధి.. ఈ పోరాటంలో విజయం మాదే అంటున్న అందాల తారలు
సమంతకు ‘మయోసైటిస్’.. పూనమ్ కౌర్‌కి ‘ఫైబ్రోమయాల్జియా’.. ఇది అందరికీ తెలిసిన విషయమే. మంగళవారం నాడు మమతా మోహన్‌దాస్ తాను చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ‘ఈ కష్టాన్నీ దాటేస్తాను’ అనే నమ్మకాన్ని వ్యక్తపరిచారామె. ఇక సమంత తన అనారోగ్యం గురించి చెప్పినప్పుడు ‘నాలానే ఎంతోమంది పోరాడుతున్నారు. మేం గెలుస్తాం’ అన్నారు. ఇదే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరిచిన పూనమ్, మమతా.. ఈ మధ్యకాలంలో తమ అనారోగ్యం గురించి పేర్కొన్న కొందరు తారల గురించి తెలుసుకుందాం. గత ఏడాది అక్టోబర్‌లో సమంత తాను మయోసైటిస్ వ్యాధి (ఎక్కువ పని చేయలేకపోవడం, కండరాల నొప్పి, త్వరగా అలసిపోవడం వంటివి)తో బాధపడుతున్నట్లు ప్రకటించారు. ఆస్పత్రి బెడ్‌పై ఉండి ఆమె ‘యశోద’ సినిమాకి డబ్బింగ్ చెప్పారు కూడా. ‘‘జీవితంలో మంచి రోజులతో పాటు చెడ్డ రోజులు కూడా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో (మయోసైటిస్‌ని ఉద్దేశించి) ఇంకొక్క అడుగు కూడా ముందుకు వేయలేనేమో అనిపించింది. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంతదూరం వచ్చానా అనిపించింది. అందుకే పోరాడతా. నాలానే చాలామంది పోరాడుతున్నారు. మేం గెలుస్తాం’’ అని పేర్కొన్నారు సమంత. ఇక సమంత తనకు మయోసైటిస్ అని ప్రకటించిన తర్వాత పియా బాజ్‌పాయ్ (‘రంగం’ సినిమా ఫేమ్) కూడా గతంలో తాను ఇదే వ్యాధితో బాధపడ్డాననే విషయాన్ని బయటపెట్టారు. అయితే ఇంట్లోవాళ్లు భయపడతారని తనకు మయోసైటిస్ అనే విషయాన్ని చెప్పలేదన్నారు పియా. కుటుంబ సభ్యులతో ఢిల్లీలో ఉంటున్న పియా వ్యాధి చికిత్స నిమిత్తం ముంబైలో ఉన్నారు. ఇంట్లోవాళ్లకు తెలియకుండా చికిత్స చేయించుకుని, కోలుకున్నాక చెప్పానని పియా పేర్కొన్నారు. ఇటీవల ‘లాస్ట్’ అనే హిందీ చిత్రంలో నటించారామె. ఇక సమంత తన అనారోగ్యం విషయం బయటపెట్టిన రెండు నెలలకు డిసెంబర్లో పూనమ్ కౌర్ తనకు ‘ఫైబ్రోమయాల్జియా’ అనే విషయాన్ని బయటపెట్టారు. కండరాల నొప్పి, అలసట, నిద్రలేమితో ఈ వ్యాధి బాధపెడుతుంటుంది. రెండేళ్లుగా ఈ వ్యాధితో తాను బాధపడుతున్నట్లు తెలిపారు పూనమ్. కేరళలో ఆయుర్వేద చికిత్స మొదలుపెట్టిన ఆమె త్వరలోనే కోలుకుంటానని ఈ వ్యాధి గురించి ప్రకటించినప్పుడు తెలిపారు. మరోవైపు గత ఏడాది నవంబర్‌లో బాలీవుడ్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ తాను ‘ఎపిలెప్సీ’ (మూర్ఛ రోగం)తో బాధపడుతున్నట్లు తెలిపారు. అయితే తన వ్యాధి విషయాన్ని ఇప్పటివరకూ గోప్యంగా ఉంచడానికి కారణం ఇతరులు తనను బలహీనురాలు అనుకోకూడదని, ఒకవేళ అందరికీ తెలిస్తే తనకు పని ఇవ్వడానికి వెనకాడతారనే భయాలే అని పేర్కొన్నారు ఫాతిమా. కానీ ఇప్పుడు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే తన విషయం బయటపెట్టానని స్పష్టం చేశారు. ‘‘నేను షూటింగ్ చేస్తున్నప్పుడు మా యూనిట్లో ఒకరికి మూర్ఛ వచ్చింది. నేను ఆ వ్యక్తికి సహాయం చేశాను. నాకలా జరిగినప్పుడు ఇతరుల సహాయం కావాలి. అయితే ఇదేం తప్పు కాదు... దాచేయడానికి. అందుకే చెప్పాలనుకున్నాను. నా నిర్మాతలకు నా పరిస్థితి చెబుతుంటాను. లొకేషన్లో నాకు మూర్ఛ వచ్చిన సందర్భాలున్నాయి. ఆ టైమ్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందే చెప్పడం హెల్ప్ అయింది’’ అన్నారు ఫాతిమా. ఆమిర్ ఖాన్ కూతురుగా ‘దంగల్’లో ఫాతిమా మల్ల యోధురాలుగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రం తనకు మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత నుంచి వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు ఫాతిమా. ఇక 2010లో మమతా మోహన్‌దాస్ కేన్సర్ బారిన పడ్డారు. ఆ విషయాన్ని బాహాటంగా చెప్పి, ధైర్యంగా చికిత్స చేయించుకున్నారామె. కేన్సర్‌పై అవగాహన కలిగించడానికి పలు విషయాలను పంచుకున్నారు కూడా. అయితే 2013లో మళ్లీ కేన్సర్ అని తెలిసినప్పుడూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చికిత్స చేయించుకుని, కోలుకున్నారు. ఇప్పుడు మంగళవారం (17.01.) నాడు తాను చర్మ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని పంచుకున్నారు మమతా మోహన్‌దాస్. ‘విటిలిగో’ అనే చర్మ వ్యాధి సోకిందని పేర్కొన్నారామె. చర్మంపై మచ్చలు, చర్మం రంగు మారడం ఈ వ్యాధి లక్షణాలన్నారు. ఇంకా ‘‘ప్రియమైన సూర్యుడా.. ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు నిన్ను హత్తుకోవాలనుకుంటున్నాను. నా చర్మం రంగుని కోల్పోతున్నాను. నువ్వు ఉదయించక ముందే నీకోసం నేను నిద్రలేచి పొగమంచులో నీ తొలి కిరణాన్ని చూడటానికి వేచి చూస్తున్నాను. నీ వెచ్చదనాన్నంతా నాకు ఇచ్చెయ్. ఎందుకంటే నాకు అది ఎంతో మేలు చేస్తుంది. అందుకే నీకెప్పటికీ రుణపడి ఉంటాను’’ అని మమతా మోహన్‌దాస్ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. ‘మీరు పెద్దవే దాటి వచ్చారు. ఇది చిన్న విషయం. ఇందులోంచీ బయటపడతారు’ అని ఫ్యాన్స్ పోస్ట్ చేశారు. అనారోగ్యం అనే విషయాన్ని బయటపెట్టడానికి ధైర్యం కావాలి. దాన్ని ఎదుర్కొని, కోలుకోవడానికి ఇంకా ధైర్యం కావాలి. ఈ చాలెంజ్‌లో ‘గెలుపు ఖాయం’ అని నమ్మడంతో పాటు ఇతరులకు స్ఫూర్తిగా నిలిచిన ఈ స్టార్స్ నిజమైన ‘స్టార్స్’. -
సినీ నటి పూనమ్ కౌర్ కు అరుదైన వ్యాధి
-
అరుదైన వ్యాధితో బాధపడుతున్న పూనమ్ కౌర్? కేరళలో చికిత్స!
హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువ పాపులర్ అయిన పూనమ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఫైబ్రో మైయాల్జియా అనే అరుదైన సమస్యతో బాధపడుతున్న పూనమ్ ప్రస్తుతం కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటుందట. ఈ వ్యాధి కారణంగా అలసట, నిద్ర, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మానసిక స్థితిలో సమస్యలు, కండరాల నొప్పి సహా పలు ఇబ్బందులు పడుతుందట.చదవండి: పెళ్లి ఫోటోల్లో లావుగా ఉందంటూ హీరోయిన్‌పై ట్రోల్స్ గత రెండేళ్ల నుంచి పూనమ్ ఈ వ్యాధితో బాధపడుతుందని ప్రస్తుతం దీన్నుంచి బయటపడేందుకు కేరళలో ట్రీట్మెంట్ తీసుకుంటుందట. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇక ఇటీవలె సమంత మయోసైటిస్ వ్యాధి బారినపడినట్లు స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో హీరోయిన్ పూనమ్ అరుదైన వ్యాధితో చికిత్స తీసుకుంటుందని సమాచారం. కాగా ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్లో మాయాజాలం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన పూనమ్ ఆ తర్వాత ఒక విచిత్రం, నిక్కి అండ్ నీరజ్, ఆమె 3 దేవ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి వంటి సినిమాల్లో నటించింది. చదవండి: డీజే టిల్లు-2 సెట్స్‌లో అనుపమ-సిద్ధూ గొడవపడ్డారా? -
రాహుల్ గాంధీ చేయి పట్టుకుని నడవడంపై పూనమ్ వివరణ
రాహుల్ గాంధీ, పూనమ్‌కౌర్ ఫోటోపై సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో నటి పూనర్ కౌర్ పాల్గొన్న విషయం తెలిసిందే. చేనేత కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. చేనేత చీరలో మెరిసిపోతూ రాహుల్ చేతిలో చేయి వేసి పట్టుకొని కొద్ది దూరం నడిచారు. అయితే యాత్రలో నడుస్తుండగా రాహుల్‌తో పూనమ్‌కౌర్ చేయిపట్టుకున్న ఫోటోపై చర్చ నడుస్తోంది. పూనమ్ కౌర్ చేయిపట్టుకొని రాహుల్ గాంధీ నడవడంపై పలువురు ట్రోల్ చేస్తున్నారు. This is absolutely demeaning of you , remember prime minister spoke about #narishakti - I almost slipped and toppled that’s how sir held my hand . https://t.co/keIyMEeqr6 — पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 29, 2022 తాత అడుగు జాడల్లో నడుస్తున్నాడని బీజేపీ నేత ప్రీతి ట్వీట్ చేశారు. దీనిపై వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు స్పందిస్తున్నారు. మోదీ మహిళలతో ఉన్న ఫోటోలను రీట్వీట్ చేస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై పూనమ్ కౌర్ ఘాటుగా స్పందించారు. ‘ఇది నిన్ను నువ్వే తక్కువగా చేసుకుంటున్నట్టుగా ఉంది. మన ప్రధాని నారీ శక్తి గురించి చెబుతుంటారు కాదా. నేను జారిపడబోతుంటే రాహుల్ గాంధీ నాచేయిపట్టుకున్నారు’ అని పూనమ్ కౌర్ వివరణ ఇచ్చారు. చదవండి: డ్రగ్స్ నిషా.. రెండురోజులు లేవలేదు, ఇంట్లోవాళ్లు ఒకటే ఏడుపు! -
జోడో యాత్రలో సినీనటి పూనమ్ కౌర్ సందడి
సాక్షి, హైదరాబాద్: జోడో యాత్రలో సినీనటి పూనమ్ కౌర్ సందడి చేశారు. వన్‌టౌన్ చౌరస్తా సమీపంలో రాహుల్‌తో కలిసి కాసేపు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈరవత్రి అనిల్, ఆలిండియా చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు కాండగట్ల స్వామి, నాయకులు పద్మశ్రీ గజం అంజయ్యతో కలిసి చేనేత కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. చేనేత పైన కేంద్ర ప్రభుత్వం వేసిన 5శాతం జీఎస్టీ ఎత్తివేయాలని, నేతకు సంబంధించిన ముడి సరుకులపై పన్నులు తొలగించాలని, గ్యాస్ ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని,ఈ మేరకు పార్లమెంట్లో మాట్లాడాలని కోరగా.. రాహుల్ సానుకూలంగా స్పందించినట్లు పూనమ్ కౌర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. సీతక్క, భట్టి, కళాకారులతో రాహుల్ దరువు భారత్ జోడో యాత్ర కల్చరల్ కమిటీ చైర్మన్, సీఎల్పీ నేత, భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లోని అవంతి హోటల్ వద్ద ఖమ్మం తదితర జిల్లాలకు చెందిన ఆదివాసీలు ప్రదర్శించిన కొమ్ము, కోయ నృత్యాలను రాహుల్ ఆసక్తిగా తిలకించారు. కేసీ వేణుగోపాల్, భట్టి, సీతక్క, సంపత్ కుమార్, కళాకారులతో కలిసి లయబద్ధంగా స్టెప్పులేశారు. ఈ సందర్భంగా ఆదివాసీల కళారూపాల గురించి రాహుల్‌కు భట్టి విక్రమార్క వివరించారు. -
ఆ ఫొటో చూసి పెళ్లయిందా? అంటూ ప్రశ్నల వర్షం, క్లారిటీ ఇచ్చిన పూనమ్
నటి పూనమ్ కౌర్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. నటిగా కంటే కూడా వివాదస్పద వ్యాఖ్యలతో ఆమె ఎక్కువగా పాపులర్ అయ్యారు. సమాజంలో జరిగే సంఘటనలు, రాజకీయ వ్యవహరాలపై స్పందిస్తూ ఆమె చేసే వ్యాఖ్యలు నిత్యం వార్తల్లో నిలుస్తుంటాయి. తాజాగా పూనమ్ తన తీరుతో మరోసారి వార్తల్లోకెక్కింది. నార్త్ ప్రజలు భర్తల క్షేమం కోరుతూ చేసే ప్రత్యేక పూజ కర్వాచౌత్ (Karwa Chauth). పెళ్లయిన మహిళలు స్పెషల్‌గా జరుపుకునే ఈ పండగను శుక్రవారం పూనమ్ సెలబ్రెట్ చేసుకుంది. అంతేకాదు ఇందుకు సంబంధించిన ఫొటోను తన ట్విటర్లో షేర్ చేస్తూ అందరికి కర్వాచౌత్ శుభాకాంక్షలు తెలిపింది. చదవండి: వెండితెర ఎంట్రీ ఇస్తున్న కార్తీక దీపం ఫేం ‘వంటలక్క’, ఫస్ట్‌లుక్ రిలీజ్ దీంతో ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ‘పెళ్లి కానీ మీరు కర్వాచౌత్ ఎలా జరపుకుంటారు?’, ‘అంటే ఇప్పుటికే మీకు పెళ్లయిపోయిందా? లేదా పెళ్లి చేసుకోబోతున్నారా?’ అంటూ నెటిజన్లు ఆమె పోస్ట్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక నెటిజన్ల ప్రశ్నలపై ఆమె కాస్త ఘాటుగా స్పందించింది. ‘ఈ ఆర్టికల్స్ రాజకీయంగా ప్రేరేపించబడ్డాయో లేక మిషనరీల ఆలోచన విధానంతో సంధించబడ్డాయో నాకు తెలియదు. కానీ కర్వాచౌత్ పండుగను పెళ్లి కాని అమ్మాయిలు కూడా జరపుకోవచ్చు. తమ కాబోయే భర్తల కోసం జరుపుకుంటారు. పెళ్లయిన వాళ్లు చంద్రుని ఆరాధిస్తే.. పెళ్లికాని అమ్మాయిలు చంద్రునికి బదులుగా చుక్కలను ఆరాధిస్తారు. అంతేకాదు మహా శివుడుని కూడా కోలుస్తారు’ అంటూ ఆమె వివరణ ఇచ్చింది. చదవండి: అందుకే సినిమాలకు గ్యాప్ తీసుకున్నా: నటుడు అజయ్ I don’t know if the articles revolving around today are politically motivated or motivated by missionaries way of thinking - educate yourself - #omnamahshivya ( vasudeva Kutumbakam is what u need to learn . pic.twitter.com/BlQ1mq0qHJ — पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 14, 2022 -
హీరోయిన్ పూనమ్ కౌర్‌కు పెళ్లయిందా? ఆ ఫోటో వైరల్
సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది హీరోయిన్ పూనమ్ కౌర్. గత కొంతకాలంగా వెండితెరకు దూరమైన ఈ పంజాబి ముద్దుగుమ్మ నెట్టింట చేసే రచ్చ అంతా ఇంత కాదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పూనమ్ నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది. కర్వాచౌత్ (Karwa Chauth)శుభాకాంక్షలు చెబుతూ చేతిలో జల్లెడను పట్టుకొని చంద్రుడిని చూస్తూ చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోను పూనమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పడు దీనిపైనే తెగ చర్చ నడుస్తుంది. ఎందుకంటే తమ భర్త క్షేమాన్ని కోరుతూ కర్వాచౌత్‌ను పెళ్లయిన మహిళలే జరుపుకుంటారు. నార్త్‌లో ఈ పండుగను ఎక్కువగా జరుపుకుంటారు. భర్త పేరు మీద ఉపవాసం చేసి… జల్లెడలో చంద్రుడిని చూసిన వెంటనే భర్త ముఖాన్ని చూసి ఆశీర్వాదం తీసుకుంటారు. అలాంటిది పెళ్లికాని పూనమ్ కర్వాచౌత్ ఫోటోను షేర్ చేయడంపై నెటిజన్లు సందేహాలు లేవనెత్తుతున్నారు. మీకు ఇదివరకే పెళ్లయిందా? లేదా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారా? అంటూ పూనమ్ పోస్టుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) -
ఇప్పటికైనా నన్ను ప్రశాంతంగా బతకనివ్వండి : పూనమ్ కౌర్
సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది హీరోయిన్ పూనమ్ కౌర్. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పూనమ్ నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటోపై తెగ చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు పిల్లలతో ఫోటో దిగిన పూనమ్ దీనికి హ్యాపీనెస్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో క్షణాల్లోనే ఆ పోస్ట్ వైరల్‌గా మారి పూనమ్‌కు పెళ్లయి, పిల్లలున్నారంటూ నెట్టింట పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఈ వార్తలపై పూనమ్ కౌర్ స్పందించింది. 'ఇప్పటివరకు జరిగిన డ్యామేజ్ చాలు, వాళ్లు నా బెస్ట్ ఫ్రెండ్ పిల్లలు. సోషల్ మీడియాకు థ్యాంక్స్. నేను క్లారిటీ ఇవ్వగలుగుతున్నాను. నన్ను కాస్త ఊపిరి తీసుకోనివ్వండి' అంటూ పూనమ్ ట్వీట్ చేసింది. దీంతో పుకార్లకు చెక్ పెట్టినట్లయ్యింది. Enough unbearable damage has been done , these are my best friends kids. Thankful to social media , that I can give clarity. 🙏 Let me breathe🙏 pic.twitter.com/4yyCPMuRDn — पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) May 4, 2022 -
ఆ స్టార్ హీరో గురించి చాలా చెప్పాలి: పూనమ్ షాకింగ్ కామెంట్స్
కాంట్రవర్సీ క్వీన్ పూనమ్ కౌర్ ఏం మాట్లడిన అది వివాదమే అవుతుంది. గత కొంతకాలంగా వెండితెరకు దూరమైన ఈ పంజాబి సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంత కాదు. పీకే లవ్స్ అంటూ ట్విటర్ ఖాతాలో పేరు మార్చుకుని అందరిని ఆలోచనలో పడేసింది. ఇక ఇటీవల దాని అర్థం చెబుతూ.. పీ అంటే పూనమ్.. కే అంటే కౌర్ అంటూ క్లారిటీ ఇచ్చేసింది. ఇటీవల ‘నాతి చరామి’ మూవీతో రీఎంట్రీ ఇచ్చిన పూనమ్ పలు ఇంటర్య్వూలో టాలీవుడ్ హీరోలందరిపై ఆసక్తిగా స్పందిస్తోంది. చదవండి: ప్రభాస్‌పై పూనమ్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు తాజాగా మె నటించిన నాతి చరామి మూవీ మార్చి 10న ఈ మూవీ అమెజాన్, హంగామా, సోనీ, టాటా స్కై, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్, ఎంఎక్స్ ప్లేయర్ వంటి 20 ఓటీటీ ప్లాట్ఫామ్ల్లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె ఆసక్తిక ప్రభాస్ మంచివాడని, అతడిలాంటి వ్యక్తి పరిశ్రమలో ఎవరు లేరంటూ కితాబు ఇచ్చింది. కెరీర్ మొదట్లో విజయ్ దేవరకొండతో నటించే అవకాశం వచ్చిందని, కానీ తను ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలిపింది. ఇక చిరంజీవి అంటే తనకు చాలా అభిమానం అని, నాగార్జున కుటుంబాన్ని చూస్తే ముచ్చటేస్తుందని పేర్కొంది. చదవండి: షాకింగ్.. నయన్, విఘ్నేశ్‌ల పెళ్లి అయిపోయిందా? ఇదిగో ప్రూఫ్ చిరంజీవి అంటే వారింట్లో అందరికి ఇష్టమని ఆయన ప్రతి సినిమా చూస్తారని చెప్పిన పూనమ్.. ఆయన తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చరణ్ గురించి చాలా విషయాలను చెప్పాలని, అయితే ఇప్పుడు సరైన సమయం కాదు సస్పె న్స్‌కు తెరలేపింది. అంతేకాదు సమయం వచ్చినప్పడు చరణ్ గురించి తప్పకుండ మాట్లాడతానంటూ పూనమ్ వ్యాఖ్యానించింది. దీంతో ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. ఇక ప్రభాస్ లాంటి వ్యక్తి చాలా అరుదుగా ఉంటారని, ఒక మనిషిని నమ్మి అయిదు సంవత్సరాలు ఒకే మూవీకి కేటాయించడం చాలా గొప్ప విషయం. అది ప్రభాస్ లాంటి వ్యక్తి మాత్రమే చేయగలరు చెప్పుకొచ్చింది. -
ప్రభాస్‌పై పూనమ్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Poonam Kaur Intresting Comments On Prabhas: నటి పూనమ్ కౌర్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. గత కొంతకాలంగా వెండితెరకు దూరమైన ఈ పంజాబి భామ తాజాగా ‘నాతి చరామి’ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. మార్చి 10న ఈ మూవీ అమెజాన్, హంగామా, సోనీ, టాటా స్కై, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్, ఎంఎక్స్ ప్లేయర్ వంటి 20 ఓటీటీ ప్లాట్ఫామ్ల్లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో పూనమ్ వరస ఇంటర్య్వూలతో బిజీగా మారింది. ఈ క్రమంలో ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చదవండి: రాధికను టిల్లు నమ్మలేదు.. కానీ మీరు నమ్మారు: హీరోయిన్ పరిశ్రమలో ప్రభాస్ లాంటి వ్యక్తి ఎవరూ లేరంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ మేరకు ఆమె ‘సినీ పరిశ్రమలో స్టార్స్, యాక్టర్స్ అనేవారు చాలామంది ఉన్నారు. కానీ ఒక మనిషిని నమ్మి అయిదు సంవత్సరాలు ఒకే మూవీకి కేటాయించడం చాలా గొప్ప విషయం. అది ప్రభాస్ లాంటి వ్యక్తి మాత్రమే చేయగలరు. ఆయన మంచి వ్యక్తి. ప్రభాస్ లుక్స్, క్రేజ్ పక్కన పెడితే.. నమ్మిన వాళ్ల కోసం నిలబడడమే ఆయన క్యారెక్టర్’ అంటూ డార్లింగ్‌పై ప్రశంసలు కురిపించింది పూనమ్. చదవండి: ఓటీటీలోకి అజిత్ ‘వలిమై’, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. కాగా ఇటీవల కాలంతో పలువురు ప్రముఖలపై సోషల్ మీడియాల్లో పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు, విమర్శలు చేస్తూ వివాదంలో నిలిచే పూనమ్ ఇలా ప్రభాస్‌పై ప్రశంస వ్యాఖ్యలు చేయడం ఆసక్తిని సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్‌పై ఆమె కామెంట్స్ వైరల్‌గా మారాయి. ఇక ప్రభాస్ ‘రాధేశ్యామ్’ మూవీ గురించి మాట్లాడుతూ.. తనకు ప్రేమ కథలు, సినిమాలు అంటే ఇష్టమని, అలాగే 'రాధే శ్యామ్' కూడా తనకు నచ్చుతుందని పూనమ్ పేర్కొంది. -
పవన్ కల్యాణ్ గురించి పూనమ్ కౌర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Poonam Kaur About Pawan Kalyan: హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాల కంటే వివాదాలతోనే పాపులర్ అయిన ఈ బ్యూటీ తన ట్వీట్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. తాజాగా పూనమ్ నటించిన 'నాతిచరామి' సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ క్రమంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న పూనమ్ తాజాగా పవన్‌కల్యాణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. 'పవన్‌తో కావాలనే నన్ను నటించకుండా చేశారు. ఆయన గురించి పాజిటివ్‌గా చెప్పినా నెగిటివ్‌గానే అర్థం చేసుకుంటారు.. అయ్యయ్యో నాకు సిగ్గు వచ్చేస్తుంది.. దేవుడా' అంటూ పవన్‌ను తల్చుకొని నవ్వేసింది. కాగా తన కెరీర్‌ను నాశనం చేయడానికి కొందరు ప్రయత్నించారని, దీంతో మానసికంగా ఎంతో నష్టాన్ని చవిచూశానని ఇటీవలె పూనమ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. -
కాంట్రవర్సీ క్వీన్ పూనమ్ కౌర్ క్యూట్ లుక్స్
-
దేశం వదిలి వెళ్లిపోదామనుకున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న పూనమ్ కౌర్
Poonam Kaur Gets Emotional In Nathi Charami Movie Press Meet: 'మాయాజాలం' సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది పూనమ్ కౌర్. తర్వాత పలు సినిమాల్లో సెకండ్ హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయింది. సరైన అవకాశాలు లేక నాలుగేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితే చాలా గ్యాప్ తర్వాత పూనమ్ ఒక సినిమాలో నటిస్తోంది. ఆ సినిమానే అరవింద్ కృష్ణ, సందేష్ బురి ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'నాతి చరామి'. నాగు గవర దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని ఏ స్టూడియే 24 ఫ్రేమ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై జై వైష్ణవి కె నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రికార్డు స్థాయిలో అమెజాన్, హంగామా, సోనీ, టాటా స్కై, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్, ఎంఎక్స్ ప్లేయర్ వంటి 20 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో మార్చి 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం (మార్చి 8) హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో పూనమ్ కౌర్ భావోద్వేగానికి గురైంది. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు రావడంతో తాను కన్నీళ్లు ఆపుకోలేక పోయానని తెలిపింది. తాను సినిమాలు వదిలేసి వెళ్లిపోవాలనుకున్నట్లు పేర్కొంది. '2017, 18లో నేను పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్లిపోదామనుకున్నా. కానీ నా జీవితాన్ని మార్చేసింది సినిమానే. తర్వాత ఇక సినిమాలు చేయను. పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్లిపోతానని మమ్మీకి చెప్పాను. దేశం వదిలి వెళ్లిపోతానని చెప్పా. కానీ చాలా క్లిష్టతరమైన పరిస్థితిలో రియలైజ్ అయ్యాను. దానివల్లే ఇక్కడ ఉన్నాను. ప్రతిరోజూ సీత, దుర్గా, ద్రౌపదిలానే తలచుకునేదాన్ని. అందువల్లే చాలా శక్తిని, ధైర్యాన్ని పొందాను. మధ్య తరగతి అమ్మాయిలకు చాలా కలలుంటాయి. అందులో ప్రత్యేకమైనది పెళ్లి. ఆ పెళ్లి కలను కొందరు చెదరగొట్టారు. అయితే ఇండియన్ కల్చర్‌లోనే మహిళలు ఎలా ధైర్యంగా ఉండాలనేది, పోరాడలనేది ఉంది. దాన్నుంచే నేను స్ఫూర్తి పొందాను. ఈ విషయంలో అమ్మ ఎంతో సపోర్ట్ చేసింది.' అని తెలిపింది పూనమ్. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఈ క్రమంలోనే ఉమెన్ సెంట్రిక్ మూవీ ఒకటి ఉందని నా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పిందని పూనమ్ కౌర్ పేర్కొంది. ఇది నిజజీవిత సంఘటనల ఆధారంగా, భార్య గురించి చెప్పే కథ అని తెలిసాక ఒప్పుకున్నట్లు వెల్లడించింది. 'నాతి చరామిలోని శ్రీలత పాత్ర నా జీవితానికి చాలా దగ్గరగా ఉంది. మూడేళ్ల క్రితం నా ఆలోచనలు 18 ఏళ్ల అమ్మాయిలా ఉన్నాయి. ఇప్పుడు 50 ఏళ్ల మహిళగా ఉన్నాయి.' అని పూనమ్ కౌర్ వివరించింది. -
ఈటల రాజేందర్‌పై పూనమ్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు
నటి పూనమ్ కౌర్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఆమె ఎప్పుడు, ఎవరి మీద కామెంట్స్ చేస్తుందో ఎవరికి తెలియదు. ఎందుకు చేస్తుందో కూడా తెలియదు. తాజాగా ఈ పంజాబీ బ్యూటీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఈటల చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో గెలుపోటముల గురించి తాజాగా పూనమ్ స్పందించింది. View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) గురునానక్ జయంతి సందర్భంగా ఈటలను ప్రత్యేకంగా కలిసి ఏక్ ఓంకార్ అనే తన మతంలో పవిత్రమైన గుర్తును కానుకగా ఇచ్చింది పూనమ్. అంతేకాకుండా ఆయనతో కలిసి శాంతి కపోతమైనా పావురాన్ని ఎగుర వేసింది. ఈ ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. ధర్మ యుద్ధం ఎప్పుడూ గెలుస్తుందంని కామెంట్ చేసింది. అలాగే రైతు చట్టాలు రద్దు చేయడంతో మళ్లీ స్వేచ్ఛ స్వాతంత్ర్యం వచ్చినట్లు అనిపించిందని పూనమ్ కౌర్ అభిప్రాయపడింది. మొత్తానికి పూనమ్ కౌర్ ఇలా కనిపించడంతో నెటిజన్లకు కొత్త అనుమానాలు పుట్టుకొచ్చాయి. పూనమ్ కౌర్ కొంపదీసి బీజేపీలో చేరుతుందా? అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) -
విడాకులపై పూనమ్ సంచలన వ్యాఖ్యలు, కాసేపటికే ట్వీట్ డిలీట్
Actress Poonam Kaur Tweet About Divorce: నటి పూనమ్ కౌర్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. గత కొంతకాలంగా వెండితెరకు దూరమైన ఈ పంజాబి భామ.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలో ఆమె సామాజిక అంశాలపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. దీంతో ఆమె ట్వీట్స్‌పై నెటిజన్లు నిగూడార్థాలు వేతుకుతుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా పూనమ్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ఈ మేరకు ఆమె విడాకులపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే కాసేపటికే ఆ ట్వీట్ డిలీట్ చేయడంతో హాట్‌టాపిక్‌గా మారింది. పూనమ్ విడాకుల అంశంపై ఆసక్తికరంగా ప్రశ్నలు లేవనెత్తుతూ ఇలా రాసుకొచ్చింది. చదవండి: విడాకుల తర్వాత మరింత పెరిగిన సామ్ క్రేజ్.. దక్షిణాది తొలి భారత నటిగా గుర్తింపు ‘విడాకుల అనంతరం నిజంగా మగవారికి బాధ ఉండదా? లేదంటే ఆడవాళ్లే ఇబ్బందులు పెడతారు.. ఆడవాళ్లే వారిని మాటలతో బాధిస్తారు.. వారి వల్లే మగవారికి కఠిన పరిస్థితులు వస్తుంటాయని ఈ సమాజమే పక్షపాతంతో వ్యవహరిస్తుందా? అసలు ఇప్పటికీ మనం విడాకుల అంశాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలిగామా? విడాకుల కోణంపై మనకు కచ్చితమైన దృక్కోణం ఉందా?’ అని ఆమె పేర్కొంది. అయితే ఈ ట్వీట్ చేసిన గంట వ్యవధిలోనే పూనమ్ పోస్ట్‌ను డిలీట్ చేయడం గమనార్హం. దీంతో అసలు ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేసింది? ఎందుకు డిలీట్ చేసింది? ఇప్పుడు ఆమె విడాకుల అంశంపై ఇంత లోతుగా స్పందించడమేంటని నెటిజన్లు ఆమె పోస్ట్‌లోని ఆంతర్యం వెతికే పనిలో పడ్డారు. చదవండి: పునీత్ గొప్ప మనసు, సేవా కార్యక్రమాల కోసం రూ. 8 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ -
MAA Elections2021: పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల పోలింగ్ రసవత్తరంగా సాగుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు ప్యానళ్ల సభ్యులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. మరోవైపు అగ్రహీరోలైన చిరంజీవి, పవన్ కల్యాణ్ , బాలకృష్ణతో పాటు నాగార్జున కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. మధ్యాహ్నం 2 గంటలకే ఓటింగ్ ముగియాల్సి ఉన్నా.. మరికొంతమంది ఓటింగ్‌కు వచ్చే అవకాశం ఉండడం, కొంత మంది ట్రాఫిక్‌లో చిక్కుకున్నట్టు సమాచారం ఇవ్వడంతో.. మరో గంటపాటు పోలింగ్ సమయాన్ని పొడిగించారు.. ప్రకాష్ రాజ్, మంచు విష్ణుతో మాట్లాడిన మా ఎన్నికల అధికారి… పోలింగ్ సమయాన్ని మధ్యాహ్నం 3 గంటల వరకు పొడిగించిడు. ఈ సారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ‘మా’ఎన్నికలపై నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆదివారం ఆమె ‘మా’ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. టాలీవుడ్లో చాలా రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపించింది. రాజకీయ లబ్ధి కోసం ఆర్టిస్టులను సతాయించడం మానుకోవాలని తెలిపింది. ఏ ప్యానల్ గెలిచినా.. రాజకీయాలను, మా అసోసియేషన్‌ను కలపకూడదని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. -
సంచలనంగా మారిన పూనమ్ తాజా ట్వీట్, ‘పీకేలవ్’ అంటూ హ్యాష్ ట్యాగ్..
నటి పూనమ్ కౌర్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. గత కొంతకాలంగా వెండితెరకు దూరమైన ఈ పంజాబి నటి.. ‘మా’ ఎన్నికల నేపథ్యంలో మరోసారి తెరపైకి వచ్చింది. ఇక ప్రకాశ్ రాజ్‌కు మద్దతు ఇస్తూ ఆమె ఇటీవల ఓ ట్వీట్ చేయగా అది చర్చనీయాంశం అయ్యింది. ఈ క్రమంలో తాజాగా పూనమ్ చేసిన మరో ట్వీట్ సంచలనంగా మారింది. తన ఫొటోలు కొన్ని షేర్ చేస్తూ దానికి ‘పీకేలవ్’(#PKlove) అనే హ్యాష్ ట్యాగ్ జత చేసింది. దీంతో పూనమ్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. పీకే అంటే పూనమ్ కౌర్ అనే అర్థం ఉన్నప్పటికీ ఇందులో మరిన్ని ఊహగానాలు రెకిస్తున్నట్లుగా ఉన్న ఆమె ట్వీట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. చదవండి: నేను ఎదుర్కొన్న సమస్యల్ని బయటపెడతా: పూనమ్ కౌర్ ఇందులో ఇంకేదో ఉందంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ మధ్య చోటుచేసకున్న కొన్ని సంఘటనల దృష్ట్యా ఈ మధ్య ఆమె చేసే ప్రతి పోస్ట్ చర్చకు దారి తీస్తున్నాయి. ఇటీవల దివంగత దర్శకుడు దాసరి నారాయణ రావు గురించి ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. చిత్ర పరిశ్రమలో నా ఏకైక గురువు దాసరి నారాయణ రావు. ఆయనను చాలా మిస్సవుతున్నారు. దాసరి గారికి నేనొక సందేశాన్ని తెలియజేయాలనుకుంటున్నా. దేవుడు దీనిని ఆయనకు చేరవేస్తాడని ఆశిస్తున్నాను’ అంటూ ఆమె రాసుకొచ్చింది. ఇది కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. చదవండి: ChaySam: అఫైర్స్ అబార్షన్ రూమార్స్‌పై స్పందించిన సమంత #pklove pic.twitter.com/SsnBORfjLW — पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 7, 2021 -
నేను ఎదుర్కొన్న సమస్యల్ని బయటపెడతా: పూనమ్ కౌర్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ గెలవాలని కోరుకుంటున్నట్లు నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆయన గెలిచాక తాను ఎదుర్కొన్న సమస్యల్ని చెప్పగలిగే అవకాశం ఉంటుందని ఆమె పేర్కొంది. తాజాగా ఆమె ట్వీట్ చేస్తూ ప్రకాశ్‌రాజ్‌తో కలిసి దిగిన ఫొటోని షేర్ చేసింది. ఈ మేరకు ఆమె ‘‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ సర్ గెలవాలని కోరుకుంటున్నా. ఇంతకాలం నిశబ్థం ఉన్న నాకు ఆయన గెలిస్తే పరిశ్రమలో నేను ఎదుర్కొన్న సమస్యలను చెప్పే అవకాశం వస్తుంది. చదవండి: బికినీ ఫొటో అడిగిన అభిమానికి అనుపమ ఘాటు రిప్లై ఎందుకంటే ఆయన మాత్రమే వాస్తవికంగా ఉంటారని నా నమ్మకం. ప్రకాశ్ రాజ్‌కు పెద్దల పట్ల గౌరవం, ఇచ్చిన మాట కు కట్టుబడి ఉంటారు. ఆయన ప్రకాశ్ రాజ్ చెత్త రాజకీయాలు చేయరు. అందుకే ఆయనకు తన మద్దతు ఉంటుంది. జైహింద్’ అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చింది. కాగా పంజాబీ భామ అయిన పూనమ్ హీరో శ్రీకాంత్ ‘మాయాజాలం’ మూవీతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ‘వినాయకుడు, శౌర్యం, గణేశ్, గగనం, శ్రీనివాస కల్యాణం’ వంటి చిత్రాల్లో సహానటిగా కనిపించింది. ఇక ప్రకాశ్ ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 10 మా ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి ‘మా’ అధ్యక్ష పదవికి ప్రకాశ్ రాజ్‌తో పాటు హీరో మంచు విష్ణు, సీవీఎల్ నరసింహారావులు పోటీ పడుతున్నారు. చదవండి: ‘మా’ ఎన్నికలు: కృష్ణను కలిసిన మోహన్‌బాబు, విష్ణు Want #prakashraj sir to win #maaelections , if he does I will put up the issues I have faced and kept quiet for the longest time , he is the only one who is apolitical and doesn’t get involved in petty politics ,with all due respect to elders will adhere to what they say .Jaihind pic.twitter.com/1lwJDwlLfs — पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 1, 2021 -
హల్చల్: హై బన్‌తో పూనమ్.. ప్రేమలో హీనా
► ఎమోజీల ఫీల్ అవుతున్న అనన్య పాండే ► హై బన్‌తో పూనమ్ కౌర్ ► వైట్ డ్రెస్‌లో హీనా ఖాన్.. ► మాట నిలబెట్టుకున్న లైగర్..సంతోషంలో షణ్ముఖ ప్రియ ► కూతురితో నటి సమీరా రీల్స్ సందడి ► ఒంటరిగా అభిజీత్ ప్రయాణం View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by HK (@realhinakhan) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Shanmukhapriya (@shanmukhapriya_1925) View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) -
టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు
Poonam Kaur: టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇప్పటికే కేసులో డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరోయిన్స్ చార్మీ, రకుల్ ఈడీ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇప్పటికే పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి, రవితేజతోపాటు డ్రైవర్ శ్రీనివాస్, నవ్‌దీప్, ఎఫ్–క్లబ్ జనరల్ మేనేజర్, ముమైత్ ఖాన్, తనీష్, నందు, తరుణ్‌లకు ఈడీ అధికారులు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా మరికొంత మంది నటీనటుల పేర్లు సైతం బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.తాజాగా టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంపై స్పందించిన నటి పూనమ్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. డ్రగ్స్ అనేది కేవలం సెలబ్రిటీల సమస్య కాదు. ఇది ప్రతి ఒక్కరి సమస్య. సరిహద్దు సమస్య. పొలిటికల్ అజెండాతో జరుగుతున్న వ్యవహారం. బలమైన ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమస్య. ఈ మొత్తం వ్యవహారంపై త్వరలోనే నా స్వీయ అనుభవాలను మీతో పంచుకుంటాను అని పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం పూనమ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి. DRUGS IS NOT A CELEBRITY ISSUE ! IT IS EVERY ONES ISSUE ! ITS A BORDER ISSUE ! ITS A POLITICAL AGENDA DRIVEN ISSUE ! ITS A STRONG PARALLEL ECONOMY ISSUE ! I WILL SPEAK ON THIS ISSUE ,WITH MY OWN EXPERIENCE SOON ! Jai hind — पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 3, 2021 -
హల్చల్ : మాటలతో పనేం ఉందన్న దివి..అంత సీరియస్ వద్దన్న నేహా
♦ క్యాప్షన్ కావాల్సిందేనా అని అడుగుతున్న దివ్యాంక ♦ లైఫ్‌ని అంత సీరియస్‌గా తీసుకోవద్దంటున్న యాంకర్ నేహా ♦ జిమ్‌లో మోటివేషన్ అంటోన్న శిల్పా ♦ కొచ్చి మెమరీస్ గుర్తుచేసుకుంటున్న అనసూయ ♦ మెహబూబ్‌తో చిందులేస్తున్న శ్వేత నాయుడు ♦ ఇంకా మూడు రోజులే అంటోన్న సుమ కనకాల ♦ మాటలతో పనేం ఉందంటోన్న దివి ♦ కర్మను సెలబ్రేట్ చేస్తున్న పూనమ్ కౌర్ View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) View this post on Instagram A post shared by Anchor Neha (@chowdaryneha) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Swetha Naidu 🇮🇳 (@swethaa_naidu) View this post on Instagram A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) -
బిగ్‌బాస్-4: భారీ ఆఫర్.. నో చెప్పిన హీరోయిన్?
బుల్లితెర సెన్సేషనల్ రియాల్టీ షో‘బిగ్‌బాస్’మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్ షో.. నాలుగో సీజన్ కోసం ముస్తాబవుతోంది. బిగ్‌బాస్-4 ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని షోను ప్రారంభించనున్నారు నిర్వాహకులు. ఇప్పటికే హోస్ట్ నాగార్జున ప్రోమో షూటింగులో పాల్గొన్నారు. ఈ మేరకు అన్నపూర్ణ స్లూడియోలో చిత్రీకరణ జరిపారు. శుక్ర, శనివారాల్లో ఈ యాడ్‌ను చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో, షోలో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరనే విషయంపై ఆసక్తి నెలకుంది. బిగ్ బాస్ 4 లో పాల్గొనేది వీరే అంటూ సోషల్ మీడియాలో రోజుకో పుకారు వస్తుంది. (చదవండి : బిగ్‌బాస్ ఈజ్ బ్యాక్) హీరో తరుణ్, హీరోయిన్లు శ్రద్ధాదాస్, హంసానందిని, యూట్యూబర్ సునయన, యాంకర్ విష్టు ప్రియ పేర్లు వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటికే తరుణ్, శ్రద్ధాదాస్ తాము షోలో పాల్గొనడం లేదని క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఈ షో నిర్వాహకులు టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్‌ను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. పూనమ్ అయితే.. ఈ షోకు మంచి రెస్పాన్స్ వస్తుందని ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు భారీ పారితోషకం ఆఫర్ కూడా చేశారట. కానీ పూనమ్ ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. మొత్తంగా ఇపుడు బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లడానికి చాలా మంది సెలబ్రిటీలు వెనకంజ వేస్తున్నారు.కాగా, బిగ్‌బాస్ నాలుగో సీజన్ జూన్ నెలలో ప్రారంభం కావాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడింది. -
ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేశా: పూనమ్ కౌర్
సాక్షి, చౌటుప్పల్: రైతులు, చేనేతలు.. దేశానికి వెన్నెముకలాంటివారని ప్రముఖ సినీనటి పూనమ్‌కౌర్ అన్నారు. కరోనాతో ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చౌటుప్పల్, నారాయణపురం మండలాల్లోని 220 మంది చేనేత కార్మికులకు హైదరాబాద్‌లోని నాస్కామ్ ఫౌండేషన్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని ఎస్సీఎస్సీ సంస్థల సౌజన్యంతో సమకూర్చిన నిత్యావసర సరుకులను ఆదివారం చౌటుప్పల్‌లోని పద్మావతి ఫంక్షన్హాల్లో పంపిణీ చేసి మాట్లాడారు. ఈ రెండురగాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. స్వాతంత్య్రానికి పూర్వమే చేనేత వస్త్రాలు విదేశాలకు ఎగుమతి అవ్వేవని తెలిపారు. నేతన్నల కళా నైపుణ్యం ఎంతో గొప్పదని కొనియాడారు. పర్యావరణానికి అనుగుణంగా చేనేత వస్త్రాలు ఉంటాయన్నారు. మాట్లాడుతున్న ప్రముఖ సినీనటి పూనమ్‌కౌర్ తమ తండ్రి 30ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి చీరల వ్యాపారం ప్రారంభించారన్నారు. తాను సైతం ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేశానన్నారు. చేనేత కార్మికుల ఇండ్లకు వెళ్లి వారి స్థితిగతులను తెలుసుకున్నానని, మగ్గం సైతం నేసానని తెలిపారు. కరోనా సమయంలో ప్రభుత్వాలు చేనేత, వ్యవసాయ రంగాలకు చేయూతనివ్వాలని కోరారు. అనంతరం చేనేత సంఘంలోని వస్త్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక చేనేత సంఘం అధ్యక్షుడు కందగట్ల భిక్షపతి, యర్రమాద వెంకన్న, బడుగు మాణిక్యం, గోశిక స్వామి, గుర్రం నర్సింహ్మ, గోశిక ధనుంజయ, నల్ల నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఆ డైరెక్టర్ వల్లే డిప్రెషన్లోకి వెళ్లాను: పూనమ్
టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ తనదైన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. నిన్నటి వరకు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై స్పందించిన పూనమ్ తాజాగా ఓ దర్శకుడు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్విటర్లో వరుస ట్వీట్లు చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. గత కొంత కాలంగా తాను డిప్రెషన్‌తో పోరాడుతున్నట్లు పూనమ్ వెల్లడించారు. తను అలా కావడానికి ఓ తెలుగు డైరెక్టర్ కారణమంటూ పేర్కొన్నారు. దర్శకుడి పేరు వెల్లడించకుండా కేవలం గురూజీ అన్న హ్యష్‌ట్యాగ్‌తో ఈ వ్యాఖ్యలు చేశారు. అతని వల్ల సినిమాలు, టెలివిజన్ ప్రకటనలతోపాటు అనేక అవకాశాలను కోల్పోయినట్లు పేర్కొన్నారు. (సల్మాన్‌ఖాన్‌పై సంచలన ఆరోపణలు..) తన మానసిక ఆరోగ్యం గురించి వివరిస్తూ ఆ పరిస్థితులు తనను ఆత్మహత్య చేసుకునే వరకు ఎలా ప్రేరేపించాయో పూనమ్ వివరించారు. ‘నా స్నేహితురాలు ఒకటి రెండు సార్లు ఓ దర్శకుడిని సంప్రదించింది. పూనమ్ అనారోగ్యంతో బాధపడుతోందని తన ఆరోగ్యం బాగోలేదని చెప్పింది. ఈ పరిస్థితి గురించి మనం తనకు ఏమైనా సహాయం చేయగలమా అని అడిగింది. అయినా దర్శకుడు ఆలస్యం చేస్తూనే ఉన్నాడు. అప్పుడు నేనే వెళ్లి నా పరిస్థితిని చెప్పాను. నేను పూర్తిగా అనారోగ్యంతో బాధపడుతున్నాను. ఇప్పుడేం చేయాలని అడిగాను. తను సమాధానం ఇవ్వలేదు. మళ్లీ నేను ఈ సమస్యను పరిష్కరించవచ్చా. నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నాను అని అడిగాను’. అంటూ తన బాధను చెప్పుకొచ్చారు. (సుశాంత్ ఆత్మహత్య; కరణ్‌కు మద్దతుగా వర్మ) దీనికి బదులుగా వెంటనే ఆ దర్శకుడు ‘ఏమీ జరగదు నువ్వు చచ్చిపోతే ఒక రోజు న్యూస్‌లో ఉంటావు అంతే’ అని చెప్పినట్లు పూనమ్ పేర్కొన్నారు. ఈ మాటలు విని తను షాక్‌కు గురైనట్లు తెలిపారు. మీడియా, మూవీ మాఫీయా, ఆడ్వర్టైజ్మెంట్స్ అన్ని అతనితో కంట్రోల్లో ఉంటాయన్నారు. తనపై అనవసర కథనాలు ప్రచురించి మరింత వేదనకు గురిచేశాయన్నారు.. అతనికి అప్పుడే డైరెక్టు సమాధానమిచ్చినట్లు స్పష్టం చేశారు. (నాకున్న స్నేహితులు ఇద్దరే: సుశాంత్) ‘నాతో మధ్య రాత్రి అయినా వస్తాను అనేవాడు. కానీ ఇప్పుడు చచ్చిపోతే ఒక రోజు న్యూస్‌లో ఉంటావు అనే వరకు వచ్చాడు. సమస్యకు పరిష్యారం కోసం తప్ప మరెందుకు తాను ఆ డైరెక్టర్‌ను సంప్రదించలేదు. తనుకున్న ఉన్నత పరిచయాలతో నన్ను తప్పుగా చిత్రీకరించాడు’ అని పేర్కొన్నారు. చివరగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తనను ఆశ్చర్యపరిచిందని, అతనిలాగే తన జీవితాన్ని అంతం చేసుకోవాలని లేదని తెలిపారు. ప్రస్తుతం డిప్రెషన్‌కు థెరపీ తీసుకుంటున్నట్లు పూనమ్ పేర్కొన్నారు. కాగా 2018లో సందీప్ కిషన్ నటించిన ‘నెక్స్ట్ ఏంటి’ సినిమాలో పూనమ్ చివరి సారిగా కనిపించారు. -
ఈ నెల 16న నిర్భయకి న్యాయం జరగబోతోంది: పూనమ్
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో తనదైన శైలిలో పదునైన కామెంట్స్ చేస్తూ ఎంతో యాక్టివ్‌గా ఉండే సినీ నటి పూనమ్ కౌర్ సామాజిక అంశాలపై తనదైన శైలింలో గళం వినిపిస్తుంటారు. ఎప్పటికప్పుడు ఆడవాళ్లపై జరుగుతున్న అక్రమాలపై ట్వీట్ల రూపంలో గళం విప్పుతుంటారు. తాజాగా.. ఆమె ఢిల్లీలో నిర్భయ తల్లి ఆశాదేవిని కలుసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆమెకు ఓ రెస్టారెంట్ లో చిన్న విందు కూడా ఇచ్చారు. అంతేగాక ఆశాదేవి భుజాలపై ఆప్యాయంగా చేతులు వేసిన ఓ ఫొటోను పూనమ్ కౌర్ తన ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ నెల 16న నిర్భయకు న్యాయం జరగబోతోంది. ఆ రోజున యావత్ భారతదేశం ఎంతో సంతోషంగా ఉంటుంది. చాలా కాలం పాటు ఎదురుచూశాం. నిర్భయ నిందితులకు ఉరిశిక్ష పడుతుందని తెలిసి మన దేశం ఎంతో సంతోషిస్తోంది అంటూ తన ట్విటర్ ఖాతాలో పేర్కొంది. చదవండి: ఆ మృగాలని చంపి నేను జైలుకెళ్తా: పూనంకౌర్ -
పవన్‌పై పూనమ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : దిశ నిందితుల్ని తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్ చేయడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తున్నారు. దిశకు న్యాయం జరిగిందంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దిశ ఎన్‌కౌంటర్‌పై సిని నటి పూనమ్ కౌర్ స్పందించారు. దిశ నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. దిశ నిదితుల్ని ఎన్ కౌంటర్ చేయటం అభినందనీయమని ఆమె సంతోషం వ్యక్తంచేశారు. దిశ ఘటన తెలిసి తానుఎంతో ఆవేదన చెందాననీ.. ఆందోళన చెందానని కానీ.. నిందితులకు ఇంత త్వరగా శిక్ష వేసినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడినవారికి ఇదే సరైన శిక్ష అని అన్నారు. ఇక ఏ ఆడపిల్లకు ఇటువంటి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులకు..ప్రభుత్వాలకు ఉందన్నారు. ఇలా పోలీసులపై ప్రశంసలు కురిపిస్తూనే.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేసింది పూనమ్. ఈ మేరకు ఓ ట్వీట్ చేసిన పూనమ్.. ఆ తరువాత కాసేపటికే డిలీట్ చేసింది. అయితే ఆ లోపే ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ఆ ట్వీట్లో ఏముందంటే...‘ ఉదయమే మంచి వార్త విన్నాను. దిశకు న్యాయం చేసినందుకు తెలంగాణ సీఎం, తెలంగాణ డీజీపీకి ధన్యవాదాలు. ఇదే విధంగా నాతో పాటు పలువురి మహిళలను మోసం చేసిన కొంతమంది సినీ అలియాస్ రాజకీయ నాయకులను శిక్షిస్తారని భావిస్తున్నా. ప్లీజ్ రెండు బెత్తం దెబ్బలు’’ అని పూనమ్ ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్లో పవన్ కల్యాణ్ పేరును ప్రత్యక్షంగా వాడనప్పటికీ.. ఇటీవల కాలంలో ఆయన మాట్లాడిన మాటలను కామెంట్ చేసింది. దీంతో ఆమె ట్వీట్ పవన్‌కేనని అందరికీ అర్థమైంది. కాగా, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనపై పవన్ స్పందిస్తూ.. ‘వైద్యురాలిపై హత్యాచారం చేసిన నలుగురిని జైల్లో పెడితే.. జైలు దగ్గరకు వేలమంది వెళ్లి.. ఉరితీయాలని, చంపేయాలని అంటున్నారు.అంత స్థాయికి ఎందుకు తీసుకువెళుతున్నారు. ఆడపిల్ల బయటకువెళ్లి ఇంటికి తిరిగిరాకపోతే.. ఆడపిల్ల మీద ఏదైనా జరిగితే.. చేసిన అబ్బాయిని రెండు బెత్తం దెబ్బలు తగిలిస్తే సరిపోతుంది’ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
ఆ మృగాలని చంపి నేను జైలుకెళ్తా: పూనంకౌర్
హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంకను దారుణంగా హత్యచేసిన మృగాలను చంపేయాలంటూ ప్రజలు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తుంటే.. సోషల్ మీడియా ద్వారా ప్రముఖులు సైతం తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఈ ఘటనపై సినీ నటి పూనమ్‌కౌర్ స్పందిస్తూ.. ఇలాంటి జంతువులను చంపడానికైనా తాను సిద్ధమేనని అన్నారు. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన ఆ మృగాలకు జైలు శిక్ష అనుభవించడం కాదు, వాళ్లను చంపి నేను జైలుకెళతాను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుల్లో ఒక వ్యక్తి మతం గురించి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మతమనేది సమస్య కానేకాదని స్పష్టం చేశారు. అడవుల్లో అయినా కాస్త మేలేమో, కానీ ఈ జనారణ్యంలోనే కొందరు మనుషులు అతిభయంకరంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గాలు ఆలోచించాలి కానీ మత, రాజకీయ రంగులు పులిమి తప్పదోవ పట్టించొద్దని కోరారు. ఈ మేరకు ఆమె ఫేస్బుక్లో ఓ వీడియోని పోస్ట్ చేశారు. కాగా.. నిందితులను షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ నుంచి చర్లపల్లి జైలుకు తరలించే క్రమంలో జనం ఆగ్రహంతో ఊగిపోయారు. నిందితులను తమకు అప్పగించాలంటూ నినాదాలు చేసుకుంటూ స్టేషన్లోకి వచ్చేందుకు యత్నించారు. ప్రియాంకారెడ్డి హత్యను న్యాయవాదులు కూడా తీవ్రంగా ఖండించారు. నిందితులకు ఎటువంటి న్యాయసహాయం అందించకూడదని నిర్ణయించుకున్నారు. -
బోనమెత్తిన రాములమ్మ, సింధు, పూనమ్
సాక్షి, హైదరాబాద్ : పాతబస్తీ లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంలో బోనాల జాతర వైభవంగా జరుగుతోంది. తెల్లవారుజామున నుంచే భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సామాన్యులే కాకుండా పలువురు సెలబ్రిటీలు కూడా బోనం సమర్పించేందుకు అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఆదివారం లాల్‌దర్వాజా సింహవాహని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. అమ్మవారికి బోనం సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. అందరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. అమ్మవారి ఆశీస్సుల ఉంటే నేను ఇంకా బాగా ఆడతానని అన్నారు. కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి అమ్మవారికి బోనం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆమె అమ్మవారిని కోరుకున్నారు. ప్రభుత్వం అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని అన్నారు. సినీనటి పూనమ్‌కౌర్ కూడా బోనమెత్తారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారికి బోనం సమర్పించి.. దర్శనం చేసుకున్నారు. -
టీడీపీ నేతల ప్రోద్భలంతోనే ఆ దుష్ప్రచారం?
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి, సినీనటి పూనమ్‌కౌర్‌లపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కోటేశ్వరరావు అలియాస్ కోటి మంగళవారం నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. ఇతడిపై హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసుస్టేషన్లో రెండు కేసులు నమోదై ఉన్నాయి. తనపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో జరిగిన దాడి వెనుక కోటి అనే వ్యక్తి ఉన్నాడని లక్ష్మీపార్వతి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసు దర్యాప్తులో ఉండగానే సినీనటి పూనమ్‌కౌర్ కూడా తనపై గుర్తు తెలియని వ్యక్తులు అభ్యంతకరమైన పోస్టింగ్‌లు పెట్టారంటూ ఫిర్యాదు ఇచ్చారు. ఈ రెండు కేసులను సాంకేతికంగా దర్యాప్తు చేసిన సైబర్‌క్రైమ్ పోలీసులు రెండు కేసుల్లోనూ కోటినే ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తుండగా, లాయర్‌తో కలిసి వచ్చి లొంగిపోతానంటూ కోటి కొన్నాళ్లుగా సైబర్‌క్రైమ్ పోలీసులకు వర్తమానం పంపుతూ వచ్చాడు. హఠాత్తుగా మంగళవారం నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. అతని రాకని పసిగట్టి సైబర్‌క్రైమ్ పోలీసులు కోర్టుకు చేరుకునేలోపే కోటి న్యాయస్థానంలో లొంగిపోయాడు. చదవండి: (దురుద్దేశంతోనే నాపై దుష్ప్రచారం: లక్ష్మీ పార్వతి) ప్రముఖులకు దగ్గరై... ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ నాయకులు సోషల్‌మీడియా కేంద్రంగా వైసీపీ నాయకులపై విషప్రచారం చేశారు. ఇందులో కోటిని కూడా ఉపయోగించారు. టీడీపీ నేతలు ఓ పథకం ప్రకారం వారు టార్గెట్ చేసిన వారి వద్దకు కోటిని పంపిస్తుంటారని సైబర్‌క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. వారి ‘లక్ష్యాల’తో పరిచయం, స్నేహాం ద్వారా తనపై నమ్మకం కలిగేలా ప్రవర్తించి కోటి ఆపై అసలు పని ప్రారంభిస్తాడు. అవకాశం చిక్కినప్పుడల్లా వారి ఫోన్లలో తనకు కావాల్సిన అంశాలు పొందుపరిచే వాడని, లక్ష్మీపార్వతి ఫోన్‌ను కూడా అలాగే ఉపయోగించినట్లు ఆధారాలు లభించాయని పోలీసులు పేర్కొన్నారు. కోటిని అదే విధంగా పూనమ్‌కౌర్ వద్దకు కూడా పంపిన టీడీపీ నాయకులు ఆమెతో ఏపీకి చెందిన ఓ ప్రముఖ నటుడికి వ్యతిరేకంగా మాట్లాడించి, వాటిని యూట్యూబ్‌లో అప్లోడ్ చేసేలా చేశారని భావిస్తున్నారు. ఈ రెండు కేసులకు సంబంధించిన పలు వివరాలను కోటి నుంచి రాబట్టాల్సి ఉండటంతో సైబర్‌క్రైమ్ పోలీసులు అతణ్ణి కస్టడీకి కోరాలని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో కోటి కార్యకలాపాలు, కోటికి, టీడీపీ నాయకులకు ఉన్న సంబంధాల గురించి నిర్థారణ కావాలంటే అతణ్ణి కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాల్సి ఉందని వారు చెప్తున్నారు. చదవండి: సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన పూనమ్ కౌర్ -
పూనం కౌర్ కేసు.. 36 యూట్యూబ్ లింక్‌లు
సాక్షి, సిటీబ్యూరో: తనకు సంబంధించి అభ్యంతకరమైన వీడియోలు యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారంటూ సినీ నటి పూనం కౌర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బుధవారం మరోసారి సైబర్ క్రైమ్ ఠాణాకు వచ్చిన ఆమె వాంగ్మూలంతో పాటు కేసుకు సంబంధించిన వివరాలను అందజేశారు. మంగళవారం పూనం తన ఫిర్యాదుతో పాటు 36 యూట్యూబ్ లింక్‌లు అందించగా... వీటిలో కొన్ని బుధవారానికి డిలీట్ అయినట్లు పోలీసులు గుర్తించారు. వైసీపీ నాయకురాళ్లు వైఎస్ షర్మిళ, నందమూరి లక్ష్మీపార్వతి సైతం ఇప్పటికే తమపై జరుగుతున్న దుష్ఫ్రచారంపై గతంలోనే సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ మూడు కేసుల వెనుకా ఒకరే ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీతో పాటు ఆ పార్టీ నేతలు, వారికి సంబంధించిన వారిపై బురద జల్లేందుకు, దుష్ఫ్రచారం చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో షికారు చేసిన పుకార్లు, అభ్యంతరకరమైన విషయాలను మరోసారి కొత్తగా ఎన్నికలకు ముందు యూట్యూబ్ ద్వారా ప్రచారం చేసినట్లు భావిస్తున్నారు. ఓ సందర్భంలో తన వ్యక్తిగత విషయాలు మాట్లాడుతుండగా వాటిని రికార్డు చేసిన కొందరు యూట్యూబ్‌లో అప్లోడ్ చేసినట్లు పూనం కౌర్ పోలీసులకు తెలిపారు. ఎన్నికల కుయుక్తుల్లో భాగంగా మహిళలపై టీడీపీ శ్రేణులు యూట్యూబ్ వీడియోలను ఎక్కుపెట్టి కించపరిచినట్లు, తద్వారా వారిని మానసికంగా దెబ్బతిసేందుకు ప్రయత్నించినట్లు అనుమానాలు రేగుతున్నాయి. పై మూడు కేసుల్లోనూ దుండగులు దాదాపు ఒకే తరహా విధానం అవలంభించారు. ఈ నేపథ్యంలో వీటి వెనుక ఉన్నది ఒకరేనని సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. షర్మిల కేసులో అరెస్టైన వారికి మిగిలిన రెండు కేసుల్లోనూ అనుమానితులతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సైబర్ క్రైమ్ పోలీసులు మూడు కేసులను అన్ని కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఐపీ అడ్రస్‌లు, లాగిన్ ఐడీలు వంటి సాంకేతిక అంశాలు, ఆధారాల కోసం వేచి చూస్తున్న పోలీసులు అవి వస్తే ఈ మూడు కేసుల్లో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. పూనం కౌర్ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే బాధ్యులను పట్టుకుంటామని సైబర్ క్రైమ్ ఏసీపీ కేసీఎస్ రఘువీర్ బుధవారం మీడియాకు తెలిపారు. -
అసత్యా ప్రచారంపై క్రైమ్ పోలీసులకు పూనమ్ కౌర్ ఫిర్యాదు
-
సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన పూనమ్ కౌర్
సాక్షి, హైదరాబాద్: సినీ నటి పూనమ్ కౌర్ మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తనపై అసత్యా ప్రచారం చేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. వీడియో షేరింగ్ వెబ్సైట్ యూట్యూబ్‌లో కొందరు ఉద్దేశపూర్వకంగా తనపై అసభ్యకరమైన వీడియోలు పోస్టు చేస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో తెలిపారు. తనను కించపరిచేవిధంగా, నా వ్యక్తిత్వాన్ని అవమానించేలా యూట్యూబ్‌లో కొందరు పోస్టులు పెడుతున్నారని, సోషల్ మీడియాలోనూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలా పుకార్లు సృష్టించి.. దుష్ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని నటి పూనమ్ కౌర్ సైబర్ క్రైమ్ పోలీసులను అభ్యర్థించారు. ఈ సందర్బంగా పూనమ్ మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదన్నారు. గత రెండేళ్లుగా తన పేరుతో కొంతమంది యూట్యూబ్‌లో వీడియో లింక్స్ పెడుతూ.. మానసిక వేదనకు గురి చేస్తున్నారని ఆమె తెలిపారు. సుమారు 50 యూట్యూబ్ ఛానల్స్‌పై ఫిర్యాదు చేశానని వెల్లడించారు. ఆన్లైన్లో ఇలా అసత్య ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. -
అవకాశమిస్తానని రమ్మన్నాడు..!
ఇప్పుడంటే హైదరాబాదీ అమ్మాయిలు చాలామంది సినిమాల్లో కనిపిస్తున్నారు. కానీ ఓ పదేళ్ల క్రితం సిటీ అమ్మాయిల కోసం సినిమాల్లో వెతుక్కోవాల్సి వచ్చేది. అలాంటి సమయంలో ఇక్కడ్నుంచి ‘తెర’ంగేట్రం చేసింది పూనమ్ కౌర్. అమీర్‌పేట్‌లో మొదలైన ఈ ‘మిస్ ఆంధ్ర’ పయాణం... ఎన్నెన్నో మలుపులు తిరుగుతూ ఆటంకం లేకుండా సాగుతోంది. అనూహ్యంగా ఇటీవల కొన్ని వివాదాల్లోనూ ఆమె పేరు వినిపించింది. ఏదేమైనప్పటికీ పరిస్థితులకు తలవంచక ప్రయాణం కొనసాగిస్తోందీ హైదరాబాదీ. ఈ నేపథ్యంలో ‘జగన్ జీత్ కౌర్’ అలియాస్ పూనమ్ కౌర్ ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలివీ... హిమాయత్‌నగర్: నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను. స్కూల్, కాలేజీ అంతా ఇక్కడే. హైటెక్‌సిటీ, ట్యాంక్‌బండ్, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, చిలుకూరి బాలజీ టెంపుల్ అంటే అమితమైన ఇష్టం. స్కూల్లో అల్లరి చేయడంలో, కళాశాలలో ర్యాగింగ్‌లో మనమే టాప్. అమ్మ ముద్దుగా ‘అత్త’ అని పిలిస్తే, అన్నయ్య ఆప్యాయంగా ‘బచ్చీ, చోటీ’ అంటే.. ఫ్రెండ్స్ ‘పీకే (పూనమ్ కౌర్)’ అని పిలుస్తారు. అలా ఐ లవ్ యూ అమీర్‌పేట్‌లోని విద్యోదయ స్కూల్లో చదువుకున్నాను. ఎనిమిదో తరగతిలో ఉండగా నిన్ను చాలామంది లవ్ చేస్తున్నారే అని ఫ్రెండ్స్ చెప్పేవారు. ఓ రోజు సరదాగా లవ్ చేసేవాళ్లు నాతో చెప్పాలి. కానీ మీకు చెప్పడమేంటి? అన్నాను. అంతే మరుసటి రోజు ఓ అబ్బాయి ఇంటర్వేల్ సమయంలో క్లాస్‌రూమ్‌లో మోకాలిపై నిలబడి గులాబీతో ‘ఐలవ్యూ పూనమ్’ అని ప్రపోజ్ చేశాడు. పెద్దగా నవ్వి.. రోజ్, లెటర్ తీసుకొని వెళ్లిపోయా. నాకు వచ్చిన ప్రపోజల్స్‌లో ఇదే స్వీట్ ప్రపోజ్. చదువులో యావరేజ్ స్టూడెంట్‌ని. చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే భయం. విల్లామేరీ కాలేజీలో ఫస్ట్ ఎంపీసీ తీసుకున్నప్పటికీ.. ఆ భయంతోనే సీఈసీకి షిఫ్ట్ అయ్యాను. కాలేజీకి బంక్ కొట్టి ఫ్రెండ్స్ ఇంట్లో సినిమాలు చూసేవాళ్లం. ఖాళీ సమయంలో పుస్తకాలు చదువుతాను. బాగా నచ్చిన బుక్ ‘సోల్ పవర్’. అమ్మ త్యాగం మరువలేనిది.. అమ్మమ్మది నిజామాబాద్ జిల్లా బోధన్. నాన్న నాకు నాలుగేళ్ల వయస్సు ఉండగా మరణించారు. అప్పుడు అమ్మ వయస్సు 26. అప్పటికే నేను అన్నయ్య, చెల్లి. మాకోసం అమ్మ తన జీవితాన్ని త్యాగం చేసింది. మమ్మల్ని పెంచడానికి తనెంతో కష్టపడింది. పండుగ సెలవులకు మమ్మల్ని బోధన్ తీసుకెళ్లేది. మా అమ్మమ్మ వాళ్లు జమీందార్లు. అక్కడి పచ్చని పొలాలంటే నాకు చాలా ఇష్టం. నాకు చాలా భక్తి. మా నానమ్మ ప్రతిరోజు 4గంటలకే నిద్ర లేపి, పూజ చేయించేది. అదే నాకు అలవాటైపోయింది. వీలైనప్పుడు చిలుకూరి బాలాజీ టెంపుల్‌కి వెళ్తుంటాను. అవకాశమిస్తానని రమ్మన్నాడు.. కొన్నేళ్ల క్రితం ఓ పెద్ద నిర్మాత మా ఇంటికొచ్చాడు. ‘నువ్వు చాలా బాగా నటిస్తావ్. నీకు పెద్ద హీరోల సరసన చాన్స్ ఇప్పిస్తాను. ఒకసారి నన్ను కలువు’ అని చెప్పాడు. వారం తర్వాత అమ్మను తీసుకొని ఆయన దగ్గరకు వెళ్లాను. అమ్మను వెంట తీసుకెళ్లానని కనీసం సరిగ్గా మాట్లాడనూ లేదు. ఇప్పటి వరకు ఒక్క సినిమాలో అవకాశమూ ఇవ్వలేదు. టాలీవుడ్లో చాలామంది హీరోయిన్స్ సక్సెస్ అయ్యారు. అయితే అందరూ పైకి సంతోషంగా ఉన్నా... లోలోపల ఎంతో సఫర్ అవుతుంటారు. హీరోల విషయంలో అదేం ఉండదు. పెళ్లి సమయానికి వారు మ్యారేజ్ చేసేసుకుంటారు. కానీ హీరోయిన్స్ అలా కాదు. జీవితాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. అదో గుణపాఠం.. సమాజంలో ఏదైనా అన్యాయం జరిగితే ప్రశ్నించాలని అనిపిస్తుంది కదా... ఆ ఆలోచనతోనే ట్వీటర్లో ఓ పోస్ట్ చేశాను. అంతే.. నాపై ఒక్కసారిగా మూకుమ్ముడి దాడి జరిగింది. నేనేం ఫేమస్ అయ్యేందుకు ఆ ట్వీట్ చేయలేదు. మహిళా సాధికారత గురించి మహిళలు, మహిళా సంఘాలు ఎవరూ ఆ సమయంలో నాకు అండగా నిలవలేదు. నా కుటుంబమే నావెంట ఉంది. ఆ తర్వాత అర్థమైంది... సమాజంలోని ఎంతో మంది స్వలాభం కోసం మనలాంటి వాళ్లను వాడుకుంటారని. వాళ్లు ఫేమస్ అయ్యేందుకు మరో వృత్తిలోని వారిని రోడ్డుకు ఈడ్చుతారని. ఏదేమైనా ఇక అలాంటి అనవసర వివాదాలు వద్దనుకున్నాను. అందుకే ట్వీటర్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేశాను. ఫటాఫట్ ► ఇష్టమైన హీరోలు షారూక్‌ఖాన్, చిరంజీవి. హీరోయిన్లు అనుష్క శెట్టి, అనుష్కశర్మ, శ్రీదేవి, సౌందర్య. ► నచ్చిన పెర్ఫ్యూమ్ డేవిడ్ ఆఫ్ కూల్ వాటర్స్, బుర్బెర్రీ. ► జ్యూవెలరీ అంటే ఇష్టం. ఫంక్షన్లకు హ్యాండ్‌మేడ్ జ్యూవెలరీ ధరిస్తాను. ► నేను పెద్ద ఫుడీని. కానీ వంట అస్సలు రాదు. హైదరాబాదీ బిర్యానీ, ఖుర్బానీ కా మీఠా మై ఫేవరేట్. ► ఐస్‌క్రీమ్స్ ఇష్టం.. చాక్లెట్స్కి దూరం. ► ఫ్రెండ్స్‌తో లాంగ్‌డ్రైవ్‌కి వెళ్తుంటాను. ► చిన్నప్పుడు నేను బొద్దుగా ఉండేదాన్ని. బుగ్గలు చాలా పెద్దగా ఉండేవి. అందరూ ‘బుల్డాగ్’ అంటూ బుగ్గలు నొక్కేవాళ్లు. ► రంజాన్ సమయంలో చుడీబజార్ వెళ్తుంటాను. చార్మినర్ దగ్గర సందడి ఆస్వాదిస్తాను. ► హైదరాబాద్ తర్వాత నచ్చే సిటీ లండన్. ► చిన్నప్పటి ఫ్రెండ్స్ నీలిమా, రాజేష్‌లతో నా కష్టసుఖాలు పంచుకుంటాను. ► వీలు కుదిరినప్పుడల్లా ఫ్రెండ్స్‌తో బ్యాడ్మింటన్ ఆడుతుంటాను. ► హ్యాండ్లూమ్ శారీస్ ఎక్కువగా ధరిస్తాను. -
ఆ దర్శకుడు నమ్మక ద్రోహి: పూనమ్ కౌర్
సాక్షి, సినిమా : టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ గురువారం ట్విటర్లో పెట్టిన పోస్టులు చర్చనీయాంశమయ్యాయి. రెండు సినిమా పేర్లను వాడుతూ పూనమ్ 'జల్సాలు చూపిస్తూ అజ్ఞాతవాసంలో ఏసేస్తాడు జాగ్రత్త .. నమ్మకద్రోహి' అంటూ ట్వీట్ చేశారు. ఆ రెండు సినిమా పేర్లతో దర్శకుని పేరు చెప్పకుండా.. నమ్మకద్రోహి అంటూ ఆయన పేరు చెప్పకనే చెప్పారంటూ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా ‘ఆ దర్శకుడు కేవలం ఆ నాలుగు కుటుంబాలకు దగ్గరగా ఉంటారని, ఎన్నారై హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వడం ఆ దర్శకుడికి అలవాటని, నాకు హిట్లు లేవనే ఓ ఎన్నారై హీరోయిన్‌కు అవకాశం ఇచ్చాడని, మరి ఆ ఎన్నారై హీరోయిన్‌కు హిట్లు ఉన్నాయా? ఎన్నారై హీరోయిన్లు మీరు చెప్పిన పనులు బాగా చేస్తారని విన్నాను’ అంటూ పూనమ్ మరో ట్వీట్ చేశారు. అలాగే మంచికి విలువ ఇస్తే.. చెడు జరిగేది కాదు.. గాడ్ బ్లెస్ యూ ఆల్.. అంటూ పూనమ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లు సినీ ఇండస్ట్రీ, సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాయి. గతంలో ఒక సినీ దర్శకుడు తనను తరచూ అవమానపరుస్తున్నాడని పూనమ్ కౌర్ ట్వీట్ చేసి.. ఆ దర్శకుడికి ఎక్కువ చిత్రాలేమీ లేవని, అయినా ఇతరుల జీవితాలతో ఆడుకుంటూనే ఉన్నాడని ఆరోపించిన విషయం తెలిసిందే. Jalsalu choopistu agnyathavaasam lo esestadu ...Jaggeratha #namakadrohi — Poonam Kaur Lal (@poonamkaurlal) May 24, 2018 The director yet extends his support to thru all his 4 families support to this so called NRI heroine ( he has tendendancy to fall for this particular slang for years ) so I did not have a hit ...so did she ??#justasking ...good at quite a few jobs u give #justheard #hypocrisy — Poonam Kaur Lal (@poonamkaurlal) May 24, 2018 ''Manchi ni Viluva istey.... chedu occhedi kadu.....'' #omnamahshivaya ......god bless u all .... — Poonam Kaur Lal (@poonamkaurlal) May 24, 2018 -
ఆయన మా జీవితాలతో ఆడుకుంటున్నాడు!
చెన్నై: ఆ దర్శకుడు హీరోయిన్ల జీవితాలతో ఆడుకుంటున్నాడని పూనం కౌర్ సంచలన ఆరోపణలు గుప్పించారు. నెంజిరుక్కువరై చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ ఆ తరువాత ఉన్నైపోల్ ఒరువన్, పయనం, వెడి, 6 మిలగువత్తిగల్, ఎన్ వళి తనీ వళి చిత్రాల్లో నటించారు. హీరోయిన్గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోలేకపోయినా, ఇటీవల వివాదాంశ సంఘటనలతో బాగానే పాపులర్ అయ్యారు. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో పెద్దగా అవకాశాలు లేకపోయినా ఒక హిందీ చిత్రంలో నటించారు. నటుడు పవన్ కల్యాణ్‌కు సన్నిహితం అనే ప్రచారం ఇటీవల జోరందుకుంది. తాజాగా ఒక సినీ దర్శకుడు తనను తరచూ అవమానపరుస్తున్నాడని పూనంకౌర్ తన ట్వటర్లో పేర్కొన్నారు. ఆ దర్శకుడికి అధిక చిత్రాలేమీ లేవని, అయినా ఇతరుల జీవితాలతో ఆడుకుంటూనే ఉన్నాడని ఆరోపించారు. తన వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకుంటున్నాడని, తన గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడని అన్నారు. ఆ విషయాల గురించి ఆయన్ని నేరుగా ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని ఏమీ తెలియనట్లు బదులిచ్చాడన్నారు. తనకు కావలసిన వారే సినిమాలో ఉండాలని భావిస్తున్నాడని అన్నారు. అతని గురించిన బయటకు చెప్పరాని పలు విషయాలు తన వద్ద ఆధారాలు సహా ఉన్నాయని చెప్పింది. అతనికి కావలసిన నటీమణులు నటించిన చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నా, వారికే అవకాశాలు ఇస్తున్నాడని తెలిపారు. ఇతరుల మనోభావాలను ఖూనీ చేస్తున్నాడని ఆరోపించారు. అయితే అతని చర్యలే త్వరలో తగిన శిక్ష విధిస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ దర్శకుడెవరన్నది మాత్రం పూనం కౌర్ బయట పెట్టలేదన్నది గమనార్హం. -
పూనం కౌర్ అనూహ్య పోస్టు.. వైరల్!
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ టాలీవుడ్ నటి పూనం కౌర్ గురువారం ఫేస్బుక్లో పెట్టిన ఓ పోస్టు చర్చనీయాంశమైంది. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ బుధవారం తన పార్టీ ఆవిర్భావ సభలో అనూహ్యంగా టీడీపీపై విరుచుకుపడటం, చంద్రబాబు, లోకేశ్ అవినీతిపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో పూనం కౌర్ పరోక్షంగా నర్మగర్భంగా చేసిన ఈ పోస్టు వైరల్‌గా మారింది. ఇంతకు ఆమె సూటిగా ఎవరినీ ఉద్దేశించి ఈ పోస్టు పెట్టిందనే విషయం తెలియదు. కానీ, గతంలో సినీ విమర్శకుడు కత్తి మహేశ్.. పూనం కౌర్‌ను పవన్ కల్యాణ్ గర్ల్‌ఫ్రెండ్ అని అభివర్ణించడం, వారి వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు బయటపెడతాననని హెచ్చరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్‌ను ఉద్దేశించి ఆమె ఈ పోస్టు పెట్టారా? లేక ఎవరినైనా పరోక్షంగా టార్గెట్ చేశారా? అన్నది సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇంతకు ఆమె ఏం పేర్కొన్నారంటే.. ‘కాన్సెప్టులు కాపీ చేసి.. డైలాగులు కాపీ చేసి.. బట్టలు మార్చుకుంటూ.. మనుషులను మారుస్తూ.. మాట మీద ఉండకపోవడం.. జనాల ఇన్నోసెన్స్ (అమాయకత్వం)తో ఆడుకుంటూ.. వేషాభాషలు మారుస్తూ.. జనాలను మభ్యపెట్టి.. అమ్మాయిలను అడ్డంపెట్టుకుంటూ.. రాజకీయాలు చేస్తున్నారు కొంతమంది. ఆ భగవంతుడే నిజం ఏంటో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని పూనం కౌర్ ఫేస్‌బుక్‌లోని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. కాన్సెప్టులు, డైలాగులు కాపీ చేస్తూ.. వేషాభాషాలు మారుస్తూ.. జనాల అమాయకత్వంతో ఆడుకుంటూ.. అమ్మాయిలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తుంది ఎవరు? ఇలా ప్రజల్ని మభ్యపెడుతుంది ఎవరు? అన్నది సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ విషయంలో నెటిజన్లు భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన గురుగోవింద్ సింగ్ జయంతి ఉత్సవం సందర్భంగా తాను అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయాన్ని దర్శించుకున్నటు ఇతర పోస్టుల్లో పూనం కౌర్ తెలిపారు. ‘ప్రతీ పనికి ఎదో కారణం వెతుకుతుంది ఈ కాలం. మనిషి జన్మకొక కారణం.. మనిషి మరణానికి మరో కారణం.. మనసుల కలయిక ఒక కారణం. ఎడబాటుకి ఇంకో కారణం. కానీ ఎప్పుడూ ఒంటరితనమే తన బహుమానం. నిరాశా నిస్పృహలు రాగాలు ఆలపిస్తుంటే మహిళ తన గుండెల్లో పెల్లుబికే దుఖాన్ని తన గొంతులోనే సవరించుకుంటూ తనను తానూ నిందించుకుంటూ ఈ లోకంలో కాలం వెళ్లదీస్తుంది. కానీ ఇప్పుడా రోజులు పోయాయి. అన్యాయం చేసినప్పుడు అక్రమం జరిగినప్పుడు గురుగోవింద్ సింగ్ లాంటి అవతారపురుషులు దానిని చీల్చి చెండాడడానికి సత్యాన్ని కాపాడడానికి ఈ లోకంలో అవతరిస్తారు... మళ్లీ మళ్లీ అవతరిస్తూనే ఉంటారు. ఒక స్ఫురణ లో ఒక ఎరుకలో ఒక జ్ఞాపకంలో మళ్లీ మళ్లీ పుడుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నా’అని ఆమె మరో పోస్టులో తెలిపారు. -
డబ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు
సాక్షి, సినిమా : తాజాగా నటి పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ ఒకటి చర్చనీయాంశంగా మారింది. "డబ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు... మీ అస్తిత్వం ఏంటి? అవసరాల కోసం మారిపోయిన నిజాయతీ... నీ గుణం ఏంటి?" అని ట్విటర్ వేదికగా ఆమె ప్రశ్న సంధించింది. ఎవరిని ఉద్దేశించి చేసిందో తెలీదుగానీ ఇప్పుడిది హాట్ టాపిక్ అయ్యింది. పబ్లిసిటీ కోసం ట్వీట్లు చేస్తున్నావా? అంటూ పలువురు ఆమెపై మండిపడుతున్నారు. ఇటీవలి కాలంలో కత్తి మహేష్, పవన్ అభిమానుల మధ్య జరిగిన మాటల యుద్ధంలో పూనమ్ కౌర్ చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పూనమ్ ట్వీట్‌పై దుమారం రేగుతోంది. అయితే ఈ ట్వీట్ ఎవరినీ ఉద్దేశించింది కాదని.. డబ్బు కోసం ఓ తండ్రి కూతురిని అమ్ముకుంటే.. ఆమె ఆవేదనను తాను ట్వీట్ చేశాను అంటూ పూనమ్ వివరణ ఇచ్చుకుంది. పవన్ ఫ్యాన్స్ వార్నింగ్... ‘డబ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు’ అంటూ నటి పూనమ్ చేసిన కామెంట్‌పై పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలు తమ హీరోను ఉద్దేశించినవేనని భావిస్తూ... ఆమెపై నిప్పులు చెరుగుతున్నారు. సినిమాల గురించి ట్వీట్లు వేసుకుంటే బాగుంటుంది. నాటకాలు చేస్తే తగిన శాస్తి చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరికొందరు పూనమ్ కూడా టీవీ చానల్స్ చర్చా కార్యాక్రమాలకు వెళ్లాలని కొందరు సెటైర్లు వేస్తున్నారు. Dabbul kosam maripoina siddantalu..me astitvam Enti ?avasarlu kosam maripoina nijayati ni gunam Enti ??? #justathought — Poonam Kaur Lal (@poonamkaurlal) 27 January 2018 -
పూనమ్ ‘పీకే లవ్’ ట్వీట్
సాక్షి, హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ అభిమానులు, కత్తి మహేష్ మధ్య జరిగిన హాట్ వార్‌లో తలదూర్చి కత్తి క్లాస్‌లతో సైడైపోయిన నటి పూనం కౌర్ మళ్లీ సంచలన ట్వీట్‌తో ముందుకొచ్చారు. కత్తి వ్యవహారం సద్దుమణిగిన క్రమంలో పూనం తాజా ట్వీట్లు ఎటు దారితీస్తాయోననే ఆందోళన నెలకొంది. పవన్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ విమర్శకులకు చురకలు అంటించేలా ఆమె చేసిన ట్వీట్‌పై ఆసక్తికర చర్చ సాగుతోంది. ‘పవిత్రంగా ఉండాలనే ఆలోచన ఓ శక్తి..అది దైవత్వం కన్నా గొప్పది..అదే పీకే ప్రేమే. ఇంకా తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా..? నన్ను విభేదిస్తూ ఎవరైనా ముందుకొస్తారా..? ‘అంటూ పూనం ట్వీట్ చేశారు.అయితే ఆమె ట్వీట్‌కు పవన్ అభిమానులు ఖుషీ అవుతుంటే..జరిగిన రచ్చ చాలు..మళ్లీ కెలకొద్దు అనే కామెంట్లూ పడుతున్నాయి. -
పవన్ గారూ హెల్ప్ మీ : పూనం కౌర్
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్‌లోనేకాక రాజకీయంగానూ దుమారం రేపుతోన్న ‘మహేశ్ కత్తి- పవన్ ఫ్యాన్స్’ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో అనుబంధం నేపథ్యంగా మహేశ్ కత్తి సంధించిన ప్రశ్నలపై నటి పూనమ్ కౌర్ స్పందించారు. వివాదం నుంచి తనను బయటపడేయాల్సిందిగా పవన్‌ను సహాయం కోరారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం పూనమ్ తన అధికారిక ఖాతాలో వరుస ట్వీట్లు చేశారు. కానీ.. నిమిషాల వ్యవధిలోనే ఆ ట్వీట్లను డిలిట్ చేసేశారు. అయితే ఆ వ్యవధిలోనే పూనమ్ ట్వీట్లు వైరల్ అయ్యాయి. స్క్రీన్ షాట్ల రూపంలోని ట్వీట్లు విపరీతంగా షేర్ అవుతున్నాయి. పవన్.. హెల్ప్ మీ : ‘‘పవన్ కల్యాణ్ గారూ.. ఈ విపత్కర పరిస్థితితో నాకు సహాయం చేయాల్సిందిగా మిమ్మల్ని అర్థిస్తున్నాను. ఎందుకంటే ఇది నా కుటుంబానికి, కెరీర్‌కు, మరీ ముఖ్యంగా నా ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. రహస్య అజెండాతో పనిచేస్తోన్న ఎవరో కొందరికి నేను పొలిటికల్ టార్గెట్ కాదల్చుకోలేదు. ఇదే విషయమై మిమ్మల్ని స్వయంగా కలిసి, మాట్లాడాలనుకుంటున్నాను’’ అని పూనమ్ ట్వీట్లలో రాసుకొచ్చారు. పవన్‌ను ఉద్దేశించిన ట్వీట్లను నిమిషాల వ్యవధిలోనే డిలిట్ చేసేయడం గమనార్హం. పూనమ్ కౌర్ ట్వీట్స్(డెస్క్‌టాప్ స్క్రీన్ షాట్) కత్తి ప్రశ్నలు : ఆదివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో కత్తి మహేశ్ విలేకరులతో మాట్లాడుతూ.. వివాదాల విషయంలో తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని, పవన్ అభిమానులే ఉన్మాదులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తన వెనక ఏ రాజకీయ పార్టీ, మీడియా లేదని, డబ్బు కోసం ఇదంతా చేస్తున్నాననే ఆరోపణలు అవాస్తవమన్నారు. నటి పూనమ్‌కౌర్ చేసిన వ్యాఖ్యలకు తాను ఆరు ప్రశ్నలు సంధిస్తున్నానన్నారు. పూనమ్‌కౌర్‌కు కత్తి మహేష్ సంధించిన ప్రశ్నలివే.. 1. చేనేత బ్రాండ్ అంబాసిడర్ హోదా పూనమ్‌కౌర్‌కు ఎలా లభించింది? 2. తిరుమలలో పవన్ గోత్రం పేరుతో పూజ చేసింది నిజం కాదా? 3. పవన్ మోసం చేశాడని ఆత్మహత్యాయత్నం చేసింది నిజం కాదా? ఆస్పత్రి బిల్లు ఎవరు కట్టారు? 4. పూనమ్ తల్లిని కలిసిన పవన్ చెవిలో ఏం చెప్పాడు? ఏం ప్రామిస్ చేశారు? 5. దర్శకుడు త్రివిక్రమ్ అంటే ఎందుకు కోపం? 6. క్షుద్ర మాంత్రికుడు నర్సింగ్‌తో క్షుద్ర పూజలు ఎందుకు చేశారు? -
మహేశ్ ప్రెస్‌మీట్‌కు పవన్ ఫ్యాన్స్.. టెన్షన్
సాక్షి, హైదరాబాద్ : సినీ విమర్శకుడు మహేశ్ కత్తి, పవన్‌కళ్యాణ్ అభిమానుల మధ్య కొన్నాళ్లుగా కొనసాగుతున్న సోషల్ మీడియా వార్ మరింత వేడెక్కింది. తనతో చర్చించేందుకు పవన్ కళ్యాణ్, పూనం కౌర్, అభిమానులు ఎవరైనా ప్రెస్ క్లబ్‌కు రావాలని ఆయన సవాల్ విసిరిన విషయం తెలిసిందే. అన్నట్లుగానే మహేశ్ కత్తి ఆదివారం ఉదయం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు వచ్చారు. పవన్ అభిమానులు సైతం రావడంతో ఇక్కడ స్పల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముందస్తుగానే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పవన్ అభిమానులను ప్రెస్‌క్లబ్‌లో అనుమతించకుండా అడ్డుకున్నారు. తన సవాల్‌ను ఎవరూ స్వీకరించకపోవడంతో మీడియాతో మాట్లాడుతూ.. ఆరు ప్రశ్నలు సంధించారు. నా తల్లి, భార్యను తిడితే ఊరుకోవాలా..? రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదని, తాను పది ప్రశ్నలు వేస్తే, ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేని పవన్ కళ్యాణ్, ఆయన అభిమానులు తన తల్లిని, భార్యను నోటితో చెప్పలేని విధంగా బూతులు తిడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. పవన్ లేదా పూనం కౌర్ ను చర్చించేందుకు రమ్మని ఆహ్వానం పంపించానని, కానీ వారు రాలేదని అన్నాడు. తనను సామాజిక బహిష్కరణ చేయాలని కోన వెంకట్ చేసిన డిమాండును ప్రస్తావిస్తూ, ఓ దళితుడిగా తాను ఎన్నోసార్లు సామాజిక బహిష్కరణను చూశానన్నారు. సినీ ఇండస్ట్రీ నుంచి కూడా బహిష్కరించారని ఆరోపించారు. రేణుదేశాయ్ విషయంలో ఏం చేయని పవన్.. రేణుదేశాయ్ తన రెండో వివాహం గురించి ఒక్క మాట ప్రస్తావిస్తే, పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోయారని, ఆమె పెళ్లి చేసుకున్న వ్యక్తిని చంపేస్తామని హెచ్చరించారని గుర్తు చేసిన కత్తి.. కనీసం ఆ వ్యాఖ్యలను సైతం పవన్ ఖండించలేదని, ఇక ఆయన ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. ప్రశ్నిస్తానని, ప్రజలకు అండగా ఉంటానని చెప్పే పవన్.. తన అభిమానులను ఎంతమాత్రమూ కంట్రోల్ చేయలేకపోతున్నారని విమర్శించారు. తాను ఓ మామూలు మనిషినని, తనపై అభిమానులు చేస్తున్న విమర్శలను, దాడిని, ఒక్క మాట చెప్పి పవన్ అడ్డుకోలేక పోతున్నారని ఆరోపించారు. తాను ఎన్నడూ పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేయలేదని, రాజకీయ వ్యాఖ్యలు మాత్రమే చేశానని, వాటికి సమాధానం చెప్పలేని ఆయన, రాష్ట్రానికి ఏం మేలు చేస్తారని ప్రశ్నించారు. తన ప్రాణాలకు అపాయం ఉందని, దీంతోనే ఈ వివాదానికి పుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తే, తనతో చర్చించేందుకు ఎవరూ రాలేదని ఆయన వాపోయారు. పూనం కౌర్‌కు ప్రశ్నల వర్షం.. ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ పదవి ఎలా వచ్చిందన్న కత్తి.. పవన్ మోసం చేశాడన్న భావనతో మీరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే మిమ్మల్ని కాపాడిందేవరు? మీ ఆసుపత్రి బిల్ కట్టిందేవరని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ మీ అమ్మను కలిసి ఏం ప్రామిస్ చేశారు? అది నెరవేర్చారా, లేదా? డైరెక్టర్ త్రివిక్రమ్ అంటే మీకు ఎందుకంత కోపం? ఓ క్షుద్రమాంత్రికుడితో కలసి త్రివిక్రమ్ పూజలు చేస్తుంటే, అక్కడ మీరు ఏం చేశారు? ఈ ప్రశ్నలకు పూనం కౌర్ సమాధానం చెప్పాలని మహేష్ డిమాండ్ చేశారు. తాను సంధించిన ప్రశ్నలకు సంబంధించి అన్ని ఆధారాలూ తన వద్ద ఉన్నాయని చెప్పారు. -
పూనమ్ కౌర్‌కు కత్తి వార్నింగ్
సాక్షి, హైదరాబాద్ : పవన్ కళ్యాణ్‌పై కొందరు నోరు పారేసుకుంటున్నారని పరోక్షంగా కత్తి మహేష్‌పై కత్తిగట్టిన హీరోయిన్ పూనమ్ కౌర్‌కు మహేష్ కత్తి కౌంటర్ ఇచ్చారు. తనపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డ పూనం తీరును ఆయన ఎండగట్టారు. పవన్ ప్రాపకంతో ఏపీలో చేనేత బ్రాండ్ అంబాసిడర్ పదవి సంపాదించి ఆయన మెప్పు కోసం తనపై ప్రేలాపనలు చేస్తున్నావని మండిపడ్డారు. పూనమ్‌పై కత్తి ఎలా చెలరేగారంటే...‘పవన్ కళ్యాణ్ రికమండేషన్ తో ఆంద్రప్రదేశ్ చేనేతవస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యావు. ఉద్యోగం,సద్యోగం, సినిమాలు లేకుండా తిరిగింది నువ్వు. కాబట్టి నీ లాయల్టీ నిరూపించుకోవడానికి నన్ను "ఫ్యాట్సు" అని పిలిస్తే, నేను నిన్ను చాలా పిలవగలను. కానీ అది నా సంస్కారం కాదు. అడుక్కుని సంపాదించుకున్న పదవి మీద బ్రతుకుతున్న నువ్వా నాకు భిక్ష వేసేది? మాటలు జాగ్రత్తగా రాని. నేను నోరు తెరిస్తే నువ్వు, నీ పవన్ కళ్యాణ్ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో ఆలోచించుకొండి’ అంటూ కౌంటర్ ఇచ్చారు. -
ఒబామాకు నటి ప్రత్యేక కానుక
భారత దేశ పర్యటనలో ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు నటి పూనమ్ కౌర్ ప్రత్యేక కానుక ఇచ్చారు. పర్యటనలో భాగంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇదే కార్యక్రమానికి వెళ్లిన పూనమ్, ఒబామాను కలిశారు. ఈ సందర్భంగా పూనమ్ చేనేత వస్త్రాలను ఒబామాకు బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను పూనమ్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. తన జీవితంలో మర్చిపోలేని సంఘటన అని.. తాను ఆదర్శంగా భావించే వ్యక్తి బరాక్ ఒబామా అని తెలిపింది. ఆయనకు చేనేత వస్త్రాలు కానుకగా ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. కాగా పూనమ్ కౌర్‌ను ఆంధ్రప్రదేశ్ చేనేత ప్రచార కర్తగా నియమించినట్టు ఇటీంల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. -
అనంతలో సినీతార పూనమ్‌కౌర్ సందడి
-
చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా పూనమ్
-
పీతతో పూనంకౌర్ స్నేహం..!
తమిళసినిమా: సముద్ర పీతతో నటి పూనంకౌర్ స్నేహానికి రెడీ అవుతోంది. ఏమిటీ అర్థం కాలేదా? చాలా గ్యాప్ తరువాత జిత్తన్ రమేశ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం నండు ఎన్ నన్బన్. ఇందులో నటి పూనంకౌర్ నాయకిగా నటించనుంది. పీత(నండు)కు హీరోయన్ పూనంకౌర్‌కు మధ్య స్నేహమే నండు ఎన్ నన్భన్ చిత్ర ప్రధాన ఇతివృత్తం అంటున్నారు చిత్ర దర్శకుడు ఆండాళ్ రమేశ్. ఎస్.నాగరాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతానభారతి, మనోహర్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. సెవిలోరాజా ఛాయాగ్రహణం, ఎస్ఎన్.అరుణగిరి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం శుక్రవారం ఉదయం స్థానిక వడపళనిలోని ఏవీఎం స్టూడియోలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. అభిరావిన్ రామనాథన్, జాగ్వర్‌తంగం సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. -
మళ్లీ హీరోగా..
తమిళసినిమా: నటుడు జిత్తన్ రమేశ్ చాలా గ్యాప్ తరువాత హీరోగా రీఎంట్రీ అవుతున్నారు. జిత్తన్ వంటి పలు చిత్రాల్లో నటించిన ఈయన కొన్ని చిత్రాలు వరుసగా నిరాశపరచడంతో నటనకు దూరమై తన తండ్రి ఆర్బీ.చౌదరి నిర్మిస్తున్న చిత్రాల నిర్వహణ బాధ్యతలను చేపట్టారు. తాజాగా నండు ఎన్ నన్భన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఈయనకు జంటగా నెంజిరుక్కువరై, పయనం చిత్రాల ఫేమ్ పూనంకౌర్ నాయకిగా నటిస్తున్నారు. ఈ అమ్మడు చాలా గ్యాప్ తరువాత నటిస్తున్న తమిళ చిత్రం ఇదే అవుతుంది. అసామి, ఇన్నారుక్కు ఇనారెండ్రు చిత్రాల ఫేమ్ ఆండాళ్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఇది. సంతానభారతి, ఆర్ఎన్ఆర్.మనోహర్, చాందిని ముఖ్య పాత్రలు పోషిస్తున్న దీనికి ఎస్ఎన్.అరుళ్‌గిరి సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఒక యువతికి, పీతకు మధ్య స్నేహం ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్న చిత్రం నండు ఎన్ నన్భన్ అని చెప్పారు. తరచూ సముద్ర తీరానికి వెళ్లే కథానాయకికి అక్కడ ఒక పీత ఫ్రెండ్ అవుతుందన్నారు.అలాంటి పరిస్థితిలో హీరోయిన్ ప్రేమికుడు కనిపించకుండా పోతాడని, ఆ విషయాన్ని తన ఫ్రెండ్ పీతకు తెలియజేయగా అది ఆమె ప్రేమికుడిని కనుగొనడానికి ఎలా సహకరించిదన్నది ఆసక్తికరంగా ఉంటుందన్నారు. పీతతో హీరోయిన్ స్నేహం ఏమిటనే సందేహం కలగవచ్చునని, నాన్ఈ చిత్రంలో ఒక పెద్ద విలన్‌పై చిన్న ఈగ ఎలా ప్రతీకారం తీర్చుకుందో ఇదీ అంతేనన్నారు. ఈ చిత్రం ద్వారా చిన్న సందేశాన్ని కూడా చెప్పనున్నట్లు దర్శకుడు తెలిపారు. -
చాలాకాలం తర్వాత హీరో రీఎంట్రీ
చెన్నై: నటుడు జిత్తన్ రమేశ్ చాలాకాలం తరువాత హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. జిత్తన్ వంటి పలు చిత్రాల్లో నటించిన ఈయన కొన్ని చిత్రాలు వరుసగా నిరాశపరచడంతో నటనకు దూరమై తన తండ్రి ఆర్.బి.చౌదరి నిర్మిస్తున్న చిత్రాల నిర్వహణ బాధ్యతలను చేపట్టారు. తాజాగా నండు ఎన్ నన్భన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఈయనకు జంటగా నెంజిరుక్కువరై, పయనం చిత్రాల ఫేమ్ పూనంకౌర్ నాయకిగా నటిస్తున్నారు. చాలా గ్యాప్ తరువాత ఆమె నటిస్తున్న తమిళ చిత్రం ఇదే. అసామి, ఇన్నారుక్కు ఇనారెండ్రు చిత్రాల ఫేమ్ ఆండాళ్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. సంతానభారతి, ఆర్ఎన్ఆర్ మనోహర్, చాందిని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎన్ అరుళ్‌గిరి సంగీతాన్ని అందిస్తున్నారు. దర్శకుడు ఆండాళ్ రమేశ్ మాట్లాడుతూ.. 'ఒక యువతికి, పీతకు మధ్య స్నేహం ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. తరచూ సముద్ర తీరానికి వెళ్లే హీరోయిన్‌కి అక్కడ ఒక పీత ఫ్రెండ్ అవుతుంది. కనిపించకుండా పోయిన తన ప్రియుడి విషయాన్ని పీతకు చెబుతోంది. ఆమె ప్రేమికుడిని కనుగొనడానికి ఆ పీత ఎలా సహకరించిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది. పీతతో హీరోయిన్ స్నేహం ఏమిటనే సందేహం కలగవచ్చు. నాన్ఈ (తెలుగులో నాని) చిత్రంలో ఒక పెద్ద విలన్‌పై చిన్న ఈగ ఎలా ప్రతీకారం తీర్చుకుందో ఇదీ అంతేనని' చెప్పారు. -
విశాఖతో ప్రేమలో పడ్డా..!
ఈ నగరాన్ని మొదటిసారి చూసినప్పుడే ముచ్చటపడ్డా.. దానితో ప్రేమలో పడిపోయానని సినీ నటి పూనం కౌర్ అన్నారు. అందుకే వేసవిని గడపడానికి నాలుగు రోజులుగా ఇక్కడే మకాం వేశానని చెప్పుకొచ్చారు. వినాయకుడు, గగనం, ఆడు మగాడ్రా బుజ్జి, పొగ, నాయకి తదితర చిత్రాల్లో నటించిన హీరోయిన్ పూనమ్ కౌర్ మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా తనకు వస్తున్న చాన్స్‌ల గురించి, ఇష్టాల గురించి మాట్లాడారు. ‘విశాఖ అంటే నాకు ఎంతో ఇష్టం. మొదటిసారి ఇక్కడికి వచ్చి ఈ సిటీతో ప్రేమలో పడిపోయాను.’ అన్నారు పూనమ్. ప్రస్తుతం వేసవి కావటంతో విశాఖ అందాలను చూడ్డానికి నాలుగు రోజులుగా కుటుంబంతో వచ్చినట్టు చెప్పారు. ‘అమ్మానాన్నలతో వైజాగ్ రావడం చాలా బాగుంది. అరకు, బొర్రా గుహలు చూశాం.’ అని చెప్పారు. తెలుగమ్మాయిలకు చాన్సులు తక్కువే.. ‘టాలీవుడ్లో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు తక్కువే. ఇక్కడ దర్శకులు, నిర్మాతలు తెలుగు అమ్మాయిలను అంతగా ప్రోత్సహించరు. అందుకే ఫీల్డ్‌లో తెలుగు అమ్మాయిలు అంతగా కనిపించరు.’ అని అభిప్రాయపడ్డారు. గత కొంత కాలంగా తనకు తెలుగు సినిమాల్లో అవకాశాలు తక్కువగా వస్తున్నాయన్నారు. ఏడాదిగా రెండు హిందీ సినిమాలు చేస్తున్నానని, త్వరలోనే అవి విడుదల కానున్నాయని తెలిపారు. ‘పవన్‌కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఆయనతో ఒక సినిమా చేయాలని ఉంది. ఆ అవకాశం వస్తే సో లక్కీ.’ అని చెప్పారు. -
నా కల నెరవేరింది: హీరోయిన్
కోర్టులో న్యాయ విచారణ జరుగుతున్నప్పుడు న్యాయవాదులు జడ్జిని గౌరవంగా యువరానర్ అంటుంటారు. కథానాయిక పూనమ్ కౌర్ కూడా ఇప్పుడు అలానే అంటున్నారు. తొలిసారి ఆమె లాయర్‌గా నటిస్తోన్న చిత్రం ‘ప్రణయం’. దిలీప్, పూనమ్ కౌర్, అక్షిత ప్రధాన పాత్రల్లో శ్రీ విజయానంద్ పిక్చర్స్ పతాకంపై జీయస్వీ సత్యప్రసాద్ దర్శకత్వంలో ఎ.నరేందర్, విజయానంద్, సురేష్ గౌడ్ నిర్మిస్తోన్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు రఘుబాబు కెమేరా స్విచాన్ చేయగా, నిర్మాత సి.కల్యాణ్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత గుణ్ణం గంగరాజు స్క్రిప్ట్ అందించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇదొక సిన్సియర్ లవ్‌స్టోరీ. యువతరంతో పాటు అన్ని వర్గాల వారికీ నచ్చేలా తెరకెక్కిస్తాం. పూనమ్ కౌర్ లాయర్ పాత్రలో కనిపిస్తారు. ఆమె పాత్ర ఈ చిత్రానికి హైలెట్. దిలీప్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాం. సహ నిర్మాత నరేందర్ సహకారంతోనే ఈ చిత్రం చేయగలుగుతున్నాం’’ అని చెప్పారు. ‘‘నా పాత్రను దర్శకుడు బాగా డిజైన్ చేశారు. రియల్ లైఫ్‌లో లాయర్ కావాలనుకుని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా రాశా. కానీ సెలెక్ట్ కాలేదు. ఎందుకంటే నేనంత తెలివైనదాన్ని కాదు. ఇప్పుడు రీల్ లైఫ్‌లో లాయర్ పాత్ర చేయడంతో నా రియల్ డ్రీమ్ నెరవేరినట్లనిపిస్తోంది’’ అని పూనమ్‌కౌర్ తెలిపారు. దిలీప్, అక్షిత, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమేరా: రామ్‌కుమార్, సంగీతం: కేయం రాధాకృష్ణ, నిర్మాణ, నిర్వహణ: యండీ సలీమ్. -
ఫ్యాషన్ షో
-
‘టాలివుడ్ మిస్ ఏపీ-2015’
-
అక్టోబర్ 9 న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: వీవీ వినాయక్ (దర్శకుడు), పూనమ్ కౌర్ (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9. ఇది కుజునికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల స్థిరాస్తులలో వృద్ధి కలుగుతుంది. ఎంతోకాలంగా ఉన్న కోర్టుకేసులలో విజయం కలుగుతుంది లేదా ఇటీవల కొంతకాలంగా మానసిక వ్యధకు గురి చేస్తున్న కేసుల నుండి ఊరట లభిస్తుంది. విద్యార్థులు తమలోని శక్తిసామర్థ్యాలను, తెలివితేటలను బాగా ఉపయోగించుకుని కష్టపడి చదివి, మంచిమార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు. పుట్టిన తేదీ 9. ఇది కూడా కుజునికి సంబంధించిన సంఖ్యే కాబట్టి వీరు సహజంగానే నాయకత్వ లక్షణాలు, ఇతరులను ప్రభావితం చేయగలిగిన కార్యనిర్వహణా సామర్థ్యం కలిగి ఉంటారు. కొత్త కొత్త ఆలోచనలతో మంచి సాంకేతిక నైపుణ్యంతో చురుకుగా పని చేసి మంచి పేరు తెచ్చుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. యూనిఫారం ధరించే ఉద్యోగులు మంచి ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తి ప్రదర్శించి అధికారుల మన్ననలు అందుకుంటారు. లక్కీ నంబర్స్: 1,5,6,9; అన్ లక్కీ నంబర్: 4; లక్కీ కలర్స్: రెడ్, బ్లూ, గోల్డెన్; లక్కీ డేస్: మంగళ, బుధ, శనివారాలు సూచనలు: నవగ్రహాలకు అభిషేకం, సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించడం, రక్తదానం చేయటం లేదా చేయించటం, పేదవిద్యార్థులకు పుస్తకాలు, పరికరాలు కొనిపెట్టడం; వాహనాలు నడిపేటపు్పుడు, ఆయుధాలను ఉపయోగించేటప్పుడు అప్రమత్తంగా ఉంటూ, ప్రతీకార ధోరణిని విడనాడటం. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్ -
శరవణ సిల్క్స్ షోరూం ప్రారంబించిన హీరోయిన్స్
-
శ్రీకాళహస్తిలో హీరోయిన్ పూజలు
'మాయాజాలం' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమై.. తర్వాత నాగార్జున సరసన 'గగనం' సినిమాలో చేసి ప్రస్తుతం కోలీవుడ్‌లో మాంచి బిజీగా కనిపిస్తున్న పూనమ్ కౌర్.. తనకున్న దోషాలను తొలగించుకోడానికి శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు చేయించిందట. తెలుగులో ఆమెకు పెద్ద ఆఫర్లు రాకపోయినా.. అడపాదడపా ఏవో ఒకటి చేస్తూనే ఉంది. ఒక విచిత్రం, నిక్కీ అండ్ నీరజ్, శౌర్యం, వినాయకుడు, గణేశ్ జస్ట్ గణేశ్, నాగవల్లి, పయనం, బ్రహ్మిగాడి కథ.. ఇలా పలు సినిమాల్లో ఆమె నటించినా ఇక్కడ పెద్దగా పేరు మాత్రం తెచ్చుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో తన హవా చూపించేందుకు ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం తమిళంలో 'రణం' అనే సినిమాలో నటిస్తున్న ఆమె.. అందులో ఒక్క పాట కోసం ఏకంగా 400 కాస్ట్యూమ్స్‌ని మార్చింది. ఇప్పటి వరకూ తమిళంలో ఏ హీరో/ హీరోయిన్ ఇలా చేయ్యకపోవడంతో ఇదొక రికార్డని చెబుతున్నారు. -
పూనంతో చిందులు
మంచి చార్మింగ్ పర్సనాలిటీ కలిగిన నటుడు గణేశ్ వెంకట్రామన్. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన ఈయన కోలీవుడ్‌లో వెర్సెటైల్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఏ తరహా పాత్ర అయినా ఇట్టే నప్పే గణేశ్వెంక ట్రామన్ తాజాగా అచ్చారం చిత్రం కోసం నటి పూనం కౌర్‌తో కలిసి ఒక రొమాంటిక్ పాటలో చిందులు వేశారు. రాధామోహన్ శిష్యుడు మోహన్‌కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ పిజిరోలాజికల్ థ్రిల్లర్ చిత్రం కోసం ఇటీవల చెన్నైలో ఒక రొమాంటిక్ గీతాన్ని గణేశ్ వెంకట్రామన్, పూనంకౌర్లపై మూడు రోజుల పాటు చిత్రీకరించారు. ఈ పాట గురించి గణేశ్ వెంకట్రామన్ తెలుపుతూ ఈ తరహా పాటలో నటించడం ఇదే తొలిసారి అన్నారు. ఐటమ్‌సాంగ్స్‌కు పెట్టింది పేరైన సంగీత దర్శకుడు శ్రీకాంత్‌దేవా ఈ పాట చాలా రొమాంటిక్‌గా సంగీతబాణీలందించారని తెలిపారు. నృత్య దర్శకుడు రాబర్ట్ యువతను దృష్టిలో పెట్టుకుని కొరియోగ్రఫీ చేశారని చెప్పారు. ఈ చిత్రంలో తాను రెండు డిఫరెంట్ లుక్స్‌తో కనిపిస్తానని తెలిపారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ త్వరలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంతో పాటు జయం రవి, నయనతార జంటగా నటిస్తున్న తనీ ఒరువన్ చిత్రంలో ఒక ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లు గణేశ్ వెంకట్రామన్ తెలిపారు. -
సెల్ఫీ.. ఫైట్ క్యాన్సర్
అపోలో హాస్పిటల్ ‘లెట్స్ బీ ఇన్ పింక్ ఆఫ్ హెల్త్.. ఫైట్ క్యాన్సర్’ పేరుతో బ్రెస్ట్ క్యాన్సర్ క్యాంపెయిన్ నిర్వహించింది. జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్లో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నటి పూనమ్‌కౌర్ హాజరయ్యారు. పలు కాలేజీలకు చెందిన విద్యార్థినులు గులాబి రంగు దుస్తుల్లో వచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్‌లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా యువతులు, చిన్నారులతో పూనమ్‌కౌర్ సెల్ఫీ ఫొటోలు దిగుతూ మురిపించింది. -
కిడ్నాప్ డ్రామా
‘‘ఈ సినిమా ఐడియా నాకు బాగా నచ్చింది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఇది. ఇందులో నటీనటులు కాకుండా నేను, అల్లరి నరేశ్, ప్రిన్స్‌తో పాటు ఏడుగురు నటించిన పెద్ద మల్టీస్టారర్ ఇది’’ అని హీరో నాని అన్నారు. నందు, ఆదర్శ్, భూపాల్, పూనమ్‌కౌర్, శ్రద్ధాదాస్ ముఖ్య తారలుగా సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో లక్కీ క్రియేషన్స్ పతాకంపై చందు పెన్మత్స నిర్మిస్తున్న ‘సూపర్‌స్టార్ కిడ్నాప్’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని హీరో శ్రీకాంత్ ఆవిష్కరించి, తొలి ప్రతిని ఏపీ పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డికి అందించారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఊహించని సంఘటనల వల్ల చిక్కుల్లో పడిన ముగ్గురు యువకులు సూపర్‌స్టార్ మహేశ్‌బాబును కిడ్నాప్ చేయాలనుకుంటారు. వారు చేసిన ప్లాన్ ప్రకారం కిడ్నాప్ జరిగిందా లేదా అనేది తెరపైనే చూడాలి’’ అని చెప్పారు. ఇందులో ఛాలెంజింగ్ రోల్ చేశానని నందు తెలిపారు. ఈ కార్యక్రమంలో రానా, సుదీప్, తనీష్, నిఖిల్, ఖయ్యూమ్, వరుణ్ సందేశ్, ప్రిన్స్, శ్రీనివాస్ అవసరాల, సాయికార్తీక్, శశాంక్ తదితరులు మాట్లాడారు. -
లిప్‌లాక్ ఓకే కానీ
లిప్‌లాక్ సన్నివేశంలో నటించడానికి రెడీ అంటున్నారు నటి పూనంకౌర్. బహు భాషల్లో నటించినా రావలసిన పేరు మాత్రం ఈ బ్యూటీకి రాలేదు. అయితే ఖచ్చితంగా తనకంటూ ఒక స్థానాన్ని కోలీవుడ్‌లో ఏర్పరచుకుంటానంటున్నారు. ముంబయికి చెందిన ఈ భామ తొలిసారిగా బాలీవుడ్ ప్రవేశానికి సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో ఉంటూ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ మొదలగు భాషల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మతో చిన్న ఇంటర్వ్యూ. సరైన గుర్తింపు పొందలేకపోయారే? ఆబాధ నాకూ ఉంది. నేనింత కు ముందు నటించిన చిత్రాల గురించి అందరికీ తెలుసు. ఆ చిత్రాలు రీచ్ అయినంతగా నేను ప్రేక్షకులకు రీచ్ అవలేకపోయాను. అయితే ఆ లోటు ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో చేరుతుందనే నమ్మకంతో ఉన్నాను. ఆ చిత్రాలు ఏవి? ఎన్ వళి తనీ వళీ, గెస్ట్, అచ్చారం, రణం చిత్రాలతో పాటు ఇంద్రకుమార్ దర్శకత్వంలో రూ పొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నాను. ఈ చిత్రంతో నాకంటూ ఒక స్థానం లభిస్తుందని భావిస్తున్నాను. షూటింగ్లో మిలటరీ అధికారులు భయపెట్టారట? అవును. ఎన్ వళి తనీ వళీ చిత్రంలో ఆర్కె కి జంటగా నటిస్తున్నాను. పాటల చిత్రీకరణ కోసం జార్దాన్ వెళ్లాం. జార్దాన్ ప్రాంత సరిహద్దులో షూటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. అయితే అక్కడ మమ్మల్ని షూటింగ్ చేయకుండా ఆ దేశ మిలటరి బెదిరించి తరిమేశారు. అనుమతి పత్రాలు చూపడంతో వారు అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ పాటలో భలే డాన్స్ చేశాను. వదం చిత్రంలో ఫైట్స్ చేశారటగా? ఈ చిత్రం షూటింగ్ కొడెకైనాల్లో నిర్వహించారు. ఇందులో పగ, ప్రతీకారాల పాత్ర కావడంతో యాక్షన్ సన్నివేశాల్లో నటించాల్సి వచ్చింది. దర్శక, నిర్మాతలు డూప్‌తో చేయిద్దామన్నా వద్దని రిస్కీ ఫైట్స్ సన్నివేశాల్లో నటించాను. అనూహ్యంగా కొన్నిసార్లు గాయాలకు గురయ్యాను కూడా. చిత్రం విడుదలానంతరం ప్రేక్షకుల చప్పట్లతో నేను పడిన శ్రమను మరచిపోతాను. ఎలాంటి షరతులు విధిస్తారు? నిజం చెప్పాలంటే నేనెలాంటి షరతులు విధించను. పాత్రకు న్యాయం చేయడానికి కఠినంగా శ్రమించడానికి ఎప్పుడూ సిద్ధమే. చిత్రం ఒప్పుకున్న తరువాత ఎలాంటి సమస్యలు సృష్టించను. ఎలాంటి పాత్రలు ఆశిస్తున్నారు? అతి అనుకోకుంటే నటి శ్రీదేవి, జ్యోతికల మాదిరి నటనకు అవకాశం వున్న పాత్రలు లభిస్తే ఆ పాత్రకు ప్రాణం పోయడానికి ఎంత కష్టపడి అయినా నటించడానికి రెడీ. ఈ మధ్య 6 చిత్రంలో నా నటనకు ప్రశంసలందారుు. హీరోయిన్ ప్రాముఖ్యత వున్న పాత్రలను కోరుకుంటున్నారా? అలాంటి మంచి పాత్రల్లో నటించే అవకాశం వస్తే వెంటనే ఒప్పుకుంటాను. ప్రస్తుతం నటిస్తున్న వదం చిత్రకథ నా పా త్ర చుట్టూనే తిరుగుతుంది. ఇది పూర్తిగా నా కోసమే తయారు చేసిన ట్లు ఉంటుంది. ఈత దుస్తులు ధరిస్తారా? కథకు అవసరం అయితే లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించడానికి సిద్ధమే గానీ ఈత దుస్తుల్లో మాత్రం నటించను. మోడ్రన్ దుస్తుల్లో గ్లామరస్‌గా నటించడానికి అభ్యంతరం లేదు. అయితే అందులోను వల్గారిటీ ఉండేలా నటించను. -
విభిన్న ప్రేమ కథా చిత్రంగా అచ్చారం
సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే సహజత్వంతో కూడిన చిత్రాలకు ప్రజాదరణ ఎప్పుడూ ఉంటుంది. అలాంటి విభిన్న ప్రేమ కథతో తెరకెక్కిస్తున్న చిత్రం అచ్చారం అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు మోహనకృష్ణ. ఈయన తొలిసారిగా మెగాఫోన్ పట్టి రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని తరుణ్ క్రియేషన్స్ పతాకంపై జ్ఞాన దేశ్ అంబేద్కర్ నిర్మిస్తున్నారు. గణేశ్ వెంకట్రామన్ మున్న హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో పూనం కౌర్ హీరోయిన్. ఇతర ముఖ్య పాత్రల్లో రేఖ, రాజ్యలక్ష్మి, ఓ.ఎ.కె.సుందర్, ఐశ్వర్యదత్ తదితరులు నటిస్తున్నారు. నిర్మాత జ్ఞానదేశ్ అంబేద్కర్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ, ఇద్దరు యువకులు ఒక యువతి మధ్య జరిగే లవ్, రొమాన్స్, థ్రిల్లర్ కథా చిత్రం అచ్చారం అని తెలిపారు. వీరిలో ఒక యువకుడు ఇన్నోసెంట్ అయితే మరొకరు భిన్న వ్యక్తిత్వం కలిగి ఉంటారన్నారు. అలాంటి ఈ ఇద్దరు హీరోయిన్‌కు సంబంధం ఏమిటన్నది చిత్రంలో ప్రధానాంశం అన్నారు. ఇన్నోసెంట్ హీరో పాత్రను మున్నా వింత మనస్తత్వం గల హీరో పాత్రను గణేశ్ వెంకట్రామన్ పోషిస్తున్నారని హీరోయిన్ పూనం కౌర్ పాత్ర చాలా సస్పెన్స్‌గా ఉంటుందని చెప్పారు. మూడు దశల్లో జరిగే ఈ చిత్ర షూటింగ్‌ను కొడెక్కైనాల్, చెన్నై, తంజావూరులో పూర్తి చేసినట్లు తెలిపారు. అచ్చారం కమర్షియల్ అంశాలతో కూడిన విభిన్న ప్రేమ కథా చిత్రం అని దర్శకుడు పేర్కొన్నారు. -
‘కింగ్ ఫిషర్’ ఫ్యాషన్ వీక్
-
అదిరిందిరా బుజ్జి
-
సినిమా రివ్యూ: ఆడు మగాడే కానీ...
ఎస్సెమ్మెస్, ‘ప్రేమ కథా చిత్రం’తో గుర్తింపు తెచ్చుకున్న సుధీర్‌బాబు ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ అనే ఓ క్రేజీ, ఫ్యాన్సీ టైటిల్‌తో మరోసారి డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ద్వారా కృష్టారెడ్డి గంగదాసు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. టైటిల్‌తో విడుదలకు ముందే ప్రేక్షకుల్లో అంచనాలను పెంచిన ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ ఏలాంటి టాక్‌ను సంపాదించుకుందో తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళ్తాం. సిద్ధు అల్లరి చిల్లరిగా తిరిగే ఓ తుంటరి యువకుడు. చిన్నతనం నుంచి అందర్ని కష్టాల్లో ఇరికించడం సిద్దూకి అలవాటు. సిద్దూ వ్యవహారం ఎలా ఉంటుందంటే.. సొంత తండ్రి ప్రసాద్ (నరేశ్) కూడా వీడు నా కొడుకు అని చెప్పుకోవడానికి కూడా భయపడేంత రేంజ్లో ఉంటుంది. సిద్దూ నుంచి ఎదురయ్యే కష్టాల్ని భరించలేక హాస్టల్ ఉంచి చదివిస్తుంటాడు. చాలా జాలీగా కాలం గడుపుతున్న సిద్దూ, ఇందూ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇందూకి చెర్రి (రణధీర్) అనే ఓ అన్నయ్య ఉంటాడు. ఇందూ వైపు ఎవడైనా చూస్తే తాట తీయడం చెర్రీ పని. అయితే ఒకానొక కారణంగా శంకరన్న అనే రౌడీ పొలిటీషియన్‌ను సిద్దు విపరీతంగా కొడుతాడు. అయితే శంకరన్నకు ఎవరు కొట్టారనే విషయం తెలియదు. తనను కొట్టిన వ్యక్తిపై పగను పెంచుకొని అతని అంతు చూడటానికి వెతుకుతుంటాడు. కథ ఇలా సాగుతుంటే తన ప్రేమ కోసం సిద్దూ అదే కాలేజిలో చదువుతున్న శంకరన్న మరదలు అంజలీతో చెర్రీ ప్రేమలో పడేలా నాటకం ఆడుతాడు. అంజలీ ప్రేమ విషయం తెలుసుకున్న శంకరన్న చెర్రీపై దాడి చేస్తాడు. చెర్రీ, అంజలీలు విడిపోవడానికి సిద్దూనే కారణమని తెలుసుకున్న ఇందూ అతనికి దూరంగా ఉంటుంది. అయితే శంకరన్నను ఎదురించి విడిపోయిన చెర్రీ, అంజలీలను ఎలా కలిపాడు. వారి ప్రేమను పెళ్లిదాకా ఎలా తీసుకువచ్చాడు. అలాగే ఇందూను ప్రేమను సిద్దూ ఎలా గెలుచుకున్నాడు అనేది ఈ చిత్ర కథ. లవ్, యాక్షన్, కామెడీ అంశాలకు తన ఎనర్జీని మేళవించి సుధీర్ ఆకట్టుకున్నాడు. టైమింగ్, మెచ్యురిటీ, డాన్స్ లతో సిద్దూ పాత్రకు పూర్తి న్యాయం చేకూర్చాడు. గత రెండు చిత్రాల్లోని ఫెర్ఫార్మెన్స్‌కు ధీటుగా తనదైన శైలిలో సుధీర్ బాబు మరోసారి నటుడిగా తనకు తాను ప్రూవ్ చేసుకున్నాడు. పాటల్లో సిక్స్‌ప్యాక్ బాడీతో సుధీర్ అదరగొట్టాడు. కథలను జాగ్రత్తగా ఎంచుకుని తన సినిమాలను చక్కగా ప్లాన్ చేసుకుంటే.. త్వరలోనే టాలీవుడ్ లో స్టార్‌గా ఎదగేందుకు అన్ని అంశాలు సుధీర్‌లో పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇందూ పాత్రలో అస్మితా సూద్ మంచి పాత్రే లభించింది. గ్లామర్‌తో ఆకట్టుకున్న కీలక సన్నివేశాల్లో ఎమోషన్స్ పలికించడంలో కొంత తడబాటుకు గురైంది. అయినా అస్మితా పర్వాలేదనింపించింది. అంజలీ పాత్రలో పూనమ్ కౌర్‌కు అంతగా ప్రాధాన్యత ఉన్న పాత్రేమి కాదు. ప్రధాన విలన్‌గా అజయ్ తనదైన మార్కును ప్రదర్శించాడు. కొన్ని సీన్లలో అజయ్ మంచి పరిణతిని ప్రదర్శించాడు. శంకరన్న లాంటి పాత్రలను అజయ్ ఇప్పటికే ఎన్నో చేశాడు. అజయ్ కేరిర్‌కు అంతగా పేరు తీసుకురాకపోయినా.. విలన్ రేసులో తాను ఉన్నానని చెప్పుకోవడానికి పనికివచ్చే రేంజ్ మాత్రమే. సుమన్, నరేశ్‌లు అతిధి నటుల పాత్రకే పరిమితమయ్యారు. ఇక ఈ సినిమాలో కుక్క పాత్ర హైలెట్ అని చెప్పవచ్చు. పృథ్వీ, కృష్ణభగవాన్ కామెడీ కొంత ప్లస్ అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో గొప్పగా చెప్పుకావాల్సిందేమైనా ఉందంటే అది డైలాగ్స్. ఈ సినిమాలో డైలాగ్స్ ప్రధాన ఆకర్షణ. ’సంతానం కోసం సముద్ర స్నానం చేస్తే ఉప్పు నీళ్లతో ఉన్నది పొయింది’, కొడుకును ఇవ్వమంటే కసబ్ ను ఇచ్చావ్ లాంటి డైలాగ్స్ తోపా టు, మరికొన్ని సన్నివేశాల్లో డైలాగ్స్ బాగా పేలాయి. ఫోటోగ్రఫి కూడా అదనపు ఎస్సెట్. ఈ చిత్రంలో శ్రీ సంగీతం అంతగా ఆక ట్టుకోలేకపోవడం, పాటలు క్యాచీగా లేకపోవడం మైనస్. ఆడు మగాడ్రా బుజ్జీ అనే ఎనర్జీ ఉన్న టైటిల్‌తో దర్శకుడిగా పరిచయమైన కృష్ణారెడ్డి తొలి భాగంగా ఓకే అనిపించాడు. మంచి ఎంటర్టైన్మెంట్తో తొలి భాగంపై గ్రిప్‌ను సాధించినట్టు కనిపించినా.. అదే ఊపును ద్వితీయార్ధంలో కొనసాగించలేకపోయాడు. కుక్క ఎపిసోడ్, కృష్ణ భగవాన్ సీన్లు బాగా పండించాడు. తొలి భాగంలో ప్రేక్షకుల్ని కన్విన్స్ చేయడంతోపాటు.. రెండవ భాగంపై ఆసక్తిని రేకేత్తించాడు. అయితే రెండవ భాగంపై ఆశలు పెంచుకున్న ప్రేక్షకులకు నిరాశను పంచాడు. తొలి చిత్రం ద్వారా రొటీన్ కథను ఎంచుకోవడం కృష్ణారెడ్డి కొంత సాహసామేనప్పటికి.. ఆడు మగాడ్రా బుజ్జీ టైటిల్లో ఉండే ఫోర్స్‌ను పూర్తి స్థాయిలో చూపించడంలో విఫలమయ్యాడనే చెప్పవచ్చు. -
బాలీవుడ్ హీరోలతో పోలుస్తున్నారు!
‘‘ఈ సినిమాలో నా సిక్స్ ప్యాక్ బాడీ చూసి చాలామంది, నన్ను బాలీవుడ్ హీరోలతో పోలుస్తున్నారు. ఈ సినిమా తప్పకుండా అందర్నీ ఆకట్టుకుంటుంది’’ అని సుధీర్‌బాబు చెప్పారు. ఆయన హీరోగా నటించిన ‘ఆడు మగాడ్రా బుజ్జి’ ఈ నెల 7న విడుదల కానుంది. కృష్ణారెడ్డి గంగదాసు దర్శకత్వంలో సుబ్బారెడ్డి, ఎస్.ఎన్.రెడ్డి నిర్మించిన ఈ సినిమా ప్లాటినమ్ డిస్క్ వేడుక బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. యూనిట్ సభ్యులకు షీల్డులందజేసిన అనంతరం నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ -‘‘సుధీర్‌బాబు కమిట్మెంట్, డెడికేషన్ నాకు బాగా నచ్చాయి. రెండు సినిమాలతో తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు తను’’ అన్నారు. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని దర్శక నిర్మాతలు ఆకాంక్షించారు.