జానీని ‘మాస్టర్‌’ అని పిలవకండి: హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌ | Poonam Kaur Fires On Jani Master | Sakshi
Sakshi News home page

జానీని ‘మాస్టర్‌’ అని పిలవకండి: హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌

Published Tue, Sep 17 2024 12:29 PM | Last Updated on Tue, Sep 17 2024 12:38 PM

Poonam Kaur Fires On Jani Master

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ షేక్‌ జానీ బాష అలియా జానీ మాస్టర్‌పై ఓ యువతి లైంగిక ఆరోపణలు చేయడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. హైదరాబాద్, చెన్నై, ముంబై తదితర నగరాల్లో ఔట్‌డోర్‌ షూటింగ్‌లకి వెళ్లినప్పుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అతని సహాయకురాలు(21) పోలీసులకు ఫిర్యాదు చేసింది.అలాగే నార్సింగిలోని తన నివాసానికి వచ్చి పలు మార్లు వేధింపులకు కూడా గురి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో నార్సింగి పోలీసులు జానీ మాస్టర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 

(చదవండి: మైనర్‌గా ఉన్నప్పటి నుంచే 'జానీ' వేధించాడు: చిన్మయి)

ఈ విషయం బయటకు రాగానే పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా జానీ మాస్టర్‌పై ఫైర్‌ అవుతూ.. బాధితురాలికి అండగా నిలుస్తున్నారు. సింగర్‌ చిన్మయి స్పందిస్తూ.. యువతి మైనర్‌గా ఉన్నప్పుడే జానీ మాస్టర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. తాజాగా నటి పూనమ్‌ కౌర్‌ కూడా జానీ మాస్టర్‌పై సీరియస్‌ అయింది. ఇకపై అతన్ని మాస్టర్‌ అనే పిలువొద్దని ఎక్స్‌ వేదికగా కోరింది.  ‘నిందితుడు షేక్ జానీ ని ఇకపై ఎవరు జానీ మాస్టర్ అని పిలవకండి. మాస్టర్ అనే పదానికి విలువ ఇవ్వండి’ అని పూనమ్‌ ట్వీట్‌ చేసింది. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement