ప్రముఖ గాయని చిన్మయి తాజాగా టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీపై రియాక్ట్ అయ్యారు. చిత్రపరిశ్రమలో 'మీటూ' ఉద్యమం సమయం నుంచే ఆమె అనేక అంశాలపై లేవనెత్తుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలోని మహిళలు లైంగిక దాడులకు గురైతే వెంటనే తన అభిప్రాయాన్ని తెలుపుతారు. డ్యాన్స్ మాస్టర్ జానీపై లైంగిక ఆరోపణలు చేసిన యువతి పక్షాన సింగర్ చిన్మయి నిలబడ్డారు.
ఒక మీడియా కథనాన్ని ట్యాగ్ చేస్తూ చిన్మయి ఇలా చెప్పుకొచ్చారు. 'నివేదికల ప్రకారం ఆ అమ్మాయి మైనర్‌గా ఉన్నప్పటి నుంచే జానీ మాస్టర్ వేధించడం ప్రారంభించాడు. ఈ కేసులో పోరాడేందుకు కావాల్సినంత శక్తి ఆ అమ్మాయికి చేకూరాలని నేను కోరుకుంటున్నాను.' అని ఆమె తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువతిని (అసిస్టెంట్ కొరియోగ్రాఫర్) జానీ మాస్టర్ లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. నార్సింగ్ పోలీస్టేషన్‌లో కేసు కూడా నమోదు అయిన విషయం తెలిసిందే.
చిన్మయి ఒక సింగర్‌గానే కాదు... ఆమె ఒక ఫెమినిస్ట్‌గా కూడా గుర్తింపు పొందారు. గతంలో చిన్మయి కూడా లైగింక వేధింపులకు గరైనట్లు చెప్పిన విషయం తెలిసిందే. తాను కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే సాహిత్య రచయిత వైరముత్తు తన ఫోన్ నంబర్ తీసుకుని పలు ఇబ్బందులకు గురిచేశాడని ఆమె ఆరోపించారు. తాను నంబర్ మార్చినా కూడా ఎదో విధంగా తెలుసుకుని కాల్స్ చేసేవాడని ఆమె చెప్పారు. అలా ఆమె కూడా ఇలాంటి ఘటనలతో ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలోనే ఆమె మహళలకు అండగా నిలుస్తూ ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment