'పవర్ రేపిస్ట్' అంటూ పూనమ్‌ కౌర్‌ ట్వీట్‌ | Poonam Kaur Tweet On TDP MLA Koneti Adimulam | Sakshi
Sakshi News home page

'పవర్ రేపిస్ట్' అంటూ పూనమ్‌ కౌర్‌ ట్వీట్‌

Published Thu, Sep 5 2024 4:25 PM | Last Updated on Thu, Sep 5 2024 4:44 PM

Poonam Kaur Tweet On TDP MLA Koneti Adimulam

టాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన పలు సంఘటనల్లో ఆమె వెంటనే రియాక్ట్‌ అవుతారు. సత్యవేడుకు చెందిన ఒక మహిళ టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం మీద తాజాగా పూనమ్‌ సంచలన ట్వీట్ చేశారు. ఆమె చేసిన కామెంట్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

"పవర్ రేపిస్ట్"ని బయటపెట్టమని తన భాగస్వామిని ప్రోత్సహించిన భర్తను  అభినందిస్తున్నానంటూ పూనమ్‌ కౌర్‌ ఒక ట్వీట్‌ చేశారు. అతను అలా తన భార్యకు అండగా లేకుండా ఉండుంటే ఇప్పుడు ఆ ఎమ్మెల్యే టీడీపీ నుంచి సస్పెండ్ అయ్యేవాడు కాదని ఆమె అభిప్రాయపడ్డారు.  'ఇలాంటి సంఘటన ఎదురైతే అధికారంలో ఉన్నవారితో గొడవ ఎందుకని చాలామంది  మౌనంగా ఉండమని చెబుతారు.. కానీ, అతను తన భార్యను సపోర్ట్‌ చేస్తూ తప్పును బహిర్గతం చేశాడు.తన భార్య మీద అత్యాచారం చేసిన ఎమ్మెల్యే వ్యవహారాన్ని బట్టబయలు చేసేలా ఎంకరేజ్ చేసిన ఆ భర్తకు నా కృతజ్ఞతలు. అత్యాచారానికి గురైన మహిళ దైర్యంగా బయటికొచ్చి మాట్లాడిన ఆ మహిళను అభినందిస్తున్నాను.' అని పూనమ్‌ పేర్కొన్నారు.

పూనమ్‌ కౌర్‌ చేసిన 'పవర్‌ రేపిస్ట్‌' అనే వ్యాఖ్యం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళ పట్ల వ్యవహరించిన తీరు నెట్టింట పెద్ద దుమారమే రేగుతుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట ట్రెండ్‌ అవుతుంది.  సత్యవేడు నియోజకవర్గం టీడీపీ  మహిళా అధ్యక్షురాలిగా ఉన్న బాధిత మహిళ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై సంచలన ఆరోపణలతో పాటు వీడియోలను విడుదల చేసింది. ఆయన తనను లైంగికంగా వేధించడంతో పాటు  అత్యాచారం  చేశారని చెబుతూ ఆమె మీడియా ముందుకు వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement