
‘‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు. థియేటర్స్‌కి వచ్చిన ప్రతి ఒక్కరూ తాము టిక్కెట్ కోసం పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం జరిగిందని భావిస్తారు’’ అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ పేర్కొన్నారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు.
సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) రిలీజ్ కానుంది. బుధవారం నిర్వహించిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హారిక సూర్యదేవర మాట్లాడుతూ– ‘‘కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రమిది’’ అన్నారు. నార్నే నితిన్ మాట్లాడుతూ– ‘‘మ్యాడ్’ సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు రుణపడి ఉంటాం. ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’లో వినోదం రెట్టింపు ఉంటుంది. చూసి ఆనందించండి’’ అని తెలిపారు. ‘‘మా ట్రైలర్ అందరికీ నచ్చిందనుకుంటున్నాం. సినిమా కూడా కచ్చితంగా నచ్చుతుంది’’ అన్నారు సంగీత్ శోభన్, రామ్ నితిన్.
Comments
Please login to add a commentAdd a comment