Vadevadu Veedevadu Mana Premaku Aaddevadu Trailer: పోసాని కృష్ణ మురిళి నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం "వాడెవ్వడు వీడెవ్వడు మన ప్రేమకు అడ్డెవ్వడు ?". మాస్టర్ బాలు, మాస్టర్ మహేష్ సమర్పణలో బియం క్రియేషన్స్ పతాకంపై నిర్మాత పప్పుల కనక దుర్గారావు నిర్మిస్తున్నారు. ఫస్ట్ కాపీ రెడీ అయిన ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని, జులై 10న ట్రైలర్ రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర బృందం పాల్గొంది.
నటుడు, చిత్ర దర్శకులు పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ.. 'నటుడిగా 400 సినిమాలలో నటించాను, అలాగే రైటర్ గా 100 సినిమాలు రాసుంటాను. అలాగే కొన్ని సినిమాలకు డైరెక్షన్ కూడా చేశాను.అయితే దుర్గారావు తీసే సినిమాలో నాకొక క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమాకు నేను 12 రోజులు పని చేశాను. ఇన్ని సినిమాలు చేసిన నాకు చాలా తక్కువ టైమ్ లో ఎక్కువ దగ్గరైన వ్యక్తి పప్పుల కనక దుర్గారావు. దుర్గారావు నాతో నీ పై నాకు చాలా నమ్మకం ఉంది. నీతో సంవత్సరానికి రెండు సినిమాలు చెయ్యాలకుంటున్నాను మీరే కథలను రెడీ చేసుకొండి అని చెప్పడం జరిగింది. అయితే నా కొడుకు ఉజ్వల్ పోసాని కథ, మాటలు, స్క్రీన్ ప్లే రాసుకున్న ఈ కథను నిర్మాత దుర్గరావు వినిపించడంతో తనకీ కథ నచ్చడంతో నన్నే డైరెక్షన్ చేయమన్నాడు.మంచి కాన్సెప్ట్ ను సెలెక్ట్ చేసుకొని తీసిన ఈ సినిమాను విజయవాడ, కృష్ణ బ్యాక్ డ్రాప్ లో చిత్రికరించడం జరిగింది. నిర్మాత దుర్గా రావు నాపై ఉన్న నన్ను నమ్మి నాకీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. బతికున్నంత కాలం మనిద్దరం స్నేహితులుగా ఉంటాం.
ఈ సినిమాలో అందరూ కొత్త ఆర్టిస్టులే. సినిమాలో ముగ్గురు అమ్మాయిలు శ్వేత, స్నేహ, శృతి నటించారు. వారు ముగ్గురు ఇందులో హీరోయిన్ లే. అలాగే విలన్ గా హీరోగా డిఫ్రెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో అశోక్ చాలా చక్కగా నటించాడు. ఈ సినిమాకు పనిచేసిన నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ కూడా కొత్తవారైనా ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశారు.చాలా షాట్ టైమ్ లో అంటే 30 రోజుల్లో ఈ సినిమాను షూట్ చేయడం జరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ సినిమాను అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాం' అని తెలిపారు. నటుడు అశోక్ మాట్లాడుతూ.. 'లెక్చరర్ గా చేస్తున్న నేను నటుడు అవుతాను అనుకోలేదు. పోసాని సర్ నన్ను నమ్మి నాకీ అవకాశం ఇచ్చారు. ఇంత మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు' అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment