
కీర్తి కృష్ణ హీరోగా నిఖిత, మధుబాల హీరోయిన్లుగా లక్ష్మణ్ చప్రాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్ నరసింహ 117’. నవ్యసాయి ఫిలిమ్స్ పతాకంపై బి. నరసింహా రెడ్డి నిర్మించారు.
Agent Narasimha 117 Movie Trailer Released: కీర్తి కృష్ణ హీరోగా నిఖిత, మధుబాల హీరోయిన్లుగా లక్ష్మణ్ చప్రాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్ నరసింహ 117’. నవ్యసాయి ఫిలిమ్స్ పతాకంపై బి. నరసింహా రెడ్డి నిర్మించారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్, దర్శకుడు వి. సముద్ర, తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి ముత్యాల రాందాస్, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్‌లు ‘ఏజెంట్ నరసింహ 117’ ట్రైలర్‌ను విడుదల చేశారు.
‘‘పక్కా మాస్‌గా రూపొందిన మూవీ ఇది. ఈ నెలలోనే రిలీజ్ చేస్తాం’’ అని తెలిపారు నిర్మాత బి. నరసింహా రెడ్డి. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ చప్రాల, నటుడు దయ మాట్లాడారు. రాజ్ కిరణ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.
చదవండి: ఆయన పాటలు అనేక భావోద్వేగాలను పలకించేవి: ప్రధాని మోదీ
నాకు మూడు ఫ్యామిలీలు ఉన్నాయి: అనిల్ రావిపూడి