Telangana Film Chamber of Commerce
-
తప్పుడు ప్రచారం జరుగుతోంది
‘‘తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్’ (టీఎఫ్‌సీసీ) చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో సెప్టెంబరులో దుబాయ్‌లో నిర్వహించాలనుకుంటున్న టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ ఫంక్షన్‌కు, తమకు సంబంధం లేదని, టీఎఫ్‌సీసీకి ప్రభుత్వ గుర్తింపు లేదని తెలుగు, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశాయి. ఈ విషయంపై శనివారం టీఎఫ్‌సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ స్పందిస్తూ– ‘‘మాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. సౌత్ ఇండియాలోని ఆర్టిస్టులకు అవార్డులు ఇవ్వనున్నాం. దీన్ని కాదనే హక్కు దామోదర ప్రసాద్, సునీల్ నారంగ్‌లకు లేదు. ‘టీఎఫ్‌సీసీ’ పేరుతో ట్రేడ్ మార్క్, టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ రిజిస్ట్రేషన్ చేయించాం. టీఎఫ్‌సీసీ నంది ఈవెంట్స్ పేరుతో దుబాయ్ ప్రభుత్వం నుండి లైసెన్స్ తీసుకున్నాం. సెప్టెంబర్ 28న దుబాయ్‌లో టీఎఫ్‌సీసీ నంది అవార్డుల వేడుక జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం టీఎఫ్‌సీసీ నంది అవార్డులకు అనుమతితో కూడిన లెటర్ కూడా ఇచ్చింది’’ అన్నారు. -
టీఎఫ్‌సీసీకి ప్రభుత్వ గుర్తింపు లేదు
‘‘తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ (టీఎఫ్‌సీసీ) తెలంగాణ ప్రభుత్వంచే గుర్తింపు పొందలేదు. ఆ ఛాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 24న దుబాయ్‌లో నిర్వహించే నంది అవార్డు వేడుక ఆయన వ్యక్తిగతంతో పాటు ఓ ప్రైవేట్ వేడుక. ఈ నంది అవార్డు వేడుకకు, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి)కు ఎలాంటి సంబంధం లేదు. ఈ వేడుకకి మేం భాగస్వామ్యం వహించం’’ అని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి గౌరవ కార్యదర్శి కేఎల్. దామోదర్ ప్రసాద్, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి కె. అనుపమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు వారు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి, ఏపీ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల వద్ద టీఎఫీసీసీ నంది అవార్డుల వేడుకకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్నది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మాతృసంస్థ. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాత్రమే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన సంస్థలు. 24–09–2023న దుబాయ్‌లో నిర్వహించనున్న టీఎఫ్‌సీసీ నంది అవార్డుల గురించి మా రెండు ఛాంబర్లకు సంబంధం లేదు. ‘నంది’ అవార్డు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పేటెంట్. నంది పేరును ఉపయోగించడం, అవార్డు వేడుక నిర్వహించడాన్ని ఖండిస్తున్నాం. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిత్వశాఖ, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల వద్ద కూడా టీఎఫ్‌సీసీ నంది అవార్డుల వేడుకకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
ఆగస్టులో టీఎఫ్‌సీసీ నంది అవార్డులు
తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) ఆధ్వర్యంలో ‘టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023’ వేడుక జరగనుంది. దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఆగస్టు 12న ఈ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జ్యూరీ సభ్యులను సెలెక్ట్ చేసుకున్న సందర్బంగా సోమవారం పాత్రికేయుల సమావేశంలో టీఎఫ్‌సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘2021, 22 సంవత్సరాల్లో విడుదలైన చిత్రాల వారు ఈ అవార్డుల కోసం టీఎఫ్‌సీసీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు చివరి తేదీ జూన్ 15. తెలంగాణ ప్రభుత్వం నుండి నంది అవార్డ్స్‌కి సంబంధించిన లెటర్ పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు సంతకం చేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్ర ప్రభుత్వం సహకారం కూడా కోరనున్నాం. ఆగస్టు 12న దుబాయ్ ప్రిన్స్ చేతుల మీదుగా నంది అవార్డులు ఇవ్వనున్నాం’’ అన్నారు. ‘‘జ్యూరీ కమిటీకి నన్ను చైర్మన్‌గా ఉండమన్నారు. కానీ నేను జ్యూరీ మెంబర్‌గా ఉంటూ సపోర్ట్ చేస్తానని చెప్పాను. తెలంగాణ ప్రభుత్వ సహకారం తీసుకున్నట్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది’’ అన్నారు మురళీ మోహన్. సుమన్, బి. గోపాల్ తదితరులు మాట్లాడారు. -
ఓటీటీ దిగ్గజాలకు పోటీగా వస్తోన్న 'సన్‌షైన్'
మలేషియాలో ఎస్టాబ్లిష్డ్ అయిన 'సన్ షైన్' ఓటీటీ సంస్థని త్వరలో ఇండియాకు పరిచయం చేయనున్నారు. తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్‌తో(టిఎఫ్‌సీసీ)తో టై అప్ అవుతూ ఈ ఓటీటీని ఇక్కడ ఘనంగా లాంచ్ చేయబోతున్నారు 'సన్ షైన్' సిఎమ్ డి బొల్లు నాగ శివప్రసాద్ చౌదరి. ఈ సందర్భంగా సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీఎఫ్‌సిసి ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ...'ప్రస్తుతం ఇండియాలో ఓటీటీల హవా నడుస్తోంది. ఈ ఓటీటీ ద్వారా తెలుగుతో పాటు అన్ని భాషల చిత్రాలు రిలీజ్ చేయనున్నాం. అలాగే షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్ కూడా రిలీజ్ చేయడానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ అంతా స్తబ్దతలో ఉన్న విషయం తెలిసిందే. నా అనుభవంతో...నిర్మాతల కష్టనష్టాలు తెలిసిన వ్యక్తిగా ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న వాటితో ఏమాత్రం ఏకీభవించను. సినీ నిర్మాత అనేవాడు తన సినిమాను ఎప్పుడు అమ్మాలనేది తనే నిర్ణయించుకోవాలి తప్ప ఏ అసోసియేషనో, మరో సంస్థో చెప్పడం కరెక్ట్ కాదు. నిర్మాత డబ్బు ఎక్కడ వస్తే అక్కడే ఇచ్చుకునే అవకాశం ఉండాలి. థియేటర్స్ ఇవ్వరు...ఓటీటీలో అమ్ముకునే అవకాశం ఇవ్వమంటే ఎలా? నిర్మాతకు తన సినిమాను తనే అమ్ముకునే స్వేచ్ఛ ఉండాలి. నిర్మాతలపై ఏ అసోసియేషన్ కండీషన్ పెట్టొద్దు. ఒకవేళ పెడితే రిలీజ్‌కి థియేటర్స్ కూడా పర్సేంటేజ్ విధానంలో ఇవ్వాలి. ఇదే మా డిమాండ్. మా చాంబర్ ఎప్పుడూ నిర్మాతలకు అండగా ఉంటుంది' అన్నారు. సన్ షైన్ సియమ్ డి బొల్లు నాగ శివప్రసాద్ చౌదరి మాట్లాడుతూ...``లాక్డౌన్ టైమ్‌లో ఓటీటీ సంస్థలు ప్రారంభమై పబ్లిక్‌లోకి విపరీతంగా చొచ్చుకెళ్లాయి. దీనిపై నేను రెండేళ్ల పాటు వ్యూయర్ షిప్, రెవెన్యూ ఎలా? ఏంటనే విషయాలపై రీసెర్చ్ చేసి సన్ షైన్ అనే పేరుతో ఓటీటీ సంస్థ ప్రారంభించాం. ప్రస్తుతం ఇండియాలో లాంచ్ చేయబోతున్నాం. అన్ని భాషల చిత్రాలు మా ఓటీటీ ద్వారా రిలీజ్ చేయనున్నాం. ఇప్పటికే వెయ్యికి పైగా చిత్రాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఒరిజినల్ కంటెంట్ కూడా ఉంది. కొత్తవారిని ఎంకరేజ్ చేయడానికి షార్ట్ ఫిలిం కాంటెస్ట్ కూడా పెట్టనున్నాం. త్వరలో మా ఓటీటీ సంస్థని గ్రాండ్ గా లాంచ్ చేయనున్నాం' అన్నారు. చదవండి: థియేటర్, ఓటీటీలో సందడి చేసే సినిమాలివే! హీరోగా చేస్తానని చెప్పగానే నాన్న చివాట్లు పెట్టారు -
షూటింగ్ ఆపితే ఊరుకునేది లేదు: టియఫ్‌సీసీ చైర్మన్ ఆర్.కె.గౌడ్
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం కోసం ఆగస్ట్ 1న షూటింగ్స్ బంద్ చేయాలని టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యలు ఆగ్రహం వ్యక్తం చేశారు. షూటింగ్స్ ఆపితే ఊరుకోబోమని తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు, నిర్మాత డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ (ఆర్.కె. గౌడ్) హెచ్చరించారు. షూటింగ్స్ నిలివేత అంశంపై మాట్లాడేందుకు శనివారం తెలంగాణ ఫిలిం ఛాంబర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆర్.కె.గౌడ్ మాట్లాడుతూ.. స్వార్థం కోసమే ప్రొడ్యూసర్స్ గిల్డ్ షూటింగ్స్ నిలిపివేస్తుందని ఆరోపించారు. ‘తెలంగాణలో 50 మంది వరకు నిర్మాతలున్నారు. చాలా మంది చిత్రీకరణ చేస్తున్నారు. ఆగస్ట్ 1 నుంచి షూటింగ్స్ బంద్ అని గిల్డ్ నిర్మాతలు అంటున్నారు. ఎందుకు ఆపాలి? ఇదంతా వారి స్వార్థం కోసం చేస్తున్నదే తప్ప చిత్ర పరిశ్రమకు ఉపయోగపడేది కాదు. చిత్ర పరిశ్రమ నలుగురిది కాదు.. అందరినీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి. బంద్ ప్రకటిస్తే వర్కర్స్కు ఇబ్బంది అవుతుంది. గిల్డ్ నిర్మాతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊరికునేది లేదు. టికెట్ ధరలు పెంచుకుంది వారే.. ఇప్పుడు ధియేటర్ లకు ప్రేక్షకుల రావటం లేదని ఎడ్చేది వారే. ఆర్టిస్ట్ లకు రెమ్యూనిరేషన్ లు పెంచింది కూడా గిల్డ్ నిర్మాతలే. ఇంకొకరు ఎదగొద్దు అనేలా గిల్డ్ నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. గిల్డ్ నిర్మాతలే ఓటీటీలకు తమ సినిమాలను ఎక్కువ ధరకు అమ్ముకున్నారు. ఇవన్ని తప్పులు వారు చేసి..ఇప్పుడు షూటింగ్ బంద్ అంటే ఎలా? బంద్ చేస్తే ఊరుకునేదే లేదు’అని తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆర్.కె. గౌడ్ హెచ్చరించారు. టికెట్ రేట్లు తగ్గించి, పర్సంటేజ్ విధానం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ ఏ.గురురాజ్ మాట్లాడుతూ... కొంత మంది సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్నారు. పెద్ద నిర్మాతలు, చిన్న నిర్మాతలు అంటూ ఎవరూ లేరు. ప్రతి ఒక్కరూ చిన్న నిర్మాత నుంచి పెద్ద నిర్మాతగా ఎదిగినవారే. నేను కూడా చాలా చిత్రాలు నిర్మించాను. కానీ సరైన థియేటర్స్ దొరక్క ఎంతో నష్టపోయాను. షూటింగ్స్ బంద్ చేయడానికి మీకు అధికారం లేదు. సామాన్యుడు ప్రస్తుతం సినిమా చూడాలంటే భయపడుతున్నాడు. కారణం టికెట్ల రేట్లు, తినుబండారాల రేట్లు పెంచడం. ముందు వీటిని తగ్గించండి. అంతే కానీ షూటింగ్స్ నిలిపేస్తే వచ్చేది ఏం లేదు. ఎవరైనా తమ షూటింగ్స్ ఆపారని మమ్మల్ని సంప్రదిస్తే మేము ప్రభుత్వం సపోర్ట్ తో వారిని ఎదుర్కొంటాం` అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సెక్రటరి సాగర్, హీరో సురేష్ బాబు, చెన్నారెడ్డి, కిషోర్, సతీష్, రాఖీ తదితరులు పాల్గొన్నారు. -
పక్కా మాస్‌గా 'ఏజెంట్ నరసింహ 117'.. ట్రైలర్ రిలీజ్
Agent Narasimha 117 Movie Trailer Released: కీర్తి కృష్ణ హీరోగా నిఖిత, మధుబాల హీరోయిన్లుగా లక్ష్మణ్ చప్రాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్ నరసింహ 117’. నవ్యసాయి ఫిలిమ్స్ పతాకంపై బి. నరసింహా రెడ్డి నిర్మించారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్, దర్శకుడు వి. సముద్ర, తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి ముత్యాల రాందాస్, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్‌లు ‘ఏజెంట్ నరసింహ 117’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘పక్కా మాస్‌గా రూపొందిన మూవీ ఇది. ఈ నెలలోనే రిలీజ్ చేస్తాం’’ అని తెలిపారు నిర్మాత బి. నరసింహా రెడ్డి. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ చప్రాల, నటుడు దయ మాట్లాడారు. రాజ్ కిరణ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. చదవండి: ఆయన పాటలు అనేక భావోద్వేగాలను పలకించేవి: ప్రధాని మోదీ నాకు మూడు ఫ్యామిలీలు ఉన్నాయి: అనిల్ రావిపూడి -
నారాయణ్ దాస్ మంచి సలహాలిచ్చేవారు: నిర్మాత
‘‘నారాయణ్ దాస్‌గారు ఏ సమస్యని అయినా క్షుణ్ణంగా పరిశీలించి, ఆ సమస్య మళ్లీ రాకుండా పరిష్కరించేవారు. చాంబర్‌కు సంబంధించిన విషయాల్లో మంచి సలహాలూ సూచనలు ఇస్తూ అభివృద్ధి దిశగా ఎలా వెళ్లాలో చెబుతుండేవారు. ఆయన్నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను’’ అన్నారు నిర్మాత దామోదర ప్రసాద్. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్, నిర్మాత నారాయణ్‌దాస్ నారంగ్ బుధవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. చదవండి: శ్రీవిష్ణు ‘భళా తందనాన’ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ తెలుగు, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, నిర్మాతల మండలి ఆధ్వర్యంలో ఆయనకు సంతాప సభ జరిగింది. ‘‘చిన్న సినిమాలకు మేం ఉన్నాం అనే భరోసా కల్పించారు నారాయణ్ దాస్‌గారు. ఏ రోజూ తాను చేసిన సేవలు బయటకు చెప్పుకోలేదు. మాట ఇస్తే వెనక్కి తగ్గే వ్యక్తి కాదు. అదే పద్దతి ఆయన తనయుడు సునీల్‌కు వచ్చింది’’ అని ప్రసన్నకుమార్ అన్నారు. ఇంకా దర్శకుడు వై.వి.యస్ చౌదరి, నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, డీఎస్ రావు, మోహన్ వడ్లపట్ల, పద్మినీ నాగులపల్లి తదితరులు పాల్గొన్నారు. చదవండి: సినీ నటి జీవితకు అరెస్ట్ వారెంట్ -
టికెట్ ధరల విషయంలో ఏపీ నిర్ణయం బాగుంది
‘‘గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, జిల్లా కేంద్రాలు.. ఇలా ప్రాంతాలను బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలు నిర్ణయించడం బాగుంది.. అలాంటి విధానం తెలంగాణ రాష్ట్రంలో కూడా వస్తే బాగుంటుంది’’ అని తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ– ‘‘తెలంగాణ ప్రభుత్వం టికెట్ల రేట్ల విషయంలో విడుదల చేసిన జీఓ 120 వల్ల చిన్న చిత్రాల నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. ఏపీలోలాగా ప్రాంతాలను బట్టి టికెట్ రేటు ఉంటే తప్ప తెలంగాణలో చిన్న చిత్రాలు బతికి బట్టకట్టలేని పరిస్థితి. కచ్చితంగా జీవో 120ని సవరించాలి. అలాగే లీజు విధానాన్ని కూడా రద్దు చేయాలి. థియేటర్స్ యాజమాన్యాన్ని, ప్రభుత్వాలను పెద్ద నిర్మాతలు తప్పుదోవ పట్టిస్తున్నారు. టికెట్ రేట్లు పెంచుకున్నప్పుడు థియేటర్ అద్దెలు కూడా పెంచాలి.. కానీ పెంచడం లేదు. దీని వల్ల ఎగ్జిబిటర్స్ నష్టపోతున్నారు. ఇండస్ట్రీ ఆ నలుగురిది మాత్రమే కాదు. ఆ నలుగురైదుగురి దోపిడీ వల్ల చిన్న నిర్మాతలు, చిన్న హీరోలు మునిగిపోతున్నారు. అంతటా ఒకే రేటు కాకుండా పాత పద్ధతినే కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌గారిని కలిసి వివరిస్తాం’’ అన్నారు. తెలంగాణ డైరెక్టర్స్ యూనియన్ అధ్యక్షుడు ఆర్. రమేష్ నాయుడు, వైస్ ప్రెసిడెంట్ ఎస్. వంశీ గౌడ్, ‘టి మా’ జనరల్ సెక్రటరీలు సకమ్ స్నిగ్ధ, బి కిషోర్ తేజ, వైస్ ప్రెసిడెంట్ ఎ. కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
'టీఎఫ్‌సీసీ' నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
ఇటీవల జరిగిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిసిన సంగతి తెలిసిందే. చైర్మన్ గా డా.లయన్ ప్రతాని రామకృష్ణగౌడ్, టిఎఫ్‌సీసీ వైస్ ఛైర్మన్లు గా ఎ.గురురాజ్, నెహ్రు, సెక్రటరీగా జేవీఆర్. తెలంగాణ `మా` ప్రెసిడెంట్ గా రష్మి ఠాకూర్, డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రమేష్ నాయుడు తదితరులు ఎన్నికయ్యారు. కాగా ఈ రోజు టీఎఫ్‌సీసీ చైర్మన్‌తో పాటు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, `మా` ప్రెసిడెంట్ మంచు విష్ణు అతిథులుగా హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు మా ప్రెసిడెంట్ మంచు విష్ణు చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. టీఎఫ్‌సీసీ చైర్మన్‌గా నాల్గోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రతాని రామకృష్ణ గౌడ్‌కు శుభాకాంక్షలు. ఈ సంస్థ ద్వారా ఎంతో మంది కళాకారులకు చేయూతనిస్తున్నారు. చిత్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ.. చిత్ర పరిశ్రమను మరింత ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తాం’అన్నారు. ‘మా’అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి నేను వ్యక్తిగత హోదాలో మాత్రమే వచ్చాను. సినిమా నటులలో ఆంధ్ర, తెలంగాణ అనే భేదం లేదు. మనమందరం తెలుగు వారం. మనమంతా కలిసి తెలుగు ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవాలని కోరుతున్నాను’అని అన్నారు. వైస్ చైర్మన్లు గురురాజ్, వెంక టేశ్వరరావు, నెహ్రు, సెక్రటరీగా జేవీఆర్,జనరల్ సెక్రటరీ బి.కిషోర్ పటేల్, ఆర్గనైజర్ సెక్రెటరీ డాక్టర్ వి.రామారావు గౌడ్, టి.మా వైస్ ప్రెసిడెంట్ జ్యోతి రెడ్డి, జాయింట్ సెక్రటరీస్ వేణు గోపాల్ రావ్, కల్యాణి నాయుడు, రాజయ్య, జి.చెన్నారెడ్డి,ఆర్గనైజింగ్ సెక్రటరీస్ యమ్.అశోక్,కె.యల్. యన్.ప్రసాద్, ఈ.సి మెంబర్స్ లయన్ డి.ప్రేమ సాగర్, లయన్ సి.హెచ్.శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. -
TFCC: నవంబర్ 14న టీఎఫ్‌సీసీ ఎన్నికలు
‘తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ)’ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయింది. నవంబరు 14న ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో టీ ఎఫ్‌సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘టీఎఫ్‌సీసీ స్థాపించి ఏడేళ్లు పూర్తయింది. మా చాంబర్లో 8000 మంది సినీ కార్మికులు, 800 మంది నిర్మాతలు, 400 మంది తెలంగాణ మూవీ ఆర్టిస్టులు సభ్యులుగా ఉన్నారు. 30 మందితో కూడిన టీఎఫ్‌సీసీ ప్రస్తుత కమిటీ గడువు ముగియనుండటంతో ఎన్నికలు నిర్వహిస్తున్నాం. నవంబరు 14నే ‘తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఆసక్తిగలవారు పోటీ చేయవచ్చు’’ అన్నారు. ‘‘టీఎఫ్‌సీసీ’ ప్రారంభమై ఏడేళ్లలో 8000 మంది సభ్యులుగా చేరడం సాధారణమైన విషయం కాదు. ‘టీఎఫ్‌సీసీ’ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాం’’ అన్నారు టీఎఫ్‌సీసీ ఉపాధ్యక్షుడు ఎత్తరి గురురాజ్. -
ఎగ్జిబిటర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : మంత్రి తలసాని
సినీ ఎగ్జిబిటర్స్ సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం తెలంగాణా స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు మాసాబ్ ట్యాంక్‌లోని మంత్రి కార్యాలయంలో ఆయనను కలిసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కరోనా మహమ్మారి కారణంగా సుమారుగా ఏడాది నుంచి సినిమా దియేటర్లు పూర్తిగా మూసి ఉన్నాయని మంత్రికి వివరించారు. సినిమా ఎగ్జిబిటర్స్, సినిమా దియేటర్ల నిర్వహకులు ఆర్ధికంగా ఎంతో నష్టపోయామని, ప్రభుత్వం ఈ కష్టకాలంలో అండగా నిలిచి ఆదుకోవాలని కోరారు. ప్రధానంగా సినిమా దియేటర్లు మూసి ఉంచిన సమయానికి ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని, సింగిల్ స్క్రీన్ ధియేటర్ లలో వాహనాల పార్కింగ్ చార్జి వసూలు చేసే వెసులుబాటు కల్పించాలని, ఎస్జీఎస్టీ ట్యాక్స్ రద్దు చేయాలని కోరారు. జీఓ 75ను పునరుద్దరించాలని, షూటింగ్ అనుమతులకు వసూలు చేసే చార్జీలను తగ్గించేలా చూడాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఆయన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో సునీల్ నారంగ్, అనుపమ్ రెడ్డి, అభిషేక్ నామా, సదానంద్ గౌడ్, బాల గోవింద్ రాజ్ తాడ్ల, టీఎస్ఎఫ్డీసీ ఈడీ కిషోర్ బాబు తదితరులు ఉన్నారు. -
నిత్యావసర సరుకులు పంపిణీ
కరోనా వైరస్ ప్రభావంతో నెలకొన్న లాక్ డౌన్ నేపథ్యంలో ‘తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్’లోని 100 మంది కళాకారులకు, సాంకేతిక నిపుణులకు ‘తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్’ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సంస్థ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు. ‘‘గతంలో కొంత మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. మళ్లీ ఈరోజు మరో వందమందికి పంపిణీ చేయడం అభినందనీయం’’ అన్నారు బూర నర్సయ్య గౌడ్. ‘‘పది కేజీల బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు అందించాం. త్వరలో మరికొంత మందికి అందిస్తాం’’ అన్నారు ప్రతాని రామకృష్ణ గౌడ్. ఈ కార్యక్రమంలో ‘తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్’ కార్యదర్శి కాచం సత్యనారాయణ, తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. -
స్క్రీన్ ఉంది.. సీన్ లేదు
ఒకప్పుడు ‘నేడే చూడండి... మీ అభిమాన హీరో సినిమా’ అంటూ రిక్షాల్లో తిరుగుతూ మైకుల్లో చెప్పేవారు. రిక్షా వెనకాల పిల్లలు పరిగెత్తుతూ సందడి సందడి చేసేవారు. ఇప్పుడు టీవీ, రేడియా, సోషల్ మీడియా ఇలా సినిమా ప్రమోషన్‌కి చాలా ఉన్నాయి. థియేటర్ ముందు అయితే భారీ కటౌట్లు, గజమాలలు, పాలాభిషేకాలతో ఫ్యాన్స్ సందడి సందడి చేస్తుంటారు. ఇప్పుడు కరోనా ప్రభావంతో థియేటర్ల ముందు సందడి లేదు. వెండితెర వెలవెలబోతోంది. ‘స్క్రీన్ ఉంది.. సీన్ లేదు’. ‘‘సినిమా చరిత్రలో ఇలా పదీ పదిహేను రోజులు ‘థియేటర్లు బంద్’ కావడం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైమ్ అని’’ నైజాం ప్రముఖ పంపిణీదారుడు చారి పేర్కొన్నారు. దాదాపు పది రోజులు థియేటర్లు మూసివేయడం ద్వారా ‘సింగిల్ థియేటర్’కి ఏర్పడే నష్టం ఐదారు లక్షలు ఉంటుందని, మల్టీప్లెక్స్‌కి ఇంకా ఎక్కువ ఉంటుందని ఓ పంపిణీదారుడు తెలిపారు. అయితే సినిమా ఆడినప్పుడు సింగిల్ థియేటర్‌తో పోల్చితే మల్టీప్లెక్స్‌కి రాబడి ఎక్కువ ఉంటుందని మరో పంపిణీదారుడు అన్నారు. థియేటర్ల నిర్వహణ గురించి కొందరు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చిన సమాచారంలోకి వెళదాం... ► ఈ మధ్య ‘సింగిల్ థియేటర్’కి అన్నీ నష్టాలే. ఎందుకంటే సినిమా రిలీజులు పెద్దగా లేవు. చిన్న సినిమాలు మంచి టాక్ తెచ్చుకుని ఓ మూడు నాలుగు వారాలు ఆడితే అప్పుడు లాభాలు చూడొచ్చు. ఇక పెద్ద హీరోల సినిమాలను ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తారు. దాంతో ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ మంచి వసూళ్లతో థియేటర్ నడుస్తుంది. థర్డ్ వీక్ నుంచి వసూళ్లు పడిపోతుంటాయి. ► మల్టీప్లెక్స్‌లో అయితే ఉన్న మూడు నాలుగు స్క్రీన్స్‌లోనూ పెద్ద సినిమాని ప్రదర్శిస్తారు. వాళ్లకు పర్సంటేజ్ సిస్టమ్ ఉంటుంది. మొదటి వారం వచ్చే వసూళ్లలో డిస్ట్రిబ్యూటర్ 55 శాతం, ఎగ్జిబిటర్ 45 శాతం తీసుకుం టారు. రెండో వారానికి రివర్శ్. 55 ఎగ్జిబిటర్ (సినిమా ప్రదర్శించేవాళ్లు), 45 శాతం డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటారు. అలా చివర్లో డిస్ట్రిబ్యూర్ 30, ఎగ్జిబిటర్ 70 శాతం తీసుకుంటారు. ► సింగిల్ థియేటర్ అయితే సినిమాని పర్సంటేజ్ పద్ధతిలో కాకుండా రెంటల్ సిస్టమ్‌కి ఇస్తారు. ఏరియాని బట్టి వారానికి నాలుగు లక్షలు రెంట్ ఉంటుంది. ఒకవేళ వసూళ్లు నామమాత్రంగా ఉంటే అప్పుడు డిస్ట్రిబ్యూటర్లు రెంటల్ విధానంలో కాకుండా పర్సంటేజ్ విధానంలో ఎగ్జిబిటర్ నుంచి డబ్బు తీసుకుంటారు. అది ఎప్పుడూ అంటే ఒక షోకి 50 వేలు వసూలు అయితే.. వారానికి సుమారు 10 లక్షలు కలెక్ట్ అవుతాయి. అప్పుడు డిస్ట్రిబ్యూటర్ 2 లక్షలు రెంట్ ఇచ్చేసి, మిగతా 8 లక్షలు తీసుకుంటారు. అదే వారం మొత్తం 2 లక్షలే వస్తే... ఎగ్జిబిటర్‌కి మొత్తం 2 లక్షలు రెంట్ ఇవ్వకుండా వచ్చిన వసూళ్లలో సగం తీసుకుంటారట పంపిణీదారుడు. అదే మల్టీప్లెక్స్ అయితే పర్సంటేజ్ సిస్టమే. ► అసలు ఒక థియేటర్ నెల మెయింటెనెన్స్ ఎంత అవుతుంది? అంటే.. బాగా నీట్‌గా మెయింటైన్ చేసే సింగిల్ థియేటర్‌కి ఐదున్నర నుంచి ఆరు లక్షలవుతుందట. ప్రొజెక్టర్ ఖర్చు, ప్రొజెక్టర్ బల్బ్, టాయ్‌లెట్, ఫ్లోర్ క్లీనింగ్, సీట్స్, కరెంట్ బిల్... ఇలాంటివన్నీ ఈ ఆరు లక్షల్లో ఉంటాయి. ప్రొజెక్టర్ నెల రెంట్ 30 వేలు అయితే, బల్బ్ దర 90 వేల నుంచి లక్ష వరకూ ఉంటుంది. రెండు మూడు నెలలకోసారి కొత్త బల్బ్ మార్చాల్సి ఉంటుంది. ఇది సింగిల్ థియేటర్ ఖర్చు. మల్టీప్లెక్స్‌కి వేరే విధంగా ఉంటుంది. అయితే సింగిల్ థియేటర్లో మూడు టికెట్ కౌంటర్లు ఉంటే.. మల్టీప్లెక్స్‌లోనూ దాదాపు అన్నే ఉంటాయని ఓ ఎగ్జిబిటర్ అన్నారు. కాకపోతే మల్టీప్లెక్స్‌లో స్టాఫ్ తక్కువ.. స్క్రీన్లు ఎక్కువ ఉంటాయి. అలాగే సింగిల్ థియేటర్లో సినిమా బాగా ఆడకపోతే క్యాంటీన్ రెవెన్యూ కూడా తగ్గుతుంది. కానీ మల్టీప్లెక్స్‌లో వేరే వేరే సినిమాలు స్క్రీనింగ్ చేసుకోవచ్చు కాబట్టి క్యాంటీన్ రన్ బాగానే ఉంటుంది. బాగున్న సినిమాని రెండు మూడు స్క్రీన్స్‌లో ప్రదర్శించే వీలు మల్టీప్లెక్స్‌కి ఉంటుంది. అయితే మల్టీప్లెక్స్వాళ్లకు ఉండే కష్టాలు వాళ్లకూ ఉంటాయి కానీ సింగిల్ థియేటర్స్‌కే నష్టం ఎక్కువ అని లెక్కలు చెబుతున్నారు కొందరు ఎగ్జిబిటర్లు. ► మరి ఈ పరిస్థితిలో థియేటర్ని ఎందుకు కంటిన్యూ చేయడం అంటే.. ఎప్పుడో థియేటర్స్ కట్టి ఉన్నాయి. వాటిని ఏం చేయాలన్నా కోట్లు పెట్టుబడి పెట్టాలి. ఉమ్మడి ప్రాపర్టీ అయితే పెట్టుబడి ఎవరు పెట్టాలి? అనే విషయంలో వివాదం వచ్చే అవకాశం ఉంది. ఇక పిల్లలు విదేశాల్లో సెటిల్ అయితే ఇక్కడున్న ప్రాపర్టీ మీద పెద్దగా దృష్టి పెట్టరు. అందుకని ఎలాగూ ఉన్నాయి కదా అని థియేటర్స్‌ని నడుపుతున్న ఎగ్జిబిటర్లే ఎక్కువ శాతం ఉన్నారని చారి పేర్కొన్నారు. ► ఇంతకీ పది రోజులు థియేటర్లు మూసేస్తే వచ్చే నష్టం ఎంతా అంటే ‘మినిమమ్ ఐదారు లక్షలు’ అంటున్నారు. ఏరియాని బట్టి ఈ లెక్కలో హెచ్చు తగ్గులుంటాయి. పైగా మార్కెట్లో దొరికే వస్తువులు ఇవాళ కాకపోతే రేపు అమ్ముడవుతాయి. కానీ ఆ రోజు సినిమా చూడాలనుకున్న ప్రేక్షకులు థియేటర్‌కి రాకపోతే ఆ మర్నాడు వస్తారన్న గ్యారంటీ లేదు. ఓ వారం తర్వాత ఆ సినిమా థియేటర్లో ఉంటుందన్న గ్యారంటీ కూడా లేదు. గత శుక్రవారం అర్జున, ప్రేమ పిపాసి’, 302, యురేక, మేద వంటి సినిమాలు విడుదలయ్యాయి. ఆ మర్నాటి నుంచే థియేటర్ల మూతను ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నష్టపోయే అవకాశం ఉంది. అయితే బాగా వినిపిస్తున్న మాట ఏంటంటే... కరోనా కారణంగా ప్రేక్షకులు పెద్దగా థియేటర్లకు రావడంలేదు. అందుకని ఇప్పుడు థియేటర్లు మూసినా పెద్దగా నష్టం వాటిల్లదనే చెబుతున్నారు. దానికి ఓ ఉదాహరణ చెప్పాలంటే... ఓ మల్టీప్లెక్స్ థియేటర్లో 3600 టికెట్లు బుక్ అయితే.. 600 మంది ప్రేక్షకులు అసలు థియేటర్‌కి రాలేదట. బుక్ చేసుకుని మరీ రాలేదంటే కరోనా ఎంత భయపెడుతోందో ఊహించుకోవచ్చు. షూటింగ్ బంద్ కరో కరోనా వైరస్ ప్రభావం అన్ని రాష్ట్రాల చిత్ర పరిశ్రమలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో సినిమాల చిత్రీకరణలను నిలిపివేస్తున్నట్లు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, నటీనటుల సంఘం, నిర్మాతల మండలి సంయుక్తంగా ప్రకటించాయి. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు నారాయణదాస్ నారంగ్ మాట్లాడుతూ – ‘‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో షూటింగ్స్‌ను నిలిపి వేయాలని తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది’’ అన్నారు. ‘‘తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లు సంయుక్తంగా చిత్రీకరణలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొందరు నిర్మాతలకు ఇబ్బందిగా ఉన్నా సరే మా ఈ నిర్ణయానికి అందరూ సహకరించాలని కోరుతున్నాం. కరోనా కారణంగా తెలంగాణలో ఎక్కడా షూటింగ్స్ జరగవు’’ అన్నారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్. ‘‘కరోనా వైరస్ చాలా భయంకరమైనది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం థియేటర్స్, మాల్స్ బంద్ ప్రకటించడం జరిగింది. అదే విధంగా షూటింగ్ నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది’’ అన్నారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ యాక్టింగ్ ప్రెసిడెంట్ బెనర్జీ. ‘‘తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా తీసుకున్న నిర్ణయం ఇది. థియేటర్స్ బంద్‌తోపాటు షూటింగ్స్ కూడా నిలిపివేయాలనేది అందరూ మాట్లాడుకుని తీసుకున్న నిర్ణయం. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న చిత్రీకరణలు ఒక్కొక్కటిగా ఆగిపోతున్నాయి. అభ్యంతరం లేని ఆంధ్రా ప్రాంతాల్లో షూటింగ్స్ జరుగుతున్నాయి’’ అన్నారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు సి. కల్యాణ్. ‘‘షూటింగ్స్‌లో వందలమంది పాల్గొంటుంటారు. వారి ఆరోగ్య దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సామాజిక బాధ్యతతో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. అందరం దీన్ని సమర్థిస్తున్నాం’’ అన్నారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సెక్రటరీ జీవితా రాజశేఖర్. ‘‘ప్రభుత్వం మళ్లీ షూటింగ్స్ జరుపుకోవచ్చని తెలియజేసినప్పుడు చిత్రీకరణలు పునరావృతం అవుతాయి. ఈ నిర్ణయాన్ని నిర్మాతలందరూ స్వాగతించాలి’’ అన్నారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్. ఈ సమావేశంలో నిర్మాతలు శ్యామ్ ప్రసాద్, ఠాగూర్ మధు, నట్టికుమార్, రామసత్యానారాయణ, సురేందర్‌రెడ్డి, కొమర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు సినిమాలు, టీవీ సీరియల్స్, వెబ్‌సిరీస్‌ల షూటింగ్స్ కూడా ఈ నెల 19 నుంచి 31 వరకు జరగకూడదని ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐఎమ్పీఆర్ఏ) ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. తిరిగి షూటింగ్స్‌ను ఎప్పుడు ప్రారంభించాలనే విషయాలను అప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 30న ఓ నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఐఎమ్పీఆర్ఏ పేర్కొంది. సి. కల్యాణ్, ప్రసన్నకుమార్, జీవిత, వెంకటేష్, నారాయణదాస్, బెనర్జీ, దామోదర ప్రసాద్, మధు -
టీఎఫ్‌సీసీ అధ్యక్షుడిగా ప్రతాని
‘తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్’ (టీఎఫ్‌సీసీ) ఎన్నికలు ఆదివారం హైదరాబాద్‌లో జరిగాయి. ప్రెసిడెంట్‌గా ప్రతాని రామకృష్ణ గౌడ్, ప్రధాన సలహాదారునిగా నిర్మాత ఏ.యమ్ రత్నం, వైస్ ప్రెసిడెంట్‌గా నిర్మాత గురురాజ్, రంగా రవీంద్ర గుప్తా, అలీ భాయ్, సెక్రెటరీలుగా కె.వి. రమణా రెడ్డి, కె .సత్యనారాయణ , ఆర్గనైజయింగ్ సెక్రెటరీలుగా వి. మధు, పూసల కిశోర్, రవీంద్ర గౌడ్, జాయింట్ సెక్రెటరీలుగా సతీష్, నాగరాజు గౌడ్, జి. శంకర్ గౌడ్, కోశాధికారిగా రామానుజం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటుగా ఈసీ మెంబర్స్‌గా వి. కృష్ణ రావు, హెచ్. కృష్ణ రెడ్డి, అలెక్స్, ఇ .సదాశివరెడ్డి, రాజు నాయక్, వెంకటేష్ గౌడ్, టి. శ్రీనివాస్ గౌడ్, టి. రాజేష్, ఎమ్. వెంకటేష్, ముఖావర్ వలి, మహాలక్ష్మి, బి. నాగరాజు (జడ్చెర్ల ) ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్’ ప్రెసిడెంట్ పి.రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – ‘‘తెలంగాణ ఫిలిం ఛాంబర్ బిల్డింగ్ నిర్మాణానికి స్థలం కేటాయిస్తాం. పది ఎకరాల్లో సినీ వర్కర్స్ ఇళ్ల కోసం స్థలం కేటాయిస్తాం. కల్చరల్ సెంటర్ కోసం స్థల కేటాయింపుతో పాటు 24 శాఖల్లోని వర్కర్స్ అందరికీ పని దొరికేలా చూస్తాం. త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారిని కలిసి ఇవ్వన్నీ ప్రభుత్వం ద్వారా చేయాలని తీర్మానించుకున్నాం’’ అన్నారు. -
డిజిటల్ చార్జీలు తగ్గించాల్సిందే
డిజిటల్ రేట్స్ అండ్ థియేటర్స్ లీజ్ విధానంపై ఇండస్ట్రీకి అనుకూలంగా మార్చి 31లోపు సరైన నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్‌ను మూసివేయడంతోపాటు, షూటింగ్‌లను బంద్ చేయాలనుకుంటున్నట్లు ఇటీవల తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఓ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయానికి తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్, వైస్ ప్రెసిడెంట్ అలీఖాన్, నిర్మాత సాయివెంకట్ మద్దతు తెలిపారు. మంగళవారం పాత్రికేయుల సమావేశంలో ప్రతాని మాట్లాడుతూ– ‘‘తమిళనాడు, కర్ణాటక, ముంబైలలో డిజిటల్ చార్జీలు వారానికి 2500 రూపాయలు వసూలు చేస్తున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో 13వేలు వసూలు చేస్తున్నారు. ఈ విధానంలో మార్పు రావాలి’’ అన్నారు. ‘‘ఇప్పటికైనా సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం’’ అన్నారు సాయి వెంకట్. -
చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయ్
బంజారాహిల్స్: చిన్న సినిమాలను బతికించాలని కోరుతూ తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో సోమవారం ఫిలించాంబర్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత ఆర్. నారాయణమూర్తి హాజరై మాట్లాడుతూ సినిమా పరిశ్రమ పెట్టుబడిదారుల మయం అయిపోయిందని, వారి ఆధిపత్యం పెరిగిపోయిందన్నారు. వాళ్ల వల్ల చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయన్నారు. థియేటర్ల విషయంలో గుత్తాధిపత్యం కొనసాగుతుందని దీనిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని తగిన విధంగా ఆలోచించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతాని రామకృష్ణగౌడ్, సాయి వెంకట్, కవిత, అన్నపూర్ణమ్మ, రమ్యశ్రీ, బల్లెపల్లి మోహన్, వట్టికుమార్, శ్రీలక్ష్మి, పీఎన్.రాంచందర్‌రావు, వాసిరాజు ప్రకాశం, జ్యోతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సినీ సమస్యల పరిష్కారానికి స్క్రీనింగ్ కమిటీ
‘‘తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) ఏర్పాటుకి రాష్ట్ర సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. చిత్రసీమలో సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లగా, వాటి పరిష్కారానికి త్రిసభ్య కమిటీ వేశారు. సినీ కార్మికుల్లో సంతోషాన్ని నింపుతున్న కేసీఆర్‌గారికి కృతజ్ఞతలు’’ అన్నారు టీఎఫ్‌సీసీ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణగౌడ్. టీఎఫ్‌సీసీ ఏర్పాటై రెండేళ్లు పూరై్తన సందర్భంగా ఉపాధ్యక్షులు రంగా రవీంద్రగుప్తా, కార్యదర్శి ‘లయన్’ సాయివెంకట్లతో కలసి రామకృష్ణగౌడ్ మీడియాతో మాట్లాడారు. ‘‘టీఎఫ్‌సీసీలో వెయ్యిమంది నిర్మాతలు, ఇతర శాఖలను కూడా కలుపుకుని సుమారు 3000 మంది సభ్యులున్నారు. వారందరికీ హెల్త్ కార్డులు, సభ్యుల పిల్లలకు స్కాలర్షిప్ ఇప్పించనున్నాం. చిన్న చిత్రాలకు ఐదవ ఆట, చిత్రపురి కాలనీలో ఇల్లు లేనివారికి 9 ఎకరాల కేటాయింపు, ప్రభుత్వం తరపున ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు వంటివి సీఎం దృష్టికి తీసుకువెళ్లాం. త్వరలో జీవో వస్తుంది’’ అని రామకృష్ణగౌడ్ తెలిపారు. -
తెలంగాణలో మరో చాంబర్
‘తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్’ పేరుతో విజయేందర్ రెడ్డి అధ్యక్షతన ఇప్పటికే ఓ సంఘం సినీ వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు తెలంగాణలో మరో చాంబర్ అవతరించింది. దీని పేరు - ‘తెలంగాణ మూవీ చాంబర్ ఆఫ్ కామర్స్’. తెలంగాణ సినిమాను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ సరికొత్త సంస్థను ఏర్పాటు చేసినట్లు ప్రధాన కార్యదర్శి సానా యాదిరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి ‘దిల్’ రాజు అధ్యక్షునిగా, విజయేందర్ రెడ్డి ఉపాధ్యక్షునిగా, జాయింట్ సెక్రటరీగా సంగ కుమారస్వామి, కోశాధికారిగా బాల గోవిందరాజులు వ్యవహరిస్తారనీ, అల్లాణి శ్రీధర్, సంగిశెట్టి దశరథ, సత్యనారాయణ గౌడ్లు ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా, గౌరవ సలహాదారుగా బి. నరసింగరావు వ్యవహరిస్తారనీ తెలిపారు. ఇప్పటికే ‘తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్’ ఉండగా, మరో సంఘాన్ని ఆరంభించడానికి కారణం ఏంటి? ‘‘ఇప్పటికే ఉన్న సంఘంలో పంపిణీదారులు, థియేటర్ అధినేతలు ఎక్కువ శాతం మంది ఉన్నారు. అందుకే, నిర్మాతల కోసం ఈ తాజా సంఘాన్ని ఆరంభించాం. అయితే నిర్మాతలకు మాత్రమే పరిమితం కాదల్చుకోలేదు. దర్శకులు, పంపిణీదారులు, థియేటర్ అధినేతలను కూడా చేర్చుకుంటాం’’ అని ప్రధాన కార్యదర్శి సానా యాదిరెడ్డి ‘సాక్షి’కి వివరించారు. చిన్న నిర్మాతల సమస్యలకు పరిష్కారం కోరుతూ, తెలంగాణ కళాకారుల అభివృద్ధికి ప్రభుత్వం సహకారం కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవనున్నామన్నారు. -
కోహినూర్ అవార్డ్స్ ప్రదానోత్సవం