మలేషియాలో ఎస్టాబ్లిష్డ్ అయిన 'సన్ షైన్' ఓటీటీ సంస్థని త్వరలో ఇండియాకు పరిచయం చేయనున్నారు. తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్‌తో(టిఎఫ్‌సీసీ)తో టై అప్ అవుతూ ఈ ఓటీటీని ఇక్కడ ఘనంగా లాంచ్ చేయబోతున్నారు 'సన్ షైన్' సిఎమ్ డి బొల్లు నాగ శివప్రసాద్ చౌదరి. ఈ సందర్భంగా సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో టీఎఫ్‌సిసి ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ...'ప్రస్తుతం ఇండియాలో ఓటీటీల హవా నడుస్తోంది. ఈ ఓటీటీ ద్వారా తెలుగుతో పాటు అన్ని భాషల చిత్రాలు రిలీజ్ చేయనున్నాం. అలాగే షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్ కూడా రిలీజ్ చేయడానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ అంతా స్తబ్దతలో ఉన్న విషయం తెలిసిందే. నా అనుభవంతో...నిర్మాతల కష్టనష్టాలు తెలిసిన వ్యక్తిగా ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న వాటితో ఏమాత్రం ఏకీభవించను. సినీ నిర్మాత అనేవాడు తన సినిమాను ఎప్పుడు అమ్మాలనేది తనే నిర్ణయించుకోవాలి తప్ప ఏ అసోసియేషనో, మరో సంస్థో చెప్పడం కరెక్ట్ కాదు. నిర్మాత డబ్బు ఎక్కడ వస్తే అక్కడే ఇచ్చుకునే అవకాశం ఉండాలి. థియేటర్స్ ఇవ్వరు...ఓటీటీలో అమ్ముకునే అవకాశం ఇవ్వమంటే ఎలా? నిర్మాతకు తన సినిమాను తనే అమ్ముకునే స్వేచ్ఛ ఉండాలి. నిర్మాతలపై ఏ అసోసియేషన్ కండీషన్ పెట్టొద్దు. ఒకవేళ పెడితే రిలీజ్‌కి థియేటర్స్ కూడా పర్సేంటేజ్ విధానంలో ఇవ్వాలి. ఇదే మా డిమాండ్. మా చాంబర్ ఎప్పుడూ నిర్మాతలకు అండగా ఉంటుంది' అన్నారు.
సన్ షైన్ సియమ్ డి బొల్లు నాగ శివప్రసాద్ చౌదరి మాట్లాడుతూ...``లాక్డౌన్ టైమ్‌లో ఓటీటీ సంస్థలు ప్రారంభమై పబ్లిక్‌లోకి విపరీతంగా చొచ్చుకెళ్లాయి. దీనిపై నేను రెండేళ్ల పాటు వ్యూయర్ షిప్, రెవెన్యూ ఎలా? ఏంటనే విషయాలపై రీసెర్చ్ చేసి సన్ షైన్ అనే పేరుతో ఓటీటీ సంస్థ ప్రారంభించాం. ప్రస్తుతం ఇండియాలో లాంచ్ చేయబోతున్నాం. అన్ని భాషల చిత్రాలు మా ఓటీటీ ద్వారా రిలీజ్ చేయనున్నాం. ఇప్పటికే వెయ్యికి పైగా చిత్రాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఒరిజినల్ కంటెంట్ కూడా ఉంది. కొత్తవారిని ఎంకరేజ్ చేయడానికి షార్ట్ ఫిలిం కాంటెస్ట్ కూడా పెట్టనున్నాం. త్వరలో మా ఓటీటీ సంస్థని గ్రాండ్ గా లాంచ్ చేయనున్నాం' అన్నారు.
చదవండి: థియేటర్, ఓటీటీలో సందడి చేసే సినిమాలివే!
హీరోగా చేస్తానని చెప్పగానే నాన్న చివాట్లు పెట్టారు
Comments
Please login to add a commentAdd a comment