sunshine
-
సూర్యం శరణం గచ్ఛామి!
కేస్ స్టడీ.. చిన్న బకెట్‌తో నీళ్లు తెస్తుంటే.. ఆత్మకూరు మండలం నల్లపరెడ్డిపల్లె గ్రామానికి చెందిన మస్తానమ్మకు సుమారు 60 ఏళ్లు ఉంటాయి. యాక్టివ్‌గా ఉండేది. అయితే కొంతకాలం క్రితం చిన్న బకెట్‌తో నీరు తీసుకువెళ్తుండగా కాలు స్లిప్ అయి మెల్లగా కిందకు ఒరిగిపోయి పైకి లేవలేకపోయింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు నెల్లూరులోని ఆస్పత్రికి తరలించారు. ఎక్స్‌రే తీయగా తొడభాగంలో పొడవైన ఎముక ముక్కలుగా విరిగిపోయి ఉంది. దీంతో డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేసి రాడ్ వేశారు. ఇలా ఎందుకు జరిగిందని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా ఆమెకు విటమిన్–డి, కాల్షియం లోపం ఉన్నాయని, అందుకే ఎముకలు పెళుసుబారి కాలు విరిగిందని డాక్టర్లు తెలిపారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. నిత్యం ఇలాంటి కేసులు జిల్లాలోని పలు ఆస్పత్రులకు వస్తున్నాయి. సాక్షి, నెల్లూరు డెస్క్: ఆరోగ్యమే మహాభాగ్యం. సృష్టిలో ప్రతి జీవి ఆరోగ్యంగా ఉండేలా ప్రకృతి అన్ని వనరులు ప్రసాదించింది. కానీ మనిషి జీవనశైలి గాడి తప్పడంతో అనారోగ్యాలకు గురవుతున్నాడు. మన దేశ జనాభాలో ప్రతి నలుగురిలో ముగ్గురు విటమిన్–డి లోపంతో బాధపడుతున్నట్లు తాజాగా గురుగావ్‌కు చెందిన టాటా గ్రూప్ కంపెనీ 1ఎంజీ నిర్వహించిన సర్వేలో వెల్లడైనట్లు పేర్కొంది. విటమిన్–డి ఎలా అందుతుంది? మన శరీరానికి రెండు మార్గాల ద్వారా విటమిన్–డి అందుతుంది. అందులో మొదటిది సూర్యరశ్మి నుంచి, రెండోది ఆహారంగా తీసుకోవడం ద్వారా వస్తుంది. ప్రతిరోజూ ఎండలో కొంత సమయం ఉంటే చాలు మనిషి శరీరానికి అవసరమైన డి–విటమిన్ సహజంగానే అందుతుంది. అలాగే చేపలు, గుడ్డులోని పచ్చసొన, పాలు, తృణధాన్యాలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. ప్రాముఖ్యత ఏమిటంటే.. మన దేహంలో బలమైన ఎముకలు, కండరాలు, దంతాలు ఏర్పడాలంటే విటమిన్–డి ఎంతో అవసరం. తగినంతగా ఈ షోషకం లేకపోతే చిన్నపిల్లల్లో ఎముకలు పటుత్వం కోల్పోయి వంకర్లు పోతాయి. పెద్దవాళ్లలో అయితే ఎముకలు గుల్లబారి ధృడత్వం పోతుంది. తర్వాత కీళ్ల నొప్పులతో మొదలై పలు ఇబ్బందులు ఏర్పడతాయి. ఫలితంగా ఏ చిన్న ప్రమాదం జరిగినా ఎముకలు విరిగి పోతుంటాయి. అందుకే ముందుగా మేల్కొని డాక్టర్‌ను సంప్రదించి సమస్య రాకుండా జాగ్రత్తపడాలి. డి–విటమిన్ లోపిస్తే.. మన శరీరానికి విటమిన్–డి లోపిస్తే ఉదరంలోని పేగులు కాల్షియం, ఫాస్ఫరస్‌ను తగినంతగా సంగ్రహించలేవు. ఇది హైపోకాల్సిమియాకు దారితీస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. అంటే రక్తంలో కాల్షియం లెవెల్స్ తగ్గిపోవడం. ఫలితంగా కండరాలు బలహీనపడి.. పిక్కలు పట్టేయడం, మలబద్ధకం, నీరసం వంటి సమస్యలు వస్తాయి. తీవ్రత ఎక్కువైతే ఒక్కోసారి డిప్రెషన్‌కు గురికావచ్చు. సమస్యకు కారణాలు విటమిన్–డి లోపం నేటి కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఉంది. గతంలో సుమారు మూడు దశాబ్దాల క్రితం వరకు స్కూళ్లలో విద్యార్థులు ఉదయం కొంతసేపు ఎండలో నిలబడి ప్రతిజ్ఞ చేసేవారు. అంతేకాకుండా సాయంత్రం డ్రిల్ పిరియడ్ ఉండేది. ఆ సమయంలో పిల్లలందరూ గ్రౌండ్లో ఆటలాడేవారు. ఆ విధంగా వారికి అవసరమైన మేరకు డి విటమిన్ సూర్యరశ్మి ద్వారా అందేది. పెద్దలు కూడా ఎక్కువమంది ఎండలోనే కాయకష్టం చేసేవారు కాబట్టి వారికి ఈ సమస్య ఎదురుకాలేదు. కాలక్రమంలో ప్రైవేట్ స్కూళ్లు ఎక్కువ కావడం, వాటిలో చేరే విద్యార్థులను నాలుగు గోడల మధ్య కుక్కి చదివించడమే కానీ గౌండ్‌లో ఆటలాడించడం లేకుండా పోయింది. ధనికుల పిల్లలు ఇళ్లలో, స్కూళ్లలో కూడా ఏసీ గదుల్లోనే గడిపేస్తుండటంతో వారికి విటమిన్–డి లోపిస్తోంది. అవగాహన లోపం ఎండలో తిరిగితే నల్లబడిపోతామని, చర్మ ఛాయ తగ్గుతుందని భావిస్తూ చాలామంది ఇళ్లలోనే ఉండిపోతున్నారు. ఒకవేళబయటకు రావాల్సి వచ్చినా పూర్తిగా దుస్తులతో శరీరాన్ని కప్పేస్తున్నారు. ఇలా చేయడంతో వారికి సూర్యరశ్మి తగలకు విటమిన్–డి అందడం లేదు. శరీరానికి ఉదయం, సాయంత్రం వేళల్లో అయినా కొంత సమయం సూర్యరశ్మి తాకేలా చూసుకోవాలి. గ్రామీణులే మెరుగు సాధారణంగా పట్టణాల్లో నీడపట్టున పనిచేయడం, ఏసీ రూంలలో ఉండటం, రాత్రిళ్లు మేలుకొని విధులు నిర్వర్తించే వారు, ఇలా ఎండతగలని వారికి విటమిన్–డి లోపం ఉంటోంది. ఎండలో కనీసం 4 గంటలు పని చేసేవారికి విటమిన్–డి ఎక్కువగా వస్తుంది. తద్వారా ఎముకలు బలంగా, ధృడంగా ఉంటాయి. అందువల్లనే గ్రామీణ ప్రాంతాల్లో ఎండలో పని చేసేవారికి డి విటమిన్ అంది వారు ధృడంగా ఉంటారని వైద్యులు చెపుతున్నారు. ఇష్టానుసారంగా విటమిన్లు తీసుకోరాదు ప్రస్తుతం మార్కెట్లో అనేక మంది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇష్టానుసారంగా విటమిన్–డి, కాల్షియం, ఇ విటమిన్ లాంటి మాత్రలు కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. ఇది సరైనది కాదు. శరీరానికి తక్కువ మోతాదులో విటమిన్లు అవసరమవుతాయి. ప్రతిరోజూ డి–విటమిన్ ట్యాబ్లెట్ తీసుకుంటే ఆ కాంపోనెంట్ ఎక్కువై మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. శరీరానికి ఉపయోగపడదు. ఒక్కో దఫా అతిగా వినియోగించినందు వల్ల అర్థిమియా వచ్చి (గుండె చాలా వేగంగా కొట్టుకోవడం) గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల డాక్టర్ల సలహా లేకుండా ఏ మాత్రలు వినియోగించకూడదు. పిల్లల్లోనూ సమస్య ఉంది డి–విటమిన్ లోపం పెద్ద వారిలోనే కాకుండా పిల్లల్లోనూ ఉంది. 30 శాతం మంది పిల్లల్లో డి–విటమిన్¯ తక్కువ ఉన్నందువల్ల వారి శారీరక, మానసిక పెరుగుదల సరిగా ఉండటం లేదు. ఈ ప్రభావం చదువుపై పడుతోంది. అంతేకాకుండా చిన్నపిల్లల్లో రికెట్స్ వ్యాధికి గురవుతున్నారు. పెద్దల్లో 40 నుంచి 45 శాతం మందికి విటమిన్–డి లోపం ఉంటోంది. డి–విటమిన్ శరీరానికి అందాలంటే ఎండవేడిమికి అలవాటు పడాలి. విటమిన్లు తగ్గితే శరీర జీవన ప్రక్రియలు సకాలంలో జరగాల్సిన తీరులో జరగవు. విటమిన్స్ లభించే పదార్ధాలు, ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి. –డాక్టర్ మస్తాన్‌బాష, అసోసియేట్ ప్రొఫెసర్, ఆర్థోపెడిక్ స్పెషలిస్టు, జీజీహెచ్ అతిగా ఉపయోగిస్తే అనర్ధాలు జీవన క్రియలు సక్రమంగా జరగాలంటే స్థూల పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు విటమిన్లు శరీరానికి అవసరం. ఇందులో డి విటమిన్ శరీరంలో తక్కువగా ఉందంటే అనుబంధంగా కాల్షియం కూడా తగ్గిపోతుంది. ఇసుక–సిమెంట్ కలిస్తేనే గోడ బలంగా ఉన్నట్టు, డి విటమిన్, కాల్షియం సరిపడా ఉండాలి. ఇవి లోపిస్తే ఎముకలు గుల్లబారుతాయి. పెద్ద కారణం లేకుండానే ఎముకలు విరిగిపోతాయి. 40 ఏళ్లు వచ్చిన మహిళల్లో ముందస్తు మెనోపాజ్ దశ వల్ల కూడా విటమిన్స్ లోపం ఏర్పడి హార్మోన్స్ బ్యాలెన్స్ తగ్గి కాల్షియం తగ్గిపోతుంది. అప్పుడు డి విటమిన్ కూడా తగ్గుతుంది. మునగ ఆకు, మునగ కాయలు, రాగులు, పాలు, గుడ్డు, చేప, గుమ్మడి లాంటి ఆహార పదార్థాలు తీసుకునే వారిలో విటమిన్ డి తగ్గదు. –డాక్టర్ రోజారమణి, అసోసియేట్ ప్రొఫెసర్, జనరల్ సర్జన్, జీజీహెచ్ -
హమ్మయ్య.. సూర్యుడు కనిపించాడు
న్యూయార్క్: అమెరికాలో గత కొద్ది రోజులుగా మంచు తుఫాన్‌కు అల్లాడిపోయిన న్యూయార్క్ రాష్ట్రంలోని బఫెలో సిటీలో ఎట్టకేలకు సూర్యరశ్మి కనిపించింది. గురువారం ఉదయం సూర్యుడి రాకతో కాసేపు వాతావరణం వెచ్చగా మారడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రాంతంలో ప్రజల క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి నేషనల్ గార్డ్ అధికారులు ఇంటింటికి వెళ్తున్నారు. విద్యుత్ సౌకర్యం పోయిన ఇళ్లకి వెళ్లి వారు ఎలా ఉన్నారో వాకబు చేస్తున్నారు. తీవ్రమైన మంచు కురుస్తున్నప్పుడు కరెంట్ పోయిన సమయంలో ఆక్సిజన్ వెంటిలేషన్ మీద ఉన్నవారు, వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యవసర సహాయం అందక కొందరు మృతి చెందిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. రహదారులపై కొన్ని అడుగుల మేర పేరుకుపోయిన మంచు కరిగితే ఇంకా ఎన్ని మృతదేహాలు బయటకు వస్తాయోనన్న ఆందోళనైతే నెలకొంది. బఫెలో నగరంలో రాకపోకల్ని పునరుద్ధరించారు. భారీ యంత్రాల సాయంతో రహదారులపై ముంచెత్తిన మంచుని తొలగించే పని యుద్ధ ప్రాతిపదికన జరుగుతోందని బఫెలో నగర మేయర్ బైరన్ బ్రౌన్ వెల్లించారు. అత్యవసరమైతే తప్ప ఇంకా ఇంటి నుంచి బయటకు రావొద్దని ఆయన నగర ప్రజలను హెచ్చరించారు. అమెరికాలోని మరికొన్ని రాష్ట్రాల్లో మంచు ముంచేయడంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో నీటి పైపులు పగిలిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజులుగా కుదిపేసిన మంచు తుఫాన్ కాస్త శాంతించినట్టే కనిపిస్తోంది. -
ఓటీటీ దిగ్గజాలకు పోటీగా వస్తోన్న 'సన్‌షైన్'
మలేషియాలో ఎస్టాబ్లిష్డ్ అయిన 'సన్ షైన్' ఓటీటీ సంస్థని త్వరలో ఇండియాకు పరిచయం చేయనున్నారు. తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్‌తో(టిఎఫ్‌సీసీ)తో టై అప్ అవుతూ ఈ ఓటీటీని ఇక్కడ ఘనంగా లాంచ్ చేయబోతున్నారు 'సన్ షైన్' సిఎమ్ డి బొల్లు నాగ శివప్రసాద్ చౌదరి. ఈ సందర్భంగా సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీఎఫ్‌సిసి ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ...'ప్రస్తుతం ఇండియాలో ఓటీటీల హవా నడుస్తోంది. ఈ ఓటీటీ ద్వారా తెలుగుతో పాటు అన్ని భాషల చిత్రాలు రిలీజ్ చేయనున్నాం. అలాగే షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్ కూడా రిలీజ్ చేయడానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ అంతా స్తబ్దతలో ఉన్న విషయం తెలిసిందే. నా అనుభవంతో...నిర్మాతల కష్టనష్టాలు తెలిసిన వ్యక్తిగా ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న వాటితో ఏమాత్రం ఏకీభవించను. సినీ నిర్మాత అనేవాడు తన సినిమాను ఎప్పుడు అమ్మాలనేది తనే నిర్ణయించుకోవాలి తప్ప ఏ అసోసియేషనో, మరో సంస్థో చెప్పడం కరెక్ట్ కాదు. నిర్మాత డబ్బు ఎక్కడ వస్తే అక్కడే ఇచ్చుకునే అవకాశం ఉండాలి. థియేటర్స్ ఇవ్వరు...ఓటీటీలో అమ్ముకునే అవకాశం ఇవ్వమంటే ఎలా? నిర్మాతకు తన సినిమాను తనే అమ్ముకునే స్వేచ్ఛ ఉండాలి. నిర్మాతలపై ఏ అసోసియేషన్ కండీషన్ పెట్టొద్దు. ఒకవేళ పెడితే రిలీజ్‌కి థియేటర్స్ కూడా పర్సేంటేజ్ విధానంలో ఇవ్వాలి. ఇదే మా డిమాండ్. మా చాంబర్ ఎప్పుడూ నిర్మాతలకు అండగా ఉంటుంది' అన్నారు. సన్ షైన్ సియమ్ డి బొల్లు నాగ శివప్రసాద్ చౌదరి మాట్లాడుతూ...``లాక్డౌన్ టైమ్‌లో ఓటీటీ సంస్థలు ప్రారంభమై పబ్లిక్‌లోకి విపరీతంగా చొచ్చుకెళ్లాయి. దీనిపై నేను రెండేళ్ల పాటు వ్యూయర్ షిప్, రెవెన్యూ ఎలా? ఏంటనే విషయాలపై రీసెర్చ్ చేసి సన్ షైన్ అనే పేరుతో ఓటీటీ సంస్థ ప్రారంభించాం. ప్రస్తుతం ఇండియాలో లాంచ్ చేయబోతున్నాం. అన్ని భాషల చిత్రాలు మా ఓటీటీ ద్వారా రిలీజ్ చేయనున్నాం. ఇప్పటికే వెయ్యికి పైగా చిత్రాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఒరిజినల్ కంటెంట్ కూడా ఉంది. కొత్తవారిని ఎంకరేజ్ చేయడానికి షార్ట్ ఫిలిం కాంటెస్ట్ కూడా పెట్టనున్నాం. త్వరలో మా ఓటీటీ సంస్థని గ్రాండ్ గా లాంచ్ చేయనున్నాం' అన్నారు. చదవండి: థియేటర్, ఓటీటీలో సందడి చేసే సినిమాలివే! హీరోగా చేస్తానని చెప్పగానే నాన్న చివాట్లు పెట్టారు -
కరోనా: పెరుగుతున్న విటమిన్ల వాడకం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ విజంభన వల్ల ప్రపంచ దేశాల్లో విటమిన్ సప్లిమెంట్లను తీసుకోవడం పెరిగిపోయింది. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు కావలసిన రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు నేడు ప్రజలు విటమిన్లు ఎక్కువగా తీసుకుంటున్నారు. రొమ్ము, అండాశయం తదితర క్యాన్సర్ల నుంచి బయట పడేందుకు ఏసీఈ విటమిన్లు దోహదం చేయడం కూడా విటమిన్ల వాడకాన్ని పెంచింది. గతేడాదితో పోలిస్తే ఒక్క బ్రిటన్‌లోనే విటమిన్ల వినియోగం ఏకంగా 17.3 శాతం పెరిగింది. నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు 12 రకాల మొక్కలు, ఐదు రకాల జంతువుల నుంచి వస్తోన్న ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నారు. అందుకనే ఇంకా విటమిన్లు, పోషక పదార్థాల కోసం ఇతర మార్గాలు వెతుక్కోవాల్సి వస్తోంది. బంగాళా దుంపలో సీ విటమిన్‌తోపాటు బీ 6 విటమిన్లు ఉంటాయి. రోగ నిరోధక శక్తిని ఎదుర్కోవడంలో కీలక పాత్ర వహించే డీ విటమిన్ లోపాన్ని ప్రజలు ఎదుర్కొంటున్నారు. అందుకు ఆధునిక జీవన విధానంతోపాటు వాణిజ్య ప్రపంచీకరణ కూడా కారణమే. క్యాన్సర్‌ను సమర్థంగా ఎదుర్కోవడంలో కూడా డీ విటమిన్ బాగా పని చేస్తోందని తాజా అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. సూర్య రశ్మి ద్వారా వచ్చే డీ విటమిన్ కోసం కూడా నేడు ప్రజలు సప్లిమెంట్లపై ఆధార పడాల్సి వస్తోంది. (చదవండి: భారత్‌లో తగ్గుతున్న ‘కరోనా మరణాలు’) శరీరంలోని ‘యాంటీ ఆక్సిడెంట్లు’ తగ్గించడంలో ఏ, ఈ విటమిన్లు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఏ, ఈ విటమిన్లు ఎక్కువగా ఉండే సప్లిమెంట్ల వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాటికి బదులుగా ఈ రెండు విటమిన్లు సహజంగా దొరికే ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా మంచిదని వారు సూచిస్తున్నారు. ఇక ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ ఆసిడ్స్ ఉండే ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల కూడా జీర్ణ శక్తి బాగా మెరగుపర్చడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని కూడా వైద్యులు సూచిస్తున్నారు. కే1, కే2 విటమిన్లు రక్త ప్రసరణలో ప్రముఖ పాత్ర వహిస్తాయని ఓ తాజా అధ్యయనంలో తేలింది. పాలకూర, బీట్రూట్, క్యాబేజీ, బీన్స్, కోడిగుడ్లు, బెర్రీస్, గ్రేప్స్, దానిమ్మ కాయల్లో ఈ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. (చదవండి: కరోనాను 'ఢీ'కొట్టండి) -
డీ విటమిన్‌తో కరోనాకు ఢీ
కాన్బెర్రా : ప్రాణాంతకమైన కరోనా వైరస్ బారిన పడినప్పటికీ ప్రాణాలతో బయట పడాలంటే ప్రతి రోజు పది నిమిషాలపాటు ఎండలోకి వెళ్లడం ఒక్కటే అత్యుత్తమమైన పరిష్కార మార్గమని ఆస్ట్రేలియాకు చెందిన స్కిన్ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ రాచెల్ నీల్ తెలియజేశారు. తాను పరిశీలించినంత వరకు విటిమిన్ డీ తక్కువగా ఉన్నవారిలోనే ఎక్కువగా కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని ఆమె చెప్పారు. డీ విటమిన్ ఎక్కువగా ఉన్నట్లయితే వారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. రోగ నిరోధక శక్తి ద్వారానే కరోనా వైరస్‌ను ఎదుర్కోగలమని అభిప్రాయపడ్డారు. డీ విటమిన్ సప్లిమెంట్లు తీసుకున్న వారిలో శ్వాసకోశ ఇబ్బందులు తగ్గిపోవడం తాను గతేడాదే కనుగొన్నానని డాక్టర్ రాచెల్ తెలిపారు. డీ విటమిన్ ఎక్కువగా ఉన్న వారిలో కూడా శ్వాసకోశపరమైన ఇబ్బందులు ఉంటాయని ఆమె తెలిపారు. అయితే డి విటమిన్ తక్కువగా ఉన్న 78 వేల మంది రోగులను అధ్యయనం చేశానని, వారిలో డీ విటమిన్ ఎక్కువగా ఉన్న వారిలో ఉండే శ్వాసకోశ ఇబ్బందులకన్నా డీ విటమిన్ తక్కువగా ఉన్నవారిలో రెట్టింపు ఇబ్బందులు కనిపించాయని ఆమె చెప్పారు. వాతావరణ పరిస్థితులనుబట్టి అంటే, ఎండ తీవ్రతను బట్టి ప్రతి రోజు ఐదు నుంచి 15 నిమిషాలపాటు ఎండలోకి వెళ్లడం మంచిదని ఆమె సూచించారు. (కరోనా టెస్ట్ కిట్ల ‘కొనుగోల్‌మాల్’!) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1341281459.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మండే ఎండలకు ప్లాస్టిక్ పూత విరుగుడు
ఎండాకాలంలోనూ భవనాలు చల్లగా ఉండేలా చేసేందుకు కొలంబియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఓ వినూత్న పరిష్కారాన్ని కనుక్కున్నారు. సూక్ష్మస్థాయి గాలిబుడగలు ఉన్న ప్లాస్టిక్ పూతను వాడటం ద్వారా భవనాల ఉష్ణోగ్రతలను మూడు నుంచి ఆరు డిగ్రీ సెల్సియస్ వరకూ తగ్గించవచ్చునని వీరు అంటున్నారు. పెరిగిపోతున్న వేడిని తగ్గించుకునేందుకు పైకప్పులను తెల్లటి పెయింట్ వేసుకోవడం ఓ పద్ధతి అని మీరు వినే ఉంటారు. అయితే ఈ పద్ధతిలో ఓ చిక్కు ఉంది. సూర్యకిరణాల్లోని పరారుణ కాంతి కిరణాలను ఈ పెయింట్ అడ్డుకోలేదు. మిగిలిన కాంతిలోనూ సగం మాత్రమే మళ్లీ అంతరిక్షంలోకి తిప్పి పంపగలదు. గాలిబుడగలు ఉన్న పెయింట్‌తో ఈ చిక్కులేవీ ఉండవు. దాదాపు 96 శాతం సూర్యకాంతిని తిప్పి పంపడంతోపాటు అంతేస్థాయిలో వేడిని కూడా నిరోధించగలదు ఇది అని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త యాన్ యాంగ్ తెలిపారు. నీటితోపాటు సాల్వెంట్, ప్లాస్టిక్‌ను ఉపయోగించడం ద్వారా కొత్త రకం పెయింట్‌ను తయారు చేయవచ్చునని వివరించారు. బంగ్లాదేశ్‌తోపాటు అమెరికాలోని అరిజోనా ఎడారి ప్రాంతంలో తాము ఈ పెయింట్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించామని, అరిజోనాలో ఆరు డిగ్రీ సెల్సియస్ వేడి తగ్గితే.. గాల్లో తేమశాతం ఎక్కువగా ఉండే బంగ్లాదేశ్‌లో ఇది మూడు డిగ్రీ సెల్సియస్‌గా ఉందని వివరించారు. -
రసాయనాలు అడ్డుపెట్టి.. సూర్యరశ్మిని తగ్గించగలమా ?
సాక్షి, హైదరాబాద్ : గ్లోబల్ వార్మింగ్... గత కొన్నేళ్లుగా వార్నింగ్‌ల మీద వార్నింగ్‌లు ఇస్తోంది. ఎలాగైనా భూతాపాన్ని 2 డిగ్రీల సెంటీగ్రేడ్ లోపుకి పరిమితం చేయాలి. అదే ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్న సవాల్.. దీని కోసం ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ కొన్నాళ్ల క్రితం వచ్చిన ఒక అనూహ్యమైన ఆలోచన సూర్యరశ్మిని తగ్గించడం.. ఆ దిశగా ఇప్పుడు ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు అందులోనుంచి వెలువడే బూడిద ఆకాశం అంతా ఆవరించుకుంటే సూర్య కాంతి తక్కువై భూతాపం తగ్గుతుంది. అందుకే కృత్రిమంగా అగ్నిపర్వతాలు పేల్చడానికి అభివృద్ధి చెందిన దేశాలు, హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ వంటి యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే తరహాలో ఆకాశంపై రసాయనాలను ఒక పొరలా ఏర్పడేలా చేస్తే సూర్యరశ్మిని తగ్గించవచ్చన్న ఆలోచనతో అభివృద్ధి చెందుతున్న దేశాలు ముందుకు వచ్చాయి. సూర్యరశ్మిని తగ్గించడం ద్వారా వాతావరణంలో మార్పులు తీసుకురావడం (సోలార్ జియో ఇంజనీరింగ్) పై పరిశోధనలకు నడుం బిగించాయి. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం కంటే ఇలాంటి ప్రయత్నాలు చేయడం వల్ల మానవాళికి మేలు జరుగుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో ఎక్కువగా విలవిలలాడిపోతున్నవి అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాలే.. భూతాపాన్ని తగ్గించడానికి 2015 సంవత్సరంలో 200 దేశాల మధ్య పారిస్ ఒప్పందం కుదిరినప్పటికీ అభివృద్ధి చెందిన దేశాలు వీసమెత్తు చర్యలు కూడా తీసుకోవడం లేదు. దీంతో ఆ భారం ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాల మీదే పడింది. భారత్, బంగ్లాదేశ్, బ్రెజిల్, చైనా, ఇథియోపియా,జమైకా, థాయ్‌ల్యాండ్‌కు చెందిన 12 మంది రీసెర్చ్ స్కాలర్లు భూతాపం తగ్గాలంటే సూర్యుడి కాంతిని తగ్గించే చర్యలు చేపట్టడమే మార్గమని అంటున్నారు. దీనికి సంబంధించి నేచర్ జర్నల్‌లో తమ అభిప్రాయాలను ఒక వ్యాసంలో పొందుపరిచారు. సోలార్ జియో ఇంజనీరింగ్‌పై పరిశోధనల నిమిత్తం ఈ శాస్త్రవేత్తలకి ఆర్థిక సాయం అందించడానికి సోలార్ రేడియేషన్ మేనేజ్మెంట్ గవర్నెన్స్ ఇనీషియేటివ్ అనే సంస్థ ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టుకి 4 లక్షల డాలర్లు వ్యయం అవుతుందని అంచనా. సోలార్ జియో ఇంజనీరింగ్ వల్ల ప్రాంతాల వారీగా ఏర్పడే ప్రభావాలపై కూడా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయనున్నారు సూర్యరశ్మిని ఆపడం సాధ్యమేనా ? రసాయనాలతో ఒక షేడ్‌ను ఏర్పాటు చేయడం వల్లో, అగ్నిపర్వతాన్ని కృత్రిమంగా బద్దలయ్యేలా చేయడం ద్వారా లేదంటే మేఘాలపై సల్ఫర్‌ని జల్లడం వల్లో సూర్యుడి నుంచి వచ్చే వెలుతుర్ని తగ్గించడం సాధ్యమేనా ? సాంకేతికంగా ఇది చేయగలరా ? అలా చేసినా వాతావరణంలో ఆశించిన మార్పులు వస్తాయా ? అన్న సందేహాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఐక్యరాజ్యసమితికి చెందిన వాతావరణ నిపుణుల బృందం సోలార్ జియో ఇంజనీరింగ్‌పై అనుమానాలే వ్యక్తం చేసింది. ఆర్థికంగా, సామాజికంగా, సంస్థాగతంగా ఇది సాధ్యం కాదంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. అయితే కొత్తగా పరిశోధనలు మొదలుపెట్టనున్న శాస్త్రవేత్తలు మాత్రం ఇప్పట్నుంచి దీని పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పలేమని అంటున్నారు. ‘ సోలార్ జియో ఇంజనీరింగ్ అన్నది వెర్రి ఆలోచన అని ఒకప్పుడు అనుకున్నప్పటికీ, ఇప్పుడిప్పుడే ఇదే పరిష్కారం అన్న అభిప్రాయం అందరిలోనూ పాతుకుపోతోంది‘ అని వ్యాస రచయిత, బంగ్లాదేశ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ చీఫ్ అతిక్ రెహ్మాన్ చెబుతున్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించడంలో అభివృద్ధి చెందిన దేశాలన్నీ పూర్తిగా విఫలం కావడం వల్ల ఇక ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితులు వచ్చాయని, అందుకే రిస్క్ తీసుకొనే రసాయనాల పూతతో సూర్య రశ్మిని తగ్గించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించామని అంటున్నారు. - (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
సూర్యనమస్కారాలతో శారీరక, మానసిక ఆరోగ్యం
ఎముకలు ఆరోగ్యంగా పెరగాలంటే మన శరీరానికి డి విటమిన్ ఎంతో అవసరం. ఇది సూర్యరశ్మి నుంచి సమృద్ధిగా లభిస్తుంది. అందుకే కాబోలు, పూర్వం మన పెద్దవాళ్లు సూర్యనమస్కారాలు చేసేవారు. ఇప్పుడు కొందరు వెద్యులు కూడా సూర్యనమస్కారాలు చేయమని చెబుతుంటారు. సూర్యనమస్కారాల ప్రయోజనమేమిటో చూద్దాం. సూర్య నమస్కారం అనేది పేరు ఒక్కటే అయినా, అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి. ఈ పన్నెండు చేస్తే ఒక వృత్తం పూర్తయినట్లు! వీటిలో ఒకటి నుంచి ఐదు; ఎనిమిది నుంచి పన్నెండు ఆసనాలు ఒకేలా ఉంటాయి. కుడి, ఎడమల తేడా మాత్రమే ఉంటుంది. సూర్య నమస్కారాలతో ఎముకలు, కండరాలు బలోపేతమై ఆరోగ్యంగా ఉండటమే కాదు; మధుమేహం, బీపీ, గుండె జబ్బుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. సూర్య నమస్కారాలలో 12 రకాల భంగిమలు ఉంటాయి. వీటిలో కొన్నింటిని నెమ్మదిగా చేయాలి. మరి కొన్నింటిని వేగంగా చేయాలి. వేగంగా చేసే భంగిమల్లో కండరాలకు మేలు జరుగుతుంది. ఏరోబిక్స్‌తో సమానమైన ఫలితాలు సాధించవచ్చు. నెమ్మదిగా చేసే సూర్య నమస్కారాలు శ్వాస నియంత్రణకు ఉపయోగపడతాయి. ఎక్కువ గాలిని పీల్చి, వదలడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుందని సైన్సు చెబుతోంది. సూర్య నమస్కారాల వల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సూర్య నమస్కారాలు శరీర భాగాలపైనే కాకుండా వివిధ రకాల గ్రంథులపైనా పని చేస్తాయి. థైరాయిడ్, పార్థరాయిడ్, పిట్యూటరీ వంటి గ్రంథులు సాధారణ స్థాయిలో పని చేయడానికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి. -
సాగరంలో ఓడ.. తీరంలో దేశివాళీ జాడ
బీచ్‌రోడ్డు సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన నాటు పడవ నడపుతున్న నావికుడి ఆకృతికి రంగులద్దుతున్న సమయంలో వెనకాల నీలి సముద్రంలో తేలియాడుతున్న నౌక దృశ్యం ఇలా ఆవిష్కృతమైంది.– ఫొటో: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
సొరంగం పూర్తయితే జన్మధన్యం
కనగల్ (నల్లగొండ) : శ్రీశైలం సొరంగమార్గం పూర్తయితే జన్మధన్యమవుతుందని సీఎల్పీ ఉపనేత, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని తేలకంటిగూడెంలో రూ.16 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ఒత్తిడి చేసి శ్రీశైలం సొరంగం నిర్మాణానికి రూ. 3 వేల కోట్లు మంజూరు చేయించినట్లు తెలి పారు. సొరంగం పూర్తయితే నల్లగొండ జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. గ్రావిటీ ద్వారా రెండు పంటలకు సాగు నీరు అందుతుందన్నారు. రూ.7 వందల కోట్లతో బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. తన నాలుగు పర్యాయాల ఎమ్మెల్యే పదవీకాలంలో సుమారు మొత్తంగా రూ. 4 వేల కోట్లు ప్రాజెక్టుల నిర్మాణం, వ్యవసాయ రంగానికి మంజూరు చేయించడం మామూలు విషయం కాదన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. తేలకంటిగూడెం నుంచి తిమ్మన్నగూడెం వరకు రూ. 1కోటి 20 లక్షలతో బీటీ రోడ్డును నిర్మించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో వంద శాతం మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు. తేలకంటిగూడెం ఎంపీటీసీ కాంగ్రెస్‌లో చేరిక సీపీఎం పార్టీకి చెందిన తేలకంటిగూడెం ఎంపీటీసీ బోగరి మణెమ్మరామకోటి కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరా రు. ఎంపీటీసీకి పార్టీ కండువా కప్పి కాం గ్రెస్‌లోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి జరుగుతుందని నమ్మి పార్టీలో చేరిన ఎంపీటీసీకి ఆయన స్వాగతం పలి కారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పా లన సాగుతుందన్నారు. టీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. పూటకో మాట చెప్పుతూ సీఎం కేసీఆర్ ప్రజలకు మోసం చేస్తున్నారన్నారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డం అనూప్‌రెడ్డి, వైఎస్ ఎంపీపీ భారతి వెంకటేశం, స్థానిక సర్పం చ్ బిల్లపాటి లక్ష్మమ్మ, ఎంపీటీసీ బోగరి మణెమ్మ, నాయకులు జి.భిక్షం యాదవ్, బొడ్డుపల్లి శ్రీనివాస్, బిల్లపాటి మోహన్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. చిట్యాల : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని నల్లగొండ ఎమ్మెల్యే, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని పెద్దకాపర్తి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ యువత కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. . కార్యక్రమంలో సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మం డల అ«ధ్యక్షుడు కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, సర్పంచ్ కందిమళ్ల శశిపాల్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ కందిమల్ల జైపాల్‌రెడ్డి, ఏర్పుల మైసయ్య, తొట్లపల్లి సురేష్‌గౌడ్, జడల ఆదిమల్లయ్య, రవి, శ్రీనివాసరెడ్డి ఉన్నారు. -
ఎండలకు ఆకుల్లా రాలుతున్న గబ్బిలాలు
చెట్లపైకి పైప్‌తో నీళ్లు కొడుతున్న గ్రామస్తులు కేసముద్రం(మహబూబాబాద్): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని కోమటిపల్లి గ్రామంలో ఎటు చూసినా గబ్బిలాలే దర్శనమిస్తాయి. ఈ వేసవిలో ఎండ తీవ్రత పెరగడంతో అవి మృత్యువాత పడుతున్నాయి. దీంతో స్థానికులు వాటిని కాపాడేందుకు చెట్లపై నీళ్లు చల్లుతూ వాటికి ఉపశమనం కలిగిస్తున్నారు. గ్రామంలోని శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయ సమీపం లోని చెట్లపైనున్న గబ్బిలాలు వడ గాడ్పులకు మృత్యువాత పడుతున్నాయి. దీంతో సర్పంచ్ బాలునాయక్ ఆధ్వర్యంలో గ్రామస్తులు బుధ వారం వ్యవసాయ బావికి మోటారు పెట్టించి పైపుల ద్వారా చెట్ల మీదున్న గబ్బిలాలకు నీళ్లు కొట్టి గబ్బిలాలను బతికించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో వీస్తున్న వడగాడ్పులకు 14 మంది మృతి చెందారు. అందులో 12 మంది ఉమ్మడి వరంగల్ జిల్లా లోనే మరణించారు. మృతుల్లో కరీంనగర్ జిల్లా రాచపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు పంజాల రామయ్య (64), మానకొండూర్ మండలంలోని ముం జంపల్లి గ్రామానికి చెందిన కార్మికుడు పిల్లి రవి (38) కూడా ఉన్నారు. -
గుణ విజృంభణ
సాక్షి, హైదరాబాద్: సన్‌షైన్ బౌలర్ గుణ (6/7)తో చెలరేగడంతో ఆ జట్టు ఘన విజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా కాస్మోస్ జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 128 పరుగుల తేడాతో సన్‌షైన్ జట్టు గెలుపొందింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌షైన్ జట్టు 34 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. ఫ్రీజన్ (45) రాణించాడు. కాస్మోస్ బౌలర్లలో రమేశ్, మోహన్ చెరో 3 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం గుణ బౌలింగ్ దాటికి కాస్మోస్ జట్టు 15 ఓవర్లలో 33 పరుగులు మాత్రమే చేసి ఓడిపోరుుంది. గుణ కేవలం 7 పరుగులిచ్చి 6 వికెట్లను దక్కించుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు విజయ్‌పురి విల్లోమెన్: 242 (విజయ్ కుమార్ 62, విక్రమ్ 46; యశ్వర్ధన్ 3/49, అమర్నాథ్ 3/54), ఎస్ఎన్ గ్రూప్: 151 (చంద్రలోక్ 4/35). ఎలెవన్ మాస్టర్స్: 105 (ఆర్ఆర్ మల్లికార్జున్ 5/30), రుషిరాజ్ సీసీ: 106/1 (అలీ బేగ్ 39 నాటౌట్, సయ్యద్ అస్మత్ 32 నాటౌట్). సదరన్ స్టార్స్: 153/8 (స్వరూప్ 42; నర్సింహా 3/33), పీఎస్వైసీసీ: 155/3 (సయ్యద్ నూర్ ముజస్సిమ్ 44, భాను 71 నాటౌట్). సౌతెండ్ రేమండ్‌స: 143 (అబ్దుల్లా 35; సిద్ధార్థ్ మిట్టల్ 5/30), విక్టోరియా సీసీ: 125 (సిద్ధార్థ్ మిట్టల్ 42; ఒమర్ 3/7). రోషనారా: 299/9 (ముకేశ్ 52, శ్రీకాంత్ 79, ఇర్ఫాన్ 64; నవీన్ 3/56), తారకరామ సీసీ: 216 (యోగి 65, శ్రావణ్ 51; కునాల్ 3/38, అమీర్ 3/32, బిజయ్ 3/33). ఇంపీరియల్:102 (చిరంజీవి 36; రాజ్ 6/22), లాల్ బహదూర్ సీసీ: 103 (శ్రీధర్ 70 నాటౌట్). సత్య సీసీ: 79 (అబ్దుల్ యూసుఫ్ 4/22), షాలిమార్ సీసీ: 82/2 (దేవేశ్ 35). సూపర్‌స్టార్స్: 203/7 (రోహిత్ రెడ్డి 40, శ్రీకాంత్ గౌడ్ 52 నాటౌట్; భవన్ 3/25), కన్సల్ట్ సీసీ: 204/6 (రాహుల్ 74, భాను 38; రోహిత్ 4/28). సెరుుంట్ మేరీస్:165 (శైలేందర్ కుమార్ 44, కల్యాణ్ 31; మానస్ 3/35, సుధీర్ 5/40), నవ్‌జీవన్ ఫ్రెండ్స: 166/7 (రాజ 42; రాఘవ్ 5/48). పికెట్ సీసీ: 252/9 (శాశ్వత్ 61, నాగ నితిన్ 40; రోహిత్ యాదవ్ 5/30), హైదరాబాద్ వాండరర్స్: 112 (అక్షయ్ 60; తాత్విక్ 5/22). -
నాచు పట్టిన ఇల్లు కరెంట్ ఇస్తుంది!
ఫొటో చూశారుగా... జర్మనీలోని హాంబర్గ్‌లో ఉందీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్. ఏంటి దీని ప్రత్యేకత? ముందువైపు అద్దాల్లో పచ్చగా కనిపిస్తోందే... అదే! ఏముంది అందులో? పాచి! ఎందుకు? ఆ పాచి ఇంటికి కావాల్సిన కరెంట్ మొత్తాన్ని తయారు చేస్తుంది! అదెలా? అంటున్నారా? పాచి చిన్నసైజు మొక్కలన్న సంగతి మీకు తెలుసుకదా... కాబట్టి ఇవి సూర్యరశ్మిని తీసుకుని ఎదుగుతాయి. ఫలితంగా ఏర్పడే బయోమాస్‌ను రియాక్టర్‌లోకి చేరిస్తే.. అక్కడ బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది. దీన్ని ఫ్యుయెల్ సెల్‌లోకి పంపి కరెంట్ ఉత్పత్తి చేస్తారు. ఈ క్రమంలో విడుదలయ్యే కార్బన్‌డై యాక్సైడ్‌ను పాచి మరింత వేగంగా పెరిగేందుకు ఎరువుగా వాడతారు. మొత్తమ్మీద ఈ అపార్ట్మెంట్స్లోని అన్ని ఇళ్లకు కావాల్సిన విద్యుత్తు అక్కడికక్కడే ఉత్పత్తి కావడమే కాకుండా... 24 గంటలూ వేడినీళ్లు పొందేందుకూ ఈ పాచినే వాడుతున్నారు. అంతేకాదు... అప్పుడప్పుడూ కొంచెం ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి జరిగితే.. దాన్ని ఎంచక్కా గ్రిడ్‌కు కనెక్ట్ చేసి అమ్మేసుకుంటున్నారు. భలే ఐడియా కదూ...! -
ఎండలు బాబోయ్
సోమవారం 40నిఛి ఉష్ణోగ్రత - నడివేసవిని తలపిస్తున్న వాతావరణం - అల్లాడిపోతున్న జనం విజయవాడ : నగరంలో ఎండలు నడివేసవిని తలపిస్తున్నాయి. నాలుగు రోజులుగా భానుడు ఉగ్రరూపం దాల్చి ప్రతాపం చూపుతున్నాడు. సోమవారం నగరంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో నగరవాసులు అల్లాడిపోయారు. వడగాలులకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. దీనికితోడు ఉక్కపోత కూడా తోడవడంతో చిన్నారులు, వృద్ధులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండవేడిమి ఉధృతంగా ఉంటోంది. సోమవారం నగరంలో 40 డిగ్రీల గరిష్ట, 26.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం 38.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో నగరవాసులు అత్యవసర పనులుంటేనే బయటకు వస్తున్నారు. -
మళ్లీ నిప్పులా?
విశాఖపట్నం : జులై నెల వచ్చిందంటే ఆకాశంలో మబ్బులు.. అప్పుడప్పుడు చిరుజల్లులు.. వానలు.. సాదాసీదా ఉష్ణోగ్రతలు.. ఎప్పుడైనా కాస్త ఎండలు.. వెరసి మంచి వాతావరణాన్ని అందిస్తుంది. మరి ఇప్పుడు? జులై ఆరంభం నుంచి వానలకు బదులు నిప్పులు కురుస్తున్నాయి. మలమల మాడ్చే ఎండలు కాస్తున్నాయి. మునుపెన్నడూ లేనంతగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతూ వడగాడ్పులు కూడా వీస్తున్నాయి. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. గత మే నెలలో తీవ్ర వడగాడ్పులను చవిచూశారు. ఇటు నగరంలోనూ, అటు జిల్లాలోనూ దాదాపు 200 మంది వరకూ వడదెబ్బకు బలయ్యారు. రుతుపవనాలొచ్చి వేడిపై నీళ్లు చల్లడంతో వాతావరణం చల్లబడిందని జనం సంతోషించారు. మరోవైపు పంటలకు వానలు మేలు చేశాయని సంబరపడ్డారు. ఈ తరుణంలో ఎండలు విజృంభిస్తుండడంతో అంతా ఆందోళన చెందుతున్నారు. ఆదివారం నగరంలో 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది.18 ఏళ్ల తర్వాత జులైలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత ఇదే కావడం విశేషం. 1997 జులై 16న నగరంలో 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. అదే జులైలో ఇప్పటిదాకా ఉన్న రికార్డు. ఆ తర్వాత మళ్లీ ఆదివారం నాటి ఉష్ణోగ్రతే అత్యధికం. వాస్తవానికి నాలుగై రోజుల నుంచి భానుడు ప్రతాపం చూపుతూనే ఉన్నాడు. ఆదివారం నాటికి మరింత ఉగ్రరూపం దాల్చాడు. వేడితోపాటు వడగాడ్పులనూ వెదజల్లాడు. కాలం గాని కాలంలో వడగాడ్పులకు జనం అల్లాడిపోయారు. మళ్లీ మే నెలను గుర్తుకు తెచ్చుకున్నారు. నిప్పులు కురిసే ఎండలోకి వెళ్లే సాహసం చేయలేకపోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చిన వారు తట్టుకోలేకపోయారు. ప్రస్తుతం సముద్రం పైనుంచి గాలులు వీయకపోవడం, పశ్చిమ, వాయవ్య దిశగా గాలులు వీస్తుండడం, ఆకాశంలో మేఘాల్లేకపోవడం వంటివి ఉష్ణోగ్రతలు పెరిగి ఎండల తీవ్రతకు కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరికొద్ది రోజులు సెగలు తప్పవని వీరు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎండలోకి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వ చ్చిన వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. -
వడదెబ్బతో 165 మంది మృతి
నెట్వర్క్: ఎండలు ఇంకా చంపుతూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితం అక్కడక్కడా చిరుజల్లులు కురియగా, శనివారం మళ్లీ వాతావరణం వేడెక్కడంతో మరణాలు పెరిగాయి. శనివారం ఒక్కరోజే తెలంగాణవ్యాప్తంగా మొత్తం 165మంది వడదెబ్బతో చనిపోయారు. ఇందులో ఒక్క వరంగల్ జిల్లాకు చెందిన వారే 44 మంది ఉన్నారు. అలాగే, కరీంనగర్ జిల్లాలో 36 మంది, ఖమ్మం జిల్లాలో 22 మంది, ఆదిలాబాద్ జిల్లాలో 11 మంది, నిజామాబాద్‌లో ఐదుగురు చనిపోయారు. అలాగే, మహబూబ్‌నగర్ జిల్లాలో ఏడుగురు మెదక్ జిల్లాలో 15 మంది, రంగారెడ్డి జిల్లాలో ఒకరు, నల్లగొండ జిల్లాలో 20 మంది, హైదరాబాద్‌లో నలుగురు మరణించారు. ఏపీలో 134 మంది ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో వడదెబ్బ మృతుల సంఖ్య తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం 134 మంది మరణించారు నెల్లూరు జిల్లాలో 24 మంది, విశాఖపట్నంలో 24, పశ్చిమగోదావరి 15, చిత్తూరు 15, తూర్పు గోదావరి 11, గుంటూరు 10, విజయనగరం 09, ప్రకాశం 7, అనంతపురం 7, వైఎస్సార్ కడప 5, శ్రీకాకుళం 3, కృష్ణా 3, కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు -
మండుతున్న ఎండలు
నల్లగొండలో 45.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు 205 మంది మృతి ఏపీలో వడదెబ్బకు 341 మంది మృతి హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు ఇంకా మండుతూనే ఉన్నాయి. రెండ్రోజులు తగ్గుముఖం పట్టినట్లు అనిపించినా మంగళవారం మరింత పెరిగాయి. రాష్ట్రంలోకెల్లా నల్లగొండలో 45.8 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే రామగుండంలో 44.5, నిజామాబాద్‌లో 44.4, ఆదిలాబాద్‌లో 44.3, వరంగల్‌లో 42, హైదరాబాద్‌లో 42.8, అశ్వారావుపేటలో 43.4, జగిత్యాలలో 42.3, కంపాసాగర్‌లో 43.8, మహబూబ్‌నగర్‌లో 43, రుద్రూర్లో 42, సంగారెడ్డిలో 42, తాండూరులో 42.2, మెదక్‌లో 41.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు 205 మంది మృతిచెందారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతలలో 12 రోజుల ఆడ శిశువు వడదెబ్బతో మృతి చెందింది. జిల్లాలవారీగా చూస్తే నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 55 మంది మరణించగా వరంగల్ జిల్లాలో 49 మంది, ఖమ్మం జిల్లాలో 41 మంది, కరీంనగర్ జిల్లాలో 23 మంది, మహబూబ్‌నగర్ జిల్లాలో తొమ్మిది మంది, మెదక్ జిల్లాలో ఎనిమిది మంది, హైదరాబాద్‌లో ఏడుగురు, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆరుగురు చొప్పున, నిజామాబాద్ జిల్లాలో ఒకరు మృతిచెందారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం వడదెబ్బ బారిన పడి 341 మంది మరణించారు. మరో 24 గంటల తర్వాత క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ నెల 28 నుంచి ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. -
ఎండ 47 డిగ్రీలకు.. నీరు పాతాళానికి..
- రాష్ట్ర వ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగానే ఉన్న ఉష్ణోగ్రత - చాలా చోట్ల తీవ్రమైన నీటి ఎద్దడి.. ట్యాంకరలతో సరఫరా - మరఠ్వాడాలో కరవు పరిస్థితితో అడుగంటిన జలాలు - మధ్యాహ్న సమయంలో కర్ఫ్యూ తలపిస్తున్న రహదారులు - వర్షాలు ఆలస్యమైతే పరిస్థితి మరింత తీవ్రం సాక్షి, ముంబై: ఒక వైపు భానుడి ఉగ్రరూపం, మరోవైపు నీటి ఎద్దడి రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. ఉష్టోగ్రతలు 47 డిగ్రీలను దాటి అర్ధ సెంచరీ సాధించేందుకు సిద్ధంగా ఉండగా.. నీటి వనరులు పాతాల అంచుకు చేరిపోయి నోటి తడి ఆర్పేస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా మరాఠ్వాడా తీవ్ర తాగు నీటి సమస్యను ఎదుర్కొంటుంది. అధిక సంఖ్యలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగు నీరు మరాఠ్వాడాకు సరఫరా జరుగుతోంది. ప్రస్తుతం స్థానిక డ్యాములు సామార్థ్యం కంటే 8 శాతం తక్కువ నీటి నిలువలు పడిపోయాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తోంది. ఈ రీజియన్ పరిధిలో ఎనిమిది జిల్లాల్లోని దాదాపు 1,065 గ్రామాలకు, 377 కుగ్రామాలకు 1,500 ట్యాంకర్ల ద్వారా రోజూ నీటి సరఫరా జరుగుతోంది. గతేడాది 150 ట్యాంకర్ల ద్వారా మాత్రమే జరిగిన నీటి సరఫరా ఈ సారి అందుకు పది రెట్లు ఎక్కువగా జరుగుతోంది. ఈ పరిస్థితి నీటి సంక్షోభం ఎంత తీవ్రంగా చెప్పక నే చెబుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,215 ట్యాంకర్ల ద్వారా 1,625 గ్రామాలు, 2,096 కుగ్రామాలకు నీటి సరఫరా జరుగుతోంది. గత ఏడాది ఇదే సమయంలో కేవలం 300 తాగునీటి ట్యాంకర్లను వినియోగించారు. నీటి ఎద్దడి అధికంగా ఉంది: మంత్రి గిరీశ్ నీటి వనరుల విభాగ మంత్రి గిరీశ్ మహాజన్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా నీటి ఎద్దడి అధికంగా ఉందని అన్నారు. ప్రధానంగా మరాఠ్వాడా తీవ్ర పరిస్థితిని ఎదుర్కొంటుందని చెప్పారు. వచ్చే ఏడాది నాటిక ఈ విషయంపై జాగ్రత్త వహించి మంచి ఫలితాలు వచ్చేలా చేస్తామని ఆయన వివరించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి అయిన తర్వాత తాగు నీటి కొరత కొంత మేర తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాగ్‌పూర్‌లో అంతంత మాత్రమే నాగ్‌పూర్ రిజీయన్పై నీటి సంక్షోభం ప్రభావం అంతగా చూపలేదని నీటి వనరుల శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి అన్నారు. కాని ఉష్ణోగ్రతలు మాత్రం 47 డిగ్రీలకు పైగానే ఉన్నాయని అన్నారు. కేవలం ఐదు ట్యాంకర్ల ద్వారానే నాగ్‌పూర్‌కు తాగు నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. వర్దా, గోండియా, చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాల్లో ఇప్పటి వరకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయలేదని వివరించారు. కాగా, ఔరంగాబాద్, జాల్నా, బీడ్, పర్భణి, హింగోళి, నాందేడ్, ఉస్మానాబాద్, లాతూర్లకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. ఔరంగాబాద్‌లో అధికం గా 431 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. బీడ్‌కు 361, జాల్నాకు 219 ట్యాంకర్లను ఉపయోగిస్తున్నారు. కొంకణ్ రీజియన్‌కు 90 ట్యాంకర్ల ద్వారా తాగు నీటిని సరఫరా చేస్తున్నారు. నాసిక్‌కు 400 ట్యాంకర్లు, పుణే రీజియన్‌కు 70, అమరావతి రీజియన్‌కు వంద మంచి నీటి ట్యాంకర్లను వినియోగిస్తున్నారు. మొదట ప్రైవేట్ నీటి ట్యాంకర్లను అద్దెకు తీసుకునే వాళ్లమని, అదనంగా అవసరం ఏర్పడటంతో ప్రభుత్వ ట్యాంకర్లను ఉపయోగించా ల్సి వస్తోందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. తాగు నీటి ట్యాంకర్లను పెంచాలన్న డిమాండు రోజురోజుకు పెరుగుతోందన్నారు. ఒకవేళ ఈ ఏడాది వర్షాలు ఆలస్యమైనా.. వర్షపాతం తగ్గినా రాష్ట్రం తీవ్ర నీటి సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. రాష్ర్టంలోని చాలా ప్రాంతాలు రెండు దశాబ్దాలుగా తాగు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నా సమస్యను పరిష్కరించేందుకు ఎవ్వరూ కృషి చేయడం లేదని విచారం వ్యక్తం చేశారు. మండుతున్న ఎండలు.. దేశ ఆర్థిక రాజధాని ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న మరాఠ్వాడా పరి స్థితి తీవ్రంగా మారింది. విదర్భ, పశ్చిమ మహారాష్ట్రలోనూ ఎండలు ఠారెత్తుస్తున్నాయి. ఓ వైపు పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, వడగండ్ల వర్షంతో జనజీవనం అతలాకుతలం అవుతుంటే.. మరోవైపు మండుతున్న ఎండలు తీవ్ర ఇబ్బందికి గురిచేస్తున్నాయి. కరవుతో అల్లాడుతున్న అనేక ప్రాంతాల్లో ఇదే దుస్థితి దర్శనమిస్తోంది. మరాఠ్వాడా ప్రాంతంలో ఇప్పటికే తీవ్ర కరవు పరిస్థితి నెలకొని దుర్భిక్ష పరిస్థితులను సృష్టిస్తోంది. రాష్ట్రంలోని కోంకణ్, ఉత్తర మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు మినహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. విదర్భలోని అకోలాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ప్రాంతాల్లోని ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరుకున్నాయి. వర్ధా, చంద్రాపూర్, అమరావతితోపాటు జల్గావ్, మాలేగావ్‌లలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. ఇక విదర్భ, మరాఠ్వాడాల్లో 42 నుంచి 44 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. దీంతో మధ్యాహ్నం పూట ప్రజలు బయటికి రావాడానికే జంకుతున్నారు. అత్యవసరంగా బయటికి వెళ్లాల్సిన పరిస్థితిలోనే వెళ్తున్నారు. విదర్భలలోని అనేక పట్టణాల్లో మధ్యాహ్నం సమయంలో వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తూ కర్ఫ్యూ తలపిస్తున్నాయి. -
మండుతున్న ఎండలు
రెండు రోజులుగా పెరుగుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు మేలో మరింత వేడి తప్పదంటున్న వాతావరణ శాఖ సగటున గతం కంటే 1 డిగ్రీ మేర పెరిగే అవకాశం తీవ్ర వడగాలులు.. ఉరుములు, మెరుపులతో వర్షాలు రాజధాని భగభగ.. తీవ్రంగా ఉక్కపోత సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు రోజురోజుకూ ముదురుతున్నాయి. మూడు రోజులుగా భగభగలాడుతున్న భానుడు.. మే నెలలో మరింత ఉగ్రరూపం దాల్చనున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్లా రెండు రోజులుగా ఈ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజధాని హైదరాబాద్‌లో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది. ఈసారి గతంతో పోల్చితే ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మే నెలలో ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల మధ్య కొనసాగుతాయని, కొన్నిరోజులు ఇంతకంటే ఎక్కువ వేడి ఉండే అవకాశముందని పేర్కొంటున్నారు. గతేడాది కంటే కనిష్టంగా ఒక డిగ్రీ ఎక్కువగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భావిస్తున్నారు. ఇదే సమయంలో వడగాడ్పులు వీస్తాయని.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. దడ పుట్టించేలా వడగాడ్పులు.. రాష్ట్రం దక్షిణ పీఠభూమి ప్రాంతంలో విస్తరించి ఉన్నందున వేసవిలో వడగాలులు అధికంగా వీస్తాయి. ఈ ఏడాది వీటి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ భావిస్తోంది. మే రెండో వారం నుంచి వడగాడ్పులు పెరిగే అవకాశముంది. రాష్ట్రంలో ఎండలు, వడగాలుల కారణంగా వడదెబ్బకు గురై గతేడాది అనేక మంది వృద్ధులు, రోగులు మరణించారు. ఈ నేపథ్యంలో ఈసారి మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని వాతావారణ శాఖ సూచిస్తోంది. రాజధాని భగభగ.. భానుడి ప్రకోపానికి రెండు రోజులుగా రాజధాని హైదరాబాద్ భగభగలాడిపోతోంది. సీజన్లో తొలిసారిగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. బుధ, గురువారాల్లో వరుసగా 40.6, 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉక్కపోత కారణంగా నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. మధ్యాహ్న సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. నగరంలో ఈసారి గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాది సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. కనిష్టంగా 1 డిగ్రీ మేర ఎండలు పెరుగుతాయి. మే నెలలో వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కొన్ని సార్లు వేగంగా గాలులు వీస్తాయి. క్యుములోనింబస్ మేఘాల కారణంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. మొత్తంగా ఈ ఏడాది వేసవిలో ఎండలు, గాలులు, వానలు గతం కంటే అధికంగా ఉంటాయి. - వై.కె.రెడ్డి, వాతావరణ శాఖ హైదరాబాద్ విభాగం ఇన్చార్జి డెరైక్టర్ -
ప్రేమానుభవం!
‘‘ఆ యువకుడి పేరు సూర్య. కానీ సూర్యరశ్మిని ఏమాత్రం తట్టుకోలేని వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. అందుకే రాత్రిళ్లు మాత్రమే తిరుగుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలో సూర్య ఓ అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ తరువాత అతని జీవితంలో ఎదురైన అనుభవాలు ఏంటో తెలుసుకోవాలంటే ‘సూర్య వర్సెస్ సూర్య’ చూడాల్సిందే’’ అని చిత్ర దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని చెప్పారు. మల్కాపురం శివకుమార్ నిర్మాత. ఈ సినిమా ఇటీవలే చిత్రీక రణ పూర్తిచేసుకుంది. సత్యమహవీర్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను ప్రేమికుల రోజైన ఈ నెల 14న విడుదల చేస్తున్నామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: చందూ మొండేటి. -
తడులిస్తే మక్క మస్తు
ఖమ్మం వ్యవసాయం: రబీలో మొక్కజొన్న సాగులో అధిక దిగుబడి సాధించేందుకు సాగునీటిని సక్రమంగా పారించాలి. మొక్కలకు నీరు, సూర్యరశ్మిని పెరుగుదలకు అనుకూలంగా ఉపయోగించుకునే శక్తి ఎక్కువ. తడుల మెలకువలను జిల్లా ఏరువాక శాస్త్రవేత్తలు డాక్టర్ జె.హేమంత్ కుమార్(99896 23813), డాక్టర్ ఎం.వెంకట్రాములు(89856 20346), డాక్టర్ ఆర్.శ్రీనివాసరావు (83329 51138) చెబుతున్నారు. విత్తేముందు జాగ్రత్తలు నేలలో తేమ సరైన స్థాయిలో ఉండాలి. విత్తనం నీటిని గ్రహించి దాదాపు రెండింతల బరువు పొందిన తరువాత మొలకెత్తుతుంది. మొక్కజొన్న అధికనీరు(నీటి ముంపు) లేక బెట్ట(నీటి ఎద్దడి) పరిస్థితులను తట్టుకోలేకపోవటం వల్ల నష్టం జరుగుతుంది. విత్తిన మొదటి రెండు రోజులు నీటి ముంపునకు గురైతే అంకురోత్పత్తి శాతం తగ్గుతుంది. పైరు లేత దశలో (విత్తిన తరువాత 30రోజుల వరకు) నేలలో నీరు నిలువ ఉంకుండా జాగ్రత్త పడాలి. నీటిముంపు ఉండే భూముల్లో మొక్కజొన్న లేత పసుపు పచ్చగా మారి, పెరుగుదల తగ్గి దిగుబడి పడిపోతుంది. నేలలో మురుగు నీరు పోయే విధంగా చూసుకోవాలి. లేదా బోదెసాళ్ల పద్ధతులను పాటించాలి. తేమ సున్నిత దశలు పంట మోకాలెత్తు దశ, పూతదశ, గింజపాలుపోసుకునే దశ, గింజనిండే దశ. విత్తిన వెంటనే నీటి తడి ఇవ్వడం ద్వారా మంచి మొలక శాతం పొందొచ్చు. పంట లేత దశలో నీటి ఎద్దడికి గురైతే మగ, ఆడ పుష్పించు దశలు ఆలస్యమవుతాయి. మొక్క 30-40 సెం.మీ ఎత్తు పెరిగే వరకు నీటి వినియోగం తక్కువ. పూత దశలో (జల్లు, పీచు వేసి పరాగ సంపర్కం జరగటం) అత్యధికంగా అంటే రోజుకు 8-12 మి.మీ ఉంటుంది. ఈ దశలోని 15-20 రోజులు మొక్కకు అత్యంత కీలకం. పూతదశ కీలకం పూత దశ నుంచి గింజలు పాలు పోసుకునే వరకు పంట నీడి ఎద్దడికి గురైతే 40-80 శాతం వరకు దిగుబడులు తగ్గుతాయి. గింజకట్టే సమయంలో నీటి ఎద్దడి ఏర్పడితే గింజ పరిమాణం తగ్గుతుంది. కానీ గింజ గట్టి పడే సమయంలో నీటి ఎద్దడి ఏర్పడితే పెద్దగా నష్టం ఉండదు. నీటి ఎద్దడి వలన మగపూత దశలో 25 శాతం, ఆడపూత దశలో 50 శాతం పరాగ సంపర్కం తరువాత 21 శాతం గింజ దిగుబడి తగ్గుతుంది. పూత దశలో తక్కువ వ్యవధిలో నీరు పెట్టాలి. ఎన్నితడుల నీరు కట్టాలంటే... నీరు సమృద్ధిగా ఉంటే నల్లరేగడి నేలల్లో 5-6 తడులు, ఎర్రనేలల్లో 8 తడుల వరకు అవసరం. ఒకవేళ 6 తడులు ఇవ్వడానికి అవకాశం ఉంటే ఒక తడి మొలక దశ, ఒక తడి పంట మోకాలెత్తు దశ, ఒక తడి పూత దశ, రెండు తడులు పూత దశ నుంచి గింజపాలు పోసుకునే వరకు, గింజ నిండే దశలో ఇవ్వాలి. ఒకవేళ 5 తడులు మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంటే పంట మొలక దశ ను తీసివేసి మిగతా దశల్లో ఇచ్చుకోవాలి. అదే విధంగా సాగు నీరు 4 తడులకే ఉంటే ఒక తడి మోకాలెత్తు దశలో, ఒక తడి పూత దశలో, రెండు తడులు పూత దశ నుంచి గింజపాలు పోసుకునే దశ వరకు ఇవ్వాలి.