సాక్షి, హైదరాబాద్: సన్‌షైన్ బౌలర్ గుణ (6/7)తో చెలరేగడంతో ఆ జట్టు ఘన విజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా కాస్మోస్ జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 128 పరుగుల తేడాతో సన్‌షైన్ జట్టు గెలుపొందింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌షైన్ జట్టు 34 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. ఫ్రీజన్ (45) రాణించాడు. కాస్మోస్ బౌలర్లలో రమేశ్, మోహన్ చెరో 3 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం గుణ బౌలింగ్ దాటికి కాస్మోస్ జట్టు 15 ఓవర్లలో 33 పరుగులు మాత్రమే చేసి ఓడిపోరుుంది. గుణ కేవలం 7 పరుగులిచ్చి 6 వికెట్లను దక్కించుకున్నాడు.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
విజయ్‌పురి విల్లోమెన్: 242 (విజయ్ కుమార్ 62, విక్రమ్ 46; యశ్‌వర్ధన్ 3/49, అమర్‌నాథ్ 3/54), ఎస్‌ఎన్ గ్రూప్: 151 (చంద్రలోక్ 4/35).
ఎలెవన్ మాస్టర్స్: 105 (ఆర్‌ఆర్ మల్లికార్జున్ 5/30), రుషిరాజ్ సీసీ: 106/1 (అలీ బేగ్ 39 నాటౌట్, సయ్యద్ అస్మత్ 32 నాటౌట్).
సదరన్ స్టార్స్: 153/8 (స్వరూప్ 42; నర్సింహా 3/33), పీఎస్‌వైసీసీ: 155/3 (సయ్యద్ నూర్ ముజస్సిమ్ 44, భాను 71 నాటౌట్).
సౌతెండ్ రేమండ్‌స: 143 (అబ్దుల్లా 35; సిద్ధార్థ్ మిట్టల్ 5/30), విక్టోరియా సీసీ: 125 (సిద్ధార్థ్ మిట్టల్ 42; ఒమర్ 3/7).
రోషనారా: 299/9 (ముకేశ్ 52, శ్రీకాంత్ 79, ఇర్ఫాన్ 64; నవీన్ 3/56), తారకరామ సీసీ: 216 (యోగి 65, శ్రావణ్ 51; కునాల్ 3/38, అమీర్ 3/32, బిజయ్ 3/33).
ఇంపీరియల్:102 (చిరంజీవి 36; రాజ్ 6/22), లాల్ బహదూర్ సీసీ: 103 (శ్రీధర్ 70 నాటౌట్).
సత్య సీసీ: 79 (అబ్దుల్ యూసుఫ్ 4/22), షాలిమార్ సీసీ: 82/2 (దేవేశ్ 35).
సూపర్‌స్టార్స్: 203/7 (రోహిత్ రెడ్డి 40, శ్రీకాంత్ గౌడ్ 52 నాటౌట్; భవన్ 3/25), కన్సల్ట్ సీసీ: 204/6 (రాహుల్ 74, భాను 38; రోహిత్ 4/28).
సెరుుంట్ మేరీస్:165 (శైలేందర్ కుమార్ 44, కల్యాణ్ 31; మానస్ 3/35, సుధీర్ 5/40), నవ్‌జీవన్ ఫ్రెండ్‌స: 166/7 (రాజ 42; రాఘవ్ 5/48).
పికెట్ సీసీ: 252/9 (శాశ్వత్ 61, నాగ నితిన్ 40; రోహిత్ యాదవ్ 5/30), హైదరాబాద్ వాండరర్స్: 112 (అక్షయ్ 60; తాత్విక్ 5/22).
గుణ విజృంభణ
Published Tue, Dec 27 2016 10:33 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 PM
Advertisement
Advertisement