
మండే ఎండలు, మెల్‌బోర్న్‌లో 41 డిగ్రీలు
జనవరి సగటు కంటే 14నిడిగ్రీలు అధికం
మెల్‌బోర్న్: ఆ్రస్టేలియాను మండే ఎండలు భయపెడుతున్నాయి. మెల్‌బోర్న్‌లో సోమవారం 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి! జనవరిలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఇది ఏకంగా 14 డిగ్రీలు అధికం. ఆగ్నేయ ఆ్రస్టేలియాలో సోమవారం తీవ్ర వడగాల్పులు వీచాయి. దాంతో కార్చిచ్చు ముప్పు పెరిగింది. ఈ నేపథ్యంలో విక్టోరియా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అగి్నమాపక ఆంక్షలు విధించారు.
సోమవారం న్యూ సౌత్‌వేల్స్, సౌత్ ఆ్రస్టేలియా, వెస్ట్రన్ ఆస్ట్రేలియా, క్వీన్స్‌ల్యాండ్, నార్తర్న్ టెరిటరీ రాష్ట్రాల్లో రెండో అగి్నప్రమాద ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వేడి గాలులు పెద్ద మంటలను రేకెత్తించవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. 2019–2020 బ్లాక్ సమ్మర్ తరువాత మళ్లీ ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2020 మంటలు 33 మందితో పాటు లక్షలాది వన్యప్రాణులను పొట్టన పెట్టుకున్నాయి.