Heatwaves
-
అత్యంత ఉష్ణ ఏడాదిగా 2024
జీవకోటికి ప్రాణాధారం సూర్యుడు. సూర్య కిరణాల ప్రసరణతో పుడమి పులకిస్తుంది. అదే పుడమి నేడు భానుడి భగభగలతో అల్లాడుతుంది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వంటి విపరిణామాలే భూమిపై విపరీత ఉష్ణోగ్రతలకు ముఖ్య కారణాలు. గత కొన్ని నెలలుగా హీట్‌వేవ్‌లు, వాతావరణ మార్పుల కారణంగా ప్రతినెలా ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతూ పోతున్నాయి. వరుసగా గత 17 నెలల్లో చూస్తే 16 నెలల్లో సగటు ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదవుతూ రావడం ఆందోళనకరం. ఇలా నెలల తరబడి సగటు ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదవడంతో రాబోయే నెలల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు పెచ్చరిల్లే ప్రమాదకర ధోరణి కొనసాగనుందని స్పష్టమవుతోంది. పారిశ్రామికీకరణకు ముందునాటితో పోలిస్తే భూతాపంలో పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్లోపునకు పరిమితం చేయాలన్న ప్రపంచ దేశాల ప్రతిజ్ఞ ఇప్పుడు నీరుగారిపోతోంది. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీ సెల్సియస్ దాటి నమోదైన తొలి ఏడాదిగా 2024 నిలవనుందని కోపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్(సీ3ఎస్) తాజాగా ప్రకటించింది. 1991–2020 సగటుతో పోలిస్తే ఈ ఏడాది జనవరి– నవంబర్ కాలంలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 0.72 డిగ్రీ సెల్సియస్ ఎక్కువ నమోదైంది. నవంబర్‌లో సైతం గతంలో ఎన్నడూలేనంతటి ఉష్ణోగ్రత నమోదైంది. పారిశ్రామిక విప్లవం ముందునాటితో పోలిస్తే ఈ నవంబర్‌లో 1.62 డిగ్రీ సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత నమోదైంది. 2024 ఏడాది ఎందుకింత వేడి ?హరితవాయు ఉద్గారాలు అత్యధికంగా వెలువ డటంతోపాటు ఎన్నో కారణాలు ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలకు కారణాలుగా నిలుస్తున్నా యని నిపుణులు చెబుతున్నారు. అత్యధిక వేడిమిని సముద్రాల ఉపరితల జలాలు పీల్చుకో వడమూ దీనికి మరో కారణం. విచ్చలవిడి మానవ కార్యకలాపాలు, అడవుల నరికివేత, ఎడారీకరణ తదితరాలు ఈ పరిస్థితిని మరింత ఉష్ణ మంటల్లోకి నెట్టేస్తున్నాయి. వాతావరణంలో కలుస్తున్న మీథేన్ స్థాయిలు సైతం గతంలో ఎన్నడూలేనంతగా పెరిగాయి. పారిశ్రామికీకరణ ముందునాటి కాలంతో పోలిస్తే 2023 చివరినాటికి వాతావరణంలో మీథేన్ గాఢత స్థాయి ఏకంగా 165 శాతం పైకెగసిందని, అధిక ఉష్ణోగ్రతకు ఇదీ ఒక కారణమని అధ్యయనకారులు విశ్లేషణ చేశారు. పారిశ్రామికీకరణ ముందునాటి కాలంతో పోలిస్తే ఉపరితల గాలి ఉష్ణోగ్రత ఈ ఏడాది జనవరి–నవంబర్ కాలంలో 1.54 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా ఉంది. ‘‘మానవ ప్రేరేపిత వాతావరణ మార్పుల కోసం సహజ ఎల్–నినో పరిస్థితులూ ఉష్ణోగ్రతల విజృంభణకు మరో కారణం’’ అని సస్టేన్ ల్యాబ్ పారిస్ సీఈఓ డాక్టర్ మినియా ఛటర్జీ వ్యాఖ్యానించారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఏమౌతుంది?అధిక ఉష్ణోగ్రత భరించలేని కష్టాలను మోసుకొస్తాయి. పారిశ్రామికీకరణకు ముందునాటితో పోలిస్తే భూ తాపోన్నతిలో పెరుగుదల 1.5 డిగ్రీ సెల్సియస్ దాటితే కరువు, అతి భారీ వర్షాలు, వరదలు సాధారణమవుతాయి. ఇది పర్యావరణానికి, మానవునికి హానికరం. మితిమీరిన వేడి కారణంగా పంటకు నష్టం వాటిల్లుతుంది. దిగుబడి దారుణంగా పడిపోతుంది. జీవజాతులకూ నష్టమే. సాధారణ ఉష్ణోగ్రతల్లో బతికే జీవులు మనుగడ సాధించడం కష్టం. చిన్న జీవుల ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. వన్యప్రాణుల సంఖ్య తగ్గుతుంది. హీట్‌వేవ్‌ల కారణంగా హాలర్ కోతులు, చిన్న పక్షులు అంతరించిపోతాయి. ఉష్ణోగ్రతల్లో వైరుధ్యం కారణంగా జీవవైవిధ్యం దెబ్బతింటుంది. పక్షుల ఎదుగుదల తగ్గుతుంది. ‘‘ ఉభయచర జీవులు పొదిగే క్రమంతోపాటు ఎండా, వానా, చలికాలాల మధ్య ఉన్న సరిహద్దు రేఖలు చెరిగిపోతాయి. అధిక వేడిమికి పాలిచ్చే జంతువుల మనుగడా కష్టమవుతుంది’’ అని ది హ్యాబిటెంట్స్ ట్రస్ట్ సారథి రిషికేశ్ చవాన్ చెప్పారు. సముద్ర ఉష్ణోగ్రతలూ పైపైకి..ఈ ఏడాది సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు గతంతో పోలిస్తే పెరిగాయి. ఎక్కువ రోజుల పాటు సముద్ర ఉష్ణోగ్రతలు అధిక స్థాయిల్లో కొనసాగితే పగడపు దిబ్బల ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. వేడి పెరిగితే సముద్ర జీవావరణానికి సంబంధించిన ఆహారవల యంలో కీలక పాత్రపోషించే ఈ పగడపు దీవులు కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా అంతర్థాన మవడం ఖాయం. అట్లాంటిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రాల్లోని 77 శాతం పగడపు దిబ్బల వద్ద అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ధోరణికి అడ్డుకట్టవేయకపోతే మళ్లీ పూడ్చలేని నష్టం జరుగుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది.–సాక్షి, నేషనల్ డెస్క్ -
గతేడాదిని మించి వడగాడ్పులు
సాక్షి, విశాఖపట్నం: గతేడాదిని మించి ఈ ఏడాది వడగాడ్పులు హడలెత్తించాయి. గతేడాది వేసవిలో 17 రోజులు వడగాడ్పులు/తీవ్ర వడగాడ్పులు వీచినట్టు నమోదైంది. అయితే ఈసారి వడగాడ్పుల సంఖ్య 18కి పెరిగింది. అంతేకాకుండా గతేడాది ఉష్ణోగ్రతలు గరిష్టంగా 47 డిగ్రీల వరకు నమోదు కాగా ఈ ఏడాది 48 డిగ్రీల వరకు చేరుకున్నాయి. గతేడాది వేసవి దడ పుట్టించిందనుకుంటే ఈసారి అంతకు మించి హడలెత్తించింది. సాధారణం కంటే దాదాపు మూడు రెట్ల వడగాడ్పులతో జనాన్ని బెంబేలెత్తించింది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా ఏప్రిల్ ఆరంభం నుంచే వడగాడ్పులు మొదలయ్యాయి. ఆ నెలలోనే రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరుకున్నాయి. మే నెల రెండో వారం, మూడో వారంలో అప్పుడప్పుడు వర్షాలు కురుస్తూ ఉష్ణతాపాన్ని కాస్త తగ్గించాయి. ఫలితంగా వడగాడ్పుల తీవ్రత ఒకింత తగ్గినట్టు కనిపించింది. సాధారణంగా ఏప్రిల్, జూన్కంటే మే నెలలోనే వేసవి తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా మే నెలలో వర్షాలు కురవడం వల్ల ఏప్రిల్‌కంటే తక్కువ వడగాడ్పుల రోజులు నమోదయ్యాయి. ఏప్రిల్‌లో రికార్డయిన ఉష్ణోగ్రతలను చూసి మే నెలలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుకుంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. కానీ మే నెల మధ్య మధ్యలో ఆవర్తనాలు, ద్రోణులు, తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలతో గరిష్ట ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకే పరిమితమయ్యాయి. ఇలా ఈ వేసవి మూడు నెలలూ 18 రోజుల పాటు వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీచాయి. ఇందులో ఏప్రిల్‌లో ఎనిమిది రోజులు (5, 6, 7, 8, 24, 28, 29, 30 తేదీలు), మే నెలలో ఏడు రోజులు (1, 2, 3, 4, 5, 28, 31 తేదీలు), జూన్‌లో మూడు రోజులు (1, 17, 18 తేదీలు) వడగాడ్పులు ప్రభావం చూపాయి. స్తబ్దుగా నైరుతి రుతుపవనాలునైరుతి రుతుపవనాలు ఈ ఏడాది మూడు రోజులు ముందుగా అటు కేరళలోకి, ఇటు రాష్ట్రంలోకి ప్రవేశించినా అవి ఉత్తర కోస్తాలోకి విస్తరించాక దాదాపు పది రోజుల పాటు స్తబ్దుగా ఉండిపోయాయి. దీంతో జూన్ మూడో వారం వర్షాలు కురవాల్సిన సమయంలో రెండు రోజుల (17, 18 తేదీల్లో) పాటు వడగాడ్పులు మళ్లీ చెలరేగాయి. ఈ దఫా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని అన్ని ప్రాంతాల్లోనూ వడగాడ్పులు దడ పుట్టించాయి. ప్రధానంగా నంద్యాల, కర్నూలు, తిరుపతి, వైఎస్సార్, అన్నమయ్య, అనంతపురం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, పల్నాడు, కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఎక్కువగా వడగాడ్పులను ఎదుర్కొన్నాయి. -
భేటీలతో మోదీ బిజీ బిజీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అధికార యంత్రాంగంతో సమీక్షలు నిర్వహించారు. మూడోసారి అధికారంలోకి వస్తే ‘100 రోజుల అజెండా’లో చేయాల్సిన పనులపై చర్చించారు.వరస సమీక్షలు రేమాన్ తుపాను బీభత్సం, సహాయక చర్యలు తదితరాలపై మోదీ సమీక్ష జరిపారు. దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో పౌరుల మరణానికి కారణనమైన హీట్‌వేవ్‌పై సమీక్ష జరిగింది. ఆస్పత్రుల్లో సరిపడ పడకలు, వైద్యులు, వైద్యసిబ్బంది, ఔషధాల లభ్యతపై చర్చించారు. జూన్ ఐదో తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. అన్నింటికన్నా ముఖ్యమైనదిగా భావిస్తున్న ‘100 రోజుల అజెండా’పై విడిగా మరో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారంలోకి రాగానే చేపట్టాల్సిన పనుల పురోగతిపై ప్రధాని అధికారులను ఆరాతీశారు. తొలి 100 రోజుల్లో ఎలాంటి పనులు చేస్తే బాగుంటుందో సలహాలు, సూచనలు ఇవ్వాలని గతంలో మంత్రిమండలి సభ్యులను మోదీ ఆజ్ఞాపించడం తెల్సిందే. ఫైర్, ఎలక్ట్రిక్ సేఫ్టీ ఆడిట్లు చేయండి ఎండలు, వేడి వాతావరణం కారణంగా భవనాల్లో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరిగి అగి్నప్రమాదాలకు దారి తీయకుండా ఎప్పటికప్పుడు ఫైర్, ఎలక్ట్రిక్ సేఫ్టీ ఆడిట్లను చేయాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. అధిక ఉష్ణోగ్రతల ధాటికి అటవీప్రాంతాల్లో కార్చిచ్చు ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అటవీశాఖ అధికారులకు సూచనలు చేశారు. ‘ మిజోరం, అస్సాం, మణిపూర్, త్రిపుర, మేఘాలయలో రేమాల్ తుపాను బాధితులకు అండగా ఉంటామని మోదీ భరోసా ఇచ్చారు’ అని కేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ భేటీల్లో పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఎండ దెబ్బతో జేబుకు చిల్లులు! ఆందోళన కలిగిస్తున్న అంచనాలు
ఎండ దెబ్బతో జేబుకు చిల్లులు ఏంటి అనుకుంటున్నారా? దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నుంచి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి పెరుగుతున్నాయి. ఇవి ఇప్పట్లో తగ్గే అవకాశాల్లేవని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.మానవాళి ఆరోగ్యానికి హాని కలిగిస్తున్న ఈ తీవ్రమైన ఎండలు, ఉష్ణోగ్రతలు వ్యవసాయోత్పత్తిని గణనీయంగా ప్రభావితం చేయగలవని, దీంతో అధిక ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయ ఉత్పాదకత దెబ్బతిని ద్రవ్యోల్బణం 30-50 బేసిస్ పాయింట్లు పెరుగుతుందని సంకేతాలిస్తున్నారు. సాధారణ రుతుపవనాలు వచ్చే జూన్ వరకు ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.హీట్‌వేవ్ ప్రభావం పాడైపోయే ఆహార వస్తువులు, ముఖ్యంగా కూరగాయలపై ఎక్కువగా ఉంటుందని, ఇది ద్రవ్యోల్బణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుందని డీబీఎస్ గ్రూప్ రీసెర్చ్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీనియర్ ఎకనామిస్ట్ అయిన రాధికా రావు ది ఎకనామిక్ టైమ్స్‌తో అన్నారు. ద్రవ్యోల్బణం ప్రభావం 30-50 బేసిస్ పాయింట్ల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న హీట్‌వేవ్ గ్రామీణ వ్యవసాయ ఆదాయం, ఆహార ద్రవ్యోల్బణం, సాధారణ ఆరోగ్య పరిస్థితులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని కేర్ఎడ్జ్ ముఖ్య ఆర్థికవేత్త రజనీ సిన్హా వివరించారు.గడిచిన మార్చిలో వినియోగదారుల ద్రవ్యోల్బణం 10 నెలల కనిష్ట స్థాయికి 4.9 శాతానికి తగ్గింది. కానీ ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువగా 8.5 శాతం వద్ద ఉంది. ప్రధానంగా కూరగాయల ధరలు గణనీయంగా పెరగడం వల్ల ఇది 28 శాతం పెరిగింది. కూరగాయల ద్రవ్యోల్బణం వరుసగా ఐదు నెలలుగా రెండంకెల స్థాయిలోనే ఉంది. ఈ త్రైమాసికంలో సగటున 28 శాతం ఉండవచ్చని, అదనంగా, పండ్ల ధరలు కూడా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. విపరీతమైన వాతావరణ పరిస్థితులలో సరుకు రవాణా సవాళ్లు అస్థిరతను పెంచుతాయని పిరమల్ గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ దేబోపం చౌధురి అభిప్రాయపడ్డారు. -
ఎల్లో అలర్ట్: ఈ పనులు అస్సలు చేయకండి!
వేసవి కాలం అన్నాక ఎండలు సాధారణమే కదా అని లైట్ తీసుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీ కోసమే. మండే ఎండలు, తీవ్రమైన ఉష్ట్రోగ్రతలనుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. తెలంగాణాలో ఉష్ణోగ్రతలు 43°Cకి పెరగడంతో తెలంగాణ రాష్ట్రానికి భారత వాతావరణ విభాగం-హైదరాబాద్ (IMD-H) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో నేడు రేపు వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వేసవి తాపానికి తట్టుకొని నిలబడే ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం. ఈ సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. Serious heat continues for 7th straight day 🔥🥵 More 3days to suffer, later we will move into pre monsoon rains, respite from heat from Apr 7 From Apr 6 itself storms will start, North, Central TG to get good storms in coming week 🌧️ One spell ahead in HYD during April 6-9 🌧️ pic.twitter.com/7KXOjnGQof — Telangana Weatherman (@balaji25_t) April 4, 2024 కనీస జాగ్రత్తలు వాతావరణానికి తగ్గట్టుగానే సహజం మన బాడీకూడా రియాక్ట్ అవుతుంది. ఎండకు దాహం వేస్తుంది. చల్లదనాన్ని కోరుకుంటుంది. కానీ వేసవిలో దాహం వేయకపోయినా, వీలైనంత వరకు నీరు తాగుతూ ఉండాలి. ఏ కాస్త అనారోగ్యంగా అనిపించినా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS)ని తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు తాగాలి. కొబ్బరి నీళ్ళు, చెరుకు రసంలో సహజ ఎలక్ట్రోలైట్లతో నిండి ఉంటాయి కనుక శరీరానికి తక్షణ శక్తి వస్తుంది. ప్రత్యేకించి ఎండకు బాగా అలసి పోయినప్పుడు బాగా పనిచేస్తుంది. అలాగే ఉప్పు కలిపి నిమ్మరసం, మజ్జిగ/లస్సీ, పండ్ల రసాలు తీసుకోవాలి. ఇంట్లోనే తయారుచేసిన పానీయాలైతే ఇంకా మంచిది. తొందరగా వంట ముఖ్యంగా ఈ వేసవికాలంలో వంట ఎంత తొందరగా పూర్తి చేసుకొని అంత తొందరగా బయటపడితే మంచిది. లేదంటే ఆ వేడికి, ఉక్క బోతకు చెప్పలేనంత నీరసం వస్తుంది. దాదాపు 10 గంటలలోపు వంట ఇంటి నుంచి బయపడాలి. బాగా వెంటిలేషన్ ,చల్లని ప్రదేశాలలో ఉండండి. సాధ్యమైనంతవరకు ఎండకు బయటికి వెళ్లకుండా ఉండాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు. మరీ తప్పనిసరి అయితే తప్ప బయటికి రావద్దు. ఒక వేళ వెళితే ఉదయం 12 గంటల లోపు, సాయంత్రం 4 గంటల తరువాత బైటి పనులకు సమయాన్ని కేటాయించుకోవాలి. ఎండలో బయటి వెళ్లి..తిరిగి వచ్చిన వెంటనే హడావిడిగా నీళ్లు తాగవద్దు.. కాస్త నెమ్మదించి, మెల్లిగా నీటిని తాగండి. అలాగే మరీ చల్లని నీళ్లను కూడా తాగకూడదు. ఆహారం పుచ్చకాయ, తర్బూజ నారింజ, ద్రాక్ష, పైనాపిల్ లాంటి పండ్లతోపాటు, నీరు ఎక్కువగా ఉండే అన్ని రకాల ఆకు కూరలు, దోసకాయ, బీరకాయ, సొరకాయ, గుమ్మడి, టమాటా లాంటి కూరగాయలు తీసుకోవాలి. వేపుళ్లు, మసాలాల వాడకాన్ని కూడా తగ్గించాలి. పగటిపూట కిటికీలు , కర్టెన్లను మూసి వేయాలి. రాత్రికి చల్ల గాలికి తెరిచి పెట్టండి. దోమలు రాకుండా దోమలు తెరలు తప్పనిసరి. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు గొడుగు మర్చిపోకూడదు. సన్నని వదులుగా ఉండే కాటన్ వస్త్రాలను ధరించడం మంచిది. ఎండనుంచి కాపాడుకునేలా తలను టవల్ , స్కార్ప్, టోపీ, చున్నీతో కప్పుకోవాలి. ఈ పనులు మానుకోండి ♦ ముఖ్యంగా మధ్యాహ్నం 12:00 నుండి 03:00 గంటల మధ్య ఎండలో బయటికి రావద్దు. ♦ ఎండ ఎక్కువ ఉన్న సమయంలో బాగా ఎక్కువ కష్టపడవద్దు. కాసేపు నీడ పట్టున ఉండి విశ్రంతి తీసుకోండి. ♦ చెప్పులు, గొడుగు లేకుండా బయటకు వెళ్లవద్దు. ♦ ఆల్కహాల్, టీ, కాఫీ , కార్బోనేటేడ్ శీతల పానీయాలకు సాధ్యమైనంత దూరంగా ఉండండి. ♦ ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని, మాంసాహారాన్ని మితంగా వాడండి. నిల్వ ఉన్న ఆహారాన్ని అస్సలు తినకూడదు ♦ పార్క్ చేసిన వాహనాల్లో పిల్లలను, పెంపుడు జంతువులను వదిలి వెళ్లవద్దు. ఇలా చేయడం వేడికి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అప్రమత్తత విపరీతమైన తలనొప్పి, జ్వరం, నీరసం, వాంతులు, విరోచనలు, గందరగోళం, మూర్చ, కోమా లాంటి సమస్యలను కనిపిస్తే వెంటనే సమయంలోని వైద్యులను సంప్రదించండి. ఎవరు మరింత అప్రమత్తంగా ఉండాలి ఆరుబయట పనిచేసే వ్యక్తులు; గర్భిణీ స్త్రీలు; మానసిక అనారోగ్యం ఉన్న వ్యక్తులు; శారీరకంగా అనారోగ్యం ముఖ్యంగా గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు,వృద్ధులను కుటుంబ సభ్యులు ఒక కంట కనిపెడుతూ ఉండాలి. -
ఈ రెండు నెలలూ అగ్నిగుండమే
సాక్షి, విశాఖపట్నం: వేసవి దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను అట్టుడుకించనుంది. ఈ సీజన్లో ఏప్రిల్, మే నెలల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతోపాటు అసాధారణ తాపాన్ని వెదజల్లనుంది. గత ఏడాది ఉష్ణ తీవ్రత అధికంగానే ఉంది. ఈ వేసవిలో అంతకు మించి ఎండలు, వడగాలులకు ఆస్కారం ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాకు వచ్చింది. సాధారణంగా మే నెలలో ఎండలు మండుతాయి. ఆ నెలలోనే ఎక్కువగా వడగాలులూ వీస్తాయి. కానీ.. ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఒక నెల ముందుగానే మార్చి మూడో వారం నుంచే ఎండలు విజృంభిస్తున్నాయి. ఎన్నడూ లేనివిధంగా మార్చి నెలాఖరు నుంచే వడగాలులు వీస్తున్నాయి. ఏప్రిల్ ఆరంభం నుంచే మే నెల నాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పలుచోట్ల 40 నుంచి 44 డిగ్రీలు రికార్డవుతున్నాయి. రానున్న రోజుల్లో ఇవి మరింతగా ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా మే నెలలో అగ్నిగుండాన్ని తలపించేలా ఎండలు, వడగాలులు ప్రతాపం చూపనున్నాయి. సాధారణం కంటే 5–8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదై తీవ్ర వడగాలులకు దారితీయనున్నాయి. మే నెలలో ఎన్నికల దృష్ట్యా ప్రజలు, నాయకులు వడదెబ్బ బారిన పడకుండా, మరణాలు సంభవించకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేయాలని భారత ఎన్నికల సంఘానికి ఐఎండీ సూచించింది. అంతేకాదు.. తమకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఏప్రిల్, మే నెలల్లో ఏయే రోజుల్లో ఉష్ణతీవ్రత, వడగాలుల ప్రభావం ఎక్కడ, ఎలా ఉంటుందో ముందుగానే తెలియజేస్తామని కూడా వెల్లడించింది. పెరగనున్న వడగాలుల రోజులు మరోవైపు రాష్ట్రంలో ఈ వేసవిలో వడగాలుల రోజులు కూడా పెరగనున్నాయని ఐఎండీ అంచనా వేసింది. రాష్ట్రంలో వేసవి కాలంలో సగటున ఐదు రోజులు వడగాలులు వీస్తాయి. కానీ.. గత ఏడాది జూన్ ఆఖరు వరకు వేసవి సీజన్ కొనసాగడంతో మూడు రెట్ల అధికంగా 17 రోజులు వడగాలులు/తీవ్ర వడగాలుల రోజులు నమోదయ్యాయి. 2020లో మూడు, 2021లో మూడు, 2022లో ఒక్కరోజు చొప్పున వడగాలుల రోజులు రికార్డయ్యాయి. 2019లో మాత్రం అత్యధికంగా 25 రోజులు వడగాలులు వీచాయి. ఈ ఏడాది కూడా సగటు కంటే నాలుగు రెట్లు అధికంగా వడగాలులు వీచేందుకు ఆస్కారం ఉందని ఐఎండీ విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడించింది. ఇదే ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. రాయలసీమలో ఉష్ణతీవ్రత రాష్ట్రంలో వడగాలుల ప్రభావం అప్పుడే మొదలైంది. కోస్తాంధ్ర కంటే రాయలసీమలోనే ఉష్ణతీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. మంగళవారం రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా నెల్లూరు జిల్లా కలిగిరిలో 43.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే ఇది ఐదు డిగ్రీలు అధికం. ఇంకా వగరూర్ (కర్నూలు)లో 43.5, ఒంటిమిట్ట (వైఎస్సార్)లో 43.4, తెరన్నపల్లి (అనంతపురం), ఎం.నెల్లూరు (తిరుపతి), అనుపూర్ (నంద్యాల)లలో 43 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆయా ప్రాంతాల్లో వడగాలులు వీచాయి. ఇంకా మరికొన్ని జిల్లాల్లో 40–42 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోస్తాలోనూ.. రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు పలుచోట్ల 2–3 డిగ్రీలు, అక్కడక్కడ 4–5 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రాయలసీమతోపాటు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని వెల్లడించింది. అదే సమయంలో వేడి, తేమ, అసౌకర్య వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. ఈ నెల 7వ తేదీ నుంచి గాలిలో మార్పు వల్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని అమరావతి వాతావరణం కేంద్రం డైరెక్టర్ ఎస్.స్టెల్లా చెప్పారు. -
ముంపు అంచున అగ్రరాజ్యం
భూతాపోన్నతి, కాలుష్యం, కార్చిచ్చులు అన్నీ కలిసి ధ్రువపు మంచును వేగంగా కరిగించేస్తున్నాయి. కొత్తగా వచి్చచేరిన నీటితో సముద్ర మట్టాలు అమాంతం పెరిగి తీరప్రాంతాలను తమలో కలిపేసుకోనున్నాయి. ఇలా సముద్రమట్టాల పెరుగుదలతో ముంపు ముప్పును అమెరికాలోని 24 తీరప్రాంత నగరాలు ఎదుర్కోనున్నాయని తాజా అధ్యయనం ఒకటి ప్రమాదఘంటికలు మోగించింది. ఇప్పటికైనా తేరుకోకపోతే అనూహ్యంగా పెరిగే సముద్రమట్టాలను ఆపడం ఎవరితరమూ కాదు. అమెరికాలోని ప్రభావిత 32 తీరనగరాలకుగాను 24 నగరాల వెంట సముద్రమట్టం ప్రతిసంవత్సరం 2 మిల్లీమీటర్ల మేర పెరుగుతోంది. వీటిలోని 12 నగరాల్లో అయితే అంతర్జాతీయ సముద్రమట్టాల సగటు పెరుగుదల రేటును దాటి మరీ జలాలు పైపైకి వస్తున్నాయి. వీటికితోడు ఈ నగరాల్లోని ప్రతి 50 మంది జనాభాలో ఒకరు దారుణమైన వరదలను చవిచూడక తప్పదని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఈ పరిశోధన తాలూకు సమగ్ర వివరాలు జర్నల్ ‘నేచర్’లో ప్రచురితమయ్యాయి. గ్లోబల్ వార్మింగ్ దెబ్బకి వాతావరణంలో అనూహ్య ప్రతికూల మార్పులు సంభవిస్తున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా తరచూ హీట్‌వేవ్‌లు, కరువులు సంభవించి, కార్చిచ్చులు చెలరేగి సగటు ఉష్ణోగ్రతలను అంతకంతకూ పెచ్చరిల్లుతున్నాయి. దీంతో ధృవాల వద్ద హిమానీనదాలు గతంలో కంటే వేగంగా కరిగిపోతున్నాయి. దీంతో అమెరికా, భారత్‌సహా పలు ప్రపంచదేశాల తీరప్రాంతాలకు ముంపు ప్రమాదం హెచి్చందని అధ్యయనకారులు ఆందోళన వ్యక్తంచేశారు. మరిన్ని వరదలు 2050 సంవత్సరంకల్లా అమెరికా తీరప్రాంతాల వెంట సముద్రం దాదాపు 0.30 మీటర్లమేర పైకి ఎగిసే ప్రమాదముంది. దీంతో జనావాసాలను సముద్రపు నీరు ముంచెత్తి జనజీవనం అస్తవ్యస్తంకానుంది. సముద్రపు నీటితో కుంగిన నేలలు, రోడ్లు ఇలా ప్రజారవాణా వ్యవస్థ మొత్తం దెబ్బతిననుంది. కొన్ని ప్రాంతాలు మరింతగా కుంగిపోయే ప్రమాదముందని గణాంకసహితంగా అధ్యయనం పేర్కొంది. వచ్చే 30 సంవత్సరాల్లో ప్రతి 35 ప్రైవేట్ ఆస్తుల్లో ఒకటి వరదల బారిన పడి నాశనమయ్యే అవకాశముంది. గత అంచనాలను మించి విధ్వంసం తప్పదని అధ్యయనం హెచ్చరించింది. మట్టం పెరగడంతో లక్షలాది మంది తీరప్రాంత ప్రజల జీవనం ప్రశ్నార్ధకంగా మారనుంది. అమెరికాలో 109 బిలియన్ డాలర్లమేర ఆస్తినష్టం సంభవించవచ్చని ఓ అంచనా. ఈ అధ్యయనంలో పంజాబ్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ వారి బృందం సైతం పాలుపంచుకుంది. అమెరికా తీరప్రాంతంలో ముంపును ఎదుర్కోనున్న ప్రాంతాల అంచనా గణాంకాలను సిద్దంచేసింది. ‘నక్షత్రాలు నేలరాలితే ఏం చేయగలం?. చిన్నపాటి వర్షం కూడా పడవ వేగంగా మునగడానికి ప్రబల హేతువు కాగలదు. అలాగే తీరాల వెంట మట్టాలు పెరిగితే కలిగే విపత్తులు, విపరిణామాలు దారుణంగా ఉంటాయి’ అని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్త రాబర్ట్ నెకొలస్ ఆందోళన వ్యక్తంచేశారు. ముంపు అవకాశమున్న 32 నగరాలు బోస్టన్, న్యూయార్క్ సిటీ, జెర్సీ సిటీ, అట్లాంటిక్ సిటీ, వర్జీనియా బీచ్, విలి్మంగ్టన్, మేర్టల్ బీచ్, చార్లెస్టన్, సవన్నా, జాక్సన్విల్లే, మయామీ, నేపుల్స్, మొబిల్, బిలోక్సీ, న్యూ ఓర్లీన్స్, స్లైడెల్, లేక్ చార్లెస్, పోర్ట్ ఆర్ధర్, టెక్సాస్ సిటీ, గాల్వెస్టన్, ఫ్రీపోర్ట్, కార్పస్ క్రిస్టీ, రిచ్మండ్, ఓక్లాండ్, శాన్ ప్రాన్సిస్కో, సౌత్ శాన్ ప్రాన్సిస్కో, ఫాస్టర్ సిటీ, శాంటాక్రూజ్, లాంగ్ బీచ్, హటింగ్టన్ బీచ్, న్యూపోర్ట్ బీచ్, శాండియాగో – సాక్షి, నేషనల్ డెస్క్ -
India Environment Report – 2024: హిమగిరులకు పెనుముప్పు!
భారతదేశానికి పెట్టని కోటలాగా రక్షణ కవచంగా ఉన్న సుందర హిమాలయాలు కనుమరుగు కానున్నాయా? భూమిపై ఉష్ణోగ్రతల పెరుగుదలను అడ్డుకోకపోతే కచి్చతంగా ఇదే జరుగుతుందని ఇండియా పర్యావరణ నివేదిక–2024 తేలి్చచెప్పింది. 2100 నాటికి హిమాలయ పర్వతాల్లోని 75 శాతం మంచు కరిగిపోయే ప్రమాదం ఉందని స్పష్టంచేసింది. తద్వారా వరదలు, విపత్తులు సంభవిస్తాయని, పర్యావరణం, జీవజాలం, వృక్షజాతులకు ముప్పు సంభవిస్తుందని వెల్లడించింది. ఆసియాలో 200 కోట్ల మంది తీవ్రంగా ప్రభావితం అవుతారని పేర్కొంది. భూగోళంపై అత్యధికంగా మంచు నిల్వ ఉన్న మూడో అతిపెద్ద ప్రాంతం హిమాలయాలే. కాలుష్యం, ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల ఇక్కడి హిమానీనదాలు(గ్లేసియర్స్) వేగంగా కరిగిపోతున్నాయి. ఎగువ హిమాలయాల్లో ఇప్పటికే మంచు చాలావరకు మాయమైంది. 2013 నుంచి 2022 వరకు ఇండియాలో 44 శాతం ప్రకృతి విపత్తులకు హిమగిరుల్లో మంచు కరగడమే కారణమని ఇండియా పర్యావరణ నివేదిక–2024 వివరించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో, ప్రధానంగా హిమాలయ రాష్ట్రాల్లో వరదలు, పెను తుఫాన్లు, కొండ చరియలు విరిగిపడడం వంటి విపత్తులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నట్లు ఈ నివేదిక గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. మనమంతా పర్యావరణ సంక్షోభం అంచున ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. హిమాలయాల్లో మంచు కరిగిపోతుండడంతో విలువైన వృక్ష సంపద అంతరించిపోతున్నట్లు పలు పరిశోధనల్లో తేలింది. ప్రతి పదేళ్లకు 54 మీటర్ల మేర వృక్షాలు కనుమరుగు అవుతున్నట్లు వెల్లడయ్యింది. నిత్యం మంచుతో గడ్డకట్టుకొని ఉండే ప్రాంతాలు సైతం మాయమవుతున్నాయి. ముఖ్యంగా పశి్చమ భాగంలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. 2004 నుంచి 2020 వరకు 8,340 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మంచు కరిగింది. అదంతా మైదాన ప్రాంతంగా మారిపోయింది. హిమాలయాల్లో 40 శాతం మంచు ఇప్పటికే కరిగిపోయిందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే 2100 నాటికి 75 శాతం మంచు కనిపించకుండా పోతుందని ఇండియా పర్యావరణ నివేదిక హెచ్చరించింది. ఈ మహావిపత్తును నివారించాలంటే వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెడ్ డెవలప్మెంట్(ఐసీఐఎంఓడీ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇజబెల్లా కొజీల్ సూచించారు. అత్యవసర, నిర్ణయాత్మక కార్యాచరణ అవసరమని పేర్కొన్నారు. హిమాలయ పర్యావరణ, జీవావరణ వ్యవస్థపై కోట్ల మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయని గుర్తుచేశారు. మన ప్రభుత్వాలు చురుగ్గా వ్యవహరించాలని, హిమాలయాలను కాపాడుకోకపోతే మానవాళి మనుగడకు ప్రమాదం తప్పదని స్పష్టం చేశారు. ప్రమాదంలో డూమ్స్ డే గ్లేసియర్ అంటార్కిటికా ఖండం పశి్చమ భాగంలోని డూమ్స్ డే హిమానీనదం(థ్వాయిట్స్ గ్లేసియర్) మనుగడ ముప్పును ఎదుర్కొంటోంది. గత 80 ఏళ్లలో ఏకంగా 50 బిలియన్ టన్నుల మంచును కోల్పోయింది. ప్రస్తుతం 130 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ గ్లేసియర్ క్రమంగా కరిగిపోతోంది. కొత్తగా వచి్చచేరే మంచు కంటే కరిగిపోతున్నదే ఎక్కువ. మరికొన్నేళ్లలో పూర్తిగా అంతమైనా అశ్చర్యం లేదని పరిశోధకులు చెబుతున్నారు. ఇటీవలే ఈ హిమానీనదంపై అధ్యయనం చేశారు. నమూనాలు సేకరించి విశ్లేషించారు. ఎల్–నినో ప్రభావం కారణంగా భూమి వేడెక్కుతుండడంతో డూమ్స్‌డే గ్లేసియర్ కరిగిపోతున్నట్లు గుర్తించారు. ఈ పరిణామం 80 సంత్సరాల క్రితం.. 1940వ దశకంలోనే మొదలైందని, 1970వ దశకంలో వేగం పుంజుకుందని తేల్చారు. అంటార్కిటికా ఖండంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో హమానీనదం కరిగిపోయే రేటు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నట్లు సైంటిస్టులు స్పష్టం చేశారు. పశి్చమ అంటార్కిటికాలో మంచు ఫలకాల స్థిరత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనం తోడ్పడుతుందని భావిస్తున్నారు. డూమ్స్ డే గ్లేసియర్ కీలకమైన ప్రదేశంలో ఉంది. ఇది పూర్తిగా కరిగిపోతే పశి్చమ అంటార్కిటికా నుంచి సముద్రంలోకి మరింత నీరు చేరుతుంది. ఫలితంగా సముద్ర మట్టం 65 సెంటీమీటర్ల వరకు పెరిగే ప్రమాదం ఉంది. అదే జరిగితే లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి. జల విధ్వంసం తప్పదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వడగాడ్పులకు 100 మంది బలి!
బలియా/పట్నా: ఉత్తరాదిన కొనసాగుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాలులతో జనం పిట్టల్లా రాలుతున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో మూడు రోజుల్లోనే 100 మంది వరకు ప్రజలు చనిపోయారు. భరించలేని ఎండలు, వడగాడ్పులకు తాళలేక యూపీలో 54, బిహార్‌లో 44 మరణాలు నమోదయ్యాయి. ఈ నెల 15, 16, 17 తేదీల్లో యూపీలోని బలియా ఆస్పత్రిలో చేరిన సుమారు 400 మంది జ్వర బాధితుల్లో 54 మంది వివిధ కారణాలతో చనిపోయారని అధికారులు తెలిపారు. ఎండలు విపరీతంగా ఉండడంతో ప్రజలు వివిధ ఆరోగ్య సమస్యలకు గురై ఆస్పత్రికి వస్తున్నారని బలియా ప్రధాన వైద్యాధికారి(సీఎంవో) డాక్టర్ జయంత్ కుమార్ తెలిపారు. మొత్తం 54 మందిలో 40 శాతం మంది జ్వరంతో, 60 శాతం మంది ఇతర వ్యాధులతో చనిపోయారని డాక్టర్ కుమార్ చెప్పారు. ఎక్కువ మంది 60 ఏళ్లకు పైబడిన వారేనన్నారు. మరణాలకు కచ్చితమైన కారణాలను కనుగొనేందుకు లక్నో నుంచి వైద్య బృందాలను పంపించింది. బల్లియా జిల్లా ఆస్పత్రిలో మరిన్ని ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను ఏర్పాటు చేశారు. వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది సంఖ్యను కూడా పెంచామని అధికారులు తెలిపారు. ఆజంగఢ్ డివిజన్ ఆరోగ్య శాఖ అదనపు డైరెక్టర్ ఓపీ తివారీ శనివారం మీడియాతో మాట్లాడుతూ..లక్నో నుంచి రానున్న ఆరోగ్య శాఖ బృందం బల్లియాకు వచ్చి పరీక్షలు నిర్వహిస్తుందని, మరణాలకు కారణాలను నిర్ధారిస్తామని చెప్పారు. బహుశా గుర్తించని ఏదో ఒక వ్యాధి మరణాలకు కారణమై ఉండొచ్చు, ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. వేసవి, శీతాకాలాల్లో డయాబెటిక్ రోగులతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, రక్తపోటు ఉన్నవారిలో మరణాల రేటు సాధారణంగా ఎక్కువగా ఉంటుంది’అని తివారీ చెప్పారు. శుక్రవారం బలియాలో 42.2 డిగ్రీల సెల్సియస్ ఉషో్టగ్రత నమోదైందని ఐఎండీ తెలిపింది. సాధారణం కంటే ఇది 4.7 డిగ్రీలు ఎక్కువని పేర్కొంది. సీఎంఎస్ తొలగింపు బలియా జిల్లా ఆస్పత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్(సీఎంఎస్) డాక్టర్ దివాకర్ సింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆస్పత్రిలో మరణాలకు కారణాలపై నిర్లక్ష్యపూరితంగా వ్యాఖ్యలు చేశారంటూ ఆజంగఢ్‌కు బదిలీ చేసింది. డాక్టర్ ఎస్కే యాదవ్‌కు సీఎంఎస్ బాధ్యతలను అప్పగించింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ..నిత్యం 125 నుంచి 135 మంది రోగులు ఆస్పత్రిలో చేరుతున్నారని తెలిపారు. 15న 23 మంది, 16న 20 మంది, 17న 11మంది వేర్వేరు కారణాలతో చనిపోయినట్లు తెలిపారు. బిహార్‌లో 44 మంది.. బిహార్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. గత 24 గంటల్లో తీవ్ర వడగాల్పుల కారణంగా 44 మంది చనిపోయారు. వీరిలో ఒక్క పటా్నలోనే 35 మంది ప్రాణాలు కోల్పోయారు. పట్నా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో వంద మంది వరకు వడదెబ్బ బాధితులు చేరినట్లు అధికారులు తెలిపారు. ఎండలకు తోడు రాష్ట్రంలోని 18 ప్రాంతాల్లో తీవ్రమైన వడగాడ్పులు, నాలుగు చోట్ల వడగాడ్పులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయని అధికారులు తెలిపారు. షేక్‌పురాలో అత్యధికంగా 44.2 డిగ్రీలు, పటా్నలో 43.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం పాఠశాలలు, అంగన్వాడీలకు వేసవి సెలవులను 24 వరకు పొడిగించింది. -
సగం రాష్ట్రాలకు వడగాల్పుల వెతలు
న్యూఢిల్లీ: సూర్య ప్రతాపానికి దాదాపు సగం భారతదేశ రాష్ట్రాలు చెమటతో తడిసి ముద్దవుతున్నాయి. భానుడి భగభగలతో మొదలైన వడగాల్పులు మరో 3–4 రోజులు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ వేడి వేడి వార్తను పట్టుకొచ్చింది. మండే ఎండలను భరిస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలుగు రాష్ట్రాలూ ఉన్నాయి. రుతుపవనాలు తలుపుతట్టినా వడగాల్పులు మాత్రం వదిలిపోవట్లేవు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలుసహా విదర్భ ప్రాంతాల్లో తీవ్రస్థాయి నుంచి అతి తీవ్రస్థాయిలో వడగాల్పుల పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే బిహార్‌లో రెడ్అలర్ట్ను ప్రకటించారు. శనివారం(జూన్ 17)దాకా జార్ఖండ్‌లో స్కూళ్లు తెరుచుకోనేలేదు. ఛత్తీస్‌గఢ్, గోవాల్లోనూ ఇదే పరిస్థితి. వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు, రాత్రిపూట ఉష్ణోగ్రతలపై వాతావరణ శాఖ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. ► తెలంగాణ, రాయలసీమ, మధ్యప్రదేశ్ పశ్చిమ ప్రాంతం, తమిళనాడు రాష్ట్ర ప్రజలు ఆదివారం(జూన్ 18న) కూడా వడగాల్పులను భరించాల్సిందే. ► ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, యానాం, మధ్యప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతాలు, తూర్పు యూపీ, బిహార్‌లో మరో రెండు రోజులు ఎండలు మరింత మండుతాయి. ► ఒడిశా, విదర్భ ప్రాంతాల్లో మరో నాలుగు రోజులపాటు వడగాల్పులు కొనసాగుతాయి. ► పశ్చిమబెంగాల్లోని గంగా పరీవాహక ప్రాంతాలు, జార్ఖండ్‌లో మరో 3 రోజులు ఎండలు మరింత ముదురుతాయి. ► రాత్రిపూట సైతం ఉష్ణోగ్రతలు పైస్థాయిలోనే ఉండే అవకాశం ఉంది. ► విదర్భ, ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతాల్లో ఆదివారం ఈ పరిస్థితులు ఉంటాయి. ► మధ్యప్రదేశ్ తూర్పు ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్‌లలో రెండు రోజులు రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువే ఉండనున్నాయి. ► మధ్య భారతం, తూర్పు భారతం, దక్షిణ భారతదేశంలో వచ్చే మూడు రోజులూ ఉష్ణోగ్రతల్లో మార్పేమీ ఉండదు. ► ఆ తర్వాత మాత్రం 2–4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గొచ్చు. -
ఏపీ ప్రజలకు అలర్ట్.. అప్రమత్తంగా ఉండాల్సిందే.. ఈ రోజు 48 మండలాల్లో..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 48 మండలాల్లో శుక్రవారం తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురువారం ప్రకటనలో తెలిపారు. అనకాపల్లి జిల్లాలోని 14 మండలాల్లో, విజయనగరం జిల్లాలో 9, గుంటూరు జిల్లాలో 7, కాకినాడ జిల్లాలో 7, కృష్ణాలో 4, ఎన్టీఆర్‌లో 4, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్క మండలం చొప్పున తీవ్ర వడగాడ్పులు వీస్తాయని పేర్కొన్నారు. గురువారం అనకాపల్లి జిల్లాలో 8, విజయనగరంలో ఒక మండలంలో తీవ్ర వడగాడ్పులు వీచాయని, మరో 51 మండలాల్లో వడగాడ్పులు నమోదైనట్లు చెప్పారు. గురువారం తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువులో 44.7 డిగ్రీలు, నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని నందవరం 44.6, విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 44.5, చిత్తూరు జిల్లాలోని నింద్రలో 44.3, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వేపినాపి, అక్కమాంబపురంలలో 44.3 డిగ్రీలు చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చదవండి: ఇటు పునాది రాళ్లు-అటు సమాధి రాళ్లు -
ఇంగ్లండ్‌లో ఎండ దెబ్బకు కరిగిన రన్‌వే
లండన్: ఇంగ్లాండ్‌లో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. వాహనాలకు నిప్పంటుకుంటోంది. గడ్డి భూములు అగ్నికి ఆహూతవుతున్నాయి. రైళ్లను రద్దు చేయాల్సి వస్తోంది. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఎండలను తట్టుకోలేక ప్రజలు బీచ్‌లకు పరుగులు తీస్తున్నారు. ఈత కొలన్లలో సేదతీరుతున్నారు. ఎండ దెబ్బకు లూటన్ ఎయిర్‌పోర్టులో రన్‌వే కరిగిపోయింది! దాంతో విమానాశ్రయాన్ని మూసేయాల్సి వచ్చింది. సోమవారం కేంబ్రిడ్జ్‌లో 38 డిగ్రీలు, లండన్‌లో 37.5 డిగ్రీలు నమోదైంది! సూర్యప్రతాపం వల్ల అడవుల్లో కార్చిచ్చు రగులుతోంది. లండన్‌లోని వాక్స్హాల్ ప్రాంతంలో రైలు పట్టాలు వ్యాకోచించి, వంగిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. లండన్‌లో వుడ్గ్రీన్ క్రౌన్ కోర్టులో ఏసీ యూనిట్ పేలిపోవడంతో ఓ మర్డర్ కేసులో విచారణను వాయిదా వేశారు. యూకేలో వాతావరణం సహారా ఎడారిని తలపిస్తోందంటూ జనం సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే ప్రమాదముందన్న హెచ్చరికలు ఇంకా భయపెడుతున్నాయి. -
ఈ ఏడాది వేసవి బాధించదు: ఐఎండీ
న్యూఢిల్లీ: ఈ ఏడాది వేసవి అంతగా బాధించే అవకాశాల్లేవని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఉత్తర భారతంలో గరిష్ట స్థాయి ఉష్ట్రోగతలు తక్కువగానే నమోదవుతాయని మంగళవారం వెల్లడించింది. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, బిహార్లలో మార్చి నుంచి మే వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతాయని తెలిపింది. తూర్పు, ఈశాన్య, ఉత్తర భారతం, గంగా నది మైదాన ప్రాంతాల్లో వడ గాడ్పులు సాధారణం కంటే తక్కువగానే ఉంటాయని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్రో చెప్పారు. పశ్చిమ, వాయవ్య భారతాన్ని ఈ వేసవిలో వడగాడ్పులు బాధిస్తాయని, కానీ ఉత్తర భారతంలో అంతగా ఉండవని తెలిపారు. -
మరో 4 డిగ్రీలు పైపైకి..!
న్యూఢిల్లీ: భూగోళంలో వాతావరణ మార్పుల ప్రభావం భవిష్యత్తులో దేశంపై ప్రతికూలంగా ఉండనుందని కేంద్రం అంచనా వేసింది. ఈ శతాబ్దాంతానికల్లా దేశంలో ఉష్ణోగ్రతలు సరాసరిన 4.4 డిగ్రీలు పెరగనుండగా, వేసవి వడగాల్పుల తీవ్రత 3 నుంచి 4 రెట్లు పెరిగే అవకాశాలున్నాయని కేంద్ర భూ విజ్ఞాన శాఖ పేర్కొంది. సెంటర్ ఫర్ క్లైమేట్ రీసెర్చ్ వారి ఆ నివేదికలోని ముఖ్యాంశాలివీ.. ► కర్బన ఉద్గారాల కారణంగా 1901–2018 సంవత్సరాల మధ్య దేశంలో ఉష్ణోగ్రత సగటున 0.7 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగింది. ► 1986 –2015 మధ్య 30 ఏళ్ల కాలంలో అత్యంత వేడి, అత్యంత చల్లని రోజుల్లో ఉష్ణోగ్రతలు 0.63, 0.4 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగాయి. ఈ శతాబ్దాంతానికి అత్యంత వేడి, అత్యంత చల్లని దినాల్లో ఉష్ణోగ్రతలు వరుసగా 4.7, 5.5 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగే అవకాశముంది. భవిష్యత్తులో అత్యంత వేడి, అత్యంత చల్లని రోజులు నమోదులో 55, 70 శాతం మేర పెరుగుతాయి. ► ఏప్రిల్–జూన్‌ల మధ్య దేశంలో సాధారణంగా సంభవించే వడగాడ్పుల తీవ్రత రాబోయే కాలంలో 3 నుంచి 4 శాతం మేర పెరగనుంది. వడగాల్పులు వీచే సమయం కూడా రెట్టింపు కానుంది. ఇది ముఖ్యంగా గంగా, సింధు నదీ పరివాహక ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. దేశంలో రుతు పవనాలకు కారణమయ్యే హిందూ మహా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో 1951–2015 కాలంలో సగటున ఒక డిగ్రీ చొప్పున నమోదయింది. ఇది ప్రపంచ సగటు 0.7 కంటే ఎక్కువ. ► ఉత్తర హిందూ మహా సముద్రంలో సముద్ర మట్టాలు 1874– 2004 కాలంలో ఏడాదికి 1.06 నుంచి 1.75 మిల్లీమీటర్ల చొప్పున పెరిగాయి. 1986–2005 కాలంతో పోల్చి చూసుకుంటే శతాబ్దాంతానికి సుమారు 300 మిల్లీమీటర్లమేర పెరిగే అవకాశం. -
ఉడికిపోతున్న ఉత్తర భారతం
జైపూర్: ఉత్తరభారతం వడగాడ్పులతో ఉడుకెత్తిపోతోంది. ఆదివారం ప్రపంచ వ్యాప్తంగా నమోదైన 15 అత్యంత వేడి ప్రదేశాల్లో 10 ఉత్తర భారతంలోవే కావడం విశేషం. మిగతా ఐదు పాకిస్తాన్లో ఉన్నాయి. రాజస్థాన్‌లోని చురు (48.9 డిగ్రీలు) , శ్రీ గంగానగర్ (48.6 డిగ్రీలు)లు ఈ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి . తర్వాత స్థానాల్లో పాకిస్తాన్‌లోని జకోబాబాద్(48 డిగ్రీలు), ఉత్తర ప్రదేశ్‌లోని బండా(47.4డిగ్రీలు), హరియాణాలోని నర్నాల్(47.2డిగ్రీలు) ఉన్నాయి. ఈఐ డొరాడో వెదర్ వెబ్సైట్ ఈ వివరాలు వెల్లడించింది. శనివారం నుంచి అగర్తలలో ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదవుతున్నా ఈ ప్రాంతంలో ఎండలు మండిపోయాయి. దేశంలోని పర్వత ప్రాంతాల్లో గత రెండు దశాబ్దాలుగా ఎండ ఎక్కువుండే రోజులు పెరుగుతున్నాయని, ముస్సోరీ లాంటి ప్రాంతంలో ఈ జూన్ 1న 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మహాపాత్ర చెప్పారు. పశ్చిమ దిశ నుంచి వస్తున్న పొడిగాలులు పాకిస్తాన్, రాజస్తాన్ ఎడారుల్లోని వేడిని గ్రహించడమే ప్రస్తుతం వేడిగాలుల ఉధృతికి కారణమని ఆయన చెప్పారు. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు రెండూ పెరుగుతుండటం వల్ల భూతలం బాగా వేడెక్కుతోందని,ఫలితంగా వేడిగాలులు ఎక్కువ కాలం కొనసాగుతున్నాయని, రెండు దశాబ్దాలుగా ఇలాంటి పరిస్థితిని గమనిస్తున్నామని మహాపాత్ర వివరించారు. 2010–2018 మధ్య కాలంలో దేశంలో వడగాడ్పుల కారణంగా 6,167 మంది చనిపోయారని, ఒక్క 2015లోనే 2,081 మంది వడగాడ్పులకు బలయ్యారు. మైదాన ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటితే వడగాడ్పుగా పరిగణిస్తారు. రెండు దశాబ్దాలుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు -
'ఎండలు మరెంత భగ్గుమంటాయో'
న్యూఢిల్లీ: ఏప్రిల్ నెలలో అడుగుపెట్టి పట్టుమని పది రోజులు కూడా కాకముందే దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ ఇప్పటికే ఎండల తీవ్రత 40 డిగ్రీల సెల్సియస్ దాటి పోయింది. మే నెలల్లో ఎండలు మరెంత భగ్గుమంటాయో అన్న ఆందోళన అప్పడే ప్రజలను పిండేస్తోంది. ఎండలు ఎంత ఎక్కువ ఉంటే ఆ తర్వాత అంత ఎక్కువ వర్షాలు పడతాయని ప్రజలు భావిస్తారు. కానీ అది అన్ని కాలాల్లో నిజం కాదు. భారత ప్రభుత్వ వాతావరణ శాఖ ఈ సారి వర్షాలు ఎలా ఉంటాయో ఇప్పటివరకు వెల్లడించలేదు. కానీ సాధారణ వర్షపాతం కన్నా తక్కువగా వర్షాలు కురుస్తాయని ప్రైవేటు వాతావరణ అధ్యయన సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కరవు పరిస్థితులు తాండివిస్తున్నాయి. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తమను ఆదుకోవాల్సిందిగా కోరుతూ తమిళనాడు రైతులు కపాలాలతో ఢిల్లీ కపాలం అదిరేలా నిరసన వ్యక్తం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. దేశంలో కరవు పరిస్థితులు నెలకొన్నప్పుడల్లా ఆ నెపాన్ని అనూహ్య వాతావరణ పరిస్థితులపైకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెట్టేస్తున్నాయి. అందుకు భూతాపోన్నతి కారణమంటూ ఓ భూతాన్ని చూపిస్తున్నాయి. భూతాపోన్నతికి ఎవరు కారణం ? మరి భూతాపోన్నతి తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలేమిటీ? భూతాపోన్నతి పెరిగినా కరవు పరిస్థితుల ప్రభావం ఉండకుండా ప్రభుత్వాలు తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలేమిటీ? ఏనాడైనా ఆలోచించాయా? మార్చి 30 నాటి లెక్కల ప్రకారం కేంద్ర జల సంఘం పర్యవేక్షణలో ఉన్న 91 శాతం పెద్ద రిజర్వాయర్లలో నీటి నిల్వలు 52,63,200 కోట్ల క్యూబిక్ మీటర్లకు పడిపోయింది. అంటే మొత్తం రిజర్వాయర్ల సామర్థ్యంలో 33 శాతానికి పడిపోయింది. నీటి పొదుపునకు కేంద్ర జల సంఘం ఇప్పటికే అత్యవసర చర్యలు తీసుకోవాలి. అలాంటి సూచనలేవి కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో అనేక రాష్ట్రాలు రక్షిత మంచినీటి కోసం తల్లడిల్లి పోతున్నాయి. సమస్య వచ్చే వరకు కదలక పోవడమన్న జాడ్యం పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలకు పాకడంతోనే దేశంలో దారుణ పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. దేశంలో సగానికి సగం జనాభా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నా.. వ్యవసాయ ఉత్పత్తులు జాతీయ స్థూల ఉత్పత్తిలో 12 శాతం మాత్రమే ఉందంటే అది ఎవరిది తప్పు? నీటి పారుదల ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, తప్పనిసరిగా ప్రతి రైతు భూగర్భ జలాల రక్షణకు చర్యలు తీసుకోవాలనే నిబంధనలు అమలయ్యేలా చూడకపోవడం ప్రభుత్వాల తప్పుకాదా? మొత్తం రైతుల్లో 61 శాతం రైతులు ఇప్పటికీ వర్షాధార పంటలపైనే ఆధారపడడానికి కారణం ఎవరు? అన్న విషయాన్ని ఈ ప్రభుత్వాలు ఒక్కసారైనా ఆలోచిస్తున్నాయా? అళ్వార్‌లోని తరుణ్ భారత్ సంఘ్, పుణెలోని వాటర్‌షెడ్ ఆర్గనైజేషన్ ట్రస్ట్, చండీగఢ్ శివారులోని సుఖోమజిరి, మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధి ఎన్జీవో సంస్థలు జల వనరుల అభివద్ధికి చర్యలు తీసుకొని ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నా మన పాలకులు మాత్రం నిద్ర లేవరెందుకు? చెట్టూ పుట్ట, చేను పచ్చగా ఉన్నప్పుడే భూతాపోన్నతి తగ్గుతుందని, పర్యవసానంగా ఎండల తీవ్రత ఎక్కువ ఉండదన్న విషయం మన పాలకులకు తెలియదా? కనీసం వచ్చే నెల ప్రజలకు తాగునీటిని అందించి ప్రాణాలను నిలిపేందుకు అహ్మదాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీసుకోనైనా అన్ని మున్సిపాలిటీలు సత్వర చర్యలు చేపట్టాలి. 2010 నుంచి 2015 మధ్య అక్కడి స్థానిక ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపట్టిన 'అహ్మదాబాద్ హీట్ యాక్షన్ ప్లాన్' వల్ల వేసవి కాలంలో వందల సంఖ్యలో సంభవించే మరణాలు పదుల సంఖ్యకు తగ్గాయి. 2015లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వేసవి గాలులకు దాదాపు రెండున్నర వేల మంది మరణించడం గమనార్హం. -
సూర్య ప్రతాపం
వడదెబ్బకు 10 మంది మృతి రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు భయాందోళన చెందుతున్న ప్రజలు ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు భగ్గుమంటున్నారుు. వేడిమితో పాటు వడగాల్పులు భరించలేక ప్రజల ప్రాణాలు హరీ అంటున్నారుు. చిన్నా, పెద్ద తేడా లేకుండా వడదెబ్బకు బలవుతున్నారు. జిల్లాలో గురువారం ఒక్కరోజే వడదెబ్బతో 10 మంది మృతి చెందారు. దీంతో జనం బెంబేలెత్తుతున్నారు. బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. కొడకండ్ల : మండలంలోని పెద్దవంగర గ్రామానికి చెందిన ఈదురు ఎల్లమ్మ(58) ఎండల తీవ్రతతో అస్వస్థతకు గురైంది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది. ఎల్లమ్మకు ఇద్దరు కుమారులున్నారు. ఆత్మకూరు : మండలంలోని ముస్త్యాలపల్లికి చెందిన కొత్తపెల్లి చంద్రమ్మ (55) గురువారం కూలీ పనులకు వెళ్లి వచ్చి అస్వస్థతకు గురైంది. కు టుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే మృతిచెం దింది. చంద్రమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జఫర్‌గఢ్ : మండలంలోని తిడుగు గ్రామానికి చెందిన శ్రీరాముల వెంకటేశ్వర్లు(32) కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. రెండు రోజుల క్రి తం పనికి వెళ్లిన వెంకటేశ్వర్లు ఎండ తీవ్రతతో అస్వస్థకు గురయ్యూడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. తిరిగి ఇంటికి వచ్చాక మళ్లీ అస్వస్థతకు గురై మృతిచెందాడు. నిరుపేద అరుున వెంకటేశ్వర్లు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు. మృతుడి కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకులు అన్నెబోయిన భిక్షపతి, పార్టీ మండల అధ్యక్షుడు చిట్టిమళ్ల కృష్ణమూర్తి తదితరులు పరామర్శించారు. కాశిబుగ్గలో సెంట్రింగ్ కార్మికుడు.. వరంగల్ నగరంలోని కాశిబుగ్గ బీఎన్ రావు కాలనీకి చెందిన సిరిపెల్లి వీరస్వామి(52) గత 15 ఏళ్లుగా సెంట్రింగ్ కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజుల క్రితం దేశాయిపేటలోని ఓ ఇంటి నిర్మాణంలో కూలి పని చేస్తూ వడదెబ్బకు గురయ్యూడు. ఆస్పత్రికి వెళ్లేందుకు డబ్బు లేకపోవడంతో విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని భార్య మార్తకు చెప్పాడు. గురువారం విరేచనాలు, వాంతులు కావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుండగానే మృతి చెందినట్లు మార్త బోరున విలపించింది. స్థానిక కార్పోరేటర్ బయ్యస్వామి వీరస్వామి కుటుంబసభ్యులను ఓదార్చి దహనసంస్కరాల ఖర్చులు ఇచ్చారు. మృతుడి కుటుంబ పరిస్థితిని కొండా దంపతుల దృష్టికి తీసుకెళ్లి, సాయం చేయిస్తానని తెలిపారు. స్థానిక పెద్దలు కట్కూరి రాజు, కండె పోషయ్య, మహేందర్, ఆరెపెల్లి రవి, పెండ్యాల కొమురయ్య, బొచ్చుమహేష్ తదితరులు సంతాపం తెలిపారు. మంగపేటలో ఇద్దరు.. మండలంలోని కోమటిపల్లికి చెందిన బత్తిని వెంకన్న(42) కూలీ పనికి వెళ్లి వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యూడు. వాంతులు చేసుకుంటుండగా కుటుంబ సబ్యులు మంగపేట పీహెచ్‌సీకి తరలిస్తుండగానే మృతి చెందాడు. వెంకన్నకు భార్య రజిత, కుమారుడు రాకేష్, కుమార్తె అనూష ఉన్నారు. అదే గ్రామానికి చెందిన అనంతుల సాంబయ్య అనే టీఆర్ఎస్ నాయకుడి తల్లి సరోజన(80) కూడా వడదెబ్బతో బుధవారం రాత్రి మృతి చెందింది. ఖానాపురం : వుండల కేంద్రానికి చెందిన గట్టి చిన్న రావుయ్యు(60) వడదెబ్బకు గురై వాం తులు, విరేచనాలు చేసుకున్నాడు. కుటుంబసభ్యులు ఇంటి వద్దనే చికిత్స చేరుుస్తుండగా గురువారం వుృతి చెందాడు. వుృతునికి భార్య లచ్చవ్ము, వుుగ్గురు కువూర్తెలు, ఇద్దరు కువూరులు ఉన్నారు. కురవిలో ఇద్దరు.. మండలంలో వడదెబ్బతో ఇద్దరు మృతి చెందారు. మోద్గులగూడెం గ్రామానికి చెందిన చింతమల్ల స్వామి(55), నల్లెల్ల గ్రామానికి చెందిన కల్లూరి గోవిందమ్మ(45) వడదెబ్బ తాళలేక ప్రాణాలొదిలారు. వీరి మృతికి ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు సంతా పం తెలిపారు. కరీమాబాద్ : నగరంలోని కరీమాబాద్ నానమియాతోటలో కూలీ పనులు చేసుకుని జీవించే వనం విజయ(45) గురువారం వడదెబ్బ తట్టుకోలేక మృతి చెందింది. కార్పోరేటర్ మేడిది రజిత విజయ కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సాయం అందజేశారు. స్థానిక నాయకులు మేడిది మధు, చారి, సాబీర్ సంతాపం తెలిపారు. -
వడదెబ్బతో ఎనిమిది మంది మృతి
డోర్నకల్‌లో ఒకే తండాకు చెందిన ఇద్దరు.. ఏటూరునాగారంలో అంగన్వాడీ టీచర్ జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. ప్రచండ భానుడి ప్రకోపానికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు నానాటికీ పెరుగుతుండడం, వడగాల్పులు వీయడంతో వృద్ధులు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నా రు. జిల్లాలో వడదెబ్బ మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతుండడంతో ప్రజలు భయూందోళనలకు గురవుతున్నారు. సోమవారం ఒక్కరోజే ఎనిమిది మంది మృత్యువాత పడ్డారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మరిపెడ : మరిపెడ మండల కేంద్రానికి చెందిన గోల్కొండ మైసయ్య(65) వంట చెరుకు కోసం ఆదివారం అడవికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చాక తీవ్ర అస్వస్థతకు గురయ్యూడు. ఈ క్రమంలో సోమవారం మృతిచెందాడు. మైసయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నెల్లికుదురు : మండలంలోని చిన్నముప్పారం గ్రామంలో వడదెబ్బ తాళలేక బొమ్మిశెట్టి వెంకయ్య(75) అనే వృద్ధుడు మృతిచెందాడు. ఎండలతో తీవ్ర అస్వస్థతకు గురైన వెంకయ్య ఇంట్లో పడుకుని నిద్రలోనే మృత్యువాత పడ్డాడని కుటుంబసభ్యులు తెలిపారు. దుగ్గొండి : మండలంలోని జీడికల్ గ్రామానికి చెందిన దండు సాంబయ్య(55) వడదెబ్బతో మృతిచెందాడు. పసుపు వేరేందుకు సోమవారం పొలానికి వెళ్లిన సాంబయ్య మధ్యాహ్నం 3 గంటలకు ఇంటికి వచ్చాడు. అనంతరం అస్వస్థతకు గురికాగా, కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. మృతుడికి భార్య సుగుణ, ఇద్దరు కుమారులు ఉన్నారు. హసన్‌పర్తి : వరంగల్ నగరంలోని 58వ డివిజన్ వం గపహాడ్కు చెందిన నక్క రాములు(62) వడదెబ్బతో మృతి చెందాడు. సోమవారం కూలీ పనికి వెళ్లిన రాములు మధ్యాహ్నం ఇంటికి వచ్చి కుప్పకూలాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగానే ప్రాణాలు వదిలాడు. ఏటూరునాగారం : మండలంలోని ఎక్కెల గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ బలంతుల సరోజన (60) వడదెబ్బకు గురై ఆదివారం అర్ధరాత్రి మృతి చెందారు. ఆదివారం ఎండలో తిరగడంతో వడదెబ్బకు గురైన సరోజనను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించామని, చికిత్స పొం దుతూ మృతి చెందిందని ఆమె కోడలు కల్పన తెలి పారు. విషయం తెలుసుకున్న సీడీపీవో రాజమణి, సూపర్వైజర్లు, అంగన్వాటీ కార్యకర్తలు మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. రాయపర్తి: మండలంలోని తిర్మలాయపల్లికి చెందిన గడ్డం మల్లమ్మ(65) వడదెబ్బతో సోమవారం మృతిచెందింది. మల్లమ్మ పింఛన్ తీసుకునేందుకు పోస్టాఫీసు వద్దకు వెళ్లి తిరిగొచ్చి ఎండదెబ్బతో అస్వస్థతకు గురైంది. ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఒకే తండాకు చెందిన ఇద్దరు డోర్నకల్ : పట్టణ శివారు సిగ్నల్‌తండాకు చెందిన ఇద్దరు మహిళలు సోమవారం వడదెబ్బతో మృతి చెందారు. బాదావత్ లింగమ్మ(58), బానోత్ కాంతమ్మ(60) తీవ్రమైన ఎండలతో గత మూడు రోజులుగా అస్వస్థతకు గురయ్యారు. చికిత్స అందిస్తుండగా సోమవారం కొద్దిపాటి సమయం తేడాతో ఇద్దరూ మృతి చెందారు. దీంతో తండావాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఎమ్మెల్యే పరామర్శ... బాదావత్ లింగమ్మ, బానోత్ కాంతమ్మ కుటుంభాలను ఎమ్మెల్యే రెడ్యానాయక్ పరామర్శించారు. మృతదేహాలపై పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులు గొర్ల సత్తిరెడ్డి, వాంకుడోత్ వీరన్న, డీఎస్ కృష్ణ, కేశబోయిన కోటిలింగం, కత్తెరసాల విద్యాసాగర్, మేకపోతుల శ్రీనివాస్, మాదా శ్రీనివాస్, నలబోలు శ్రీనివాస్, దేవ్‌సింగ్ ఉన్నారు. -
ఇప్పుడే ఇలా.. మేలో ఎలా?
రాష్ట్రంలో నిప్పుల కుంపటిని తలపిస్తున్న ఎండ రాయలసీమలో అత్యధిక ఉష్ణోగ్రతలు పదేళ్లలో రికార్డు.. వడగాలులు తీవ్రం భయాందోళనలో ప్రజలు హైదరాబాద్/విశాఖపట్నం: రాష్ట్రంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు రోజులపాటు తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని భారత వాతావరణ శాఖ మంగళవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. మార్చిలోనే పరిస్థితి ఇలా ఉండటంతో మండు వేసవి(మే నెల)లో ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. భానుడి భగభగలతో రాయలసీమ నిప్పుల కుంపటిని తలపిస్తోంది. తెలంగాణ, కోస్తాంధ్రలోనూ ఉష్ణోగ్రతలు వెనక్కి తగ్గడం లేదు. మార్చి నెలలో(25వ తేదీ లోపు) గత పదేళ్లలోనే అత్యధికంగా తిరుపతిలో 42.7, కర్నూలులో 42.6, అనంతపురంలో 42.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2007 మార్చి 25న అనంతపురంలో 41.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. ఆయా జిల్లాల్లో రాత్రి (కనిష్ట) ఉష్ణోగ్రతలు(26 నుంచి 28 డిగ్రీలు) కూడా అధికంగా ఉంటూ వేడి రాత్రుల(వార్మ్ నైట్స్) ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక వర్షాభావం వల్ల ఇప్పటికే కోస్తా జిల్లాల్లో భూగర్భ జలమట్టం పాతాళానికి పడిపోయింది. తాగునీరు అందించే జలాశయాలతో పాటు నీటివనరులు అడుగంటాయి. గతంలో ఏప్రిల్ చివర్లోనూ, మే నెలలోనూ వడదెబ్బ మరణాలు నమోదయ్యేవి. ఈ ఏడాది అప్పుడే వడదెబ్బ మరణాలు రికార్డవుతున్నాయి. వడదెబ్బ లక్షణాలు తలనొప్పి, వాంతులు, ఒంటి నొప్పులు, తీవ్ర నీరసం, కళ్లు తిరిగి పడిపోవడం వడదెబ్బ లక్షణాలు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే రోగికి నాలుగు వైపులా గాలి తగిలే ఏర్పాటు చేయాలి. తక్షణం వైద్యులను సంప్రదించి వైద్య సేవలకు ఏర్పాటు చేయాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు పిల్లలు, వయోవృద్ధులు, గుండెజబ్బుల బాధితులు, వ్యాధిగ్రస్తులు త్వరగా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లకపోవడం మంచిది. బయటకు వెళ్లాల్సివస్తే తలకు, ముఖానికి వేడి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేత రంగు కాటన్ దుస్తులే ధరించాలి. అధిక మోతాదులో మంచి నీరు తాగాలి. డీహైడ్రేషన్ బారినపడకుండా ఉప్పు వేసిన నీరు తీసుకోవాలి. చల్లదనం కోసం పండ్ల రసాలు, మజ్జిగ, కొబ్బరి నీరుతో పాటు తాజా పండ్లు తీసుకోవడం మంచిది. వ్యవసాయ కూలీలు తప్పనిసరిగా తలపాగా ధరించాలి. నివాస ప్రాంతాన్ని సాధ్యమైనంత మేరకు చల్లగా ఉండేలా చూసుకోవాలి. బాగా గాలి వచ్చేలా వెంటిలేషన్ ఏర్పాటు చేసుకోవాలి. కిటికీలకు వట్టివేళ్ల కర్టెన్లు లేదా గోనెసంచులు వేలాడదీసి నీరు చల్లుతూ ఉండాలి. -
ఈజిప్టులో వడగాల్పులు; 70 మంది మృతి
కైరో: పాకిస్తాన్లో వందలాది మంది జనాల్ని పొట్టనపెట్టుకున్న ప్రచండ భానుడు ఇప్పుడు వడగాల్పులతో ఈజిప్టు దేశానికి పయనం సాగిస్తున్నాడు. భానుడి ప్రతాపానికి పాక్‌లో పసిముద్ద నుంచి పండుటాకుల వరకు 630 మందికిపైగా మృత్యువాతపడిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో భానుడు అగ్నిగుండంలా మండిపోతూ వడగాలులతో ఈజిప్ట్‌ను బెంబేలెత్తిస్తున్నాడు. భానుడి ప్రతాపానికి ఇప్పటివరకూ ఈజిప్ట్‌లో 70 మంది మృత్యువాత పడినట్టు అక్కడి ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. ఈజిప్టులో గురువారం నాటికి నమోదైన మృతుల సంఖ్య 16 కాగా, బుధవారం 6గురు మృతిచెందినట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దాంతో మృతుల సంఖ్య76కు చేరగా, 187 మంది ఆస్పత్రి పాలయ్యారని పేర్కొంది. ఈజిప్టు రాజధాని కైరోలో గడిచిన ఐదురోజుల్లో వడగాల్పుల ప్రభావం ప్రమాద స్థాయికి చేరుకుంది. రోజురోజుకూ పెరిగిపోతున్న తీవ్ర వేడిగాలుల వల్ల పలుప్రాంతాల్లో తేమ శాతం ఒక్కసారిగా పడిపోయింది. దాంతో తీవ్రమైన వేడిని తట్టుకులేక అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు బయటకు రావద్దంటూ, వడదెబ్బ తగిలి ప్రాణాలకు హాని వాటిల్లే అవకాశం ఉందని ముందు జాగ్రత్త చర్యగా మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచనలు చేస్తోంది. ప్రత్యేకించి అనారోగ్యంతో ఉన్నవాళ్లు, పిల్లలు, ఇంట్లో నుంచి బయటకు రావద్దొంటూ జాగ్రత్తలను వివరిస్తోంది. కానీ, ఈజిప్టులో గత కొన్నిరోజులుగా ఉష్ణోగ్రతలు ఉన్నదానికంటే హెచ్చుస్థాయిలో భారీగా పెరిగిపోతున్నాయి. కైరోలోని దక్షిణ ప్రాంతాలైన లక్సోర్ ప్రాంతంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే, అశ్వన్ లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల ఆఖరు వరకూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. -
వాతావరణ మార్పులతోనే తీవ్ర వడగాలులు
సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వె ల్లడి దేశవ్యాప్తంగా 2,000 మంది మృత్యువాత.. అకస్మాత్తుగా పెరిగిన ఉష్ణోగ్రతలే కారణం హైదరాబాద్: ఈ ఏడాది మండిపోతున్న వేసవికి ప్రజలు పిట్టల్లా రాలి పోతున్నారు.. వడగాల్పుల ప్రభావానికి దేశవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు రెండు వేల మంది మృత్యువాత పడ్డారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనే మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ దారుణ విపత్తుకు వాతావరణంలో తీవ్రమైన మార్పులే కారణమని ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న పర్యావరణ పరిరక్షణ సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) తెలిపింది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదయ్యాయని, ఈ మార్పు అకస్మాత్తుగా చోటు చేసుకోవడం వల్లే మృతుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిందని సీఎస్ఈ పేర్కొంది. ముఖ్యంగా పచ్చదన లేమి, తారు, సిమెంట్ రోడ్డులు ఉన్న కాస్త ఖాళీ స్థలాన్ని కప్పివేయడంతో నగరాల్లోనే ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయని వెల్లడించింది. వేడి మొత్తం రహదారుల ఉపరితలంపైనే ఉండిపోవడం వల్ల నగరాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ఫలితంగా ఉష్ణోగ్రతలు మరో మూడు, నాలుగు డిగ్రీలు ఎక్కువగా ఉన్న అనుభూతి కలుగుతుందని సీఎస్ఈ క్లైమేట్ చేంజ్ విభాగం ప్రోగ్రామ్ మేనేజర్ అర్జున శ్రీనిధి తెలిపారు. ‘‘2010తో పోలిస్తే ఈ ఏడాది వడగాల్పులు చాలా తక్కువ. కానీ మరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫిబ్రవరి, మార్చిల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసిన తరువాత కూడా ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరిగిపోవడానికి నగరాలలోని పరిస్థితులే కారణం’’ అని ఆయన వివరించారు. రుతు పవనాలపై ప్రభావం వేసవిలో ఎండలు బాగా ఉంటే ఆ ఏడాది వర్షాలు బాగా కురుస్తాయని అంటుంటారు. కానీ, ఈ రోజుల్లో దీన్ని కూడా నమ్మే అవకాశం లేదు. వడగాల్పుల కారణంగా నేల వేడెక్కిన కారణంగా వెస్టర్లీ డిస్టర్బెన్సెస్ (పసిఫిక్, ఆర్కిటిక్ ప్రాంతాల నుంచి వీచే గాలులు)లో తేడాలు వస్తాయని, రుతు పవనాలపై వీటి ప్రభావం ఉండే అవకాశముందని సీఎస్ఈ శాస్త్రవేత్త గీతికా సింగ్ ‘సాక్షి’కి తెలిపారు. అతి నీలలోహిత కిరణాల ముప్పు మానవ చర్యల కారణంగా భూమి సగటు ఉష్ణోగ్రతలు ప్రతిఏటా పెరుగుతున్నాయి. 2001 నుంచి 2010 మధ్యలో భారత్‌లోనే సగటు ఉష్ణోగ్రతలు దాదాపు అర డిగ్రీ సెల్సియస్ వరకూ పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే వందేళ్లలో ఉష్ణోగ్రత పెరుగుదల 0.8 డిగ్రీలుగా ఉంది. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో వడగాల్పుల ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని సీఎస్ఈ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం వడగాల్పులు వీచే సమయం అయిదు రోజులు మాత్రమే ఉండగా భవిష్యత్తులో ఇది 30 నుంచి 40 రోజులకు పెరుగుతుందని అభిప్రాయపడింది. దీని వల్ల నగరాల్లో చర్మ కేన్సర్‌కు కారణమయ్యే అతి నీలలోహిత కిరణాల ప్రభావమూ పెరుగుతోందని తెలిపింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటిరియాలజీ లెక్కల ప్రకారం కొన్ని నగరాల యూవీ ఇండెక్స్ (అతి నీలలోహిత కిరణాల సూచీ) ప్రమాదకర స్థాయిలో ఆరు నుంచి తొమ్మిది మధ్యలో ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో వడగాల్పులకు సంబంధించిన అవగాహన పెంచడంతోపాటు, హెచ్చరిక వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, తగిన సంఖ్యలో వైద్య, ఆరోగ్య సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సీఎస్ఈ సూచించింది.