వడదెబ్బకు 10 మంది మృతి
రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
భయాందోళన చెందుతున్న ప్రజలు
ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు భగ్గుమంటున్నారుు. వేడిమితో పాటు వడగాల్పులు భరించలేక ప్రజల ప్రాణాలు హరీ అంటున్నారుు. చిన్నా, పెద్ద తేడా లేకుండా వడదెబ్బకు బలవుతున్నారు. జిల్లాలో గురువారం ఒక్కరోజే వడదెబ్బతో 10 మంది మృతి చెందారు. దీంతో జనం బెంబేలెత్తుతున్నారు. బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు.
కొడకండ్ల : మండలంలోని పెద్దవంగర గ్రామానికి చెందిన ఈదురు ఎల్లమ్మ(58) ఎండల తీవ్రతతో అస్వస్థతకు గురైంది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది. ఎల్లమ్మకు ఇద్దరు కుమారులున్నారు.
ఆత్మకూరు : మండలంలోని ముస్త్యాలపల్లికి చెందిన కొత్తపెల్లి చంద్రమ్మ (55) గురువారం కూలీ పనులకు వెళ్లి వచ్చి అస్వస్థతకు గురైంది. కు టుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే మృతిచెం దింది. చంద్రమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
జఫర్‌గఢ్ : మండలంలోని తిడుగు గ్రామానికి చెందిన శ్రీరాముల వెంకటేశ్వర్లు(32) కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. రెండు రోజుల క్రి తం పనికి వెళ్లిన వెంకటేశ్వర్లు ఎండ తీవ్రతతో అస్వస్థకు గురయ్యూడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. తిరిగి ఇంటికి వచ్చాక మళ్లీ అస్వస్థతకు గురై మృతిచెందాడు. నిరుపేద అరుున వెంకటేశ్వర్లు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు. మృతుడి కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకులు అన్నెబోయిన భిక్షపతి, పార్టీ మండల అధ్యక్షుడు చిట్టిమళ్ల కృష్ణమూర్తి తదితరులు పరామర్శించారు.
కాశిబుగ్గలో సెంట్రింగ్ కార్మికుడు..
వరంగల్ నగరంలోని కాశిబుగ్గ బీఎన్ రావు కాలనీకి చెందిన సిరిపెల్లి వీరస్వామి(52) గత 15 ఏళ్లుగా సెంట్రింగ్ కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజుల క్రితం దేశాయిపేటలోని ఓ ఇంటి నిర్మాణంలో కూలి పని చేస్తూ వడదెబ్బకు గురయ్యూడు. ఆస్పత్రికి వెళ్లేందుకు డబ్బు లేకపోవడంతో విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని భార్య మార్తకు చెప్పాడు. గురువారం విరేచనాలు, వాంతులు కావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుండగానే మృతి చెందినట్లు మార్త బోరున విలపించింది. స్థానిక కార్పోరేటర్ బయ్యస్వామి వీరస్వామి కుటుంబసభ్యులను ఓదార్చి దహనసంస్కరాల ఖర్చులు ఇచ్చారు. మృతుడి కుటుంబ పరిస్థితిని కొండా దంపతుల దృష్టికి తీసుకెళ్లి, సాయం చేయిస్తానని తెలిపారు. స్థానిక పెద్దలు కట్కూరి రాజు, కండె పోషయ్య, మహేందర్, ఆరెపెల్లి రవి, పెండ్యాల కొమురయ్య, బొచ్చుమహేష్ తదితరులు సంతాపం తెలిపారు.
మంగపేటలో ఇద్దరు..
మండలంలోని కోమటిపల్లికి చెందిన బత్తిని వెంకన్న(42) కూలీ పనికి వెళ్లి వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యూడు. వాంతులు చేసుకుంటుండగా కుటుంబ సబ్యులు మంగపేట పీహెచ్‌సీకి తరలిస్తుండగానే మృతి చెందాడు. వెంకన్నకు భార్య రజిత, కుమారుడు రాకేష్, కుమార్తె అనూష ఉన్నారు. అదే గ్రామానికి చెందిన అనంతుల సాంబయ్య అనే టీఆర్‌ఎస్ నాయకుడి తల్లి సరోజన(80) కూడా వడదెబ్బతో బుధవారం రాత్రి మృతి చెందింది.
ఖానాపురం : వుండల కేంద్రానికి చెందిన గట్టి చిన్న రావుయ్యు(60) వడదెబ్బకు గురై వాం తులు, విరేచనాలు చేసుకున్నాడు. కుటుంబసభ్యులు ఇంటి వద్దనే చికిత్స చేరుుస్తుండగా గురువారం వుృతి చెందాడు. వుృతునికి భార్య లచ్చవ్ము, వుుగ్గురు కువూర్తెలు, ఇద్దరు కువూరులు ఉన్నారు.
కురవిలో ఇద్దరు..
మండలంలో వడదెబ్బతో ఇద్దరు మృతి చెందారు. మోద్గులగూడెం గ్రామానికి చెందిన చింతమల్ల స్వామి(55), నల్లెల్ల గ్రామానికి చెందిన కల్లూరి గోవిందమ్మ(45) వడదెబ్బ తాళలేక ప్రాణాలొదిలారు. వీరి మృతికి ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు సంతా పం తెలిపారు.
కరీమాబాద్ : నగరంలోని కరీమాబాద్ నానమియాతోటలో కూలీ పనులు చేసుకుని జీవించే వనం విజయ(45) గురువారం వడదెబ్బ తట్టుకోలేక మృతి చెందింది. కార్పోరేటర్ మేడిది రజిత విజయ కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సాయం అందజేశారు. స్థానిక నాయకులు మేడిది మధు, చారి, సాబీర్ సంతాపం తెలిపారు.