మండిపోతున్న ఎండలు
వేడికి కేసముద్రం సమీపంలో సాగిన రైలు పట్టాలు
గతేడాది కంటే 4డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు అల్లాడిపోతున్న ప్రజలు
హన్మకొండ : రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయనే సామెతను మించి పోయేలా ప్రచండ భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోహిణికి నెల రోజుల ముందుగానే ఎండ ధాటికి రైలు పట్టాలు కరిగిపోతున్నాయి. గడిచిన ఇరవై రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గురువారం కేసముద్రంలో ఎండవేడికి పట్టాలు సాగిపోయూరుు. రెండు పట్టాలకు 1.90 సెంటీమీటర్ల దూరం చొప్పున ఆరు చోట్ల మెత్తబడి పట్టాకు ఉన్న ఇనుప పట్టీలు కరిగి లేచిపోయూరుు. మరికొన్ని చోట్ల మెత్తబడి గుంతలా మారి పట్టా వెడల్పు అరుుంది. దీంతో ఈ మార్గంలో నడిచే పలు రైళ్ల రాకపోకలు ఆటంకం ఏర్పడింది. గతేడాదితో పోల్చితే జిల్లా వ్యాప్తంగా సగటున నాలుగైదు సెల్సియస్ డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
వడదెబ్బ మరణాలు కూడా పెరుగుతున్నారుు. 36 సెల్సియస్ డిగ్రీలు దాటితే వడదెబ్బకు గురయ్యే ఆస్కారం ఉంది. అలాంటిది దాదాపు మూడు వారాలుగా 40 సెల్సియస్ డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4గంటల వరకు 45 సెల్సియస్ డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నారుు. మే నెలలో సైతం ఇదే తీరులో ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.