డోర్నకల్‌లో ఒకే తండాకు చెందిన ఇద్దరు..
ఏటూరునాగారంలో అంగన్‌వాడీ టీచర్
జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. ప్రచండ భానుడి ప్రకోపానికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు నానాటికీ పెరుగుతుండడం, వడగాల్పులు వీయడంతో వృద్ధులు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నా రు. జిల్లాలో వడదెబ్బ మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతుండడంతో ప్రజలు భయూందోళనలకు గురవుతున్నారు. సోమవారం ఒక్కరోజే ఎనిమిది మంది మృత్యువాత పడ్డారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
మరిపెడ : మరిపెడ మండల కేంద్రానికి చెందిన గోల్కొండ మైసయ్య(65) వంట చెరుకు కోసం ఆదివారం అడవికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చాక తీవ్ర అస్వస్థతకు గురయ్యూడు. ఈ క్రమంలో సోమవారం మృతిచెందాడు. మైసయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
నెల్లికుదురు : మండలంలోని చిన్నముప్పారం గ్రామంలో వడదెబ్బ తాళలేక బొమ్మిశెట్టి వెంకయ్య(75) అనే వృద్ధుడు మృతిచెందాడు. ఎండలతో తీవ్ర అస్వస్థతకు గురైన వెంకయ్య ఇంట్లో పడుకుని నిద్రలోనే మృత్యువాత పడ్డాడని కుటుంబసభ్యులు తెలిపారు.
దుగ్గొండి : మండలంలోని జీడికల్ గ్రామానికి చెందిన దండు సాంబయ్య(55) వడదెబ్బతో మృతిచెందాడు. పసుపు వేరేందుకు సోమవారం పొలానికి వెళ్లిన సాంబయ్య మధ్యాహ్నం 3 గంటలకు ఇంటికి వచ్చాడు. అనంతరం అస్వస్థతకు గురికాగా, కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. మృతుడికి భార్య సుగుణ, ఇద్దరు కుమారులు ఉన్నారు.
హసన్‌పర్తి : వరంగల్ నగరంలోని 58వ డివిజన్ వం గపహాడ్‌కు చెందిన నక్క రాములు(62) వడదెబ్బతో మృతి చెందాడు. సోమవారం కూలీ పనికి వెళ్లిన రాములు మధ్యాహ్నం ఇంటికి వచ్చి కుప్పకూలాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగానే ప్రాణాలు వదిలాడు.
ఏటూరునాగారం : మండలంలోని ఎక్కెల గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్ బలంతుల సరోజన (60) వడదెబ్బకు గురై ఆదివారం అర్ధరాత్రి మృతి చెందారు. ఆదివారం ఎండలో తిరగడంతో వడదెబ్బకు గురైన సరోజనను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించామని, చికిత్స పొం దుతూ మృతి చెందిందని ఆమె కోడలు కల్పన తెలి పారు. విషయం తెలుసుకున్న సీడీపీవో రాజమణి, సూపర్‌వైజర్‌లు, అంగన్‌వాటీ కార్యకర్తలు మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు.
రాయపర్తి: మండలంలోని తిర్మలాయపల్లికి చెందిన గడ్డం మల్లమ్మ(65) వడదెబ్బతో సోమవారం మృతిచెందింది. మల్లమ్మ పింఛన్ తీసుకునేందుకు పోస్టాఫీసు వద్దకు వెళ్లి తిరిగొచ్చి ఎండదెబ్బతో అస్వస్థతకు గురైంది. ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు.
ఒకే తండాకు చెందిన ఇద్దరు
డోర్నకల్ : పట్టణ శివారు సిగ్నల్‌తండాకు చెందిన ఇద్దరు మహిళలు సోమవారం వడదెబ్బతో మృతి చెందారు. బాదావత్ లింగమ్మ(58), బానోత్ కాంతమ్మ(60) తీవ్రమైన ఎండలతో గత మూడు రోజులుగా అస్వస్థతకు గురయ్యారు. చికిత్స అందిస్తుండగా సోమవారం కొద్దిపాటి సమయం తేడాతో ఇద్దరూ మృతి చెందారు. దీంతో తండావాసులు ఆందోళనకు గురవుతున్నారు.
ఎమ్మెల్యే పరామర్శ...
బాదావత్ లింగమ్మ, బానోత్ కాంతమ్మ కుటుంభాలను ఎమ్మెల్యే రెడ్యానాయక్ పరామర్శించారు. మృతదేహాలపై పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ నాయకులు గొర్ల సత్తిరెడ్డి, వాంకుడోత్ వీరన్న, డీఎస్ కృష్ణ, కేశబోయిన కోటిలింగం, కత్తెరసాల విద్యాసాగర్, మేకపోతుల శ్రీనివాస్, మాదా శ్రీనివాస్, నలబోలు శ్రీనివాస్, దేవ్‌సింగ్ ఉన్నారు.