DORNAKAL
-
డోర్నకల్–గద్వాల మధ్య కొత్త రైల్వేలైన్!
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు రైల్వేలైన్‌తో అను సంధానంలో లేని కీలక ప్రాంతాలను జత చేస్తూ కొత్త రైల్వే లైన్ ఖరారుకు అడుగులు పడుతున్నా యి. హైదరాబాద్–విజయవాడ, హైదరాబాద్– బెంగుళూరు రైల్వే మార్గాలను కలుపుతూ కొత్త లైన్ నిర్మించేందుకు ఫైనల్ లొకేషన్ సర్వే నిర్వహిస్తు న్నారు. హైదరాబాద్–విజయవాడ లైన్లో ఉన్న డోర్నకల్ నుంచి హైదారబాద్–బెంగుళూరు మార్గంలోని గద్వాల వరకు ఈ కొత్త లైన్ కొనసాగనుంది. దీనికి సంబంధించి గతేడాది ఫైనల్ లొకేషన్ సర్వేకు రైల్వే బోర్డు అమోదముద్ర వేసింది. దీనికి దాదాపు రూ.ఏడున్నర కోట్లు మంజూరు చేసింది. రాష్ట్రంలో 2647 కి.మీ. మేర సాగే కొత్త లైన్లకు సంబంధించి మంజూరు చేసిన 15 ఫైనల్ లొకేషన్ సర్వేల్లో ఇది ఒకటి. ఈ అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు రూ. 50848 కోట్ల వరకు ఖర్చవుతుందని రైల్వేశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వీటిల్లో డోర్నకల్– గద్వాల లైన్ చాలా కీలకమైంది. ఈలైన్ నిడివి 296 కిలోమీటర్లు కాగా, ప్రాజెక్టు ప్రాథమిక అంచనా వ్యయం రూ.5330 కోట్లుగా అంచనా. ప్రాధాన్యతా క్రమంలో దీన్నే ముందుగా చేపట్టే అవకాశం ఉంది. ఈ లైన్‌కు సంబంధించి ఫైనల్ లొకేషన్ సర్వే చేప ట్టడం ఇప్పుడు ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. సంబంధిత సర్వే సంస్థ వేగంగా సర్వే నిర్వహిస్తూ ప్రతిపాదిత మార్గంలో మార్కింగ్ చేస్తోంది. అనుసంధానం ఎలా.. వరంగల్ మీదుగా సాగే హైదరాబాద్–విజయవాడ లైన్ రైల్వేలో కీలక మార్గం. అలాగే.. మహబూబ్ నగర్ మీదుగా సాగే హైదరాబాద్–బెంగుళూరు మార్గం కూడా అలాంటిదే. కానీ ఈ రెండింటిని అనుసంధానించే మరో కీలక మార్గం అవసరమని రైల్వే భావిస్తోంది. ఇందుకోసం డోర్నకల్ నుంచి గద్వాల వరకు లైన్ నిర్మించే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇది కేవలం ఆ రెండు కీలక మార్గాలను అనుసంధానించేది కావటమే కాకుండా, ఇప్పటి వరకు రైల్వే వసతి లేని కీలక పట్టణాలకు ఆ అవ కాశాన్ని కల్పించినట్టవుతుంది. డోర్నకల్‌లో మొద లయ్యే ఆ లైను ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కూసు మంచి, పాలేరు, మోతె, ఉమ్మడి నల్గొండ జిల్లా లోని సూర్యాపేట, భీమారం, నాంపల్లి, ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి, నాగర్‌కర్నూలు, వనపర్తి,భూత్పూర్ మీదుగా గద్వాల వద్ద ముగు స్తుంది. దీంతో ఈ లైను ఇటు వరంగల్ మీదుగా సాగే హైదరాబాద్–విజయవాడ లైన్ డోర్నకల్ వద్ద, అటు హైదరాబాద్–బెంగుళూరు లైన్‌ను గద్వాల వద్ద, నడికుడి మీదుగా సాగే హైదరాబాద్–గుంటూరు లైన్‌ను నల్గొండ వద్ద అనుసంధానిస్తుంది. దీంతో ఆయా మార్గాల్లో నడిచేరైళ్లను అవసరానికి తగ్గట్టు దారి మళ్లించే విషయంలో, కొత్త రైళ్లను నడి పే విషయంలో, దక్షిణ–ఉత్తరభారత్లను వేరువేరు మార్గాల్లో జోడించే విషయంలో మరింత వెసులు బాటు కలిగినట్టవుతుంది. ఇప్పటి వరకు రైల్వే లైన్లేని ప్రాంతాలను అనుసంధానించటం వల్ల ఆయా ప్రాంతాల ఆర్థిక ముఖ చిత్రం వేగంగా మా రేందుకు వీలు కల్పిస్తుంది. పర్యాటకంగా, పారి శ్రామికంగా ఎదిగేందుకు అవకాశాలు కలుగు తాయి. ఈ ప్రాంతాల్లో బొగ్గు గనులతోపాటు సిమెంటు, విద్యుదుత్పత్తి కేంద్రాలున్నందున బొగ్గు, సిమెంటు తరలింపు తేలికవుతుంది. వ్యవ సాయ ఉత్పత్తుల తరలింపు కూడా పెరుగుతుంది. ఈ ప్రాజెక్టుపై రైల్వే ఆసక్తి! సాధారణంగా ప్రతి రైల్వే ప్రాజెక్టులో ఫైనల్ లొకేషన్ సర్వే కీలకంగా ఉంటుంది. అలాగని సర్వే జరిగిన అన్ని ప్రాజెక్టులు పట్టాలెక్కాలని కూడా లే దు. సర్వే తర్వాత దాని సాధ్యాసాధ్యాలపై స్పష్టత వస్తుంది. ఇప్పుడు డోర్నకల్–గద్వాల లైను విష యంలో మాత్రం స్వయంగా రైల్వే శాఖనే ఆసక్తిగా ఉండటం విశేషం. ఆయా ప్రాంతాలను రైల్వేతో జోడించాలని చాలా కాలంగా ప్రజల ఆకాంక్షను రాజకీయ నేతలు రైల్వే దృష్టికి తెస్తున్నారు. ఇటు ప్రజల అవసరాలు, అటు రైల్వే శాఖకు ఉన్న ఉపయోగాల రీత్యా దీనికి ప్రాధాన్యం పెరిగింది. వెరసి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. అయితే, ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వంతో సహా అన్ని పార్టీలు, రాజకీయాలకతీ తంగా ప్రజాప్రతినిధులు, నాయకులు రైల్వే బోర్డుపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం కనిపిస్తోంది.ప్రాజెక్టు: డోర్నకల్–గద్వాల కొత్త రైల్వే లైన్ నిడివి: 296 కిలోమీటర్లు ప్రాథమిక అంచనా వ్యయం: రూ.5330 కోట్లు -
రైళ్ల పునరుద్ధరణ
సాక్షి, హైదరాబాద్: కాజీపేట్–డోర్నకల్, విజయవాడ– డోర్నకల్ మధ్య రైళ్లను పునరుద్ధరించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ తెలిపారు. కాజీపేట్–డోర్నకల్ మధ్య ఈ నెల 14 నుంచి, విజయవాడ–డోర్నకల్ మధ్య ఈ నెల 20 నుంచి రైళ్లు యాథావిధిగా రాకపోకలు సాగించనున్నాయి. రైల్వేలైన్ల నిర్వహణ దృష్ట్యా ఈ రెండు రైళ్లను ఈ నెల ఒకటో తేదీ నుంచి రద్దు చేసినట్లు పేర్కొన్నారు. -
హరీష్ రావు వల్లే రైతు బంధు నిలిచిపోయింది: రేవంత్
-
ఎమ్మెల్యే సాబ్! ఏం చేశావో జర జెప్పు? ఏ ఊరుకు వెళ్లినా ఇదే కథ!
-
ఎమ్మెల్యే సాబ్! ఏం చేశావో జర జెప్పు?
సాక్షి, మహబూబాబాద్: డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కు నిరసన సెగ తప్పడం లేదు. కురివి మండలంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఏ తండాను తట్టినా ఎమ్మెల్యే ను గిరిజనులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. బాలుతండాకు చేరుకున్న ఎమ్మెల్యే ను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డ్స్ ప్రదర్శించారు. మా గ్రామానికి ఏం చేశావో చెప్పాలని తండవాసులు నిలదీశారు. పోలీసులు భారీగా మోహరించి ఆందోళన కారులను ప్రక్కకు నెట్టేయడంతో గ్రామస్థులు పోలీసులపైకి తిరగబడడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్యే రెడ్యానాయక్ మౌనంగా పోలీస్ బందోబస్తు మధ్య ముందుకు వెళ్ళిపోయారు. గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే ఏ గ్రామానికి వెళ్ళినా విపక్షాల తోపాటు స్వపక్షానికి చెందిన వారు నిలదీసి అడ్డుకోవడం రాజకీయంగా కలకలం సృష్టిస్తుంది. పార్టీలోని గ్రూపు రాజకీయాలే ఆందోళనకు కారణమని స్థానికులు భావిస్తున్నారు. (బీఆర్ఎస్కు భారీ షాక్.. కాంగ్రెస్ గూటికి మాజీ ఎమ్మెల్యే!) -
సీఎం ఆదేశిస్తే డోర్నకల్ నుంచి పోటీ చేస్తా: మంత్రి సత్యవతి రాథోడ్
సాక్షి, మహబూబాబాద్: సీఎం కేసీఆర్ ఆదేశిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డోర్నకల్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. సామాన్య మహిళనైన నాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి గిరిజన, మహిళలకు, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయమని ఆదేశించారని తెలిపారు. మానుకోట ప్రజానీకం అభివృద్ధికి కేసీఆర్ సహకారంతో వైద్య విద్యాలయం, ఇంజనీరింగ్ కళాశాల తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ‘డోర్నకల్ నియోజకవర్గంలో మీకంటూ ఒక వర్గం ఉన్నది.. పార్టీ చేపట్టే వివిధ కార్యక్రమాలకు మీ వారు ఎవరూ హాజరు కావట్లేదని’ విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం దాటవేస్తూ..ఇది సందర్భం కాదంటూనే..మాకంటూ వర్గమేమీ లేదని, మేమంతా ముఖ్యమంత్రి గొడుగు కింద పనిచేస్తాం..ఎలాంటి అనుమానాలు అక్కరలేదన్నారు. చదవండి: తెలంగాణలో బీజేపీని తుడిచివేస్తామన్న రాహుల్.. దాని వెనక మర్మమేంటో? -
ప్రశ్నిస్తే పింఛన్ కట్...వివాదస్పదంగా డోర్నకల్ ఎమ్మెల్యే
-
మహబూబాబాద్: మైక్ సెట్ రిపేర్ చేస్తుండగా షాక్.. ముగ్గురి మృతి
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలోని డోర్నకల్ మండలం అందనాలపాడులో విషాదం చోటు చేసుకుంది. గత రాత్రి కురిసిన గాలివానకు గ్రామంలోని రామాలయం గుడిపై ఉన్న మైక్ సెట్ దెబ్బతింది. దెబ్బతిన్న మైక్ సెట్ సరి చేస్తుండగా.. కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి చెందారు. మృతుల్ని సుబ్బారావు, మస్తాన్ రావు, వెంకయ్యలుగా నిర్ధారించారు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. -
దారుణం: వివాహితపై లైంగిక దాడి
డోర్నకల్: మండలంలోని రాముతండా పంచాయతీకి చెందిన బానోతు ప్రశాంత్ గురువారం రాత్రి ఓ వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటి సమీపంలో ఉంటున్న వివాహిత గురువారం రాత్రి స్నానం చేస్తుండగా ప్రశాంత్ బాత్రూమ్లోకి ప్రవేశించి అత్యాచారం చేశాడు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు డోర్నకల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. యువతి అదృశ్యం మడికొండ: కాజీపేట మండలం కొత్తపెల్లి హవేలికి చెందిన ఇంటర్ విద్యార్థి చిట్యాల శ్రావణి(19) గురువారం మధ్యాహ్నం ఇంట్లోంచి వెళ్లిపోయింది. కుటుంబీకులు చుట్టుపక్కల వెతికారు. సమీప బంధువులకు ఫోన్ చేశారు. అయినప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో శుక్రవారం మడికొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మడికొండ పోలీస్ ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. -
లోడ్ దించుతున్నారనుకున్నాం; దీని కింద ఇంత కథ ఉందా!
సాక్షి,డోర్నకల్: ఇందులో ఏముంది? ట్రాక్టర్ నుంచి లోడ్ దించుతున్నారంతే అనుకుంటున్నారా? సరిగ్గా చూస్తే.. ట్రాలీ కింద ప్రత్యేకంగా అమర్చిన అరలో బాక్స్‌లున్నాయి కదా.. అవన్నీ 3 క్వింటాళ్ల గంజాయి నింపిన పెట్టెలు. ఒక్కో దానిలో 2 కిలోలు ప్యాక్‌చేసి ఇలా 150 బాక్స్‌లను తరలిస్తుండగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ అమ్మపాలెం క్రాస్‌రోడ్డు వద్ద బుధవారం పట్టుకున్నారు. మరిపెడ మండలం తండాధర్మారానికి చెందిన బానోత్ కిరణ్‌కుమార్, కొత్తగూడెం జిల్లా కోయగూడెంకు చెందిన ఆర్ఎంపీ బాదావత్ సూర్య ఏపీలోని చింతూరులో గంజాయి కొని తరలిస్తుండగా పట్టుకున్నట్టు ఎస్పీ ఎన్.కోటిరెడ్డి తెలిపారు. కిలో రూ.3 వేలకు కొని మహారాష్ట్రలో రూ.10 వేలకు విక్రయిస్తున్నట్టు తేలిందన్నారు. -
ఒక తొండ.. 4 గంటలు కరెంట్ కట్!
సాక్షి, డోర్నకల్: ఓ తొండ గురువారం అర్ధరాత్రి విద్యుత్ సిబ్బందికి చుక్కలు చూపించింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో రాత్రి 8.15 గంటల నుంచి 12.05 వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనికితోడు వర్షం పడటం, విపరీతంగా దోమలు ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో వైపు విద్యుత్ సరఫరా అంతరాయానికి కారణమేమిటని విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది వెతుకులాట ప్రారంభించారు. సబ్‌స్టేషన్‌లో ఎలాంటి సమస్య లేకపోవడంతో ఏఈ, లైన్ ఇన్స్పెక్టర్, సబ్ ఇంజనీర్, ఇతర ఇబ్బంది సబ్ స్టేషన్ నుంచి రైల్వే ట్రాక్ వరకు 11 కేవీ లైన్‌కు సంబంధించి సుమారు 30 స్తంభాలపైకి ఎక్కి పరిశీలించారు. చివరకు రైల్వే ట్రాక్ సమీప స్తంభంపైన ఉన్న కండక్టర్ ఇన్సులేటర్ మీద తొండ పడి చనిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినట్లు గుర్తించారు. వెంటనే తొండను తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. చదవండి: మహబూబ్‌నగర్ జిల్లాలో హైవేపై ట్రక్కు బీభత్సం -
జనం చస్తుంటే.. జాతర చేస్తారా..
డోర్నకల్: కరోనా వైరస్ వ్యాప్తితో ఓవైపు ప్రజలు అల్లాడుతోంటే.. మీరు జాతర ఎలా చేస్తారని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అడ్డుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని లింబ్యాతండాలోని వెంకటేశ్వరస్వామి(పుల్లు బాబోజీ) ఆలయంలో ప్రతీ సంవత్సరం మే నెలలో జాతర నిర్వహిస్తారు. శుక్రవారం జాతరలో పాల్గొనేందుకు భారీగా గిరిజనులు తరలి వచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ అమలును పట్టించుకోకుండా వివిధ ప్రాంతాల నుంచి గిరిజనులు జాతరకు తరలివచ్చారు. ఆలయంలో పూజలు నిర్వహిస్తూ జంతుబలి చేస్తున్నారనే సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ బృందం సభ్యులు తహసీల్దార్ జి.వివేక్, మండల ప్రత్యేక అధికారి సయ్యద్ ఖుర్షీద్, సీఐ ఇస్లావత్ శ్రీనివాస్, ఎస్ఐ భద్రునాయక్‌తో సహా పోలీసులు తండాకు చేరకున్నారు. ఆలయ పరిసరాల్లో గుంపులుగా చేరిన గిరిజనులను అక్కడి నుంచి పంపించారు. ఆలయ పూజారితో పాటు నిర్వాహక కమిటీలో ఒకరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈమేరకు అధికారులు మాట్లాడుతూ.. లాక్డౌన్ అమలులో ఉన్న సమయంలో నిబంధనలు అతిక్రమించి జాతరకు వచ్చిన వారిపై కేసులు నమోదు చేసి వారిని అక్కడి నుంచి పంపించినట్లు తెలిపారు. ఆలయ నిర్వాహక కమిటీకి చెందిన 11 మందిపై కేసు నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. చదవండి: కరోనా పేరు తెలియని అడవిబిడ్డలు చదవండి: చెరువులో విషప్రయోగం.. -
సమాధుల పక్కన ఆడశిశువు
డోర్నకల్: మహిళా దినోత్సవం రోజున మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బూరుగుపాడు గ్రామంలో ఓ దారుణం చోటుచేసుకుంది. గ్రామ సమీపాన సమాధుల పక్కన అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. పాలిథిన్ కవర్ చుట్టి ఉన్న పసికందు ఏడుపు విని సమీపంలో ఉన్న మహిళ అక్కడకు వెళ్లడంతో శిశువు కనిపించింది. బూరుగుపాడుకు చెందిన వేల్పుల వెంకటమ్మ సోమవారం ఉదయం 8 గంటల సమయంలో కాకరకాయల కోసం దర్గా ప్రాంతానికి వెళ్లగా పసికందు ఏడుపు వినిపించింది. పక్కనే పరిశీలించగా అక్కడి సమాధుల పక్కన కవర్లో ఆడశిశువు కనిపించింది. సమీపంలో ఎవరూ లేకపోవడంతో పసికందును ఆమె ఇంటికి తీసుకొచ్చింది. బొడ్డు పేగు, శరీరానికి రక్తం ఉండటంతో స్నానం చేయించిన తర్వాత పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలకు సమాచారం అందించింది. వారు వెంకటమ్మ ఇంటికి వచ్చి పసికందును పరిశీలించి అధికారులకు విషయాన్ని తెలియజేశారు. 108 సిబ్బంది గ్రామానికి చేరుకున్న తరువాత ఏఎన్ఎం సరస్వతి, అంగన్వాడీ కార్యకర్త హైమావతి, ఆశ కార్యకర్త సులోచన పసికందును డోర్నకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. నవజాత శిశువును పరీక్షించిన వైద్యులు పాపను వార్మర్లో ఉంచారు. 2.5 కేజీల బరువుతో పాప ఆరోగ్యంగా ఉందని చెప్పారు. బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర సభ్యుడు బృందాధర్రావు, సీడీపీఓ ఇందిర, బాల రక్ష భవన్ కో–ఆర్డినేటర్ జ్యోతి, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి నరేశ్వై,ద్యాధికారి డాక్టర్ రంజిత్‌రెడ్డి, వైద్యురాలు డాక్టర్ విరాజిత తదితరులు ఆస్పత్రిలో పసికందును పరిశీలించారు. చైల్డ్ ప్రొటెక్షన్ ప్రతినిధులు పసికందును మహబూబాబాద్ శిశుగృహానికి తరలించారు. చదవండి: 20 ఏళ్ల క్రితమే అక్కడ మహిళా రాజ్యం -
ఉమ్మడి వరంగల్ జిల్లాలో జోరుగా వర్షాలు
సాక్షి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో 28.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా, అత్యల్పంగా పెద్ద వంగరలో 3.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. జిల్లాల వారీగా వర్షపాతం వివరాలు.. వరంగల్ అర్బన్ జిల్లా : ఐనవోలులో 8.7, వేలేరులో 8.3, ఎల్కతుర్తిలో 7.5, హన్మకొండలో 7.0, హసన్‌పర్తిలో 5.8, వరంగల్‌లో 5.0, ధర్మసాగర్లో 4.0 మిల్లీమీటర్ల చొప్పున వర్షం పడింది. వరంగల్ రూరల్ జిల్లా : ఖానాపూర్‌లో 18.2, చెన్నారావుపేటలో 14.8, పరకాలలో 12.0, సంగెంలో 10.0, నల్లబెల్లిలో 7.3, వర్ధన్నపేటలో 6.2, నెక్కొండలో 6.0, దుగ్గొండిలో 5.4, దామెరలో 5.6, ఆత్మకూరులో 5.2, పర్వతగిరిలో 5.0, నడికుడలో 3.3 మిల్లీమీటర్ల చొప్పున వర్షం నమోదైంది. ములుగు జిల్లా : కన్నాయిగూడెంలో 27.8 మిల్లీమీటర్లు, వెంకటాపురంలో 12.9, వెంకటాపూర్‌లో 9.6, గోవిందరావుపేటలో 9.0, వాజేడులో 8.5, ములుగులో 7.3, తాడ్వాయిలో 7.3, మంగపేటలో 7.0, ఏటూర్‌నాగారంలో 6.0 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. జయశంకర్ జిల్లా : మహాముత్తారం మండలంలో 14.6 మి.మీలు, పలిమెలలో 10.5, కాటారంలో 10.2, మొగుళ్లపల్లిలో 10.0, మల్హర్రావులో 6.1, టేకుమట్లలో 3.3, మహదేవ్‌పూర్‌లో 3.3 మిల్లీమీటర్ల చొప్పున వర్షం పడింది. మహబూబాబాద్ జిల్లా : డోర్నకల్‌లో 28.8, గంగారంలో 27.5, మరిపెడలో 15.2, గార్లలో 11.1, కురవిలో 11.8, గూడురులో 11.2, కొత్తగూడలో 8.2, చెన్నారావుపేటలో 8.0, కేసముద్రంలో 5.2, నర్సింహులపేటలో 5.4, పెద్దవంగరలో 3.0 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. జనగామ జిల్లా : తరిగొప్పులలో 11.5 మి.మీలు, చిల్పూర్‌లో 8.3, జఫర్‌గఢ్‌లో 8.0 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. -
మహబూబాబాద్‌లో అరుదైన జీవి.. వైరల్ వీడియో
సాక్షి, డోర్నకల్: అంతరించిపోతున్న ఓ చిన్న క్షీరదం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లోని లచ్చతండాలో కనబడింది. ఆర్మడిల్లోగా పిలువబడే ఈ క్షీరదం దక్షిణ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తుంది. అటువంటి ఆర్మడిల్లో లచ్చతండాలో కనబడటంతో స్థానికంగా ఉన్నవారు దాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భూమిని డ్రిల్ మిషన్ మాదిరి తవ్వుకుంటూ లోనికి వెళ్లే అరుదైన జీవిగా ఆర్మడిల్లోకు పేరుంది. కాగా, స్పానిష్ భాషలో ఆర్మడిల్లో అంటే కవచం ఉన్న జీవి అని అర్థం. పలు జీవులకు రక్షణగా కొన్ని శరీర భాగాలు ఉన్నట్టే.. ఆర్మడిల్లోకు కూడా శరీరంపై ఉండే కవచం రక్షణ కల్పిస్తుంది. వీటిలో దాదాపు 20కు పైగా జాతులు ఉన్నాయి. ఆర్మడిల్లో ఒంటిపై ఉన్న చారల ఆధారంగా అది ఏ జాతికి చెందిందో గుర్తిస్తారు. ఈ జీవికి ప్రమాదం ఎదురైతే కాళ్లను, తలను కవచంలోకి ముడిచిపెట్టుకుంటుంది. వీటికున్న ప్రత్యేకత ఎంటటే.. ఇవి నేలను తవ్వుకుంటూ లోనికి వెళ్లి తమకు రక్షణ కల్పించుకుంటాయి. -
కాంగ్రెస్ సన్నాసులకు సిగ్గుండాలి
సాక్షి, మహబూబాబాద్: సీట్ల కోసం కాంగ్రెస్ సన్నాసులు చంద్రబాబు దగ్గర చేతులు కట్టుకొని నిలబడ్డారని మంత్రి కె.తారకరామారావు ధ్వజమెత్తారు. పొరపాటున ఈ దద్దమ్మలకు ఓటు వేసి అధికారంలోకి తీసుకొస్తే నిర్ణయాలు హైదరాబాద్‌లో కాదు.. అమరావతిలో తీసుకుంటారని చెప్పారు. మహబూ బాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో శనివారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీడీపీలపై నిప్పు లు చెరిగారు. ‘‘చంద్రబాబు ఢిల్లీలో రాహుల్ గాంధీ ని కలిసేందుకు ఆంధ్రా భవన్లో ఉన్నడు. తెలంగాణ కాంగ్రెసోళ్లు ఏపీ భవన్ ఎదుట క్యూ కట్టారు. చంద్రబాబు వీళ్ల సీట్ల కోసం సిఫారసు చేయాల్నట. ఇంత దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా? పరిస్థితి ఈ రోజే ఇట్ల ఉంటే రేపు అధికారంలోకి వస్తే ఎట్ల ఉంటదో ప్రజలు ఆలోచించాలి’’అని కోరారు. సీట్లు రాహుల్ గాంధీ ఇస్తే.. చంద్రబాబు నోట్లు ఇస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు సోనియా గాంధీని అవినీతి అనకొండ, గాడ్సే అన్నడు. గన్ని తిట్లు తిట్టిన చంద్ర బాబు దగ్గరకు పోయి ఆయన మోచేతి నీళ్లు తాగేందుకు కాంగ్రెసోళ్లకు సిగ్గు లేదా’అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో 40 మంది సీఎంలు ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అందులో 40 మంది సీఎంలు కుర్చీలాట ఆడుకుంటారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అసలు కాంగ్రెస్ సీఎం ఎవరు? మీ కూటమికి నాయకుడు ఎవరు? అని మంత్రి ప్రశ్నిం చారు. ‘‘24 గంటల కరెంట్ ఇచ్చిన కేసీఆర్ ఇటు దిక్కుంటే, కరెంట్ అడిగితే కాల్చి చంపినోళ్లు ఇంకో దిక్కున్నారు.. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు అటు దిక్కునుంటే.. వ్యవసాయం పండుగన్న కేసీఆర్ ఇటు దిక్కునున్నారు... ఏ దిక్కునుంటారో ప్రజలు నిర్ణయించుకోవాలి’అని కేటీఆర్ కోరారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పథకాలు ఆగకూడదంటే కారు జోరు తగ్గొద్దని, డ్రైవర్ కేసీఆర్ ప్రభుత్వమే ఏర్పడాలని కేటీఆర్ అన్నా రు. ఎన్నికల కమిషన్ కూడా చూసే గుర్తులిచ్చింది ఎన్నికల కమిషన్ కూడా ఎవరేంటో చూసే గుర్తులు కేటాయించిందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌కు మొండి చెయ్యి ఇచ్చింది. 70 ఏళ్లలో ఆ పార్టీ దేశప్రజలకు మొండి చెయ్యి చూపించిందని గుర్తు చేశారు. ప్రజల చెవుల్లో అద్భుతంగా పువ్వులు పెట్టినందుకు బీజేపీకి పువ్వు గుర్తు. పుల్లలు పెట్టడంలో దిట్ట కాబట్టి కోదండరాం పార్టీకి అగ్గిపెట్టె గుర్తు, అభివృద్ధిలో దూసుకెళ్తుందనే నమ్మకంతోనే మనకు కారు గుర్తు ఇచ్చినట్లు కేటీఆర్ చలోక్తులు విసిరారు. ఆయా సభల్లో ఎంపీలు పసునూరి దయాకర్‌రావు, బండా ప్రకాశ్, తాజా మాజీ ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, రెడ్యానాయక్, తదితరులు పాల్గొన్నారు. దేశం వెనుకబాటుకు కాంగ్రెసే కారణం.. సాక్షి, హైదరాబాద్: దేశం వెనుకబాటుకు కాంగ్రెస్ పార్టీయే కారణమని మంత్రి కే.తారకరామారావు అన్నారు. శనివారం ఇక్కడ జరిగిన స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. దేశ చరిత్రలో అత్యధిక కాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజల కనీస అవసరాలను గుర్తించడంలో, వాటిని అందించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. టీఆర్ఎస్ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఉంటే కచ్చితంగా తాను రాజకీయాల నుంచి వైదొలగే వాడినని, తన కుటుంబ సభ్యులకు సైతం ఇదే విషయాన్ని తేల్చి చెప్పానన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత విద్యుత్, తాగునీరు, సాగునీరు వంటి అంశాలను ప్రాధాన్యత అంశాలుగా ఎంచుకొని వాటిని సాధించే దిశగా ముందుకు పోతున్నామన్నారు. దేశ రాజకీయాల్లో పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కీలకమైన పాత్ర వహించే అవకాశం ఉన్నదని కేటీఆర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటుహక్కును వినియోగించుకోవాలని, ఓటు వేయని వారికి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఓటు హక్కును వినియోగించుకుంటామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. -
డోర్నకల్‌లో కార్డన్ సెర్చ్
డోర్నకల్ : డోర్నకల్ పట్టణంలోని పలు వీధుల్లో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మహబూబాబాద్, డోర్నకల్, బయ్యారం, గార్ల, కురవి, కేసముద్రం, నెక్కొండ తదితర పోలీస్స్టేషన్ల సీఐలు, ఎస్సైలు, సిబ్బంది, స్పెషల్‌పార్టీ పోలీసులు నాలుగు బందాలుగా తనిఖీలు చేశారు. మహబూబాబాద్ డీఎస్పీ నరేష్కుమార్ కార్డన్ సెర్చ్‌ను పర్యవేక్షించారు. ఎస్సీ, బీసీ కాలనీ, అంబేడ్కర్ నగర్, శాంతినగర్, యాదవనగర్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇళ్లలోకి వెళ్లి క్షుణ్ణంగా సోదాలు చేశారు. ఇళ్లలో పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను స్టేషన్‌కు తరలించారు. రోడ్లపై వెళ్తున్న వాహనాలను నిలిపి తనిఖీలు నిర్వహించారు. తెల్లవారుజామున వీధుల్లో పోలీసులు సంచరించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. తనిఖీల్లో అనుమతి పత్రాలు లేని 63 ద్విచక్ర వాహనాలు, 8 గ్యాస్ సిలిండర్లు, నాలుగు ఆటోలు, రూ.15వేల విలువైన 45 బీర్లు, 31 క్వార్టర్ మద్యం బాటిళ్లు, 12లీటర్ల కిరోసిన్, రైల్వేశాఖ, విద్యుత్‌శాఖ ఇనుప సామగ్రి, 20 అంబర్ ప్యాకిట్లను స్వాధీనం చేసుకున్నారు. డోర్నకల్‌లో మొదటిసారిగా కార్డన్‌సెర్చ్ నిర్వహించడం, తెల్లవారుజామున పోలీసులు వీధుల్లోకి రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణకే...ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. ఆదివారం డోర్నకల్ కార్డన్ సెర్చ్ తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజంలో 99శాతం మంది ప్రజలు చట్టాలకు లోబడి ప్రశాంతంగా జీవిస్తున్నారని, ఒక్కశాతం మాత్రమే చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. వారి ఆగడాలను అరికట్టేందుకే కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. డోర్నకల్‌లో పట్టుబడిన వస్తువులను ఆయా శాఖలకు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ నరేష్కుమార్, డోర్నకల్ సీఐ ఆవుల రాజయ్యతోపాటు పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
లక్ష మెజారిటీతో గెలుపు తథ్యం
కురవి (మహబూబాబాద్ జిల్లా): ‘మీరంతా కలిసి ఉంటే కాంగ్రెస్ గాలిలో కొట్టుకుపోతుంది. టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో, సమిష్టిగా పని చేయాలి. ఐకమత్యం అవసరం. అందరూ కలిసి పని చేయాలి. ఇదే స్ఫూర్తి ఇకముందు కూడా కొనసాగించాలి. నాకెలాంటి అనుమానం లేదు. డోర్నకల్ నియోజకవర్గంలో లక్ష మెజారిటీ మనకొస్తుంది’ అని నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. డోర్నకల్ నియోజకవర్గంలోని కురవిలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి హరీష్ ప్రసంగించారు. ‘కాళేశ్వరం పూర్తికాకముందే ఎసారెస్పీ స్టేజ్1, స్టేజ్2 పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ రెండు దశలలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 440 కోట్లతో కాకతీయ ప్రధాన కాలువను ఆధునీకరిస్తున్నాం. వచ్చే వానాకాలం నాటికి కాళేశ్వరం నుంచి నీరు పారిస్తాం. కాంగ్రెస్ హయాంలో ఎపుడూ ఎసారెస్పీని పట్టించుకోలేదు. మేడిగడ్డ దగ్గర 300 రోజులు నీళ్ల నిల్వ ఉంటాయి. కాళేశ్వరంలో ఒక రోజుకు 2 లక్షల సిమెంట్ బస్తాలు వాడుతున్నాం. ఇలాంటి భారీ ప్రాజెక్టు, ఇంత వేగంగా పనులు జరిగే ప్రాజెక్టు మరొకటి తాము చూడలేదని కేంద్ర జలసంఘం ప్రతినిధులు స్వయంగా కాళేశ్వరం పనులను చూసి ఆశ్చర్యపోయారు' అని హరీష్‌రావు తెలిపారు. ‘డోర్నకల్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తాం. చివరి భూములకూ నీరందేలా చూస్తున్నాం. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు చివరి భూములకూ సాగునీరు అందించాలని సీఎం కేసీఆర్ నడుం బిగించారు. కాళేశ్వరంతో ఎస్సారెస్పీని అనుసంధానంచేస్తున్నందున శ్రీరాంసాగర్ రెండో దశ పనులు పూర్తి చేస్తున్నాం. ఎల్ఎండీకి ఎగువ, దిగువ ప్రాంతాల్లోని కాల్వల్లో నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండాచూస్తున్నాం. శ్రీరాంసాగర్ నీరు ఇప్పటిదాకా చూడని జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, డోర్నకల్ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది’ అని హరీశ్‌రావు అన్నారు. -
రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక
డోర్నకల్ : వచ్చే నెలలో మూడు ప్రాంతాల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు జిల్లా జట్లను స్థానిక బిషప్గ్రౌండ్లో సోమవారం ఎంపిక చేశారు. ఫుట్‌బాల్ అసోసియేషనఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపికకు జిల్లా నలుమూలల నుండి క్రీడాకారులు భారీగా తరలివచ్చారు. వచ్చే నెల 5 నుంచి 7 వరకు మెదక్‌లో జరిగే బాలుర సబ్ జూని యర్ ఫుట్‌బాల్ టోర్నమెంట్, 20 నుంచి 22 వరకు అదిలాబాద్లోజరిగే జూనియర్ బాలి కల రాష్ట్రస్థాయి టోర్నమెంట్, అదే నెల చివరి వారంలో డోర్నకల్‌లో జరిగే సీనియర్ ఇంటర్ డిస్టిక్ట్ర్ బాలుర టోర్నమెంట్ పోటీలకు జట్ల ఎంపికకోసం పోటీలునిర్వహించారు. మూడు జట్లలో ఒక్కో దానికి 20 మందిని ఎంపిక చేసినట్లు జిల్లా ఫుట్‌బాల్ అసోసియేష¯ŒS సెక్రెటరీ సురేష్‌కుమార్ పాట్ని తెలిపారు. కార్యక్రమంలో ఫుట్‌బాల్ క్రీడాకారులు ప్రేంకుమార్, కృష్ణారావు, రవికుమార్, మోజేస్మనోహర్, స్వామీనాథ్, రాజేందర్ పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
డోర్నకల్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు బుధవారం డోర్నకల్‌లో జిల్లా జట్టును ఎంపిక చేశారు. స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణలోని పైకా కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా జట్టు ఎంపిక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలో ప్రతిభ కనబర్చి జిల్లాకు పేరు తేవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ మేకపోతుల రమ్య, జడ్పీటీసీ సభ్యురాలు కేశబోయిన స్వరూప, సర్పంచ్ మాదా లావణ్య, పీఏసీఎస్ చైర్మెన్ రాయల వెంకటేశ్వర్రావు, ఎంఈఓ మధులత, మండల క్రీడాధికారి ఇమ్మానియల్, జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్జనరల్ సెక్రెటరీ కొత్త రాంబాబు, కో ఆప్షన్ సభ్యులు వాజీద్, ఎస్ఎంసీ చైర్మన్ దాసరి నాగేశ్వర్రావు, వెయిట్‌లిఫ్టింగ్ కోచ్ కొత్త కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గొర్ల సత్తిరెడ్డి పాల్గొన్నారు. బాలుర జట్టు.. 48 కేజీల విభాగంలో వి.గణేష్, ఎం వేణు, 56 కేజీల విభాగంలో ఎన్రాజేష్, 62 కేజీల విభాగంలో కె.హర్షిత్చక్రవర్తి, బి.కార్తీక్, 69 కేజీల విభాగంలో కె.సాయికుమార్, 77 కేజీల విభాగంలో ఎస్కె మదార్, 85 కేజీల విభాగంలో జి.గణేష్, ఎస్కె మెహరాజ్పాషా, ఎండీ అమీర్‌పాషా ఎంపికయ్యారు. బాలికల జట్టు.. 44 కేజీల విభాగంలో వి.వెన్నెల, కె.వైజయంతి, 48 కేజీల విభాగంలో ఎస్ మౌనిక, 53 కేజీల విభాగంలో బి.కావేరి, 58 కేజీల విభాగంలో పి.శ్రావణి, 63 కేజీల విభాగంలో బి.సింధు, 75 కేజీల విభాగంలో బి.అఖిల ఎంపికయ్యారు. -
కొత్తగా ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాలు
డోర్నకల్ : కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా డోర్నకల్‌లో ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం ఏర్పాటు కానుంది. గతంలో మహబూబాబాద్ ఫారెస్ట్ సబ్ డివిజన్ పరిధిలో డోర్నకల్ ఉండేది. మహబూబాబాద్ కొత్త జిల్లాగా ఏర్పాటు కానుండడంతో మానుకోట, పాకాల అటవీ డివిజన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండూ కొత్తగూడెం జిల్లా సర్కిల్ పరిధిలోకి వస్తాయి. పాకాల పరిధిలో గూడూరు, కొత్తగూడ రేంజ్ కార్యాలయాలు, మహబూబాబాద్ పరిధిలో మహబూబాబాద్, డోర్నకల్, బయ్యా రం, తొర్రూరులో రేంజి కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు మహబూబాబాద్‌లో టాస్క్‌ఫోర్స్ రేంజిని ఏర్పాటు చేస్తున్నారు. మహబూబాబాద్ రేంజి పరిధిలో ఈదులపూసపల్లి, కంబాలపల్లి, జమాండ్లపల్లి, కేసముద్రం, ఇనుగుర్తి, తాళ్లపూసపల్లి, నాగారం, ఎఫ్ఎస్ఓ మహబూబాబాద్ నర్సరీ, ఎఫ్ఎస్ఓ మహబూబాబాద్ సెక్షన్లు ఉన్నాయి. టాస్క్‌ఫోర్స్ పరిధిలో రెండు ఎఫ్ఎస్ఓ టీపీ సెక్షన్లు ఉన్నాయి. డోర్నకల్ రేంజి పరిధిలో డోర్నకల్, ఎఫ్ఎస్ఓ కురవి, మరిపెడ సెక్షన్లు ఉండగా, బయ్యారం రేంజి పరిధిలో బయ్యారం, గౌరారం, కొత్తపేట సెక్షన్లు, ఎఫ్ఎస్ఓ కోర్టు డ్యూటీ, ఎఫ్ఎస్ఓ నర్సరీ సెక్షన్లు ఉన్నాయి. తొర్రూరు రేంజి పరిధిలో రెండు ఎఫ్ఎస్ఓ నర్సరీ, ఎఫ్ఎస్ఓ తొర్రూరు, ఎఫ్ఎస్ఓ నర్సింహులపేట సెక్షన్లు ఉన్నాయి. రేంజి కార్యాలయ పరిధిలో రేంజి అధికారి, సెక్షన్ అధికారి, ఒక్కో సెక్షన్‌కు ఇద్దరు ఫారెస్ట్ బీట్ అధికారులను నియమించనున్నారు. వీరితో పాటు కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, అటెండర్‌ను నియమించనున్నారు. -
పెండింగ్ సమస్యలు పరిష్కరించండి
రైల్వే జీఎంను కలిసిన ఎంపీ సీతారాంనాయక్ హన్మకొండ : దక్షిణ మధ్య రైల్వే జీఎం రవిగుప్త ను మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ కలిశారు. ఈ మేరకు శనివారం ఆయన సికింద్రాబాద్‌లో జీఎంను కలిసి రైల్వే పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న డోర్నకల్ రైల్వే స్కూల్‌ను తిరి గి ప్రారంభించాలని కోరారు. డోర్నకల్‌కు మం జూరు చేసిన సరుకుల రైలు ఎగ్జామినేషన్ ఫెసిలి టీ కేంద్రం పనులను వెంటనే ప్రారంభించాల న్నారు. అలాగే అండర్ బ్రిడ్జిని మంజూరు చేయాలన్నారు. నూతన జిల్లా కేంద్రంగా ప్రకటించిన మహబూబాబాద్‌లో రఫ్తిసాగర్(125/2), నర్సాపూర్–నాగర్సోల్ (17213/14), డోర్నకల్ వద్ద పద్మావతి (12763/64), ఈస్ట్ కోస్ట్ (13645/46) ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని కోరారు. ఏపీ ఎక్స్‌ప్రెస్, వైజాగ్ నుంచి న్యూఢిల్లీకి వెళ్లే రైళ్లలో ఒక రైలును నెక్కొండ వద్ద ఆపాలన్నారు. గోరఖ్‌పూర్‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు (12511/12), శాతవాహన, ఇంటర్సిటీ, జమ్ముతావి ఎక్స్‌ప్రెస్‌లో ఏదైనా ఒక రైలు నెక్కొండలో హాల్ట్ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో డోర్నకల్–ఇల్లందు వరకు నడిచిన ప్యాసింజర్‌రైలును పునరుద్ధరించాలని కోరారు. కాగా, వీటిపై జీఎం రవిగుప్తా సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు. -
రైలు బోగీపైకెక్కి వ్యక్తి హల్చల్
డోర్నకల్ : పట్టణంలోని రైల్వే స్టేషన్లో సోమవారం మతిస్థిమితం లేని ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. తెల్లవారుజామున విజయవాడ వైపు నుంచి∙వరంగల్ వైపునకు వెళ్తున్న గూడ్స్ రైలు కొత్త ప్లాట్‌ఫామ్ రెండో లైన్లో ఆగింది. ఈక్రమంలో మతిస్థిమితం లేని వ్యక్తి గూడ్సు రైలు బోగీపైకి ఎక్కి పడుకున్నాడు. సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు అక్కడికి చేరుకొని సదరు వ్యక్తిని బోగీపై నుంచి దింపి స్టేషన్‌కు తరలించారు. -
విద్యార్థి అదృశ్యం
డోర్నకల్ : స్థానిక ఎస్టీ బాలుర హాస్టల్ విద్యార్థి గుగులోత్ ప్రవీణ్ శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించకుండాపోయినట్లు అతడి తండ్రి తెలిపారు. నెల్లికుదురు మండలం రత్తిరాంతండా గ్రామపంచాయతీ పరిధిలోని నల్లగట్టు తం డాకు చెందిన గుగులోత్ హనుమంతు కుమారుడు ప్రవీణ్ డోర్నకల్ ఎస్టీ హాస్టల్లో ఉంటూ అక్కడి గుగులోత్ ప్రవీణ్‌లో ఆరో తరగతి చదువుతున్నాడు. ఇటీవల తండా నుంచి హాస్టల్‌కు వచ్చిన ప్రవీణ్ శుక్రవారం ఉదయం స్కూ ల్కు వెళ్లి బ్యాగ్ తరగతి గదిలో పెట్టి ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లాడు. సాయంత్రం హాస్టల్‌కు వచ్చిన తోటి విద్యార్థులు ప్రవీణ్ కనిపించకపోవడంతో ఈ విషయాన్ని హాస్టల్ సిబ్బందికి తెలపడంతోపాటు ప్రవీణ్ తండ్రి హనమంతుకు కూడా ఫోన్లో సమాచారమిచ్చారు. ఈ విషయమై హాస్టల్ సిబ్బందిని వివరణ కోరగా ప్రవీణ్ ఆధార్ కార్డుతో సహా సర్టిఫికెట్లు తెచ్చుకోకపోవడంతో హాస్టల్లో చేర్చుకోలేదని నల్లగట్టుతండాకు చెందిన విద్యార్థులతో కలిసి హాస్టల్లో కొద్దిరోజులు మాత్రమే ఉన్నాడని సిబ్బంది చెబుతున్నారు. ప్రవీణ్ కోసం బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఎలాంటి సమాచారం లభించలేదని తండ్రి హనుమంతు ‘సాక్షి’కి తెలిపారు. -
రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య
డోర్నకల్ : ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. డోర్నకల్ జీఆర్పీ ఎస్ఐ పెండ్యాల దేవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన ఎల్లంపల్లి సత్యనారాయణ(55) నవభారత్ సంస్థలో క్యాజువల్ లేబర్‌గా పని చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న సత్యనారాయణ శుక్రవారం రాత్రి ఖమ్మం జిల్లాలోని పాండురంగాపురం, గాజులగూడెం రైల్వే స్టేషన్ల మధ్య రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
సోమ్లా తండాకు జ్వరం
కలుషిత జలాలే కారణమంటున్న తండావాసులు వైద్య శిబిరం నిర్వహించాలని వేడుకోలు డోర్నకల్ : డోర్నకల్ పట్టణ పరిధిలోని సోమ్లా తండాలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూపోతోంది. తలనొప్పి, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులతో కూడిన జ్వరం తండావాసులు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే చాలామంది డోర్నకల్‌తో పాటు ఖమ్మంలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. స్థానికులు వాంకుడోత్ శారద, వాంకుడోత్ ఉపేందర్, దేవ్‌సింగ్, ధారావత్ సోనియా, రుక్మిణి, వాంకుడోత్ వరుణ్‌తేజ్, బానోత్ పార్వతి, కమిలి తదితరులు జ్వరంతో మంచంపట్టారు. సుమారు 80 కుటుంబాలు ఉన్న ఈ తండాకు రక్షిత మంచినీటి బావి, బోరు బావి ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. వాటి నుంచి కలుషిత జలాలు సరఫరా అవుతున్నాయని, అవి తాగడం వల్లే అనారోగ్యం బారిన పడుతున్నట్లు తండావాసులు పేర్కొంటున్నారు. బోరు బావి ద్వారా సరఫరా అయ్యే నీటినే తాగాలని ఇప్పటికే తాము సూచించామని గ్రామ పంచాయతీ సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు స్థానికంగా పారిశుద్ధ్య నిర్వహణ పడకేసింది. ఫలితంగా దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. వెంటనే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్యం అందించాలని తండావాసులు కోరుతున్నారు. -
యాభై లక్షల మెుక్కలు నాటుతాం
డోర్నకల్ : మండలంలోని తహసీల్దార్ బంజర గ్రామంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న డీఐజీ స్థానిక పోలీసు సిబ్బంది, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ గతేడాది నాలుగు జిల్లాల్లో కేవలం రెండు లక్షల మొక్కలు మాత్ర మే నాటామని తెలిపారు. ఈ ఏడాది నాలుగు లక్షలు నాటాలని నిర్థేశించుకున్నాం. హరితహారం ప్రారంభం రోజే పోలీసులంతా కలిసి ఐదు లక్షలు నాటినట్లు తెలిపారు. వరంగల్ రేం జి పరిధిలోని అదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఇప్పటి వరకు 32 లక్షల మొక్కలు నాటామని పేర్కొన్నారు. గడువు ముగిసే వరకు 50 లక్షలు నాటుతామని తెలిపా రు. నేడు నాటిన మొక్కలు రేపు చెట్లుగా మారి తే ఇప్పటి చిన్నారులకు మేలు జరుగుతుందని తెలిపారు. ప్రజలంతా స్వచ్ఛందంగా ముందు కు వచ్చి సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. బంజర గ్రామాన్ని పోలీసు లు దత్తత తీసుకున్నారని ఇప్పటి వరకు 2000 మొక్కలు నాటారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అంకతి పద్మ, సీఐ హరీష్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యురాలు కేశబోయిన స్వరూప, ఎంపీటీసీ సభ్యురాలు వాంకుడోత్ అచ్చమ్మ, తహసీల్దార్ ఎం.కనకరాజు, ఎంపీడీఓ సుదర్శనం, ఏపీఓ శంకర్‌నాయక్, ఆర్ఐ సూరయ్య, ఎస్సైలు ఖాదర్‌బాబా, జగదీష్, హెచ్ఎం వి. సుధాకర్, నాయకులు సీతారామయ్య, అయోధ్యరామయ్య పాల్గొన్నారు. -
వడదెబ్బతో ఎనిమిది మంది మృతి
డోర్నకల్‌లో ఒకే తండాకు చెందిన ఇద్దరు.. ఏటూరునాగారంలో అంగన్వాడీ టీచర్ జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. ప్రచండ భానుడి ప్రకోపానికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు నానాటికీ పెరుగుతుండడం, వడగాల్పులు వీయడంతో వృద్ధులు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నా రు. జిల్లాలో వడదెబ్బ మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతుండడంతో ప్రజలు భయూందోళనలకు గురవుతున్నారు. సోమవారం ఒక్కరోజే ఎనిమిది మంది మృత్యువాత పడ్డారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మరిపెడ : మరిపెడ మండల కేంద్రానికి చెందిన గోల్కొండ మైసయ్య(65) వంట చెరుకు కోసం ఆదివారం అడవికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చాక తీవ్ర అస్వస్థతకు గురయ్యూడు. ఈ క్రమంలో సోమవారం మృతిచెందాడు. మైసయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నెల్లికుదురు : మండలంలోని చిన్నముప్పారం గ్రామంలో వడదెబ్బ తాళలేక బొమ్మిశెట్టి వెంకయ్య(75) అనే వృద్ధుడు మృతిచెందాడు. ఎండలతో తీవ్ర అస్వస్థతకు గురైన వెంకయ్య ఇంట్లో పడుకుని నిద్రలోనే మృత్యువాత పడ్డాడని కుటుంబసభ్యులు తెలిపారు. దుగ్గొండి : మండలంలోని జీడికల్ గ్రామానికి చెందిన దండు సాంబయ్య(55) వడదెబ్బతో మృతిచెందాడు. పసుపు వేరేందుకు సోమవారం పొలానికి వెళ్లిన సాంబయ్య మధ్యాహ్నం 3 గంటలకు ఇంటికి వచ్చాడు. అనంతరం అస్వస్థతకు గురికాగా, కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. మృతుడికి భార్య సుగుణ, ఇద్దరు కుమారులు ఉన్నారు. హసన్‌పర్తి : వరంగల్ నగరంలోని 58వ డివిజన్ వం గపహాడ్కు చెందిన నక్క రాములు(62) వడదెబ్బతో మృతి చెందాడు. సోమవారం కూలీ పనికి వెళ్లిన రాములు మధ్యాహ్నం ఇంటికి వచ్చి కుప్పకూలాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగానే ప్రాణాలు వదిలాడు. ఏటూరునాగారం : మండలంలోని ఎక్కెల గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ బలంతుల సరోజన (60) వడదెబ్బకు గురై ఆదివారం అర్ధరాత్రి మృతి చెందారు. ఆదివారం ఎండలో తిరగడంతో వడదెబ్బకు గురైన సరోజనను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించామని, చికిత్స పొం దుతూ మృతి చెందిందని ఆమె కోడలు కల్పన తెలి పారు. విషయం తెలుసుకున్న సీడీపీవో రాజమణి, సూపర్వైజర్లు, అంగన్వాటీ కార్యకర్తలు మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. రాయపర్తి: మండలంలోని తిర్మలాయపల్లికి చెందిన గడ్డం మల్లమ్మ(65) వడదెబ్బతో సోమవారం మృతిచెందింది. మల్లమ్మ పింఛన్ తీసుకునేందుకు పోస్టాఫీసు వద్దకు వెళ్లి తిరిగొచ్చి ఎండదెబ్బతో అస్వస్థతకు గురైంది. ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఒకే తండాకు చెందిన ఇద్దరు డోర్నకల్ : పట్టణ శివారు సిగ్నల్‌తండాకు చెందిన ఇద్దరు మహిళలు సోమవారం వడదెబ్బతో మృతి చెందారు. బాదావత్ లింగమ్మ(58), బానోత్ కాంతమ్మ(60) తీవ్రమైన ఎండలతో గత మూడు రోజులుగా అస్వస్థతకు గురయ్యారు. చికిత్స అందిస్తుండగా సోమవారం కొద్దిపాటి సమయం తేడాతో ఇద్దరూ మృతి చెందారు. దీంతో తండావాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఎమ్మెల్యే పరామర్శ... బాదావత్ లింగమ్మ, బానోత్ కాంతమ్మ కుటుంభాలను ఎమ్మెల్యే రెడ్యానాయక్ పరామర్శించారు. మృతదేహాలపై పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులు గొర్ల సత్తిరెడ్డి, వాంకుడోత్ వీరన్న, డీఎస్ కృష్ణ, కేశబోయిన కోటిలింగం, కత్తెరసాల విద్యాసాగర్, మేకపోతుల శ్రీనివాస్, మాదా శ్రీనివాస్, నలబోలు శ్రీనివాస్, దేవ్‌సింగ్ ఉన్నారు. -
రైలుబండి.. రెండు అంతస్తులదండి!
మీరు చిత్రంలో చూస్తున్నది రెండంతస్తుల.. డబుల్ డెక్కర్ రైలు. ఇది మంగళవారం విజయవాడ నుంచి డోర్నకల్ మీదుగా వెళ్లింది. రైళ్ల కోసం ప్రయాణికులు డోర్నకల్ స్టేషన్లో ఎదురుచూస్తుండగా..అకస్మాత్తుగా ఈ డబుల్ డెక్కర్ రైలు వచ్చి ఆగడంతో దాన్ని ఆసక్తిగా తిలకించారు. రైలు లోపల ఏర్పాట్లు ఎలా ఉంటాయోనని చర్చించుకున్నారు. - డోర్నకల్ -
బైక్ ఢీకొని ఇద్దరు చిన్నారులకు గాయాలు
డోర్నకల్: వరంగల్ జిల్లా డోర్నకల్ పట్టణంలోని ఎస్సీబీసీ కాలనీ వద్ద ఓ బైక్ ఢీకొని ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. స్థానిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న ఇద్దరు చిన్నారులు స్కూలుకు వెళ్తుండగా బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన ఇద్దరిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు
డోర్నకల్ (వరంగల్) : మహారాష్ట్రలోని షిర్డీ సాయి నగర్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న షిర్డీ ఎక్స్‌ప్రెస్ శనివారం డోర్నకల్ సమీపంలోకి రాగానే ఏసీ బోగీ కింది భాగంలో సమస్య తలెత్తడంతో.. బోగీలో పొగలు కమ్ముకున్నాయి. ఈ సమస్యను గుర్తించిన డ్రైవర్ వెంటనే డోర్నకల్ రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది మూడో ఏసీ బోగీ కింద బ్రేక్ జామ్ అయిన విషయాన్ని గుర్తించి దాన్ని సరిచేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో షిర్డీ ఎక్స్‌ప్రెస్ డోర్నకల్‌లో అరగంటకు పైగా ఆగిపోయింది. -
పురుగుల మందు తాగిన చిన్నారుల పరిస్థితి విషమం
డోర్నకల్: వరంగల్ జిల్లాలో ఇద్దరు చిన్నారులు పురుగుల మందు తాగి ప్రాణాపాయ పరిస్థితుల్లో చిక్కుకున్నారు. డోర్నకల్ మండలం గొల్లచర్ల పంచాయతీ కస్నా తండాలో మంగళవారం ఈ విషాదం చోటుచేసుకుంది. తండాకు రవీందర్, స్రవంతి దంపతులకు ప్రణీత (5), ప్రణీత్ (3) ఇద్దరు సంతానం. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా, ఇంట్లో ఉన్న పురుగుల ముందును చిన్నారులు తాగారు. పొలం నుంచి ఇంటికి తిరిగి వచ్చిన రవీందర్ దంపతులకు చిన్నారుల నుంచి పురుగుల ముందు వాసన రావడంతో వెంటనే 108 వాహనంలో మహబూబాబాద్ ఆస్పత్రికి పంపించారు. ప్రణీత్ ఎక్కువ మొత్తంలో పురుగుల మందు తాగడంతో బతకడం కష్టమని, ప్రణీత పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
మహిళా రైతు ఆత్మహత్య
డోర్నకల్ (కర్నూలు) : ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ మహిళా రైతు ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం తొడేళ్లగూడెం గ్రామానికి చెందిన చెక్కల ఉపేంద్ర(33) తన భర్త శ్రీనుతో కలిసి తమకున్న ఎకరం ఇరవై గుంటల్లో పత్తి సాగు చేస్తోంది. పెట్టుబడి కోసం శ్రీను పలు చోట్ల చేసిన అప్పులు సుమారు రూ.2.30 లక్షల వరకు చేరాయి. ఇంత చేసినా పంటకు సరిగా నీరందలేదు. ఇటీవల రెండుసార్లు వ్యవసాయ బావి కరెంటు మోటారు కాలిపోయింది. మనస్తాపానికి గురైన ఉపేంద్ర సోమవారం తన పత్తి చేను వద్ద పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను భర్తతోపాటు స్థానికులు ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ వివరించారు. -
రెండు జిల్లాల సరిహద్దున తండ్లాట !
ఖమ్మం.. వరంగల్ నడుమ లచ్యాతండా దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని గూడెం పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు మౌలిక వసతులు లేక అల్లాడుతున్న గిరిజనులు ఖమ్మం జిల్లాలో కలపాలని కోరుతున్న స్థానికులు అదో చిన్న తండా. రెండు జిల్లాల సరిహద్దులో ఉంది. సగం ఇళ్లు ఖమ్మం జిల్లా కామెపల్లి మండల పరిధిలో, మిగతా సగం ఇళ్లు డోర్నకల్ మండల పరిధిలో ఉండడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. కనీస వసతులు కొరవడి గిరిజనం తండ్లాడుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. డోర్నకల్- లింగాల ప్రధాన రహదారిలో రోడ్డుకు పావు కిలోమీటర్ దూరంలో ఉన్న లచ్యా తండా పరిస్థితి ఇది. డోర్నకల్ : లచ్యాతండా.. మొత్తం 400మంది జనాభాతో ఖమ్మం.. వరంగల్ జిల్లాల సరిహద్దున ఉన్న ఈ చిన్న తండా రెండుగా చీలిపోయింది. తండా మధ్యనుంచి వెళ్తున్న రహదారికి ఒకవైపున ఉన్న ఇళ్లన్నీ డోర్నకల్ మండల పరిధిలోకి, మరోవైపున ఉన్న ఇళ్లన్నీ ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం పొన్నెకల్లు గ్రామ పరిధిలోకి వస్తాయి. మొత్తం 80కుటుంబాలు ఉన్న ఈ తండాలో 240మంది ఓటర్లున్నారు. డోర్నకల్-లింగాల ప్రధాన రహదారిలో రోడ్డుకు పావు కిలోమీటరు దూరంలో ఉన్న లచ్యాతండాలోని సగం ఇళ్లు డోర్నకల్ నాలుగో వార్డు పరిధిలో, అలాగే మూడవ మండల ప్రాదేశిక స్థానం పరిధిలో ఉన్నాయి. డోర్నకల్ మండలకేంద్రం నుంచి ఇది రెండు కిలోమీటర్ల దూరంలో ఉండగా, ఖమ్మం జిల్లాలోని కామెపల్లి మండలకేంద్రం నుంచి 20కిలోమీటర్ల దూరంలో ఉంది. దశాబ్దాలు గడుస్తున్నా.. నిర్లక్ష్యమే.. లచ్యాతండా ఏర్పడి దశాబ్దాలు గడుస్తున్నా అభివృద్ధికి మాత్రం ఆమడదూరంలోనే ఉంది. రెండు జిల్లాల సరిహద్దులో ఉండడంతో ఏ జిల్లా అధికారులూ, ప్రజాప్రతినిధులూ పట్టించుకోవడం లేదు. తండాలో తాగునీరు, విద్యుత్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. రోడ్డుకు ఇరుపక్కల ఉన్న వాళ్లు గొడవలు పడితే ఇటుపక్క ఉన్నవారు డోర్నకల్‌లో, అటుపక్కన వారు కామెపల్లి మండలం తోడేళ్లగూడెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకుంటున్నారు. తండాలోని ఇరుపక్కల ఉన్న చేతిపంపులు పనిచేయడం ఏనాడో మానివేశాయి. తండాలోని ఏకైక వీధిలో కొద్ది దూరం మాత్రం సిమెంటు రోడ్డు నిర్మించి వదిలేశారు. దీంతో వర్షాకాలంలో తండావాసులు అనుభవిస్తున్న ఇబ్బందులు అన్నీఇన్నీకావు. చిన్నపాటి వర్షానికే వీధంతా బురదమయమై మోకాలు లోతు వరకు భూమిలోకి కూరుకుపోతుందని తండావాసులు చెబుతున్నారు. తండాలో పాఠశాల లేకపోవడంతో కొంతమంది విద్యార్థులు పొన్నెకల్లు, మరికొంతమంది డోర్నకల్‌లోని పాఠశాలలకు వెళ్తున్నారు. ఇరు జిల్లాల ప్రజాప్రతినిధులు తండాను గాలికొదిలేయడంతో కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదని గిరిజనులు వాపోతున్నారు. కామెపల్లి మండలం ఏజెన్సీ ప్రాతం కింద ఉన్నందున తండా మొత్తాన్ని కామెపల్లి మండలం కిందకు మార్చి అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతున్నారు. తాగునీటి సమస్య తీవ్రం డోర్నకల్ వైపు ఉన్న లచ్యాతండాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఎండాకాలంలో వ్యవసాయ బావుల్లోని నీరే ఆధారం. తండాలో వసతుల కల్పన కు అప్పుడప్పుడు అరకొరగా నిధులు కేటాయిస్తున్నా పెద్దగా ఉపయోగపడడం లేదు. - తేజావత్ బాలు, లచ్యాతండా, డోర్నకల్ మండలం తాతల కాలం నుంచీ ఇంతే.. మా తాతల కాలం నుంచీ తండా ఇలాగే ఉంది. మా తాత బోల్యా, తండ్రి పంతులు, నేను, నా కొడుకు రవి ఇక్కడే పుట్టాం. సమస్యలతో సర్దుకుపోతున్నాం. రెండు జిల్లాల వాళ్లు మా తండా అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. - భూక్యా రాములు లచ్యాతండా, కామెపల్లి మండలం ఖమ్మంలో కలిపితేనే మేలు ప్రస్తుతం మేమున్న వైపు తండా ఏజెన్సీ మండలమైన కామెపల్లి పరిధిలో ఉంది. కాబట్టి తండా మొత్తాన్ని కామెపల్లి మండలంలో కలిపితే కొంతమేలు జరిగే అవకాశం ఉంది. నేను డిగ్రీ చదువుకున్నా ఉద్యోగం రాలేదు. తండాను కామెపల్లిలో కలిపితే కొందరికైనా మేలు జరుగుతుంది. - భూక్యా నరేష్ లచ్యాతండా, కామెపల్లి మండలం కరెంటు సక్రమంగా ఉండదు తండాలో ఎప్పుడూ కరెంటు సక్రమంగా ఉండదు. వీధిలైట్లు లేకపోవడంతో రాత్రి బయటకు వెళ్లాలంటే భయమేస్తుంది. మారుమూలన ఉన్నందునే మా తండాను ఎవరూ పట్టించుకోవడం లేదు. - భూక్యా పద్మ లచ్యాతండా, కామెపల్లి మండలం -
పోరుగడ్డ పెరుమాళ్లసంకీస
రజాకార్ల దురాగతానికి 66 ఏళ్లు ఊరు తగులబెట్టి పైశాచిక దాడి నాటి ఘటనలో 21 మంది మృతి డోర్నకల్ : తెలంగాణ సాయుధ పోరులో పెరుమాళ్లసంకీస కీలకపాత్ర పోషించింది. డోర్నకల్ మండలంలోని పెరుమాళ్లసంకీసతోపాటు బూరుగుపాడు, ఉయ్యాలవాడ, వెన్నారం తదితర గ్రామాలకు చెందిన అనేక మంది రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగించారు. సంకీస గ్రామానికి చెందిన తుమ్మ శేషయ్య దళనాయకుడిగా ముందుండి రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడారు. తెలంగాణ ప్రాంతం నుంచి రజాకార్లను తరిమికొట్టాలంటూ దళాలతో గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను చైతన్యపరిచాడు. ఒక్కో దళంలో 12 మంది సభ్యుల చొప్పున 8 దళాలను ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఈ క్రమంలో తుమ్మ శేషయ్యతోపాటు ఉద్యమాల్లో పాల్గొంటున్న యువకులను అంతమొందించేందుకు రజాకార్లు కుట్ర పన్నారు. 1948 సెప్టెంబర్ ఒకటో తేదీన రెండొందల మందికి పైగా రజాకార్లు సంకీస గ్రామంపై ఆయుధాలతో దాడి చేసి మారణహోమం సృష్టించారు. తుమ్మ శేషయ్య కోసం రజాకార్లు రాగా... ఆ సమయంలో ఆయన లేకపోవడంతో గ్రామస్తులపై దాడి చేసి మట్టుబెట్టారు. గ్రామ నలుమూలల నుంచి లోపలకు ప్రవేశించి పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. గ్రామ నడిబొడ్డున ఉన్న బందెల దొడ్డి వద్దకు పురుషులను ఈడ్చుకువచ్చి గుండ్రంగా కూర్చోబెట్టి తుపాకులతో అమానుషంగా కాల్చి చంపారు. కాల్పుల్లో చాలా మంది చనిపోగా... కొన ఊపిరితో ఉన్నవారిని వరిగడ్డి కప్పి దహనం చేశారు. మహిళలపై మూకుమ్మడిగా అత్యాచారాలకు పాల్పడ్డారు. నాటి ఈ ఘటనలో మొత్తం 21 మంది గ్రామస్తులు ప్రాణాలు కోల్పోయారు. గ్రామానికి చెందిన వృద్ధులు ఆ ఘటనను తల్చుకుని నేటికీ భయంతో వణుకుతున్నారు. ఆ తర్వాత కాలంలో నాటి మృతుల జ్ఞాపకార్థం పెరుమాళ్లసంకీస గ్రామంలో స్మారకస్థూపం ఏర్పాటు చేశారు. ఊరు తగులబెట్టారు... రజాకార్లు రెండు సార్లు ఊరిని తగులబెట్టారు. మూడు సార్లు దాడులు జరిపారు. నా భర్త నారాయణను రెండు సార్లు జైలులో పెట్టారు. మహిళలపై రజాకార్లు అతికిరాతకంగా దాడులు చేస్తుండడంతో మొక్కజొన్న తోటల్లో దాక్కున్నాం. - శెట్టి వెంకటనర్సమ్మ పైశాచిక దాడి... రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్నపుడు నాకు 17 ఏళ్లు. అడవుల్లో ఉన్న దళాలకు అన్ని రకాలుగా సహకరించాను. రజాకార్లు మానవత్వం మరిచి రక్తపాతం సృష్టించారు. పిల్లలు, పెద్దలు ప్రాణాలు చేతిలో పెట్టుకుని తలా దిక్కు పారిపోయారు. - కొత్త రంగారెడ్డి నాటి ఉద్యమకారులే స్ఫూర్తి.. సాయుధపోరులో అనేక మంది ప్రాణాలు కోల్పోయూరు. వారి ఆశయసాధన కోసం పనిచేస్తున్నాం. వారి స్ఫూర్తితో పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం. - శెట్టి వెంకన్న, పెరుమాళ్లసంకీస సర్పంచ్ -
ఆదాయం ఉన్నా.. అభివృద్ధి శూన్యం
- ప్రధాన స్టేషన్లలో ఫుట్ఓవర్ బ్రిడ్జిలు కరువు - వరంగల్,కాజీపేటలో లిఫ్టులు లేవు - డోర్నకల్‌లో వేధిస్తున్న ప్లాట్‌ఫాం సమస్య - హామీలకే పరిమితమవుతున్న రైళ్ల హాల్టింగ్ సాక్షి, హన్మకొండ :‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా తయారైంది దక్షిణ మధ్య రైల్వేకు మన జిల్లా. వివరాల్లోకెళితే.. దక్షిణ మధ్య రైల్వేకు అధిక ఆదాయం చేకూర్చి పెట్టడంలో వరంగల్ జిల్లా ముందంజలో ఉంది. కానీ అభివృద్ధిలో మాత్రం వెనుకంజలో ఉంది. నిత్యం వరంగల్ జిల్లా నుంచి సగటున రైల్వేకు *20లక్షలవరకు ఆదాయం సమకూరుతోంది. కానీ జిల్లాలోని ప్రధాన రైల్వే స్టేషన్లైన వరంగల్, కాజీపేట, డోర్నకల్ మహబూబాబాద్, జనగామలలో కనీస వసతులు కరువయ్యాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా రైల్వే ఉన్నతాధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో ప్రయాణీకులు అవాక్కవుతున్నారు. 40వేల మంది రాకపోకలు జిల్లాలో ప్రధాన రైల్వేస్టేషన్లు అయిన కాజీపేట స్టేషన్ నుంచి సగటున 12వేల మంది, వరంగల్ నుంచి సగటున 27 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వీటికి పోస్టాఫీసు రిజర్వేషన్లు, ఆన్లైన్ రిజర్వేషన్లు కలుపుకుంటే జిల్లా కేంద్రం నుంచి రైళ్లలో రాకపోకలు సాగించే వారి సంఖ్య 40వేలుగా ఉంది. వీటితో పాటు మహబూబాబాద్, జనగామ, డోర్నకల్ వంటి ఇతర స్టేషన్లను సైతం కలుపుకుంటే ఈ సంఖ్య సగటున దాదాపుగా డెబ్భైవేలుగా ఉంది. తద్వారా ప్రతిరోజు జిల్లాలో సగటున *20 లక్షల వరకు టిక్కెట్ల అమ్మకాలు సాగుతున్నాయి. కానీ రైల్వేస్టేషన్లలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఇబ్బందుల్లో ప్రధాన స్టేషన్లు ప్రధాన రైల్వేస్టేషన్లయిన వరంగల్, కాజీపేటలలో ఆదాయానికి తగ్గ అభివృద్ధి లేదు. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ భారతదేశాలకు గేట్వేగా ఉన్న కాజీపేట స్టేషన్లో సౌకర్యాలు నామమాత్రంగా ఉన్నాయి. మూడు ప్లాట్‌ఫారాలు మాత్రమే ఉన్న ఈ స్టేషన్లో ఒక్కటంటే ఒక్కటే బ్రిటిష్ హయంలో నిర్మిం చిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి అందుబాటులో ఉంది. ఉదయం, సాయంత్రం వేళల్లో రెండురైళ్లు రెండు ప్లాట్‌ఫారాల మీదకు వచ్చినప్పుడు ఈ బ్రిడ్జి కిక్కిరిసిపోతుంది. ఒకటో నంబరు ఫ్లాట్‌ఫారమ్ మీద నుంచి రెండు, మూడుఫ్లాట్ఫారమ్లకు చేరుకునేలోపు రైళ్లు వెళ్లిపోతున్నాయి. ఈ హాడావుడిలో ప్రయాణికులు ప్రాణాలకు తెగించి పట్టాలు దాటి రైళ్లు ఎక్కాల్సిన దుస్థితి నెలకొంది. రెండేళ్ల కిందే కాజీపేట స్టేషన్‌కు రెండో ఫుట్ ఓవర్‌బ్రిడ్జితో పాటు వృద్ధులు, వికలాంగుల కోసం లిఫ్టులు సైతం మంజూరు అయ్యాయి. అమలుకు నోచుకోని లిఫ్టుల పనులు అత్యధిక ఆదాయం తెచ్చిపెడుతున్న వరంగల్ స్టేషన్‌కు లిఫ్టు లు రెండేళ్ల కిందే మంజూరయ్యాయి. కానీ వాటి పనులు అమలుకు నోచుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మరోవైపు డోర్నకల్ జంక్షన్ ఏర్పాటులో జరిగిన లోపం వల్ల ఫుట్ఓవర్ బ్రిడ్జిని ఉపయోగించకుండా నేరుగా ప్రయాణికు లు ప్లాట్‌ఫారమ్ మీదకు చేరుకోలేరు. దానితో ఈ సమస్య ను నివారించేందుకు రెండేళ్ల కిందే స్టేషన్లో లక్షలాది రూపాయల వ్యయంతో కొత్తగా ఫ్లాట్‌ఫారమ్‌లు నిర్మించారు. రెం డేళ్లు గడుస్తున్నా ఈ ఫ్లాట్ఫారమ్ను ప్రారంభించడం లేదు. ఈ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలి పదేళ్ల క్రితం ప్రారంభించిన కాజీపేటటౌన్ స్టేషన్‌పై రైల్వే అధికారులు సవతితల్లి ప్రేమ చూపుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా సింగరేణి పాస్ట్‌ప్యాసింజర్, పెద్దపల్లి ప్యాసింజర్లు తప్ప మరోరైలుకు ఇక్కడ హాల్టింగ్ కల్పించడం లేదు. నగరంలో కలిసిపోయినట్లుగా ఉన్న హసన్‌పర్తిలో రైల్వేస్టేషన్లో సైతం ఇంటర్సిటీ, తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలంటూ అనేక సార్లు రైల్వేశాఖకు వినతిపత్రాలు సమర్పించారు. కనీసం కరీంనగర్-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలుకు ఇక్కడ హాల్టింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. డోర్నకల్‌లో పద్మావతి, మహబాద్‌లో హౌరా, జీటీ, రఫ్తీసాగర్కు హాల్టింగ్ ఇవ్వాలి డోర్నకల్ రైల్వేస్టేషన్లో పద్మావతి, హౌరా ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మహబూబాబాద్‌లో గ్రాండ్‌ట్రంక్, రఫ్తీసాగర్ రైళ్లకు హాల్టిం గ్ ఇవ్వాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు. డోర్నకల్ స్టేష న్లో రెండు, మూడోనంబరు ప్లాట్‌ఫారమ్‌లపై కనీసం మూ త్రశాలలు లేకపోవడం వల్ల ప్రయాణికలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భువనగిరి-సికింద్రాబాద్‌ల నడుమ నడుస్తోన్న మెమూ రైళ్లను జనగామ వరకు పొడిగించాల్సిన అవసరం ఉంది. సరిపడా ఫుట్ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలి జిల్లాలో ప్రధానంగా వరంగల్, మహబూబాబాద్ రైల్వేస్టేషన్లు పట్టణంలోని ప్రధాన వ్యాపార కూడళ్ల మధ్యలో ఉన్నాయి. ఇక్కడ సరిపడా ఫుట్ఓటర్ బ్రిడ్జిలు నిర్మించాలని ఆయా ప్రాంతాల్లోని ప్రయాణీకులు కోరుతున్నారు. కొన్ని సమయాల్లో టీసీల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోంది. వీటితో పాటు కాజీపేట స్టేషన్లో బోడగుట్టను కలుపు తూ మరో బైపాస్ ఫుట్ఓవర్ బ్రిడ్జిలను నిర్మిం చాలని ఏళ్ల తరబడి ప్రజలు కోరుతున్నారు. పిట్‌లైన్, అదనపు ప్లాట్‌ఫాంపై మెలిక సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై పెరిగిపోతున్న భారాన్ని తగ్గించేందుకు కాజీపేట స్టేషన్ ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేయాలని గతంలో నిర్ణయించారు. అందులో భాగంగా కాజీపేటలో ప్రస్తుతం ఉన్న నాలుగు, ఐదు ప్లాట్ ఫారమ్‌లకు బదులుగా కొత్తగా మూడో నంబరు ప్లాట్‌ఫారమ్‌కు సమాంతరంగా మరో రెండు ప్లాట్‌ఫారమ్‌లు నిర్మించాలని నిర్ణయించారు. రైళ్ల మెయింటనెన్స్‌లో భాగంగా అదనపు పిట్లైన్లు సైతం మంజూరు చేశారు. ఇందుకు సంబంధించిన నిధులు విడుదల కాలేదు. ఈలోగా రైల్వే అధికారులు కొత్త మెలికలు పెడుతున్నారు. కాజీపేట స్టేషన్ కొత్తిపిట్లైన్లు నిర్మించేందుకు అనువుగా లేదంటూ సరికొత్త వాదనలు తెరపైకి తెస్తున్నారు. ఈ ప్రయత్నాలను తిప్పికొట్టి పిట్లైన్లతో పాటు అదనపు ప్లాట్‌ఫారమ్‌లు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాజీపేటకు పీఓహెచ్ దక్కేనా? ఓకే అయితే మూడు వేలమందికి ఉపాధి కాజీపేట రూరల్ : కాజీపేటలోని డిజిల్ లోకోషెడ్, ఎలక్ట్రిక్ లోకోషెడ్లకు పీరియాడికల్ ఓవర్ హాలింగ్(పీఓహెచ్) అనుమతి కోసం రైల్వే కార్మికులు, జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈనెల 8న పార్లమెంట్లో రైల్వే మంత్రి సదానంద గౌడ 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రైల్వేబడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గౌడ బడ్జెట్లో కాజీపేట జంక్షన్‌కు న్యాయం జరుగుతుందని కార్మికులు కోటి ఆశలతో ఉన్నారు. కాజీపేట ఎలక్ట్రిక్, డీజిల్ లోకోషెడ్లలో పీఓహెచ్ ఏర్పాటు చేస్తే రైల్వేలకు లాభంతో పాటు సుమారు మూడు వేల మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఇక్కడ పీఓహెచ్ షెడ్లు లేకపోవడంతో రైల్వే అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. డీజిల్ లోకోషెడ్.. డీజిల్ లోకోషెడ్‌లో 142 డీజిల్ ఇంజిన్ల నిర్వహణ జరుగుతోంది. ఇందులో 800 మంది ైరె ల్వే కార్మికులు పని చేస్తున్నారు. డీజిల్ లోకోషెడ్ కేంద్రంగా దేశ వ్యాప్తంగా తిరుగుతున్న రైలు ఇంజిన్లకు ప్రతీ ఆరేళ్లకు ఒకసారి లేదా 60వేల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత పీఓహెచ్ చేయాలి. పీఓహె చ్ అంటే ఇంజిన్ టాప్ తప్ప అన్ని భాగాలు విప్పి సర్వీస్ చేసేవిధానం. డీజిల్ ఇంజిన్లకు తమిళనాడులో గోల్డెన్రాఖ్, ఒడిషాలో ఖరగ్‌పూర్, పంజాబ్‌లో పాఠియాలలో పీఓ హెచ్లున్నాయి. కాజీపేటలో పీఓహెచ్ లేక డీజిల్ ఇంజిన్లను ఈ ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. ఎలక్ట్రిక్ లోకోషెడ్.. కాజీపేట ఎలక్ట్రిక్ లోకోషెడ్‌లో 143 ఇంజిన్ల నిర్వాహణ జరుగుతోంది. ఇందులో 450 మంది కార్మికులు పని చేస్తున్నారు. ఎలక్ట్రిక్ ఇంజిన్ జీవిత కాలం 36 ఏళ్లు. మహారాష్ట్రలో బుసావల్, పశ్చిమబెంగాల్లో కంచీరపార, చెన్నైలో పెరంబూర్‌లోని పీఓహెచ్కు ప్రతీ తొమ్మిది సంవత్సరాలకు ఒకసారి ఎలక్ట్రిక్ ఇంజిన్‌ను తీసుకెళ్లాలి. ఇక్కడ ఇంజిన్‌ను విప్పి మేజర్ సర్వీస్ చేస్తారు. రైల్వేకు లాభం.. నిరుద్యోగులకు ఉపాధి దక్షిణ మధ్య రైల్వేలో వందల కొలది డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజిన్లు తిరుగుతున్నాయి. మనదగ్గర పీఓహెచ్ లేకపోవడంతో వేరే రాష్ట్రాలకు వెళ్తున్నాం. డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజిన్లను తీసుకెళ్తే 30 రోజుల్లో పీఓహెచ్ చేసి ఇవ్వాలని కార్మికులు అంటున్నారు. అయితే ఇప్పడు 50 రోజుల వరకు సమయం తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఒక్క రోజుకు ఒక ఇంజిన్ నడవకుంటే రైల్వేకు రూ.2 లక్షలు నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన ఇంత పెద్ద సంఖ్యలో ఇంజిన్లు నడవకుంటే నష్టం భారీ స్థాయిలోనే ఉంటుంది. మన వద్ద నుంచి పీఓహెచ్కు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు 10 రోజుల వరకు సమయం పడుతుంది. అదికూడా ఖాళీగానే వెళ్లి రావలసి ఉంటుంది. లక్నోలో మాదిరిగా కాజీపేటలో డీజిల్‌షెడ్, ఎలక్ట్రిక్ షెడ్లను పీఓహెచ్లుగా చేస్తే రైల్వేకు లాభంతో పాటు ఉద్యోగాల అవకాశాలు పెరగడంతోపాటు, ఇంజిన్లకు కావల్సిన కాంపోనెంట్లు, ఆక్సిలరీ భాగాలకు చిన్నచిన్న పరిశ్రమలు ఏర్పడి వే లాది మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని పేర్కొంటున్నారు. -
ఓరుగల్లు యాదిలో ‘శకుంతల’
పోచమ్మమైదాన్ : తెలంగాణ యాస, భాషతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సినీనటి శకుంతల శనివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో గుండెపోటుతో మృతిచెందడంతో జిల్లాకు చెందిన ఆమె అభిమానులు, కళాకారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గ్రామీ ణ ప్రాంతాల ప్రజలు మాట్లాడుకునే భాష ను యథాతదంగా వినిపించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన శకుంతల ఆకస్మికంగా కన్నుమూయడంతో చాలామంది ఆవేదనకు లోనయ్యారు. ‘మా భూమి’ సినిమాతో తెలుగు సినీ రంగంలోకి ప్రవేశించిన శకుంతల.. ఇంతింతై.. వటుడింతై అన్న చందంగా ఎదిగింది. డెరైక్టర్ తేజ రూపొందించిన ‘నువ్వునేను’ సినిమా ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. అయితే అప్పటి నుంచి చాలా సినిమాల్లో కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న శకుంతల ఇటీవల ‘పాం డవులు పాండవులు తుమ్మెద’లో బామ్మ పాత్ర చేసి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుం ది. ఇదిలా ఉండగా, 1996 సంవత్సరంలో ‘ఉద యం టెలీఫిలిం’ షూటింగ్లో భాగంగా ఆమె వరంగల్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె దేశాయిపేట లో జరిగిన షూటింగ్లో పాల్గొన్నారు. అలాగే జిల్లా లో పలుమార్లు జరిగిన నాటకాల ప్రదర్శనకు కూడా హాజరయ్యారు. కాగా, 2012 సంవత్సరంలో ఓ టీవీ చానల్ వరంగల్‌లో నిర్వహించిన వంటల ప్రోగాం కు హాజరయ్యారు. ఆ సమయంలో ఆమె ‘సాక్షి’తో చిట్‌చాట్ చేశారు. కాగా, ఉదయం టెలిఫిలీంకు దర్శకత్వం వహించిన టీవీ ఆశోక్ శకుంతల మరణవార్త విని తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. దిగ్భ్రాంతికి గురైన డోర్నకల్ వాసులు డోర్నకల్ : సినీనటి తెలంగాణ శకుంతల మృతివార్తను తెలుసుకున్న డోర్నకల్ వాసులు శనివారం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. 2009 ఫిబ్రవరి 9వ తేదీన పట్టణంలో ఏర్పాటు చేసిన వెన్నెల ఫ్యూరిఫైడ్ వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభించేందుకు శకుంతల డోర్నకల్‌కు వచ్చారు. ఆ సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు డోర్నకల్‌లో గడిపిన శకుంతలను చూసేందుకు చాలామంది వచ్చారు. అయితే తనవద్దకు వచ్చిన వారితో ఆమె ఆప్యాయంగా మాట్లాడి ఫొటోలు దిగింది. కాగా, ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం తెలంగాణ యాసలో మాట్లాడగా స్థానికులు ఆనందంతో కేరింతలు కొట్టారు. ఇది లా ఉండగా, శకుంతల మృతిని జీర్ణించుకోలేకపోతున్నామని వెన్నెల వాటర్‌ప్లాంట్ నిర్వాహకురాలు బానోత సరళ అన్నారు. -
చిన్నారి కళ్ల నుంచి రాలుతున్న రాళ్లు
మన్నెగూడెం(డోర్నకల్), న్యూస్‌లైన్ : కంటిలో చిన్న నలుసు పడితేనే తట్టుకోవడం కష్టం. కళ్లలో దుమ్ము, దూళి పడితే పడే ఇబ్బంది అంతా.. ఇంతా కాదు. కానీ ఓ చిన్నారి కళ్లలో నుంచి ఏకంగా శనగ గింజ సైజులో రాళ్లు బయటపడతున్నారుు. దీంతో ఆ బాలిక పడుతు న్న బాధ వర్ణణాతీతంగా మారింది. అర గంటకోసారి నరకం అనుభవిస్తోంది. కళ్ల నుంచి రాళ్లతోపాటు రక్తం కారుతుండడం తో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. డోర్నకల్ మండలంలోని మన్నెగూడెం గ్రామానికి చెందిన తేజావత్ కృష్ణ, లక్ష్మి దంపతులు కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి కుమార్తె సాయితేజ స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. సోమవారం సాయంత్రం నుంచి సాయితేజ కళ్ల నుంచి రక్తం కారడంతోపాటు రెండు కళ్ల నుంచి రాళ్లు వస్తుండడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నా రు. ఆరు నెలల క్రితం కూడా ఇలాగే బాలిక కళ్ల నుంచి రక్తం, రాళ్లు రావడంతో తల్లిదండ్రులు ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించారు. అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎలాంటి జబ్బు లేదని తేల్చారు. రాళ్లు ఎందుకు వస్తున్నాయని అడిగితే హైదరాబాద్‌లోని పెద్దాస్పత్రికి వెళ్లాలని సూచించారు. భూత వైద్యుడిని ఆశ్రరుుంచిన తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో ఇంటికి వచ్చి భూతవైద్యుడికి చూపగా రాళ్ల రావడం ఆగిపోయాయని సాయితేజ తల్లిదండ్రులు కృష్ణ, లక్ష్మి తెలిపారు. తిరిగి రెండు రోజులుగా సాయితేజ కళ్ల నుంచి రక్తం, రాళ్లు రావడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ప్రతీ అరగంటకు ఒకసారి రెండు కళ్ల నుంచి రక్తంతోపాటు రారుు వస్తుండడంతో సాయితేజ నరకయాతన అనుభవిస్తోంది. శనగ గింజ కంటె పెద్ద పరిమాణంలో ఉన్న రాళ్లు కళ్ల నుంచి ఒక్కొక్కటిగా బయటకు వస్తుండడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కళ్ల నుంచి రాళ్లు రావడాన్ని ప్రత్యక్షంగా గమనించిన గ్రామస్తులు సాయితేజ పరిస్థితిపై విచారం వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల క్రితం కృష్ణ, లక్ష్మీ దంపతులకు చెందిన ఇల్లు అగ్నిప్రమాదానికి గురై సర్వం అగ్నికి ఆహుతవడంతో నిరాశ్రయులయ్యారు. ఇప్పుడు సాయితేజకు వింత జబ్బు రావడంతో వైద్యం చేయిం చలేని దుస్థితిలో ఉన్నామని అధికారులు, దయామయులైన దాతలు తమ కూతురికి వైద్యం చేయించేందుకు సాయం చేసి ఆదుకోవాలని సాయితేజ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.