బైక్ ఢీకొని ఇద్దరు చిన్నారులకు గాయాలు
Published Fri, Dec 4 2015 10:12 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 PM
డోర్నకల్: వరంగల్ జిల్లా డోర్నకల్ పట్టణంలోని ఎస్సీబీసీ కాలనీ వద్ద ఓ బైక్ ఢీకొని ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. స్థానిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న ఇద్దరు చిన్నారులు స్కూలుకు వెళ్తుండగా బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన ఇద్దరిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement