
హైదరాబాద్, సాక్షి: రాజేంద్రనగర్ మండలం పరిధిలో గత రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తగా ప్రారంభమైన మన్మోహన్ సింగ్ ఎక్స్‌ప్రెస్ వేపై ఓ బైక్ వేగంగా వచ్చి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

బహదూర్‌పురా-ఆరాంఘడ్ కొత్త ఫ్లై ఓవర్‌పై సోమవారం రాత్రి వేగంగా దూసుకొచ్చిన ఓ బైక్ డివైడర్‌ను ఢీ కొట్టింది. ఇద్దరు స్పాట్‌లోనే చనిపోగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ధృవీకరించారు.

మృతుల్ని బహుదూర్‌పురాకు చెందిన మాబ్, అహ్మద్, సయ్యద్‌గా గుర్తించారు. ఈ ముగ్గూరూ మైనర్లుగా పోలీసులు నిర్ధారించుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment