fly over
-
అతివేగంతో ట్రిపుల్ రైడింగ్.. స్పాట్లోనే మృతి
హైదరాబాద్, సాక్షి: రాజేంద్రనగర్ మండలం పరిధిలో గత రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తగా ప్రారంభమైన మన్మోహన్ సింగ్ ఎక్స్‌ప్రెస్ వేపై ఓ బైక్ వేగంగా వచ్చి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.బహదూర్‌పురా-ఆరాంఘడ్ కొత్త ఫ్లై ఓవర్‌పై సోమవారం రాత్రి వేగంగా దూసుకొచ్చిన ఓ బైక్ డివైడర్‌ను ఢీ కొట్టింది. ఇద్దరు స్పాట్లోనే చనిపోగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ధృవీకరించారు.మృతుల్ని బహుదూర్‌పురాకు చెందిన మాబ్, అహ్మద్, సయ్యద్గా గుర్తించారు. ఈ ముగ్గూరూ మైనర్లుగా పోలీసులు నిర్ధారించుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
తమిళనాడులో కుప్పకూలిన ఫ్లైఓవర్..
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కుప్పకూలడంతో శిథిలాల కింద వందలాది మంది కార్మికులు చికుకున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి.వివరాల ప్రకారం.. తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో అంబూర్ బస్టాండ్ ఎదురుగా చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా కూలిపోయింది. ఈ క్రమంలో వందలాది మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటనా స్థలంలో రాత్రి నుంచి సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. రెస్య్కూ టీమ్ ఇప్పటి వరకు 22 మందిని కాపాడింది. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.ఇది కూడా చదవండి: రత్న భండార్‌లో రెండో సర్వే ప్రారంభం -
‘బైరామల్ గూడ’ ఫ్లై ఓవర్‌తో.. రయ్ రయ్!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో మరో ఫ్లై ఓవర్ త్వరలో అందుబాటులోకి రానుంది. బైరామల్‌గూడ సెకండ్ లెవెల్ ఫ్లై ఓవర్ ఈ నెల 8వ తేదీన ప్రారంభమయ్యే అవకాశముంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించనున్నారు. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే నాగార్జునసాగర్ రింగ్‌రోడ్, బైరామల్‌గూడ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ చిక్కులు తగ్గుతాయి. త్వరలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని, అది వెలువడేలోగా దాదాపు వారం రోజుల్లో ఈ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత సమాచారం మేరకు ఈ నెల 8న ప్రారంభించాలని తాత్కాలికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ఫ్లైఓవర్ వినియోగంలోకి వచ్చాక శంషాబాద్ విమానాశ్రయం, ఓవైసీ హాస్పిటల్ వైపుల నుంచి విజయవాడ(చింతలకుంట వైపు), నాగార్జునసాగర్ (బీఎన్ రెడ్డి నగర్ వైపు)ల వైపు ఈ ఫ్లై ఓవర్ మీదుగా ట్రాఫిక్ జంజాటం లేకుండా వెళ్లవచ్చు. ఈ ఫ్లై ఓవర్లతోపాటు రెండు లూప్‌లు కూడా అందుబాటులోకి వస్తే ఎడమవైపు లూప్ నుంచి నాగార్జునసాగర్, చింతలకుంట వైపుల నుంచి ఎల్బీనగర్, సికింద్రాబాద్‌ల వైపు వెళ్లే వారికి సదుపాయం కలుగుతుంది. అలాగే కుడివైపు లూప్ అందుబాటులోకి వస్తే ఎల్బీనగర్ నుంచి కర్మాన్‌ఘాట్, ఐఎస్ సదన్ల వైపు వెళ్లే వారికి సౌలభ్యంగా ఉంటుంది. తద్వారా ప్రయాణ సమయం కలిసి రావడంతోపాటు వాహనదారులకు ఇంధన వ్యయం తగ్గుతుంది. వాయు, ధ్వని కాలుష్యాలు తగ్గుతాయి. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంలో క్రాష్ బారియర్స్, ఫ్రిక్షన్ శ్లాబ్స్, శ్లాబ్ ప్యానెల్స్ వంటి వాటికి ఆర్సీసీ ప్రీకాస్ట్ టెక్నాలజీ వినియోగించారు. ఎస్సార్డీపీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఫ్లైఓవర్ల నిర్మాణంతోనే నగరంలో తొలిసారిగా ఈ టెక్నాలజీని వినియోగించడం తెలిసిందే. బైరామల్‌గూడ సెకండ్ లెవెల్ ఫ్లై ఓవర్ ఇలా.. నిర్మాణ వ్యయం: రూ.148.05 కోట్లు, పొడవు: 1.78 కి.మీ, వెడల్పు ఓవైసీ వైపు (ర్యాంప్1): 12 మీటర్లు, 3లేన్. నాగార్జునసాగర్ వైపు(ర్యాంప్2): 8.5మీటర్లు, 2 లేన్. చింతల్‌కుంట వైపు(ర్యాంప్3): 8.5 మీటర్లు, 2 లేన్. ప్రయాణ మార్గం.. ఒకవైపు సిద్ధమైన బైరామల్‌గూడ ఫ్లైఓవర్ బైరామల్‌గూడ జంక్షన్ వద్ద మొదటి, రెండవ లెవెల్ ఫ్లై ఓవర్లు, లూప్స్ వినియోగంలోకి వస్తే బైరామల్‌గూడ జంక్షన్‌వద్ద 95 శాతం, నాగార్జునసాగర్ రింగ్‌రోడ్ వద్ద 43 శాతం ట్రాఫిక్ చిక్కులకు పరిష్కారం లభించనుందని ఇంజినీర్లు పేర్కొన్నారు. -
ఫ్లైఓవర్‌పై డివైడర్‌ను ఢీ కొట్టడంతో.. ఒక్కసారిగా..
సాక్షి, విశాఖపట్నం: ఉపాధి కోసం నగరానికి వచ్చిన ఇద్దరు యువకులు తెలుగుతల్లి ఫ్లైఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదానికి బలయ్యారు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఫ్లైఓవర్‌పై మలుపు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. వేగంగా వస్తూ వాహనాలను అదుపు చేయలేక ప్రమాదానికి గురవుతున్నారు. అల్లిపురం నగరంలోని తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. రెండో పట్టణ ఇన్చార్జి సీఐ రమణమూర్తి తెలిపిన వివరాలివీ.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటకు చెందిన కాపరపు శ్యామ్(21), కాపరపు రాజు అలియాస్ బాబీ(20), అనకాపల్లి జిల్లా కొత్తూరుకు చెందిన తోట హర్ష అలియాస్ నాని ఇళ్లకు సున్నాలు వేస్తూ.. తద్వారా వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గాజువాకలో సున్నాలు వేసేందుకు వచ్చిన వారు బుధవారం రాత్రి 10.45 గంటల ప్రాంతంలో ఒకే బైక్‌పై ఆర్.కె.బీచ్‌కు వెళ్లారు. తిరిగి సుమారు మూడు గంటల ప్రాంతంలో తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా గాజువాక వెళ్తున్నారు. ఈ క్రమంలో వాహనం అదుపు తప్పడంతో వంతెన చివర్లో గల మలుపు వద్ద డివైడర్‌ను బలంగా ఢీకొట్టారు. ప్రమాదంలో శ్యామ్ తలకు తీవ్ర గాయమై ఘటనా స్థలంలోనే మరణించాడు. హర్ష తలకు తీవ్ర గాయాలవడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. రాజు కాళ్లు విరిగిపోవడంతో ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. మార్గంమధ్యలోనే హర్ష ప్రాణాలు కోల్పోయాడు. రాజు ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న టూటౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. శ్యామ్, రాజులిద్దరూ అన్నదమ్ముల పిల్లలు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీపీ.. ఈ విషయం తెలుసుకున్న నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ గురువారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రమాదాలు జరగకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ ఏడీసీపీ, ఏసీపీలను ఆదేశించారు. నిబంధనలు పాటించాలి.. తెలుగుతల్లి ఫ్లైఓవర్‌పై ఎత్తు పల్లంతో కూడిన ప్రమాదకర మలుపు వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీస్ కమిషనర్ రవిశంకర్ తెలిపారు. ఫ్లైఓవర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 13 మంది మరణించారని, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఇంజినీరింగ్ వైఫల్యమే ఇందుకు కారణమని, ఈ సమస్యపై గత ఫిబ్రవరిలో జీవీఎంసీ అధికారులకు లేఖ రాసినట్లు చెప్పారు. జీవీఎంసీ అధికారులు సత్వరమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వాహన చోదకులు కూడా నిబంధనలు పాటించాలన్నారు. త్రిబుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి ప్రమాదకర, శిక్షార్హమైన డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. వాహన చోదకలు నిబంధనలు పాటించకపోవడం వల్ల వారితో పాటు పాదచారులకు భద్రత లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. -
హైదరాబాద్‌లోనే ‘టాప్’గా.. అత్యంత ఎత్తైన ఫ్లై ఓవర్..
హైదరాబాద్: నగరంలోనే అత్యంత ఎత్తులో.. మెట్రోరైలు మార్గంపైన నిర్మించిన ఫ్లై ఓవర్ త్వరలో ప్రారంభం కానుంది. వీఎస్టీ నుంచి ఇందిరాపార్కు వరకు నిర్మించిన ఈ ఫ్లై ఓవర్ ఈ నెలలో ప్రారంభం కానున్నట్లు మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో తెలపడంతో, ఇప్పటికే పూర్తయిన ఈ ఫ్లైఓవర్‌కు తుది మెరుగులద్దే పనులు చేస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ చిక్కులు తప్పించేందుకు వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ) కింద జీహెచ్ఎంసీ వివిధ ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు నిర్మిస్తోంది. వాస్తవానికి ఈపాటికే ప్రారంభం కావాల్సిన ఈ ఫ్లైఓవర్ పనుల్లో స్థల సేకరణ తదితర సమస్యలతో జాప్యం ఏర్పడింది. గుడి స్థలాన్ని సైతం సేకరించాల్సి వచ్చింది. కొద్దిరోజుల క్రితం ఈ ఫ్లైఓవర్‌ను తనిఖీ చేసిన మంత్రి కేటీఆర్.. పనులు సత్వరం పూర్తి చేయాల్సిందిగా ఆదేశించడంతో వేగం పెంచి పూర్తి చేశారు. ఎస్సార్డీపీ కింద జీహెచ్ఎంసీ ఇప్పటికే 32 పనులు పూర్తి చేసింది. ఫ్లై ఓవర్లలో ఇది 20వ ఫ్లై ఓవర్‌గా అధికారులు తెలిపారు. ఎంతో ఎత్తులో.. ఎస్సార్డీపీ కింద ఇప్పటి వరకు నిర్మించిన ఫ్లై ఓవర్లు ఒక ఎత్తయితే. ఇది మరో ఎత్తు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద ఈ ఫ్లై ఓవర్ మెట్రో మార్గాన్ని క్రాస్ చేయాల్సి ఉండటంతో మెట్రో మార్గం పైనుంచి దీన్ని తీసుకువెళ్లారు. అక్కడ భూమి నుంచి ఫ్లై ఓవర్ ఎత్తు 26 మీటర్లకు పైగా ఉందని జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ (ప్రాజెక్ట్స్)ఎం.దేవానంద్ తెలిపారు. బహుశా ఈ నెల రెండో వారంలో మున్సిపల్ మంత్రి కేటీఆర్ దీన్ని ప్రారంభించే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ పేర్కొంది. ఎస్సార్డీపీలో పొడవైన ఫ్లై ఓవర్లలో ఇది మొదటి స్టీల్ ఫ్లైఓవర్ అని తెలిపింది. దీని అంచనా వ్యయం రూ.450 కోట్లు. ఫ్లై ఓవర్ పొడవు 2.6 కి.మీ. స్టీల్‌తో నిర్మాణం నగరీకరణ, ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా నిర్మాణ సమయం తగ్గించేందుకు స్టీల్‌తో నిర్మించారు. ఖర్చు దాదాపు 30 శాతం అధికమైనప్పటికీ, 40 శాతం మేర సమయం తగ్గుతుండటంతో ట్రాఫిక్ సమస్యలున్న ప్రాంతాల్లో స్టీల్‌బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. హౌరా– కోల్కత్తా నగరాలను కలుపుతూ హుగ్లీ నదిమీద నిర్మించిన పొడవైన హౌరాబ్రిడ్జి స్టీలు బ్రిడ్జేనని అధికారులు తెలిపారు. ప్రయోజనాలు ఈ ఫ్లై ఓవర్(ఎలివేటెడ్ కారిడార్) అందుబాటులోకి వచ్చాక ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద ట్రాఫిక్ తగ్గుతుంది. సచివాలయం నుంచి హిందీ మహావిద్యాలయం, ఉస్మానియా యూనివర్సిటీ, అంబర్‌పేట, మూసారంబాగ్ల వైపు వెళ్లే వారికి ప్రయాణ సమయం కలిసి వస్తుంది. ప్రస్తుతం ట్రాఫిక్ సిగ్నళ్లున్న ఇందిరాపార్కు, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద ఎక్కడా ఆగకుండా సిగ్నల్ ఫ్రీగా వెళ్లిపోవచ్చు. -
శ్రీనివాస సేతు ప్రమాదం బాధాకరం: ఎమ్మెల్యే భూమన
సాక్షి, తిరుపతి: ఫ్లైఓవర్ పనులు చివరి దశకు చేరుకున్న తరుణంలో.. ప్రమాదం జరగడం బాధాకరమని అన్నారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణార్ రెడ్డి. శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ ప్రమాదంపై స్పందించిన ఆయన.. మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరపున ఆదుకుంటామని ప్రకటించారు. సహాయక కార్యక్రమాలు దగ్గరుండి పర్యవేక్షించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘పనులు చివరి దశకు చేరుకున్నాయి. కేవలం మూడు సెగ్మెంట్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో ట్రైల్ రన్ నిర్వహించాలని నిర్ణయించాం, ఇప్పటి వరకు చిన్న సంఘటన కూడా జరగలేదు..భగవంతుడు దయ వల్ల అంతా మంచి జరిగింది అనుకున్న తరుణంలో ఈ సంఘటన బాధాకరం. మెకానికల్ ప్రోబ్లం కారణంగా భారీ క్రేన్ కేబుల్ తెగడంతో ప్రమాదం జరిగింది. 700 టన్నుల కెపాసిటీ గల భారీ క్రేన్ 70 టన్నుల సెగ్మెంట్ లిఫ్ట్ చేస్తుండగ కేబుల్ తెగి ప్రమాదం జరిగింది. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తున్నా, ప్రభుత్వము నుంచి సహకారం అందించి ఆదుకుంటాం అని ఎమ్మెల్యే భూమన తెలిపారు. శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ ప్రమాదం భారీ క్రేన్ సిమెంట్ సెగ్మెంట్ లిఫ్ట్ చేస్తున్న సమయంలో కేబుల్స్ తెగి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సిమెంట్ సెగ్మెంట్ కింద పడి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. 70-80 టన్నుల బరువున్న సిమెంట్ సెగ్మెంట్ పడడంతో బాడీలు నుజ్జు నుజ్జు అయ్యాయి. మృతులు బీహార్ రాష్ట్రం కథియార్ జిల్లాకు చెందిన బార్థో మండల్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన అవిజిత్ ఘోష్‌గా గుర్తించారు. భారీ క్రేన్ సహాయంతో సిమెంట్ సెగ్మెంట్ ను తొలగించి.. డెడ్ బాడీ లను రుయా ఆసుపత్రికి తరలించారు. -
బోయిన్పల్లి టు బోరజ్.. నాగ్‌పూర్ హైవేపై దిద్దుబాటు చర్యలు
సాక్షి, కామారెడ్డి: ‘‘కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో టేక్రియాల్ చౌరస్తా వద్ద 2016లో రోడ్డు దాటే క్రమంలో కారును రెండు లారీలు ఢీకొట్టాయి. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తరువాత కూడా పలు ప్రమాదాలు జరిగాయి. ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలన్న డిమాండ్ ఎన్నో ఏళ్లుగా ఉంది. ఎట్టకేలకు ఇప్పుడక్కడ అండర్ పాస్ నిర్మాణం జరుగుతోంది. బ్రిడ్జి పూర్తయితే ప్రమాదాలు ఆగిపోతాయని భావిస్తున్నారు’’ ఇక్కడే కాదు.. హైదరాబాద్–నాగ్‌పూర్ కారిడార్‌గా పిలిచే 44వ నంబరు జాతీయ రహదారిపై పగలు, రాత్రి తేడా లేకుండా నిత్యం వేలాది వాహనాలు పరుగులు తీస్తుంటాయి. దీంతో రహదారిపై పలు పట్టణాలు, గ్రామాలు, చౌరస్తాల వద్ద నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు ఏడాదికేడాది పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించి, రోడ్డు ప్రమాదాలు నివారించడానికి భారత జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ (ఎన్హెచ్ఏఐ) నడుం కట్టింది. హైదరాబాద్‌లోని బోయిన్పల్లి నుంచి తెలంగాణ రాష్ట్రం ముగిసి మహారాష్ట్రలోకి ప్రవేశించే బోరజ్ దాకా బ్లాక్ స్పాట్లను గుర్తించిన ఎన్హెచ్ఏఐ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే పలు చోట్ల సర్వీస్ రోడ్ల నిర్మాణాలు, రోడ్ల మరమ్మతులు చేపట్టారు. ప్రధాన సమస్యగా ఉన్న జంక్షన్లు, కూడళ్ల వద్ద అండర్ పాస్‌లు, వంతెనల నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ఏడాది, ఏడాదిన్నర కాలంలో పనులన్నీ పూర్తి చేయాలని ఎన్హెచ్ఏఐ లక్ష్యంగా పెట్టుకుంది. బోయిన్పల్లి నుంచి బోరజ్ దాకా.... బోయిన్పల్లి నుంచి మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల మీదుగా రాష్ట్ర సరిహద్దుల్లోని బోరజ్ దాకా 44వ నంబరు జాతీయ రహదారిపై ఎన్హెచ్ఏఐ పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టింది. బోయిన్పల్లి నుంచి కాళ్లకల్ దాకా 27 కిలోమీటర్ల మేర రూ.933 కోట్ల వ్యయంతో ఆరు వరుసల రహదారిని నిర్మిస్తోంది. ఇందులో ఐదు అండర్‌పాస్‌లు, నాలుగు ఫ్లై ఓవర్లున్నాయి. సుచిత్ర, డెయిరీ ఫాం, హైటెన్షన్ రోడ్డు, దూలపల్లి, కొంపల్లి, మేడ్చల్ ప్రాంతంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తారు. మెదక్ జిల్లా పరిధిలోకి వచ్చే రెడ్డిపల్లి, జప్తి శివునూర్, గోల్డెన్ దాబా ప్రాంతాల్లో మూడు అండర్ పాస్‌లు నిర్మిస్తున్నారు. జాతీయ రహదారి నుంచి కామారెడ్డి పట్టణంలోకి ఎంటర్ అయ్యే నర్సన్నపల్లి చౌరస్తా, పట్టణం నుంచి బయటకు వెళ్లే టేక్రియాల్ చౌరస్తా వద్ద రెండు అండర్ పాస్‌లు నిర్మిస్తున్నారు. సదాశివనగర్ మండలంలోని పద్మాజివాడీ చౌరస్తా వద్ద కూడా అండర్ పాస్ నిర్మాణం పనులు మొదలయ్యాయి. నిర్మల్ జిల్లా కడ్తాల్ జంక్షన్, ఆదిలాబాద్ జిల్లాలోని గుడి హత్నూర్ జంక్షన్ల వద్ద అండర్ పాస్‌ల నిర్మాణాలు ప్రారంభించాల్సి ఉంది. రూ. పదకొండు వందల కోట్లతో.. రోడ్ల విస్తరణ, అండర్‌పాస్‌లు, సర్వీస్ రోడ్లు, ఫ్లై ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలకు రూ.పదకొండు వందల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. బోయిన్పల్లి నుంచి కాళ్లకల్ దాకా వంతెనలు, ఆరువరుసల రోడ్ల నిర్మాణానికి రూ.933 కోట్లు కేటాయించారు. రెడ్డిపల్లి, జప్తి శివునూర్, గోల్డెన్ దాబా జంక్షన్, నర్సన్నపల్లి, టేక్రియాల్, పద్మా జివాడీ చౌరస్తా, కడ్తాల్, గుడి హత్నూర్ వద్ద అండర్ పాస్‌ల కోసం దాదాపు రూ.2 వందల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. పలు అండర్ పాస్‌ల నిర్మాణ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. కామారెడ్డి జిల్లాలో నర్సన్న పల్లి, టేక్రియాల్, పద్మాజివాడీ ఎక్స్రోడ్ల వద్ద పనులు వేగంగా నడుస్తున్నాయి. మెదక్ జిల్లాలోనూ పనులు కొనసాగుతున్నాయి. ఏడాదిలోపు పూర్తి చేస్తాం... ఏడాదిలోపు పూర్తి చేయాలన్న లక్ష్యంతో 44వ నంబరు జాతీయ రహదారిపై అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు మొదలుపెట్టాం. చాలాచోట్ల సర్వీస్ రోడ్లను చేపట్టాం. హైదరాబాద్‌లో ఆరు వరుసల నిర్మాణం, ఫ్లై ఓవర్ల నిర్మాణాలు కూడా ఏడాదిన్నర లోపు పూర్తి చేస్తాం. ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగి పోతాయి. -
హైదరాబాద్‌లో మళ్లీ పోస్టర్ వార్.. అదే దారిలో బీజేపీ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి పోస్టర్ల కలకలం రేగింది. ఇప్పటి వరకు బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ వాల్ పోస్టర్ల వార్‌కు తెర తీయగా.. ఇప్పుడు అదే దారిలో బీజేపీ కౌంటర్‌కు దిగింది. ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఫ్లై ఓవర్‌కు బీజేపీ అతికించింది. ఈ క్రమంలో మళ్లీ పోస్టర్ రాజకీయం తెర మీదకు వచ్చింది. ఉప్పల్-నారపల్లి ఫ్లై ఓవర్‌పై రచ్చ కొనసాగుతోంది. మొన్న మోదీ ఫొటోలతో ఫ్లై ఓవర్ పనులు సాగడం లేదని వాల్ పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ జాప్యంపై మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించారు కొందరు వ్యక్తులు. ‘‘మోదీ గారు.. ఈ ఫ్లై ఓవర్ పనులు ఇంకా ఎన్నాళ్లు? తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం’’ అని వెలిసిన పోస్టర్లు దారి పొడవునా ఏర్పాటు చేశారు. కాగా, వాస్తవాలు తెలుసుకోవాలంటూ ఒక దిన పత్రికలో వచ్చిన వార్తతో వాల్ పోస్టర్ వెలిసింది. ఉప్పల్‌లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీవీఎస్ ప్రభాకర్ ర్యాలీ నిర్వహించి, ధర్నాకు దిగారు. ఫ్లై ఓవర్ పనుల ఆలస్యానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడమే కారణమని బిజేపీ నేత ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. చదవండి: ‘మోదీగారు.. ఇంకెన్నాళ్లూ?’ ఉప్పల్ తిప్పల్‌పై పిల్లర్లకు పోస్టర్లు -
ఉప్పల్ తిప్పల్.. మోదీ పోస్టర్ల కలకలం
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి పోస్టర్ల కలకలం రేగింది. ఉప్పల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పోస్టర్లు వెలిశాయి. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ జాప్యంపై మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించారు గుర్తు తెలియని వ్యక్తులు. ‘‘మోదీ గారు.. ఈ ఫ్లై ఓవర్ పనులు ఇంకా ఎన్నాళ్ళు? తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం’’ అని వెలిసిన పోస్టర్లు దారి పొడవునా కనిపిస్తున్నాయి. ఉప్పల్ నుండి ఘట్కేసర్ వెళ్ళే వరంగల్ హైవే పై కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ ఫ్లై ఓవర్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత ఐదేళ్లలో సగం పనులు కూడా పూర్తి కాలేదు. దీంతో.. ఆ రూట్లో నిత్యం ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. పనులు నడుస్తుండడంతో సాయంత్రం వేళ్ల ఉప్పల్, మేడిపల్లి మధ్య ప్రయాణం గంటకు పైనే పడుతోంది. హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్లేవారు ఉప్పల్ రింగ్‌రోడ్డు, బోడుప్పల్, మేడిపల్లి, చెంగిచర్ల చౌరస్తాల వద్ద తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారాంతాల్లో అయితే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటోంది. దీంతో వాహనదారులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు పోస్టర్ రాజకీయం తెర మీదకు వచ్చింది. ఉప్పల్ వరంగల్ హైవేపై.. ఉప్పల్ - మేడిపల్లి మధ్య ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు భారత్‌మాల పథకం కింద రూ.626.80 కోట్ల వ్యయంతో 6.2 కిలోమీటర్ల దూరంతో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. ఉప్పల్ జంక్షన్ నుంచి మేడిపల్లి సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ దాకా ఈ ఫ్లైఓవర్ వేయాలని భావించింది కేంద్రం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. 2018 మేలో ఈ ఫ్లైఓవర్‌కు శంకుస్థాపన చేశారు. జూలైలో పనులు ప్రారంభం కాగా.. 2020 జూన్ వరకు నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చేపట్టిన.. ఈ 45 మీటర్ల ఆరులేన్ల కారిడార్ పనులు నెమ్మదిగా సాగుతోంది. మరోవైపు ఈ నిర్మాణ పనులతో ఉన్న రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. కారిడార్ పనులు పూర్తయితేనే రోడ్డు పనులు పూర్తిచేస్తామని అధికారులు అంటున్నారు. దీంతో ప్రజలు నిత్యం నరకయాతన పడుతున్నారు. హైదరాబాద్ లో మళ్ళీ పోస్టర్ల కలకలం ఉప్పల్ - నారపల్లి ఫ్లైఓవర్ 5 ఏండ్లు అయినా 40% పూర్తి కాలేదు.. ఇంకా ఎన్ని సంవత్సరాలు కడతారు మోడీ గారు అంటూ ఫ్లైఓవర్ పిల్లర్లపై వెలసిన పోస్టర్లు.#ModiDisasterForIndia#ModiHataoDeshBachao pic.twitter.com/tAXRBbull3 — Latha (@LathaReddy704) March 28, 2023 -
హైదరాబాద్: మార్చి నాటికి మరో నాలుగు ప్రాజెక్టులు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ) కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో మరో నాలుగు ప్రాజెక్టులు వచ్చే మార్చిలో ప్రారంభం కానున్నాయి. బహదూర్‌పురా ఫ్లై ఓవర్, ఎల్బీనగర్ కుడివైపు అండర్‌పాస్, తుకారాంగేట్ ఆర్‌యూబీలు ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే ప్రకటించిన జీహెచ్ఎంసీ.. తాజాగా బైరామల్‌గూడ ఎడమవైపు ఫ్లై ఓవర్ సైతం మార్చిలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. దీంతో ఎస్సార్డీపీలో భాగంగా నాలుగు అభివృద్ధి ఫలాలతో ప్రజలకు ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గనున్నాయి. బైరామల్‌గూడ కుడివైపు ఫ్లై ఓవర్ 2020 ఆగస్టులో అందుబాటులోకి వచ్చింది. ఎడమవైపు ఫ్లై ఓవర్ వచ్చేనెల రెండో వారంలో అందుబాటులోకి రానున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. వీలును బట్టి మిగతా మూడు ప్రాజెక్టులు కూడా వచ్చే నెలలోనే ప్రారంభించనున్నట్లు తెలిపింది. పనులు తుదిదశలో ఉన్నాయని తెలిపిన అధికారులు వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టారు. చదవండి: వెలుగులోకి ‘వెబ్ సిరీస్ సూరి’ మరో వ్యవహారం బైరామల్‌గూడ కుడివైపు ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే ఒవైసీ జంక్షన్ వైపు నుంచి ఉప్పల్ జంక్షన్ వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు, సిగ్నల్ చిక్కులు ఉండవు. ప్రయాణవేగం పెరుగుతుంది. ప్రయాణ సమయం, వాహనాల ఇంధన,నిర్వహణ వ్యయం కూడా తగ్గుతాయని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. ఎస్సార్డీపీలో భాగంగా ప్రభుత్వం రూ. 25వేల కోట్లకు పైగా ఖర్చయ్యే ఫ్లై ఓవర్లు, మేజర్ కారిడార్లు, స్కైవేలు, అండర్‌పాస్‌లు, మేజర్ కారిడార్లు, ఆర్ఓబీలు,ఆర్‌యూబీలు, తదితరమైన వాటి నిర్మాణం చేపట్టడం తెలిసిందే. వాటిల్లో పూర్తయిన పనులతో ఆయా మార్గాల్లో సాఫీ ప్రయాణంతో ట్రాఫిక్ చిక్కులు తగ్గాయని జీహెచ్ఎంసీ పేర్కొంది. బైరామల్ గూడ ఫ్లై ఓవర్.. అంచనా వ్యయం : రూ. 28.64 కోట్లు ఫ్లై ఓవర్ పొడవు : 780 మీటర్లు వెడల్పు :12.50 మీటర్లు లేన్లు : 3 ప్రయాణం : ఒక వైపు -
శ్రీనివాస సేతుపై స్మార్ట్ జర్నీ! వాహనాలకు అనుమతి
-
విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్-2 ను ప్రారంభించిన నితిన్ గడ్కరి,సీఎం వైఎస్ జగన్
-
రేపు బెంజ్ సర్కిల్ వెస్ట్ సైడ్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్న సీఎం వైఎస్ జగన్ నితిన్ గడ్కరి
-
పంజగుట్ట కేబుల్ బ్రిడ్జి ప్రారంభానికి సర్వం సిద్ధం
సాక్షి, బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం. 1/3లోని పంజగుట్ట శ్మశాన వాటిక పాత ద్వారాన్ని తొలగించి నూతన కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో శ్మశాన వాటికకు వెళ్లేందుకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి. పాత గేటు నుంచి హైటెన్షన్ విద్యుత్ పోల్ వరకు చేసిన విస్తరణతో నాగార్జున సర్కిల్ నుంచి కేబీఆర్ పార్కు జంక్షన్‌కు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా ఉంటుంది. గ్రేవియార్డ్‌కు వెళ్లేందుకు ఇబ్బందులు తీరుతాయి. ఇందుకోసం జీహెచ్ఎంసీ రూ.17 కోట్లు మంజూరు చేసింది. కేబుల్ బ్రిడ్జి, పాత గేటు నుంచి హెచ్‌టీ లైన్ వరకు రోడ్డును విస్తరించడంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మార్గం సుగమమైంది. ఈ బ్రిడ్జిని గురువారం ఉదయం 10 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించనున్నారు. చదవండి: హైదరాబాద్: చలో అంటే చల్తా నై! -
యునెస్కో ‘భాగ్యం’ దక్కాలి
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌కు తీసిపోనిరీతిలో చారిత్రక సంపద ఉన్న హైదరాబాద్‌కు యునెస్కో హెరిటేజ్ సిటీగా గుర్తింపు తీసుకురావాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. రూ.333.50 కోట్లతో 2.71 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ‘రాయదుర్గం–షేక్‌పేట్’ ఫ్లైఓవర్‌ను శనివారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో చార్మినార్ మొదలు గోల్కొండ వరకు ఎన్నో అద్భుతమైన చారిత్రక కట్టడాలు ఉన్నాయన్నారు. రసూల్‌పుర జంక్షన్ వద్ద కేంద్ర హోంశాఖకు సం బంధించిన స్థలం అందించి ఫ్లైఓవర్ నిర్మాణానికి సహకరించాలని కిషన్‌రెడ్డిని కోరారు. కంటోన్మెంట్ లో మిలటరీ అధికారులు మూసేసిన 21 రోడ్లను తెరిపించే బాధ్యతను తీసుకోవాలన్నారు. హైదరా బాద్‌కు అనుసంధానంగా ఉన్న 8 జాతీయ రహదా రుల వెంట అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నా మని పేర్కొన్నారు. ఎస్ఆర్డీపీలో ఫ్లైఓవర్లు, అం డర్పాస్లు, గ్రేడ్ సెపరేటర్లు తదితర 24 ప్రాజెక్ట్‌లు పూర్తి అయ్యాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా 11వ, జనాభా పరంగా 12వ స్థానం, దేశానికి సంపద అందించడంలో 4వ స్థానంలో ఉందని ఇటీవల రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన నివేదికలో పేర్కొనట్లు కేటీఆర్ వెల్లడించారు. రూ.100 కోట్లతో ఔటర్‌రింగ్ రోడ్డును ఎల్ఈడీ లైట్ల వెలుగులతో దేశంలో ఏ నగరానికి లేనంతగా ఒక మణిహారంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ తెలంగాణకు మకుటం... కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్)కు అనుమతించామని, స్థలసేకరణ సేకరణ వేగవంతంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఆర్ఆర్ఆర్ తెలంగా ణకు మకుటం లాంటిదని, గేమ్ ఛేంజర్‌గా మారు తుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణకు మరిన్ని జాతీయ రహదారులు మంజూరయ్యాయని, త్వరలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని తెలిపారు. హైదరా బాద్‌లో సైన్స్ సిటీ నిర్మాణానికి 25 ఎకరాల స్థలం కేటాయించాలని సీఎంకు లేఖ రాశానన్నారు. ఎస్సార్డీపీ ద్వారా చేసిన పలు పనులకు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు ఖర్చు చేసిందని, మరిన్ని పనులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి ద్వారా రూ.10 వేల కోట్లను స్పెషల్ ప్యాకేజీ కింద ఇప్పించాలని కిషన్‌రెడ్డిని మంత్రి తలసాని శ్రీని వాస్‌యాదవ్ కోరారు. కార్యక్రమంలో రాష్ట్రమం త్రులు మహుమూద్ అలీ, సబితాఇంద్రారెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్ అరికపూడి గాంధీ, ఎమ్మెల్సీలు మహేందర్‌రెడ్డి, సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, కార్పొరేటర్లు పాల్గొన్నారు. అప్పటి చీఫ్ ఇంజనీర్‌కు గుర్తింపు షేక్‌పేట ఫ్లై ఓవర్‌ను ప్రారంభించే అవకాశాన్ని ఈఎన్సీకి ఇచ్చి మునిసిపల్ మంత్రి కేటీఆర్ పనిచేసేవారికి గుర్తింపునిచ్చారు. జీహెచ్ఎంసీలో ఎస్సార్డీపీ ద్వారా పూర్తి చేసిన 24 పనుల్లో కీలకపాత్ర పోషించిన అప్పటి చీఫ్ ఇంజనీర్, ప్రస్తుతం రాష్ట్ర ప్రజారోగ్యశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్‌గా ఉన్న శ్రీధర్ రుమాండ్లతో రిబ్బన్ కట్ చేయించి ఈ ఫ్లై ఓవర్‌ను ప్రారంభోత్సవం చేయించారు. -
శభాష్.. పోలీస్.. 30నిమిషాల వ్యవధిలోనే
మంచిర్యాలక్రైం: 100డైల్ కాల్స్ ఫిర్యాదుతో స్పందించిన బ్లూ కోల్ట్స్ పోలీసులు వెంటనే స్పందించి 30నిమిషాల వ్యవధిలో తప్పిపోయిన బాలున్ని కుటుంబ సభ్యులకు అప్పగించి శభాష్ బ్లూ కోల్ట్స్ అనిపించుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే... జన్నారం మండలం గంగవ్వకు చెందిన బంధువులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని చూసేందుకు గంగవ్వ తన 7సంవత్సరాల కుమారుడితో కలిసి మంగళవారం ఆసుపత్రికి వచ్చింది. గంగవ్వ ఆసుపత్రిలో బంధువులతో మాట్లాడుతుండగా బాలుడు అక్కడి నుంచి కనిపించకుండా పోయాడు. ఖంగు తిన్న గంగవ్వ కుటుంబ సభ్యులకు సమాచారం అందించి స్థానికుల సలహాలు, సూచనల మేరకు 100డైల్కు ఫోన్ చేసి చెప్పడంతో క్షణంలోనే స్పందించిన సీఐ నారాయణ్‌నాయక్ బ్లూ కోల్ట్స్ పోలీసులను అప్రమత్తం చేసి గాలించారు. రంగంలోకి దిగిన బ్లూ కోల్ట్స్ సిబ్బంది ఉస్మాన్పాష, తిరుపతి ఐబీ ప్రాంతం నుంచి ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో పరిశీలించగా ఐబీ వైపు నుంచి ఫ్లై ఓవర్ బ్రిడ్జి వైపు ఏడుస్తూ వెళ్తున్న బాలున్ని గమనించి, అదుపులోకి తీసుకున్నారు. ఆ బాలున్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో బ్లూ కోల్ట్స్ సిబ్బందిని స్థానికులు, అధికారులు అభినందించారు. -
10న బెంజి సర్కిల్ రెండో ఫ్లైఓవర్ ప్రారంభం
ఆటోనగర్ (విజయవాడ తూర్పు): అనతి కాలంలో నిర్మాణ పనులు పూర్తి అయిన బెంజి సర్కిల్ రెండో ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఈ నెల 10న సీఎం వైఎస్ జగన్, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నట్టు జిల్లా కలెక్టర్ జె.నివాస్ చెప్పారు. రవాణా, ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వి.ప్రసన్నతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఫ్లైఓవర్ బ్రిడ్జిని, ప్రారంభోత్సవ ఏర్పాట్లును శనివారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 10న ఉదయం 11 గంటలకు బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని సీఎం, కేంద్ర మంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తారన్నారు. విజయవాడలోని స్క్రూ బ్రిడ్జి జంక్షన్ నుంచి నోవాటెల్ హోటల్ మధ్య రూ.88 కోట్లతో 2.47 కి.మీ. మేర అనుకున్న సమయానికే నిర్మించారన్నారు. దీని వల్ల ఆ మార్గంలోని పలు జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందన్నారు. -
ట్రాఫిక్ కష్టాలకు చెక్.. బాలానగర్ ఫ్లై ఓవర్ సిద్ధం!
సాక్షి, బాలానగర్: బాలానగర్ డివిజన్లోని నర్సాపూర్ చౌరస్తా రద్దీగా ఉండే నాలుగు రోడ్ల కూడలి. కూకట్పల్లి, సికింద్రాబాద్, జీడిమెట్ల వెళ్లే రహదారి. పారిశ్రామిక కేంద్రం కావటంతో నిత్యం వేలాది వాహనాల రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి. బాలానగర్‌లో ట్రాఫిక్ దాటితే చాలు అని ప్రజలు అనుకుంటారు. అంతగా ఉంటుంది రద్దీ. ఇక్కడి ప్రజలకు ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారం చూపారు. బాలానగర్ ఫ్లై ఓవర్ నిర్మించారు. రయ్ రయ్‌న బాలానగర్‌పై ఓవర్ బ్రిడ్జిపై వాహనాలు పరుగులు తీయడానికి అంతా సిద్ధం చేశారు. ఈ నెల 6న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. సాకారమిలా.. 2017 ఆగస్టు 21న బాలానగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ.385 కోట్లతో మూడున్నరేళ్ల వ్యవధిలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు. బ్రిడ్జి ఇరువైపులా రెండు డివిజన్లు ఉన్నాయి. ఒకటి ఫతేనగర్, మరొకటి బాలానగర్. రెండు డివిజన్లతో వందలాది పరిశ్రమలు ఉన్నాయి. దీంతో నిత్యం కార్మికులు, లారీలు, ఆటో ట్రాలీలతో రద్దీగా ఉంటుంది. బ్రిడ్జి పొడవు 1.13 కిలోమీటర్లు, 24 మీటర్లు వెడల్పు 26 పిల్లర్లతో నిర్మించారు. ఈ బ్రిడ్జికి ఒక ప్రత్యేకత ఉంది. హైదరాబాద్ నగరంలోని అతి ప్రధాన రహదారుల్లో ఒకటి, 6 లేన్లతో సిటీలోనే నిర్మించిన మొట్టమొదటి బ్రిడ్జి ఇది. 2050 సంవత్సరం వరకు ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని నిర్మాణం చేశారు. దీనికి బాబూ జగజ్జీవన్‌రామ్ బ్రిడ్జిగా నామకరణం చేయనున్నారు. ప్రజలకిచ్చిన హామీని నెరవేర్చాం.. బాలానగర్, ఫతేనగర్ డివిజన్ల ప్రజలకిచ్చిన హామీని నెరవేర్చాం. గత 40 సంవత్సరాలు ప్రజలు ట్రాఫిక్ బాధలు పడ్డారు. ట్రాఫిక్ సమస్య తీరనుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేశాం. – మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్యే బాలానగర్ రూపురేఖలే మారిపోయాయి.. ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యాయి. వాహనదారులకు అందుబాటులోకి వచ్చింది. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాం. ఈ బ్రిడ్జి నిర్మాణంతో బాలానగర్ రపురేఖలే మారిపోయాయి. – యూసఫ్ హుస్సేన్, హెచ్ఎండీఏ ఎస్ఇ∙ -
మాదాపూర్‌లో జాగ్వార్ కార్ హల్చల్.. ఒకరు మృతి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో శనివారం రాత్రి జాగ్వార్ కారు బీభత్సం సృష్టించింది. మాదాపూర్ ఫ్లై ఓవర్ వద్ద పాదచారుడిపై దూసుకెళ్లింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. సంఘటన తెలుసుకున్న వెంటనే పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కేపీహెచ్ కాలనీ నుంచి మాదాపూర్ వైపు జాగ్వార్ కారు శనివారం రాత్రి 9 గంటల సమయంలో అతి వేగంగా దూసుకుంటూ వచ్చింది. ఈ సమయంలో రోడ్డు దాటుతున్న వ్యక్తిని వేగంతో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కర్ఫ్యూ అమల్లో ఉండడంతో రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. దీంతో కారులో ఉన్న వ్యక్తి వేగంగా నడుపుతూ నిబంధనలు అతిక్రమించాడు. అసలు కర్ఫ్యూ సమయంలో బయటకు ఎందుకు వచ్చాడు? అనేది తెలియాల్సి ఉంది. చదవండి: తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు చదవండి: ఒకేసారి నాలుగు ప్రాణాలు: కుటుంబాన్ని చిదిమేసిన కరోనా -
జైపూర్‌లో ఆడి కారు బీభత్సం
జైపూర్ : రాజస్తాన్‌లోని జైపూర్‌లో శుక్రవారం ఉదయం ఆడి కారు బీభత్సం సృష్టించింది.రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు వేగంగా ఢీకొట్టడంతో ఫ్లైఓవర్‌పై నుంచి కింద ఉన్న ఒక బిల్డింగ్ టాప్రూఫ్పై ఎగిరిపడ్డాడు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కారు వేగంగా నడిపి వ్యక్తి మరణానికి కారణమైన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 'రాజస్తాన్‌లోని పాలి ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల మాదా రామ్ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలకు ప్రిపేరవుతున్నాడు. ఈ నేపథ్యంలో పోలీస్ రిక్రూట్మెంట్కు సంబంధించిన పరీక్షకు హాజరయ్యేందుకు శుక్రవారం ఉదయం మాదా రామ్ జైపూర్ వచ్చాడు. ఉదయం 8గంటల ప్రాంతంలో మాదా రామ్ జైపూర్‌లోని సోడాలా ప్రాంతంలో ఉన్న ఫ్లైఓవర్ రోడ్డును దాటేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో ఫ్లైఓవర్‌పై వేగంగా వస్తున్న ఆడి కారు అదుపు తప్పి మాదారామ్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో మాదా రామ్ ఫ్లైఓవర్‌పై నుంచి పక్కన ఉన్న బిల్డింగ్ రూఫ్‌టాప్ మీదకు ఎగిరిపడ్డాడు. గాయాలు బలంగా తగలడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడని' తెలిపారు. కారును వేగంగా నడిపిన నేహా సోని అనే మహిళతో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా మాదారామ్ కుటుంబసభ్యులు జైపూర్‌కు చేరుకున్న తర్వాత పోస్ట్‌మార్టం నిర్వహిస్తామని పోలీసులు వెల్లడించారు. #Rajasthan | A man was killed after being hit by a speeding Audi car in #Jaipur on Friday. According to the details, the accident was reported today morning in Jaipur's Sodala area, where the deceased suffered serious wounds and succumbed to his injuries. (Disturbing Visual) pic.twitter.com/vZvKd5rgT7 — First India (@thefirstindia) November 6, 2020 -
హవ్వా! మస్కా కొట్టకు మంత్రీజీ
పట్నా: ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిహార్ మంత్రి సురేష్ కుమార్ శర్మ నవ్వులపాలయ్యారు. అర్బన్ డెవలప్మెంట్, హౌజింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన ముజఫర్‌పూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముజఫర్‌పూర్ అభివృద్ధికి కృషి చేస్తున్నాని చెబుతూ సురేష్ చేసిన ట్వీట్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ముజఫరాపూర్ లైట్ యోజనా’ అంటూ ఓ ఫొటో షేర్ చేసిన ఆయన.. భారీ వ్యయంతో నిర్మించిన రోడ్లపై 17,554 వీధి దీపాలను ఏర్పాటు చేశామని గొప్పగా చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీతో పాటు ఉన్న పోస్టర్ తయారు చేయించి ట్విటర్లో పోస్టు చేశారు. అయితే, మంత్రి షేర్ చేసిన రోడ్డు, స్ట్రీట్ లైట్ల ఫొటో ఫేక్ అని తేలింది. రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా విషయం బయటపడటంతో నెటిజన్లు మంత్రిని ఏకి పారేస్తున్నారు. ఆయన షేర్ చేసింది హైదరాబాద్‌లోని బైరామల్‌గూడ ఫ్లైఓవర్ అని పేర్కొంటూ.. మంత్రి కేటీఆర్ ట్వీట్‌ను సురేష్‌కు ట్యాగ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఫ్లైఓవర్ ఫొటోలతో మస్కా కొట్టిస్తావా అంటూ తిట్టిపోస్తున్నారు. కాగా, బైరామల్‌గూడ జంక్షన్ వద్ద కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ ఆగస్టు 9న ప్రారంభించారు. 780 మీటర్ల వెడల్పైన ఈ ఫ్లైఓవర్ నిర్మాణ వ్యయం 26.5 కోట్లు. Happy to be throwing open yet another flyover in #Hyderabad tomorrow that has been completed as part of #SRDP (Strategic Road Development Plan) RHS flyover at Bairamalguda junction, 780 mt long coating 26.5Cr@bonthurammohan @CommissionrGHMC pic.twitter.com/nb0OLqRYvC — KTR (@KTRTRS) August 9, 2020 -
హర్యానాలో అర్థరాత్రి కూలిన ఫ్లై ఓవర్
గురుగ్రామ్ : హర్యానాలోని గురుగ్రామ్‌లో శనివారం అర్థరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి సోహ్నా రోడ్డులో 6 కిమీ మేర నిర్మిస్తున్న ఫ్లైఓవర్ ఆకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మాత్రమే గాయపడ్డారని.. వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫ్లైఓవర్ శిధిలాలను తొలగించే పనులు జరుగుతున్నాయి. ఘటన జరిగిన సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ లేని కారణంగా పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అమన్ యాదవ్ తెలిపారు. రాజీవ్ చౌక్ నుంచి గురుగ్రామ్‌లోని సోహ్నా వరకు 6కిమీ మేర ఈ ఫ్లైఓవర్‌ను రెండు వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టును ఓరియంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ చేపట్టింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఫ్లైఓవర్‌లోని ఎలివేటెడ్ రోడ్డులోని కొంత భాగం కూలిపోయిందని కంపెనీ ప్రాజెక్ట్ హెడ్ శైలేష్ సింగ్ తెలిపారు. కాగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణ నాణ్యతపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
బాలానగర్ ఫ్లైఓవర్ పనులకు బ్రేక్
సాక్షి, సిటీబ్యూరో: నగరవాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చే బాలానగర్ ఫ్లైఓవర్ పనులకు కరోనా కారణంగా బ్రేక్ పడింది. పనులకు ఆదిలో ఆస్తుల సేకరణతో ఆలస్యం కాగా.. లాక్డౌన్ నేపథ్యంలో పనులు వేగిరంగా సాగాయి. ప్రస్తుతం సిబ్బందిని కరోనా వెంటాడుతోంది. పనులు చేస్తున్న బీఎస్సీపీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, ప్రాజెక్ట్ మేనేజర్, కిందిస్థాయి సిబ్బందితో పాటు దాదాపు 10 మందికిపైగా కోవిడ్ నిర్ధారణ అయినట్లు సమాచారం. దీంతో పనుల్లో వేగిరం తగ్గింది. మిగిలిన 40 మందిలోనూ కలవరం మొదలవడంతో వారికి కూడా కరోనా టెస్టులు చేస్తున్నారు. అక్టోబర్ నాటికి ఫ్లైఓవర్ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మరింత ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది. . కొనసాగుతున్న స్లాబ్ వర్క్.. బాలానగర్‌లోని శోభనా థియేటర్ నుంచి ఐడీపీఎల్ వరకు 1.13 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల ఫైఓవర్ నిర్మాణానికి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) రూ.387 కోట్లు కేటాయించింది. ఆస్తుల సేకరణకు రూ.265 కోట్లు, నిర్మాణానికి రూ.122 కోట్లు వ్యయం చేస్తోంది. 2017 ఆగస్టు 21న ఫ్లైఓవర్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. దాదాపు రెండేళ్లకుపైగా ఆస్తుల సేకరణ జరగడంతో ఆ తర్వాత ఇంజినీరింగ్ పనులు మొదలయ్యాయి. ఇటీవల లాక్డౌన్ కాలంలో కమిషనర్ అర్వింద్‌కుమార్ ఆదేశాల మేరకు పనుల్లో వేగిరం పెంచారు. మొత్తం 26 పిల్లర్ల నిర్మాణం పూర్తయ్యింది. మూడు స్లాబ్‌లు పూర్తి చేశారు. మిగిలిన పనులు కొనసాగుతున్న క్రమంలోనే కాంట్రాక్ట్ చేపట్టిన కంపెనీ సిబ్బందికి కరోనా రావడంతో మిగిలినవారిలో అలజడి మొదలైంది. దీనిపై హెచ్ఎండీఏ ఇంజినీరింగ్ విభాగం అధికారులు మాట్లాడుతూ.. కొంతమంది సిబ్బందికి కరోనా వచ్చినట్టుగా తెలిపారు. అక్టోబర్ ఆఖరునాటికి ఫ్లైఓవర్ పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. -
ప్లైఓవర్‌పై రయ్ రయ్..
-
మరో రెండు.. కొత్త ఫ్లైఓవర్లు
సాక్షి, సిటీబ్యూరో: సినిమా హాళ్ల జంక్షన్‌గా ప్రసిద్ధి చెందిన ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, దానికి కొద్ది దూరంలోని వీఎస్టీ జంక్షన్, రాంనగర్, బాగ్‌లింగంపల్లిలలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి రెండు స్టీల్‌బ్రిడ్జిలు నిర్మించనున్నారు. ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు మొదటి దశలో, ఫస్ట్ లేన్‌గా నిర్మించే నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ అంచనా వ్యయం రూ.350 కోట్లు. రాంనగర్ నుంచి బాగ్‌లింగంపల్లి వరకు దాదాపు కిలోమీటరు పొడవున సెకండ్ లెవెల్లో రెండో దశలో నిర్మించే ఫ్లైఓవర్ అంచనా వ్యయం రూ.76 కోట్లు. ఈ రెండింటికీ కలిపి మొత్తం రూ.426 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనులకు మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఈ నెల 11న శంకుస్థాపనచేయనున్నట్లు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. స్టీల్ బ్రిడ్జిల వివరాలు.. ♦ ఇందిరాపార్కు– వీఎస్టీ ఎలివేటెడ్ కారిడార్ ♦ ఇందిరాపార్కు నుంచి ఎన్టీఆర్ స్టేడియం, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ మీదుగా వీఎస్టీ(ఆజామాబాద్) వరకు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ ఇది. పొడవు: 2.6 కి.మీ. లేన్లు : 4 (16.60 మీటర్లు), రెండు వైపులా ప్రయాణం. వ్యయం : రూ.350 కోట్లు డిజైన్ స్పీడ్ : 40 కేఎంపీహెచ్ పనులకు పట్టే సమయం: 2 సంవత్సరాలు. ప్రయోజనాలు: ♦ ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ జంక్షన్ వరకు ట్రాఫిక్ చిక్కులుండవు. ♦ ప్రయాణ సమయం తగ్గుతుంది. ♦ హిందీ మహా విద్యాలయ, ఉస్మానియా యూనివర్సిటీల వైపు ట్రాఫిక్ సమస్య తొలగడంతో పాటు ప్రయాణ సమయం తగ్గుతుంది. ♦ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ జంక్షన్లో ట్రాఫిక్‌కు ఉపశమనం కలుగుతుంది. ♦ ఇందిరాపార్క్ క్రాస్‌రోడ్స్, అశోక్‌నగర్ క్రాస్ రోడ్స్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, బాగ్‌లింగంపల్లిల వద్ద ట్రాఫిక్ ఇక్కట్లు తొలగుతాయి. రాంనగర్– బాగ్‌లింగంపల్లి ఫ్లైఓవర్ ♦ సెకండ్ లెవెల్లో నిర్మించే ఫ్లైఓవర్ ఇది. రాంనగర్ నుంచి వయా వీఎస్టీ మీదుగా బాగ్‌లింగంపల్లి వరకు. పొడవు: 0.850 కి.మీ. లేన్లు: 3 లేన్లు (16.60 మీ), రెండు వైపులా ప్రయాణం వ్యయం: రూ.76 కోట్లు డిజైన్ స్పీడ్: 30 కేఎంపీహెచ్ పనుల పూర్తి: 2 సంవత్సరాలు. ప్రయోజనాలు: ♦ రాంనగర్ నుంచి బాగ్‌లింగంపల్లి వరకు ట్రాఫిక్ రద్దీ సమస్య తొలగి ట్రాఫిక్ ఫ్రీ ఫ్లోగా మారుతుంది. ♦ బాగ్‌లింగంపల్లి, వీఎస్టీల వద్ద ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. ♦ వాహనదారుల సమయం ఆదా అవుతుంది. వాహనదారులకుఎంతో సదుపాయం ఇందిరాపార్కు– వీఎస్టీ ఎలివేటెడ్ కారిడార్‌ను మొదటి దశలో, రాంనగర్– బాగ్‌లింగంపల్లి ఫ్లై ఓవర్‌ను రెండో దశలో నిర్మించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ రెండూ అందుబాటులోకి వస్తే దిల్సుఖ్నగర్, సికింద్రాబాద్ ప్రాంతాల నుంచి సచివాలయం, లక్డికాపూల్‌ల మీదుగా నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే వారి రాకపోకలకు ఎంతో సదుపాయంగా ఉంటుందని అధికారులు తెలిపారు. -
ఎల్బీనగర్ అండర్‌పాస్.. ఈజీ జర్నీ..
సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్‌లోని ఈస్ట్‌జోన్‌లో సాగర్‌రింగ్ రోడ్, ఎల్బీనగర్ జంక్షన్, కామినేని జంక్షన్, ఉప్పల్ జంక్షన్లు అత్యంత రద్దీ ప్రాంతాలు. విజయవాడ, నాగార్జునసాగర్, శంషాబాద్ విమానాశ్రయం వైపుల నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు రావాలన్నా..తిరిగి వెళ్లాలన్నా ట్రాఫిక్ రద్దీతో ప్రయాణం నరకప్రాయం. ఈ సమస్యల పరిష్కారానికి ఎస్సార్డీపీ ఫేజ్ వన్ ప్యాకేజీ–2లో భాగంగా వివిధ జంక్షన్ల వద్ద ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, లూప్‌ల వంటి వివిధ పనులకు శ్రీకారం చుట్టారు. మొత్తం 14 పనుల్లో గురువారం ప్రారంభమైన రెండింటితో సహా ఇప్పటికి ఐదు పనులు పూర్తయ్యాయి. దీంతో ట్రాఫిక్‌కు కొంత మేరఉపశమనం లభించింది. మిగతావన్నీ పూర్తయితే సికింద్రాబాద్, ఉప్పల్, నాగోల్, దిల్సుక్నగర్ల నుంచి నుంచి నల్లగొండ, విజయవాడల వైపు, అలాగే నాగార్జునసాగర్, శంషాబాద్ వైపు వెళ్లేవారికి.. ఆప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చే వారికి సిగ్నల్ జంజాటాల్లేని ప్రయాణం సాధ్యం కానుంది. పూర్తయి వినియోగంలోకి వచ్చినవి ♦ ఎల్బీనగర్ ఎడమవైపు ఫ్లై ఓవర్, కామినేని వద్ద రెండు ఫ్లై ఓవర్లు, ఎల్బీనగర్ వద్ద ఎడమవైపు అండర్‌పాస్, చింతల్‌కుంట వద్ద అండర్‌పాస్ పూర్తి కావాల్సినవి.. ♦ ఎల్బీనగర్ కుడివైపు ఫ్లై ఓవర్ ♦ ఎల్బీనగర్ వద్ద కుడివైపు అండర్‌పాస్ ♦ బైరామల్ గూడ వద్ద ఫస్ట్ లెవెల్లో కుడి, ఎడమ ఫ్లై ఓవర్లు ♦ బైరామల్ గూడ వద్ద సెకెండ్ లెవెల్లో ఫ్లై ఓవర్ ♦ బైరామల్ గూడ వద్ద కుడి, ఎడమవైపుల లూప్‌లు ♦ కామినేని అండర్‌పాస్ నాగోల్ జంక్షన్ వద్ద ఆరులేన్ల ఫ్లై ఓవర్ ట్రాఫిక్ రద్దీ ఇలా.. ఈస్ట్‌జోన్‌లోని ఆయా జంక్షన్ల వద్ద భవిష్యత్‌లో ట్రాఫిక్ రద్దీని ట్రాఫిక్ నిపుణులు అంచనా వేశారు. ఆమేరకు.. 2034 నాటికి రద్దీ సమయాల్లో గంటకు ఉండే ట్రాఫిక్ పీసీయూ.. పూర్తయిన, పూర్తి కావాల్సిన పనుల అన్నింటి అంచనా వ్యయం :రూ. 448 కోట్లు -
బేఫికర్ జర్నీ
సాక్షి, సిటీబ్యూరో: గతంలో అరుదుగా మాత్రమే నిర్మాణమయ్యే ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నాలుగైదేళ్లుగా వేగం పుంజుకున్నాయి. బహుశా ఎవరూ ఊహించని విధంగా ఎస్సార్డీపీ పథకంలో భాగంగా పనులు పూర్తవుతున్నాయి. ఈ పథకంలో ఆయా జంక్షన్లలో ట్రాఫిక్ చిక్కుల పరిష్కారం కోసం వివిధ ప్యాకేజీలుగా పనులు చేపట్టారు. ఫస్ట్‌ఫేజ్‌లో నాలుగో ప్యాకేజీలోని నాలుగు జంక్షన్లలో ట్రాఫిక్ పరిష్కారానికి చేపట్టిన ఆరు పనులు పూర్తవడంతో ఎస్సార్డీపీ పనుల్లో ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. వీటితో ఆయా ప్రాంతాల వారికి, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు ఎంతోసమయం కలిసివస్తోంది. ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల వివరాలు ఇవీ.. రాజీవ్‌గాంధీ జంక్షన్ ఫ్లైఓవర్.. మెజిస్టిక్ షాపింగ్‌మాల్ నుంచి మలేషియన్ టౌన్షిప్ వరకు టూ వే ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో కూకట్పల్లి వైపు నుంచి ఉదయం హైటెక్ సిటీకి వెళ్లేవారికి, తిరిగి సాయంత్రం ఇళ్లకు చేరుకునేందుకు ట్రాఫిక్ చిక్కులు తగ్గాయి. -
ఫ్లై ఓవర్‌పై ఆత్మహత్య.. భార్యే కారణం
నాగోలు: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఫ్లై ఓవర్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు..రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లికి చెందిన పొలగోని నరేందర్‌గౌడ్ (37) వనస్థలిపురం సాగర్ కాంప్లెక్స్‌లో భార్య పార్వతమ్మ, కుమారుడు శ్రీకర్(4)తో కలసి ఉంటున్నాడు. నగరంలో ఉంటు కారు డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొంత కాలంగా నరేందర్ ఆర్థిక ఇబ్బందులతో బాధపడటమే కాకుండా కుటుంబ కలహాలతో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన చావుకుఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలే కారణమని సూసైడ్ నోట్ రాసి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ కు సమీపంలోనే ఉన్న ఎల్బీనగర్ ఫ్లైఓవర్ పైకి తన బైక్ పై చేరుకున్నాడు. బైక్‌ను అక్కడే వదిలి పైనుంచి దూకాడు. ఈ సంఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డటంతో స్థానికులు 108 అంబులెన్స్‌లో ఓ ప్రయివేట్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. నరేందర్ తండ్రి మల్లయ్య మాత్రం తన కుమారుడి చావుకు కారణం తన కోడలు పార్వతమ్మతో పాటు తన బంధువైన రమేష్ కారణమని, వారి వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నరేందర్ జేబులో ఓ రెండు సూసైడ్ నోట్లు దొరికాయి. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. -
హైదరాబాద్‌లో కారు బీభత్సం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని భరత్‌నగర్ బ్రిడ్జ్‌పై కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి బ్రిడ్జ్‌పై నుంచి కిందికి దూసుకుపోయింది. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున 2.45 గంటల సమయంతో జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని స్థానికులు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరుపై దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులు బోరబండ పండిట్ నెహ్రూనగర్‌కి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గురైనవారు సోమవారం రాత్రి 10 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లారని వారి బంధువులు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ తిరిగి ప్రారంభం
గచ్చిబౌలి: గచ్చిబౌలిలోని బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై 42 రోజులు తరువాత వాహనాల రాకపోకలు ప్రారంభం అయ్యాయి. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఫ్లైఓవర్‌పై నుంచి వాహనాల రాకపోకలను జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు. అంతకు ముందు ఫ్లై ఓవర్‌ను సీపీ సజ్జనార్, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలించారు. అనంతరం ఫ్లై ఓవర్‌పై నుంచి రాకపోకలను అనుమతించారు. Inspected the extra safety measures taken up as per the recommendations of the expert committee at the Biodiversity flyover along with @cpcybd @harichandanaias @CEProjectsGHMC. Driver’s desecration is imp. Have a safe drive. @KTRTRS @arvindkumar_ias @CommissionrGHMC @GHMCOnline pic.twitter.com/CJGtKHyXuw — BonthuRammohan,Mayor (@bonthurammohan) January 4, 2020 కాగా గత నవంబర్ 23న ఫ్లై ఓవర్‌పై కారు ప్రమాదం జరిగి సత్యవేణి అనే మహిళ మృతి చెందగా..మరో నలుగురికి గాయాలైన విషయం తెలిసిందే. అదే రోజు జీహెచ్ఎంసీ అధికారులు ఫ్లై ఓవర్‌ను మూసివేశారు. రూ.69.47 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసుకున్న బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ను రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి గత నవంబర్ 4న ప్రాంభించారు. వారం రోజులు తిరగక ముందే నవంబర్ 10న అర్ధరాత్రి ఫ్లైఓవర్‌పై సెల్ఫీ దిగుతుండగా ఓ కారు అతి వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ప్రవీణ్ (22), సాయి వంశీ రాజు(22) ఫ్లై ఓవర్‌పై నుంచి కిందపడి అక్కడిక్కడే మృతి చెందారు. ఈ రెండు ప్రమాదాలతో జీహెచ్ఎంసీ అధికారులు దిద్దుబాటులో భాగంగా భద్రతా చర్యలు చేపట్టారు. నవంబర్ 23న శనివారం ప్రమాదం జరిగిన రోజు మూసివేసిన ఫ్లైఓవర్‌పై మళ్లీ శనివారమే రాకపోకలు ప్రారంభం కానుండటం గమనార్హం. రంబుల్ స్ట్రిప్స్, స్పీడ్ బ్రేకర్ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై 1200కు పైగా రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేశారు. ఒక చోట రబ్బరు స్పీడ్ బ్రేకర్ వేశారు. 12 చోట్ల స్పీడ్ బ్రేకర్లుగా రంబుల్ స్ట్రిప్స్ వేశారు. ఫ్లై ఓవర్ పొడవునా నాలుగు వరుసలుగా తెల్లరంగు, ఎరుపు రంగు క్యాట్ ఐస్‌ను బిగించారు. ఫ్లైఓవర్ మధ్యలో ఎడమ వైపు సైడ్ వాల్‌పై రీలింగ్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు తెలియజేసే సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక మెటీరియల్‌తో ఫ్లైఓవర్‌పై స్పీడ్ లిమిట్ 40 కిలో మీటర్లు అని తెలిసేలా రంబుల్ స్ట్రిప్స్ వేశారు. -
40 సేఫ్టీ
సాక్షి, సిటీబ్యూరో: విశ్వసనీయ సమాచారం మేరకు నిపుణుల కమిటీ తన నివేదికలో 40 కి.మీ.ల వేగం బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ప్రయాణం సురక్షితమేనని పేర్కొంది. ఇదే సమయంలో ఫ్లైఓవర్‌పై నిర్ణీత వేగం మించి వెళ్లకుండా ఉండేందుకు వేగ నిరోధక చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. ఫ్లైఓవర్‌కు ఇప్పటికే ఉన్న భద్రత చర్యలకు తోడు అదనంగా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని నివేదికలో పేర్కొంది. వివిధ అంశాలను, ఇండియన్ రోడ్ కాంగ్రెస్ ప్రమాణాలను, ఫ్లైఓవర్ డిజైన్, జామెట్రి తదితర అంశా>లను కూలంకషంగా విశ్లేషించిన కమిటీ ఫ్లైఓవర్‌పై వెళ్లే వాహనదారులు వేగ పరిమితి కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. కమిటీ సిఫార్సులకనుగుణంగా జీహెచ్ఎంసీ అదనపు భద్రత ఏర్పాట్లను వెంటనే చేపట్టనుంది. ఈ ఏర్పాట్లు పూర్తి చేశాక, నిపుణుల కమిటీ వాటిని పరిశీలించి ప్రయాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాకే జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు తిరిగి వాహన ప్రయాణానికి అనుమతించనున్నారు. మానవ వైఖరి వల్ల, విపరీత వేగం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, వేగాన్ని కట్టడి చేసేందుకు కమిటీ కొన్ని అంశాలు సిఫార్సు చేసినట్లు తెలిసింది. సిఫార్సుల్లో ముఖ్యాంశాలిలా ఉన్నాయి. చిన్నపాటి స్పీడ్‌బ్రేకర్లు.. ♦ సాఫీగా రయ్‌మని దూసుకుపోయేలా ఉన్న ఫ్లైఓవర్‌పై వేగాన్ని తగ్గించకుండా వెళ్లేవారిని కట్టడి చేసేందుకు సాధారణ రంబుల్స్ట్రిప్స్కు వాడేథర్మోప్లాస్టిక్ పెయింట్ కాకుండా బాగా దృఢంగా ఉండే ప్రత్యేకమైన మెటీరియల్‌ను వాడాలని కమిటీ సిఫార్సు చేసింది. ♦ ప్రత్యేక మెటీరియల్‌తో రంబుల్ స్ట్రిప్స్ 20 మి.మీ. మందంతో ఉండేవి ఒకదాని తర్వాత ఒకటిగా వరుసగా 6 ఏర్పాటు చేయాలి. అంటే ఇవి చిన్నపాటి స్పీడ్బ్రేకర్లలా ఉంటాయి. సాధారణంగా రంబుల్‌స్ట్రిప్స్ నగరంలో 2.5 మి.మీల నుంచి 5 మి.మీ., 7.5 మి.మీ. మందంతో వేస్తున్నారు. 20 మి.మీ.ల మందంతో ప్రతి వంద మీటర్ల చొప్పున ఫ్లై ఓవర్ పొడవునా దాదాపు 9 ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. వీటిని అప్పటికప్పుడే అక్కడే తయారు చేసి వేయాల్సి ఉంటుంది. దీన్ని ఇన్‌సిటు రంబుల్స్ట్రిప్గా వ్యవహరిస్తారు. ♦ ఫ్లై ఓవర్ కర్వ్ ప్రాంతానికి 135 మీటర్లకుముందు కూడా ఇవి ఏర్పాటు చేయాలి. ♦ ప్రస్తుతమున్న క్రాస్ బారియర్ ఎత్తును అదనంగా మరో 1.5 మీటర్లు పెంచాలి. ♦ తద్వారా సెల్ఫీలు తీసుకోవాలనే ఆలోచన రాదు. మానసికంగానూ ధైర్యంగా ఉంటారు. ♦ ఫ్లైఓవర్ పైకి ఎక్కడానికి ముందునుంచే అడుగడుగునా హెచ్చరికలు, వేగపరిమితిని సూచించే సైనేజీలు ఏర్పాటు చేయాలి. వాటిని ఎక్కడెక్కడ ఎలా ఏర్పాటుచేయాలో కూడా కమిటీ సూచించింది. ♦ అందరికీ బాగా కనిపించేలా పెద్దదైన ఓవర్‌హెడ్ సైనేజీని ఫ్లై ఓవర్‌కు దాదాపు 100 మీటర్లకు ముందుగా ఏర్పాటు చేయాలి. దీనిపై వేగపరిమితి 40 కేఎంపీహెచ్ దాటవద్దని, మలుపులున్నాయని సూచించాలి. ఐదున్నర మీటర్ల పొడవుతో దీన్ని ఏర్పాటు చేయాలి. ఓరియన్ విల్లా దగ్గరున్న ఎఫ్ఓబీ మీద కానీ, మరో చోట కానీ దీన్ని ఏర్పాటు చేయవచ్చని సూచించారు. ♦ మైండ్‌స్పేస్, మాదాపూర్, కూకట్పల్లి వైపు వెళ్లే వారే ఫ్లైఓవర్ ఎక్కాలి. గచ్చిబౌలి, లింగంపల్లి వైపు వెళ్లేవారు ఎక్కరాదు అని తెలుపుతూ కూడా సైనేజీలు ఏర్పాటు చేయాలి. ♦ స్పీడ్ కంట్రోల్ కావడానికి ఏయే లొకేషన్లలో మార్కింగ్‌లు, సైనేజీలు ప్రత్యేకంగా ఎలా ఉండాలో కూడా సిఫార్సు చేశారు. ♦ ప్రమాదం జరిగిన ఫ్లైఓవర్‌పై నిపుణుల కమిటీ సభ్యులు వివిధ రోజుల్లో, రాత్రుళ్లు వివిధ సమయాల్లో నాలుగైదు పర్యాయాలు వివిధ వేగాలతో ప్రయాణించి చూశారు. ♦ కమిటీ సభ్యులు డిజైన్ డ్రాయింగ్లు, టెండర్లకు ముందుగా ఆమోదం పొందిన డీపీఆర్, ఈపీసీ ప్రాజెక్ట్ షెడ్యూల్స్, నిర్మాణ డ్రాయింగ్లు పరిశీలించారు. బంప్ ఇంటిగ్రేటర్తో రఫ్‌నెస్ సర్వే, బ్రిటిష్ పెండ్యులమ్ టెస్టర్‌తో స్కిడ్ రెసిస్టెన్స్, శాండ్ ప్యాచర్ పరీక్ష ద్వారా టెక్స్చర్ మీన్ డెప్త్ తదితరాలను అధ్యయనం చేశారు. ♦ నలుగురు నిపుణుల కమిటీలో ప్రపంచబ్యాంకు రోడ్డు సేఫ్టీ విభాగం సలహాదారుప్రొఫెసర్ ఎస్.నాగభూషణ్‌రావు, రోడ్డుసేఫ్టీ, ట్రాఫిక్, ఇంజినీరింగ్ నిపుణులు డా.టి.ఎస్.రెడ్డి, ఓయూ ట్రాఫిక్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీనివాస్ కుమార్, రోడ్‌సేఫ్టీ ఆడిట్ ఎక్స్పర్ట్ ప్రదీప్‌రెడ్డిలు ఉండటంతెలిసిందే. -
బయోడైవర్సిటీ ప్రమాదం.. పోలీసులకు కోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్ : బయోడైవర్సిటీ ప్లైఓవర్ కారు ప్రమాదం కేసులో రాయదుర్గం పోలీసులకు మరోసారి చుక్కెదురైంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కృష్ణ మిలన్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. కృష్ణ మిలన్‌రావును జనవరి 3వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని న్యాయస్థానం ఈ సందర్భంగా పోలీసులను ఆదేశించింది. కారు యాక్సిడెంట్ చేసిన వ్యక్తిపై 304(2) సెక్షన్ ఎలా పెడతారని రాయదుర్గం పోలీసులను ప్రశ్నించింది. తదుపరి విచారణను జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది. కాగా, కృష్ణ మిలన్‌రావు నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు కోర్టుకు తెలిపారు. నిందితుడు అధిక వేగంతో దూసుకెళ్లినందునే ఈ ప్రమాదం జరిగినట్లు ఆధారాలు సేకరించామన్నారు. అంతకుముందు నిందితుడిని డిసెంబర్ 12వ తేదీ వరకు అరెస్ట్ చేయరాదని కోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలసిందే. కాగా, నవంబర్ 23న మధ్యాహ్నం బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పైనుంచి కారు అదుపు తప్పి ఫల్టీలు కొడుతూ రోడ్డుపై పడిన ఘటనలో సత్యవతి(56) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా కుబ్రా(23), బాలరాజ్ నాయక్, ప్రణిత గాయాల పాలయ్యారు. -
కుబ్రా బేగంకు అనంత వెంకట్రామిరెడ్డి చేయూత
సాక్షి, అనంతపురం : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మంచి మనసును చాటుకున్నారు. హైదరాబాద్‌లోని బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన కుబ్రా బేగం (23)కు చేయూత అందించారు. లెటర్ ఆఫ్ క్రెడిట్ కింద బాధిత యువతికి హైదరాబాద్‌లో మెరుగైన చికిత్సలు అందిస్తున్నారు. అలాగే బాధితురాలికి సీఎం రిలీఫ్ ఫండ్ విడుదలయ్యేలా అధికారులతో సంప్రదింపులు జరిపారు. అనంత వెంకట్రామిరెడ్డి వినతి మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం సహాయకనిధి నుంచి రూ.3,60,000 మంజూరు చేసింది. (చదవండి : బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం) అనంతపురంనకు చెందిన కుబ్రా బేగం శనివారం హైదరబాద్‌లోని ఓ కంపెనీకి ఇంటర్వ్యూకు హాజరై సెలక్ట్ కూడా అయింది. ఈ వార్తను సెల్ఫోన్లో అనంతపురంలో ఉన్న తండ్రి తో పంచుకుంటున్న సమయంలోనే రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఒంటినిండా గాయాలతో చావుబతుకులతో పోరాడుతోంది. గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రమాదంలో కుబ్రా వెన్నెముక దెబ్బతిందని, ఆపరేషన్ కోసం రూ.6లక్షలు ఖర్చు అవుందని వైద్యులు చెప్పారు. (చదవండి : రూపాయి లేదు..వైద్యమెలా!) తప్పకుండా ఆదుకుంటా: కేటీఆర్ ఫ్లైఓవర్ ప్రమాదంలో గాయపడిన కుబ్రా బేగం (23) ను తప్పకుండా ఆదుకుంటామని తెలంగాణ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘రూపాయి లేదు..వైద్యమెలా!’ అనే శీర్షికతో సోమవారం ‘సాక్షి’లో వచ్చిన కథనాన్ని ఓ నెటిజన్ కేటీఆర్‌కు ట్విట్ చేశారు. ఎలాగైనా ఆ యువతిని ఆదుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ఆమెకు మెరుగైన వైద్యం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఆమె ఆరోగ్యంపై మేయర్ బొంతు రామ్మోహన్‌తో చర్చించానని చెప్పారు. కుబ్రా కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. Absolutely will be taken care. I have already asked Hyderabad Mayor @bonthurammohan to visit her and assure her parents of all support that is required https://t.co/MRZKlHz52Z — KTR (@KTRTRS) November 25, 2019 -
బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదంపై కమిటీ
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ జంక్షన్లో శనివారం జరిగిన ప్రమాదంపై అధ్యయనం చేసేందుకు ముగ్గురు నిపుణులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించింది. సోమవారం నగర మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన ఛీఫ్ ఇంజనీర్స్, ప్రొఫెసర్స్‌తో కూడిన ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ బృందం నేడు బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదంపై జరిగిన తీరును ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించిది. అంతేకాక మూడు రోజుల్లో ఫ్లైఓవర్ డిజైన్‌పై నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. ఫ్లైఓవర్‌పై వేగ నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అవసరమైతే మరో ఐదు రోజుల వరకు ఫ్లైఓవర్‌ను మూసివేస్తామని పేర్కొన్నారు. (చదవండి: డిజైన్ లోపమేనా?) -
ఫ్లై ఓవర్ ప్రమాదం: ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు
సాక్షి, హైదరాబాద్ : బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై జరిగన ఘోర ప్రమాదం పట్ల నగర మేయర్ బొంతు రామ్మోహన్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన కృష్ణవేణి (40) అనే మహిళకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే విధంగా బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై వేగ నియంత్రణ చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ప్రమాద నేపథ్యంలో మూడు రోజుల పాటు ఈ ఫ్లైఓవర్‌పై రాకపోకలను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనలో కృష్ణవేణితో పాటు ఆమె కుమార్తె కూడా గాయాలపాలైంది. ఇక ఈ ఘటనపై మంత్రి కె.తారకరామారావు కూడా స్పందించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణలో తేలిందన్నారు. ఈ క్రమంలో వేగ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని జీహెంఎంసీ చీఫ్ ఇంజనీర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కాగా ఇటీవల నూతనంగా ప్రారంభించిన బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఫ్లై ఓవర్‌పై నుంచి ఓ కారు పల్టీలు కొట్టి కిందపడిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. యాక్షన్ సినిమా గ్రాఫిక్స్ మాదిరి ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ప్రమాద విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ప్రమాద సమయంలో కారు గంటకు 104 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయినట్లు సమాచారం. ఘటనాస్థలం మొత్తం విషాదకర దృశ్యాలతో నిండిపోయింది. Distressed to hear about today’s accident on Biodiversity flyover. Prima facie it appears to be result of over speeding; have directed GHMC Engineer-in-Chief & @cpcybd to close the flyover & get speed control/safety measures in place & an independent expert committee evaluation — KTR (@KTRTRS) November 23, 2019 -
బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం
సాక్షి హైదరాబాద్ : ఓ కారు 105 కిలోమీటర్ల వేగంతో బయల్దేరిన నిమిషంలోపే అదుపు తప్పింది. ఫ్లైఓవర్ మీదుగా.. 19 మీటర్ల ఎత్తు నుంచి గాల్లో ఎగురుతూ కింద రోడ్డుపై పడి.. చెట్టును బలంగా ఢీకొట్టింది. ఆ చెట్టు కింద కుమార్తెతో కలిసి బస్సు కోసం వేచి చూస్తున్న మహిళపై పడింది. ఈ ఘటనలో శరీర భాగాలు ఛిద్రమై.. మహిళ మృత్యువాత పడింది. చెట్టు కూకటివేళ్లతో సహా నేలకూలింది. నలుగురు గాయపడ్డారు. గచ్చిబౌలి బయోడైవర్సిటీ ప్లైఓవర్ జంక్షన్లో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ఊహకందని ఘటనతో ఆ ప్రాంతమంతా భీతావహ వాతావరణం నెలకొంది. ప్రమాదం దరిమిలా.. ప్రభుత్వ ఆదేశాలతో జీహెచ్ఎంసీ అధికారులు ఫ్లైఓవర్‌ను మూడు రోజుల పాటు పాక్షికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 86, ప్లాట్ నంబర్ 530లో నివాసం ఉండే కల్వకుంట్ల కృష్ణ మిలాన్ రావు (27) శనివారం మధ్యాహ్నం రాయదుర్గం వైపు నుంచి వోక్స్ వ్యాగన్ పోలో కారు (టీఎస్09 ఈడబ్ల్యూ 5665)లో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై నుంచి మైండ్‌స్పేస్ వైపు బయల్దేరారు. ఈ ఫ్లైఓవర్‌పై 40 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సి ఉండగా, ఆ సమయంలో కారు 105 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. అతి వేగంగా వెళ్తూ ఫ్లైఓవర్ మలుపు వద్ద ఒక్కసారిగా అదుపుతప్పింది. 1.04 నిమిషాల సమయంలో కారు ఫ్లైఓవర్ మీదుగా 19 మీటర్ల పై నుంచి.. కింద రోడ్డుపై ఉన్న నిసాన్ షోరూం ఎదుట పడింది. ఆపై పల్టీలు కొడుతూ చెట్టును ఢీకొట్టింది. ఆ ధాటికి చెట్టు కింద బస్సు కోసం వేచి చూస్తున్న పసల సత్యవేణి (56) తల, ఛాతీ భాగం ఛిద్రమై అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. ఆమె కాలేయంతో పాటు శరీర భాగాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడటంతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. కారు బలంగా ఢీకొట్టడంతో చెట్టు కూకటివేళ్లతో సహా పడిపోయింది. క్షతగాత్రులకు కేర్‌లో చికిత్స ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు సమీపంలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. – కారు నడుపుతున్న కల్వకుంట్ల కృష్ణ మిలాన్ రావు.. కారులోని ఎయిర్ బెలూన్లు తెరచుకోవడంతో గాయాలతో బయటపడ్డారు. ఆయన తలకు, చెవికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. – కుర్బా (23).. ఛాతీకి తీవ్ర గాయాలవడంతో పక్కటెముకలు విరిగిపోయాయి. అనంతపురానికి చెందిన ఈమె ఆరు నెలల క్రితం నగరానికి వచ్చి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. పీపుల్ టెక్ కంపెనీలో ఇంటర్వ్యూకు వెళ్లేందుకు ఆటో కోసం వేచి చూస్తూ ప్రమాదంలో గాయపడ్డారు. ఆమెకు ఆర్థోపెడిక్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. – ప్రయాణికులను ఎక్కించుకునేందుకు చెట్టు కింద వేచి చూస్తున్న ఆటో డ్రైవర్ ముడావత్ బాలూ నాయక్ (38) ఎడమ కాలి పాదం పూర్తిగా దెబ్బతింది. – మృతురాలి కుమార్తె ప్రణీత స్వల్పంగా గాయపడ్డారు. కుమార్తె కళ్లెదుటే.. మృతురాలు సత్యవేణి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు. ఏడాదిగా మణికొండలో ఉంటున్నారు. కుమార్తె ప్రణీతతో కలిసి అద్దె ఇల్లు కోసమని, కూకట్‌పల్లిలోని బంధువులను కలిసేందుకు బయల్దేరారు. మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో వీరిద్దరు చెట్టు కింద బస్సు కోసం వేచి ఉండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కళ్లెదుటే తల్లి సత్యవేణిని పొగొట్టుకున్న ప్రణీత (26) స్వల్ప గాయాలతో బయటపడింది. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ మృతురాలికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. చెట్టు కింద 12 మంది.. అంతా కకావికలం కారు ఫ్లైఓవర్ నుంచి కిందపడిన సమయంలో చెట్టు కింద 12 మంది వరకు ఉన్నారు. ఈ చెట్టు కిందే ఆటోస్టాండ్ ఉంది. బస్సు కోసం కూడా ప్రయాణికులు ఇక్కడే వేచి చూస్తుంటారు. కారు రోడ్డుపై పడి, చెట్టును ఢీకొట్టగానే పెద్ద శబ్దం రావడంతో అంతా భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. నిసాన్ షోరూం ముందు పార్క్ చేసి ఉన్న కార్లపై చెట్టు పడటంతో ఐ10 గ్రాండ్, రెండు నిసాన్ మైక్రా కార్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. పల్టీలు కొట్టి కారు మీద పడడంతో మరో డట్సన్ కారు ధ్వంసమైంది. చెట్టు కొమ్మలు అక్కడున్న కార్లపై పడటం, అక్కడున్న వారంతా పక్కకు పరుగెత్తడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. ఘటన స్థలాన్ని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్, ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్, వెస్ట్ జోనల్ కమిషనర్ హరిచందన దాసరి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించారు. ఈ ప్రమాదంతో ఫ్లైఓవర్ డిజైన్ తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రమాద దృశ్యాలు వైరల్ అయ్యాయి. సినిమా షూటింగ్ అనుకున్నా.. స్కూటీపై వచ్చిన నేను నిసాన్ షోరూమ్ వద్ద కొద్దిసేపు ఆగాను. ఫ్లైఓవర్ పై నుంచి గాల్లో ఎగురుతూ కిందపడుతున్న కారును చూసి సినిమా షూటింగ్ జరుగుతుందనుకున్నా. నా పక్కనే కారు పడటం.. క్షణాల్లో చెట్టు కూలడం.. మహిళ చనిపోవడం.. అంతా పరుగులు తీయడంతో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఘటనతో షాక్‌కు గురయ్యాను. నాలుగడుగులు ముందుకేస్తే నాకు ప్రమాదం జరిగేది. – రాజేశ్వరి, విద్యానగర్, ప్రత్యక్షసాక్షి 105 వేగం.. అందుకే ప్రమాదం బయోడైవర్సిటీ పై నుంచి కింద పడ్డ కారు 105 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ అదుపు తప్పింది. ఫ్లైఓవర్‌పై 40 కి.మీ. వేగంతో వెళ్లాల్సి ఉండగా అతి వేగం వల్లే ప్రమాదం చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ బృందం, ట్రాఫిక్ పోలీసులు ఈ ప్రమాదంపై అధ్యయనం చేస్తున్నారు. ఫ్లైఓవర్‌పై వేగ నియంత్రణ కోసం సూచికలు ఏర్పాటు చేశాం. వాహనదారుల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటాం. – ‘సాక్షి’తో సైబరాబాద్ కమిషనర్ వి.సి.సజ్జనార్ 20 రోజులు.. 3 మరణాలు.. 550 ఓవర్‌స్పీడ్ చలానాలు దివ్యశ్రీ ఓరియన్ సెజ్ నుంచి మొదలయ్యే బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ 990 మీటర్ల పొడవునా ఐకియాకు వెళ్లే మార్గంలో ముగుస్తుంది. రూ.69.47 కోట్లతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌ను ఈ నెల 4న మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ 20 రోజుల్లో జరిగిన రెండు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. ఈ నెల 10న ఇద్దరు యువకులు సెల్ఫీలు దిగుతూ.. కారు ఢీకొట్టిన దుర్ఘటనలో మృతి చెందారు. శనివారం జరిగిన ప్రమాదంలో మహిళ దుర్మరణం పాలైంది. కాగా, ఈ ఫ్లైఓవర్‌పై గత ఆరు రోజులుగా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సీసీటీవీ కెమెరాల ద్వారా వాహనాల వేగాన్ని సాఫ్ట్వేర్ సహకారంతో గుర్తించి 550 ఓవర్ స్పీడ్ చలాన్లు జారీ చేశారు. -
ట్రాఫిక్ వేళ..రాంగే రైటు!
అసలే సోమవారం.. సమయం ఉదయం 9.30 గంటలు.. ఐటీ కారిడార్ రద్దీగా ఉండేది కూడా అప్పుడే. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగలతో కిటకిటలాడుతూ ఉంది. ఇదే సమయంలో బయోడైవర్సిటీ డబుల్ హైట్ ఫ్లైఓవర్ ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. మంత్రులు, ఉన్నతాధికారుల వాహనాల రాకతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. దాంతో చాలామంది లీడర్లు తమ వాహనాలను రాంగ్ రూట్లోనే కొత్త వంతెన దగ్గరకు పోనిచ్చారు. 108 వాహనాలు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. ఐటీ ఉద్యోగులైతే కార్యాలయాలకు సమయం మించి పోతుందని టెన్షన్ పడ్డారు. ఇటు మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి జంక్షన్.. మాదాపూర్ వరకు భారీగా ట్రాఫిక్ జామైంది. – ఫొటోలు: నోముల రాజేష్‌రెడ్డి -
ఐటీజోన్‌లో జెయింట్ ఫ్లైఓవర్
-
ఐటీజోన్‌లో జెయింట్ ఫ్లైఓవర్ నేడే ప్రారంభం
గచ్చిబౌలి: నిత్యం ట్రాఫిక్‌తో రద్దీగా ఉండే ఐటీ కారిడార్‌లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. బయోడైవర్సిటీ డబుల్ హైట్ ఫ్లైఓవర్‌ను సోమవారం ప్రారంభించనున్నారు. దీంతో రాయదుర్గం నుంచి హైటెక్‌సిటీ, ఇనార్బిట్ మాల్ వైపు వెళ్లే ప్రయాణికులు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రయాణం చేయవచ్చు. రెండున్నర ఏళ్లకు ముందు ప్రారంభమైన నిర్మాణానికి స్థల సేకరణ అడ్డంకిగా మారడంతో పనుల్లో జాప్యం జరిగింది. ఎట్టకేలకు నిర్మాణ పనులు పూర్తి కావడంతో అతి ఎత్తయిన వంతెన అందుబాటులోకి వచ్చింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. బల్దియా పరిధిలో ఎస్ఆర్డీపీ పనుల కింద చేపట్టిన ఫ్లైఓవర్లలో ఈ డబుల్ ఫ్లైఓవర్ నగరంలోనే ఎత్తయినది. దాదాపు రూ.16.47 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ వంతెన జంక్షన్లో ఎత్తు 17.45 మీ. కాగా, పొడవు 990 మీ, వెడల్పు 11.5 మీటర్లు. మూడు లైన్ల వెడల్పులో వన్ వేలో వెళ్లాల్సి ఉంటుంది. -
అభివృద్ధి పనులకు నిధుల దెబ్బ
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దాదాపు రూ.25వేల కోట్ల ఫ్లైఓవర్లు, జంక్షన్ల అభివృద్ధి పనుల్లో సుమారు రూ.4,400 కోట్ల విలువైన వాటికి బ్రేక్ పడింది. అటు ప్రభుత్వం, ఇటు జీహెచ్ఎంసీ వద్ద నిధులు లేకపోవడం.. దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ప్రభావం తదితర పరిణామాలతో ప్రారంభించని పనులతో పాటు 90శాతం భూసేకరణ పూర్తవ్వని ప్రాజెక్టుల జోలికి వెళ్లొద్దని జీహెచ్ఎంసీకి స్పష్టమైన ఆదేశాలు అందినట్లు తెలిసింది. వీటితో పాటుపురోగతిలో ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి కూడా డోలాయమానంలో పడింది. ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా జీహెచ్ఎంసీ దాదాపు రూ.25వేల కోట్ల పనులకు ప్రణాళికలు రూపొందించిన విషయం విదితమే. వీటిని వివిధ దశల్లో చేపట్టాల్సి ఉండగా.. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం కొన్ని ఆగిపోయాయి. ఇప్పటికే ఈ పనుల కోసం బల్దియా రూ.495 కోట్లను బాండ్ల ద్వారా సేకరించింది. వీటి చెల్లింపులతో పాటు వివిధ నిర్వహణ పనులు, ఇతరత్రాలకు నిధులు లేవు. ప్రతినెల వస్తున్న ఆదాయానికి, ఖర్చులకు పొంతన కుదరడం లేదు. సిబ్బంది జీతాల చెల్లింపులకే కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తగిన నిధులు అందజేయగలదన్న ఆశలు కూడా అడుగంటాయి. మరోవైపు ఇంకా ప్రారంభం కాని, టెండర్ల ప్రక్రియ పూర్తికాని ప్రాజెక్టులు చేపట్టరాదన్న సంకేతాలతో పలు పనులకు బ్రేకులు పడ్డాయి. పురోగతిలో ఉన్న పనులు సైతం... సాధారణ ఫ్లైఓవర్ల కంటే స్టీల్ బ్రిడ్జీలను తక్కువ భూసేకరణతోనే చేపట్టే వీలుండడంతో రెండు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ టెండర్ల వరకు వచ్చినప్పటికీ... పూర్తికాకపోవడంతో నిలిపేయాల్సి వచ్చింది. మరోవైపు వివిధ దశల్లో పురోగతిలో ఉన్న రూ.2వేల కోట్లకు పైగా పనుల పరిస్థితి డోలాయమానంలో పడింది. వాటిలో కామినేని–బైరామల్‌గూడ అండర్‌పాస్, నాగోల్ జంక్షన్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45–దుర్గం చెరువు, షేక్‌పేట–విస్పర్‌వ్యాలీ, బొటానికల్ గార్డెన్, కొండాపూర్, కొత్తగూడ ఫ్లైఓవర్లు తదితర ఉన్నాయి. ఇతర ప్రాజెక్టులు ♦ రేతిబౌలి, నానల్‌నగర్ జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లు, అండర్‌పాస్ అంచనా వ్యయం రూ.636.80 కోట్లు ♦ ఎన్ఎఫ్సీఎల్–మెహదీపట్నం ఫ్లైఓవర్ అంచనా వ్యయం రూ.1200 కోట్లు ♦ ఆరాంఘర్–జూపార్కు ఫ్లైఓవర్ అంచనా వ్యయం రూ.320 కోట్లు ♦ ఇవి కాకుండా మరో రూ.1,000 కోట్లకు పైగా ప్రాజెక్టులు ఆగిపోయాయి. వీటికే బ్రేకులు ♦ నల్లగొండ క్రాస్ రోడ్ – ఒవైసీ జంక్షన్ ♦ ఇందిరాపార్కు–వీఎస్టీ జంక్షన్ ♦ రేతిబౌలి, నానల్‌నగర్ జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లు, అండర్‌పాస్ ♦ ఎన్ఎఫ్సీఎల్–మెహదీపట్నం ఫ్లైఓవర్ ♦ ఆరాంఘర్–జూపార్కు ఫ్లైఓవర్ ♦ ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్టులు ఆగిపోయాయి. ఈ ప్రాజెక్టులకే బ్రేకులు ♦ నల్లగొండ క్రాస్ రోడ్ – ఒవైసీ జంక్షన్ ♦ నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ ♦ పొడవు 4 కిలోమీటర్లు ♦ అంచనా వ్యయం రూ.523.37 కోట్లు ♦ రద్దీ సమయంలో వాహనాలు:70,576 ( 2015లో) ♦ 2035 నాటికి వాహనాలు: 1,93,632 నల్లగొండ క్రాస్ రోడ్ నుంచి సైదాబాద్, ఐఎస్ సదన్ల మీదుగా ఒవైసీ జంక్షన్ వైపు దాదాపు 4కి.మీ మేర ఈ స్టీల్ ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే మిథాని, సంతోష్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి చాదర్‌ఘాట్, కోఠిల మీదుగా న్యూసిటీలోకి వచ్చేవారు.. ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేవారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ మార్గంలో పలు ప్రార్థనా మందిరాలు ,ఆస్పత్రులతో పాటు పోలీస్ స్టేషన్, శ్మశానవాటికలు ఉండడంతో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటోంది. ఇందిరాపార్కు–వీఎస్టీ జంక్షన్ దీన్ని రెండు భాగాలుగా చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించి టెండర్లు ఆహ్వానించారు. ఇందిరాపార్కు– వీఎస్టీ జంక్షన్ 2.6 కిలోమీటర్లు, రామ్‌నగర్–బాగ్‌లింగంపల్లి 0.84 కిలోమీటర్ల మార్గంలో నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు. ఈ రెండింటి అంచనా వ్యయం రూ.426 కోట్లు. ♦ రామంతాపూర్, హిందీ మహావిద్యాలయ, విద్యానగర్, రామ్‌నగర్, వీఎస్టీల నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్ మీదుగా సచివాలయం, లక్డీకాపూల్ తదితర ప్రాంతాలకు ప్రయాణించే వారికి... రామ్‌నగర్ నుంచి బాగ్‌లింగంపల్లి మీదుగా హిమాయత్‌నగర్, లిబర్టీ, సచివాలయం తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి వీటి వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయని టెండర్లు పిలిచారు. ♦ వీటికి టెండర్లు ఆహ్వానించినప్పటికీ మొత్తం ప్రక్రియ పూర్తి కాకపోవడం, భూసేకరణలో భాగంగా పలు ఆస్తులు సేకరించాల్సి ఉండడం తదితర కారణాలతో ఈ స్టీల్ బ్రిడ్జీలకు బ్రేక్‌లు పడ్డాయి. -
‘అక్కడ ఏ ప్రార్థనా మందిరం కట్టినా ఊరుకోం’
సాక్షి, హైదరాబాద్ : అంబర్పేట్ ఫ్లై ఓవర్ వివాదంపై బీజేపీ నాయకులు ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ అధ్వర్యంలో మంగళవారం హోం మంత్రిని కలిశారు. అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. అంబర్‌పేట్‌లో మా ఎమ్మెల్యేతో సీపీ, పోలీసులు దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. పాతబస్తీ నుంచి వచ్చిన ఓ వర్గం వారు అంబర్‌పేట్‌లో స్థానికులపై రాళ్లు రువ్వారని తెలిపారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం పొందిన తర్వాత మళ్లీ మజ్లిస్ నాయకులు, బయటి వ్యక్తులతో కలిసి అదే స్థలంలో ప్రార్థన చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఫ్లైఓవర్ నిర్మించడానికి కూల్చివేసిన స్థలంలో మళ్లీ గుంపులుగా నమాజ్ చేస్తే స్థానిక అంబర్ పేట్ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని లక్ష్మణ్ విమర్శించారు. ప్రభుత్వ స్థలంలో ఓ వర్గం వారు మందిరం కడుతుంటే పోలీసులు, ప్రభుత్వం ఏం చేస్తుందని లక్ష్మణ్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ అండ చూసుకునే.. ఎంఐఎం అరాచకాలకు పాల్పడుతుంది.. అందుకు పోలీసులు కూడా సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. అంబర్‌పేటలో ఏ ప్రార్థన మందిరం కట్టినా ఊరుకోమని హెచ్చరించారు. తమ ఎమ్మెల్యేపై దాడి చేసిన సీపీ, పోలీసులతో పాటు.. పాషా ఖాద్రి, వక్ఫ్ చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలని హోం మంత్రిని కోరినట్లు లక్ష్మణ్ తెలిపారు. -
పీవీ ఎక్స్‌ప్రెస్ వన్ వే మూసివేత
సాక్షి, హైదరాబాద్ : పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే శనివారం నుంచి వన్‌వేగా మారనుంది. దీనికి నిర్వహిస్తున్న మరమ్మతుల నేపథ్యంలో కేవలం విమానాశ్రయం వైపు వెళ్లే వాహనాలనే అనుమతించనున్నట్లు అదనపు సీపీ (ట్రాఫిక్) అనిల్ కుమార్ తెలిపారు. విమానాశ్రయం వైపు నుంచి వచ్చే వాహనాలను అనుమతించబోమని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే వాహనాలు ఆరాంఘర్, శివరాంపల్లి, పీడీపీ ఎక్స్‌రోడ్, ఉప్పర్‌పల్లి, హైదర్‌గూడ, అత్తాపూర్, రేతిబౌలి, మోహదీపట్నం మీదగా వెళ్లాలని, అలాగే చాంద్రాయణగుట్ట, జూపార్క్ల వైపు నుంచి వచ్చే వాహనాలు అదే మార్గంలో ప్రయాణించాలని సూచించారు. దాదాపు 3 నెలల పాటు ఈ పనులు జరిగే అవకాశం ఉండటంతో వాహనదారులకు కొంత ఇబ్బంది ఉంటుందని హెచ్ఎండీఏ ఇంజనీరింగ్ విభాగ అధికారులు చెబుతున్నారు. వాహనదారుల భద్రత కోసమే... 11.6 కిలోమీటర్లు ఉన్న పీవీఎక్స్‌ప్రెస్ వేపై రోడ్డు కొంతమేర దెబ్బతినడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నిర్ధారిత వేగంతో వెళ్లినా రోడ్డు బాగా లేక ప్రాణాలు కోల్పోతున్నారు. 2009, అక్టోబర్ 19 నుంచి వాహనదారులకు అందుబాటులోకి వచ్చిన ఈ ఎక్స్‌ప్రెస్ వే రోడ్ల మరమ్మతులు ఇప్పటివరకు చేయకపోవడం కూడా ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. దీంతో ఎక్స్‌ప్రెస్ వేలోని పాత బీటీ రోడ్డు తొలగించి మిల్లింగ్‌తో కొత్త బీటీ రోడ్డు సోమవారం నుంచి వేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సరోజినీదేవి కంటి ఆసుపత్రి నుంచి ఈ పనులను వన్‌వేలో పూర్తయ్యాక మళ్లీ మరో వన్‌వేలో వేసేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రకారం ఈ 3 నెలల పాటు వన్‌వేలోనే శంషాబాద్ విమానాశ్రయానికి వాహనదారులను అనుమతించనున్నారు. ట్రాఫిక్ మళ్లింపు ఇలా... శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికులు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే కింది నుంచి ఆరాంఘర్, శివరాంపల్లి, పీడీపీ ఎక్స్‌రోడ్డు, ఉప్పర్‌పల్లి, హైదర్‌గూడ, అత్తాపూర్, రేతిబౌలి, మెహదీపట్నం మీదుగా రావాల్సి ఉంటుంది. చాంద్రాయణగుట్ట, జూపార్క్ రోడ్డు, శివరాంపల్లి నుంచి మెహదీపట్నం వచ్చే వాహనదారులు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే కింది నుంచి శివరాంపల్లి, పీడీపీ ఎక్స్‌రోడ్డు, ఉప్పర్‌పల్లి, హైదర్‌గూడ, అత్తాపూర్, రేతిబౌలి నుంచి మెహదీపట్నానికి చేరుకోవాలి. -
ఫ్లై ఓవర్ ప్లీజ్!
సాక్షి,సిటీబ్యూరో: మంజీరా మెజిస్టిక్ షాపింగ్ మాల్ నుంచి మలేషియన్ టౌన్‌పిష్ వైపు వెళ్లే రాజీవ్‌గాంధీ జంక్షన్ ఫ్లై ఓవర్‌ను వెంటనే అందుబాటులోకి తేవాల్సిందిగా సిటీజనుల నుంచి, నెటిజన్ల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ వంతెనను వినియోగంలోకి తెస్తే ఈ మార్గం నుంచి ప్రయాణించే దాదాపు నాలుగైదు లక్షల మందికి ఊరట లభించడంతో పాటు, ట్రాఫిక్ చిక్కులు సైతం తీరుతాయి. ‘ఫ్లై ఓవర్ లేక ముందు.. నిర్మాణం ప్రారంభం కాకముందు.. ఎన్నో అవస్థలు భరించాం. ఫ్లై ఓవర్ పూర్తయింది. అనుమతించడానికి ఇబ్బంది ఏముంది? అందరికీ సమస్యలు తీరుతాయిగా. అసలెందుకు ప్రారంభించడం లేద’ంటూ అధికారులను పలువురు సామాజికమాధ్యమాలైన ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సప్‌ల వేదికగా ప్రశ్నిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండటంతో ‘కోడ్’ ఉల్లంఘన అవుతుందేమోనని అధికారులుసంశయిస్తున్నారు. కోడ్ అడ్డువస్తే అధికారికంగా లాంఛనాలతో ప్రారంభోత్సవం చేయకపోయినా ప్రయాణానికి అనుమతించాలని కోరుతున్నారు. అనుమతిస్తే నిత్యం నిజాంపేట్, ప్రగతినగర్, కూకట్పల్లి మీదుగా హైటెక్‌సిటీకి వెళ్లే వారికి, అటు నుంచి ఇటు వచ్చేవారికి ఎంతో మేలు జరుగుతుందనివెంటనే అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. రాజీవ్‌గాంధీ విగ్రహం, మలేషియా టౌన్‌షిప్‌ల మీదుగా హైటెక్‌సిటీకి వెళ్లేవారికి ట్రాఫిక్ నరకం తప్పుతుందంటున్నారు. ఈ మార్గంలో నిత్యం దాదాపు 1.60 లక్షల వాహనాలు ప్రయాణిస్తున్నాయి. రాజీవ్‌గాంధీ విగ్రహం జంక్షన్ ఫ్లై ఓవర్.. మంజీరా మెజిస్టిక్ షాపింగ్‌మాల్ నుంచి ప్రారంభమయ్యే ఈ ఫ్లై ఓవర్ మలేషియా టౌన్షిప్ ముందు ముగుస్తుంది.జేఎన్టీయూ రోడ్, కేపీహెచ్‌బీ ఫేజ్–1, ఫేజ్–6, ఫేజ్–9 సంగమంగా ఉన్న ఈ జంక్షన్ వద్ద రద్దీ సమయాల్లో 66 శాతం జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీవైపు వెళ్లే వారే ఉంటున్నారు. ఈ వంతెన వినియోగంతో ఇందులో 94 శాతం సమస్య పరిష్కారమవుతుందని, హైటెక్‌సిటీలో ఐటీ రంగం అభివృద్ధికి ముందు ఉన్నంత రద్దీ మాత్రమే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రాజీవ్‌గాంధీ సర్కిల్ వద్ద రద్దీ తగ్గితే ట్రాఫిక్ కష్టాలు చాలా వరకు తగ్గినట్లే. హైటెక్ సిటీ నుంచి కేపీహెచ్‌బీ వైపు వెళ్లే వారికీ ఇదే సౌలభ్యంగా ఉంటుంది. ప్యాకేజీ–4 లో చేపట్టిన పనులు.. ప్యాకేజీ–4లో బయోడైవర్సిటీ జంక్షన్, అయ్యప్ప సొసైటీ జంక్షన్, రాజీవ్‌గాంధీ జంక్షన్, మైండ్‌స్పేస్ జంక్షన్ పనులను మొత్తం రూ.379 కోట్ల వ్యయంతో చేపట్టారు. వీటిలో అయ్యప్ప సొసైటీ జంక్షన్, మైండ్‌స్పేస్ అండర్‌పాస్, మైండ్‌స్పేస్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చాయి. రాజీవ్‌గాంధీ జంక్షన్ ఫ్లై ఓవర్ పూర్తయింది. ఇప్పుడు ఈ వంతెనను అందుబాటులోకి తేవాలని ప్రజలను డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఫ్లై ఓవర్ వివరాలు ఇవీ.. వ్యయం: రూ.97.94 కోట్లు పొడవు: 1230 మీ. వయడక్డ్ పొడవు: 780 మీ. ఆబ్లిగేటరీ స్పాన్ పొడవు: 90 మీ. అప్రోచెస్ పొడవు: 360 మీ. వెడల్పు: 20 మీ. క్యారేజ్‌వే: ఆరు లేన్లు (రెండువైపులా ప్రయాణం) కాంట్రాక్ట్ ఏజెన్సీ: ఎం.వెంకట్రావు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ -
ఫతేనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద కలకలం!
సాక్షి, హైదరాబాద్ : సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఫతేనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్నారు. మృతిచెందిన మహిళను సనత్‌నగర్‌లోని ఎస్ఆర్టీ కాలనీకి చెందిన మంగతాయారుగా గుర్తించారు. ఆమె భర్త భీమేశ్వరరావు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాకినాడలోని మొగలిపాలెంకు చెందిన భీమేశ్వరరావు 10 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి ఎస్ఆర్టీ కాలనీలో నివాసముంటున్నారు. కుంటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఈస్ట్ జోన్లో ఈజీ జర్నీ
సాక్షి, సిటీబ్యూరో: ఎల్బీనగర్ పరిసరాల్లో ప్రయాణించేవారికి ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన కామినేని ఫ్లై ఓవర్(ఎడమవైపు), చింతల్‌కుంట అండర్‌పాస్‌లతోపాటు మరికొన్ని ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఎల్బీనగర్ జంక్షన్ వద్ద దిల్సుఖ్నగర్ వైపు నుంచి హయత్‌నగర్ వైపు వెళ్లే ఫ్లై ఓవర్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నెల్లోనే దీన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఇదే జంక్షన్ వద్ద కామినేని వైపు నుంచి బైరామల్ గూడవైపు వెళ్లేవారికి సదుపాయంగా నిర్మాణం చేపట్టిన అండర్‌పాస్ పనులు పురోగతిలో ఉన్నాయి. మరో ఆర్నెళ్లలో ఈ పనులు పూర్తికానున్నాయి. దీంతోపాటు నాగోల్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికి తాజాగా చేపట్టిన ఫ్లై ఓవర్ పనులతో ఈస్ట్‌జోన్‌లో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని భావిస్తున్నారు. ఏటా రూ.10 వేల కోట్ల వంతున ఐదేళ్లలో రూ.50 వేల కోట్లతో నగరాభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన నేపథ్యంలో, అందుకనుగుణంగా ఎస్సార్డీపీ ప్రాజెక్టు పనుల్నికూడా పెంచనున్నట్లు మేయర్ రామ్మోహన్ ఇటీవల ప్రకటించడంతో జీహెచ్ఎంసీ అధికారులు ఈ పనుల వేగం పెంచారు. ఇప్పటికే ప్రారంభించిన పనులతోపాటు కొత్త పనులపైనా ప్రతిపాదనలకు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు మందకొడిగా సాగిన ఎస్సార్డీపీ పనులపై ప్రస్తుతం దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ – ఎల్బీనగర్ అటు నుంచి ఇటు, ఇటునుంచి అటు వెళ్లేవారికి నాగోల్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ చిక్కులు తగ్గించేందుకు,సిగ్నల్ ఫ్రీగా వెళ్లేందుకు నాగోల్ వద్ద ఫ్లై ఓవర్ పనులకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఈ ఫ్లై ఓవర్ పొడవు 980 మీటర్లు, వెడల్పు 24 మీటర్లు. ఇన్నర్రింగ్రోడ్లో ప్రయాణం చేసేవారికి ఎంతో సదుపాయంగా ఉండే ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే కొత్తపేట నుంచి బండ్లగూడ వైపు వెళ్లే వారికి, మన్సూరాబాద్‌తో సహ ఎల్బీనగర్ పరిసరాల్లోని వివిధ ప్రాంతాల్లోకి వెళ్లేవారికి ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గుతాయని భావించి జీహెచ్ఎంసీ ఈ ఫ్లై ఓవర్ పనులకు శ్రీకారం చుట్టింది. సికింద్రాబాద్, ఉప్పల్ల వైపు నుంచి కామినేని, ఎల్బీనగర్ల వైపు వెళ్లేవారికి మూసీ బ్రిడ్జి దాటాక దాదాపు 200 మీటర్ల తర్వాత ప్రారంభమయ్యే ఈ ఫ్లై ఓవర్ అలకాపురికి దాదాపు 500 మీటర్ల ముందుగా ముగుస్తుంది. దీంతో నాగోల్ జంక్షన్ మీదుగా పరిసరాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లేవారికి ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయి. ఈ ఫ్లై ఓవర్ అంచనా వ్యయం రూ.65.71 కోట్లు. ఇటీవలే ఈ ఫ్లై ఓవర్ పనులకు శ్రీకారం చుట్టారు. ఒకే వరుస స్తంభాలపై ఆరులేన్లుగా నిర్మించనున్న ఈ ఫ్లై ఓవర్‌ను కామినేని తరహాలో ప్రీకాస్ట్ పద్ధతిలో నిర్మించనున్నారు. హయత్‌నగర్ ఫ్లై ఓవర్ స్థానే .. ఎస్సార్డీపీ రెండో ప్యాకేజీలో భాగంగా ఎల్బీనగర్ చుట్టుపక్కల సిగ్నల్‌ఫ్రీ పనుల్లో భాగంగా పలు జంక్షన్లలో పలు ఫ్లై ఓవర్లు, అండర్పాస్లున్నాయి. కామినేని నుంచి హయత్‌నగర్ వరకు కూడా ఒక ఫ్లై ఓవర్ నిర్మించాల్సి ఉండగా, మెట్రోరైలు రెండో దశలో ఎదురయ్యే ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని ఆ ఫ్లై ఓవర్ ప్రతిపాదనను విరమించుకున్నారు. ప్యాకేజీలో భాగంగా దాని స్థానే నాగోల్ జంక్షన్ వద్ద కొత్తగా ఫ్లై ఓవర్ నిర్మించాలని భావించారు. అందుకు ప్రభుత్వం అనుమతించడం, ప్యాకేజీ పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్ ఏజెన్సీ సుముఖత వ్యక్తం చేయడంతో పనులు ప్రారంభించారు. దాదాపు ఏడాది కాలంలో ఈ ఫ్లై ఓవర్ పూర్తవుతుందని పనులు పర్యవేక్షిస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పీవీ కృష్ణారావు తెలిపారు. ఎల్బీనగర్ ఫ్లై ఓవర్ ఫినిషింగ్ పనులు మాత్రం మిగిలి ఉన్నాయిన రిపబ్లిక్డేనాటికి ఈ పనులు పూర్తి కాగలవన్నారు. ఎల్బీనగర్ ఫ్లై ఓవర్.. ఫ్లై ఓవర్ పొడవు : 780 మీటర్లు వెడల్పు : 9 మీటర్లు అంచనా వ్యయం : రూ. 42.75 కోట్లు ఇది అందుబాటులోకి వస్తే 90 శాతం ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుంది. మెట్రోరైలు రాకకుముందు రద్దీ సమయంలో వెళ్లే వాహనాలు: 14,153 మెట్రో రైలు వచ్చాక రద్దీసమయంలో వాహనాలు:8,916 2034 నాటికి జంక్షన్లో రద్దీసమయంలో గంటకు వెళ్లే వాహనాలు: 21,990 రూ. 448 కోట్లతో.. ప్రభుత్వం దాదాపు రూ. 25వేల కోట్లతో చేపట్టిన ఎస్సార్డీపీ పనుల్లో ప్యాకేజీ–2లో కామినేని, ఎల్బీనగర్, బైరామల్‌గూడ జంక్షన్ల వద్ద నిర్మించ ప్రతిపాదించిన ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల అంచనా వ్యయం మొత్తం రూ. 448 కోట్లు. వీటిల్లో చింతల్కుండ అండర్‌పాస్, కామినేని ఎడమవైపు ఫ్లై ఓవర్ వినియోగంలోకి రావడం తెలిసిందే. ఈనెలలో ప్రారంభానికి అవకాశమున్న ఎల్బీనగర్ ఫ్లై ఓవర్‌తోపాటు కూకట్పల్లి రాజీవ్‌గాంధీ జంక్షన్ దగ్గరి ఫ్లై ఓవర్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. -
కిం కర్తవ్యం?
సాక్షి, సిటీబ్యూరో: కేబీఆర్ పార్కు చుట్టూ రూ.586 కోట్ల వ్యయంతో నిర్మించాలనుకున్న ఫ్లై ఓవర్ల పనులు అగమ్య గోచరంగా మారాయి. టెండర్లు పూర్తయి కూడా దాదాపు రెండున్నరేళ్లు దాటినా పనులు ప్రారంభం కాలేదు. పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లతో పర్యావరణానికి హాని కలుగుతుందని పర్యావరణవేత్తలు చేపట్టిన ఆందోళన లతో పనులకు బ్రేక్ పడటం తెలిసిందే. అక్కడ పనులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎకో సెన్సిటివ్ జోన్ అంశానికి సంబంధించి క్లియరెన్స్ రావాల్సి ఉంది. అప్పటి దాకా ఏమీ చేయ లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో టెండర్లను రద్దు చేసుకునే దిశగా అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకు ప్రభుత్వ అనుమతి కోరుతూ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందే దాదాపు నాలుగునెలల క్రితం లేఖ రాసినట్లు సమాచారం. టెండరు పొందిన కాంట్రాక్టరుకు 24 నెలల్లో పనులు చేసేందుకు స్థలాన్ని అప్పగించని పక్షంలో నష్టపరిహారం కోరుతూ కోర్టుకు వెళ్లే అవకాశం ఉండటంతో ఇందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాజెక్టు పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. సిగ్నల్ ఫ్రీ కోసం... ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా నగరంలో సిగ్నల్ ఫ్రీ ప్రయాణం కోసం దాదాపు రూ.25 వేల కోట్లతో ప్రణాళికలు రూపొం దించడం తెలిసిందే. ఎస్సార్డీపీలో మొత్తం ఐదు దశలుండగా, తొలిదశలో తొలిప్యాకేజీ కేబీఆర్‌చుట్టూ ఫ్లై ఓవర్లు, జంక్షన్ల అభివృద్ధి పనులు ఉన్నాయి. అందులో ఆరు ముఖ్యమైన పనులున్నాయి. అవి.. 1. కేబీఆర్‌పార్కు ఎంట్రెన్స్ జంక్షన్ 2. ఫిల్మ్‌నగర్ జంక్షన్ 3. రోడ్ నెంబర్ 45 జంక్షన్ 4. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్ (ఇక్కడ రోడ్డు వెడల్పుతోపాటు పాదచారులకు సదుపాయాలు, ప్రత్యేక బస్‌బేలు, జాగింగ్‌ట్రాక్ తదితరమైనవి ఉన్నాయి) 5. ఎన్ఎఫ్సీఎల్– కేబీఆర్పార్క్ ఎంట్రెన్స్ 6. రోడ్ నెంబర్ 45 – దుర్గంచెరువు జంక్షన్ వరకు ఎలివేటెడ్ కారిడార్. వీటిల్లో దుర్గంచెరువు జంక్షన్ వరకు ఎలివేటెడ్ కారిడార్ పనులు మాత్రం ప్రారంభం కాగా, ఎకో సెన్సిటివ్‌జోన్ అంశంతో ముడిపడి ఉన్నందున మిగతా ఐదు పనులు ప్రారంభానికి నోచుకోలేదు. వీటి రద్దు కోసం ప్రభుత్వానికి రాయడంతో ఇవి కార్యరూపం దాలుస్తాయా.. లేదా అనే సంశయాలు నెలకొన్నాయి. అన్నీ అనుకూలిస్తే కార్యరూపం దాల్చేందుకు ఎంత సమయం పడుతుందన్నది కూడా అంతుపట్టకుండా ఉంది. దాదాపు రూ. 25వేల కోట్ల ఎస్సార్డీపీ పనుల్లో దిగువ పనులున్నాయి. 7 స్కైవేలు : 135 కి.మీ. 11 మేజర్ కారిడార్లు: 166 కి.మీ. 68 మేజర్ రోడ్లు: 348 కి.మీ. ఇతర రోడ్లు: 1400 కి.మీ. గ్రేడ్ సెపరేటర్లు: 54 ♦ ఇవి పూర్తయితే బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్‌సిటీ, కూకట్పల్లి, బాచుపల్లి, పటాన్చెరు, ఆబిడ్స్, చార్మినార్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఉప్పల్, సికింద్రాబాద్, ఈసీఐఎల్, అల్వాల్, కొంపల్లి, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లోని ట్రాఫిక్ కారిడార్లలో సమస్యలు పరిష్కారమవుతాయి. ♦ చింతల్‌కుంట, అయ్యప్పసొసైటీ అండర్‌పాస్‌లు, కామినేని, మైండ్‌స్పేస్ జంక్షన్ల ఫ్లై ఓవర్ల పనులు పూర్తయి ఇప్పటికే అందుబాటులోకి రాగా, షేక్‌పేట, ఫిల్మ్‌నగర్ రోడ్ జంక్షన్, ఓయూ కాలనీ జంక్షన్, విస్పర్‌వ్యాలీ జంక్షన్లలో రూ.333.55 కోట్ల పనులు, బొటానికల్ గార్డెన్, కొత్తగూడ, కొండాపూర్ జంక్షన్లలో రూ.263.09 కోట్ల పనులు ప్రారంభమయ్యాయి. మిగతా పనులు వివిధ ప్రక్రియల్లో ఉన్నాయి. -
‘డబుల్’ వే!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని కొన్ని మార్గాల్లో ఒక వరుసలో రోడ్డు, మరో వరుసలో మెట్రో రైలు మార్గాలు రానున్నాయా..? అంటే అన్నీ అనుకూలిస్తే వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. జైపూర్‌లోని ‘ఎలివేటెడ్ రోడ్, మెట్రో ట్రాక్’ తరహాలో ఒకే పిల్లర్లపై రెండు వరుసల్లో ఒక వరుసలో సాధారణ వాహనాల కారిడార్, మరో వరుసలో మెట్రో రైల్ ట్రాక్ నిర్మించాలని అధికారులు యోచిస్తున్నారు. మెట్రో రెండో దశలో భాగంగా మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు మెట్రో ట్రాక్ రానుంది. ఇదే మార్గంలో ఎస్సార్డీపీలో భాగంగా జీహెచ్ఎంసీ చేపట్టిన వివిధ పనులున్నాయి. ఎన్ఎఫ్సీఎల్ నుంచి ఆల్విన్ చౌరస్తా వరకు దాదాపు 22 కి.మీ.ల మేర మేజర్ కారిడార్‌లో భాగంగా వివిధ ప్రాంతాల్లో జంక్షన్ల అభివృద్ధి, ఫ్లై ఓవర్లు తదితర పనులకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. వీటిల్లో టోలిచౌకి ఓయూ కాలనీ, బొటానికల్ గార్డెన్, నానల్‌నగర్, ఖాజాగూడ, గచ్చిబౌలి, కొండాపూర్, బయో డైవర్సిటీపార్క్, జీవీకే మాల్, మెహదీపట్నం తదితరమైనవి ఉన్నాయి. వీటిల్లో కొన్ని చోట్ల ఇప్పటికే పనులు ప్రారంభం కాగా, మరికొన్ని చోట్ల వివిధ దశల్లో ఉన్నాయి. దాదాపు రూ.2 వేల కోట్ల అంచనా వ్యయం కలిగిన ఈ మేజర్ కారిడార్ పనుల్లో ఇప్పటికే దాదాపు రూ.800 కోట్ల మేర మంజూరై పనులు జరుగుతున్నాయి. ఈ మేజర్ కారిడార్ మార్గంలోనే మెట్రో రెండో దశ కూడా రానుండటంతో భూసేకరణ ఇబ్బందులు, ఖర్చు తదితరమైనవి పరిగణనలోకి తీసుకుని ఎస్సార్డీపీ పనుల ఫ్లై ఓవర్లు, మెట్రోట్రాక్‌లు వేర్వేరుగా కాకుండా రెండింటినీ రెండంతస్తుల్లో నిర్మిస్తే ఎలా ఉంటుందని సంబంధిత అధికారులు యోచించారు. జైపూర్‌లోని ఇలాంటి ప్రాజెక్టును పరిగణనలోకి తీసుకొని నగరంలో సాధ్యాసాధ్యాలపై యోచిస్తున్నారు. వీలైన ప్రాంతాల్లో దిగువ వరుసలో ఎలివేటెడ్ కారిడార్, పై వరుసలో మెట్రో ట్రాక్ నిర్మించవచ్చునని భావిస్తున్నారు. ఇందులో భాగంగా జీవీకే మాల్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం.10, 12, మాసాబ్‌ట్యాంక్, ఎన్ఎండీసీ, మెహదీపట్నం మార్గంలో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ కారిడార్‌లో రోజుకు సగటున రెండు లక్షల వాహనాలు ప్రయాణిస్తుండటటాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని ఈ ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ, మెట్రోరైలు అధికారుల సంయుక్త సమావేశంలో దీనికి సంబంధించి తగు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. -
మరో ఏడు కారిడార్లలో ట్రాఫిక్ ఫ్రీ
సాక్షి, సిటీబ్యూరో: ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా ఇప్పటికే వివిధ మార్గాల్లో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, జంక్షన్ల అభివృద్ధి తదితర పనులు చేపట్టిన జీహెచ్ఎంసీ..త్వరలో మరో ఏడు కారిడార్లలో ‘ట్రాఫిక్ ఫ్రీ’ చర్యలు చేపట్టనుంది. ఆయా మార్గాల్లో ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఎక్కడ ఏవి అవసరమైతే ఆ పనులు చేయనుంది. అందులో భాగంగా మరికొన్ని ఫ్లై ఓవర్లు, జంక్షన్ల అభివృద్ధి, రహదారుల విస్తరణ వంటి పనులు జరుగనున్నాయి. ఏయే మార్గాల్లో ట్రాఫిక్ పరిష్కారానికి ఏయే పనులు చేయాలో డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)ల కోసం కన్సల్టెంట్లకు బాధ్యతలప్పగించారు. కన్సల్టెంట్ సంస్థలనుంచి డీపీఆర్‌లు అందాక టెండర్లు పిలిచి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఓవైపు ఇప్పటికే పనులు ప్రారంభమైన ఎల్బీనగర్ జంక్షన్, కూకట్పల్లి రాజీవ్‌గాంధీ జంక్షన్,బయోడైవర్సిటీపార్క్ జంక్షన్, షేక్‌పేట్ సెవెన్ టూంబ్స్, ఫిల్మ్‌నగర్ రోడ్ జంక్షన్, ఓయూకాలనీజంక్షన్, విస్పర్‌వ్యాలీ జంక్షన్, కొత్తగూడ, కొండాపూర్ జంక్షన్, దుర్గంచెరువుపై కేబుల్‌స్టే బ్రిడ్జి, తదితర పనుల్ని నిర్ణీత వ్యవధిలో పూర్తిచేయడంతోపాటు మరోవైపు ఈ కొత్త పనులకు శ్రీకారం చుట్టనున్నారు. చింతల్‌కుంట, అయ్యప్పసొసైటీ, కామినేని, మైండ్స్పేస్ల వద్ద ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన అండర్‌పాస్‌లు, ఫ్లై ఓవర్లతో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో నగరంలోని అన్ని ప్రధాన మార్గాల్లోనూ వీలైనంత త్వరితంగా ట్రాఫిక్చిక్కుల్ని తొలగించాలని భావిస్తున్నారు. తాము చేపట్టిన ఫ్లై ఓవర్లు,తదితర పనులతోనే మరోమారు నగర ప్రజలు అధికారం కట్టబెట్టారని భావిస్తోన్న టీఆర్ఎస్ నేతలు సైతం ఎస్సార్డీపీ పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపనున్నారు. ట్రాఫిక్ చిక్కులు తొలగనున్న కారిడార్లు ఇవే... ♦ సంగీత్ జంక్షన్–ఉప్పల్–ఎల్బీనగర్ క్రాస్‌రోడ్స్ (అంచనా వ్యయం దాదాపు రూ. 500 కోట్లు). ♦ సచివాలయం– ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం–లిబర్టీ– బషీర్‌బాగ్– జీపీఓ– అఫ్జల్‌గంజ్ (రూ. 500కోట్లు). ♦ పెద్ద అంబర్‌పేట ఓఆర్ఆర్–హయత్‌నగర్–ఎల్బీనగర్ క్రాస్‌రోడ్స్ (రూ.600 కోట్లు). ♦ ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్–పంజగుట్ట–బేగంపేట–హరిహరకళాభవన్–సంగీత్ జంక్షన్( రూ.800 కోట్లు). ♦ తార్నాక–మౌలాలి–ఈసీఐఎల్క్రాస్రోడ్స్–దమ్మాయిగూడ (రూ.500 కోట్లు). ♦ ఈసీఐఎల్ క్రాస్‌రోడ్స్–నేరేడ్మెట్–తిరుమలగిరి క్రాస్‌రోడ్స్(రూ. 300 కోట్లు). ♦ జేబీఎస్–ఆర్పీరోడ్– నెక్లెస్‌రోడ్–సెక్రటేరియట్–లక్డికాపూల్–మాసాబ్‌ట్యాంక్ జంక్షన్(రూ. 1200 కోట్లు). -
హ్యాపీ జర్నీ
గచ్చిబౌలి: ఎప్పటినుంచో కలగా ఉన్న మైండ్‌స్పేస్ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఈ వంతెన ప్రారంభంతో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి.. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్‌తో కలిసి శుక్రవారం వంతెనను ప్రారంభించారు. ఈ సందర్భంగా జోషి మాట్లాడుతూ.. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ చిక్కులు తీరనున్నాయన్నారు. మైండ్‌స్పేస్ ఫ్లైఓవర్ ప్రారంభంతో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. నిర్ణీత సమయానికి ముందే ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేసిన చీఫ్ ఇంజినీర్ శ్రీధర్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. చీఫ్ ఇంజినీర్ శ్రీధర్ మాట్లాడుతూ.. రూ.25 వేల కోట్లతో ఎస్ఆర్డీపీలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టామన్నారు. 111 కి.మీ స్కైవేలు, 366 కి.మీ మేజర్ కారిడార్లు, 166 కి.మీ. మేజర్ రోడ్లు,348 కి.మీ. జంక్షన్లు, 2500 కి.మీ. మైనర్ రోడ్లు ఐదు విడతల్లో అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో రూ.5 వేల కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం చేపట్టనున్నట్టు చెప్పారు. వచ్చే జనవరిలో జేఎన్టీయూ, ఎల్బీనగర్ ఫ్లైఓవర్లు అందుబాటులోకి వస్తాయన్నారు. వంతెన ప్రారంభోత్సవంలో వెస్ట్ జోన్ కమిషనర్ హరిచందన, సైబరాబాద్ కమిషనర్ వి.సి.సజ్జనార్, ట్రాఫిక్ డీసీపీ ఎస్.ఎం.విజయ్ కుమార్, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్రావు, అడిషనల్ డీసీపీలు అమర్ కాంత్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్యామ్ ప్రసాద్‌రావు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఇక సాపీగా రాకపోకలు.. అత్యంత కీలకమైన మైండ్‌స్పేస్ జంక్షన్లో ట్రాఫిక్ సమస్య అత్యంత తీవ్రంగా ఉన్నట్టు జీహెచ్ఎంసీ 2015లో చేపట్టిన అధ్యయనంలో తేలింది. ఇక్కడ గంటకు 14,393 వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని, 2035 నాటికి వాటి సంఖ్య 31,536కు పెరగనుందని అంచనా వేశారు. అందుకు అనుగుణంగా ఇక్కడ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. దీంతో ఇనార్బిట్ మాల్ నుంచి రాడిసన్ హోటల్, బయోడైవర్సిటీ జంక్షన్‌కు ఐదు నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఉదయం సమయంలో జూబ్లీహిల్స్ నుంచి వచ్చే వాహనాలు బయోడైవర్సిటీ, రాడిసన్ హోటల్ వైపు, లెమన్ ట్రీ హోటల్ వైపు వెళ్లవచ్చు. గచ్చిబౌలి వైపు నుంచి వచ్చే వాహనాలు ఇనార్బిట్ మాల్, సైబర్ టవర్, రాడిసన్ హోటల్ వైపు రాకపోకలు చేయవచ్చు. సాయంత్రం ç5 నుంచి రాత్రి 9 గంటల వరకు రాడిసన్ హోటల్, బయోడైవర్సిటీ వైపు నుంచి వాహనాలు ఇనార్బిట్ మాల్, సైబర్ టవర్ వైపు ఎలాంటి అటంకం లేకుండా రాకపోకలు సాగేందుకు మార్గం సులువైంది. అయితే, రాడిసన్ హోటల్ వద్ద జంక్షన్ విస్తరణ జరగకుంటే ట్రాఫిక్ కష్టాలు తప్పవు. డీఎల్ఎఫ్ వైపు వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగే అవకాశం ఉంది. ఈ జంక్షన్ వద్ద ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఆరులేన్ల అండర్‌పాస్ వ్యయం రూ.25.78 కోట్లు. సర్వీస్ రోడ్లు, యుటిలిటీ డక్ట్, డ్రెయిన్ల వ్యయం రూ.28.83 కోట్లు, యుటిలిటీ షిఫ్టింగ్ వ్యయం రూ.5.92 కోట్లు. వెరసి మొత్తం ఖర్చు రూ.108.59 కోట్లు. ఎస్సార్డీపీ పనుల్లో ఇప్పటికే రూ.200 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మరో రూ.3 వేల కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మరో రూ.25 వేల కోట్ల పనులు టెండర్ల ప్రక్రియలో ఉన్నాయి. -
డ్రంక్ అండ్ డ్రైవ్ తప్పించుకోవాలని..
బీజింగ్ : డ్రంక్ అండ్ డ్రైవ్‌ని తప్పించుకోవడానికి మందుబాబులు నానా తంటాలు పడుతుంటారు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారని తెలిస్తే చాలు తప్పించుకోవడానికి మార్గాలు ఆలోచిస్తారు. ఆ దారిని తప్పించి, రాంగ్ రూట్లోనైనా సరే పోలీసులకు చిక్కకుండా వెళ్లి పోవాలనుకుంటారు. చైనాకు చెందిన ఓ ప్రయాణికుడు కూడా ఇదే పని చేశాడు. కానీ ఓ కాలు విరగ్గొట్టుకుని, ఆస్పత్రి పాలయ్యాడు. తీరా అక్కడ వైద్యులు అతన్ని పరీక్షిస్తే అతని రక్తంలో ఆల్కహాల్ కంటెంట్ జీరో అని తెలిసింది. ఈ ఫన్ని సంఘటన చైనాలోని జియాంగ్జు పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని ఒక ఫ్లై ఓవర్ మీద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అదే మార్గంలో వస్తున్న సదరు ప్రయాణికుడు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోతానని భావించి వెనకా ముందు ఆలోచించకుండా ఫ్లై ఓవర్ మీద నుంచి దూకేశాడు. ఈ సంఘటనలో సదరు ప్రయాణికుడి కాలు విరిగిపోయింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు భయపడి వంతెన మీద నుంచి దూకాడంటే ఎంత తాగాడో అని అనుకుంటే పొరపాటు పడినట్లే. ఎందుకంటే ఆ ప్రయాణికుడు డ్రంక్ అండ్ డ్రైవ్ జరిగిన రోజున కాకుండా దానికి ముందు రోజు రాత్రి మద్యం తీసుకున్నాడు. అయినా కూడా అతి తెలివితో పోలీసులకు దొరుకుతానేమోనని భయపడి ఆవేశంలో ఫ్లై ఓవర్ మీద నుంచి దూకి ఆస్పత్రి పాలవ్వడమే కాక ఓ కాలు పోగొట్టుకున్నాడు. -
స్పీడ్ ప్రాజెక్ట్
సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలోని ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా చేపట్టిన మొదటి ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. దేశంలోనే మొదటిసారి కేవలం ఫౌండేషన్స్ తప్ప.. మిగతా పనులన్నీ రెడీమేడ్ (ప్రీ ఫ్యాబ్రికేటేడ్)గా కామినేని వద్ద (ఎడమవైపు) ఈ వంతెన నిర్మాణాన్ని చేపట్టి కేవలం 16 నెలల్లోనే పూర్తి చేశారు. సంప్రదాయ పద్ధతిలో ఫ్లై ఓవర్ల నిర్మాణానికి రెండు నుంచి రెండున్నరేళ్లు పడుతోంది. టెండరు మేరకు.. ఈ వంతెనను సంప్రదాయ పద్ధతిలోనే నిర్మించాల్సి ఉండగా, నగరంలోని రద్దీ ప్రాంతాల్లో పనులను దృష్టిలో ఉంచుకొని కాంట్రాక్టు సంస్థ బీఎస్సీపీఎల్ ‘ప్రీ ఫ్యాబ్రికేటెడ్’ వైపు మొగ్గు చూపింది. ఖర్చు 20 శాతం అధికమైనా తామే భరిస్తామనడంతో ప్రభుత్వం అంగీకరించింది. వివిధ ప్రాజెక్టుల్లో స్తంభాలపైన ఉండే పియర్ క్యాపింగ్ సెగ్మెంట్లు, గర్డర్లకు మాత్రం ప్రీ ఫ్యాబ్రికేటెడ్ను వినియోగిస్తున్నారు. స్తంభాలకు కూడా ప్రీకాస్టింగ్ వాడడం ఇదే ప్రథమం. ‘ప్రీకాస్ట్ అండ్ పోస్ట్ టెన్షన్డ్ టెక్నాలజీ’గా వ్యవహరించే ఈవిధానంతో ఫ్లై ఓవర్‌ను విజయవంతంగా పూర్తిచేశారు. కాగా దీనిని మున్సిపల్ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించనున్నారు. ఇదే పద్ధతిలో మరో 14 నిర్మాణం చైనా, జర్మనీ వంటి దేశాల్లో ఎంతోకాలంగా అనుసరిస్తున్న ఈ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానాన్ని నగరంలో అమలు చేసేందుకు కాంట్రాక్టు సంస్థ ఎండీ బొల్లినేని శీనయ్య ఆసక్తి కనబరిచారు. ప్రభుత్వం ప్రోత్సహించడంతో తాము చేపట్టనున్న మరో 14 ఫ్లై ఓవర్లను సైతం ఇదే పద్ధతిలో నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. కామినేని జంక్షన్ పరిసరాల్లోని మిగతా ఎస్సార్డీపీ పనులు కూడా పూర్తయ్యాక ట్రాఫిక్ సమస్యలు 89 శాతం తగ్గుతాయని జీహెచ్ంసీ చీఫ్ ఇంజినీర్(ప్రాజెక్టŠస్) ఆర్.శ్రీధర్ తెలిపారు. ప్రీ ఫ్యాబ్రికేటెడ్.. పర్యావరణ పరంగానూ మేలైనదన్నారు. ట్రాఫిక్ సమస్యలతో పాటు ధ్వని కాలుష్యం, జంక్షన్ వద్ద విరామ సమయం తగ్గుతుందన్నారు. ప్రజలకు ప్రయాణ సమయం, ఇంధనం ఆదా అవుతాయని ప్రాజెక్ట్ మేనేజర్ బి.మల్లికార్జునయ్య వివరించారు. కొత్త టెక్నాలజీతో ప్రయోగం సాహసమే అయినా ప్రభుత్వం, జీహెచ్ఎంసీ సహకారంతో విజయవంతంగా పూర్తి చేశామన్నారు. రూ.448 కోట్లతో ప్యాకేజీ–2 పనులు ఎస్సార్డీపీ మొదటి దశ ప్యాకేజీ–2లో భాగంగా ఎల్బీనగర్ చుట్టుపక్కల నాలుగు జంక్షన్ల (ఎల్బీనగర్, కామినేని, చింతల్‌కుంట, బైరామల్‌గూడ) వద్ద ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించనున్నారు. వీటికి మొత్తం వ్యయం రూ. 448 కోట్లుగా అంచనా వేశారు. తగ్గనున్న ట్రాఫిక్ చిక్కులు ప్రస్తుతం ఈ ఫ్లై ఓవర్‌తో పాటు ప్యాకేజీ–2 పనులు పూర్తయితే కామినేని జంక్షన్ వద్ద ట్రాఫిక్ చిక్కులు దాదాపు తొలగిపోతాయి. శ్రీశైలం, శంషాబాద్, ఒవైసీ ఆస్పత్రి, విజయవాడ వైపు నుంచి సికింద్రాబాద్, ఉప్పల్ వైపు వెళ్లేవారికి సౌకర్యంగా ఉంటుంది. కుడివైపు ఫ్లై ఓవర్ పనులు జరగాల్సి ఉన్నందున అది పూర్తయ్యేంత వరకు ఈ ఫ్లైఓవర్‌ను ప్రస్తుతానికి సికింద్రాబాద్, ఉప్పల్ వైపు నుంచి ఒవైసీ, శంషాబాద్ వైపు వెళ్లే వారి కోసం వినియోగించనున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కృష్ణారావు తెలిపారు. -
కొండాపూర్ వద్ద ఫ్లై ఓవర్‌కు శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని కొండాపూర్ వద్ద మల్టీ లెవల్ ఫ్లై ఓవర్‌కు మంత్రి కేటీఆర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ ఫ్లైఓవర్‌ను రూ. 263 కోట్లతో నిర్మించనున్నారు. గచ్చిబౌలి నుంచి హాఫిజ్‌పేట్ మార్గంలో నాలుగు లైన్ల ఫ్లై ఓవర్‌కు కూడా శంకుస్థాపన చేశారు. బొటానికల్ గార్డెన్ నుంచి ఓల్డ్ బాంబే రూట్.. కొండాపూర్ నుంచి హైటెక్ సిటీ రోడ్లను కలుపుతూ ఫ్లై ఓవర్ల నిర్మాణం జరగనుంది. హైటెక్‌సిటీ పరిసరాల్లో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు ఈ నాలుగు లేన్ల ఫ్లైఓవర్ ఉపయోగపగనుంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా సౌకర్యాలు మెరుగు పరుస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. సరికొత్త ప్లై ఓవర్‌తో గచ్చిబౌలి నుంచి కొండాపూర్ మీదుగా హఫీజ్ పేట ప్రాంతాలకు వెళ్లే వాహనదారుల ట్రాఫిక్ కష్టాలకు తెరపడుతుందన్నారు. బొటానికల్ గార్డెన్ నుంచి ఓల్డ్ బాంబే రూట్.. కొండాపూర్ నుంచి హైటెక్ సిటీరోడ్లను కలుపుతూ ఈ నిర్మాణం సాగుతుందని తెలిపారు. నగరంలో ఇప్పటికే అనేక ఫ్లైఓవర్లు, అండర్ పాసులు నిర్మాణం కొనసాగుతుందని వాటిని దశవారీగా ప్రారంభోత్సవాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మరో మంత్రి మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ నిర్మాణానికి బ్రేక్
సాక్షి, హైదరాబాద్ : గచ్చిబౌలి బయోడైవర్సిటీ పార్కు వద్ద గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చేపట్టిన ఫ్లై ఓవర్ నిర్మాణ పనులకు హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు నిర్మాణ పనులు చేపట్టవద్దని అధికారులను ఆదేశిస్తూ స్టే ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు గతవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. భూ సేకరణ పరిహారం ఖరారుపై చట్టం నిర్దేశించిన గడువు ను ప్రభావిత వ్యక్తులకు ఇవ్వకపోవడం భూ సేకరణ చట్టం–2013 నిబంధనలకు విరుద్ధమని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. శేరిలింగంపల్లి, రాయదుర్గం పన్మక్త సర్వే నెంబర్ 83/1లో ఏసియన్ గ్లోబల్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు 2,515 చదరపు గజాల స్థలం ఉంది. ఇందులో వాణిజ్య సముదాయ నిర్మాణం నిమిత్తం జీహెచ్ఎంసీ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోగా, ఆయన దాన్ని తిరస్కరించారు. రోడ్డు విస్తరణ నిమిత్తం ఏసియన్ గ్లోబల్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ స్థలాన్ని భూ సేకరణ చట్టం–2013 కింద సేకరించాలని అధికారులు నిర్ణయించి ఆ మేర ఆ కంపెనీకి నోటీసులిచ్చారు. 1,310 చదరపు అడుగల స్థలాన్ని సేకరించనున్నట్లు అందులో పేర్కొన్నారు. దీంతో ఆ కంపెనీకి వాణిజ్య సముదాయం నిర్మించే అవకాశం లేకుండా పోయింది. ఏసియన్ యాజమాన్యం జిల్లా కలెక్టర్ ముందు అభ్యంతరాలను వినిపించగా.. వాటిని తోసిపుచ్చుతూ జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు. దీనిపై ఆ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. వాదనలు విన్నది కలెక్టర్ అయితే జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడంపై హైకోర్టు విస్మ యం వ్యక్తం చేసింది. భూమికి పరిహారం చెల్లించే విషయమై అభ్యంతరాలు వెల్లడించాలంటూ ఏసియన్ యాజమాన్యానికి కలెక్టర్ మరో నోటీసు ఇచ్చారు. అభ్యంతరాలు సమర్పించేందుకు 30 రోజు ల గడువు కావాలని ఏసియన్ యాజమాన్యం జిల్లా కలెక్టర్‌ను కోరింది. అయితే అధికారులు గడువు వర కు వేచి చూడకుండా పరిహారం నిర్ణయిస్తూ స్థలాన్ని ఖాళీ చేయాలని ఉత్తర్వులిచ్చారు. దీనిపై ఏసియన్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించగా.. ఫ్లైఓవర్ నిర్మాణ పనులపై స్టే విధిస్తున్నట్లు వెల్లడిస్తూ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. -
హోంగార్డుల ఆందోళనతో భారీ ట్రాఫిక్ జామ్
-
నగరంలోని ఆ నాలుగు రోడ్లలో నరకం..
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఖైరతాబాద్‌లో హోంగార్డుల ఆందోళనతో సోమవారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్‌లో ఇరుక్కున్న వాహనదారులు సుమారు మూడు గంటలుగా నరకం అనుభవిస్తున్నారు. ట్యాంక్ బండ్ మొదలు ఖైరతాబాద్-నెక్లెస్ రోడ్డు, ఖైరతాబాద్-పంజాగుట్ట, సోమాజిగూడ, రాజ్‌భవన్ రోడ్లలో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. దాదాపు మూడు గంటల సమయం నుంచి ట్రాఫిక్ జామ్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఖైరతాబాద్ సర్కిల్ కావడంతో వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. మహబూబ్‌నగర్‌కు చెందిన గుర్రం గౌడ్ అనే హోంగార్డు ఉద్యోగం నుంచి తొలగించిన 400 మంది హోంగార్డులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలంటూ హోర్డింగ్ ఎక్కి ఆందోళనకు దిగాడు. లేకపోతే పైనుంచి దూకుతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీని కారణంగా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గౌడ్ ఆందోళనకు మద్దతుగా మరో 250 మంది హోంగార్డులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని, ఆందోళనకు దిగారు. తమ ఉద్యోగాలు తమకు ఇవ్వాలంటూ ఖైరతాబాద్ ఫ్లైఓవర్ బైఠాయించారు. పోలీసులు వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.ఉమ్మడి ఏపీలో తొమ్మిదేళ్లు ఉద్యోగం చేయించుకొని, అనంతరం సర్వీస్ నుంచి తొలగించాని ఆవేదన వ్యక్తం చేశారు. 400 మంది హోంగార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోవాంటూ డిమాండ్ చేశారు. తమ ఉద్యోగ హామీ ఇచ్చేంత వరకూ ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, నిరసనకారుడిని కిందకు దించే ప్రయత్నం చేస్తున్నారు. -
విశాఖపట్నంలో మరో ఫ్లైఓవర్!
సాక్షి, విశాఖపట్నం: నగరంలో మరో ఫ్లైఓవర్ రాబోతోంది. ఇప్పటికే ఆశీలుమెట్ట నుంచి రైల్వేస్టేషన్ వరకు ఒకటి, కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ వెళ్లేందుకు మరొక ఫ్లైఓవర్ ఉన్నాయి. ఎన్ఏడీ జంక్షన్లో మరో ఫ్లైఓవర్ నిర్మాణం జరగబోతోంది. తాజాగా కాన్వెంట్ జంక్షన్ నుంచి విశాఖ పోర్టు వరకు మరో కొత్త ఫ్లైఓవర్ రానుంది. దీంతో విశాఖలో ఫ్లైఓవర్ల సంఖ్య నాలుగుకు చేరుతుంది. కేంద్ర ప్రభుత్వం సాగరమాల ప్రాజెక్టులో దీనిని నిర్మించనుంది. ఈ వంతెనకు రూ.60 కోట్లు వ్యయం కానుంది. ఇందులో సివిల్ పనులకు రూ.44.32 కోట్లు ఖర్చు చేయనున్నారు. మొత్తం వ్యయంలో సగం సొమ్మును కేంద్ర ప్రభుత్వం, మిగిలిన సగం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ), విశాఖ పోర్టు ట్రస్టు (వీపీటీ)లు సంయుక్తంగా భరిస్తాయి. ప్రస్తుతం కాన్వెంట్ జంక్షన్ నుంచి పోర్టు వరకు ఉన్న రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డులో ప్రమాదాల బారిన పడి ఏటా సగటున ఐదుగురు మృత్యువాత పడుతున్నారు. పది మందికి పైగా గాయాలపాలవుతున్నారు. పైగా ఈ రోడ్డులో వాహనాల సంఖ్య పెరిగిపోతుండడంతో ట్రాఫిక్ రద్దీ అధికమవుతోంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీంతో కేంద్రం దీనిని సాగరమాల ప్రాజెక్టులో చేర్చింది. కాన్వెంట్ జంక్షన్ నుంచి పోర్టు లోపల ఉన్న అంబేడ్కర్ విగ్రహం వరకు 724 మీటర్ల మేర ఈ ఫ్లైఓవర్‌ను నిర్మిస్తారు. ఇందుకోసం ఇటీవల టెండర్లను కూడా పిలిచారు. వీటిలో అత్యల్పంగా కోట్ చేసిన సంస్థకు నెలాఖరుకల్లా టెండరు ఖరారు చేయనున్నామని ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి చెప్పారు. -
ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌పై కారు బోల్తా
హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌పై శుక్రవారం రాత్రి అదపుతప్పి ఓ కారు బోల్తా పడింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో కారులోని ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ కావడంతో.. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇది గుర్తించిన పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ కావడం వల్లే ప్రాణాపాయం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో నలుగురు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆ ప్లైఓవర్ పేరు మారింది!
బంజారాహిల్స్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమాజిగూడ సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట ఫ్లై ఓవర్‌కు రాత్రికి రాత్రి సెప్టెంబర్ 17 వంతెన పేరుతో బోర్డు ఏర్పాౖటెంది. సీఎం క్యాంపు కార్యాలయం ముందు, పంజాగుట్ట ఫ్లై ఓవర్ ముగిసే ప్రాంతంలో రెండు ప్రాంతాల్లో బోర్డులు కనిపించాయి. తెలంగాణ ప్రజల తీర్మానం పేరుతో నేటి నుంచి ఈ వంతెన పేరు 17 సెప్టెంబర్ ఫ్లై ఓవర్‌గా.. భారత సైన్యానికి ప్రజలు స్వాగతం పలికిన చౌరస్తా అంటూ భారతీయ జనతా పార్టీ పేరుతో బోర్డులు ఏర్పాటు చేశారు. -
ఆ కారు మరో రెండు కార్లను ఢీకొట్టింది
హైదరాబాద్: నగరంలోని హైటెక్ సిటీ ప్లై ఓవర్ పై ఆదివారం రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వస్తున్న కారు ఎదురుగా వస్తున్న మరో రెండు కార్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు కార్లు పూర్తిగా ధ్వంసం కాగా, పలువురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బందరు పోర్టుకు 3 నెలల్లో పూలింగ్ పూర్తి
సాక్షితో కలెక్టర్ బాబు.ఎ కలెక్టర్‌గా కృష్ణా జిల్లాకు ఒక టర్నింగ్ పాయింట్ సమయంలో వచ్చాను. కొత్త రాష్ట్రం ఏర్పడడం, కొత్తగా రాజధాని రావడం, విజయవాడ నగరానికి పెద్ద ప్రాజెక్టులు తేవాలనే ప్రభుత్వ సంకల్పానికి అధికారుల సహకారం తీసుకోవడం పెద్ద సవాల్‌గా చెప్పవచ్చు. నాలుగు హైవేలు, ఒక పోర్టు, ఎయిర్పోర్ట్, గ్రామస్థాయిలో రోడ్లు వేయడం, విద్యుదీకరణ వంటి మంచి పనులు చేసేందుకు అవకాశం కలిగింది. కనకదుర్గ ఫ్లైవోవర్, మెట్రో రైలు ప్రాజెక్ట్, ఇన్నర్ రింగ్‌రోడ్డు పనులను త్వరితగతిన పూర్తిచేయించడం నాకో చాలెంజ్. బందరు పోర్టుకు మూడు నెలల్లో ల్యాండ్ పూలింగ్ పూర్తిచేస్తాం. టీమ్ కృష్ణా పేరుతో పరిపాలనలో సంస్కరణలు తీసుకొస్తున్నాం.. అని కలెక్టర్ బాబు.ఎ. చెప్పారు. బుధవారం ఆయన సాక్షి ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు సంగతులు చెప్పారు. సాక్షి: జిల్లా గురించి ఏం చెప్పదలుచుకున్నారు? కలెక్టర్: కొత్తగా రాష్ట్రం ఏర్పడింది. కొత్త రాజధాని వచ్చింది. కృష్ణాజిల్లాను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి పథకాల అమలు, పరిపాలనాపరమైన సంస్కరణలు తీసుకురావాలని సీఎంగారు చెప్పారు. ఆ దిశగా ముందుకు సాగుతున్నాను. టీమ్ వర్క్ ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నాం. సాక్షి: ఈ-పోస్ విధానం అమలుపై మీ స్పందన? కలెక్టర్: ఈ విధానాన్ని దేశంలోనే తొలిసారిగా కృష్ణా జిల్లాలో ప్రారంభించాం. అనుకున్నది సాధించాం. అంగన్వాడీ సరకులు కూడా ఈ-పోస్ విధానంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం ద్వారానే ఇస్తున్నాం. ఈ సంవత్సరం రూ.56 కోట్ల విలువైన సరకులు అక్రమార్కుల చేతుల్లోకి పోకుండా కాపాడాం. సాక్షి: పింఛన్లు సరిగా అందడం లేదనే దానిపై ఏమంటారు? కలెక్టర్: పింఛన్లు అందలేదనేది అవాస్తవం. ప్రతి నెలా ఒకటి నుంచి ఐదో తేదీలోపు 90 శాతం మందికి పింఛన్లు ఇస్తున్నాం. సాక్షి: ఈ-వైద్యం మాటేమిటి? కలెక్టర్: ఈ-వైద్యం చాలా ముఖ్యమైనది. జీజీహెచ్, ఇతర వైద్యశాలల్లో దీనిపై కసరత్తు జరుగుతున్నది. ఇప్పటికే కంప్యూటర్లో పేషంట్ వివరాలు పొందుపరిచాము. ఇన్‌పేషంట్ వివరాలు పూర్తిస్థాయిలో ఉంటాయి. అవుట్ పేషంట్ వివరాలు కూడా ఎప్పటికప్పుడు పొందుపరుస్తున్నాం. ఇన్‌పేషంట్ విషయంలో అన్ని రకాల టెస్ట్‌లు, ట్రీట్మెంట్కు సంబంధించిన వివరాలు ఉంటాయి. ఆ పేషంట్ పేరు నమోదు చేయగానే గతంలో చేసిన వైద్యం, టెస్ట్‌ల వివరాలన్నీ కంప్యూటర్లో చూపిస్తాయి. దీనిని బట్టి తగిన వైద్యం అందించేందుకు సులువవుతుంది. అన్నిచోట్ల త్వరలోనే పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సాక్షి: జీజీహెచ్‌లో ఉన్న సమస్యలపై ఏమంటారు? కలెక్టర్: జీజీహెచ్‌లో సౌకర్యాలకు రూ.86 కోట్లు అవసరమని ప్రభుత్వాన్ని కోరగా, రూ.4 కోట్లు రిలీజ్ చేసింది. ఆస్పత్రిలో నూరుశాతం ప్రక్షాళన జరగలేదు. సాక్షి: మచిలీపట్నం అభివృద్ధి గురించి ఏమి చెప్పదలుచుకున్నారు? కలెక్టర్: మచిలీపట్నాన్ని చూడగానే జిల్లాస్థాయిలో దిగజారుతున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే పోర్టును అభివృద్ధి చేయాల్సి ఉంది. సాక్షి: పుష్కర ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? కలెక్టర్: ఈ పుష్కరాలకు పెద్దఎత్తున భక్తులు వస్తారని భావిస్తున్నాను. డిసెంబరులో పనులు మొదలు పెడుతున్నాం. సాక్షి: మెట్రో రైల్ ప్రాజెక్టు, ఎయిర్‌పోర్టు విస్తరణ పనులు ఎంతవరకు వచ్చాయి? కలెక్టర్: మెట్రోకు సర్వే పూర్తయింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా స్పీడ్‌గా పనులుచేయిస్తాం. ఎయిర్‌పోర్టులో టెర్మినల్ పనులు పూర్తి కావచ్చాయి. ల్యాండ్ పూలింగ్‌కు నోటిఫికేషన్ ఇచ్చాం. సాక్షి: జిల్లాలో రబీ పరిస్థితి ఏమిటి? కలెక్టర్: రబీ పంటకు సాగునీరు వస్తుంది. ఈ ఏడాది వర్షాలు సరిగ్గా లేనందున 40వేల హెక్టార్లలో రైతులు ఖరీఫ్ పంట వేయలేకపోయారు. జిల్లాలో 14 కరువు మండలాలను ప్రభుత్వం ప్రకటించింది. సాక్షి: రైతుల ఆత్మహత్యలపై మీ స్పందన ఏమిటి? కలెక్టర్: వారి ఆత్మహత్యలకు పంటలు పండకపోవడం ఒక్కటే కారణం కాదు. అయినా వారిలో చైతన్యం నింపేందుకు ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. సాక్షి: మీకోసంలో వస్తున్న అర్జీల పరిష్కారం సరిగ్గా లేదని ఆరోపణ ఉంది? కలెక్టర్: ఈ ఏడాది ఇప్పటివరకు మీకోసం, జన్మభూమి కార్యక్రమాల ద్వారా ఐదున్నర లక్షల అర్జీలు వచ్చాయి. వీటిలో 65 వేలు మినహా మిగిలిన అర్జీలన్నీ పరిష్కరించాం. సాక్షి: ఇసుక దందాను అరికట్టడంలో విఫలమయ్యారనే విమర్శ ఉంది? కలెక్టర్: ఇసుక రీచ్‌లలో ఇంటర్నెట్ ద్వారా సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి కంట్రోల్ పాయింట్ విజయవాడలో పెట్టాం. సత్ఫలితాలనిస్తోంది. సాక్షి: రాజధాని పనులు ఎలా జరుగుతున్నాయి? కలెక్టర్: ఇది ఒక్క రోజుతో అయ్యేది కాదు. ‘టీమ్ కృష్ణా’ పేరుతో ఒక టీమ్‌ను ఏర్పాటుచేసి పనులను వేగవంతంగా ముందుకు తీసుకుపోతున్నాం. సాక్షి: పరిపాలనా విధానంలో తీసుకొచ్చిన మార్పులేమిటి? కలెక్టర్: ఈ-ఆఫీస్ విధానాన్ని అమల్లోకి తెచ్చాం. ఇంకా పూర్తి కాలేదు. అన్ని కార్యాలయాల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. - సాక్షి ప్రతినిధి, విజయవాడ సాక్షి: పోర్టు భూసేకరణను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు కదా? కలెక్టర్: ల్యాండ్ పూలింగ్ ద్వారానే భూములు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాం. రాజధానికి ఇచ్చినట్లుగానే ఇక్కడ కూడా ఒక ప్యాకేజీ అమలు చేస్తే బాగుంటుందనే ఆలోచనకు వచ్చాం. మూడు నెలల్లో ల్యాండ్ పూలింగ్ పూర్తవుతుంది. సాక్షి: కనకదుర్గ వద్ద ఫ్లైవోవర్ పుష్కరాలకు పూర్తవుతుందా? కలెక్టర్: తప్పకుండా. పుష్కరాలకు ముందే ఫ్లైవోవర్‌పై నుంచి రాకపోకలు జరుగుతాయని నూరు శాతం నమ్మకం నాకుంది. -
‘ప్రిన్సెస్’ ఫ్లై ఓవర్ మరమ్మతు పనులు ప్రారంభం
- రూ. 68 లక్షలు కేటాయించిన బీఎంసీ - రెండు దశల్లో ఈ నెల 18 నుంచి 24 వరకు మరమ్మతు పనులు - పనులు పూర్తయ్యే వరకు భారీ వాహనాల ప్రవేశం నిషేధం సాక్షి, ముంబై: మెరిన్లైన్స్ స్టేషన్ సమీపంలో ఉన్న ప్రిన్సెస్ స్ట్రీట్ ఫ్లై ఓవర్ మరమ్మతు పనులను బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సోమవారం నుంచి ప్రారంభించనుంది. ఈ బ్రిడ్జిలోని దాదాపు 36 జాయింట్లకు మరమ్మతు చేపట్టనున్నారు. 50 ఏళ్ల కిందట నిర్మించిన ఈ ఫ్లై ఓవర్ మరమ్మతులకు రూ.68 లక్షలు వెచ్చించనున్నట్లు బీఎంసీ అధికారులు వెల్లడించారు. ఈ పనులను రెండు దశల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. మొదటి దశ పనులను ఈ నెల 18 నుంచి 24 వరకు, రెండో దశ పనులు 24 నుంచి 31వ తేదీ వరకు చేపట్టనున్నారు. బ్రిడ్జిల విభాగ చీఫ్ ఇంజనీర్ ఎస్.ఓ.కోరి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మరమ్మతు పనులకు సంబంధించిన అన్ని అనుమతులను ఇదివరకే తీసుకున్నామని, రెండు దశల్లో ఈ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. అంతేకాకుండా ట్రాఫిక్ మళ్లింపునకు సంబంధించిన పనులు కూడా ఇదివరకే నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మొదటి దశ పనుల్లో ఎన్.ఎస్.రోడ్, శ్యామల్‌దాస్ గాంధీ మార్గ్ నుంచి ప్రిన్సెస్ స్ట్రీట్ ఫ్లై ఓవర్‌కు వచ్చే భారీ వాహనాలకు ఎంట్రీని నిషేధించామని తెలిపారు. శ్యామల్‌దాస్ గాంధీ మార్గ్ నుంచి వచ్చే వాహనాలు ఈ ఫ్లైఓవర్ ఎడమ వైపు నుంచి వెళ్లాలని, లేదా నేరుగా ఎం.కె.రోడ్‌కు చేరుకోవాల్సి ఉంటుందని అన్నారు. 18వ తేదీ నుంచి బ్రిడ్జి మరమ్మత్తు పనులు పూర్తయ్యేవరకు శ్యామల్ దాస్ గాంధీ మార్గ్ రోడ్డు ఇరు వైపులా వాహనాలు పార్క్ చేయకూడదని అన్నారు. మార్గ్ నుంచి శ్రీ పటన్ జైన్ మండల్‌కు వచ్చే వాహనాలు ఈ ఫ్లై ఓవర్‌పై నేరుగా వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత ఎన్.ఎస్.రోడ్లో ప్రవేశించి తర్వాత మఫత్‌లాల్ బత్ సిగ్నల్ నుంచి యూ టర్న్ తీసుకొని నేరుగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. బ్రిడ్జిల మరమ్మతులు చేయాల్సిందిగా బీఎంసీకి చెందిన స్టాండింగ్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (ఎస్టీఏసీ) సిఫార్సు చేసింది. 2009-10 నుంచి బ్రిడ్జిల స్థితి గతులపై అధ్యయనం నిర్వహించింది. 57 బ్రిడ్జిల్లో 34 అపాయకరంగా ఉన్నాయని ఆ అధ్యయనంలో వెల్లడైంది. ఈ ఫ్లై ఓవర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు దీనికి మరమ్మత్తులు నిర్వహించడం ఇదే తొలిసారి. -
సప్త పథం
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో రాచమార్గాల నిర్మాణానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ట్రాఫిక్ సిగ్నళ్లు లేకుండా.. రయ్య్న దూసుకెళ్లేందుకు వీలుగా వివిధ జంక్షన్లను అభివృద్ధి చేయనున్నారు. దీనికి అధునాతన స్కైవేలు.. ఎక్స్‌ప్రెస్ కారిడార్లు.. మల్టీలెవెల్ గ్రేడ్ సెపరేటర్లు అవసరమని భావిస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి తొలిదశలో రూ.1250 కోట్లతో వీటిని నిర్మించనున్నట్టు ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రద్దీ దృష్ట్యా అత్యధిక ప్రాధాన్యం కలిగిన ఏడు ప్రాంతాల్లో పనులకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ఏడింటిలో అత్యధిక రద్దీ కలిగిన ఐదు జంక్షన్లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఎలాం టి ట్రాఫిక్ ఆంక్షలు... రెడ్ సిగ్నళ్లు లేకుండా వాహనదారులు ముందుకు వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు. వీటిలో ఫ్లై ఓవర్లు... అండర్‌పాస్‌లు.. రహదారి విస్తరణ.. ఇలా అవసరానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయనున్నారు. వీటికి దాదాపు రూ.1225 కోట్లు ఖర్చు కాగలదని ప్రాథమిక అంచనా. ఉప్పల్ వంటి ప్రాంతాల్లో మెట్రో రైలు మార్గానికి పైవరుసలో కానీ, దిగువ వరుసలో కానీ రహదారులు, ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు. వీటికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదికలు రూపొందించాల్సి ఉంది. వీటిలో జీహెచ్ఎంసీ మార్గాలు కొన్ని కాగా... ఆర్అండ్బీ పరిధిలో కొన్ని ఉన్నాయి. ఎల్బీనగర్, ఉప్పల్, బాలానగర్, రసూల్‌పురా జంక్షన్లు ఆర్అండ్బీ పరిధిలో ఉన్నాయి. అక్కడ ఎలాంటి పరిష్కార ‘మార్గం’ చూపుతారో తేలాల్సి ఉంది. జీహెచ్ఎంసీ చేపట్టనున్న వాటిలో దుర్గం చెరువు బ్రిడ్జి, కేబీఆర్ పార్కు జంక్షన్లు, జీవ వైవిధ్య పార్కు నుంచి కూకట్పల్లి మార్గం ఉన్నాయి. జూబ్లీహిల్స్ రోడ్డు నెం.45 నుంచి దుర్గం చెరువు మీదుగా ఇనార్బిట్ మాల్ వరకు రాచమార్గం నిర్మించనున్నారు. -
‘నయాసాల్’కు ట్రాఫిక్ ఆంక్షలు
⇒ నేటి రాత్రి 10 నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు అమలు ⇒ ఫ్లై ఓవర్ల మూసివేత.. ⇒ పలు మార్గాల్లో వాహనాల దారి మళ్లింపు సాక్షి, సిటీబ్యూరో: కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా పలు రహదారులు, ఫ్లై ఓవర్‌పై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ జంట పోలీసు కమిషనర్లు ఎం.మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జంట కమిషనరేట్లలోని ఫ్లై ఓవర్లను నేటి రాత్రి మూసివేస్తారు. ఆంక్షలు బుధవారం రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు జాము 2 గంటల వరకు అమలులో ఉంటాయని వారు తెలిపారు. ఆంక్షలు ఇలా.. ⇒ ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్డు, అప్పర్ ట్యాంక్‌బండ్‌పై వాహనాలను అనుమతించారు. ⇒ వీవీ విగ్రహం నుంచి నెక్లెస్‌రోడ్డు, ఎన్టీఆర్ మార్ట్ వైపు వచ్చే వాహనాలు వీవీ విగ్రహం నుంచి ఖైరతాబాద్- రాజ్‌భవన్ రోడ్డు వైపు వెళ్లాలి. ⇒ బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్ట్ మీదుగా వచ్చే వాహనాలను ఇక్బాల్ మినార్ నుంచి లక్డీకాపూల్, అయోధ్య హోటల్ వైపు వెళ్లాలి. ⇒ లిబర్టీ జంక్షన్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాహనాలను జీహెచ్ఎంసీ కార్యాలయం వై జంక్షన్ నుంచి బీఆర్కే భవన్, తెలుగుతల్లి, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, లక్డీకాపూల్, అయోధ్య హోటల్ మీదుగా మళ్లిస్తారు. ⇒ సచివాలయంను ఆనుకుని ఉన్న మింట్ కాంపౌండ్ రోడ్డుపై సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించ రు. ⇒ ఓఆర్ఆర్పై కూడా వాహనాలను అనుమతించరు. కేవలం విమాన ప్రయాణికులు తమ టికెట్లను చూపిస్తే అనుమతిస్తారు. ఔటర్‌పై కూడా.. శంషాబాద్ రూరల్: నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. ఇది గురువారం ఉదయం వరకు అమలులో ఉంటుంది. బుధవారం సాయంత్రం నుంచి పోలీసు నిఘా పెంచి గస్తీని ముమ్మరం చేయనున్నారు. గచ్చిబౌలి, తొండుపల్లి, పెద్ద గోల్కొండ, తుక్కుగూడ, బొంగులూరు, పెద్ద అంబర్పేట్ తదితర ప్రాంతాల్లోని టోల్గేట్ల వద్ద వాహనాల రాకపోకలను నియంత్రించనున్నారు. -
ముంబై-గోవా హైవేపై ఫ్లై ఓవర్లు
సాక్షి, ముంబై: ముంబై-పుణే నేషనల్ హైవేపై మరో 10 చోట్ల ఫ్లై ఓవర్లను నిర్మించడానికి అధికారులు నిర్ణయించారు. మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (ఎమ్మెస్సార్డీసీ) ఈ హైవేపై ఎక్కువగా ట్రాఫిక్ జామ్‌లు చోటుచేసుకుంటున్న 10 జంక్షన్లను గుర్తించింది. దీంతో ఈ స్థలాలలో బ్రిడ్జిలను నిర్మించేందుకు ఎమ్మెస్సార్డీసీ యోచిస్తోంది. దీంతో వాహన దారులు త్వరగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని ఎమ్మెస్సార్డీసీ అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రాజెక్టును రూ.300 కోట్ల అంచనావ్యయంతో చేపట్టనున్నట్లు తెలుస్తోంది.ఈ సందర్భంగా ఎమ్మెస్సార్డీసీ చీఫ్ ఇంజినీర్ అరుణ్ డియోధర్ మాట్లాడుతూ.. పాత ముంబై-పుణే హైవేపై 10 రద్దీ గా ఉండే జంక్షన్లను గుర్తించామన్నారు. ఇక్కడ తరచూ ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. దీంతో వాహన చోదకులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా వాహన కదలికలు సులభంగా జరిగే విధంగా ఆయా ప్రాంతాల వద్ద బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామన్నారు. ఈ నిర్మాణ పనులు ప్రారంభం కాకముందే ఓ సూపర్ విజన్ ఇంజినీర్‌ను నియమించాలని భావిస్తున్నామన్నారు. దీని ద్వారా ఈ నిర్మాణ పనులు త్వరగా పూర్తి అవుతాయని ఆయన పేర్కొన్నారు. ఇందుకు గాను టెండర్లను కూడా ఆహ్వానించామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో హైవేపై ట్రాఫిక్ జామ్‌లు ప్రధాన సమస్యలుగా తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఘాట్ సెక్షన్లలో ఈ ట్రాఫిక్ జామ్ సమస్యలు వస్తున్నాయి. లోనావాలా, పుణే చేరురోవడానికి చాలా మంది వాహనదారులు ఎన్‌హెచ్-4 రహదారిని ఉపయోగిస్తున్నారు. ఇక్కడ తక్కువ టోల్ చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా, హైవేపై రద్దీ ఎక్కువగా ఉండే 14 స్థలాలను ఎమ్మెస్సార్డీసీ గుర్తించి, వాటిలో 10 స్థలాలను ఎంచుకుంది. ఈ బ్రిడ్జిలు 300 నుంచి 500 మీటర్ల పొడవు ఉంటాయి. ఈ మార్గంలో ఉంటున్న చుట్టు పక్కల ప్రాంతాల వారి భద్రతను దృష్టిలో ఉంచుకొని వీటి నిర్మాణం చేపట్టనున్నారు. ఇక్కడ ఉంటున్న వారు హైవేను దాటాలంటే సిగ్నల్ కోసం వేచి ఉండాల్సి ఉంటుంది. సిగ్నల్స్ జంప్ చేసి వెళ్లే కార్ల నుంచి కూడా వీరు రిస్కులో పడతారు. దీంతో జంక్షన్లపై నుంచి ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టడంతో ఈ ప్రాంతాల వారు సురక్షితంగా బ్రిడ్జి కింది నుంచి రోడ్డు దాటవచ్చని అధికారి తెలిపారు. నేషనల్ హైవే-4 మీదుగా పుణే నుంచి ముంబై చేరుకోవాలంటే దాదాపు 4-5 గంటల సమయం పడుతోంది. ఈ నిర్మాణాలు పూర్తి కాగానే ప్రయాణ సమయం మూడు గంటలు పడుతుందని అధికారి తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మూడు ఏళ్లు పడుతోందని అధికారి తెలిపారు. గోవా హైవే వెడల్పునకు గ్రీన్‌సిగ్నల్ ముంబై-గోవా హైవేను వెడల్పు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. నవంబర్ చివరి వారంలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ 20 కి.మీ. మేర ఈ హైవేను వెడల్పు చేసే ప్రతిపాదనను క్లియర్ చేసింది. ముంబై-గోవా మొదటి 84 కి.మీ మేర పన్వేల్-ఇందాపూర్ మధ్యలో రోడ్డును వెడల్పు చేసే ప్రతిపాదన ఏడాదిన్నర క్రితమే పూర్తి అయింది. కానీ మరో విడత 25 కి.మీ మేర ప్రతిపాదన గత మూడేళ్ల నుంచి పెండింగ్‌లో ఉంది. పర్యావరణం నుంచి ఈ ప్రతిపాదనకు అనుమతి లభించడంలో జాప్యం జరిగింది. అంతేకాకుండా భూసేకరణ విషయంలో కూడా తీవ్ర ఇబ్బందులు తలెత్తాయని అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు పర్యవరణం నుంచి అనుమతి లభించడం ఎంతో ముఖ్యమైందిగా పేర్కొన్నారు. మిగితాది ఇందాపూర్-గోవా సరిహద్దు వరకు ఉన్న 350 కి.మీ వరకు టెండర్ల కోసం సిద్ధంగా ఉంది. ఇందుకు సంబంధించిన స్థల సేకరణ, అనుమతులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి అయిన వెంటనే పనులు ప్రారంభిస్తామని అధికారి తెలిపారు. ఈ పనులు ప్రారంభించేందుకు మరో ఏడాది పడుతుందని అధికారి తెలిపారు. అనంతరం పనులు పూర్తి కావడానికి మరో మూడు ఏళ్లు పడుతోందన్నారు. ఈ గోవా హైవేను నాలుగు లేన్లతోపాటు డివైడర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అదేవిధంగా మార్గం ఇరువైపుల సురక్షితమైన సేఫ్టీ వాల్స్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ హైవేను వెడల్పు చేయడంలో ఎంత జాప్యం జరుగుతోందో అంత ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రమాదాలు జరిగినప్పుడల్లా ట్రాఫిక్‌ను పుణే-కొల్హాపూర్ మార్గం నుంచి గోవాకు దారి మళ్లించాల్సి ఉంటుంది. 2006 జనవరి నుంచి 2012 డిసెంబర్ వరకు గోవా హైవేపై 7,721 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అదేవిధంగా 1,731 మరణాలు సంభవించాయి. దీంతో ముంబై నుంచి సూరత్, నాసిక్, పుణేల మార్గాలను వెడల్పు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎంతో ముఖ్యమైన ముంబై-గోవా మార్గాన్ని వెడల్పు చేయడంలో అధికారులు ప్రదర్శిస్తున్న తీవ్ర జాప్యంపై నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్‌హెచ్-17 పై ఎలాంటి ట్రామే కేర్ సెంటర్ లేదు. అంతేకాకుండా అన్ని సదుపాయాలతో కూడుకొని ఉన్న అంబులెన్స్ కూడా లేదన్నారు. దీంతో ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను త్వరగా చికిత్స నిమిత్తం తరలించడంలో జాప్యం జరుగుతుండడంతో మరణా లు ఎక్కువగా సంభవిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. -
ఫ్లై ఓవర్‌పై నిర్లక్ష్యపు నీడలు
రామకృష్ణాపూర్ : నిధులు లేక మూలిగే పనులు.. ప్రభుత్వ అనుమతి కోసం వేచి ఉన్న పనులు.. సర్వసాధారణంగా వింటుంటాం. కానీ.. పని మంజూరై కోట్ల నిధులుండీ అతీగతీ లేని పరిస్థితి రామకృష్ణాపూర్ రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జికి పట్టుకుంది. అక్షరాలా రూ.30 కోట్ల నిధులు అధికారుల నిర్లక్ష్యం కారణంగా మూలుగుతున్నాయి. సమగ్ర సర్వే జరిపి, ఉన్నతాధికారులకు నివేదికలు పంపాల్సిన రెవెన్యూ శాఖ తాత్సార వైఖరితో ప్రజలు తంటాలు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. రామకృష్ణాపూర్-మంచిర్యాల మార్గంలో ఉన్న రైల్వే లైన్‌పై ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. గత ఫ్రిబవరి నెలలో కొత్త బ్రిడ్జి మంజూరైంది. 30 కోట్ల నిధులు కూడా విడుదల అయ్యాయి. క్యాతన్‌పల్లి గ్రామ పంచాయతీ ప్రాంతంలో దీన్ని నిర్మించాల్సి ఉంది. దీనికి 8 ఎకరాల 20 గుంటల్లో ప్రైవేట్ భూమి అవసరం పడుతుండగా మిగిలింది రైల్వే శాఖ భూమి ఉంది. మొత్తం 11 వందల మీటర్ల పొడవున బ్రిడ్జి నిర్మించడానికి అంచనా వేశారు. ప్రస్తుతమున్న రైల్వే లైన్ నుంచి అటు ఇటూ 550 మీటర్ల పొడవున బ్రిడ్జి నిర్మానం చేపట్టాల్సి ఉంది. కాగా ఒకరిద్దరూ అడ్డుపడుతున్నారనే సాకును తీసుకుని రెవెన్యూ అధికారులు జాప్యం చేస్తున్నారని ప్రజాప్రతినిధులే పేర్కొంటున్నారు. అతీగతీ లేని నివేదిక... ప్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో రెవెన్యూ శాఖ పాత్ర కీలకం. ఎంత పొడవు బ్రిడ్జి నిర్మాణం జరుపుతున్నార్నది ఆ శాఖ గుర్తించాలి. దీనికి సంబంధించి భూ సేకరణ జరపాలి. బ్రిడ్జి నిర్మిస్తున్న ప్రాంతంలో ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఎన్ని ఎకరాల్లో ఉన్నాయనేది సర్వే చేయాలి. అదేవిధంగా ఎంతమందికి పరిహారం చెల్లించాల్సి వస్తుంది అన్న అంశాల్ని రెవెన్యూ శాఖ పరిశీలించాల్సి ఉంటుంది. వివిధ కోణాల్లో సర్వే చేపట్టి సదరు నివేదికను ఉన్నతాధికారులకు పంపాలి. కాని ప్రారంభంలో తూతూమంత్రంగా కొలతలు చేసిన నేడు ముఖం చాటేస్తున్నారు. ఈ నిర్లక్ష్యం కారణంగానే బ్రిడ్జి నిర్మాణం అమలుకు నోచుకోవడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే రైల్వే, ఆర్అండ్బి శాఖలు తమ పని పూర్తి చేశాయి. రైల్వే శాఖ,ఆర్అండ్బీ ఆధ్వర్యంలో బ్రిడ్జి అలైన్మెంట్ పనిని పూర్తి చేసి నివేదికను సైతం కేంద్రానికి పంపించడం జరిగింది. మిగిలిందల్లా రెవెన్యూ శాఖ పని మాత్రమే. బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి ఏ సర్వే నంబర్లో ఎంత భూమి ఉంది..? భూమి తాలూకూ విలువ.. దానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక పంపాలి. అయితే రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాత్సారంతో తంటాలు... రైల్వే లైన్‌పై ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం మంజూరైందన్న మాటే గాని అది ఆచరణకు నోచుకోక పోతుండడంతో ప్రజలకు తంటాలు తప్పడం లేదు. రామకృష్ణాపూర్-మంచిర్యాల మార్గంలోని ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే దాదాపు 30 గ్రా మాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పట్టణంతో పాటు అమరవాది, పొన్నారం, మందమర్రి, చిర్రకుం ట, సారంగపెల్లి, తుర్కపల్లి, సండ్రోన్‌పల్లి.. తదితర గ్రామాల్లోని ప్రజలకు బ్రిడ్జి నిర్మాణంతో ఎంతో ఊరట కలిగేది. హైదరాబాద్-న్యూఢిల్లీ ప్రధాన రైలు మార్గం కావడంతో ఈ మార్గంలో పదేపదే గేట్ వేస్తుండడం వల్ల ప్రయాణీకులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా వైద్య చికిత్సలకు మంచిర్యాలకు వెళ్లే సమయాల్లో గేటు పడుతుండడంతో తిప్పలు తప్పడం లేదు. ఈ బాధలు తీరుతాయని, నిరీక్షించే పరిస్థితి సమసి పోతుందని ఆశించిన ప్రజలు నిరాశకు గురవుతున్నారు. దశాబ్దాల డిమాండ్ తీరిపోతుందని అనుకుంటున్న క్రమంలో అధికారుల నిర్లక్ష్య ధోరణి ఉన్న నిధుల్ని వెనక్కీ పంపే పరిస్థితి నెలకొందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా స్పందించి బ్రిడ్జి నిర్మాణానికి సహకరించాలని అధికారులను కోరుతున్నారు. -
కాగితాల నుంచి నిర్మాణానికి..
సాక్షి, ముంబై : తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ముంబైకర్లకు శుభవార్త. కొద్ది సంవత్సరాలుగా కాగితాలకే పరిమితమైన బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)-చునాబట్టి ప్రాంతాలను కలిపే ఫ్లై ఓవర్ ప్రతిపాదనకు త్వరలో మోక్షం లభించనుంది. ముంబైలో ప్రభుత్వ, ప్రైవేటు కార్పొరేట్ కార్యాలయాలకు బీకేసీ ప్రధాన నిలయంగా మారింది. ఈ ప్రాంతం అతి తక్కువ సమయంలోనే ప్రసిద్ధి గాంచింది. ఇక్కడికి నిత్యం ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం వచ్చే వారి సంఖ్య దాదాపు లక్షాపైనే ఉంటుంది. వీరి సౌకర్యార్థం బీకేసీ నుంచి చునాబట్టి వరకు పశ్చిమ-తూర్పు ప్రాంతాలను కలిపేందుకు 1.6 కి.మీ. ఫ్లై ఓవర్ నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆ మేరకు ముందుగా రూపొందించిన ప్రణాళిక ప్రకారం మిఠీనది పరిసరాల్లో కేబుల్ సపోర్టుతో ఫ్లై ఓవర్ నిర్మించాల్సి ఉంది. అందుకు మొత్తం రూ.261 కోట్లు ఖర్చవుతాయని అంచనవేశారు. ఈ ప్రతిపాదన ఫైలు కొద్ది సంవత్సరాలుగా పడకేసింది. కానీ, మిఠీనది మధ్య భాగంలో ఒక పిల్లర్ వేసేందుకు కేంద్ర పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పడకేసిన ఈ ఫైలు మళ్లీ తెరమీదకు వచ్చింది. ఈ పిల్లర్ కారణంగా ఈ ప్రాజెక్టుకయ్యే వ్యయం రూ.58 కోట్ల మేర తగ్గింది. మొత్తం రూ.203 కోట్లతో ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తామని ముంబై ప్రాంతీయ అభివృద్థి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ఆరు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయని ఎమ్మెమ్మార్డీయే అధికార వర్గాలు తెలిపాయి. మరో పదిహేను రోజుల్లో ఎమ్మెమ్మార్డీయే పూర్తిగా అధ్యయనం చేయనుంది. ఆ తర్వాత వర్క్ ఆర్డర్ జారీ చేయనుంది. ఫ్లై ఓవర్ రూట్.... ఈ ఫ్లై ఓవర్ బీకేసీలోని జి-బ్లాక్ (డైమాండ్ బోర్స్ వెనక) నుంచి మహారాష్ట్ర నేచర్ పార్క్, ఎల్బీఎస్ రోడ్, సెంట్రల్ రైల్వే ట్రాక్ మీదుగా, సోమయ్య మైదానం సమీపంలో నుండి చునాబట్టి వరకు వెళుతుంది. అందుకు సెంట్రల్ రైల్వే పరిపాలన విభాగం కూడా ప్రాథమికంగా అనుమతి ఇచ్చింది. టెండరు వేసిన ఐదు కంపెనీలు ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ఏడు కంపెనీలు సిద్ధంగా ఉన్నప్పటికీ ఐదు కంపెనీలు మాత్రమే టెండర్లు వేశాయి. ఇందులో గ్యామన్ ఇండియా, సింప్లెక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జే.కుమార్, ఎల్ అండ్ టీ, జేఎంసీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఎస్‌సీఎల్‌ఆర్ వల్ల తగ్గిన ట్రాఫిక్ శాంతకృజ్-చెంబూర్ లింక్ రోడ్డు (ఎస్‌సీఎల్‌ఆర్) ప్రారంభం కావడంతో సైన్-ధారావి లింకు రోడ్డు, కలానగర్‌లో ట్రాఫిక్ జాం సమస్య కొంత తగ్గింది. బీకేసీ-చునాబట్లి ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ జాం సమస్య పూర్తిగా తగ్గనుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, పారిశ్రామిక వేత్తల విలువైన సమయం, ఇందనం ఎంతో ఆదా కానుంది. -
ఫ్లైఓవర్‌పై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
నల్గొండ: నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బీబీనగర్ జాతీయ రహదారి ఫ్లైఓవర్‌పై ఆగిఉన్న బస్సును లారీ ఢీ కొట్టింది. ఆ సంఘటనలో నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫ్లై ఓవర్ నిర్మించే వరకు పోరాటం
పలాస రూరల్, న్యూస్‌లైన్: కంబిరిగాం జంక్షన్ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మించేవరకు పోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, మాజీ ఎంపీ కణితి విశ్వనాథం అన్నారు. పలాస మండలం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం కంబిరిగాం జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంబిరిగాం జంక్షన్‌కు ఇరువైపులా చెట్లు ఏపుగా పెరగడంతో వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రయాణికులు మృత్యువాత పడుతున్నారని, వందలాది మంది గాయాల పాలవుతున్నారన్నారు. దీనిపై జిల్లాలోని హైవే అథారిటీ టెక్నికల్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ డెరైక్టర్‌తో పాటు ఢిల్లీలో కేంద్ర మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. ప్రమాదాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కంబిరిగాం జంక్షన్లో రోడ్డుకు ఇరువైపులా పెరిగిన చెట్లను సుమారు వంద మీటర్ల వెడల్పు చొప్పున తొలగించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా వాటిని తొలగించకపోతే తామే తొలగిస్తామన్నారు. కంబిరిగాం జంక్షన్ వద్ద రోడ్డు వెడల్పు చేయాలని, సోలార్ వీధి దీపాలు వేయాలని డిమాండ్ చేశారు. నిలిచిన వాహనాలు ఫ్లై ఓవర్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. వారితో పాటు పరిసర గ్రామాల ప్రజలు వచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. పలువురు ప్రయాణికులు కూడా వారికి మద్దతు తెలిపారు. రోడ్డుపై బైఠాయించడంతో లారీలు,పలు వాహనాలు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఫ్లై ఓవర్ నిర్మించాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో డాక్టర్ దువ్వాడ జీవితేశ్వరరావు, వైశ్యరాజు రాజు, బమ్మిడి కృష్ణారావు, కె.పి.నాయుడు, లంబాడ మోహనరావు, పాడి సూర్యనారయణ, కె.కృష్టారావు, పాడి భీమారావు, అర్జున్, వాసు, కారువాడు, పాడి ఫల్గుణ రావు తదితరులు పాల్గొన్నారు. -
మేమింతే!
=ఫ్లై ఓవర్ నిర్మాణంలో నిబంధనలకు పాతర =భూ యజమానులతో చర్చించకుండా పనులు =పరిహారం నిర్ణయించకుండా నిర్మాణం వంతెన నిర్మించాలనుకున్నారు..అంతే.. పనులు ప్రారంభించేశారు. భూ సేకరణలో నిబంధనలు పాటించలేదు. ప్రయివేటు భూముల యజమానుల్ని సంప్రదించలేదు. వారి అభిప్రాయం తెలుసుకోలేదు. పరిహారం ఎంతో నిర్ణయించలేదు. కొక్కిరాపల్లి ఫ్లై ఓవర్ నిర్మాణంలో అధికారులు ముందు చూపు లేకుండా వ్యవహరిస్తున్నారు. పద్ధతి లేకుండా పనులు చేపడుతున్నారన్న విమర్శలను మూటగట్టుకున్నారు. యలమంచిలి, న్యూస్‌లైన్: కొక్కిరాపల్లి రైల్వే గేట్ వద్ద రూ.36 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఆరు నెలల క్రితమే ప్రారంభమయ్యాయి. వంతెన నిర్మాణానికి 8 ఎకరాల 42 సెంట్ల భూ సేకరణకు సర్వే పూర్తి చేశారు. దీంట్లో 6 ఎకరాల 38 సెంట్లు ప్రభుత్వ భూమి కాగా, 2.04 ఎకరాల్లో వ్యవసాయ, ప్రయివేటు స్థలాలున్నాయి. ప్రస్తుతం ఫ్లై ఓవర్ నిర్మాణంలో భాగంగా పిల్లర్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 20న జేసీ ప్రవీణ్‌కుమార్ ప్రయివేటు భూములను పరిశీలించి మార్కెట్ ధరలపై ఆరా తీశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివరాలను సేకరించాలని స్థానిక రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. ప్రయివేట్ భూసేకరణలో అధికారులు నిబంధనలను పాటించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా పరిశ్రమలు, ప్రాజెక్టులు, ఇతర అవసరాలకు భూసేకరణలో ముందుగానే సంబంధిత రైతులు, యజమానుల అభిప్రాయాలను సేకరించాలి. అనంతరం గెజిట్ నోటిఫికేషన్ జారీచేయాలి. ప్రభుత్వం చెల్లించే పరిహారంపై చర్చించాలి. భూయజమానుల అంగీకారం మేరకు నష్టపరిహారం నిర్ణయించాలి. ఆ తర్వాతే పనులు ప్రారంభించాలి. యలమంచిలి ఫ్లై ఓవర్ నిర్మాణంలో మాత్రం అధికారులు పూర్తి విరుద్ధంగా వ్యవహరించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రయివేట్ భూములకు పరిహారం చెల్లించడంలో జాప్యం జరిగితే రూ.కోట్ల విలువైన పనులు నిలిచిపోయే అవకాశం ఉంది. కొత్త నిబంధనలతో చెల్లింపులెలా? కేంద్రప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం భూసేకరణలో అధికార యంత్రాంగం నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. మార్కెట్ ధరకు 3 రెట్లు అధికంగా భూములకు పరిహారం అందజేయాలి. కొక్కిరాపల్లి వంతెనను నిర్మిస్తున్న ప్రాంతంలో ప్రస్తుతం ఎకరా భూమి మార్కెట్ ధర రూ.12 లక్షల వరకు ఉందని అంచనా. భూసేకరణ కొత్త చట్టం ప్రకారం భూమి కోల్పోతున్న వారికి ఎకరాకు పరిహారంగా రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అధికారులు ఇంకా మార్కెట్ ధరలపై ఆరా తీయడం స్థానికులను విస్మయపరుస్తోంది. -
విజయవాడలో కుప్పకూలిన ఫ్లైఓవర్
-
ప్రైవేట్ బస్సుకు తప్పిన ముప్పు: ప్రయాణికలు సురక్షితం
అనంతపురంలోని బళ్లారి జాతీయ రహదారి నెంబర్- 44 పై వెళ్తున్న ప్రైవేట్ బస్సు ఆదివారం తెల్లవారుజామున అదుపు తప్పి ఫ్లైఓవర్‌ను ఢీ కొట్టింది. అయితే ఆ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. దాంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఆ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని ఆ బస్సులోని ప్రయాణికులు ఆరోపించారు. ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానం చేర్చేందుకు బస్సు యాజమాన్యం చర్యలు చేపట్టింది. -
ఫ్లైఓవర్ కింద ‘నో పార్కింగ్’!
సాక్షి, ముంబై: నగరంలోని ఫ్లై ఓవర్ల కింద నిలిపి ఉంచిన వాహనాలను జప్తు చేయనున్నట్లు మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎంఎస్ఆర్టీసీ) స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశానుశారం ఈ చర్యలను తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఎంఎస్ఆర్టీసీ పరిధిలో మొత్తం 11 ఫ్లై ఓవర్లు ఉన్నాయి. వాటి దిగువ భాగంలో వేలాది వాహనాలు నిలిపి ఉంచుతున్నారు. 2010లో నగరవ్యాప్తంగా ఉన్న ఫ్లై ఓవర్ల దిగువ భాగాన వాహనాలను పార్కింగ్ చేయడాన్ని నిషేధించింది. నగరానికి ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. సదరు స్థలాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ఎంఎస్ఆర్టీసీ తగిన ప్రణాళికను తయారుచేసుకుంది. ఈ క్రమంలో అక్కడ వాహనాలను నిలిపి ఉంచడం నిషేధమని రెండు నెలల కిందటే ఎంఎస్ఆర్టీసీ ఆయా వాహనాల యజమానులను ఆదేశించింది. ఇప్పటికే నిలిచి ఉంచిన వాహనాలను తొలగించకుంటే వాటిని జప్తు చేస్తామని హెచ్చరించింది. అయితే సంస్థ ఆదేశాలను నగరవాసులు పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడంలేదు. ఇదిలా ఉండగా ఆరే మిల్క్ కాలనీ ఫ్లై ఓవర్, ఠాణేలోని ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఉన్న క్యాడ్బరీ జంక్షన్ ఫ్లై ఓవర్ దిగువన ఎప్పటినుంచో ధ్వంసమైన కార్లు అధిక సంఖ్యలో పడి ఉన్నాయి. కాగా, ఎంఎస్ఆర్టీసీ మేనేజింగ్ డెరైక్టర్ బిపిన్ శ్రీమల్ మాట్లాడుతూ .. ఎంఎస్ఆర్టీసీ పరిధిలోని ఫ్లై ఓవర్ల దిగువ భాగంలో పార్క్చేసిన వాహనాల తొలగింపు చేపట్టామన్నారు. తాము ఇప్పటికే ఏడు, ఎనిమిది ఫ్లై ఓవర్ల దిగువన పార్క్ చేసిన వాహనాలను తొలగించి, ఆ స్థలాన్ని సుందరంగా తీర్చిదిద్దామన్నారు. త్వరలోనే మొత్తం ఫ్లై ఓవర్ల కింద వాహనాల తొలగింపును పూర్తిచేస్తామన్నారు. కాగా వకోలా జోగేశ్వరి-విక్రోలి లింక్ రోడ్ ఫ్లై ఓవర్, కుర్లా-సీఎస్టీ ఫ్లై ఓవర్, అంధేరి-ఘాట్కోపర్ లింక్ రోడ్ ఫ్లై ఓవర్, వకోల ఫ్లై ఓవర్, గోరేగావ్-ములుండ్ లింక్ రోడ్, చెడా నగర్ ఫ్లై ఓవర్, వకోల, నితిన్ క్యాస్టింగ్, గోల్డెన్ డైస్, క్యాడ్బెరీ, ఫర్గ్యూసన్ రోడ్ ఫ్లై ఓవర్లు ఎంఎస్ఆర్టీసీ పరిధిలోకి వస్తాయి.