సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ జంక్షన్‌లో శనివారం జరిగిన ప్రమాదంపై అధ్యయనం చేసేందుకు ముగ్గురు నిపుణులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించింది. సోమవారం నగర మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన ఛీఫ్ ఇంజనీర్స్, ప్రొఫెసర్స్‌తో కూడిన ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ బృందం నేడు బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదంపై జరిగిన తీరును ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించిది. అంతేకాక మూడు రోజుల్లో ఫ్లైఓవర్ డిజైన్‌పై నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. ఫ్లైఓవర్‌పై వేగ నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అవసరమైతే మరో ఐదు రోజుల వరకు ఫ్లైఓవర్‌ను మూసివేస్తామని పేర్కొన్నారు. (చదవండి: డిజైన్ లోపమేనా?)
Comments
Please login to add a commentAdd a comment