bontu rammohan
-
బీఆర్ఎస్కు ఊహించని ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు దెబ్బ తగిలినా.. గ్రేటర్ హైదరాబాద్‌లో క్లీన్ స్వీప్ చేసిన బీఆర్ఎస్కు లోక్‌సభ ఎన్నికల ముందు ఊహించని షాక్ తగులుతోంది. గులాబీ దండు నుంచి అధికార కాంగ్రెస్‌లోకి వలసలు జోరందుకుంటున్నాయి. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ బాటలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలుస్తోంది.ఆదివారం సాయంత్రం బొంతు రామ్మోహన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం ఇందుకు ఊతమిస్తోంది. త్వరలోనే తన అనుచరులతో కలిసి ‘కారు’ దిగి కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. చిన్నచూపు చూశారనే.. ► విద్యార్థి దశ నుంచే ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న బొంతు రామ్మోహన్ బాబా ఫసియుద్దీన్లకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచి్చన తర్వాత బల్దియాలో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులతో తగిన గుర్తింపును ఇచి్చంది. రెండో దఫా అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ ఉద్యమ వీరులను చిన్నచూపు చూసిందని, అసలు లక్ష్యమే పక్కదారి పట్టిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ► మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ టికెట్ ఆశించి భంగపడ్డ బొంతు రామ్మోహన్ నాటి నుంచి పారీ్టతో అంటీ ముట్టన్నట్లుగానే ఉంటూ వస్తుండగా... మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ మాత్రం తనకు స్థానిక ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉందని చెప్పినా బీఆర్ఎస్ అధిష్టానం పట్టించుకో లేదంటూ ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా బొంతు రామ్మోహన్ సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో.. ఆయన కాంగ్రెస్‌లో ఆయన చేరిక లాంఛనప్రాయమేనని తెలుస్తోంది. అధికార కాంగ్రెస్ కూడా నగరంలో పట్టు కోసం బీఆర్ఎస్ ముఖ్యనేతలు, కార్పొరేటర్లను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ టచ్‌లో 20 మంది కార్పొరేటర్లు ► బీఆర్ఎస్కు చెందిన సుమారు 20 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ వీడిన మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డితో పాటు పలువురు మాజీ కార్పొరేటర్లు కూడా తిరిగి సొంత గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి దంపతులు బీఆర్ఎస్ పారీ్టపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవచ్చనే ప్రచారం సాగుతోంది. మరోవైపు గులాబీలు చేజారకుండా కట్టడి చేయాల్సిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల సమావేశంలో పార్టీ నుంచి పోతే పోనీ.. వాళ్ల కర్మ అన్నట్లు వ్యాఖ్యానించడంతో పలువురు కాంగ్రెస్ బాట పడుతున్నట్లు సమాచారం. -
అసంతృప్తి ఆగేనా.. అభ్యర్థి గెలిచేనా?
హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి.. అది దక్కని ఆశావహులు అధిష్టానం ఎంపిక చేసిన అభ్యర్థుల విజయానికి కృషి చేస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టికెట్ నీకా? నాకా ? అన్నట్లు పోరాడిన వారు తమకు దక్కని టికెట్ ఇతరులకు దక్కితే వారితో కలిసి పనిచేయడం అసాధ్యమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధిష్టానం మాట కాదనలేక కలిసి పని చేయగలమని తలాడించినప్పటికీ, నిజంగా క్షేత్రస్థాయిలో ఏమేరకు పని చేయగలరన్నది వేచి చూడాల్సిందే. ఉదాహరణకు ఉప్పల్ అభ్యర్థికి టికెట్ రాకుండా చివరి నిమిషం వరకు ప్రయత్నం చేసిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ప్రస్తుత ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి ఎన్నికల్లో బండారి లక్ష్మారెడ్డి గెలుపు కోసం పనిచేయగలరా? అని స్థానికులే ప్రశ్నిస్తున్నారు. అలాగే.. అంబర్‌పేటలో టికెట్ కోసం ప్రయత్నించిన ఎడ్ల సుధాకర్, కాలేరు వెంకటేశ్‌కు టికెట్ ఇవ్వొద్దని బ్యానర్లు కట్టి డిమాండ్ చేసిన తాజా, మాజీ కార్పొరేటర్లు, తదితరులు ఆయన విజయానికి పనిచేస్తారా? అనే సందేహాలున్నాయి. ముషీరాబాద్‌లో ఎమ్మెన్ శ్రీనివాసరావు, ఆయన అనుయాయులు ముఠాగోపాల్ కోసం పనిచేస్తారా? అనేది అంతుచిక్కడం లేదు. కంటోన్మెంట్‌లోనూ టికెట్ కోసం కడదాకా పోరాడిన గజ్జెల నగేష్, మన్నె క్రిశాంక్, శ్రీగణేశ్ లాస్యనందితకు సహకరించగలరా అన్నది సందేహాస్పదమే. వీరిలో శ్రీగణేశ్ ఇప్పటికే ఇండిపెండెంట్‌గానైనా సరే పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మహేశ్వరం టికెట్ రాని పక్షంలో తీగల కృష్ణారెడ్డి పార్టీ మారతారని ఎప్పటినుంచో వినిపిస్తోంది. ఎల్బీనగర్ నుంచి ముద్దగోని రామ్మోహన్‌గౌడ్, రాజేంద్రనగర్ టికెట్ కోసం ప్రయత్నించిన ఎంపీ రంజిత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి, శేరిలింగంపల్లిలో టికెట్ తనకే వస్తుందని భావించిన బండి రమేశ్ తదితరులు ఎంపికై న అభ్యర్థుల కోసం ఏమేరకు కృషి చేస్తారో చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో టికెట్ దక్కించుకున్న వారు అసంతృప్తులను తమ దారికి తెచ్చుకోగలరా.. వారి నడుమ సఖ్యత సాధ్యమేనా.. అన్నది కాలమే తేల్చనుంది. -
పంచతత్వ పార్క్ ప్రారంభించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : నగర ప్రజలకు పంచతత్వ పార్క్ అందుబాటులోకి వచ్చింది. ఇందిరా పార్క్‌లో నిర్మించిన ఆక్యుప్రెజర్ వాకింగ్ ట్రాక్‌ను మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఎనిమిది అంశాలతో ఎకరం విస్తీర్ణంలో ఈ ట్రాక్‌ను నిర్మించారు. కంకర రాళ్లు, నల్లరేగడి మట్టి, నీరు, ఇసుక, చెక్కపొట్టు, గులకరాళ్లతో నిర్మించిన ఈ ట్రాక్ మీద నడుస్తున్నప్పుడు పాదాల అడుగు భాగంలోని నరాలపై ఒత్తిడి పడుతుంది. అంతేకాకుండా ట్రాక్ సర్కిల్లో వివిధ రకాల ఔషధ మొక్కలను పెంచారు. ఈ కార్యక్రమంలో పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, నగర మేయర్ బొంతు రామ్మెహన్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొన్నారు. -
కుబ్రా కుటుంబానికి అండగా ఉంటాం
రాయదుర్గం: బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదంలో గాయపడి గచ్చిబౌలి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనంతపురానికి చెందిన కుబ్రా కుటుంబానికి అండగా ఉంటామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. మంగళవారం ఆయన ఆస్పత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. కుబ్రా తల్లిదండ్రులు అబ్దుల్ అజీమ్, షాహిదా, సోదరుడు అబ్దుల్ ఖలీద్‌లను కలిశారు. అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘కుబ్రా కుటుంబానికి జీహెచ్ఎంసీ అం డగా ఉంటుంది. వైద్య ఖర్చులన్నీ భరిస్తాం. ఆమె ఆరో గ్య పరిస్థితిని డిప్యూటీ, జోనల్ కమిషనర్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. సర్జరీ తర్వాత డిశ్చార్జీ అయ్యాక 2 నెలలు పర్యవేక్షించాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పారు. ఆ సమయంలో వారి కుటుంబానికి అండగా ఉంటాం’అని అన్నారు. అందరికీ కృతజ్ఞతలు ‘పెయింటింగ్ చేస్తూ ఎంతో కష్టపడి నా ఇద్దరు పిల్లలను చదివించాను. నా కూతురు ప్రమాదంలో గాయపడటం మమ్మల్ని కలచివేసింది. మేం పేదోళ్లం. చికిత్సకయ్యే వ్యయాన్ని భరించలేని పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం, నగర మేయర్ భరోసా ఇవ్వడం సంతోషంగా ఉంది’ అని కుబ్రా తండ్రి అన్నారు. ఆదుకునేందుకు వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. కుబ్రా తల్లిదండ్రులను కడప జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నేతలు మంగళవారం పరామర్శించారు. రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో మరో ఇద్దరు నేతలు హైదరాబాద్‌కు చెందిన బీబీజీ కంపెనీ ద్వారా అజీమ్‌కు ఆర్థిక సాయం చేశారు. -
బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదంపై కమిటీ
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ జంక్షన్లో శనివారం జరిగిన ప్రమాదంపై అధ్యయనం చేసేందుకు ముగ్గురు నిపుణులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించింది. సోమవారం నగర మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన ఛీఫ్ ఇంజనీర్స్, ప్రొఫెసర్స్‌తో కూడిన ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ బృందం నేడు బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదంపై జరిగిన తీరును ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించిది. అంతేకాక మూడు రోజుల్లో ఫ్లైఓవర్ డిజైన్‌పై నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. ఫ్లైఓవర్‌పై వేగ నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అవసరమైతే మరో ఐదు రోజుల వరకు ఫ్లైఓవర్‌ను మూసివేస్తామని పేర్కొన్నారు. (చదవండి: డిజైన్ లోపమేనా?) -
గణేష్ ఉత్సవాలపై మంత్రి తలసాని సమీక్ష
సాక్షి, హైదరాబాద్: గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్ల నేపథ్యంలో మంత్రి తలసాని అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నగరంలో వినాయక ఉత్సవాల నిర్వహణపై ప్రజా పతినిధులతో చర్చలు జరిపామని తెలిపారు. గణేష్ ఉత్సవ సమితితో పాటు అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించాని,హైదరాబాద్‌లో 54 వేల వినాయక ప్రతిమలను పూజలు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తారని అన్నారు. గణేష్ ఉత్సవాలను చూడటానికి దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తారని, అందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం తరపున హుస్సేన్ సాగర్‌లో గంగ హారతి ఇస్తామని, హారతి ఎప్పుడనే అంశంపై పురోహితులను చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి వ్యాఖ్యనించారు. నిమజ్జనం కోసం 26 చోట్ల ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. సోమవారం ఖైరతాబాద్ గణేష్ పనులను పరిశీలిస్తామని తెలిపారు. సమావేశంలో మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. హైదరాబాద్ సర్వ మతాలను గౌరవించే నగరమని, ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన నిమజ్జనానికి సంబంధించిన అన్ని అంశాలపై చర్చించామని అన్నారు. బందోబస్తు విషయంలో రాజీ పడేది లేదన్నారు. అదేవిధంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. గతంలో ముంబైలో గణేష్ ఉత్సవాలు గొప్పగా జరిగేవని, అయితే, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు చాలా గొప్పగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. పండుగ విజయవంతంగా జరిగేలా ప్రజలు,భక్తులు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. రానున్న గణేష్ ఉత్సవాల పై అన్ని శాఖలతో సమావేశం నిర్వహించామని, మునుపెన్నడూ లేని విధంగా గణేష్ ఉత్సవాలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అన్ని పండుగలను ఆదరిస్తూ చాలా గొప్పగా జరుపుతున్నారని కొనియాడారు. -
ఆ వార్తలు అబద్ధం: మేయర్ రామ్మోహన్
సాక్షి, హైదరాబాద్ : తన రాజీనామా వార్తను జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్రావు ఖండించారు. తాను రాజీనామా చేశానంటూ కొన్ని సోషల్ మీడియా సైట్లలో వచ్చిన తప్పుడు వార్తలపై కఠిన చర్యలను తీసుకోవాలని ఆయన మంగళవారం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెట్రో రైల్ ప్రారంభోత్సవం సందర్భంగా అవమానం జరిగిందని ఈ విషయం లో తీవ్ర మనస్తాపానికి లోనై మేయర్ పదవికి రాజీనామా చేశానని మంగళవారం పలు సోషల్ మీడియాల్లో తప్పుడు వార్తలు తనపై వస్తున్నాయని, ఈ తప్పుడు వార్తలను పోస్ట్ చేసిన వారిపై చర్యలు చేపట్టాలని కోరుతూ సైబర్ నేర విభాగం అడిషనల్ డీసీపీ రఘువీర్ కు ఫిర్యాదు చేసినట్టు మేయర్ రామ్మోహన్ తెలిపారు. బీసీకి చెందిన వ్యక్తిని కాబట్టే తన పేరు వేయలేదంటూ తాను పేర్కొన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. తెలంగాణతో పాటు హైదరాబాద్ పురోభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్, యువమంత్రి కేటీఆర్ నేతృత్వంలో చిత్తశుద్ధితో పనిచేయనున్నట్టు మేయర్ స్పష్టం చేశారు. -
హైదరాబాద్ మేయర్ పర్యటన
-
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు సోమవారం దర్శించుకున్నారు. హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ కుటుంబసమేతంగా వీఐపీ విరామ సమయంలో స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డి , రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్, చాముండేశ్వరి నాథ్ లు కూడా ఏడుకొండలవాడి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.