తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు సోమవారం దర్శించుకున్నారు. హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ కుటుంబసమేతంగా వీఐపీ విరామ సమయంలో స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డి , రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్, చాముండేశ్వరి నాథ్ లు కూడా ఏడుకొండలవాడి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.