
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ.. 7 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్‌లో మే 3న చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది.
ఈ మ్యాచ్‌కు ఇంకా మూడు రోజుల సమయం ఉండడంతో ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటిదార్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో పాటిదార్ తన సహచర ఆటగాడు జితేష్ శర్మ, టీమిండియా మహిళా క్రికెటర్ శ్రేయంకా పాటిల్‌తో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.
దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఈ క్రికెటర్లను ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఆర్సీబీ కెప్టెన్‌గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన పాటిదార్ జట్టును అద్బుతంగా నడిపిస్తున్నాడు.
బ్యాటింగ్, కెప్టెన్సీతో ఆకట్టుకుంటున్నాడు పాటిదార్. అతడితో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం అదరగొడుతున్నాడు. వరుస హాఫ్ సెంచరీలతో ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బెంగళూరు మరో రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే తమ ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకుంటుంది.
సీఎస్‌కేతో మ్యాచ్‌కు ఆర్సీబీ తుది జట్టు(అంచనా)
విరాట్ కోహ్లీ, జాకబ్ బెథెల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్
Rajat Patidar, Jitesh Sharma & Shreyanka Patil offered prayers at the Tirumala temple. ♥️ 🙏 pic.twitter.com/UQNFWpsMcq
— Johns. (@CricCrazyJohns) April 30, 2025