ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు అన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల రిటైన్ జాబితాను సిద్దం చేసే పనిలో పడ్డాయి. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నుంచి ఇంకా రిటెన్షన్ పక్రియకు సంబంధించి ఎటువంటి గైడ్‌లైన్స్ రానిప్పటకి.. ఆయా జట్లు మాత్రం ఇప్పటినుంచే తమ ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నాయి.
మెగా వేలంకు ముందు ఎవరనీ విడిచిపెట్టాలి, ఎవరిని రిటైన్ చేసుకోవాలి అన్న ఆంశాలపై ఫ్రాంచైజీలు ఓ నిర్ణయంకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పలు సంచలన నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్‌పై వేటు వేయాలని ఆర్సీబీ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
డుప్లెసిస్‌తో పాటు ఆసీస్ విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను సైతం వేలంలోకి విడిచిపెట్టాలని ఆర్సీబీ నిర్ణయించుకున్నట్లు వినికిడి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పాటు రజత్ పటిదార్, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్‌ను రిటైన్ చేసుకోవాలని యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా ఆర్సీబీ కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌ను నియమించే ఆలోచనలో ఆర్సీబీ యాజమాన్యం ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చనడుస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో పాటిదార్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఫస్ట్ హాఫ్‌లో నిరాశపరిచిన పాటిదార్.. సెకెండ్ హాఫ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 15 మ్యాచ్‌లు ఆడి 398 పరుగులు చేశాడు.
గ్రీన్‌కు గుడ్ బై.. ?
అదే విధంగా 2024 మినీ వేలం లో రూ.11 కోట్ల రూపాయలకు దక్కించుకున్న అల్జారీ జోసెఫ్ తో పాటు ట్రేడింగ్ ద్వారా రూ. 17 కోట్లకు దక్కించుకున్న ఆసీస్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ సైతం వేలంలోకి వచ్చే అవకాశముంది.
ఐపీఎల్-2024లో పర్వాలేదన్పించిన ఆర్సీబీ.. లిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. 2024 ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆఫ్ కు అర్హత సాధించిన ఆర్సీబీ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment