Bhanwar Lal
-
ఇది నిజంకాదా? నార్కో అనాలసిస్ టెస్ట్‌కు చంద్రబాబు సిద్ధమా?
-
చంద్రబాబు..దేవన్ష్‌పై ప్రమాణం చేస్తావా?: ఆమంచి
సాక్షి, చీరాల : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చీరాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన ఆదివారమిక్కడ మాట్లాడుతూ.. ‘చంద్రబాబు మీద 17 కేసులు ఉన్నాయి. ఓటుకు నోటు కేసులో ఆయన ముద్దాయి. నాపై ఉన్న కేసులు ప్రజా ఉద్యమంలో జరిగినప్పుడు పెట్టినవి. చంద్రబాబు పిరికివాడు...అవకాశవాది. కేసీఆర్ కేసు పెడితే చంద్రబాబు ఆంధ్రాకు పారిపోయి వచ్చాడు. నేను ఇక్కడే ఉండి ప్రజల కోసం పోరాడుతున్నా. చీరాలకు విమానాశ్రయం తీసుకొస్తా అని చంద్రబాబు చెప్పడం పెద్ద జోక్. ప్రజలకు ఏమి అవసరమో ...ఆయనకు అవగాహన లేదు. చంద్రబాబు అతి తక్కువ నిధులు ఇచ్చింది చీరాల నియోజకవర్గానికే. ప్రజలు కట్టే పన్నులతో మేము అభివృద్ధి చేసుకున్నాం తప్ప చీరాలకు చంద్రబాబు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఆయనకు మహిళలపై గౌరవం లేదు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో టెలీకాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ మనకు వ్యతిరేకంగా ఉన్నాడు. అక్కడ ప్రచారానికి వచ్చిన వైఎస్సార్ సీపీ మహిళలో అక్రమ సంబంధం అంటగట్టమని చెప్పిన నీచుడు చంద్రబాబు. ఇది వాస్తవం కాదా?. దీనిపై నార్కో ఎనాలసిస్ పరీక్షకు సిద్ధమా?. లేకుంటే నీ మనవడు దేవన్ష్‌పై ప్రమాణం చేసి చెబుతావా?’ అని సవాల్ విసిరారు. -
రాష్ట్ర సీఈవో జాబితాలో ఆరుగురు ఐఏఎస్‌లు
-
రాష్ట్ర సీఈవో జాబితాలో ఆరుగురు ఐఏఎస్‌లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణకు కొత్త సీఈవోగా ఎవరిని నియమిస్తుందనేది ఐఏఎస్ అధికారుల్లో ఆసక్తి రేపుతోంది. ఉమ్మడి రాష్ట్రంతోపాటు, విభజన అనంతరం రెండు రాష్ట్రాలకు భన్వర్‌లాల్ సీఈవోగా కొనసాగారు. ఏడేళ్ల పాటు ఆయన ఇదే పదవిలో ఉన్నారు. రెండు రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు తెలంగాణ, ఏపీలకు వేర్వేరుగా సీఈవోలను నియమించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం తొలి సీఈవోగా బాధ్యతలు చేపట్టేందుకు అనుభవ మున్న ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారుల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించింది. ఇందులో ముఖ్య కార్యదర్శులు శశాంక్ గోయల్, రజత్‌కుమార్, నవీన్ మిట్టల్‌ల పేర్లు ఉన్నాయి. కాగా, గతంలో ఎలక్షన్ కమిషన్ అదనపు సీఈవోగా పని చేసిన రజత్‌కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం కొత్త సీఈవోగా నియమించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పంపించిన జాబితాలో సీనియర్ ఐఏఎస్ సవ్యసాచి ఘోష్ పేరును కూడా చేర్చి మరోమారు ప్రతిపాదనలు పంపించాలని కేంద్ర ఎన్నికల సంఘం గత వారంలోనే సూచించింది. దీంతో ప్రభుత్వం సవ్యసాచి ఘోష్‌తో పాటు శాలిని మిశ్రా, వికాస్‌రాజ్ పేర్లను సైతం ఈ జాబితాలో చేర్చింది. సీఎం కేసీఆర్ సూచనల మేరకు మొత్తం ఆరుగురి పేర్ల ప్యానెల్‌ను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భన్వర్‌లాల్ తరహాలో రెండు రాష్ట్రాల సీఈవో బాధ్యతలు అప్పగిస్తే తప్ప, కేవలం తెలంగాణ సీఈవోగా బాధ్యతలు చేపట్టేందుకు సవ్యసాచి ఘోష్ సుముఖంగా లేనట్లు ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజా సమాచారం మేరకు సవ్యసాచి ఘోష్ లేదా రజత్‌కుమార్‌కు కొత్త సీఈవోగా బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. -
ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం
నెల్లూరు (బృందావనం)/తిరుపతి అర్బన్: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఎప్పుడొచ్చినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఉభయ రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ చెప్పారు. నెల్లూరు రంగనాయకులపేటలోని శ్రీదేవి, భూదేవి సమేత తల్పగిరి రంగనాథస్వామి క్షేత్రానికి మంగళవారం ఆయన విచ్చేశారు. స్వామిని, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశమంతా ఒకేసారి, ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా నిర్వహించేందుకు కమిషన్ సర్వసన్నద్ధంగా ఉంటుందన్నారు. ఒకేసారి ఎన్నికల విషయమై నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్నికల సంఘం కాదన్నారు. ఈ అంశం పార్లమెంట్ లేదా కేంద్రం ప్రభుత్వ పరిధిలో ఉంటుందన్నారు. నెల్లూరులో అతి పురాతనమైన ఆలయం తల్పగిరి రంగనాథస్వామి ఆలయాన్ని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని భన్వర్‌లాల్ చెప్పారు. ఆయన వెంట ఆలయ పాలక మండలి చైర్మన్ మంచికంటి సుధాకర్‌రావు, కార్యనిర్వహణాధికారి కోవూరు జనార్దన్‌రెడ్డి ఉన్నారు. మున్సిపాలిటీల్లో పకడ్బందీగా ఓటర్ల సవరణ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో పకడ్బందీగా ఓటర్ల సవరణ చేపట్టాలని భన్వర్‌లాల్ ఆదేశించారు. మంగళవారం రాత్రి చిత్తూరు కలెక్టర్ పి.ఎస్.ప్రద్యుమ్న ఆధ్వర్యంలో తిరుపతి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలకు చెందిన సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో ఓటర్ల జాబితా సవరణపై సమీక్షించారు. ఈ ప్రక్రియను నవంబర్ 1న ప్రారంభించి నెలాఖరు నాటికి పూర్తిచేయాలన్నారు. గూగుల్ మ్యాప్‌లో పోలింగ్ కేంద్రాన్ని చూపేవిధంగా ఏర్పాటు చేయాలన్నారు. -
రాష్ట్రానికి త్వరలో కొత్త ప్రధాన ఎన్నికల అధికారి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కొత్త సీఈవో నియామకానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రం విడిపోకముందు నుంచే గత ఏడు సంవత్సరాలుగా భన్వర్‌లాల్ సీఈవోగా కొనసాగుతున్నారు. విభజన అనంతరం ఇప్పటికీ రెండు రాష్ట్రాలకు ఆయనే సీఈవోగా ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం సీఈవో ఆఫీసును వేరు చేయకపోవటంతో కొత్త రాష్ట్రమైన తెలంగాణకు భన్వర్‌లాల్ ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు ప్రత్యేక సీఈవో నియామకంపై ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించింది. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో భన్వర్‌లాల్ పదవీ విరమణ చేయగానే.. తెలంగాణకు సీఈవో కార్యాలయంతో పాటు కొత్త సీఈవో నియామకంపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో తొలి సీఈవోగా బాధ్యతలు అప్పగించేందుకు అనుభవజ్ఞులైన ముగ్గురు సీనియర్ ఐఏఎస్‌లతో ప్రభుత్వం ప్యానెల్‌ను రూపొందించింది. ఈ ప్యానెల్లో ముఖ్య కార్యదర్శులు శశాంక్ గోయల్, రజత్ కుమార్, నవీన్ మిట్టల్ పేర్లున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనల ఫైలు ముఖ్యమంత్రి వద్దకు రాగా, ఆయన సూచనల మేరకు సిద్ధం చేసిన తుది ప్యానెల్‌ను ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేసింది. సీఈసీ ఆమోదం మేరకు కొత్త సీఈవో నియామకం జరుగుతుంది. -
ఓటర్లను భయపెట్టేలా టీడీపీ కుట్ర
ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: నంద్యాల ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసేందుకు తెలుగుదేశం పార్టీ కుయుక్తులు పన్నుతోందని ఎన్నికల సంఘానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఆ కుట్రలను అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని వైఎస్సార్సీపీ తెలంగాణశాఖ ప్రధాన కార్యదర్శి శివకుమార్ సోమవారం సాయంత్రం ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ను కలసి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నంద్యాలలో తమ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో అల్లర్లు సృష్టించి, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయాలని టీడీపీ కుట్రపన్నుతోందని తెలిపారు. దీనివల్ల ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనకుండా చేయడమే అధికార పార్టీ ఎత్తుగడని చెప్పారు. -
పోలింగ్‌కు అంతా రెడీ: భన్వర్‌లాల్
సాక్షి, హైదరాబాద్: నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం ముగిసిన నేపథ్యంలో ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన వెల్లడించారు. ఓటర్లను ప్రలోభ పెట్టినా, నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. మొత్తం 255 పొలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. 6 కంపెనీ పారా మిలటరీ బలగాలతో భద్రతా ఏర్పాటు చేశామని, 82 ఫ్లైయింగ్ స్వ్కాడ్ లు క్షేత్రస్థాయిలో ఎన్నికలను పరిశీలిస్తాయని ఆయన అన్నారు. సాయంత్రం ఆరు గంటల వరకు క్యూలో ఉన్నవారంతా ఓటేయొచ్చని తెలిపారు. 23వ తేదీ వరకు మద్యం షాపులు బంద్ చేయాలని, బల్క్ ఎస్సెమ్మెస్‌లపై నిషేధం విధించినట్లు తెలిపారు. ఎలాంటి ఒపీనియన్ పోల్స్, సర్వేలు నిర్వహించకూడదన్న ఆదేశాలు ఇప్పటికే జారీ చేశామన్నారు. సోషల్ మీడియాలో కూడా ప్రచారం నిర్వహించరాదని తెలిపారు. ఓటర్లందరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో స్పందించేలా ఏర్పాట్లు చేశామని భన్వర్‌లాల్ వెల్లడించారు. ఓటర్లకు ఎలాంటి సమస్యలు ఎదురైనా 9223 166166 నంబర్ కు ఎస్ఎమ్మెస్ చేయాలని ఎన్నికల ప్రధానాధికారి సూచించారు. -
పోలింగ్‌కు అంతా రెడీ
-
కేంద్ర బలగాలను మోహరించండి
= పోలింగ్ కేంద్రాల్లో అన్ని సదుపాయాలు ఉండాలి = వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ఆదేశం కర్నూలు(అగ్రికల్చర్): ఉప ఎన్నిక జరుగుతున్న నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోని 255 పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నంద్యాల ఉప ఎన్నిక ఏర్పాట్లుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాలకు వెళ్లే నాలుగు లైన్ల రహదారి పైన, చెక్‌పోస్టుల్లోనూ అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల వరుసల నిర్వహణను పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం విద్యుత్, టాయిలెట్స్, రన్నింగ్ వాటర్ తదితర సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ర్యాంప్ ఉండాలని సూచించారు. 255 పోలింగ్ కేంద్రాల ఓటర్ల జాబితాలను పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఇవ్వాలన్నారు. ఓటర్లందరికి ఓటరు స్లిప్‌లను అందజేయాలన్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి పోలింగ్ ప్రక్రియపై పాటించాల్సిన విధి విధానాలను వివరించాలన్నారు. కర్నూలు నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ నియోజకవర్గంలోని 255 పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. ర్యాంపుల్లేని 25 పోలింగ్ కేంద్రాల్లో తాత్కాలికంగా నిర్మించామన్నారు. ఓటరు స్లిప్‌ల ముద్రణ పూర్తయిందని, ఈ నెల 17 నుంచి ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తామని వివరించారు. నంద్యాల నుంచి రిటర్నింగ్ అధికారి, జేసీ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ఓటరు స్లిప్‌లతో పాటు ఈవీఎంల వినియోగం, వివిపిఏటీ విధానం అమలుపై ముద్రించిన కరపత్రాలు కూడా ఓటర్లకు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. నియోజకవర్గంలో ఎన్నికల నియమాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ఇప్పటి వరకు రూ.25 లక్షల నగదు సీజ్ చేశామని వివరించారు. పెయిడ్ న్యూస్‌కు సంబంధించి పత్రికలకు 7నోటీసులు, 5 కేబుల్ టీవీలకు నోటీసులు ఇచ్చామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం కేటాయించిన బడ్జెట్‌కు అదనంగా రూ.3.50 కోట్లు కేటాయించాలని జిల్లా కలెక్టర్ సీఈఓకు నివేదించారు. కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ–2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, జిల్లా ఎస్పీ గోపినాథ్‌జట్టి పాల్గొన్నారు. -
నంద్యాలలో 44 కేసులు నమోదు: సీఈవో
హైదరాబాద్ : ఈ నెల 23న జరిగే నంద్యాల ఉప ఎన్నిక కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ఆయన గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. నంద్యాలలో ఇప్పటివరకూ 44 కేసులు నమోదు చేశామని, అలాగే రూ.11లక్షల నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. మంత్రులు...పార్టీ నేతలుగా వెళితే అభ్యంతరం లేదని, అయితే ఎవరు అధికార దుర్వినియోగానికి పాల్పడినా చట్టప్రకారం వ్యవహరిస్తామని భన్వర్ లాల్ స్పష్టం చేశారు. కొందరు మంత్రులపైనా ఫిర్యాదులు వచ్చాయని, ఫిర్యాదులన్నింటినీ పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి లైవ్ వెబ్‌కాస్టింగ్ ఉంటుందని, ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వీడియోగ్రఫీ చేస్తామని ఆయన వివరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు కేంద్ర, రాష్ట్ర బలగాల భద్రత ఉంటుందన్నారు. బందోబస్తు కోసం 8 కంపెనీల కేంద్ర బలగాలను అడిగామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట నిఘా పెడతామని భన్వర్‌లాల్ పేర్కొన్నారు. -
రాబోయే కాలానికి కాబోయే ఓటర్లు మీరే..
► రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ గుంతకల్లు(అనంతపురం): రాబోయే కాలానికి కాబోయే ఓటర్లు మీరే అని ఇంటర్ విద్యార్థులను ఉద్దేశించి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ అన్నారు. మంగళవారం గుంతకల్లులోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ‘రాబోయే కాలానికి కాబోయే ఓటర్లు’ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన భన్వర్‌లాల్ ఓటు నమోదు, దాని ప్రాధాన్యం గురించి ఇంటర్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే నాయకులకు ఓటు వేయకూడదన్నారు. బాధ్యత గల పౌరులుగా మంచి నేతలను ఎన్నుకోవాలని సూచించారు. 2014 ఎన్నికల్లో గుంతకల్లు నియోజకవర్గంలో 65 శాతం పోలింగ్ నమోదైందని.. వచ్చే ఎన్నికల్లో 100 శాతం నమోదు కావాలన్నారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రమామణి, జెడ్పీ సీఈఓ సూర్యనారాయణ, ఆర్డీఓ మలోల, తహసీల్దార్ హరిప్రసాద్, ప్రిన్సిపల్ శ్రీనివాసులు, మున్సిపల్ డెలిగేట్ కమిషనర్ ఈశ్వరయ్య, ఏసీపీ శివనారాయణ, ఎంపీడీఓ శంకర్, గుత్తి డీటీ మునివేలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆ జాబితా ప్రకారమే నంద్యాల ఉప ఎన్నిక
♦ జనవరి 1 నాటికి 18 సంవత్సరాలున్న వారికే ఓటు హక్కు ♦ సీఈవో భన్వర్‌లాల్ స్పష్టీకరణ సాక్షి, అమరావతి: నంద్యాల ఉప ఎన్నిక ఈ ఏడాది జనవరి 1వ తేదీన ప్రచురించిన ఓటర్ల జాబితా మేరకే జరుగుతాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్ తెలిపారు. ఆ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండినవారు ఆగస్టు 5వ తేదీ కన్నా పది రోజుల ముందు దరఖాస్తు చేసుకుని ఉంటే వారికి ఓటు హక్కు కల్పిస్తామని చెప్పారు. ఉప ఎన్నిక నేపథ్యంలో పక్క నియోజకవర్గాలకు చెందిన ఓటర్లను నంద్యాల నియోజ కవర్గంలో చేర్పించారనే ఆరోపణలున్నం దున నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలను రెండుసార్లు తనిఖీకి (డబుల్ వెరిఫికేషన్) ఆదేశించామన్నారు. ఈ ప్రక్రియ కొనసాగుతోందని, పక్క నియోజకవర్గాల ఓటర్లు ఉంటే వారి పేర్లు తొలగిస్తామ ని శుక్రవారం ఆయన ‘సాక్షి’కి తెలిపారు. పోలింగ్ రోజు ఫొటోతో కూడిన గుర్తింపు కార్డు ఉంటేనే ఓటు హక్కు వినియోగానికి అనుమతిస్తామని చెప్పారు. ఉప ఎన్నికలకు సంబంధించిన నిబంధనలను ఉద్యోగులు, అధికారులు ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు ఉంటాయని భన్వర్‌లాల్ హెచ్చరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కర్నూలు జిల్లా అంతటా అమల్లో ఉంటుందని, ఇది ఈ నెల 27వ తేదీ నుంచే అమల్లోకి వచ్చిందని తెలిపారు. -
30న ఓటరు తుది జాబితా
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ వేములవాడ: రాష్ట్రంలోని 83 నియోజకవర్గాల్లో 2017 నాటికి 18 ఏళ్ల వయస్సు నిండిన యువత తుది ఓటరు జాబితాను ఈనెల 30న విడుదల చేస్తామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్ లాల్ తెలిపారు. ఇక నుంచి జియో ట్యాగింగ్ పరిధిలోకి అన్ని నివాసాల ను తీసుకొస్తామని, తద్వారా ఆ ఇంట్లో కొత్తగా ఎవరూ ఓటరుగా పేరు నమోదు చేసుకున్నా తెలిసిపోతుందని చెప్పారు. సోమవారం ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అర్బన్ ప్రాంతాల్లోని 36 నియోజకవర్గాల్లో బూత్‌లెవల్ ఆఫీసర్లతో ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఇంటింటా సర్వే చేయిస్తున్నట్లు చెప్పారు. దీంతో 1.10 కోట్ల ఓటర్ల తుది జాబితా విడుదల చేసే అవకాశం ఉందని చెప్పారు. ఈ విధానాన్ని గతంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని 28 నియోజకవర్గాల్లో పూర్తి చేశామన్నారు. ఇకనుంచి ఒక కుటుంబంలోని ఓటర్లందరూ ఒకే పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. -
టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ రద్దు
-
టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ రద్దు
♦ బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల ఫొటోలు తారుమారు ♦ ఈసీ సూచన మేరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన భన్వర్‌లాల్ సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్– రంగారెడ్డి–హైదరాబాద్ ఉపాధ్యాయ నియో జకవర్గం ఎమ్మెల్సీ ఎన్నిక కోసం నిర్వహించిన పోలింగ్ అనూహ్యంగా రద్దయింది. గురు వారం జరిగిన ఈ పోలింగ్‌లో ఉపయోగించిన బ్యాలెట్ పేపర్లో ఇద్దరు అభ్యర్థుల ఫొటోలు తారుమారు కావడం దీనికి కారణమైంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 19న (ఆదివారం) తిరిగి పోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ప్రకటించారు. పోలింగ్ మొదలయ్యాక గుర్తింపు.. రాష్ట్రంలోని ఎనిమిది కొత్త జిల్లాల పరిధిలో ఉన్న 126 పోలింగ్ కేంద్రాల్లో గురువారం ఉదయం 8 గంటలకు ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ మొదలైంది. మొత్తం 23,789 మంది ఓటర్లు ఉండగా.. ఓటు వేసేందుకు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో బారులు తీరారు. తీరా పోలింగ్ మొదలయ్యాక బ్యాలెట్ పేపర్లో మూడో నంబర్లో ఉన్న అభ్యర్థి ఆది లక్ష్మయ్య, తొమ్మిదో నంబర్లో ఉన్న పి.మాణిక్‌రెడ్డి ఫొటోలు తారుమారైనట్లు గుర్తించడంతో.. గందరగోళం మొదలైంది. అభ్యర్థులతోపాటు ఎన్నికల ఏజెంట్లు, అధికారులు వెంటనే దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణలో ఈ తప్పు జరిగినట్లు నిర్ధారించిన సీఈవో భన్వర్‌లాల్.. వెంటనే కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల కమిషన్ నుంచి తదుపరి ఆదేశాలు అందేంత వరకు అన్ని కేంద్రాల్లో పోలింగ్‌ను యథాతథంగా నిర్వహించారు. దాంతో ఈ ఎన్నిక రద్దవుతుందా.. లేదా అనే ఉత్కంఠ కొనసాగింది. మధ్యాహ్నం 12 గంటల వరకే ఈ ఉపాధ్యాయ నియోజకవర్గంలో దాదాపు 51 శాతం పోలింగ్ నమోదైంది కూడా. ఈలోగా ఎన్నికను రద్దు చేయవద్దంటూ కొందరు, రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు పోటాపోటీగా ఎన్నికల కమిషన్‌కు వినతి పత్రాలు అందించారు. అయితే చివరికి కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి అందిన ఆదేశాల మేరకు ఎన్నికను రద్దు చేస్తున్నట్లు సాయంత్రం ఆరు గంటల సమయంలో భన్వర్‌లాల్ ప్రకటించారు. 19వ తేదీన రీపోలింగ్ నిర్వహిస్తామని.. ఓటర్లు తిరిగి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. విచారణకు ఆదేశించిన ఈసీ బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల ఫొటోలు తారుమారు కావడంపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. ఎక్కడ పొరపాటు జరిగింది, ఎవరు బాధ్యులనే అంశాలతో వెంటనే నివేదిక ఇవ్వాలని సీఈవో భన్వర్‌లాల్‌ను ఆదేశించింది. మహబూబ్ నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో మొత్తం 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలిసారిగా బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేర్లతో పాటు వారి ఫొటోలను ముద్రించారు. కానీ ఇద్దరు అభ్యర్థుల ఫొటోలు తారుమారయ్యాయి. ఈ చిన్న పొరపాటుతో మళ్లీ ఎన్నికలు నిర్వహిం చాల్సి రావటంతో పాటు పోలింగ్ నిర్వహ ణకు వెచ్చించిన దాదాపు రూ.2 కోట్లు వృథా అయ్యాయి. మళ్లీ అంత ఖర్చు చేసి, ఎన్నిక నిర్వహించాల్సి రానుంది. ముద్రణలోనే తప్పిదం.. ‘‘బ్యాలెట్ పేపర్ ముద్రణ సమయంలోనే తప్పిదం జరిగింది. ముందు మాకు పంపించిన ప్రూఫ్‌లో అక్షరాల తప్పులు తప్ప ఫొటోలన్నీ సరిగ్గానే ఉన్నాయి. అక్షరాల్లో తప్పులు దిద్ది సవరించిన రెండో ప్రూఫ్‌లో ఫొటోలు తారుమారయ్యాయి. అక్షరాల్లో తప్పులు సరిచేశారా.. లేదా.. అని చూసుకున్న అధికారులు ఫోటోలు మారడాన్ని గమనించక పోవడంతో తప్పు దొర్లింది. చివరకు బ్యాలెట్ పేపర్లు సరిగా ఉన్నాయా.. లేదా అని పరిశీలించాల్సిన రిటర్నింగ్ అధికారి సైతం గుర్తించలేదు. చంచల్‌గూడ ప్రింటింగ్ ప్రెస్‌లో బ్యాలెట్ల ముద్రణ జరిగింది. మేం సరిగ్గా పంపిన ఫొటోలు ఎందుకు మారాయి, అక్కడి సిబ్బంది ప్రమేయమేమైనా ఉందా, దీనికి బాధ్యులెవరనే దానిపై విచారణ జరిపి.. ఈసీకి నివేదిస్తాం. ఈసీ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం..’’ – రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ -
ఫోటోల తారుమారుపై స్పందించిన ఈసీ
-
ఫోటోల తారుమారుపై స్పందించిన ఈసీ
హైదరాబాద్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నకల్లో బ్యాలెట్ పేపర్‌పై దొర్లిన తప్పుల గురించి ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ స్పందించారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫోటో తారుమారు పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. మొదటి ప్రూఫ్‌లో కేవలం స్ఫెల్లింగ్ మిస్టేక్ మాత్రమే ఉంది. రెండో ప్రూఫ్‌లో ఫోటోలు తారుమారు అయ్యాయి. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేస్తున్నాం.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రెండవ ప్రూఫ్ నాటికి నేను విదేశి పర్యటనలో ఉన్నాను. అప్పుడు ఏమైందో తెలియాల్సి ఉందన్నారు. ఇదిలా ఉండగా.. ఈ విషయంపై భన్వర్‌లాల్‌ను కలిసిన యూటీఎఫ్ నేతలు అధికార పార్టియే ఈ సంఘటనకు బాధ్యత వహించాలన్నారు. ఓడిపోతామనే ఇలాంటి చర్యలకు పాల్పడిందని రిపోలింగ్‌కు ఆదేశం ఇవ్వకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. -
బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల ఫోటోలు తారుమారు
వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో గురువారం ఉదయం ప్రారంభమైన ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక బ్యాలెట్ పేపర్లో తప్పులు దొర్లాయి. అభ్యర్థి లక్ష్మయ్య ఫొటో పక్కన మాణిక్ రెడ్డి పేరు ముద్రించడంతోపాటు మాణిక్‌రెడ్డి ఫొటో పక్కనే మరో అభ్యర్థి లక్ష్మయ్య పేరు ముద్రించారు. దీంతో టీఎస్‌యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్ రెడ్డి బ్యాలెట్ పేపర్‌ను తిరిగి ముద్రించాలని డిమాండ్ చేశారు. పోలింగ్ రద్దు చేయాలని రిటర్నింగ్ అధికారిని కోరారు.ఇరువురు అభ్యర్థులు ఈ విషయమై ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ బ్యాలెట్లో అభ్యర్థుల ఫొటోలు మారాయన్నారు. పోలింగ్ కొనసాగిస్తామని, దీనిపై ఎన్నికల కమిషనకు నివేదికలు పంపుతున్నామని భన్వర్‌లాల్ తెలిపారు. పోలింగ్ నిలిపివేయాలంటూ ముషీరాబాద్ పోలీంగ్ బూతు వద్ద ఆందోళన చేస్తున్న టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావ రవి, రాష్ట్ర కార్యదర్శి రాందాసు, రామకృష్ణ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా అరెస్టు చేసిన వారిన వెంటనే విడుదల చేయాలని, వెంటనే పోలింగ్ నిలిపివేయాలని వరంగల్ రూరల్ టీఎస్ యూటీఎఫ్ డిమాండ్ చేసింది. -
ఓటరుజాబితా సవరణకు త్వరలో నోటిఫికేషన్
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ భీమారం: రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటైన దృష్ట్యా ఓటరు జాబితా సవరణ కోసం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా భీమారంలోని ఎస్వీఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో ‘ఓటు హక్కు వినియోగం’పై విద్యార్థులకు శుక్రవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో పాల్గొన్న అనం తరం భన్వర్‌లాల్ విలేకరులతో మాట్లాడుతూ 1 జనవరి 2017 వరకు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటరు నమోదుపై చైతన్య పరచడానికి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తున్నా మని, వారి సూచనలు పరిశీలిస్తామని భన్వర్‌లాల్ తెలిపారు. -
విద్యార్థుల చేతిలోనే దేశ భవిష్యత్
సాక్షి, జనగామ: ‘విద్యార్థుల్లారా మీతోనే దేశ, రాష్ట్ర భవిష్యత్ ఆధారపడి ఉంది. మీరు కాబోయే ఓటర్లు కాబట్టే ఓటు హక్కుపై చైతన్యం కల్పిస్తున్నాం. ఎన్నికలపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పిం చడం కోసమే ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం’ అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ అన్నారు. ఈనెల 25న జరగనున్న జాతీయ ఓటరు దినోత్స వాన్ని పురస్కరించుకొని జనగామ జిల్లా కేంద్రంలోని జడ్పీ హెచ్ఎస్ పాఠశాల ఆవరణలో గురువారం విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. కలెక్టర్ శ్రీదేవసేన అధ్యక్షతన జరిగిన ముఖాముఖిలో భన్వర్‌లాల్ మాట్లా డుతూ ఓటు హక్కు సరిగా వినియోగించుకు న్నప్పుడే భవిష్యత్ తరాలు బాగుంటాయ న్నారు. ఒకరి బదులుగా మరొకరు ఓటు వేయకుండా నిరోధించడం కోసం రాబోయే రోజుల్లో ఈ–ఓటింగ్ విధానం అమలు చేసే యోచన ఉందన్నారు. 2019 ఎన్నికల్లో ఈవీఎంతోపాటు ప్రింటింగ్ స్లిప్ వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈనెల 25న ఏడో జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 30వేల పోలింగ్ కేంద్రాల్లో ఓటరు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు. గ్రామస్థాయి నుంచి 31 జిల్లా కేంద్రాల వరకు ముగ్గుల పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. -
శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న భన్వర్ లాల్
మంత్రాలయం: కర్నూలు జిల్లా మంత్రాలంలోని శ్రీ రాఘవేంద్రస్వామిని ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన్వర్‌లాల్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం మంత్రాలయం వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. భన్వర్ లాల్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు -
నృసింహుని సన్నిధిలో భన్వర్‌లాల్ దంపతులు
కదిరి : రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ దంపతులు సోమవారం ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వారు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామిని దర్శించుకొన్నారు. నారసింహుని దర్శనం తన పూర్వజన్మ సుకృతమని భన్వర్‌లాల్ అన్నారు. అనంతరం ఆయన మంత్రాలయం బయలుదేరి వెళ్లారు. -
రాజన్నను దర్శించుకున్న భన్వర్‌లాల్
వేములవాడ: వేములవాడలో కొలువుదీరిన రాజరాజేశ్వర స్వామిని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ భన్వర్‌లాల్ బుధవారం దర్శించుకున్నారు. ఆయల అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. -
భన్వర్ లాల్‌ను కలిసిన ఎంపీ విజయ సాయిరెడ్డి
-
31 నుంచి ఓటరు నమోదు: భన్వర్ లాల్
సాక్షి, తిరుమల: 2017 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్ల వయసు నిండిన వారు కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియ ఈ అక్టోబర్ 31వ తేదీ నుంచి ప్రారంభిస్తామని ఆయన తిరుమలలో వెల్లడించారు. బుధవారం తలనీలాలు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ అన్ని మండల కేంద్రాలు, ఆర్డీవో, సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. -
నామినేషన్లు ఓకే: ఈసీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి రాజ్యసభకు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు సక్రమంగానే ఉన్నాయని ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ ధ్రువీకరించారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఆయన అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పరిశీలించారు. నామినేషన్లు సక్రమంగానే ఉన్నాయని, వాటిని ఆమోదిస్తున్నామని భన్వర్ లాల్ వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. తర్వాత ఎన్నికలపై అధికారిక ప్రకటన వెలువడనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజ్యసభ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఏపీ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా వి.విజయసాయిరెడ్డి నామినేషన్ వేశారు. బీజేపీ, టీడీపీ అభ్యర్థులుగా కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు, కేంద్ర మంత్రి వై. సుజనాచౌదరి, రాష్ట్ర మాజీ మంత్రి టీజీ వెంకటేష్ నామినేషన్లు వేశారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ తరపున డి. శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు నామినేషన్లు దాఖలు చేశారు. -
'అందుకే విజయ సాయిరెడ్డిని పోటీలో నిలిపాం'
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఒక అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన సంఖ్య కంటే ఎక్కువ బలం తమకుందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని పోటీలో నిలిపినట్టు ఆయన వెల్లడించారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విజయసాయిరెడ్డి సోమవారం హైదరాబాద్‌లో ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ను కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిరాయింపు రాజకీయాలపై కూడా ఫిర్యాదు చేశారు. సరిపోయేంత బలం ఉండబట్టే తాము రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ఉమ్మారెడ్డి తెలిపారు. బలం లేకుండా పోటీ చేస్తే తెలంగాణలో ఏంజరిగిందో అందరికీ తెలుసని ఆయన అన్నారు. నాలుగో అభ్యర్థికి సరిపోయేంత బలం లేకపోయినా టీడీపీ పోటీ చేయడం అనైతికమన్నారు. ఒక అభ్యర్ధిని గెలిపించుకునేందుకు అవసరమైన సంఖ్య కంటే..ఎక్కువ బలం వైఎస్ఆర్ సీపీకి ఉందన్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు సోమవారం దర్శించుకున్నారు. హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ కుటుంబసమేతంగా వీఐపీ విరామ సమయంలో స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డి , రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్, చాముండేశ్వరి నాథ్ లు కూడా ఏడుకొండలవాడి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
మహానందీశ్వరుడిని దర్శించుకున్న భన్వర్‌లాల్
మహానంది: కర్నూలు జిల్లా మహానందిలోని శ్రీ కామేశ్వరి దేవి సహిత మహా నందీశ్వరుడి ఆలయాన్ని తెలుగు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి చీర బహుకరించారు. పూజల అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు. -
ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ
-
ఇప్పటివరకూ ఎలాంటి ఫిర్యాదు రాలేదు
-
ఓట్ల తొలగింపుపై భగ్గుమన్న విపక్షం
♦ రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషన్ బృందం సమావేశం ♦ ఆధారాలు, విజ్ఞాపనలను స్వీకరించిన కమిటీ ♦ సోమేశ్‌కుమార్, భన్వర్‌లాల్,సీఎం కేసీఆర్‌పై చర్యలకు పార్టీల డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రాజకీయ దురుద్దేశంతో, టీఆర్ఎస్ అధికార దాహంతోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 30 లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించారంటూ ప్రతిపక్షాలు ఎన్నికల కమిషన్ బృందానికి తెలిపాయి. గ్రేటర్లో ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు మేరకు విచారణ జరిపేందుకు హైదరాబాద్ వచ్చిన 14 మంది సభ్యులతో కూడిన ఎన్నికల సంఘం బృందం శనివారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో అన్ని రాజకీయపార్టీలతో సమావేశమైంది. ఆయా పార్టీల ప్రతినిధులతో సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. ఓట్ల తొలగింపునకు సంబంధించి ఆధారాలను, విజ్ఞాపనలను కమిటీ స్వీకరించింది. అన్ని పార్టీల ప్రతినిధులతో ఒకేసారి కాకుండా, అక్షర క్రమంలో ఒక్కొక్క పార్టీకి చెందిన ప్రతినిధులనే పిలిచి ప్రత్యేకంగా విచారించారు. విచారణ సమయంలో రాష్ట్రానికి చెందిన అధికారులెవరినీ లోపలకు అనుమతించలేదు. కాగా, కమిటీని కలసిన వారిలో కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ప్రభాకర్, బీజేపీ మాజీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, సీపీఐ కార్యదర్శివర్గ సభ్యుడు రాం నర్సింహరావు, సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు డి.జి.నర్సింగరావు, ఎంఐఎం ఎమ్మెల్సీ జాఫ్రీ, టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, వివేకానంద, అరికెపూడి గాంధీ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్ తదితరులున్నారు. విపక్షాలను దెబ్బతీసేందుకు చేసిన ఈ ఓట్ల తొలగింపు ప్రక్రియలో జిల్లా ఎన్నికల అధికారి సోమేశ్‌కుమార్, రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ పాత్రధారులు కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన సూత్రధారి అని ప్రతిపక్ష పార్టీల సభ్యులు కమిటీకి నివేదించారు. బృందాలుగా విడిపోయి విచారణ గ్రేటర్ హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ అధికారులు భారీగా ఓట్లు తొలగించారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి అందిన ఫిర్యాదుల్లో ఎంతవరకు వాస్తవముందో తేల్చేందుకు ఉన్నతాధికారులతో కూడిన బృందాలు శనివారం సనత్‌నగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజవర్గాల్లో విచారణ చేపట్టాయి. పశ్చిమబంగా ముఖ్య ఎన్నికల అధికారి సునీల్‌గుప్తా ఆధ్వర్యంలో నగరానికి వచ్చిన అధికారులు మరికొంత మంది ఎన్నికల అధికారులతో కలసి ఓటరు జాబితాలను పరిశీలించారు. ఓట్లను తొలగించినట్టు ప్రధాన ఆరోపణలు వచ్చిన సనత్‌నగర్ నియోజకవర్గంలో మూడు టీంలుగా ఎన్నికల సంఘం అధికారులు విచారణ చేపట్టారు. షిఫ్టింగ్‌లు, డోర్లాక్ల పేరుతో ఓటర్లను తొలగించారని వారికి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సనత్‌నగర్ ఎస్ఆర్టీ, కైలాస్ నగర్, బాపూనగర్, అమీర్‌పేట్‌కు చెందిన ఓటర్ల ఇళ్లకు వెళ్లి జాబితాను, ఓటరు గుర్తింపు కార్డులను పరిశీలించారు. ఒక్కో టీంకు ఒక్కో డాకెట్ కింద 12 నుంచి 20 మంది ఓటర్ల వద్దకు వెళ్లి వారి అభిప్రాయాలను సేకరించారు. ఆరోపణలు వచ్చిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్‌గూడ డివిజన్ శ్రీకృ ష్ణానగర్లో ఫిర్యాదులను పరిశీలించి ఓట్ల తొలగింపు వ్యవహారంపై తనిఖీలు నిర్వహించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో అధికారులు విచారణ జరిపారు. రంగారెడ్డి కలెక్టరేట్లో భేటీ సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్రేటర్లో లక్షల ఓట్ల తొలగింపు ఘటనపై విచారణకు కేంద్రం నుంచి వచ్చిన బృందం శనివారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డితోపాటు కలెక్టర్ రఘునందన్‌రావు, మెదక్ కలెక్టర్ రోనాల్డ్‌రాస్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీలో ఉన్న 24 నియోజకవర్గాలకు చెందిన ఓటర్ల జాబితాను సమీక్షించారు. లక్షల సంఖ్యలో ఓట్లు తొలగింపుపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రక్రియ రెండు మూడు రోజులు కొనసాగనుందని సమాచారం. -
గ్రేటర్లో 6.3 లక్షల ఓట్లు తొలగింపు
► తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ► ఓటర్ల సవరణను సద్వినియోగం చేసుకోండి.. తప్పులుంటే మార్చుకోండి ► నవంబర్ 4 వరకు ఓటర్ల సవరణ.. కొత్త ఓటర్లకు అవకాశం ► నియోజకవర్గాలవారీగా ముసాయిదా జాబితాల ప్రచురణ ► తెలంగాణలో 2.54 కోట్ల మంది, ఏపీలో 3.51 కోట్ల మంది ఓటర్లు ► ఎమ్మెల్సీ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితాల సవరణ.. కొత్త ఓటర్ల నమోదు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ విజ్ఞప్తి చేశారు. సోమవారం నుంచి మొదలైన ఈ ప్రక్రియ వచ్చే నెల 4వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. షెడ్యూలు ప్రకారం రెండు రాష్ట్రాల్లోనూ నియోజకవర్గాల వారీగా ఓటర్ల ముసాయిదా జాబితాలను ప్రచురించినట్లు చెప్పారు. తెలంగాణలో 2.54 కోట్ల మంది, ఆంధ్రప్రదేశ్‌లో 3.51 కోట్ల మంది ఓటర్లు ఉన్నారన్నారు. 2016 జనవరి 1వ తేదీ వరకు 18 ఏళ్లు నిండే వారందరూ కొత్తగా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులవుతారని తెలిపారు. కొత్త ఓటర్లతో పాటు ఇప్పటివరకు ఓటు హక్కు లేని వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే జాబితాల్లో ఉన్న ఓటర్లు తమ పేర్లు, చిరునామాల్లో మార్పులుంటే సవరించుకోవాలన్నారు. ఓటర్లు ఆన్లైన్లో తమ దరఖాస్తులు సమర్పించే వీలుందని, రెవెన్యూ కార్యాలయాల్లో నేరుగా దరఖాస్తులు అందించవచ్చని చెప్పారు. ఖాళీగా ఉన్న వరంగల్ లోక్‌సభ స్థానం పరిధిలోని నియోజకవర్గాలు, నారాయణ్ఖేఢ్ నియోజకవర్గంలోనూ ఓటర్ల సవరణకు వీలుందన్నారు. నోటిఫికేషన్ వచ్చేలోగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే వెలువడే అవకాశం ఉందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలను పంపాలని కోరిందని, 3 రోజుల్లో పంపుతామని చెప్పారు. గ్రేటర్లో 6.3 లక్షల ఓట్లు తొలగింపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేపట్టిన ఇంటింటి సర్వే ఆధారంగా 6.3 లక్షల ఓట్లను జాబితా నుంచి తొలగించినట్లు భన్వర్‌లాల్ చెప్పారు. వీరితో పాటు మరో 19 లక్షల మంది ఓటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. ఈ జాబితాలను అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించామని, ఈ నెల 8 నుంచి ఇంటింటి సర్వే చేపట్టి వీటిని పరిశీలిస్తామన్నారు. పార్టీల తరఫున బూత్ లెవల్ ఏజెంట్లను పంపించాలని కోరామని.. వారు సహకరిస్తే ఓట్ల తొలగింపుతో పాటు అర్హులైన ఓటర్ల పేర్లు గల్లంతవకుండా ఈ ప్రక్రియ సజావుగా సాగుతుందని చెప్పారు. అకారణంగా ఓటర్లను జాబితాలో నుంచి తొలగించినట్లు తేలితే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా ఓటర్ల జాబితాల్లో తమ పేరు తొలిగించినట్లు గుర్తిస్తే తమ దృష్టికి తీసుకురావాలని.. వారి పేర్లను పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారు. రెండు రోజుల్లో ప్రత్యేక సవరణ ఈ నెల 11, నవంబర్ 1న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటర్ల సవరణకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు భన్వర్‌లాల్ తెలిపారు. సంబంధిత పోలింగ్ కేంద్రాల్లోనే బూత్ లెవల్ ఆఫీసర్లు అందుబాటులో ఉంటారని.. అక్కడే దరఖాస్తులు సమర్పించే వీలు కల్పించినట్లు చెప్పారు. ఓటర్లు తమ పేర్లు జాబితాలో ఉన్నాయా.. లేదా తెలుసుకునేందుకు వీలుగా పంచాయతీ కార్యాలయాలు, మండల రెవెన్యూ కార్యాలయం, డివిజన్ కేంద్రాల్లో ఓటర్ల జాబితాలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. 8790499899 ఫోన్ నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపి ఓటు వివరాలను తెలుసుకునే వీలుందన్నారు. ఓట్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి తమ గుర్తింపు కార్డు నంబర్‌ను.. ఈ నంబర్‌కు పంపిస్తే క్షణాల్లోనే వివరాలు అందుతాయన్నారు. ఓటర్ల జాబితాల్లో అవకతవకలు భన్వర్‌లాల్‌కు అఖిలపక్షం ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితాల్లో అవకతవకలకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నేతలు భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 6.30 లక్షల ఓట్లను తొలగించారని, మరో 19 లక్షల ఓటర్లకు నోటీసులు ఇచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. బతికి ఉన్న వారిని సైతం చనిపోయినట్లుగా చూపించి ఓట్లను గల్లంతు చేశారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ టీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్‌గా మారారని, తప్పులకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రధానంగా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీకి పట్టున్న ప్రాంతాల్లో ఉద్దేశపూర్వకంగా ఓట్లను తొలగించినట్లుగా భన్వర్‌లాల్ దృష్టికి తెచ్చారు. ఓటర్ల సవరణ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ఎన్నికల కమిషన్ మంగళవారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ తరఫున మర్రి శశిధర్‌రెడ్డి, టీడీపీ నుంచి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, బీజేపీ నుంచి ఇంద్రసేనారెడ్డి, ఎంఐఎం నుంచి జాఫ్రీ, టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ శ్రీనివాస్, వైఎస్సార్సీపీ నుంచి కె.శివకుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశంలోనే నిజామాబాద్ నంబర్‌వన్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నందున ఓటర్ల నమోదుకు, సవరణకు ఆధార్‌తో సంబంధం లేదని భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో ఆధార్ సీడింగ్ నూటికి నూరు శాతం పూర్తయిందని భన్వల్‌లాల్ చెప్పారు. దేశంలోనే ఆధార్ సీడింగ్ పూర్తి చేసిన మొదటి జిల్లా నిజామాబాద్ అని తెలిపారు. -
ఓట్లను తొలగిస్తున్నామనేది అవాస్తవం
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓటర్లను తొలగిస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ అన్నారు. ఎవరికైనా సందేహాలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చని ఆయన మంగళవారమిక్కడ సూచించారు. ఒకవేళ ఓట్లు తొలగించినట్లు ఎవరి వద్ద అయినా ఆధారాలు ఉంటే చూపించాలని భన్వర్ లాల్ కోరారు. ఇప్పటివరకు 5,14,796 మంది తమ ఓట్లను బదిలీ చేయించుకున్నారని, 89,085 మంది డూప్లికేటు ఓటర్లు ఉన్నారని తెలిపారు. డూప్లికేట్ ఓటర్లను మాత్రమే హైదరాబాద్ ఓటర్ల నుంచి తొలగించామని, అర్హులైన వారికి ఓటు హక్కు కల్పిస్తామని, అక్రమంగా ఒక్క ఓటు కూడా తొలగించలేదని భన్వర్ లాల్ స్పష్టం చేశారు. -
ప్రకృతి చికిత్సాలయాన్ని సందర్శించిన సీఈవో
వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం అక్బర్‌నగర్‌లోని ప్రకృతి చికిత్సాలయాన్ని ఆదివారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. యోగా శిక్షణ, మసాజ్, టబ్‌బాత్ కేంద్రం, రోగులకు అందించే ఆహారాన్ని ఆయన పరిశీలించారు. కాళ్ల నొప్పులు, బరువు తగ్గడానికి ఎలాంటి చికిత్స విధానం ఉంటుందో నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందిస్తున్న చికిత్సలు.. తదితర అంశాల గురించి ఆశ్రమ బాధ్యులు రామకృష్ణ, రాజశేఖర్ వివరించారు. ఇక్కడికి వచ్చే రోగులకు వ్యాధిని బట్టి ముడి బియ్యం, గోధుమలతో చేసిన పులక, ఉప్పు, నూనె లేని కూరలు, మొలకెత్తిన గింజలు ఇస్తామని పేర్కొన్నారు. భన్వర్‌లాల్ వెంట మండల తహశీల్దార్ సోమేశ్వర్, ఉప తహశీల్దార్ ముజీబ్, ఎంఆర్ఐ ఆశ్వక్ ఆహ్మద్ ఉన్నారు. -
మాగుంటను అనర్హుడిగా ప్రకటించాలి
ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చర్యలు తీసుకుంటామని భన్వర్‌లాల్ హామీ సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల నుంచి ఏపీ శాసనమండలికి జరుగుతున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎంపీటీసీల ఓట్లను డబ్బుతో కొనుగోలు చేసేందుకు ప్రయత్నించడమే కాక, వారితో శిబిరాన్ని నిర్వహిస్తున్న ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డిని తక్షణం అనర్హుడుగా ప్రకటించాలని, ఆ పార్టీ అధ్యక్షుడిపైనా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ, పీఏసీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరరావు మంగళవారం సచివాలయంలో ఉభయ రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) భన్వర్‌లాల్‌ను కలుసుకుని ఆ మేరకు ఒక వినతిపత్రం సమర్పించారు. జిల్లాలో వైఎస్సార్సీపీకి 496 మంది, టీడీపీకి 472 మంది ఎంపీటీసీలున్నారు. దీన్నిబట్టి వైఎస్సార్సీపీ అభ్యర్థే గెలుపొందడం ఖాయమని తేలిపోవడంతో 35 మందికి రూ.2.5 లక్షల చొప్పున ఇస్తామని చెప్పి శ్రీనివాసులురెడ్డి ప్రలోభపెట్టారని తెలిపారు. మొదట రూ.50 వేలు చొప్పున అడ్వాన్సుగా చెల్లించి ప్రలోభపెట్టి నెల్లూరు శిబిరానికి తరలించుకు వెళ్లారని చెప్పారు. ఎన్నికల్లో ప్రలోభాలకు, అక్రమంగా శిబిరాల నిర్వహణకు కారణమైన మాగుంటను అనర్హుడుగా ప్రకటించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. తమకు టీడీపీ అభ్యర్థి కొంత డబ్బు అడ్వాన్సుగా చెల్లించారని స్వయంగా వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు మీడియాకు చెప్పిన దృశ్యాల సీడీని కూడా అందించారు. ఫిర్యాదుపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని, సంబంధిత వ్యక్తులపై కేసులు పెట్టాల్సిందిగా ఆదేశిస్తానని భన్వర్‌లాల్ వారికి హామీ ఇచ్చారు. రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయాలు భ్రష్టు పట్టాయని, జాతీయస్థాయిలో అందరి దృష్టీ ఇక్కడే ఉందని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది. సీఈఓను కలిసిన అనంతరం జ్యోతుల నెహ్రూ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ ప్రకాశంలో ప్రలోభాలకు అతీతంగా ఎన్నికలు నిర్వహించకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. -
'మాగుంట అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలి'
-
కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి రేవంత్ వ్యవహారం
నేడు ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యేకు లంచం ఇవ్వజూపి ఏసీబీకి దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యవహారాన్ని కేంద్ర ఎన్నిక కమిషన్ (సీఈసీ) దృష్టికి తీసుకెళ్లినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. సోమవారం సచివాలయంలోని తన చాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏసీబీ డీజీ ఇచ్చిన నివేదికను సీఈసీకి సమర్పించినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అంతకుమించి ఈ విషయంలో వివరాలు వెల్లడించనని తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థలకు సంబంధించి 12 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు భన్వర్‌లాల్ తెలిపారు. విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లోని రెండేసి ఎమ్మెల్సీ స్థానాలు 2013, 2015లో ఖాళీ అయిన దృష్ట్యా వాటికి ఒకేసారి వేర్వేరుగా రెండు బ్యాలెట్లతో ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈ ఎన్నికలకు మొత్తం తొమ్మిది జిల్లాల్లో 35 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 10,004 మంది ఓటర్లున్నారన్నారు. తొమ్మిది జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందని, జెడ్పీ, మున్సిపల్, కార్పొరేషన్ సర్వసభ్య సమావేశాలు నిర్వహించరాదన్నారు. ప్లయింగ్ స్క్వాడ్, చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు భన్వర్‌లాల్ తెలిపారు. ఓటు కోసం ప్రలోభపెడితే మాత్రం కఠిన చర్యలుంటాయన్నారు. -
నేడు ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్
-
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపు నోటిఫికేషన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ తెలిపారు. ఏపీలో 12 స్థానాలకు స్థానిక సంస్థల కోటా కింద ఎన్నికలు జరగనున్నాయి. జూలై 3న ఎన్నికలు జరుగుతాయి. ఈ మేరకు భన్వర్ లాల్ మాట్లాడుతూ.. 'జూన్ 16వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఈనెల 19న నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. జూలై 3న పోలింగ్.. అదే నెల 7న లెక్కింపు ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 10,400 మంది ఓటర్లు ఉన్నారు. వారందరికీ అనుకూలంగా 35 కేంద్రాలను ఏర్పాటు చేశాం' అని అన్నారు. అదే విధంగా ఎన్నికల్లో ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నోటిఫికేషన్ విడుదలయ్యాక ఏపీలోని 9 జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలు చేయనన్నట్టు ఈ సందర్భంగా భన్వర్ లాల్ తెలిపారు. -
సదారాంను తొలగించాలి
సీఈవోకు వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ వినతి సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీకి అనుకూలంగా, పక్షపాత వైఖరితో పనిచేస్తున్న అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాంను ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతల నుంచి తొలగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) భన్వర్‌లాల్‌కు వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ విజ్ఞప్తి చేసింది. సదారాం స్థానంలో మరో అధికారిని నియమించి ఎన్నికలను నిర్వహించాలని కోరింది. ఈ మేరకు బుధవారం సచివాలయంలో భన్వర్‌లాల్‌కు వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ ప్రధాన కార్యదర్శులు కె.శివకుమార్, హెచ్ఏ రెహమాన్ వినతిపత్రాన్ని సమర్పించారు. అభ్యంతరాలుంటే తెలపండి: భన్వర్‌లాల్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఇద్దరు పరిశీలకులను నియమించామని, అభ్యంతరాలుంటే తమ దృష్టికి తీసుకురావొచ్చని భన్వర్‌లాల్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు రూపొందించిన ఎమ్మెల్యేల ఓటర్ల జాబితాలో ఏయే పార్టీలకు వారు ప్రాతి నిధ్యం వహిస్తున్నారనే వివరాలు లేకుండానే సదారాం ప్రచురించారని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో నామినేషన్ల ముగింపునకు ముందు జాబితాలో పార్టీల పేర్లను పొందుపరిచారని వారు సీఈవోకి తెలిపారు. ఇది కావాలనే చేశారని, పార్టీ ఫిరాయింపు చట్టం కింద అనర్హతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను ఈ జాబితా ద్వారా అర్హులైన ఓట ర్లుగా చేసే ప్రయత్నం జరిగిందని వారు వివరించా రు. అనంతరం కె.శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. అధికారపార్టీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న సదారాంను ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ విధుల నుంచి తొలగించాలని సీఈవోను కోరినట్లు తెలిపారు. టీఆర్ఎస్లోకి ఫిరాయించిన ఇద్దరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. వారిపై చర్య తీసుకోవాలని తాము కోర్టునూ ఆశ్రయించామన్నారు. వీరికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించవద్దని కోరామన్నారు. -
సత్యదేవుని దర్శించుకున్న భన్వర్‌లాల్
అన్నవరం (తూర్పుగోదావరి జిల్లా): రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్‌లాల్ దంపతులు ఆదివారం రత్నగిరిపై సత్యదేవుని దర్శించుకున్నారు. వారికి దేవస్థానం ఇన్చార్జి ఈఓ జగన్నాథరావు ఆధ్వర్యంలో పండితులు స్వాగతం పలికారు. స్వామివారి వ్రతం, దర్శనం అనంతరం వారికి వేదపండితులు ఆశీస్సులందజేశారు. స్వామివారి ప్రసాదాలను అందజేశారు. -
'ఈనెల 31 వరకు అనుసంధానం'
హైదరాబాద్: తెలంగాణలో 76 శాతం, ఏపీలో 84 శాతం ఓటరు గుర్తింపుకార్డులతో ఆధార్ కార్డు అనుసంధానం చేశామని ఎన్నికల ప్రత్యేకాధికారి భన్వర్ లాల్ తెలిపారు. రంగారెడ్డి, హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో ఆధార్ అనుసంధానం దాదాపు పూర్తయిందని చెప్పారు. ఏపీలో ప్రకాశం, కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, వైఎస్సార్ జిల్లాల్లో వంద శాతం అనుసంధానం జరిగిందన్నారు. ఈ విషయంలో విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలు వెనుకబడి ఉన్నాయన్నారు. ఆధార్, ఓటర్ కార్డు అనుసంధానం ఈనెల 31 వరకు కొనసాగిస్తామని ప్రకటించారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జూన్ లో జరుగుతాయని తెలిపారు. తెలంగాణలో 12, ఏపీ 13 స్థానాలు ఖాళీగా ఉన్నాయని భన్వర్ లాల్ వెల్లడించారు. -
వచ్చే ఎన్నికల్లో ఈ-ఓటింగ్!
ఆదోని: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో (2019లో) ఈ-ఓటింగ్ జరిగే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ చెప్పారు. కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహిస్తున్న ఓటరు కార్డుకు ఆధార్ సీడింగ్ కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు మేరకు ప్రభుత్వం ఎన్ఆర్ఐలకు ఈ-ఓటింగ్ అవకాశం కల్పించే చర్యలు తీసుకుంటోందని చెప్పారు. దీన్ని స్థానిక ఓటర్లకు కూడా అమలు చేయవచ్చన్నారు. జనాభా కన్నా ఓటర్లు ఎక్కువ ఉన్నారనే ప్రచారంలో నిజం లేదన్నారు. ఆగస్టు 1న తప్పులు లేని ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని చెప్పారు. జనాభా ప్రాతిపదికన ఏపీలో అసెంబ్లీ స్థానాలను 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెంచాల్సి ఉన్నా.. పెంచే అధికారం ఎన్నికల సంఘానికి లేదన్నారు. దీనిపై పార్లమెంటు మాత్రమే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. -
నవంబర్ 1 నుంచి ఓటుహక్కు నమోదు
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ సాక్షి, శివ్వంపేట (మెదక్‌జిల్లా): నవంబర్ 1 నుంచి 25 వరకు ఓటు హక్కు నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తునట్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. శనివారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయస్వామి, సత్యనారాయణస్వామి ఆలయాలను ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ ఆంజనేయశర్మ, ఈఓ శ్రీనివాసులు భన్వర్‌లాల్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి వారికి తీర్థప్రసాదాలను అందజేశారు. దాతల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్న ఆంజనేయశర్మను భన్వర్‌లాల్ అభినందించారు. ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తానన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, జనవరి 2015 సంవత్సరానికి 18 సంవత్సరాలు నిండే యువతీయువకులందరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. వారి కోసం నవంబర్ 1 నుంచి 25 వరకు గ్రామాలలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తునట్టు చెప్పారు. ఓటరుజాబితాలో పేర్లు తప్పిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జనవరి 5న ఓటరు జాబితా విడుదల చేస్తామని, 25న గుర్తింపు కార్డులు జారీ చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్‌గుప్తా, ప్రధాన అర్చకులు దేవదత్తశర్మ పాల్గొన్నారు. -
ఆళ్లగడ్డ ఎన్నికలపై హైకోర్టులో ఫిటీషన్లు: భన్వర్‌లాల్
-
మెదక్ ఎన్నికలకు బెంగళూరు ఈవీఎంలు
హైదరాబాద్: మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు బెంగళూరు నుంచి ఈవీఎంలను తెప్పిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ చెప్పారు. డీఈఎల్ కంపెనీకి చెందిన ఈవీఎంలను వాడుతున్నట్టు భన్వర్ లాల్ వెల్లడించారు. భద్రత కోసం 17 కంపెనీల బలగాలను మోహరించనున్నట్టు తెలిపారు. రేపటి నుంచి ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. -
హైకోర్టు తీర్పు తర్వాతే ఆళ్లగడ్డ ఉప ఎన్నిక
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నవంబర్‌లో యువ ఓటర్ల దరఖాస్తుల స్వీకరణ ఒంగోలు: హైకోర్టు తీర్పు ఆధారంగానే కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ వెల్లడించారు. గురువారం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నిక విషయమై రెండు మూడు రోజుల్లో స్పష్టత రానుందని తెలిపారు. 2015 జనవరి 1నాటికి 18 ఏళ్లు నిండే వారంతా ఓటరుగా పేర్లు నమోదు చేసుకునేందుకు నవంబర్ 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు. 8 ఓట్లకు రూ.5లక్షల ఖర్చా..? ఒంగోలులో జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులు చెప్పిన విషయం భన్వర్‌లాల్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాలివీ...గిద్దలూరు నియోజకవర్గ పరిధిలో 6,276 సర్వీస్ ఓటర్లున్నారు. వీరంతా దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధి నిర్వహణలో ఉండటంతో ఎన్నికల అధికారులు అందరికీ పోస్టల్ బ్యాలెట్లు పంపించారు. అందుకుగాను రూ. 5లక్షల ఖర్చయింది. కానీ, ఓటు హక్కు వినియోగించుకున్నది 8మందే. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు భన్వర్‌లాల్ తెలిపారు. -
మెదక్ లోక్‌సభ పరిధిలో సమగ్ర సర్వే వద్దు
ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలతో తేల్చి చెప్పిన భన్వర్‌లాల్ సాక్షి, హైదరాబాద్: మెదక్ పార్లమెంట్ స్థానానికి ఉపఎన్నిక నిర్వహణకు షెడ్యూల్ విడుదలైనందున ఆ నియోజకవర్గంలో సమగ్ర కుటుంబ సర్వే చేయవద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. ‘ఎన్నికల కోడ్’ అమలులోకి వచ్చినందున అక్కడ సర్వే చేయడానికి వీలులేదు. ఆ స్థానాన్ని మినహాయించుకుని మిగతాప్రాంతాల్లో నిర్వహించుకోవచ్చు’ అని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సమగ్ర కుటుంబ సర్వేకు దీంతో తొలి అవాంతరం ఎదురైంది. ఈ నెల 19న ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కుటుంబాల వద్దకు అధికారులు వెళ్లి సర్వే చేయాల్సి ఉండటం తెలిసిందే. -
నియోజవర్గాల పునర్విభజన షురూ!
-
పునర్విభజన షురూ!
* 2011 లెక్కల ప్రకారం అసెంబ్లీ స్థానాల పునర్విభజన * పార్లమెంటు స్థానాలు యథాతథం * ఎస్టీ లోక్‌సభ స్థానం ఒకటి పెరిగే అవకాశం సాక్షి, హైదరాబాద్: శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మొదలైంది. వచ్చే సాధారణ ఎన్నికల్లోగా నియోజకవర్గాల పునర్విభజన పూర్తవ్వాల్సి ఉండటంతో ఈ ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. మహారాష్ట్ర, హర్యానా తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కసరత్తులో ఉన్న ఎన్నికల సంఘం ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపైనా దృష్టి సారించినట్టు తెలిసింది. ఇందుకోసం త్వరలోనే ఒక కమిషన్‌ను నియమించనుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న మేరకు తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాలను 153కు, ఆంధ్రప్రదేశ్‌లోని 175 స్థానాలను 225కు పెంచాల్సి ఉంది. పునర్విభజనతో ఆంధ్రప్రదేశ్‌లోని నియోజకవర్గాల స్వరూప, స్వభావాలు మారతాయి. నియోజకవర్గాల్లో ఇప్పుడున్న మండలాలు కొన్ని ఇతర నియోజకవర్గాల్లో చేరతాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన చేపట్టాల్సి ఉంది. ఈ జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 4,93,78,776 జనాభా ఉంది. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పెరగనున్న నియోజకవర్గాల సంఖ్యతో మొత్తం రాష్ట్ర జనాభా సంఖ్యను విభజిస్తే ఒక్కో నియోజకవ ర్గానికి 2,19,461 సగటు జనాభా ఉండే అవకాశాలున్నాయి. ఈ లెక్కన శ్రీకాకుళం జిల్లాలో 2, విజయనగరంలో 2, విశాఖపట్నంలో 5, తూర్పు గోదావరిలో 5, పశ్చిమ గోదావరిలో 3, కృష్ణాలో 3, గుంటూరులో 5, ప్రకాశంలో 3, నెల్లూరులో 4, చిత్తూరులో 5, వైఎస్సార్‌లో 3, అనంతపురంలో 5, కర్నూలులో 5 చొప్పున నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లోనూ మార్పులు తాజా జనగణన ప్రకారం ఎస్సీ, ఎస్టీల జనాభా పెరిగినందున, ఆ వర్గాలకు రిజర్వు అయ్యే నియోజకవర్గాలు కూడా పెరగనున్నాయి. ఈ రిజర్వ్డ్ స్థానాలు కూడా మారనున్నాయి. ఈ జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీల జనాభా 84,45,398గా ఉంది. ఆ వర్గానికి ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 29 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఈసారి 38కి చేరుకొనే అవకాశం ఉంది. ఎస్సీ స్థానాలను జిల్లా యూనిట్‌గా కేటాయిస్తారు. విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఎస్సీ స్థానాలు పెరుగుతాయని అధికారులు అంచనా వేశారు. రాష్ట్రంలో ఎస్టీల జనాభా 26,31,145గా ఉంది. వారికి ప్రస్తుతం అసెంబ్లీలో ఏడు సీట్లుండగా అది 12కు చేరుకునే అవకాశముంది. ఎస్టీలకు రాష్ట్రం యూనిట్‌గా నియోజక వర్గాలను నిర్ణయిస్తారు. నియోజకవర్గాల విభజన తరువాత ఎస్టీల జనాభా ఎక్కువగా ఉన్న మొదటి 12 స్థానాలు ఏయే జిల్లాల్లో ఉంటే వాటిని ఎస్టీలకు కేటాయిస్తారు. పునర్విభజనలో భౌగోళిక మార్పులతో కొత్త నియోజకవర్గాలు రిజర్వు అయ్యే అవకాశముంది. లోక్‌సభ స్థానాల సంఖ్య యథాతథం ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాల సంఖ్యలో ఎలాంటి మార్పూ ఉండదు. అయితే జిల్లాల్లో నియోజకవర్గాల సంఖ్యను అనుసరించి లోక్‌సభ స్థానాల్లో అక్కడ పెరుగుదల, తగ్గుదల ఉంటుంది. ప్రస్తుతం ప్రతి లోక్‌సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, పునర్విభజన తర్వాత వీటి సంఖ్య తొమ్మిదికి పెరుగుతుంది. అసెంబ్లీ సెగ్మెంట్లు పెరుగుతున్నందున ఒక్కొక్క లోక్‌సభ స్థానం పరిధి రెండు మూడు జిల్లాలకు విస్తరించే అవకాశముంది. దీనివల్ల ఎంపీలకు పరిపాలనపరమైన ఇబ్బందులు తలెత్తవచ్చని భావిస్తున్నారు. సాధ్యమైనంతమేరకు ఒక్కో లోక్‌సభ స్థానం పరిధిలో ఒకటి లేదా రెండు జిల్లాలకు మించి లేకుండా చూడాలని భావిస్తున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభ ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని సమాచారం. ప్రస్తుతం అమలాపురం, బాపట్ల, చిత్తూరు, తిరుపతి లోక్‌సభ స్థానాలు ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్నాయి. అసెంబ్లీ సెగ్మెంట్ల పునర్విభజనతో ఇప్పుడున్న నియోజకవర్గాల స్వరూపంలో మార్పు వస్తే కనుక వీటికి బదులు వేరే నియోజకవర్గాలు రిజర్వు అయ్యే అవకాశముంటుందే తప్ప సంఖ్య మాత్రం నాలుగుగానే ఉండనుంది. ఎస్టీలకు ప్రస్తుతం అరకు లోక్‌సభ స్థానం మాత్రమే రిజర్వు అయి ఉంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించడంతో ఎస్టీల లోక్‌సభ స్థానం మరొకటి పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఈ మండలాల్లోని జనాభాలో అత్యధికం ఎస్టీలే ఉన్నారు. ఆ లెక్కన రాష్ర్ట్రంలో వారి జనాభా పెరుగుతుంది. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలను ఆనుకొని ఉన్నవే కనుక అక్కడి అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో కొన్ని ఎస్టీలకు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. -
స్థానిక ఎమ్మెల్సీ స్థానాల పునర్విభజన!
* నెల రోజుల్లో షెడ్యూల్ * రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన త్వరలో * ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: వచ్చే పక్షం రోజుల్లోగా స్థానిక ఎమ్మెల్సీ స్థానాల పునర్విభజనను కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి చేయనుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలి పారు. ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోందని మంగళవారం తనను కలిసిన సాక్షి ప్రతినిధికి చెప్పారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం స్థానిక సంస్థల నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి ఉందన్నారు. తెలంగాణ శాసనమండలిలో స్థాని క సంస్థల నియోజకవర్గాల సంఖ్యను మూడుకు పెంచాల్సి ఉందని, అలాగే ఏపీ శాసన మండలిలో స్థానిక సంస్థల నియోజకవర్గాల సంఖ్యను మూడుకు తగ్గించాల్సి ఉందని, ఈ మార్పులను జిల్లాల జనాభా లెక్కల ప్రాతిపదికన కేంద్ర ఎన్నికల సంఘం పక్షం రోజుల్లో పూర్తి చేయనుందని వివరించారు. అనంతరం నెల రోజుల్లోగా ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను 153కు పెంచేందుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను 225కు పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలను చేపట్టిందన్నారు. ఈ మేరకు అసెంబ్లీ నియోజవర్గాల పునర్విభజన చేపట్టేందుకు త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం కమిషన్‌ను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఈ పునర్విభజన చేపట్టేందుకు కేంద్ర ఎన్నిల సంఘం ఎస్సీ, ఎస్టీ జనాభాతో పాటు మొత్తం జనాభా లెక్కల గురించి కేంద్ర హోంశాఖ, రిజిస్ట్రార్ జనరల్‌ను సమాచారం కోరిందని తెలిపారు. ఇక సెప్టెంబర్ నెలలో ఓటర్ల జాబితా సవరణ, ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. పట్టణాల్లో ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితా సవరణ, ఓటర్ల నమోదు కార్యక్రమం చేపడతామన్నారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండే వారిని ఓటర్లుగా నమోదు చేస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించి త్వరలోనే షెడ్యూల్‌ను ప్రకటిస్తామన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఎమ్మెల్యే కోటా నుంచి రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు నోటిఫై చేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరామని, అయితే కేంద్రం ఒక ఎమ్మెల్సీ స్థానం ఎన్నికకే నోటిఫికేషన్ జారీ చేసిందని ఆయన తెలిపారు. -
ఎమ్మెల్సీ'పై సీఈసీకి భన్వర్‌లాల్ లేఖ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ లేఖ రాశారు. మండలిలో ఎమ్మెల్యే కోటాలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు అనుమతివ్వాలని కోరారు. ఏపీ కౌన్సిల్లో 17కు గాను 15 మంది ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. ఆగస్టు 4న ఒక ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చారని, మరో ఎమ్మెల్సీని కేటాయించాల్సి ఉందని సీఈసీకి రాసిన లేఖలో భన్వర్‌లాల్ వివరించారు. -
చీరాల ఉత్కంఠకు తెర
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశవ్యాప్తంగా మొదటి ఐదు స్థానాల్లో ప్రకాశం జిల్లా ఒకటిగా నిలిచింది. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలను కూడా ముందుగా జిల్లాలోనే ప్రకటించి అధికారులంతా ప్రశంసలు అందుకున్నారు. పోలింగ్‌లోనూ, ఫలితాల విడుదల్లోనూ ప్రకాశించిన జిల్లాను చీరాలలో తలెత్తిన వివాదం ఒక్కసారిగా తల్లకిందులు చేసింది. అప్పటివరకు వచ్చిన ప్రశంసలు చీరాల ఘటన మాటున కొట్టుకుపోయినట్లయింది. అందుకు కారణం.. ఆ నియోజకవర్గంలో ఈవీఎంలను తారుమారు చేశారన్న ఆరోపణలే. వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. అక్కడి స్వతంత్ర అభ్యర్థి గెలుపునకు ఆ అధికారి కృషి చేశారని ఆరోపించారు. అందుకు బలం చేకూర్చే విధంగా చీరాలలోని వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజీలో ఈవీఎంలు వెలుగుచూశాయి. దీంతో వివాదం తారాస్థాయికి చేరింది. చివరకు రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ జోక్యం చేసుకుని గుంటూరు జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్, తెనాలి ఆర్డీవో శ్రీనివాసరావు, బాపట్ల తహసీల్దార్ మూడమంచు వెంకటేశ్వర్లును విచారణాధికారులుగా నియమించారు. వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజీలో ఉన్న 71 ఈవీఎంలను చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల సమక్షంలో మంగళవారం విచారణాధికారులు తనిఖీ చేయగా అవి రిజర్వ్‌లో ఉన్న ఈవీఎంలుగా తేలింది. దీంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. నియోజకవర్గంలో ఆరు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. -
మొరాయించిన ఈవీఎం.. ఎల్లుండి రీ పోలింగ్ కు ఈసీ ఆదేశం
మహబూబ్ నగర్: జిల్లాలోని కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోజూపల్లి 119 పోలింగ్ బూత్ లో సోమవారం రీ పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ నిర్ణయించింది. నిన్నటి నుంచి ఈవీఎం మొరాయించడంతో ఆ ఫలితాన్ని అధికారులు పెండింగ్ లో పెట్టారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ ఒక నివేదికను ఈసీకి అందజేశారు. దీంతో జిల్లాలోని కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఫలితం తేలడానికి మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే తీవ్రంగా శ్రమించిన అధికారులు తిరిగి ఈ రోజు ఈవీఎంను ఓపెన్ చేయడం కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఓపెన్ చేయడానికి ఈసీఎల్ ఇంజినీర్లు రంగంలోకి దిగినా.. చివరకు వారు చేతులెత్తేశారు. ఈవీఎంను ఓపెన్ చేయడం తమవల్ల కాదంటూ రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ కు తేల్చిచెప్పేశారు. దీంతో ఇక్కడ తాజాగా ఎన్నిక నిర్వహించాలని భన్వర్ లాల్ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందజేశారు. ఈ బూత్ లో రీ పోలింగ్ నిర్వహించాలంటూ సిఫారుసు చేశారు. కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగిన వంశీచంద్‌రెడ్డికి తన సమీప ప్రత్యర్థి అచారిపై167 ఓట్లు ఆధిక్యంగా పోలైయ్యాయి. ఆ దశలో ఈవీఎం మొరాయించింది. దాంతో ఎన్నికల అధికారులు కౌంటింగ్ నిలిపివేశారు. అనంతరం ఈవీఎం మొరాయించిందని ఎన్నికల అధికారులు ఈసీ ఫిర్యాదు చేశారు. ఈరోజు ఆ ఈవీఎంను ఓపెన్ చేయడం కష్టసాధ్యంగా మారడంతో తిరిగి ఈ బూత్ కు సంబంధించి ఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో దివంగత వైఎస్సార్ సీపీ నేత భూమా శోభానాగిరెడ్డి విజయంపై కూడా ఈసీకి భన్వర్ లాల్ నివేదిక అందజేశారు. -
ఈవీఎం మొరాయింపుపై ఈసీకి భన్వర్ లాల్ నివేదిక
మహబూబ్ నగర్: జిల్లాలోని కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఫలితం తేలడానికి మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. నిన్నటి నుంచి కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో జూపల్లి 119 బూత్ లోని ఈవీఎం మొరాయించడంతో ఆ ఫలితాన్ని అధికారులు పెండింగ్ లో పెట్టారు. ఇప్పటికే తీవ్రంగా శ్రమించిన అధికారులు తిరిగి ఆ ఈవీఎంను ఓపెన్ చేయడం కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఓపెన్ చేయడానికి ఈసీఎల్ ఇంజినీర్లు రంగంలోకి దిగినా.. చివరకు వారు చేతులెత్తేశారు. ఈవీఎంను ఓపెన్ చేయడం తమవల్ల కాదంటూ రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ కు తేల్చిచెప్పేశారు. దీంతో ఇక్కడ తాజాగా ఎన్నిక నిర్వహించాలని భన్వర్ లాల్ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందజేశారు. ఈ బూత్ లో రీ పోలింగ్ నిర్వహించాలంటూ సిఫారుసు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఫలితంపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగిన వంశీచంద్‌రెడ్డికి తన సమీప ప్రత్యర్థి అచారిపై167 ఓట్లు ఆధిక్యంగా పోలైయ్యాయి. ఆ దశలో ఈవీఎం మొరాయించింది. దాంతో ఎన్నికల అధికారులు కౌంటింగ్ నిలిపివేశారు. అనంతరం ఈవీఎం మొరాయించిందని ఎన్నికల అధికారులు ఈసీ ఫిర్యాదు చేశారు. ఈరోజు ఆ ఈవీఎంను ఓపెన్ చేయడం కష్టసాధ్యంగా మారడంతో తిరిగి ఈ బూత్ కు సంబంధించి ఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో దివంగత వైఎస్సార్ సీపీ నేత భూమా శోభానాగిరెడ్డి విజయంపై కూడా ఈసీకి భన్వర్ లాల్ నివేదిక అందజేశారు. -
ముందు పోస్టల్, ఆ తర్వాత ఈవీఎంలు
హైదరాబాద్ : ఎన్నికల ఓట్ల లెక్కింపులో ముందుగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ తెలిపారు. కౌంటింగ్ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొనటంతో కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియ ముగియగానే ఉదయం 8.30 గంటల నుంచి ఈవీఎంల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఓ రౌండ్ ఫలితం పది నిమిషాల్లోనే వెల్లడి కానుంది. ప్రతి రౌండ్లో ర్యాండమ్‌గా రెండు టేబుళ్ల లెక్కింపును సరిచూసిన తర్వాత ఓట్ల వివరాలను షీట్లో నమోదు చేస్తారు. ఈ ఏడాది కొత్త విధానం ‘పాడు’ (ప్రింట్ అండ్ ఆక్జలరీ యూనిట్), కంట్రోల్ యూనిట్ ద్వారా ఫలితాలను వెల్లడిస్తారు. -
సార్వత్రిక ఎన్నికల లెక్కింపుపై వీడియో కాన్ఫరెన్స్
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ఓట్ల గణనపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ గురువారం కలెక్టర్, ఎస్పీలతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మూడు కేంద్రాల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్ల లెక్కింపును నిర్వహిస్తున్నామని చెప్పారు. వీటికి పూర్తి స్థాయిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి ఈవీఎం వద్ద మైక్రో అబ్జర్వర్‌తో పాటు వీడియో నిఘా మధ్య ఓట్ల గణన జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు. ఓట్లు లెక్కింపు జరిగే ఎంఎన్ఆర్, గీతం, డీవీఆర్ కాలేజ్‌ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పూర్తి స్థాయి బందోబస్తును ఏర్పాటు చేశామని ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ తెలిపారు. ఈ కేంద్రాల వద్ద ఇద్దరు ఏఎస్పీలు, ఒక ఓఎస్డీ, ఏడుగురు డీఎస్పీలు, 35 మంది సీఐలు, 90 మంది ఎస్ఐ/ఆర్ఎస్ఐలు, 9 స్పెషల్ పార్టీ పోలీసులు, 150 మంది పోలీసు సిబ్బందిని నియమించామని ఆమె వివరించారు. -
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ అహ్మద్ బాబు తెలిపారు. గురువారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) భన్వర్‌లాల్ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్‌లో ఏర్పాట్లపై కలెక్టర్ ఆయనకు వివరించారు. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి ఎనిమిది మంది, జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 107 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8గంటల నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. పోస్టల్ బాలెట్ ఓట్లు, ఈవీఎంల ఓట్ల లెక్కింపునకు ప్రతి టేబుల్‌కు ఒక సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, సూక్ష్మ పరిశీలకులు ఉంటారని అన్నారు. ఓట్ల లెక్కింపుపై అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు. అసెంబ్లీకి 15,028, పార్లమెంటుకు 11,228 పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకున్నారని, ముందుగా వీటిని లెక్కిస్తామని అన్నారు. ఫలితాలు ప్రజలకు తెలిసే విధంగా గురుకుల కళాశాలలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి గూగుల్ డాక్స్ ఆన్లైన్ విధానం ద్వారా జిల్లా ఫలితాలు రాష్ట్రంలోనే ముందుగా ప్రకటించేందుకు ఏర్పాట్లు చేశామని వివరించారు. లెక్కింపు రౌండ్ల వారీగా ప్రజలు వీక్షించేందుకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ప్రొజెక్టర్ ఏర్పాటు చేసి స్క్రీన్ ద్వారా ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను సంజయ్ కుమార్ సక్సేనా, ఓంప్రకాశ్ ఫాటక్, రాకేశ్‌కుమార్, ఎంజె టక్కర్, ప్రమోద్‌కుమార్ ఉపాధ్యాయ్, చిత్తరంజన్సింగ్, శివకాంత్ ద్వివేది, పంకజ్ జోషి పరిశీలిస్తారని తెలిపారు. లెక్కింపు కేంద్రాల వద్ద 2,100 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ గజరావు భూపాల్ పాల్గొన్నారు. -
'కౌంటింగ్ కేంద్రాల్లో సెల్ఫోన్లు నిషేధం'
-
'కౌంటింగ్ కేంద్రాల్లో సెల్ఫోన్లు నిషేధం'
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాటు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 78 ప్రాంతాల్లో 168 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 437 కౌంటింగ్ హాళ్లలో 6,955 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు. 189 మంది పరిశీలకులను నియమించామని చెప్పారు. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానానికి అత్యధికంగా 45 రౌండ్ల కౌంటింగ్ ఉంటుందన్నారు. అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి 18 రౌండ్ల కౌంటింగ్ మాత్రమే ఉంటుందన్నారు. కూకట్పల్లి అసెంబ్లీకి 45, చార్మినార్ అసెంబ్లీకి 13 రౌండ్లు పాటు కౌంటింగ్ జరుగుతుందన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లు అనుమతించబోమని భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. -
ఈవీఎంలు భద్రంగా ఉన్నాయి: భన్వర్‌లాల్
హైదరాబాద్: ఏయే కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలో సాయంత్రం నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ఈ నెల 12 లేదా 13న రీపోలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఏ ఏ పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ అవసరం, ఏ కేంద్రాల్లో రీ పోలింగ్ అవసరం లేదనే వివరాలను భన్వర్‌లాల్ శుక్రవారం జిల్లా కలెక్టర్ల నుంచి నివేదికల రూపంలో తెప్పించుకున్నారు. కాకినాడ జేఎన్టీయూలో ఈవీఎంలు భద్రంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఈవీఎంలోకి వర్షం నీరు చేరలేదని తెలిపారు. కాకినాడ జేఎన్టీయూ స్ట్రాంగ్ రూంలోకి వర్షపు నీరు వచ్చిన మాట వాస్తవమేనని, అయితే ఈవీఎంలు మాత్రం వర్షపు నీటిలో తడవలేదని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్ కూడా వివరణ ఇచ్చారు. -
ఈవీఎం స్ట్రాంగ్‌రూం వద్ద ఆగంతకుల కదలిక
విశాఖ : విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని సోఫియా కళాశాల స్టాంగ్ రూం వద్ద ఆగంతకులు సంచారం కలకలం రేపుతోంది. టీడీపీ ఎన్నికల ఏజెంట్‌తో ఓ పోలీసు అధికారి మంతనాలు జరుగుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాడి రత్నాకర్ శనివారం ఎన్నికల అధికారి భన్వర్ లాల్‌కు ఫిర్యాదు చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన స్టాంగ్ రూంల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని కోరారు. ఈ ఘటనపై విచారణ జరపాలని దాడి రత్నాకర్ భన్వర్ లాల్‌కు విజ్ఞప్తి చేశారు. ఈవీఎంలకు మూడంచెల పోలీసు వ్యవస్థ ఏర్పాటు చేసినా వాటి భద్రత మాత్రం సవాల్‌గా మారుతోంది. కాగా ఈ నెల 16న కౌంటింగ్ జరగనున్న విషయం తెలిసిందే. -
ఎగ్జిట్‌పోల్స్‌పై నిషేదం 12వరకే..
-
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ తెలిపారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 11మంది అదనపు సహాయ రిటర్నింగ్ అధికారులు, ఏడుగురు అబ్జర్వర్ల నియామకానకి ప్రతిపాదనలు పంపామన్నారు. జిల్లాకు 2600 పవర్ ప్యాక్స్ అవసరమన్నారు. 1.24 కోట్ల బడ్జెట్ కేటాయింపునకు ప్రతిపదనలు పంపినట్టు చెప్పా. ఈవీఎంలను భద్రపరచేందుకు నిర్మిస్తున్న గోడౌన్ గ్రౌండ్ ఫ్లోర్ పనులు పూర్తయినట్టు చెప్పారు. మొదటి అంతస్తు పనులు పురోగతిలో ఉన్నాయని, దీనికిగాను 14.74 లక్షల రూపాయలకు ప్రతిపాదనలు పంపామని అన్నారు. కౌంటింగ్ ఏర్పాట్లపై జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించామని, కౌంటింగ్ ఏజెంట్ల జాబితా ఇవ్వాలని కోరామని అన్నారు. స్ట్రాంగ్ రూమ్‌లను తనిఖీ చేసినట్టు చెప్పారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నిర్వహణకు ఆయా శాఖల అధికారులు, సిబ్బందికి డ్యూటీలు వేశామన్నారు. కౌంటింగ్‌ను పటిష్టంగా నిర్వహించేందుకు వివిధ స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. స్ట్రాంగ్ రూముల నుంచి కౌంటింగ్ కేంద్రాల వరకు బ్యాలెట్ ఈవీఎంలను తీసుకొచ్చేప్పుటి నుంచి ప్రక్రియ పూర్తయ్యేంత వరకు వీడియో చిత్రీకరణకు ఏర్పాట్లు చేశామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద బారికేడ్లు, మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఎస్పీ రంగనాథ్ మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా పటిష్ట చర్యలు చేపట్టినట్టు చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఐటీడీఏ పీవో దివ్య, జిల్లా రెవెన్యూ అధికారి శివ శ్రీనివాస్, ఏఓ చూడామణి, ఎన్నికల అధికారి యూసఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
సీఈవో భన్వర్‌లాల్ ఆదేశం శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సాధారణ ఎన్నికల కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. కౌంటింగ్ తదితర అంశాలపై శుక్రవారం సాయంత్రం ఆయన, జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున కౌంటింగ్ జరిగే గదుల పైకప్పులకున్న లీకేజీలు, గదుల్లోకి నీరు చేరే అవకాశాలున్నాయా? అనే అంశాలపై పరిశీలించాలని సూచించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక గదిని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. రిటర్నింగ్ అధికారి గదిలో పార్లమెంట్ ఓట్ల లెక్కింపునకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్నికల సందర్భంగా ప్రచురితమైన పెయిడ్ న్యూస్‌పై వెంటనే నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. కలెక్టర్ సౌరభ్ గౌర్ మాట్లాడుతూ జిల్లాలో ఓట్ల లెక్కింపునకు చేసిన ఏర్పాట్ల గురించి వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ జి.వీరపాండ్యన్, ఏజేసీ హ షీం షరీఫ్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్‌బాషా ఖాసీం, రిటర్నింగ్ అధికారులు గణేష్‌కుమార్, మనోరమ, తేజ్‌భరత్, సునీతారాణి, నాగార్జునసాగర్, కె.సాల్మన్‌రాజు, తనూజారాణి తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాంగ సంస్థలపై విమర్శలు సరికాదు
* ఓటమికి కారణాలు వెతుక్కుంటూ ఇలా మాట్లాడటం తగదు * రాష్ట్రంలో పోలింగ్ స్వేచ్ఛగా, ప్రశాంతంగా ముగిసింది * చిన్న సంఘటనలను మొత్తానికి ఆపాదించడం సరికాదు * ఎన్నికల నిఘా వేదిక ప్రతినిధులు సాక్షి, హైదరాబాద్: ఓటమికి కారణాలు వెతుక్కునే చర్యల్లో భాగంగా రాజ్యాంగ సంస్థలపై బురదచల్లడం ఏమాత్రం మంచిది కాదని టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి ఎన్నికల నిఘా వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ ప్రతినిధులు వ్యాఖ్యానించా రు. రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా, స్వేచ్ఛగా నిర్వహించినందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) భన్వర్‌లాల్‌ను ఎన్నికల నిఘా వేదిక ప్రతినిధులు ప్రశంసించారు. వేదిక ప్రతి నిధులు జస్టిస్ అంబటి లక్ష్మణరావు, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, వి.లక్ష్మణరెడ్డి తదితరులు శుక్రవారం సచివాలయంలో సీఈవో భన్వర్‌లాల్‌ను కలసి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు అభినందనలు తెలియజేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులను సత్వరమే పరిష్కరించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్ల జాబితాలో కనిపించిన లోపాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో లోప రహితంగా రూపొందించాలని సీఈఓకు ఇచ్చిన వినతిపత్రంలో కోరారు. భవిష్యత్తులో క్షేత్రస్థాయిలో మరిన్ని ఆకస్మిక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి మద్యం, డబ్బుల పంపిణీని పూర్తిగా నియంత్రించాలని సూచించారు. అనంతరం మీడియాతోనూ, విడివిడిగా టీవీ ఛానళ్లతోనూ మాట్లాడారు. ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలవల్ల గతంతో పోల్చితే రాష్ట్రంలో ఎన్నికలు పూర్తి ప్రశాంతంగా, స్వేచ్ఛగా సాగాయని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యేవరకు రాజకీయ పార్టీలు, నాయకులు సంయమనం పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలను రెచ్చగొట్టరాదని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తిచేశారు. ఇంకా వారేమన్నారంటే.. కాకి మాధవరావు: వారికి అనుకూలం కాని నిర్ణయాలు తీసుకున్నందునే భన్వర్‌లాల్‌పై విమర్శలు చేసి ఉంటారు. భన్వర్‌లాల్ ఎవరిమాటా వినరు. విధి నిర్వహణ సమయంలో సహోద్యోగులుగా మేం విన్నవించుకున్నా వినకుండా నిబంధనల ప్రకారమే నిర్ణయం తీసుకునేవారు. కాబట్టి ఆయన ఒకరి మాట విని ఒకరికి మేలు చేసి మరొకరికి అన్యాయం చేస్తారనే దానిలో సున్నా శాతం కూడా నిజం లేదు. నిఘా వేదిక ఛైర్మన్ డాక్టర్ అంబటి లక్ష్మణరావు: అక్కడక్కడా కొన్ని సంఘటనలు మినహా మొత్తమ్మీద ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరిగా యి. ఓటు వేయడానికి వచ్చిన వారు వెనక్కు వెళ్లడంగానీ, లాఠీచార్జీ జరిగినా ప్రాణనష్టంగానీ ఎక్కడా జరగలేదు. కోట్ల మంది ఓటర్లు, లక్షల మంది సిబ్బంది లక్షల పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగినప్పుడు కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగి ఉండొచ్చు. అయితే వీటినే పోలింగ్ మొత్తానికి ఆపాదించడం సరికాదు. వి.లక్ష్మణరెడ్డి: 1952లో 52 శాతం పోలింగ్ జరిగితే నేడు గ్రామీణ ప్రాంతాల్లో 80 శాతంపైగా, సీమాంధ్రలో సగటున 80 శాతం పోలింగ్ జరిగింది. ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓట్లు వేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓటమికి రకరకాల కారణాలు వెతుక్కుంటూ ఇతర వ్యవస్థల మీద ముఖ్యంగా రాజ్యాంగ వ్యవస్థల మీద బురద చల్లడం మంచిదికాదు. గతంతో పోల్చితే రిగ్గింగులు, ఘర్షణలు పూర్తిగా తగ్గాయి. ధన ప్రభావం మాత్రం పెరిగింది. -
'భన్వర్ లాల్ ఎవరి మాట వినరు'
హైదరాబాద్ : ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ అని ఎన్నికల కమిషన్‌పై విమర్శలు చేయటం తగదని ఎన్నికల నిఘా వేదిక సభ్యులు అన్నారు. ఎన్నికల నిఘా వేదిక సభ్యులు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్‌ను కలిశారు. అనంతరం నిఘా వేదిక సభ్యులు మాట్లాడుతూ భన్వర్ లాల్ ఎవరి మాట వినే వ్యక్తి కాదని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గరన్నారు. తమ మాట చెల్లుబాటు కాలేదనే కొందరు వ్యక్తులు భన్వర్ లాల్‌పై విమర్శలు చేస్తున్నారన్నారు. ఓటమికి కారణాలు వెతుక్కునే పనిలో భాగంగానే ఎన్నికల కమిషన్‌ను విమర్శిస్తున్నారని ఎన్నికల నిఘా వేదిక సభ్యులు వ్యాఖ్యానించారు. గతంలో పోలిస్తే ఈసారి ఎన్నికలు చాలా ప్రశాంత వాతావరణంలో జరిగాయని, అందుకు భన్వర్ లాల్, ఎన్నికల కమిషన్‌ను అభినందిస్తున్నామని తెలిపారు. -
'కౌంటింగ్ అయ్యేవరకూ కామ్‌గా ఉండండి'
హైదరాబాద్ : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్‌తో ఎన్నికల నిఘా వేదిక సభ్యులు శుక్రవారం భేటీ అయ్యారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై ఉన్న కేసులు పరిష్కరించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయిలో మరిన్ని తనిఖీ బృందాలు ఏర్పాటు చేసి నగదు, మద్యం ప్రభావాన్ని నివారించాలని వారు కోరారు. ఓటర్ల జాబితాలో కనిపించిన లోపాలను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలన్నారు. ఓటర్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేవరకు పార్టీ నేతలందరూ సంయమనం పాటించాలని సూచించారు. చట్ట వ్యతిరేకంగా నడుస్తున్న బెల్టు షాపులను ఎన్నికల సందర్భంగా మూసివేశారని, వాటిని శాశ్వతంగా మూసివేసేలా చర్యలు చేపట్టాలని భన్వర్ లాల్‌ను కోరారు. -
ఉద్యోగుల డీఏకి గ్రీన్‌సిగ్నల్
భన్వర్‌లాల్ ఓకే.. నేడు ఉత్తర్వులు! సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ) మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) భన్వర్‌లాల్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఉద్యోగులకు గత జనవరి నుంచి వర్తించేలా 8.56 శాతం డీఏ ఇచ్చేందుకు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపిన విషయం విదితమే. ఈ మేరకు ఫైలుపై సంతకం చేసిన గవర్నర్.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున దీనికి ప్రత్యేక అనుమతి ఇవ్వాలంటూ సీఈవోకు పంపించారు. దీనిని పరిశీలించిన భన్వర్‌లాల్ ఉద్యోగులకు డీఏ ఇచ్చేందుకు అభ్యంతరం లేదని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు శుక్రవారం జారీ అయ్యే అవకాశం ఉంది. -
అబ్బ.. ఏం చెప్పావ్ బాబూ..!
-
కృష్ణా జిల్లా అధికారులపై సీఈవో భన్వర్‌లాల్ ఫైర్
విజయవాడ: విజయవాడలో పట్టుబడ్డ టీడీపీ నేతల డబ్బు వ్యవహారంలో విచారణ జాప్యంపై కృష్ణ జిల్లా అధికారులపై సీఈవో భన్వర్‌లాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 కోట్ల రూపాయలు పట్టుబడినట్టు తన వద్ద పక్కా సమాచారం ఉందని అధికారులను భన్వర్ లాల్ నిలదీశారు. పట్టుబడిన డబ్బు వ్యవహారంపై మీరెందుకు విచారణ వేగవంతం చేయడంలేదని భన్వర్ లాల్ నిలదీశారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన నేతలను వదిలిపెట్టొద్దని, కేసు నమోదు చేయాలని భన్వర్‌లాల్ ఆదేశించారు. ఈ కేసులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని భన్వర్ లాల్ హెచ్చరించారు. విజయవాడ సిద్ధార్థ అకాడమీ కేంద్రంగా కోట్ల రూపాయల డంప్ బయటపడిన సంగతి తెలిసిందే. -
పలకజీడిలో రీపోలింగ్.. భన్వర్ లాల్ ఆదేశం
-
'అక్కడక్కడా ఉద్రిక్తత, దాడులు జరగలేదు'
హైదరాబాద్ : సీమాంధ్రలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ తెలిపారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ అక్కడక్కడా ఉద్రిక్తత నెలకొన్నా, దాడులు జరగలేదని అన్నారు. పోలింగ్‌లో ఎక్కడా అంతరాయం జరగలేదని, అన్ని ఈవీఎంలు పని చేస్తున్నాయని భన్వర్ లాల్ తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకూ 54 శాతం పోలింగ్ నమోదు అయనట్లు తెలిపారు. క్రమంగా పోలింగ్ శాతం పెరుగుతోందని ఆయన చెప్పారు. -
'సీఎం రమేష్.. ఇదేనా మీ పద్ధతి ?!'
-
సీఎం రమేష్.. పద్ధతి మార్చుకోండి: భన్వర్‌లాల్
ఓడిపోతున్నామన్న సంకేతాలు స్పష్టంగా కనపడుతుండటంతో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో అసహనం పెరిగిపోతోంది. ఎవరితో ఏం మాట్లాడుతున్నామో కూడా వారికి తెలియట్లేదు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌తో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ అమర్యాదగా ప్రవర్తించారు. తన నోటి దురుసును ప్రదర్శించారు. దీంతో భన్వర్‌లాల్ నొచ్చుకుని, రమేష్‌ను హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు ఇలాగే ఉంటారా అంటూ తీవ్రస్వరంతో ప్రశ్నించారు. పక్కగ్రామాల నుంచి ఏజెంట్లను నియమించుకునే విషయంలో హైకోర్టు స్టే ఇస్తే మీరేం చేస్తున్నారంటూ భన్వర్‌లాల్‌ను సీఎం రమేష్ ప్రశ్నించారు. అయితే, హైకోర్టు తీర్పు తన పరిధిలోకి రాదని ఆయనకు భన్వర్‌లాల్ చెప్పారు. అంతేకాక, మీరు వ్యవహరించిన తీరు సరిగా లేదని, పద్దతి మార్చుకోవాలంటూ సీఎం రమేష్‌ను భన్వర్‌లాల్ హెచ్చరించారు. -
సీమాంధ్రలో ఓటెత్తుతున్న జనం!
-
నాలుగు గంటల్లో 41 శాతం.....
హైదరాబాద్ : సీమాంధ్రలో ఇప్పటి వరకూ నమోదు అయిన పోలింగ్ శాతంలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. కర్నూలు జిల్లాలో నాలుగు గంటల్లో 41 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ మాట్లాడుతూ చెదురు మదురు ఘటనలు మినహా సీమాంధ్రలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందన్నారు. గుంటూరు జిల్లా రొంపిచర్లలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో పోలీసులు గాలిలో కాల్పులు జరిగాయన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని భన్వర్ లాల్ తెలిపారు. ఉదయం 11 గంటల వరకూ సీమాంధ్రలో 13 జిల్లల్లో 33 శాతం పోలింగ్ నమోదు అయినట్లు తెలిపారు. పోలింగ్ చురుకుగా కొనసాగుతోందని, ఓటర్లు పెద్ద ఎత్తున క్యూ లైన్లలో ఉన్నారన్నారు. 85 నుంచి 90 శాతం వరకూ పోలింగ్ నమోదు అయ్యే అవకాశం ఉందని భన్వర్ లాల్ పేర్కొన్నారు. వివిధ జిల్లాల్లో నమోదైన పోలింగ్ ఇలా ఉంది... శ్రీకాకుళం........... ..33 విజయనగరం ..........34 విశాఖపట్నం......... ..28 తూర్పు గోదావరి జిల్లా....28 పశ్చిమ గోదావరి జిల్లా.... 35 కృష్ణాజిల్లా.................30 గుంటూరు................ 35 ప్రకాశం....................34 నెల్లూరు ..................33 వైఎస్ఆర్ జిల్లా.............32 కర్నూలు..................41 అనంతపురం ..............32 చిత్తూరు...................33 -
సబ్బంపై రెండు కేసుల నమోదుకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: జై సమైక్యాంధ్ర పార్టీ విశాఖపట్టణం లోక్‌సభ అభ్యర్థి సబ్బం హరిపై రెండు కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ప్రచారంపై నిషేధం ఉండగా హరి ఒక పార్టీకి ఓటు వేయాలని చెప్పడాన్ని ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్-126 ప్రకారం ఎన్నికల నియమావళి ఉల్లంఘనగా భావించి కేసు నమోదుకు ఆదేశించడంతో పాటు ఆయనకు నోటీసు జారీ చేస్తామని చెప్పారు. హరి మరో పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడంతో ఆయనను డమ్మీ అభ్యర్థిగా పరిగణిస్తామని తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం డమ్మీ అభ్యర్థి ఎన్నికల వ్యయాన్ని ప్రధాన అభ్యర్థి ఎన్నికల ఖాతాలో జమ చే యనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అడుక్కుతింటుందా? అని ఓ టీవీ చానల్ ప్రసారం చేయడాన్ని భన్వర్‌లాల్ తప్పుపట్టారు. గతంలో కూడా ఆ టీవీ చానల్ వాహనంలో అభ్యర్థికి చెందిన సెల్ఫోన్లు దొరికాయని, ఈ రెండు అంశాలపైన కేసు నమోదు చే యడంతో పాటు చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.