భన్వర్‌లాల్ ఓకే.. నేడు ఉత్తర్వులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ) మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) భన్వర్‌లాల్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఉద్యోగులకు గత జనవరి నుంచి వర్తించేలా 8.56 శాతం డీఏ ఇచ్చేందుకు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపిన విషయం విదితమే. ఈ మేరకు ఫైలుపై సంతకం చేసిన గవర్నర్.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున దీనికి ప్రత్యేక అనుమతి ఇవ్వాలంటూ సీఈవోకు పంపించారు. దీనిని పరిశీలించిన భన్వర్‌లాల్ ఉద్యోగులకు డీఏ ఇచ్చేందుకు అభ్యంతరం లేదని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు శుక్రవారం జారీ అయ్యే అవకాశం ఉంది.