మల్కాజ్ గిరి టీడీపీ లోకసభ అభ్యర్ధిపై ఈసీకి ఫిర్యాదు
మల్కాజ్ గిరి టీడీపీ లోకసభ అభ్యర్ధిపై ఈసీకి ఫిర్యాదు
Published Tue, Apr 29 2014 9:29 PM | Last Updated on Mon, Oct 8 2018 8:52 PM
హైదరాబాద్: మల్కాజ్‌గిరి పార్లమెంట్ టీడీపీ అభ్యర్ధి మల్లారెడ్డిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ కు వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. భన్వర్‌లాల్‌ను కలిసిన వైఎస్ఆర్సీపీ నేతలు...మల్లారెడ్డి ఇచ్చిన అఫిడవిట్‌లోని లోపాలను ఎన్నికల కమిషన్ (ఈసీ) దృష్టికి తీసుకొచ్చారు.
19 విద్యాసంస్థలు ఉన్నప్పటికీ ఏ ఒక్క దానిని కూడా అఫిడవిట్‌లో చూపించలేదని ఈసీ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కోన్నారు. మల్లారెడ్డికి చెందిన విద్యాసంస్థల వివరాలను, ఆధారాలను ఈసీకి వైఎస్సార్సీపీ నేతలు శివకుమార్, జనక్‌ప్రసాద్, నాగేశ్వరరావు సమర్పించారు.
Advertisement
Advertisement