Malkajgiri
-
కరెంట్ లేదు.. నీళ్లు రావు
-
మనవరాలి పెళ్లి సంగీత్‌లో.. మల్లారెడ్డి ఊర మాస్ డ్యాన్స్
హైదరాబాద్: మాజీ మంత్రి మల్లారెడ్డి ఎప్పుడూ సోషల్ మీడియాలో ఎదో విధంగా హల్చల్ చేస్తుంటారు. తాజాగా మల్లారెడ్డి మనవరాలి పెళ్లి సంగీత్ కార్యక్రమంలో డ్యాన్స్‌ని ఇరగదీశారు. మంచి కాస్ట్యూమ్‌తో, మనవళ్లను పక్కన పెట్టుకొని.. కొరియోగ్రాఫర్లతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేశారు. మల్లారెడ్డి మనవరాలు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహం ఈనెల 27న జరగనుంది.మనవరాలి సంగీత్ లో డీజే టిల్లు పాటకు మల్లన్న మాస్ స్టెప్పులు 🕺👌#MallaReddy #Mallareddydance pic.twitter.com/D0tMDpBED6— Pulse News (@PulseNewsTelugu) October 21, 2024 -
HYD: మల్కాజ్‌గిరిలో సెల్ఫోన్లు మాయం..ఎందుకంటే..
సాక్షి,హైదరాబాద్:మల్కాజ్‌గిరిలో మొబైల్ దొంగలు హల్చల్ చేశారు. ఆనంద్‌బాగ్‌లో పాల కోసం వెళ్లిన వ్యక్తి నుంచి ఫోన్ చోరీ చేశారు. ఈస్ట్ ఆనంద్ బాగ్ లోని మార్కెట్‌కు వచ్చిన మరో వ్యక్తి నుంచి కూడా సెల్‌ఫోన్ కొట్టేశారు. ప్రజల దృష్టి మళ్లిస్తూ మొబైల్స్ చోరీ చేస్తున్నారని బాధితులు మాల్కాజ్‌గిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.చోరీలపై సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మాల్కాజ్‌గిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నరు.ఇదీ చదవండి: బంజారాహిల్స్ పబ్.. ప్రతి దానికి ఓ రేటు -
మల్కాజిగిరిలో దూసుకెళ్తున్న ఈటల.. లక్షకు పైగా ఆధిక్యం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతుంది. రాష్ట్రంలో మొత్తం 17 స్థానాలు ఉండగా..వాటిల్లో అత్యధిక స్థానాల్లో బీజీపీ ముందంజలో ఉంది. కిషన్‌రెడ్డి (హైదరాబాద్), గోడం నగేశ్ (ఆదిలాబాద్), బండి సంజయ్ (కరీంనగర్), ధర్మపురి అర్వింద్ (నిజామాబాద్), కొండా విశ్వేశ్వర్ రెడ్డి (చేవెళ్ల), డీకే అరుణ (మహబూబ్ నగర్), భరత్ ప్రసాద్ (నాగర్ కర్నూల్) ముందంజలో ఉన్నారు. ఇక దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానమైన మల్కాజిగిరిలోనూ బీజేపీ దూసుకెళ్లోంది. ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ని బట్టి చూస్తే..ఈటల అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాన్ని అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్, బీజేపీ మూడూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.ఇక్కడ నుంచి 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు.2023లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ఈ స్థానానికి రాజీనామా చేశారు.ఎలాగైన సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. కాంగ్రెస్ తరపున పట్నం సునీతా మహేందర్ రెడ్డి బరిలోకి తిప్పి భారీగా ప్రచారం చేసింది. ఇక బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి బరిలో నిలిచారు. మల్కాజిగిరిలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని అంతా భావించారు. ఇద్దరిలో ఎవరు గెలిచినా తక్కువ మెజారిటినే వస్తుందని అంచనా వేశారు. కానీ అంచనాలకు మించి ఈటల అత్యధిక మెజారిటీతో దూసుకెళ్తున్నాడు. మే 13న ఇక్కడ ఓటింగ్ జరగ్గా..50.78 శాతం పోలింగ్ నమోదైంది. -
4 నెలల్లోనే రేవంత్ అబద్ధాలకోరు అని తేలింది
సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ వైఫల్యం చెందడానికి పదేళ్ల సమయం పడితే.. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి నాలుగు నెలలు గడవక ముందే ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ‘ఈకొద్ది కాలంలోనే ఆయన అబద్ధాల కోరు అని తేలింది. ఇచ్చిన హామీలు అమలు చేసే వ్యక్తో కాదో నాలుగు నెలల్లో తెలిసిపోయింది. సీఎం అయినా భాష మారలేదు..దబాయింపులు మారలేదు. రేవంత్‌రెడ్డి మతిభ్రమించినట్టు మాట్లాడుతూ దిగజా రుడు రాజకీయాలు చేస్తున్నారు. అబద్ధాల ప్రచారం, వీడియో మార్ఫింగ్‌లతో రేవంత్‌రెడ్డి అందరినీ మించిపోయారు. సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు. మానవబాంబై పేలుతా.. పేగులు మెడలో వేసుకుంటా అని ఒక ముఖ్యమంత్రి మాట్లాడవచ్చా.. ఉన్మాదులు, సైకోలు అలా మాట్లాడతారు. నీ భాష మార్చుకో..సీఎం స్థాయిని, నీ స్థాయిని తగ్గించుకోకు. చిల్లరమాటలు మానుకోవాలి’అని రేవంత్‌రెడ్డికి ఈటల హితవు పలికారు. మంగళవారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది›ప్రెస్‌లో ఈటల రాజేందర్ మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే...తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసినందుకు కేసీఆర్ మూల్యం చెల్లించుకున్నారని, మళ్లీ దాన్ని దెబ్బతీస్తే రేవంత్‌కు కూడా పుట్టగతులుండవు. సీఎం మాటలకు విశ్వసనీయత లేదు. కమిటీల పేరుతో కాళేశ్వరం అవినీతిపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారు. గతప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్‌ట్యాపింగ్‌లపై ఎలాంటి విచారణ లేదు. నేటికీ ట్యాపింగ్‌లు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ హయాంలో బిల్లుల కోసం ఉద్యోగులు, చిన్న కాంట్రాక్టర్లు మొదలు అందరూ 7 నుంచి 10 శాతం వరకు కమీషన్ చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. 20 ఏళ్లకు పైబడిన నా రాజకీయ జీవితంలో ఇంతటి ‘పొల్యూటెడ్ పాలిటిక్స్’ ను చూడలేదు. పాలించే జాతి మాదే, పాలించే కెపాసిటీ మాకే ఉంది అని అహంకారంతో రేవంత్ మాట్లాడుతున్నారు. అంత జాత్యహంకారం, కులరాజకీయం పని కి రాదు. రద్దు చేయాలనుకుంటే అవన్నీ ఎందుకు చేస్తారు ? బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ మార్ఫింగ్ వీడియోలు చేసి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. ఈ ఫేక్ వీడియోలలో రేవంత్ ప్రమేయముందని ప్రచారం జరుగుతోంది, ప్రధాని మోదీ ఇతర రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటే దళితులు, పేదలకు న్యాయం జరగాలని ఏబీసీడీ రిజర్వేషన్ల వర్గీకరణ దిశగా చర్యలు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, మహిళలకు చట్టసభలో రిజర్వేషన్లు, వంటివి ఎందుకు చే స్తారు. ముస్లింలకు కాదు మత రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం. బీసీలుగా, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ముస్లింలు రిజర్వేషన్లు పొందుతున్నారని, మళ్లీ మ తప్రాతిపదికన ఎందుకని బీజేపీ వ్యతిరేకిస్తోంది. మల్కాజ్‌గిరిలో ఏ సర్వేసంస్థలకు అందని ఫలితాలు ‘మల్కాజ్‌గిరిలో ఏ సర్వే సంస్థలకు అందని ఫలితాలు రాబోతున్నాయి. అన్నివర్గాల మద్దతుతో మంచి మెజారిటీతో గెలుస్తా’అని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. తాను మల్కాజ్గిరి ప్రజలను తక్కువ చేసి మాట్లాడినట్టు ఓ మార్ఫింగ్ వీడియో సోషల్‌మీడియాలో ప్రచారం చేయడంపై ఈసీకి ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపారు. ఢిల్లీలో ప్రధాని మోదీ, మల్కాజ్‌గిరిలో ఈటల రాజేందర్ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. తాను గెలిస్తే మల్కాజ్‌గిరికి గుర్తింపుతోపాటు, రోడ్డు వ్యవస్థ, మెట్రోరైలు, ఐటీ. ఇండ్రస్టియల్ కారిడార్లు, మంచి విద్య, వైద్యం వస్తాయని ఇక్కడ ప్రజలు భావిస్తున్నారన్నారు. ఇక తనపై పోటీచేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల గురించి ఇక్కడి ప్రజలకు పెద్దగా తెలియదని చెప్పారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు వేణుగోపాల్‌నాయుడు, ప్రధానకార్యదర్శి ఆర్.రవికాంత్‌రెడ్డి, ఉపాధ్యక్షురాలు వనజ తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్ ఐదేళ్లు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కొంత మంది నాయకులు వెళ్లినా పార్టీకి నష్టం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్. ప్రజలు ఇచ్చిన ప్రధాన ప్రతిపక్షం బాధ్యతను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన ఒక్క హామీలను కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదని మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ దిక్కులేదని విమర్శించారు. ఘట్కేసర్లో బుధవారం మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. రేవంత్ బీజేపీలో చేరడం పక్కా ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు రేవంత్ మాట్లాడటం లేదని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన ఖర్మ తమకు లేదని. మీ పక్కనే ఉన్నాయన్నారు. రైతు బంధు, దళిత బంధు, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్, బతుకమ్మ చీరలు సహ అన్నింటిని కాంగ్రెస్ సర్కార్ రద్దు చేసిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కేసులు తప్పించుకోవడం కోసం ఖచ్చితంగా బీజేపీలో చేరుతాడని జోస్యం చెప్పారు. భద్రాచలానికి బీజేపీ ఒక్క రూపాయైనా ఇచ్చిందా? పదేళ్లు దేశాన్ని నడిపిన ప్రధాని మోదీ తెలంగాణకు రూపాయి ఇచ్చింది లేదని విమర్శించారు. సీఎం గుంపు మెస్త్రి అయితే ప్రధాని తాపీ మేస్త్రి అని ఎద్దేవా చేశారు. ఇద్దరు కలిసి తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. బీజేపీకి రాష్ట్రంపై ప్రేమ ఉంటే.. భద్రాచలం ఆలయానికి ఒక్కరూపాయి అయినా ఇచ్చిందా అని ప్రశ్నించారు. అయోధ్యలో ఉన్నది రాముడే, భద్రాచలంలో ఉన్నది కూడా రాముడేనని అన్నారు. చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసు: రాధాకిషన్‌రావు రిమాండ్ పొడిగింపు రాముడితో పంచాయితీ లేదు.. బీజేపీతోనే.. ‘శ్రీరాముడు అందరివాడు.. ఆ రాముడితో మనకు పంచాయితీ లేదు.. పంచాయితీ అంతా బీజేపీతోనే. ఈ పదేళ్లలో ఏం చేశారని బీజేపీ వాళ్లను ప్రశ్నిస్తే జైశ్రీరాం అంటారు. రాముడు బీజేపీ పార్టీ మనిషి కాదు.. ఆయన అందరి మనిషి. రాముడి పేరు చెప్పుకుని రాజకీయం చేసే బీజేపీని తన్ని తరిమేయాలన్నారు కేటీఆర్. యాదాద్రిని రాజకీయంగా వాడుకోలేదు. దేవుడు దేవుడే.. ధర్మం ధర్మమే.. రాజకీయం రాజకీయమే. ఎవరు మన కోసం పని చేస్తున్నారో.. ఎవరు దేవుళ్లను అడ్డం పెట్టుకుని బతుకుతున్నారో ప్రజలకు వివరించాలి. నిరుద్యోగం, పేదరికం, ధరల పెరుగుదల, మతోన్మాదానికి కారణమైన బీజేపీని పాతరేయాలి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. -
హోలీ పండగలోపు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తాను సీఎంగా ఉన్నానంటే.. ఆ గొప్పతనం మల్కాజిగిరి కార్యకర్తలదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని నేతలతో రేవంత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆనాడు కొందరు నాయకులు అమ్ముడుపోయినా.. కార్యకర్తలు భుజాలపై మోసి గెలిపించి తనను ఢిల్లీకి పంపించారని గుర్తు చేశారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం మల్కాజిగిరి. నాటి మల్కాజిగిరి గెలుపు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగేలా చేసింది. కేసీఆర్ పతనం 2019 మల్కాజిగిరి పార్లమెంట్ నుంచే మొదలైంది. వందరోజులు పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10లక్షలకు పెంపు, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేసుకుంటున్నాం. మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది’’ అని రేవంత్ పేర్కొన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగరాలి. అప్పుడే మన ప్రాంతం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. హొలీ పండగలోగా అధిష్టానం అభ్యర్థులను ప్రకటిస్తుందన్నారు. కష్టపడిన వారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత నాది. మనకుబలమైన నాయకత్వం ఉంది.. సమన్వయంతో ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసిన అభ్యర్థులు ఒక ఐదుగురు సభ్యులతో కమిటీ వేసుకోవాలి. వారికి పోలింగ్ బూత్‌ల వారీగా పని విభజన చేసుకుని సమీక్ష చేసుకోవాలి’’ అని సీఎం రేవంత్ సూచించారు. -
మోదీ జోష్ షో
సాక్షి, హైదరాబాద్: మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ప్రధాని మోదీ నిర్వహించిన రోడ్ షోకు వివిధ వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఏర్పాటు చేసిన ఈ రోడ్‌షో పార్టీ నాయకులు, కేడర్‌లో జోష్ నింపింది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, ఇతర వర్గాల వారు రోడ్డుకు ఇరువైపులా, ఇళ్లపై, షాపింగ్, కమర్షియల్ కాంప్లెక్స్‌లపై నుంచి ప్లకార్డులు ప్రదర్శిస్తూ మోదీకి అభివాదం తెలిపారు. అబ్కీ బార్ 400 పార్...(ఈసారి 400 సీట్లు దాటాలి) ఇతర నినాదాలతో కూడిన ప్లకార్డులు ప్రద ర్శించారు. ప్రధానిని ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించడంపై పలువురు ఆనందం వ్యక్తం చేశారు. రోడ్‌షో సాగిన మార్గమంతా రెండువైపులా ఉన్న ప్రజలను మోదీ రెండు చేతులు ఊపుతూ పలకరించారు. ఈ సంద ర్భంగా డప్పు, డోలు, ఇతర వాయిద్య బృందాల ప్రదర్శనలు, తెలంగాణ సాంస్కృతిక కళారూపాలు ఆకట్టుకున్నాయి. నేడు నాగర్‌కర్నూల్‌కు మోదీ కేరళ నుంచి బయలుదేరి శుక్రవారం సాయంత్రం బేగంపేట ఎయిర్‌పోర్టులో దిగిన ప్రధానికి కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఇతర నేతలు స్వాగతం పలికారు. మోదీ నేరుగా మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని మీర్జాల గూడకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక ఓపెన్‌టాప్ వాహనంలో మల్కాజి గిరి దాకా దాదాపు 1.3 కి.మీ. దూరం రోడ్‌షో నిర్వహించారు. ఆయన వెంట జీప్‌లో ఓ వైపు కిషన్‌రెడ్డి మరోవైపు బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మాత్రమే (ఇద్దరు భద్రతా సిబ్బంది మినహా) రోడ్‌షోలో పాల్గొన్నారు. అంతకుముందు చేవెళ్ల, భువనగిరి, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థులు కొండా విశ్వేశ్వేర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, మాధవీలతలను మోదీకి పరిచయం చేశారు. ఈ రోడ్‌షో మొదలు, చివరి పాయింట్ల వద్ద పలువురు బీజేపీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు స్వాగతం పలికేలా లైనప్‌లు ఏర్పాటు చేశారు. కాగా రోడ్‌షో ముగియగానే మోదీ రాజ్‌భవన్ బసకు చేరుకున్నారు. ప్రధాని శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి నాగర్‌కర్నూల్‌కు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభ ముగిసిన తర్వాత హెలికాప్టర్లో కర్ణాటకలోని గుల్బర్గా వెళతారు. -
మల్కాజిగిరిలో ప్రధాని మోదీ రోడ్‌షో
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. మల్కాజిగిరి రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. మల్కాజిగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన రోడ్‌షోకి భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ప్రధాని మోదీ రోడ్ షో మీర్జాలగూడ చౌరస్తా నుంచి ప్రారంభమైంది. సుమారు 1.3 కి.మీ. దూరంలో ఉన్న మల్కాజిగిరి చౌరస్తా వరకు రోడ్‌షో జరుగుతుంది. దారి పొడవునా సుమారు 60 స్వాగత వేదికలు ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల(నేడు, రేపు) నగర పర్యటన దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేశారు. మోదీ విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న నేపథ్యంలో దానిని కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకు న్నాయి. ఎయిర్పోర్ట్ పరిసరాలను అణువణువూ జాగిలాలతో జల్లెడ పట్టాయి. నేడు మోదీ రోడ్ షో పూర్తిచేసుకుని తిరిగి రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. శనివారం ఉద యం 10.40 నుంచి 11.15 మధ్య రాజ్‌భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. -
పీఎం మోడీ రోడ్ షోకు భారీగా ఏర్పాట్లు
-
PM Modi: నేడు హైదరాబాద్‌కు ప్రధాని.. మల్కాజ్‌గిరీ రోడ్‌షోలో
-
తెలంగాణకు ప్రధాని రాక.. నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలు నేపథ్యంలో... తెలంగాణలో బీజేపీ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో వరుసగా శుక్ర, శని, సోమవారాల్లో వివిధ చోట్ల బహిరంగసభలు, రోడ్‌షోల్లో పాల్గొంటారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌కు రానున్న మోదీ రాత్రికి రాజ్‌భవన్‌లో బసచేయనున్నారు. శనివారం ఉదయం నాగర్‌కర్నూల్‌లో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. మళ్లీ 18న జగిత్యాలలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. శుక్ర, శనివారాల్లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడవచ్చనే అంచనాల మధ్య ప్రధాని పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. మోదీ ఇప్పటికే ఈ నెల 4న ఆదిలాబాద్‌లో, 5న పటాన్‌చెరువులో రూ.15వేల కోట్ల పైచిలుకు విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందా లేదా అన్న దానితో నిమిత్తం లేకుండా మోదీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు కొనసాగుతాయని పార్టీ వర్గాల సమాచారం. ఇదీ మోదీ షెడ్యూల్... ► శుక్రవారం సాయంత్రం 4.50 గంటలకు కేరళ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేటకు... ► రోడ్డుమార్గాన మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని రోడ్డుషో స్టార్టింగ్ పాయింట్‌కు... ► సాయంత్రం 5.15 గంటల నుంచి 6.15 గంటల వరకు మల్కాజిగిరిలో రోడ్డుషో ► రోడ్డుమార్గాన 6.40 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస ► శనివారం ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11.50 గంటలకు నాగర్‌కర్నూల్‌కు చేరుకుంటారు ► మధ్యాహ్నం 12 నుంచి 12.45 గంటల దాకా అక్కడ బహిరంగసభలో పాల్గొంటారు ► ఒంటిగంటకు నాగర్‌కర్నూల్ నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 2.05 గంటలకు కర్ణాటకలోని గుల్బర్గాకు బయలుదేరుతారు. ► తిరిగి 18వ తేదీ రాష్ట్రానికి వస్తారు. ఆ రోజు షెడ్యూల్ అధికారికంగా విడుదల కావాల్సి ఉంది. ఔ నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు ప్రధాని మోదీ రెండు రోజుల నగర పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ విభాగం తెలిపింది. శుక్రవారం సాయంత్రం 4.40 నుంచి 7 గంటల మధ్య బేగంపేట, పీఎన్టీ జంక్షన్, రసూల్‌పురా, సీటీఓ, ప్లాజా, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ ఎక్స్‌రోడ్డు, ఆలుగడ్డ బావి, మెట్టుగూడ, రైల్వే హాస్పిటల్, మెట్టుగూడ రోటరీ, మీర్జాలగూడ టి–జంక్షన్, మల్కాజిగిరి ఆర్చి, లాలాపేట్, తార్నాక, గ్రీన్‌ల్యాండ్స్, మోనప్ప జంక్షన్, రాజ్‌భవన్, ఎంఎంటీఎస్ జంక్షన్, వీవీ విగ్రహం మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పేర్కొంది. ఆయా మార్గాల్లో వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించింది. అదేవిధంగా శనివారం ఉదయం 10.40 నుంచి 11.15 గంటల మధ్య ప్రధానమంత్రి రాజ్‌భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి వెళ్తారు. ఆ సమయంలో వీవీ విగ్రహం, మెట్రో రెసిడెన్షీ లేన్, ఎంఎంటీఎస్ రాజ్‌భవన్, పంజగుట్ట, గ్రీన్‌ల్యాండ్స్, హెచ్‌పీఎస్ ఔట్ గేట్, బేగంపేట ఫ్లైఓవర్, పీఎన్టీ ఫ్లైఓవర్, ఎయిర్పోర్ట్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వివరించింది. మోదీ రాక.. భద్రత కట్టుదిట్టం ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల(నేడు, రేపు) నగర పర్యటన దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేశా రు. మోదీ విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న నేపథ్యంలో దానిని కేంద్ర బలగాలు తమ ఆ«దీనంలోకి తీసుకు న్నాయి. ఎయిర్పోర్ట్ పరిసరాలను అణువణువూ జాగిలాలతో జల్లెడ పట్టాయి. ప్రధాని పయనించే మార్గాల్లో పోలీసులు గురువారం ట్రయల్ రన్ నిర్వహించారు. నేడే మోదీ రోడ్ షో పూర్తిచేసుకుని తిరిగి రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. శనివారం ఉద యం 10.40 నుంచి 11.15 మధ్య రాజ్‌భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. సాక్షి, సిటీబ్యూరో, మల్కాజిగిరి/ సనత్‌నగర్: మల్కాజిగిరిలో నేడు సాయంత్రం 5.15 గంటలకు జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్‌షోకు సర్వం సిద్ధమైంది. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ మరి కొద్దిరోజుల్లో వెలువడనున్న తరుణంలో ప్రధానమంత్రి రోడ్ షో బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపనుంది. మల్కాజిగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలను దృష్టిలో ఉంచుకొని పార్టీ నేతలు మల్కాజిగిరిలో రోడ్‌షో ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసేందుకు సన్నాహాక సమావేశాలు ఇ ప్పటికే ఏర్పాటు చేశారు. రోడ్ షో ఇలా... ► ప్రధాని మోదీ రోడ్ షో మీర్జాలగూడ చౌరస్తా నుంచి సాయంత్రం 5.15 గంటలకు ప్రారంభం కానున్నది. ► సుమారు 1.3 కి.మీ. దూరంలో ఉన్న మల్కాజిగిరి చౌరస్తా వరకు రోడ్‌షో జరుగుతుంది. ► మల్కాజిగిరి చౌరస్తాలో కార్నర్ మీటింగ్‌కు ఏర్పాటు చేశారు. అక్కడ మోదీ ప్రసంగించే అవకాశం ఉంది. ► దారి పొడవునా సుమారు 60 స్వాగత వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. ► ప్రజలతోపాటు పార్టీ నాయకులు స్వాగతం పలికేందుకు రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ► రోడ్‌షోలో భాగంగా సుమారు ముప్ఫై కార్లతో కాన్వాయి ట్రయల్ రన్ నిర్వహించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో నిషేధాజ్ఞలు ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన భద్రతాచర్యల్లో భాగంగా రోడ్ షో జరిగే ప్రాంతం చుట్టూ నిషేధాజ్ఞలు విధిస్తూ కమిషనర్ తరుణ్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ఎయిర్ బెలూన్లు, రిమోట్ కంట్రోల్ డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్ ఎయిర్ క్రాఫ్ట్, ప్యారా గ్లైడింగ్‌లను నిషేధించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రోడ్ షో ముగిసే వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన తెలిపారు. రహదారి మళ్లింపులు ఇలా.. ► మెట్టుగూడ నుంచి మీర్జాలగూడ క్రాస్ రోడ్, నేరేడ్మెట్ వైపునకు వచ్చే ప్రయాణికులు శాంతినగర్ టీ జంక్షన్ వద్ద మళ్లించి, లాలాపేట మీదుగా జెడ్‌టీసీ, మౌలాలి, రమాదేవి, ఈసీఐఎల్ మీదుగా నేరేడ్మెట్కు చేరుకోవాలి. ► నేరేడ్మెట్, వినాయక్‌నగర్, సఫిల్‌గూడ జంక్షన్ మీదుగా మల్కాజ్గిరి క్రాస్ రోడ్స్‌కు వచ్చే వాహనదారులు ఆనంద్‌బాగ్ క్రాస్ రోడ్స్ వద్ద మలుపు తీసుకొని ఉత్తమ్ ఆర్యూబీ మీదుగా ఉత్తమ్ నగర్, ఏఓసీ రూట్, సికింద్రాబాద్ మీదుగా వెళ్లిపోవాలి. ► జెడ్‌టీసీ జంక్షన్ నుంచి ఆనంద్‌బాగ్‌కు వచ్చే వాహనాలు జెడ్‌టీసీ వద్ద మళ్లించి, మౌలాలి, రమాదేవి, ఈసీఐఎల్, నేరేడ్మెట్, వినాయక్‌నగర్ మీదుగా వెళ్లిపోవాలి. పార్కింగ్లు ఇక్కడే.. రోడ్ షోకు హాజరయ్యేవారు తమ వాహనాలను అనుటెక్స్ పెట్రోల్ బంక్, అషూర్ఖానా మైదానం, ప్రశాంత్ నగర్, జైన్ కన్స్ట్రక్షన్, సఫిల్‌గూడ ప్రాంతాలలో మధ్యాహ్నం 2 గంటల లోపు పార్కింగ్ చేయాలి. ఆ సమయం తర్వాత పార్కింగ్ చేయడానికి అనుమతి లేదు. -
ఆ సీటు యమ హాట్.. బీజేపీలో ‘మల్కాజ్గిరి’ మంటలు
లోక్ సభ ఎన్నికల్లో ఆ సీటు యమ హాట్. దేశంలోనే దానిదొక ప్రత్యేక స్థానం. అక్కడ గెలిస్తే రాజయోగమే. అలాంటి లక్కీ సీట్ కోసం లీడర్ల పాట్లు అన్ని ఇన్నీ కావు. కేంద్రంలో అధికారంలో బీజేపీలో ఆ సీటు పోటీ మరింత రసవత్తరంగా మారింది. ఈటలకే కన్ఫర్మ్ అయిందన్న ప్రచారంతో మిగిలిన ఆశావహులు రగిలిపోతున్నారు. నాన్ లోకల్ వద్దు.. లాంగ్ అండ్ లోకల్ లీడర్‌కే ఇవ్వాలంటూ స్థానిక ఆశావహులంతా ఏకమై నిరసన గళం వినిపిస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద లోక్ సభ స్థానం మల్కాజ్గిరి. అన్ని పార్టీల కన్ను అటువైపు. అక్కడ గెలిస్తే మంత్రి లేదా ముఖ్యమంత్రి అవ్వొచ్చన లక్కీ థాట్స్ కూడా నేతలకు స్టార్ట్ అయ్యాయి. అలాంటి సీటుకు ఫుల్ డిమాండ్ ఉంది. దేశంలో ఊపు మీదున్న బీజేపీ నుంచి ఆ సీటుకున్న పోటీ అంతా ఇంత కాదు. మాజీ మంత్రి ఈటల, బీజేపీ జాతీయ నేత మురళిధర్ రావు, స్థానిక నేతలు వీరంద్రగౌడ్, కూన శ్రీశైలం గౌడ్, పన్నాల హరీశ్ రెడ్డి, చాడ సురేశ్ రెడ్డి, మల్క కొమురయ్య వంటి నేతల రేసులో ఉన్నారు. మల్కాజ్ గిరి సీటు తనకే కన్ఫర్మ్ అయిందని ఈటల రాజేందర్ ధీమాతో ఉన్నారు. ఈ మేరకు అధిష్టానం నుంచి సంకేతాలు ఉన్నాయని కేడర్‌తో ఆయన ఏర్పాటు చేసిన బ్రేక్ పాస్ట్ మీటింగ్ బిజెపి మల్కాజ్ గిరిలో మంటలు రేపింది. మల్కాజ్గిరి సీటు తనకే కన్ఫర్మ్ అయిందని ఈటల ప్రచారంపై మిగిలిన ఆశావహులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమ అసంతృప్తిని బాహటంగానే ప్రదర్శిస్తున్న నేతలు.. ఈటల వ్యవహారంపై అధిష్టానంకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో గురువారం రాత్రి జరిగిన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలో మల్కాజ్‌గిరిని పెండింగ్‌లో పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. మల్కాజ్ గిరి సీటు విషయంలో స్థానిక ఆశావహులు అంతా ఒక్కతాటిపైకి వచ్చారు. నాన్ లోకల్‌కు సీటు కేటాయిస్తే సహకరించేది లేదని తెగెసి చెబుతున్నారు. అతిపెద్ద నియోజకవర్గంలో పోటీ చేసేందుకు నేతలే లేరా అంటూ అసంతృప్త నేతలు క్వశ్చన్ చేస్తున్నారు. వీరంద్ర గౌడ్, కూన్ శ్రీశైలం గౌడ్, హరీశ్ రెడ్డి, చాడ సురేశ్ రెడ్డి నేతలు అనుచరులు, కార్యకర్తలతో మల్కాజ్ గిరి సీటు వ్యవహారంపై భేటీ అయ్యారు. లోకల్ క్యాండిడేట్ ఎవరికి ఇచ్చినా ఓకే కానీ బయట నుంచి తీసుకొస్తే మాత్రం సహకరించేది లేదని పార్టీకి చెప్పాలని డిసైడ్ అయ్యారు. పార్టీని నమ్ముకొని ఎన్నో ఎళ్లుగా ఉన్న స్థానికులైన వారికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పన్నాల హరీశ్ రెడ్డి, వీరేంద్ర గౌడ్, కూన శ్రీశైలం గౌడ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరీశ్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ టికెట్‌ను త్యాగం చేశారు. పార్లమెంట్ సీటు తనకే వస్తుందని భావించారు. మధ్యప్రదేశ్ ఇన్ చార్జీ మురళీధర్ రావు మల్కాజ్ గిరిలో మూడేండ్లుగా పలు కార్యక్రమాలు చేస్తున్నారు. చాడ సురేశ్ రెడ్డి సైతం సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. అంతేకాకుండా ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా పార్లమెంట్ పరిధిలో డబ్బులు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి టికెట్ ఈటలకు కన్ఫర్మ్ అయిందని ప్రచారం జరుగుతున్న తరుణంలో వీరితో పాటు బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్ అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ నేతలతో ఆయన టచ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ నిర్ణయం ఆధారంగా ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. మరి అధిష్టానం మల్కాజ్ గిరి టికెట్ ఎవరికి కేటాయిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. వీరికి కాకుండా ఇతరులకు ఇస్తే వీరు ఆ నేతకు సహకరిస్తారా? లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. -
తేల్చుకుందాం రా..!
సాక్షి, హైదరాబాద్: ‘‘వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దమ్ముంటే ఒక్క సీటు అయినా గెలిచి చూపించాలని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారు. అంత ఉబలాటం, దమ్ము, ధైర్యం, తెగువ ఉంటే.. పరపతి ఉన్న నాయకుడివే అయితే.. నువ్వు (రేవంత్) సిట్టింగ్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి లోక్‌సభ సీట్లోనే తేల్చుకుందాం. అది పోతే ఇది, ఇదిపోతే అది.. అన్నట్టు సేఫ్ గేమ్ ఆడకుండా.. నువ్వు సీఎం పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యి. నేను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఎంపీగా నీ పనితీరు, మున్సిపల్ మంత్రిగా నా పనితీరును ఆ ఒక్క సీటులోనే తేల్చుకుందాం. ఎవరు గెలుస్తారో చూద్దాం..’’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. గురువారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. రేవంత్ మాటలకు విశ్వసనీయత ఏది? గతంలో జీహెచ్ఎంసీలో, కొడంగల్‌లో ఓడితే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించిన రేవంత్‌రెడ్డి మాటలకు విశ్వసనీయతే లేదని కేటీఆర్ విమర్శించారు. ‘‘రాజకీయాల్లో గెలుపోటములు సహజం. గెలిస్తే మగాడు.. ఓడితే కాదంటావా? గతంలో కొడంగల్‌లో ఓడినపుడు నువ్వు కాదా..? ఇదేం లాజిక్? నువ్వు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరిలో ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు గెలిచారో చెప్పలేరు. ఆత్మన్యూనత భావంతో బాధపడుతున్న రేవంత్ నేనే సీఎం, నేనే పీసీసీ అధ్యక్షుడు అని గొంతు చించుకుంటున్నారు. ఏం మీ మంత్రివర్గ సహచరులు మిమ్మల్ని గుర్తించడం లేదా? మగతనం గురించి మాట్లాడుతున్న రేవంత్.. ఎన్నికల కోడ్ వచ్చేలోగా రూ.2లక్షల రుణమాఫీ, మహాలక్ష్మి పథకంతో పాటు మిగతా 420 హామీలను నెరవేర్చాలి’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డిది పేమెంట్ కోటా.. రాజకీయాల్లో తనది మేనేజ్మెంట్ కోటా అంటున్న రేవంత్.. రాహుల్, ప్రియాంక గాంధీ ఏ కోటానో చెప్పాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘రేవంత్‌రెడ్డి పేమెంట్ కోటా కింద మాణిక్యం ఠాగూర్‌కు డబ్బులిచ్చి పీసీసీ అధ్యక్ష పదవిని, ఇతరులకు డబ్బులిచ్చి సీఎం పదవి కొనుక్కున్నారు. పేమెంట్ కోటా అభ్యర్థి రేవంత్.. తనను ప్రజలు ఎన్నుకున్నట్టు మాట్లాడితే ఎలా? పేమెంట్ కోటాలో తెచ్చుకున్న సీటు కోసం ఢిల్లీకి కప్పం కట్టాలి. పార్లమెంటు ఎన్నికల్లో ఢిల్లీని నడపాలంటే రేవంత్, డీకే శివకుమార్ రోజుకు 18 గంటలు కష్టపడాలి. బిల్డర్లు, కాంట్రాక్టర్లను పిలిచి బెదిరించి, వేధించి డబ్బుల వసూలు దందా చేస్తున్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలో బిల్డింగ్ అనుమతులను ఎవరిని బెదిరించడం కోసం నిలిపివేశారు. హైదరాబాద్ బిల్డర్లు త్వరలోనే రోడ్డెక్కే పరిస్ధితి ఉంది. కేంద్రంలోని బీజేపీకి రేవంత్ పరోక్షంగా సహకరిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆయన ఎటుపోతారో అందరూ చూస్తారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఏం జరుగుతుందో చూస్తున్నట్టే.. భవిష్యత్తులో తెలంగాణలో కూడా రాజకీయం రంజుగా ఉంటుందనేది వేచి చూడాల్సిందే. లంకె బిందెలు ఎక్కడున్నాయో మనకేం తెలుసు. తెలంగాణ తల్లి మీద ఆభరణాలు మాయం చేశాడు’’ అని కేటీఆర్ విమర్శించారు. టీఆర్ఎస్గా మార్పుపై నిర్ణయం తీసుకోలేదు.. రాజకీయ పారీ్టల్లో చేరికలను భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. పోరాటవాదులు పారీ్టతో ఉంటారని, అవకాశవాదులు వదిలివెళ్తారని వ్యాఖ్యానించారు. ఏ పార్టీ అయినా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తుందన్నారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సునీత మహేందర్‌రెడ్డి (చేవెళ్ల), బొంతు రామ్మోహన్ (సికింద్రాబాద్), అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి (మల్కాజిగిరి), వెంకటేశ్ నేత (పెద్దపల్లి)లకు టికెట్లు ఇస్తారేమోనని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. బీఆర్ఎస్గా ఉన్నా తమ ఫోకస్ ప్రస్తుతానికి తెలంగాణపైనే ఉందని చెప్పారు. తమ పాలనలో ఏవైనా తప్పులు జరిగి ఉంటే.. రాజకీయ వేధింపులకు దిగకుండా ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చన్నారు. ఎన్డీఎస్ఏ నివేదిక రాజకీయ ప్రేరేపితం సాగునీటి ప్రాజెక్టులు, బ్యారేజీలు, రిజర్వాయర్లలో లీకేజీలు, పగుళ్లు సహజమని కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వం ఏ విచారణలు చేసినా సరే, ఇంజనీరింగ్ నిపుణులు దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించారు. కానీ గత ప్రభుత్వంపై ఆరోపణలు, శ్వేతపత్రాలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. గతంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఎలాంటి హైడ్రోలాజికల్ అధ్యయనాలు చేయకుండానే రాజకీయ ప్రేరేపితంతో ఆదరాబాదరాగా నివేదికను విడుదల చేసిందని విమర్శించారు. ఎప్పుడూ కేంద్ర సంస్థలు ఇచ్చే నివేదికలను తప్పుబట్టే కాంగ్రెస్, మంత్రి ఉత్తమ్ ఇప్పుడు ఎన్డీఎస్ఏ నివేదికను ప్రామాణికంగా తీసుకుని మాట్లాడుతున్నారేమని ప్రశ్నించారు. రైతులను ఆదుకునేందుకు తగిన పరిష్కారం చూపాలనే కామన్ సెన్స్ ఆయనకు లేదని వ్యాఖ్యానించారు. ‘‘మేం మేడిగడ్డకు వెళ్తుంటే.. కాంగ్రెస్ పాలమూరు ప్రాజెక్టు సందర్శన పేరిట చౌకబారు రాజకీయం చేస్తోంది. దిద్దుబాటు చర్యలు చేపట్టి నీరు ఇవ్వకపోవడం వికృత రాజకీయం, నేరపూరిత చర్య. పాలమూరు ప్రాజెక్టులో 80శాతం పనులు పూర్తిచేశాం. ఉత్తమ్ నీటిపారుదల శాఖ మంత్రిగా బ్యారేజీలు, రిజర్వాయర్లతోపాటు తన శాఖకు సంబంధించిన అంశాలపై అవగాహన పెంచుకోవాలి. కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేసే పనులు మానుకుని మేడిగడ్డ వద్ద దిద్దుబాటు పనులు చేపట్టాలి..’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో తల్లీకుమారుడి మృతి
మల్కాజిగిరి: కుమారుడు ఆత్మహత్య చేసుకోవడం..అదే గదిలో అతని తల్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలి్పన వివరాల మేరకు..మౌలాలి ఈస్ట్ ప్రగతినగర్‌కు చెందిన మెరుగు విజయ (73) భర్త చనిపోవడంతో కుమారుడు శ్రీధర్ గౌడ్(47)తో కలిసి ఉంటుంది. శ్రీధర్ గౌడ్‌కు భార్య శైలజతో మనస్పర్థలు రావడంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆమె వేరే ఇంట్లో ఉంటోంది. కాగా శ్రీధర్ గౌడ్ ప్రస్తుతం జవహర్‌నగర్‌లో ఉన్న వాటర్ ప్లాంట్ నిర్వహణ చూసుకుంటున్నాడు. వారి సంతానంలో కుమారుడు, కూతురు ఇతని వద్ద ఉంటుండగా..మరో కుమారుడితో కలిసి శైలజ కాప్రాలో ఉంటున్నది. బుధవారం ఉదయం శ్రీధర్ కుమార్తె నిద్రలేచి చూసేసరికి తండ్రి బెడ్రూమ్లో ఉరివేసుకొని ఉండగా, అదే రూములో ఆమె నానమ్మ విజయ కిందపడి చనిపోయిఉండడం గమనించింది. వెంటనే బయటకు వచ్చి కేకలు వేయడంతో స్ధానికులు వచి్చ..పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్ధలానికి చేరుకున్న ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్ఐ మల్లయ్యలు వారిద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. శ్రీధర్ భార్య శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు. కుటుంబ సమస్యలే కారణమా? భిక్షపతి, విజయలకు నలుగురు సంతానం. ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. ఆర్థికంగా బాగానే ఉన్న కుటుంబం. శ్రీధర్‌కు అతని భార్య శైలజకు విభేదాలు ఏర్పడ్డాయి. గతంలో మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌లో శ్రీధర్‌పై వరకట్నం వేధింపుల కేసు నమోదైంది. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా..వాదనలు పూర్తయి వచ్చే నెలలో తీర్పు రానున్నట్లు సమాచారం. పోలీసులు శ్రీధర్ ఇంట్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీని ప రిశీలించగా..మంగళవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో శ్రీధర్ బయట నుంచి ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత పాలు పోసే వ్యక్తి రావడంతో విజయ పాలు పోయించుకున్నట్లు రికార్డు అయింది. విజయ నేల మీద పడి వుండడం, తల వెనుక రక్తం ఉండడాన్ని పోలీసులు గమనించారు. కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో షాక్‌కు గురైన ఆమె కింద పడిపోయి చనిపోయిందా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నా యా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వచ్చే నెలలో విడాకులకు సంబంధించి తీర్పు రానున్నడంతో శ్రీధర్ ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడివుండవచ్చునని భావిస్తు న్నారు. గత కొంత కాలంగా ఆస్తి పంపకాలపై కూడా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. -
మల్కాజిగిరి బరిలో ఈటల?
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల సంసిద్ధతలో భాగంగా బీజేపీ కోర్ కమిటీ తెలంగాణలో పార్టీ బలాబలాలపై రాష్ట్ర నాయకత్వంతో మేధోమథనం చేపట్టింది. పార్టీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు సంబంధించి కసరత్తు నిర్వహించింది. శనివారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి సహా ఇతర కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్లలో పార్టీ పరిస్థితిపై నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. అభ్యర్థుల ఎంపికపై ప్రాథమిక కసరత్తు పూర్తి చేసినట్లు పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా సికింద్రాబాద్–జి.కిషన్‌రెడ్డి, కరీంనగర్–బండి సంజయ్, నిజామాబాద్–ధర్మపురి అర్వింద్, మహబూబ్‌నగర్–డీకే అరుణ, చేవెళ్ల–కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మల్కాజిగిరి–ఈటల రాజేందర్, మెదక్–ఎం.రఘునందన్‌రావు, భువనగిరి–బూర నర్సయ్యగౌడ్ అభ్యర్థిత్వాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టుగా పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆయా పేర్లకు నడ్డా, షా ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. ఇవి కాకుండా మరో రెండు సీట్లలోనూ విజయావకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 29న జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ తర్వాత 8 లేదా 9 స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణం తర్వాత రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పెరిగిందని, గతంలో ఓడిపోయిన స్థానాల్లో పార్టీ బలం పుంజుకుందని ఈ భేటీలో రాష్ట్ర నేతలు పార్టీ పెద్దలకు వివరించినట్లు సమాచారం. ఐకమత్యంతో పనిచేసి రాష్ట్రంలోని 17 స్థానాల్లో విజయం సాధించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని వారు రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారని తెలిసింది. ఈ సమావేశంలో పార్టీ నేతలు బండి సంజయ్, డా. కె.లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీ పాల్గొన్నారు. మెజారిటీ సీట్లు గెలుస్తాం: కె. లక్ష్మణ్ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ సీట్లు గెలుస్తామని.. గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్ చెప్పారు. పార్టీ జాతీయ నేతలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో యాత్రలు, సభలపై అగ్రనేతలతో చర్చ జరిగిందని పేర్కొన్నారు. -
మల్కాజిగిరి ఛాన్స్ నాకివ్వండి: ఈటల రాజేందర్
సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: తమకు ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే అవసరం లేదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తమ సొంత కాళ్లపై నిలబడి పోటీ చేసి గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజ్గిరి స్థానం నుంచి పోటీచేస్తానని మరోసారి ఈటల పేర్కొన్నారు. యాదగిరిగుట్టలో ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం ఈటల రాజేందర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మేడిగడ్డపై సీబీఐ విచారణ కోరిన కాంగ్రెస్.. అధికారం వచ్చాక మాట మార్చిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి, తప్పుదోవ పట్టించి హామీలు ప్రకటించిందని మండిపడ్డారు. ఆశల పల్లకిలో ప్రయాణం చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హామీలపై ప్రజల భ్రమలు తొలగుతున్నాయని అన్నారు ఈటల. ఉచిత బస్సు పథకంతో ప్రయాణికుల సంఖ్య, అక్యూపెన్సీ పెరిగినప్పటికీ బస్సుల సంఖ్య పెరగలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హామీలపై ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ అప్పుల కోసం కేంద్రం చుట్టూ తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. చదవండి: TS: ఆరు గ్యారెంటీల అమలు ఎప్పుడు: కిషన్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం పురోగతి సాధిస్తుందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. హామీలు ఇవ్వకుండానే అమలు చేసిన గొప్ప వ్యక్తి ప్రధాని మోదీ అని.. రూ. 6300కోట్ల రూపాయాలతో మూత పడిన ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించారని ప్రశంసించారు. నిజమాబాద్‌లో పసుపు బోర్డు పెట్టి నేనున్నానని భరోసా ఇచ్చారని ప్రస్తావించారు. దక్షిణాన రూ. 26వేల కోట్లతో రిజినల్ రింగ్ రోడ్డు మంజూరు చేశారని తెలిపారు. ‘ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు కేసీఆర్ సమయం ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్నీ ఖూనీ చేశారు. కేసీఆర్ లక్ష రూపాయాల రుణమాఫీ ఐదేళ్ళ కాలంలో పూర్తి స్థాయిలో జరగలేదు. రెండు లక్షల రుణ మాఫీ ఒకటే దఫా చేయాలంటే సాధ్యం కానీ పరిస్థితి. గతంలో కేసీఆర్ జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది పడ్డారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇచ్చిన హామీలను అరచేతిలో వైకుంఠం చూపెడతున్నారు. 400లకు పైగా ఉన్న హామీలను మరోసారి కాంగ్రెస్ చదువుకోవాలి. కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన ఇండియా కూటమి అతుకుల బొంతగా మారింది. దేశం ఒక్కప్పుడు బాంబుల మోతలు, మత కలహాలు ఉండేది. బీజేపీ పాలనలో దేశమంతా ప్రశాంతంగా ఉంది’ అని పేర్కొన్నారు. -
హైదరాబాద్ మల్కాజిగిరిలో ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టు
-
BRS: మల్కాజ్గిరి ఎంపీ సీటుపై మాజీ మంత్రి కన్ను!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీఎన్నికల హడావుడి ముగిసింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు తరుముకువస్తున్నాయి. దీంతో అన్ని పార్టీల్లోనూ మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. ముఖ్యంగా విపక్షాల నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన, గెలిచిన పలువురు నేతలు ఎంపీ ఎన్నికల్లో పోటీకి తహతహలాడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఓ మాజీ మంత్రి ఎంపీగా పోటీ చేయాలని తెగ ఉబలాటపడుతున్నారు. ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరో చూద్దాం. మరో మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువగా మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గంపై అన్ని పార్టీలకు చెందిన ప్రముఖ నేతల కన్ను పడింది. దేశంలోనే అతిపెద్ద పార్లమెంటరీ నియోజకవర్గం అయిన మల్కాజ్‌గిరిలో 31 లక్షలకు పైగా ఓటర్లున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. ఇక్కడి నుంచి 2014లో గెలిచిన మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కారు గుర్తు మీద పోటీచేసి మరోసారి ఎంపీ కావాలని తహతహలాడుతున్నారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి మేడ్చల్ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయినప్పటికీ ఎంపీ సీటుపై ఆయన కన్ను పడింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి మల్లారెడ్డి, మల్కాజ్ గిరి నుంచి ఆయన అల్లుడు పోటీ చేసి గెలిచారు. గత లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీ సీటుకు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్‌రెడ్డి ఓటమి చెందారు. అందుకే ఈసారి తానే పోటీ చేసి గెలవాలని ఆయన కోరుకుంటున్నారు. ఒక వేళ మల్లారెడ్డి ఎంపీ గా పోటీ చేసి గెలిస్తే.. ఆ తర్వాత మేడ్చల్ అసెంబ్లీ సీటుకు తన కోడలు ప్రీతి రెడ్డితో పోటీ చేయించాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ అగ్ర నాయకత్వానికి కూడా మల్లారెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. ఎంపీ ఎన్నికలకు, ఆ తర్వత జరిగే అసెంబ్లీ ఉపఎన్నికకు ఖర్చు మొత్తం తానే చూసుకుంటానని తెలిపినట్టు సమాచారం. ఇదిలా ఉంటే..మల్లారెడ్డికి ఎంపీ సీటు ఇస్తే.. మేడ్చల్‌కు ఉప ఎన్నిక వస్తే అక్కడ ఇతర నాయకులకు ఛాన్స్ ఇవ్వాలని స్థానిక నేతలు పార్టీని కోరుతున్నారు. దీంతో ఈ విషయంపై బీఆర్ఎస్ నాయకత్వం ఆచి తూచి వ్యవహరిస్తోంది. మేడ్చల్ అసెంబ్లీ, మల్కాజ్గిరి ఎంపీ స్థానాలు రెండూ కీలకమే కావడంతో.. ఈ సారి కచ్చితంగా మల్కాజ్గిరి పై గులాబీ జెండా ఎగురవేయాలని భావిస్తోంది. మల్లారెడ్డికి పట్టున్న స్థానం కావడంతో ఈ విషయంలో సీరియస్‌గానే ఆలోచన చేస్తోంది. ఏదేమైనా మల్కాజ్ గిరి విషయంలో మాజీ మంత్రి మల్లన్న కూడా గట్టిగానే పట్టుపడుతున్నారు. ఇక్కడ ఎలాగూ ప్రతిపక్షమే గనుక మళ్ళీ పార్లమెంట్ లో అడుగుపెట్టి... ఇక్కడున్న వివాదాల నుంచి బయట పడవచ్చని మల్లారెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదీచదవండి.. చేవెళ్ల ఎంపీ సీటు ఎవరిది..? -
కౌండిన్య క్యాలెండర్ ఆవిష్కరణ!
మల్కాజ్గిరి: గౌడ న్యాయవాదుల సమ్మేళనాన్ని పురస్కరించుకుని కౌండిన్య క్యాలెండర్ ఆవిష్కరణ కుషాయిగూడలో జరిగింది. కాటమయ్య ఆలయ సన్నిధిలోని మీటింగ్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు గౌడ న్యాయవాదులు హాజరయ్యారు. స్వామి వివేకానందుడి పిలుపునిచ్చిన జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో బీసీల ఐక్యత, గౌడ కుల అభివృద్ధి, యువజన ప్రగతి గురించి కూలంకుషంగా చర్చించారు. న్యాయవాదులే నడుం కట్టాలి తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు కీలకపాత్ర పోషించినట్టే.. బీసీల ఐక్యత, రాజ్యాధికారం కోసం కూడా గౌడ లాయర్లు ముందుకు రావాలని సమావేశంలో పిలుపునిచ్చారు. పలువురు గౌడ న్యాయవాదులు హాజరయిన ఈ సమావేశంలో.. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూడొద్దని పిలుపునిచ్చారు. ప్రతీ నియోజకవర్గంలో మెజార్టీలు బీసీలేనని, అయినా వారికి ఎలాంటి పదవులు రావడం లేదని ఆందోళన వెలిబుచ్చారు. కొన్ని చోట్ల బీసీ నాయకులను ఇబ్బంది పెట్టే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కొందరు బీసీ నేతలు చిన్న చిన్న పొరపాట్ల వల్ల, కుట్రల వల్ల ఓడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఖ్యాపరంగా భారీగా ఉన్న బీసీలు ఏకీకృతం కావాలని, గౌడ ప్రజలు ఎక్కువ ఉన్న చోట నాయకత్వం పెరగాలని పిలుపునిచ్చారు. చారిత్రక ఆధారాలతో క్యాలండర్ గౌడ న్యాయవాదుల సమ్మేళనాన్ని పురస్కరించుకుని గౌడ జాతీయ అధ్యక్షుడు ఏడుకొండల గౌడ్ ప్రత్యేకంగా రూపొందించిన కౌండిన్య క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. పురాణాల్లో కౌండిన్య ప్రస్తావన, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట, నాయకత్వ పటిమ, ప్రస్తుత పరిస్థితులను క్యాలెండర్లో వివరించారు. ఈ సమ్మేళన కార్యక్రమాన్ని గులారి శ్రీనివాస్ గౌడ్ నిర్వహించగా.. అతిథులుగా బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్, మల్కాజిగిరి బార్ అసోషియేషన్ మాజీ అధ్యక్షులు బబ్బూరి శ్రీనివాస్ గౌడ్, రవికాంత్ గౌడ్, అజయ్ కుమార్ గౌడ్, సీనియర్ న్యాయవాదులు గులారి మల్లేశం గౌడ్, దేవరాజ్ గౌడ్ కార్యక్రమ నిర్వహణ సభ్యులు నవీన్ గౌడ్, గిరిధర్ గౌడ్, విశ్వనాథ్ గౌడ్, శివ గౌడు, ఇంకా సీనియర్ న్యాయవాదులు అరుణ్ గౌడ్, నరేష్ బాబు గౌడ్, సుధీర్ బాబు గౌడ్, గౌడ హాస్టల్ మెంబర్ పాండాల శివ గౌడ్, కెనరా బాంక్ సీనియర్ లీగల్ ఆఫీసర్ వెంకటేష్ గౌడ్, తాళ్ల వెంకటేష్ గౌడ్, రఘుపతి గౌడ్, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ కొరడా -
మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి సతీమణి ప్రచారం
-
రెండుచోట్లా మైనంపల్లికి బీఆర్ఎస్ చెక్.
సాక్షి, హైదరాబాద్: మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ కేటాయించినా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పార్టీని వీడటాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా పరిగణిస్తోంది. మల్కాజ్గిరి నుంచి మైనంపల్లి, మెదక్ నుంచి ఆయన కుమారుడు రోహిత్‌రావు కాంగ్రెస్ అభ్యర్థులుగా వచ్చే ఎన్నికలలో పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో ఈ రెండు చోట్లా మైనంపల్లిని కట్టడి చేసేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. అందులో భాగంగా మెదక్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మల్కాజ్గిరి టికెట్ ఆశించిన నందికంటి శ్రీధర్‌ను బీఆర్ఎస్లో చేర్చుకునేందుకు మంతనాలు జరుగుతున్నాయి. మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న తిరుపతిరెడ్డి మూడ్రోజుల క్రితం తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాజాగా మల్కాజ్గిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకొని సేవలందిస్తున్న తమను కాదని కొత్తగా పార్టీలో చేరిన మైనంపల్లి కుటుంబానికి రెండు టికెట్లు కేటాయించడాన్ని అటు తిరుపతిరెడ్డి, ఇటు నందికంటి శ్రీధర్ ప్రశ్నిస్తున్నారు. కాగా, కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఈ ఇద్దరు నేతలను బీఆర్ఎస్లో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్లో తిరుపతిరెడ్డి చేరికకు సంబంధించి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి నివాసంలో చర్చలు జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. చదవండి: లండన్‌లో హైదరాబాద్ వాసి దారుణ హత్య -
మేడ్చల్ జిల్లాలో రాజకీయ సంద‘ఢీ’.. ప్రత్యర్థులెవరు?
సాక్షి, మేడ్చల్ జిల్లా: బరిలో నిలిచేదెవరు? గులాబీ పార్టీ అభ్యర్థులను ఢీకొట్టేదెవరు? అనే చర్చ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఊపందుకుంది. అనూహ్యంగా అధికార బీఆర్ఎస్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీలో నిలిపే వారి పేర్లను ఖరారు చేయటంతో అభివృద్ధి కార్యక్రమాలతో పేరుతో ప్రచార హోరుతో ప్రజలకు వద్దకు వెళ్తున్నారు. ఉప్పల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని కాదని కొత్త వారికి ఇవ్వగా.. మల్కాజిగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లికి టికెట్ ఇచ్చినప్పటికీ, తనయుడికి మెదక్ టికెట్ కేటాయించలేదని అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఇద్దరు సిట్టింగ్‌లు బీఆర్ఎస్లో ఇమడలేక.. బయటకు వెళ్లలేని సంకట పరిస్థితిలో సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. మరో పక్క అధికార పక్షం అభ్యర్థులకు దీటుగా.. విపక్షాలు ఎవరిని రంగంలోకి దింపుతాయనే ఉత్కంఠ అందరిలో ఉంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలేంటి అన్న చర్చ కూడా జోరుగా సాగుతుండగా.. ఆ పారీ్టలకు చెందిన ఆశావహులు మాత్రం పలు రాజకీయ, సామాజిక సమీకరణాల నేపథ్యంలో టికెట్ తమకే లభిస్తుందనే ధీమాతో వివిధ కార్యక్రమాల పేరుతో ప్రజల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కోసం ఇప్పటికే పలువురు దరఖాస్తు చేసుకోగా, అధిష్టానం వడపోత కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును అధిష్టానం ప్రకటించినా.. తనయుడు రోహిత్‌కు మెదక్ టికెట్ కేటాయించలేదన్న అసంతృప్తితో మంత్రి హరీష్‌రావుపై నిప్పులు చెరిగారు. ఈ విషయంలో మైనంపల్లి తీరుపై సీఎం కేసీఆర్ సహా వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రుగా ఉండగా, అధిష్టానం కూడా ఆయనపై వేటుకు రంగం సిద్ధం చేసినట్లు బీఆర్ఎస్లో చర్చ సాగుతోంది. బీఆర్ఎస్లో ఉండలేక.. బయటకు వెళ్లలేని సంకట పరిస్థితిని మైనంపల్లి ఎదుర్కొంటుండగా, అధిష్టానం కూడా మైనంపల్లిపై చర్యలకు సిద్ధపడకుండా మెత్తపడినట్లు ప్రచారం. ఒకవేళ అధిష్టానం మైనంపల్లి హన్మంతరావుపై సీరియస్‌గా వ్యవహరిస్తే.. మల్కాజిగిరి నుంచి మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి లేదా ఎమ్మెల్సీ శంబీపూర్ రాజును బరిలో దింపవచ్చనే చర్చ సాగుతోంది. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం ముగ్గురు నాయకులు దరఖాస్తు చేసుకున్నా పార్టీ జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌కే దక్కుతుందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మరో ఇద్దరు అన్నె వెంకట సత్యనారాయణ, బోనగిరి సురేష్‌యాదవ్ ఉన్నారు. మల్కాజిగిరిలో బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, కొత్తగా పార్టీలో చేరిన ఆకుల రాజేందర్, యువమోర్చా నాయకుడు భానుప్రకాష్ పోటీ పడుతున్నారు. మేడ్చల్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి చామకూర మల్లారెడ్డికి మళ్లీ మేడ్చల్ టికెట్ దక్కడంతో బలమైన పోటీదారుడుగా ప్రచార పర్వంలో ముందువరుసలో ఉన్నారు. గడపగడపకూ కాంగ్రెస్ అనే నినాదంతో పీసీసీ ఉపాధ్యాక్షుడు తోటకూరి వజ్రేష్(జంగయ్య)యాదవ్, అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం వీరితోపాటు రోయ్యపల్లి మల్లేష్‌గౌడ్, పిసరి మహిపాల్‌రెడ్డి, పి.బాలేష్, గువ్వ రవి దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే తొటకూరి వజ్రేష్(జంగయ్య)యాదవ్, రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తే హరివర్ధన్‌రెడ్డికి దక్కవచ్చనే ప్రచారం ఆ పారీ్టలో సాగుతోంది. బీజేపీ నుంచి పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు కొంపెల్లి మోహన్‌రెడ్డి, రూరల్ జిల్లా అధ్యక్షుడు పటోళ్ల విక్రంరెడ్డితో సహా రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షుడు, రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు, ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఉప్పల్ ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని కాదని, బండారి లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్కు అధిష్టానం టికెట్ కేటాయించడంతో కార్యకర్తల సమావేశాల పేరుతో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తానేని తప్పు చేశానో చెప్పకుండా.. టికెట్ నిరాకరించడంపై ఆయన గుర్రుగా ఉన్నారు. అనుచరులు, కార్యకర్తలతో చర్చించి పది రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తానని పేర్కొన్న తీరుపై పార్టీలో తీవ్ర చర్చ సాగుతోంది. అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి మాత్రం ప్రజల మద్దతు పొందేందుకు అనుచరులతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఉప్పల్ టికెట్ కోసం ఆరుగురు నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఎం.పరమేశ్వర్‌రెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, మేకల శివారెడ్డి, పసుల ప్రభాకర్‌రెడ్డి, అమరిశెట్టి నరేందర్ ఉన్నారు. టికెట్ విషయంలో ముగ్గురి మధ్యే పోటీ ఉండగలదని పారీ్టలో ప్రచారం సాగుతోంది. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్ఎస్ఎస్ ప్రభాకర్‌తో పాటు మరో నాయకుడు పద్మారెడ్డి పోటీ పడుతున్నారు. అధిష్టానం మాత్రం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ వైపు మొగ్గు చూపవచ్చనే ప్రచారం పారీ్టలో సాగుతోంది. కూకట్పల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరోసారి కూకట్‌పల్లిలో ప్రచారం నిర్వహిస్తుండగా, కాంగ్రెస్ నుంచి కూకట్పల్లి టికెట్ కోసం 16 మంది నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి దరఖాస్తు చేసుకున్న వారిలో గొట్టిముక్కల వెంగళరావు, సత్యం శ్రీరంగం, గాలివీర రామచంద్రబాలాజీ, పటోళ్ల నాగిరెడ్డి, వెలగపూడి వీవీస్ చౌదరి, మన్నె సతీష్‌కుమార్, ఆశపల్లి విజయచంద్ర, జాఫర్ అలీ, కొండకింది పుప్పారెడ్డి, దండుగుల యాదగిరి, మెడికొండ వెంకటమురళీ కృష్ణ, భక్త వత్సలం, జూలూరి ధనలక్ష్మీగౌడ్, పోట్లూరి శ్రీనివాస్‌రావు, దెరాటి మధుసాగర్, గొట్టిముక్కల పద్మరావు ఉన్నారు. కూకట్‌పల్లిలో బీజేపీ నుంచి అర్బన్ జిల్లా అధ్యక్షుడు పి.హరీష్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు మాధవరం కాంతారావు, కొత్తగా పార్టీలో చేరిన ప్రేమ్‌కుమార్ పోటీ పడుతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. కుత్బుల్లాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకాందగౌడ్‌కు బీఆర్ఎస్ మళ్లీ టికెట్ కేటాయించడంతో.. అభివృద్ధి పనుల పేరుతో ప్రజల వద్దకు వెళ్తుండగా, కాంగ్రెస్ నుంచి టికెట్ కోసం 12 మంది నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. నర్సారెడ్డి భూపతిరెడ్డి, కొలన్ హన్మంతరెడ్డి, కందాడి జ్యోత్సదేవి, సొంటిరెడ్డి పున్నారెడ్డి, ఉసిరిక అప్పిరెడ్డి, మహ్మద్ నిజాముద్దీన్, గుంజ శ్రీనివాస్, బండి సత్యంగౌడ్, దూళిపాక సాంబశివరావు, పోలీసు సుమిత్రారెడ్డి, అహ్మద్ నిజామొద్దీన్, బోనగిరి ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. ఇక్కడ బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, మాజీ ఉపాధ్యక్షుడు ఎస్.మల్లారెడ్డి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. -
మంత్రి హరీష్ రావుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి వార్నింగ్
తిరుమల: తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్ధుల ప్రకటన ముహూర్తానికి ముందే ఆ పార్టీ మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు మంత్రి హరీశ్ రావుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం మరికొద్ది సేపట్లో అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారనగా మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మంత్రి హరీశ్ రావుపై ఫైర్ అయ్యారు. నేను, నా కుమారుడు ఎక్కడ నుండి పోటీ చెయ్యాలో చెప్పడానికి హరీష్‌రావు ఎవరు? ఇందులో ఆయన పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. నేను మల్కాజ్ గిరి నుంచి నా కుమారుడు మెదక్ నుంచి పోటీ చేస్తాము. ఎవ్వరు అడ్డుకుంటారో చూస్తామని సవాల్ చేశారు. ఇంతకాలం మెదక్ అభివృద్ధిని అడ్డుకుంది హరీష్ రావేనని అవసరమైతే సిద్దిపేటలో నా తడాఖా ఏంటో చూప్పించి హరీశ్ రావు అడ్రస్ గల్లంతు చేస్తానని వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేశారు. కేసీఆర్ కుటుంబంలో చాలామందికి టికెట్ ఇచ్చారని మా ఇద్దరికి టికెట్ ఇస్తేనే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ‘నా కుమారుడు మైనంపల్లి రోహిత్ రెండు గోల్డ్ మెడల్స్ సాధించారు. కరోన సమయంలో ప్రణాలకు తగించి చాలా మందికి వైద్య సేవలు అందించారు. తండ్రి గా నా కుమారుడికి నా సపోర్ట్ ఉంటుంది. నా కొడుకుని మెదక్ ఎమ్మెల్యే చేస్తాను. హరీష్‌రావు మెదక్ లో పెత్తనం చలాయిస్తున్నాడు. ఓ డిక్టేటర్లా హారీష్‌రావు ప్రవర్తిస్తా ఉన్నారు. హారీష్‌రావు గతం గుర్తు పెట్టుకో. ఓ టంకు డబ్బాతో, రబ్బరు చొప్పులతో వచ్చిన రోజు చూసాను. నేను హిరోగా ఉన్నా, హరీష్ రావు చాలా చిన్న వాడు....సిద్దిపేట్ అభివృద్ధి అయింది, మెదక్ ఎందుకు అభివృద్ధి కాలేదు అని అడిగినా. హరీష్‌రావు బట్టలు ఇప్పే వరకు నేను వదలను.. ఈసారి నా కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించుకొని హరీష్‌రావు అడ్రస్ లేకుండా చేస్తా. వచ్చే ఎన్నికల్లో సిద్ధిపేటలో పోటి చేస్తా బిడ్డా. హరీష్‌రావుని నిద్రపోనివ్వను. లక్ష కోట్లు హరీష్‌రావు సంపాదించాడు. టంకు డబ్బా,రబ్బరు చెప్పులతో వచ్చిన హారీష్రావ్కి లక్ష కోట్లు ఎక్కడి నుండి వచ్చాయి. మెదక్ లో హారీష్రావ్ పెత్తనం ఏంటి. మల్కాజ్‌గిరిలో నేను పోటీ చేస్తా, మెదక్ లో నా కొడుకు పోటీ చేస్తాడు. అవసరమైతే రాజకీయాలు పక్కనపెట్టి నా కొడుకుని గెలిపించుకొంటాను. నేను టీఆర్ఎస్ పార్టీ, వారు నన్ను వద్దు అనుకొంటే నేను ఏం చేసేను. నాకు ఎమ్ఎల్ఏ టికెట్ ఇచ్చారు. ఇస్తే ఇద్దరికి టికెట్ ఇవ్వమని అడిగా. లేకుంటే ఎవ్వరికి వద్దు అని తేల్చి చెప్పాను’అని మంత్రి హరీష్‌రావుపై మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి. ఇది కూడా చదవండి: హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌కు మంత్రి హరీష్ క్లాస్ -
మల్కాజ్గిరి కిడ్నాప్ కేసు: చంపేస్తామని బెదిరించి 2కోట్లు డిమాండ్
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరి బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. డబ్బు కోసమే బాలుడిని కిడ్నాప్ చేశారు. బాలుడిని కిడ్నాప్ చేసి రూ. 2కోట్లు డిమాండ్ చేయాలనుకున్నారు. ఈ కేసులో ఓ మైనర్ బాలుడి హస్తం కూడా ఉందని డీసీపీ జానకి స్పష్టం చేశారు. కాగా, డీసీపీ జానకి ఈ కేసు వివరాలను శనివారం మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. ఈ నెల 15న బాలుడి అదృశ్యంపై కేసు నమోదైంది. కాలనీలో ఆడుకునేందుకు వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి రాలేదు. వాట్సాప్ ద్వారా బాలుడి పేరెంట్స్‌కు కాల్ వచ్చింది. పోలీసు కేసు వెనక్కి తీసుకోవాలని కిడ్నాపర్లు బెదిరించారు. ఒకే కాలనీలో ఉండేవాళ్లే బాలుడిని కిడ్నాప్ చేశారు. రవి, శివ నెలరోజులుగా బాలుడి కిడ్నాప్‌నకు ప్లాన్ చేశారు. డబ్బు కోసమే బాలుడిని కిడ్నాప్ చేశారు. బాలుడిని కిడ్నాప్ చేసి రూ.2కోట్లు డిమాండ్ చేయాలనుకున్నారు. ఈ కేసులో ఓ మైనర్ బాలుడి హస్తం కూడా ఉంది. 8 బృందాలతో 36 గంటల్లోనే కేసును ఛేదించాం. జనగామ జిల్లా రామన్నగూడెం వద్ద కిడ్నాపర్లను పట్టుకున్నాం. ప్రధాని నిందితుడు రవి సహా ముగ్గురిని అరెస్ట్ చేశాం. ఈ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్, సీసీ కెమెరా ఎవిడెన్స్ కీలకం అయింది. నిందితులపై ఐపీసీ సెక్షన్ 366 కిడ్నాప్ కేస్ నమోదు చేసినట్టు తెలిపారు. మరోవైపు.. బాబు తండ్రి శ్రీనివాస్ కిడ్నాప్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. కిడ్నాపర్ల నుంచి మా బాబును కాపాడిన పోలీసులకు ధన్యవాదాలు. కిడ్నాపర్లు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. పోలీసులకు చెబితే బాబును చంపేస్తామని బెదిరించారు. భారీగా డబ్బు డిమాండ్ చేశారు. మా పక్కింటి వాళ్లే ఇలా చేస్తారని అనుకోలేదు. 1989 నుంచి హైదరాబాద్‌లో ఉన్నాను. నాకు, నా కుటుంబానికి శత్రవులు ఎవరూ లేరు అని తెలిపారు. ఇది కూడా చదవండి: నిఘా ఉన్నా కూడా.. కక్కుర్తిపడి ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు -
‘జలకన్య కన్ను’ పేరుతో బురిడీ
సాక్షి, హైదరాబాద్: జలకన్య కన్నుకు అతీంద్రియ శక్తులు ఉంటాయని, దీంతో మీకు అంతా శుభం జరుగుతుందని, కోరుకున్న పని ఇట్లే జరిగిపోతుందని కల్లబొల్లి మాటలు చెప్పి అందినకాడికి దండుకోవాలని భావించిన నిందితుల ఆటకట్టించారు మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు. వరంగల్‌కు చెందిన చందు, యాప్రాల్‌కు చెందిన సాంబశివ ఇద్దరు స్నేహితులు. తీర్థయాత్రల నిమిత్తం షిరిడీకి వెళ్లిన ఇరువురు.. తిరుగు ప్రయాణంలో స్థానికంగా దొరికే రంగు రాయిని కొనుగోలు చేశారు. హైదరాబాద్‌కు తిరిగొచ్చాక ఆ రంగురాయిలో బ్యాటరీ సహాయంతో చిన్నపాటి లైట్‌ను అమర్చారు. లైట్ అమర్చిన రంగురాయికి నీళ్లు తాకగానే దాని కాంతి రెట్టింపు అవుతుంది. దీన్ని గమనించిన చందు, శివలకు దుర్బుద్ధి పుట్టింది. రంగురాయికి శక్తులు ఉన్నాయని నమ్మించి అమాయకులకు విక్రయించాలని నిర్ణయించుకున్నారు. దీంతో కాప్రాలో పలువురు వ్యాపారులు, స్థానికులకు చూపించి..ఈ రంగురాయి సాగరకన్య నోటిలో నుంచి తీసిన జలకాంతం అని మాయమాటలు చెప్పారు. దీన్ని ఇంట్లో పెట్టుకుంటే శుభం జరుగుతుందని నమ్మించారు. రూ.2 కోట్లకు విక్రయించేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన ఇన్స్పెక్టర్ రాములు బృందం ఇద్దరు నిందితులు చందు, సాంబశివలను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. (చదవండి: సమరానికి సై.. ఫార్ములా–ఈ పోటీలకు రేసర్లు రెడీ.. ) -
గుడికి వెళ్లొచ్చే సరికి కొడుకు మాయం.. అదృశ్యమైన గంటల్లోనే..
సాక్షి, హైదరాబాద్: అదృశ్యమైన బాలుడు కొన్ని గంటల్లో శవమై తేలిన ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ జగదీశ్వర్‌రావు వివరాల ప్రకారం..లాల్‌వాణినగర్‌కు చెందిన యాతం మహేష్‌యాదవ్ కుమారుడు యువన్ (9) చిన్నప్పటి నుంచి మాటలు రాదు. ఈ నెల 2న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తల్లితండ్రులు గుడికి వెళ్లి వచ్చేసరికి యువన్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అర్ధరాత్రి వరకు గాలించినా ఫలితం లేకపోయింది. సీసీ కెమెరాలు పరిశీలిస్తే.. ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్లు రికార్డయింది. లాల్వాణీనగర్ ప్రధాన రహదారి మరో వైపు ఉన్న సీసీ కెమరా రికార్డులు పరిశీలిస్తే యువన్ అటు వైపు వచ్చినట్లుగా కనిపించలేదు. అనుమానం వచ్చిన పోలీసులు బండచెరువులో ప్రమాదవశాత్తు పడిపోయాడా అన్న కోణంలో వెతకడం ప్రారంభించారు. గుర్రపు డెక్కతీసే యంత్రం పై నుంచి గాలిస్తుండగా చెరువు చివర కాలిన శవాన్ని గుర్తించారు. ఒంటి మీద ఉన్న బట్టలు ఆదారంగా యువన్‌దే మృతదేహంగా నిర్ధారించారు. అనుమానాలెన్నో.. బండచెరువులో చెత్త వేయకుండా కంచె ఏర్పాటు చేశారు. యువన్ మృతదేహం దొరికిన ప్రాంతంలో కంచె తొలగించి ఉంది. దీనిపై ఆరా తీయగా చెరువులో పందులు పెంచుకునే వారు వాటికి ఆహారం వేయడానికి కంచె తొలగించారని పారిశుద్ధ్య సిబ్బంది చెబుతున్నారు. ఘటనా జరిగిన స్థలానికి ప్రధాన రహదారి కొద్దిదూరంలోనే ఉంది. కాలిపోయిన స్థితిలో మృతదేహం లభ్యమైంది.గస్తీ సిబ్బంది అప్రమత్తంగా ఉండివుంటే ఈ సంఘటనను గుర్తించి ఉండేవారని స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ కొడుకు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపించారు. ఘటనా స్థలాన్ని డీసీపీ రక్షితామూర్తి, ఏసీపీ నర్సింహారెడ్డి పరిశీలించారు. జాగిలం కూడా అక్కడక్కడే తిరిగింది. -
గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ కుంభకోణం?
సాక్షి, హైదరాబాద్: ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ‘అమ్మో ఒకటో తారీఖు’ సినిమా గుర్తుందా? అందులో ఊరి నుంచి వచ్చిన బ్రహ్మానందంను నమ్మించి చార్మినార్‌ను తనికెళ్ల భరిణి విక్రయిస్తాడు. ఈ ఘటన కూడా ఇంచుమించు అలాంటిదే. కాకపోతే గ్రేటర్ హైదరాబాద్‌లో ఇంటి నిర్మాణం చేసుకున్న వారు ఆస్తి పన్ను చెల్లించడానికి ప్రవేశపెట్టిన స్వీయ మదింపు (సెల్ప్ అసెస్మెంట్)లో ఉన్న లోపాలను, అధికారుల పర్యవేక్షణ వైఫల్యాన్ని బయటపెట్టడానికి మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ ఏకంగా మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయానికి ఆస్తి పన్ను స్వయంగా మదింపు చేసుకొని అసెస్మెంట్ నంబర్ పొందారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇంటి నిర్మాణం చేసుకున్న యజమాని ఇంటి పన్ను చెల్లించడానికి ముందు ఆస్తి పన్ను మదింపు చేసి ఇంటి నంబరు కేటాయిస్తారు. ఈ విధానంలో అవినీతి ఎక్కువ కావడంతో స్వీయ మదింపు విధానాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. దాని ద్వారా ఇంటి యజమానే అన్ని వివరాలు పూర్తి చేసి ఆస్తి పన్ను మదింపు చేసుకోవచ్చు. ఈ విధానంలో కూడా లోపాలుండడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడడమే కాకుండా అక్రమార్కులకు వరంగా మారింది. బయటపెట్టింది ఇలా.. మల్కాజిగిరి కార్పొరేటర్ గీతానగర్‌లో ఉన్న సర్కిల్ కార్యాలయం భవనాన్ని యాభై గజాలుగా చూపిస్తూ 194 రూపాయలు స్వీయ మదింపు ద్వారా ఆస్తి పన్ను చెల్లించారు. ఆస్తి పన్ను చెల్లించగానే పీటీఐ నంబర్ 1280210792 జనరేట్ అయింది. ఈ విధానంలో ఉన్న లోపాలను అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులకు వరంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల తీరు బాధ్యతారాహిత్యం ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వీయ మదింపు విధానం పూర్తిగా అక్రమార్కులకు వరంగా మారింది. నకిలీ పత్రాలు సృష్టించి ఆస్తిని కాజేయడానికి ఈ విధానాన్ని ఉపయోగించుకుంటున్నారు. నగరంలోని అన్ని సర్కిళ్లలో ప్రభుత్వ భూములు కొల్లగొట్టడంతో కోట్లాది రూపాయల మేర ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది. ఈ విధానంపై రెవిన్యూ విభాగం అధికారుల తీరు అధ్వానంగా ఉంది. మల్కాజిగిరిలో ఏఎమ్‌సీలను అడిగితే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఈ విధానం ద్వారా జరిగిన అన్ని ఆస్తి మదింపు (అసెస్మెంట్ల)పై కమిటీ వేసి విచారణ జరిపించాలి. బాధ్యులను కఠినంగా శిక్షించాలి. – శ్రవణ్, కార్పొరేటర్ -
మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి ఇంట్లో BRS ఎమ్మెల్యేల భేటీ
-
అప్పు ఇచ్చిన మహిళ పట్ల దురుసు ప్రవర్తన
సాక్షి, హైదరాబాద్: అప్పిచ్చిన మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి రెండేళ్ల జైలుశిక్ష విధించిన ఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మౌలాలికి చెందిన తోట ప్రేమ్‌కుమార్ (43) 2014లో స్థానికంగా ఉండే ఓ మహిళ వద్ద రూ. 15 లక్షలను అప్పుగా తీసుకుని ఏడాది తర్వాత ఇస్తానన్నారు. ఏడాదైనా డబ్బులు ఇవ్వకపోవడంతో పాటు సదరు మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు న్యాయస్థానంలో ఆధారాలు సమర్పించడంతో విచారణ చేసిన న్యాయస్థానం సోమవారం నిందితుడికి రెండేళ్ల జైలుశిక్ష రూ. 10 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. -
‘నాకు, నా భర్తకు ఎమ్మెల్యే మైనంపల్లి నుంచి ప్రాణహాని ఉంది’
సాక్షి, హైదరాబాద్: తనకు, తన భర్తకు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నుంచి ప్రాణహాని ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డికి బీజేపీ మౌలాలి కార్పొరేటర్ సునీతాశేఖర్ యాదవ్ ఫిర్యాదు చేశారు. ‘నేను కార్పొరేటర్‌గా గెలిచినప్పటి నుంచి మాపై దాడులకు పాల్పడుతున్నారు. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలకు నాకు సమాచారం ఇవ్వ కుండా ఓడిపోయిన కార్పొరేటర్ భర్తతో ఎమ్మెల్యే ప్రారంభోత్సవాలు చేయిస్తున్నారు. మున్సి పల్ అధికారులు కూడా మాకు సమాచారం ఇవ్వడం లేదు’ అని ఆరోపించారు. తన క్యారెక్టర్‌పై నిందలు మోపుతూ, ఎమ్మెల్యే అనుచరులతో, ఆడవాళ్లతో అసభ్యంగా తిట్టిస్తూ వీడియోలు పెట్టి సోషల్‌మీడియాలో వైరల్ చేయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను తిట్టిన మహిళలపై విచారణ చేపట్టి ఎమ్మెల్యే హనుమంతరావు, ఆయన అనుచ రులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరా రు. మల్కాజ్గిరి పోలీస్ వ్యవస్థపై తమకు నమ్మకం లేదని అందువల్లే సాటి మహిళగా తనకు న్యాయం చేస్తారని మహిళా కమిషన్‌ను ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి, ఇతర నేతలతో కలిసి సునీతా శేఖర్ శనివారం వినతిపత్రం అందించారు. దీంతోపాటు తన బెదిరింపులకు సంబంధించిన వీడియోలతో కూడిన పెన్‌డ్రైవ్‌ను కూడా ఇచ్చారు. గతేడా ది ఆగస్టు 15న తన సహచర కార్పొరేటర్ శ్రవణ్‌పై ఎమ్మెల్యే, అనుచరులు భౌతికదాడు లకు పాల్పడిన ఘటనలో తాను ప్రత్యక్ష సాక్షినని సునీతాశేఖర్ పేర్కొన్నారు. చదవండి: తెలంగాణ: ఆది, సోమవారాల్లో పలుచోట్ల వర్షాలు -
మల్కాజిగిరిలో కలకలం.. తల్లి మృతదేహంతో ఇంట్లో మూడురోజులుగా..
సాక్షి, హైదరాబాద్: మల్కాజిగిరిలో దారుణం చోటుచేసుకుంది. విష్ణుపురి కాలనీలోని మైత్రి నివాస్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్‌లో కుళ్లిపోయిన స్థితిలో పడి ఉన్న ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఫ్లాట్ నుండి దుర్వాసన రావడంతో అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: రోజూ నలుగురు మగాళ్లు మిస్!.. ఎన్నెన్నో కారణాలు తల్లి మృతదేహంతో పాటు ముడు రోజులుగా కుమారుడు గడపడం కలకలం రేపింది. కుమారుడు సాయికృష్ణతో కలిసి తల్లి విజయ నివసిస్తుంది. సాయి కృష్ణ మానసిక పరిస్థితి సరిగ్గా ఉండదని తరచూ తల్లి, కొడుకులు గొడవ పడేవారని స్థానికులు చెబుతున్నారు. కొడుకు మానసిక పరిస్థితి వల్ల కొడుకే తల్లిని హత్య చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పలు కోణల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
మల్కాజ్గిరి మహిళ హత్య కేసులో ట్విస్ట్.. గర్భగుడిలోనే చంపేశాడు
సాక్షి, మల్కాజిగిరి:అదృశ్యమై..ఆపై శవంగా మారిన ఉమాదేవి హత్య కేసులో ఆలయ పూజారితో పాటు, నగల దుకాణం యజమానిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. దేవుడి దర్శనానికి వచ్చిన ఆమెను గుడి పూజారి గర్భగుడిలో రాడ్డుతో తలపై కొట్టి హత్య చేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని అక్కడే ఉన్న ఓ ప్లాస్టిక్‌డ్రమ్ములో కుక్కేశాడు. శుక్రవారం పోలీసులు తెలిపిన మేరకు.. విష్ణుపురి ఎక్స్టెన్షన్ ప్రాంతానికి చెందిన ఉమాదేవి (56) ఈ నెల 18న ఇంటి సమీపంలోని స్వయంభూ సిద్ధి వినాయక దేవాలయానికి రోజూలాగానే వెళ్లింది. అయితే తిరిగి రాలేదు. అదే రోజు ఆమె భర్త మూర్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మూడు రోజుల తర్వాత అదే ఆలయం వెనుక ఉన్న నిర్జన ప్రదేశంలో ఉమాదేవి మృతదేహాన్ని గుర్తించారు. స్థానికంగా ఉన్న కాలనీవాసులు, కుటుంబసభ్యుల నుంచి సేకరించిన సమాచారంతో ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న అనుముల మురళీకృష్ణ (42) పై దృష్టి సారించారు. సాంకేతిక ఆధారాలతో ఈ నెల 22న మురళీకృష్ణతో పాటు విష్ణుపురికాలనీలో మా భవానీ జువెలర్స్ దుకాణం యజమాని జోషి నంద కిషోర్(45)ను అదుపులోకి తీసుకొని విచారించడంతో ఉమాదేవి హత్య బయటపడింది. మురళీకృష్ణ నుంచి రెండు బంగారు గాజులు, లక్ష నగదు, నగల దుకాణ యజమాని ఇచ్చిన కెడ్రిట్ కార్డ్స్, జోషి నం చదవండి: వరంగల్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. చున్నీతో చేతులు కట్టేసి.. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే... పూజారిగా పనిచేస్తున్న మురళీకష్ణ కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇటీవల తరచూ నగలు ధరించి వస్తున్న ఉమాదేవిని మురళీకృష్ణ గమనించాడు. ఈ నెల 18న గర్భగుడిలోనే ఆమె తలమీద రాడ్‌తో బలంగా కొట్టి హత్య చేసి అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా నీళ్ల డ్రమ్ములో శవాన్ని దాచి ఉంచాడని పోలీసులు తెలిపారు. మరుసటి రోజు సంకటహరచతుర్థ్ది ఉండడంతో ఎవ్వరికీ అనుమానం రాకుండా హోమం నిర్వహించాడని నిఘా ఉండడంతో రెండు రోజుల తర్వాత 21 వ తేదీ మృతదేహాన్ని ఆలయం వెనుక పడేశాడని పోలీసులు తెలిపారు. -
యాప్స్‌తోనే లక్ష్మీపతి నెట్వర్క్
సాక్షి, హైదరాబాద్: పోలీసు పుత్రుడై ఉండి.. గంజాయి, హష్ ఆయిల్ దందాతో ‘హష్ నగేశ్’ నెట్‌వర్క్‌లో కీలకంగా మారిన వీరవల్లి లక్ష్మీపతి దందా గుట్టును పోలీసులు రట్టుచేశారు. 2020లో మల్కాజ్గిరి స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) పోలీసులకు చిక్కిన లక్ష్మీపతి.. తర్వాత ‘వర్కింగ్ స్టైల్’ పూర్తిగా మార్చేశాడని.. పకడ్బందీగా హష్ ఆయిల్ దందా నడిపాడని ‘హెచ్–న్యూ’ అధికారులు చెప్తున్నారు. పేరు కూడా తెలియకుండా..: లక్ష్మీపతి మొదట్లో వాట్సాప్ ద్వారా ఆర్డర్లు తీసుకుని గంజాయి సరఫరా చేసేవాడు. మల్కాజ్గిరి పోలీసులకు ఇతడి అనుచరులు చిక్కినప్పుడు వారి వాట్సాప్ డేటా ఆధారంగానే లక్ష్మీపతిని అరెస్టు చేశారు. దాంతో లక్ష్మీపతి తన పంథా మార్చేశాడు. మకాంను కూడా మణికొండ నుంచి హఫీజ్ పేటకు షిఫ్ట్ చేశాడు. ఈసారి ఫేస్బుక్ మెసెంజర్‌తోపాటు స్నాప్ చాట్, టెలిగ్రాం యాప్స్ వాడటం మొదలెట్టాడు. వాటిలోనూ వివరాలన్నీ హైడ్ చేసి.. కేవలం ‘ఎల్పీ’ అనే పేరు మాత్రమే కనిపించేలా చేసేవాడు. ఎక్కడా ఫొటోలేవీ బయటపడనీయలేదు. కస్టమర్లతోనే బుక్ చేయించి... హైదరాబాద్‌లో అనేక యాప్స్ వివిధ వస్తువుల పికప్–డెలివరీ సేవలు అందిస్తుండటంతో.. లక్ష్మీపతి వాటిని తన దందా కోసం వాడుకున్నాడు. సోషల్ మీడి యా ద్వారా కస్టమర్ల నుంచి ఆర్డర్ తీసుకుని, డబ్బును ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయించుకునేవాడు. ‘సరుకు’ తీసుకునే వారితోనే పికప్–డెలివరీ సర్వీసు బుక్ చేయించేవాడు. హఫీజ్‌పేటలోని ఓ ల్యాండ్‌మార్క్‌ను పికప్‌గా.. వారుండే లొకేషన్‌ను డెలివరీ ప్రాంతంగా బుక్ చేయించి.. సరుకును పంపిస్తాడు. ఇంత జా గ్రత్తగా ఉండటంతో అతడిని గుర్తించి, పట్టుకోవడానికి హెచ్–న్యూ అధికారులు శ్రమించాల్సి వచ్చింది. (చదవండి: లగేజ్ బ్యాగేజ్‌లలో గంజాయి ప్యాకెట్లు..నలుగురు అరెస్టు) -
ప్రహారీకి అడ్డుగా ఉందని పక్కా ప్లాన్! జీహెచ్ఎంసీ పబ్లిక్ టాయిలెట్ కొట్టేసి..
సాక్షి, మల్కాజిగిరి: మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజల ఉపయోగార్థం జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్ మాయమైంది. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ నిందితుడిని అరెస్టు చేయగా, టాయిలెట్ చోరీ వెనుక ఉన్న అసలు కథ బయటకు వచ్చింది. రూ.45 వేలకు విక్రయం ఆనంద్‌బాగ్ చౌరస్తాలో కొన్నాళ్ల క్రితం ఇనుముతో చేసిన పబ్లిక్ టాయిలెట్ ఏర్పాటు చేశారు. అదే ప్రాంతంలో ఓ కన్స్ట్రక్షన్స్ సంస్థ భారీ మల్టీప్లెక్స్ నిర్మిస్తోంది. దీని ప్రహరీ నిర్మాణానికి సదరు టాయిలెట్ అడ్డుగా మారింది. ఈ నేపథ్యంలోనే దాన్ని తొలగించాలని కోరుతూ సదరు కన్స్ట్రక్షన్ కంపెనీ పలుమార్లు జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకుంది. ప్రజల కోసం ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్‌ను తొలగించాలంటే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉండాలని వాళ్లు తేల్చి చెప్పారు. చదవండి: డ్రెస్ కొనుక్కుంటానని చెప్పి బయటకు వెళ్లి.. నిర్మాణ సంస్థ సూపర్వైజర్ బిక్షపతికి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసే అరుణ్‌కుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పబ్లిక్ టాయిలెట్ తొలగించే పని తాను చేస్తానంటూ చెప్పడంతో బిక్షపతి అంగీకరించాడు. టాటా ఏస్ వాహనం డ్రైవర్ చేస్తూ ఫ్లెక్సీ హోర్డింగ్స్ పని చేసే జోగయ్యకు ఆ పని అప్పగించాడు. ఈ నెల 16 ఆ టాయిలెట్ తీసుకెళ్లి ముషీరాబాద్‌లో రూ.45 వేలకు విక్రయించాడు. ఫిర్యాదు అందుకున్న జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ జి.రాజు ఆదేశాల మేరకు సానిటరీ సూపర్వైజర్ మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 17న కేసు నమోదైంది. ప్రాథమిక ఆధారాలు, సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా పబ్లిక్ టాయిలెట్ తరలించడానికి వినియోగించిన వాహనాన్ని గుర్తించి జోగయ్యను అదుపులోకి తీసుకుని విచారించారు. టాయిలెట్ తొలగింపునకు సంబంధించి బిక్షపతి, అరుణ్‌కుమార్ మధ్య ఒప్పందం కుదిరిందని, అరుణ్ చెప్పడంతోనే తాను దాన్ని తీసుకుపోయానని విషయం చెప్పడంతో జోగయ్యను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న బిక్షపతి, అరుణ్ కోసం గాలిస్తున్నారు. -
పాపం పసివాడు.. కుమారుడితో సహా భవనంపై నుంచి దూకిన మహిళ
సాక్షి, చిలకలగూడ: వరకట్న వేధింపులు భరించలేక గృహిణి ఏడాది వయసున్న తన కుమారునితో సహా భవనం పైనుంచి దూకింది. ఈ ఘటనలో బాలుడు మృతి చెందాడు. నార్త్‌జోన్ డీసీపీ చందన దీప్తి, గోపాలపురం ఏసీపీ సుధీర్, చిలకలగూడ డీఐ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరి సఫిల్‌గూడకు చెందిన దివ్యతేజకు, మెట్టుగూడకు చెందిన తప్పెట మహేందర్‌కు 2018 సెప్టెంబర్ 6న వివాహమైంది. ఈ దంపతులకు గతేడాది మార్చి 3న రిత్విక్ జన్మించాడు. ఈ క్రమంలో మహేందర్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం దివ్యతేజను వేధిస్తున్నారు. పుట్టింటి నుంచి డబ్బులు తేవాలని ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఆమె సోమవారం ఉదయం తన కుమారునితో కలిసి ఎదురుగా ఉన్న నాలుగు అంతస్తుల భవనంపైకి చేరుకుంది. శానిటైజర్‌ను కుమారునికి తాగించి, తానూ తాగింది. కుమారుని చేతి మణికట్టు, మెడపై కోసి తానూ కోసుకుంది. రక్తస్రావం అవుతుండగా చిన్నారిని పట్టుకుని భవనం పైనుంచి కిందికి దూకింది. చదవండి: హైదరాబాద్: ఫలించిన యాభై ఏళ్ల కల! రోడ్డుపై పడిన చిన్నారి రిత్విక్ అక్కడికక్కడే మృతి చెందాడు. పార్కింగ్ చేసిన వాహనంపై పడిన దివ్యతేజకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలి తల్లిదండ్రులు లక్ష్మీదాస్, తరుణ లత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మహేందర్‌తో పాటు అతని కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని చిలకలగూడ డీఐ నాగేశ్వరరావు తెలిపారు. చదవండి: కోడలిపై కోపం.. మూడు రోజుల తర్వాత ఏం జరిగిందంటే? -
మల్కాజిగిరి: ఇంజక్షన్ వికటించి బాలిక మృతి?
సాక్షి, మల్కాజిగిరి: ఇంజక్షన్ వికటించి బాలిక మృతి చెందిందని కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. కుటుంబీకులు, పోలీసుల వివరాల ప్రకారం.. ఓల్డ్ మల్కాజిగిరికి చెందిన ప్రసాద్ కుమార్తె చిన్నారి (4)కి వాంతులు కావడంతో సోమవారం మల్కాజిగిరిలోని ఓ మెడికల్ షాపులో క్లినిక్ నిర్వహిస్తున్న మధుసూదన్ వద్దకు తీసుకొచ్చారు. వాంతులు తగ్గకపోవడంతో సాయంత్రం తీసుకెళ్తే చిన్నారికి ఇంజక్షన్ ఇచ్చిన కాసేపటికే తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. చదవండి: వివాహేతర సంబంధం: దూరంగా పెడుతుందనే కోపంతో.. గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు పోస్ట్‌మార్టం అనంతరం మంగళవారం మెడికల్ షాపు వద్ద ధర్నాకు దిగారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ తెలిపారు. డాక్టర్ మధుసూదన్ పరారీలో ఉన్నాడు. చదవండి: బంజారాహిల్స్: బయటకు వెళ్లిన ఇద్దరు తిరిగి రాలేదు -
యాక్సిడెంటల్ డెత్: సుమేధ ఘటనపై కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్
సాక్షి, నేరేడ్మెట్: వినాయకనగర్ డివిజన్ దీనదయాళ్నగర్ కాలనీలో గత ఏడాది ఓపెన్ నాలాలో పడి మృతి చెందిన 12 ఏళ్ల బాలిక సుమేధ కేసులో ఆమె తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. కేసుపై సోమవారం మల్కాజిగిరి కోర్టులో బాలిక తల్లి సుకన్య కపూరియా ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఘటనపై పోలీసులు ‘యాక్సిడెంటల్ డెత్’గా నివేదిక ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తిరిగి విచారణ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుమేధ తల్లి కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్‌ను వేశారు. చదవండి: జోగులాంబ గద్వాల్లో ఎస్సై వీరంగం.. వీడియో వైరల్ పిటిషన్‌పై విచారణను వచ్చే నెల 20కి కోర్టు వాయిదా వేసింది. ఈ ఘటనపై మల్కాజిగిరి డీఈఈ, ఏఈఈతోపాటు మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, అప్పటి మేయర్ బొంతురాంమోహన్ తదితరులపై నేరేడ్మెట్ ఠాణాలో అప్పట్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. చదవండి: ఎస్ఐ కోచింగ్ సెంటర్లో పరిచయం.. వంచించి, అబార్షన్ ట్యాబ్లెట్లు వేసి.. -
మల్కాజిగిరి వివాదాన్ని సీరియస్ గా తీసుకున్న జాతీయ ఏస్సి కమిషన్
-
జాతీయ జెండా సాక్షిగా.. టీఆర్ఎస్, బీజేపీ నాయకుల ఘర్షణ
సాక్షి, మల్కాజిగిరి( హైదరాబాద్): మల్కాజిగిరిలో కొంతకాలంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య నడుస్తున్న రాజకీయ పరిస్థితులు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జెండా సాక్షిగా ఘర్షణకు దారితీసి మల్కాజిగిరిలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. వివరాలు.. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సర్కిల్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణకు వచ్చిన సందర్భంగా మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ మధ్య జరిగిన వాదనతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జెండా ఆవిష్కరణకు ముందే ఇరువర్గాల నాయకులు గొడవకు దిగడంతో తోపులాట జరిగి గందరగోళ పరిస్థితి తలెత్తింది. ఈ సందర్భంగా గాయాలైన కార్పొరేటర్ శ్రవణ్ తన అనుచరులు, పార్టీ నాయకులతో కలిసి మల్కాజిగిరి చౌరస్తా వద్దకు చేరుకొని ధర్నా చేపట్టడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే, నాయకులు, కార్యకర్తలు కూడా బైఠాయించడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. పోలీసులు రెండు వర్గాలను అక్కడి నుంచి పంపించివేశారు. ఈ ఘటనపై పరస్పరం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డాక్టర్ చీటీ లేకుండా మత్తు ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లు..
సాక్షి, మల్కాజిగిరి(హైదరాబాద్): డాక్టర్ ప్రిస్క్రిఫ్షన్ లేకుండా మత్తు ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ నవీన్‌కుమార్ తెలిపిన వివరాలు.. మౌలాలి హెచ్‌బీ కాలనీకి చెందిన భూపతి వెంకటేష్ (32) మల్కాజిగిరిలోని మెడ్‌ప్లస్ స్టోర్ ఇంఛార్జిగా పనిచేస్తున్నాడు. గత కొంత కాలంగా డాక్టర్ల చీటీలు లేకుండానే మత్తు ఇంజక్షన్లు, ట్యాబెట్లను కాలేజీ విద్యార్థులతో పాటు రైల్వే స్టేషన్లలో తిరిగే మైనర్లకు విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారంతో శుక్రవారం రాత్రి ఎస్ఓటీ పోలీసులు, డ్రగ్ కంట్రోల్ విభాగం అధికారులు దుకాణంపై దాడి చేశారు. అతని వద్ద నుంచి 785 ఇంజక్షన్లు, 585 ట్యాబ్లెట్స్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని మల్కాజిగిరి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి శనివారం వెంకటేష్‌ను రిమాండ్‌కు తరలించామని మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ జగదీశ్వర్‌రావు తెలిపారు. -
చిన్నారిని చదివిస్తా.. పెళ్లిచేస్తా: ఎమ్మెల్యే
సాక్షి, జగద్గిరిగుట్ట: తల్లిదండ్రులను కోల్పోయిన టీఆర్ఎస్ కార్యకర్తల పిల్లల పెళ్లిళ్లు అయ్యేంత వరకు ఆసరాగా ఉంటామని మైనంపల్లి హన్మంతరావు అన్నారు. జగద్గిరిగుట్టకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త వెంకటరమణ కుమార్తె వరకట్న వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు 6 సంవత్సరాల కుమార్తె ఉండటంతో చిన్నారి ఆలనా పాలనా చూసేందుకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపలి హన్మంతరావు ముందుకొచ్చారు. ఆర్థికంగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం వెంకటరమణ కరోనాతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మైనంపల్లి హన్మంతరావు స్పందించారు. ఆదివారం జగద్గిరిగుట్టకు చేరుకున్న ఆయన మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ తరఫున రూ.5 లక్షల చెక్కును స్థానిక ఎమ్మెల్యే వివేకానంద్‌తో కలిసి బాధిత కుటుంబానికి అందజేశారు. చిన్నారి చదువుతో పాటు పెళ్లి అయ్యేంత వరకు పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ, రావుల శేషగిరి, టీఆర్ఎస్ నాయకులు జైహింద్, రాజేష్, సయ్యద్ రషీద్, ఎర్ర యాకయ్య, సాజిద్, మారయ్య, రుద్ర అశోక్, ఇతర కార్పొరేటర్లు తదితరులు ఉన్నారు. -
యువకుడితో ప్రేమ.. పెళ్లి చేసుకుంటానని వెళ్లి..
సాక్షి, మల్కాజిగిరి: యువతి అదృశ్యమైన ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్జాలగూడకు చెందిన కాశీనాథ్ కూతురు అనూష(27) ఓ యువకుడిని ప్రేమించింది. తల్లిదండ్రులకు చెప్పగా వారి వివాహానికి అంగీకరించారు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటామని అనూష చెప్పడంతో హిందూ సాంప్రదాయం ప్రకారం చేసుకోవాలని తల్లిదండ్రులు కోరారు. రిజిస్టర్ వివాహం చేసుకోవడానికి ఈ నెల 17న ఇంటి నుంచి వెళ్లిన అనూష తిరిగి రాలేదు. ఆమె సెల్‌ఫోన్ స్విచ్ఛాప్ వస్తుండటంతో ఈ నెల 20 వ తేదీ రాత్రి కాశీనాథ్ మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో నవవధువు మృతి ఉప్పల్: అనుమానాస్పద స్థితిలో నవవధువు మృతి చెందిన ఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. రామంతాపూర్ కేసీఆర్‌నగర్‌కు చెందిన నాగరాజు గాంధీ ఆస్పత్రిలో వార్డు బాయ్‌గా పని చేస్తాడు. ఇతని భార్య సౌజన్య(26) సోమవారం ఉదయం మంచం మీద అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో మృతురాలి సోదరుడు లింగ స్వామి ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం నాంపల్లికి చెందిన వారు. 22 రోజుల క్రితమె పెళ్లి జరిగినట్లు మృతురాలి సోదరుడు తెలిపారు. చదవండి: నాంపల్లిలో బర్త్‌డే వేడుకపై ఆకతాయిల దాడి ఇన్‌స్టా పరిచయం.. ప్రేమ అంగీకరించలేదని ప్రియుడి ఆత్మహత్య -
రైల్వే ఉద్యోగి దారుణహత్య
మల్కాజిగిరి: రైల్వే ఉద్యోగి దారుణహత్యకు గురైన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం...న్యూ సంతోష్‌రెడ్డినగర్ కాలనీకి చెందిన మద్ది మహేశ్వరి కుమారుడు మద్ది విజయ్‌కుమార్(30) రైల్వే లోకోషెడ్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఆరేళ్లక్రితం వైజాగ్‌కు చెందిన భవ్యతో వివాహం జరగ్గా, పీవీఎన్‌కాలనీలో నివాసముంటున్నాడు. వారంరోజుల క్రితం తల్లి మహేశ్వరికి కరోనా సోకింది. భార్యను పుట్టింటికి పంపి తల్లిని రైల్వే ఆస్పత్రిలో చేర్పించాడు. రాత్రి వేళ ఆస్పత్రికి వెళ్లి ఉదయం సంతోష్‌రెడ్డినగర్‌లోని ఇంటికి వచ్చేవాడు. శనివారం ఉదయం వైజాగ్‌లో ఉంటున్న సోదరి ప్రేమలతతో విజయ్‌కుమార్ మాట్లాడి తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత ప్రేమలత పీవీఎన్‌కాలనీలో ఉంటున్న మేనత్త శారదకు ఫోన్ చేసి తమ్ముడు ఏడుస్తున్నాడని, ఇంటికి వెళ్లి చూడమని చెప్పింది. ఆమె అక్కడకు వెళ్లేసరికి ఇంటి ప్రధాన ద్వారం గడియ పెట్టి ఉండడంతో లోనికి వెళ్లి చూసింది. బెడ్రూమ్లో రక్తపుమడుగులో పడిఉన్న విజయ్‌కుమార్ చేసి కేకలు వేసింది. ఇరుగుపొరుగువారు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలిని ఏసీపీ శ్యామ్ ప్రసాద్‌రావు, క్లూస్‌టీం బృందం పరిశీలించింది. కొబ్బరి బొండాలు నరికే కత్తిని హత్యకు ఉపయోగించడం, మెడపై బలమైన వేటు వేయడంలాంటి కోణాల్లో దర్యాప్తు చేసుకున్న పోలీసులు ఇది తెలిసినవారే చేసిన పనిగా అనుమానిస్తున్నారు. చదవండి: భార్యను చంపి.. ఆపై సెల్ఫీ తీసుకుని.. -
మూడు పొరల మాస్కులు ఉచితంగా ఇస్తున్నా
కష్టాలు అడ్డంకులను అధిగమించేలా చేస్తాయి కష్టాలు జీవితం పట్ల అవగాహన పెంచుతాయి కష్టాలు ఇతరులకు సాయం చేసే గుణాన్ని నేర్పుతాయి యాభై ఏళ్ల రజితారాజ్ను కలిస్తే సమస్యలను అధిగమించే నేర్పుతో పాటు, ఇతరులకు సాయపడే గుణాలను ఎలా అలవరచుకోవచ్చో తెలుస్తోంది. సికింద్రాబాద్ మల్కాజిగిరిలో ఉంటున్న యాభై ఏళ్ల రజితారాజ్ స్వయంగా టైలరింగ్ నేర్చుకుని, దానినే ఉపాధిగా మలుచుకుని, కుటుంబం నిలదొక్కుకునేలా చేసింది. సమస్యలతో పోరాటం చేస్తున్న మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇస్తూ వారికి ఉపాధి కల్పిస్తోంది. రోజూ కాస్త తీరిక చేసుకొని వందకు పైగా మాస్కులు కుట్టి, తన బొటిక్‌లోని టేబుల్ మీద ఉంచుతుంది. అవసరమైన వారు వాటిని ఉచితంగా తీసుకెళ్లచ్చు. బస్తీ వాసులకు, పేదలకు అలా ఉచితంగా మాస్కులు పంచుతూ కరోనా కట్టడికి తనవంతు బాధ్యతగా కృషి చేస్తున్న రజితారాజ్ తన స్వయంకృషి ని ఇలా మన ముందుంచారు. స్వీయ శిక్షణ ‘‘మాది వరంగల్. ఇంటర్ఫస్టియర్లో ఉండగానే పెళ్లయ్యింది. ఇరవై ఏళ్ల లోపు ఇద్దరు పిల్లలు పుట్టారు. కుటుంబ పోషణకు ఏదైనా పనిచేయక తప్పనిస్థితి ఎదురైంది. ఏ పని చేయాలో ముందు దిక్కుతోచలేదు. చిన్నప్పటి నుంచి అమ్మ టైలరింగ్ చేస్తుంటే చూసి నేనూ కొంత నేర్చుకున్నాను. వారపత్రికల్లో వచ్చే డ్రెస్ డిజైన్స్ చూసి, ఇంట్లోనే ప్రాక్టీస్ చేసేదాన్ని. ఏం పని చేయగలనా అని ఆలోచించినప్పుడు మా నాన్నను అడిగితే కుట్టుమిషన్ కొనిచ్చారు. చుట్టుపక్కల వాళ్లకు బ్లౌజులు కుట్టేదాన్ని. అక్కణ్ణుంచి నోటి మాట ద్వారా ‘రజిత బాగా డ్రెస్ డిజైన్ చేస్తుంది’ అనే పేరొచ్చింది. ఇంటి నుంచే చుట్టుపక్కల లేడీస్‌కి ఎంబ్రాయిడరీ, టైలరింగ్ లో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను. ఆన్లైన్ లో నా డ్రెస్ డిజైన్స్ పెట్టాను. అక్కణ్ణుంచి ఆర్డర్స్ పెరిగాయి. ఏడుగురు మహిళలే.. మా కుటుంబసభ్యుల పేర్లలో మొదటి అక్షరం తీసుకొని, వాటిని కలిపి ‘చర్ప్స్’ అని బొటిక్ పెట్టాను. నేను పని నేర్పించిన వారినే ఎంప్లాయీస్‌గా పెట్టుకున్నాను. ఇప్పుడు పద్నాలుగు మంది పనివారున్నారు. అందులో ఏడుగురు మహిళలే. ముప్పై ఏళ్లు పిల్లల కోసమే బతికాను. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లయ్యారు. జీవితాల్లో స్థిరపడ్డారు. నేను తీసుకున్న నిర్ణయం కుటుంబానికి ఎంత మేలు చేసిందో పిల్లలు చెబుతుంటే సంతోషం గా అనిపిస్తుంటుంది. కుటుంబం కష్టంలో ఉన్నప్పుడు ఆడవారే త్వరగా మేలుకుంటారు. వచ్చిన ఏ చిన్న పని చేసైనా పిల్లలను వృద్ధిలోకి తీసుకు రావాలనుకుంటారు. నాకు కొద్దిగా వచ్చిన టైలరింగ్‌నే ఉపాధిగా మార్చుకున్నాను. ఇప్పుడు కొందరికి ఉపాధిని ఇవ్వగలుగుతున్నాను. ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్న విద్యార్థులూ నా వద్ద వర్క్ నేర్చుకోవడానికి వస్తుంటారు. టైలరింగ్ పర్ఫెక్ట్గా వచ్చేంతవరకు నేర్పిస్తాను. అయితే సర్టిఫికెట్ ఇవ్వడానికి ఇది స్కూల్‌గా రిజిస్టర్ కాలేదు. సీరియల్ ఆర్టిస్టులు, టీవీ యాంకర్స్‌కి డ్రెస్సులు డిజైన్ చేస్తున్నాను. ఉచితంగా మాస్కులు.. ఇదో పెద్ద సాయం అనుకోను. వచ్చిన పనే నలుగురికి ఉపయోగపడితే చాలనుకుంటాను. కరోనా మొదలైనప్పటి నుంచి వలస కార్మికులకు నిత్యావసరాలు, మాస్కులు ఇచ్చి చేతనైన సాయం చేస్తున్నాను. మాస్కుల తయారీకి కాటన్ పన్నాలు కొనుక్కొచ్చి, మూడు పొరల మాస్కులు తయారు చేసి టేబుల్ మీద పెడుతుంటాను. ఎవరికి అవసరమున్నా అడిగి తీసుకెళుతుంటారు. అనాథ, వృద్ధాశ్రమాలకు ఉచితంగా మాస్కులు ఇచ్చి వస్తుంటాను. ఇప్పుడు వేడుకల సందర్భాల్లో మ్యాచింగ్, ఎంబ్రాయిడరీ మాస్కులు వాడుతున్నారు. వాటి ఆర్డర్లతో పాటు ఈ ఉచిత మాస్కుల తయారీ కూడా ఉంటుంది’ అని వివరించారు రజితారాజ్. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
యువతితో దిగిన ఫొటోతో స్టేటస్.. భార్య చూడటంతో!
సాక్షి, మల్కాజిగిరి: మౌలాలి ప్రశాంత్‌నగర్‌కు చెందిన రాకేష్(30) రైల్వే ఉద్యోగి. ఈ నెల 18 వ తేదీ రోజువారీలాగానే సికింద్రాబాద్‌లో విధులకు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత అతని సెల్‌ఫోన్ స్టేటస్‌లో మరొక అమ్మాయితో ఉన్న ఫొటోను రాకేష్ భార్య అశ్విని గమనించి ఫోన్ చేసింది. ఇంటికి వస్తున్నాని చెప్పిన రాకేష్ రాలేదు. సెల్‌ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తుండడంతో మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహేష్ మిర్జాలగూడకు చెందిన దొడ్డి మల్లేష్ కుమారుడు మహేష్(19) ఈనెల 19వ తేదీ సెలూన్‌షాపు నిర్వహించే మల్లేష్‌కు లంచ్ బాక్స్ తీసుకొని వచ్చాడు. రాత్రి వరకు ఇంటికి రాకపోతే ఫోన్ చేస్తే ఇంటికి వస్తున్నానని చెప్పాడు. ఎంతకీ రాకపోవడంతో మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం చెందాడు. మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ఎస్ఐ శ్రీనివాస్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింహారెడ్డి నగర్‌కు చెందిన నటేషన్(39) సాఫ్ట్వేర్ ఉద్యోగి. శనివారం సాయంత్రం తన యాక్టివా మీద ఎలక్ట్రీషియన్‌తో కలిసి ఎలక్ట్రికల్ సామాన్లు తీసుకొని ఇంటికి తిరిగి వెళుతుండగా ఆర్.కె.నగర్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో అదుపుతప్పి బస్సు కింద పడిపోయాడు. బస్సు వెనుక చక్రం తల మీద వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక ఉన్న ఎలక్ట్రీషియన్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సంఘటనా స్ధలానికి చేరుకున్న ఎస్ఐ శ్రీనివాస్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నటేషన్ భార్య ప్రవీణ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చడవండి: ప్రేమ పేరుతో మోసం; యువతిని లైంగికంగా వాడుకొని. ) -
భర్త మందలింపు; టైలరింగ్ షాప్‌కు వెళ్తున్నానని చెప్పి..
సాక్షి, మల్కాజిగిరి: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వివాహిత అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఏఎస్ఐ సుబ్బరాయుడు తెలిపిన వివరాల ప్రకారం... గౌతంనగర్‌కు చెందిన గడ్డం మహేందర్, అనూష(24) ఇద్దరూ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొంత కాలంగా సెల్ఫోన్లో ఎక్కువగా మాట్లాడడాన్ని గమనించి అనూషను మహేందర్ ప్రశ్నిస్తే సోదరితో మాట్లాడుతున్నానని చెప్పింది. గత నెల 30వ తేదీ ఉదయం ఇంటి నుంచి టైలరింగ్ దుకాణానికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిన అనూష ఇంటికి తిరిగి రాలేదు. ఆమె ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళ అదృశ్యం అఫ్జల్‌గంజ్: బంధువులను కలిసేందుకు నగరానికి వచి్చన ఓ బధిర మహిళ అదృశ్యమైన సంఘటన అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రమేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సీహెచ్ చంద్రకళ అనే మహిళ గతంలో కోఠి ఈఎన్టీ ఆసుపత్రి ప్రాంగణంలోని క్యాంటీన్లో పని చేస్తూ జీవనం సాగించేది. మూడు నెలల క్రితం పనిమానేసి నల్గొండకు వెళ్లింది. ఈ నెల 27న బంధువులను కలిసేందుకు వచి్చన చంద్రకళ ఇంటికి తిరిగి రాలేదు. ఆమె కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో ఆమె కుమార్తె శ్రీలత అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చంద్రకళ, శైలజ ఇంట్లో చెప్పకుండా.. బహదూర్‌పురా: ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కిషన్‌బాగ్ ఎక్స్ రోడ్డు ప్రాంతానికి చెందిన ఏక్నాథ్ కుమార్తె శైలజ గత నెల 31వ తేదీ తెల్లవారుజామున ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లింది. ఆమె తండ్రి ఏక్నాథ్ పరిసర ప్రాంతాలు, స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో బహదూర్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
చదువు ఇష్టంలేక ఆత్మహత్య!
మల్కాజిగిరి: చదువుకోవడం ఇష్టం లేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ యాదగిరి తెలిపిన వివరాల ప్రకారం.. వసంతపురి కాలనీకి చెందిన కారింగుల విజయ్‌కుమార్ కారు డ్రైవర్. ఇతని పెద్ద కుమారుడు అర్జున్‌కుమార్(14) స్ధానిక ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. చదువుపై ఇష్టం లేకపోవడంతో పలుమార్లు పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చేవాడు. ఈ నెల 6 వ తేదీ ఉదయం ఎయిర్‌పోర్ట్‌లో డ్యూటీలో ఉన్న విజయ్‌కుమార్‌కు ఫోన్‌చేసిన అర్జున్ సోదరి మీనాక్షి తమ్ముడు బాత్రూమ్లో టవల్‌తో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపింది. కాగా.. వెంటనే కుటుంబసభ్యులు ఇరుగుపొరుగు వారి సహకారంతో అర్జున్కుమార్ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ సంఘటన విజయ్‌కుమార్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: శుభకార్యాలకు వస్తారు.. విలువైన వస్తువులు కొట్టేస్తారు -
స్నేహితురాలితో వీడియో కాల్ మాట్లాడుతోందని..
మల్కాజిగిరి: యువతి అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఏఎస్ఐ క్రిష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం... మల్కాజిగిరి భవానీనగర్‌కు చెందిన మేఘనాథ్ కూతురు సుమిత (20) ప్రైవేట్ ఉద్యోగి. తరచూ హబ్సిగూడలోని స్నేహితురాలి ఇంటికి వెళ్లి వస్తూవుండేది. ఆమెతో తరచూ వీడియోకాల్ మాట్లాడుతుండడంతో తల్లి మందలించింది.ఈ నెల 1 వ తేదీ ఇంటి నుంచి వెళ్లిన సుమిత తిరిగిరాలేదు. ఆమె ఆచూకీ లభించకపోవడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బిల్ కలెక్టర్‌ను బెదిరించిన కేసులో.. ఏడాది జైలు నేరేడ్మెట్: విద్యుత్ బిల్లు చెల్లించమని అడిగిన బిల్ కలెక్టర్‌ను కత్తితో బెదిరించిన కేసులో నిందితుడికి మల్కాజిగిరి కోర్టు ఏడాది జైలు శిక్ష విధించినట్టు బుధవారం నేరేడ్మెట్ సీఐ నర్సింహస్వామి పేర్కొన్నారు. సీఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి....పోలీసుస్టేషన్ పరిధిలోని సంతోషిమానగర్‌లో నివాసం ఉంటున్న శంకర్‌రాయ్ ఇంటికి 2018 సంవత్సరం సెపె్టంబర్ 29న బిల్ కలెక్టర్ శ్రీశైలం పెండింగ్ విద్యుత్ బిల్లు వసూలు కోసం వెళ్లాడు. బిల్లు చెల్లించాలని కోరగా నిందితుడు కత్తితో బెదిరించాడు. ఈ విషయాన్ని వెంటనే బిల్ కలెక్టర్ ఏఈ రవీందర్‌కు సమాచారం ఇచ్చాడు. ఏఈ వచ్చి బిల్లు చెల్లించాలని లేనిపక్షంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని స్పష్టం చేయగా, నిందితుడు ఆయన్ని బెదిరించాడు. ఏఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో ఛార్జిïÙటు దాఖలు చేశారు. బుధవారం తుది విచారణ పూర్తి కావడంతో నిందితుడికి ఏడాది జైలు శిక్షతోపాటు రూ.3వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారని సీఐ వివరించారు. -
మల్కాజిగిరిలో వ్యభిచార గృహంపై దాడి
సాక్షి, హైదరాబాద్ : గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న మహిళను మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ హరి ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర లాతూర్కు చెందిన పూజా కాంబ్లే(40) మల్కాజిగిరి సాయి నగర్లో నివాసముంటూ టిఫిన్ సెంటర్లో పనిచేస్తుంది. విలాస జీవితానికి అలవాటు పడ్డ ఆమె గత కొంత కాలంగా ఇతర రాష్ట్రాల యువతులను తీసుకువచ్చి తను ఉంటున్న అద్దె ఇంట్లో వ్యభిచారాన్ని నిర్వహిస్తోంది. విశ్వసనీయ సమాచారంతో మంగళవారం రాత్రి ఆమె ఇంటిపై పోలీసులు దాడిచేసి నిందితురాలిని రిమాండ్‌కు, ఆమెతో పాటు ఉన్న యువతిని హోంకు తరలించారు. మీర్పేట్లో వ్యభిచార గృహం సీజ్ -
బిర్యానీ తిన్న పదిమందికి అస్వస్థత
సాక్షి, హైదరాబాద్ : ఆనంద్‌బాగ్‌లోని ఓ మండిలో బిర్యాని తిన్న ఒకే కుటుంబానికి చెందిన పదిమంది అస్వస్థతకు గురైన సంఘటన మల్కాజిగిరిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చాణక్యపురి కాలనీకి చెందిన ఓ కుటుంబం గత నెల 31 వ తేదీ మధ్యాహ్నం ఆనంద్‌బాగ్‌లోని మండిలో చికెన్ బిర్యానీ తిని ఇంట్లో ఉన్న వారికి తీసుకు వచ్చారు. రాత్రి మిగిలిన వారు కూడా తిన్నారు. మరుసటి రోజు నుంచి వాంతులు, జ్వరం, విరేచనాలు కావడంతో వివిధ ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన పై కుటుంబసభ్యుల్లో ఒకరైన రజనీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ చిన్నారులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని, సంఘటనకు బాధ్యులైన హోటల్ నిర్వాహకులపై జీహెచ్ఎంసీ అధికారులతో పాటు మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. -
జీవితం మీద విరక్తితోనే చనిపోతున్నా..
సాక్షి, మల్కాజిగిరి: మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ బి.శ్రీనివాస్ తెలిపిన మేరకు.. సర్దార్ పటేల్‌నగర్‌కు చెందిన ఎల్లేష్,చంద్రకళ భార్యాభర్తలు. వీరికి కుమారుడు పవన్‌కుమార్, కూతురు తనూష(17) ఉన్నారు. తనూష ఇంటర్ ద్వితీయ సంవత్సరం ప్రజ్ఞాపూర్‌లోని గురుకుల్ కాలేజీలో చదువుతోంది. లాక్డౌన్ సందర్భంగా ఇంటి వద్దనే ఉంటోంది. ఈ నెల 14న ఎల్లేష్ , చంద్రకళల, పవన్‌కుమార్‌లు పనిమీద బయటకు వెళ్లారు. చదవండి: (గుడికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు..) మధ్యాహ్నం ఇంటికి వచ్చిన చంద్రకళ బాత్రూమ్లో కాలిన గాయాలతో ఉన్న తనూషను గమనించింది. భర్తకు ఫోన్ ద్వారా తెలియజేసి 108 కు సమాచారం అందించింది. సంఘటనా స్ధలానికి వచ్చిన సిబ్బంది అప్పటికే తనూష మృతి చెందినట్లు తెలిపారు. తన చావుకు తల్లితండ్రులు కారణం కాదని, జీవితం మీద విరక్తితో కిరోసిన్ పోసుకొని చనిపోదామనుకుంటున్న అని రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు. చదవండి: (దారుణం: మైనర్‌పై అత్యాచారం చేసిన ఏఎస్సై) -
దారుణం: మైనర్‌పై అత్యాచారం చేసిన ఏఎస్సై
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్‌గిరిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలికపై ఆర్పీఎఫ్ ఏఎస్సై లల్లూ సెబాస్టియన్ అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బాలికను పలుమార్లు బెదిరించి అత్యాచారం చేశారు. బాలిక తల్లిదండ్రులకు అనుమానం వచ్చి నిలదీయడంతో విషయం బయటపడింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏఎస్సై లల్లూ సెబాస్టియన్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. చదవండి: (సంచలనం రేపిన స్వాతి హత్య.. అసలేం జరిగింది..?) -
మల్కాజ్గిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి కస్టడీ పూర్తి
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి కస్టడీ గురువారం పూర్తి అయ్యింది. నాలుగు రోజుల పాటు నర్సింహారెడ్డిని ఏసీబీ విచారించింది. కస్టడీ అనంతరం బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం నుంచి వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఆయనకు 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అనంతరం ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. నర్సింహారెడ్డి బంధువులు, కుటుంబ సభ్యులు , బినామీలను ఏసీబీ విచారించింది. నాలుగు రోజుల కస్టడీలో నర్సింహారెడ్డి ఆస్తులకు సంబంధించి అన్ని వివరాలను తెలుసుకున్నారు. హైటెక్ సిటీలో సర్వే నెంబర్ 64లో ఉన్న 2వేల గజాల భూమిని తన పదవి అడ్డు పెట్టుకుని దక్కించుకున్నట్లు విచారణలో తేలింది. 2 వేల గజాల భూమిని ఏసీబీ ప్రభుత్వ భూమిగా తేల్చింది. ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన రెవెన్యూ అధికారులను ఏసీబీ విచారించింది. తన పదవిని అడ్డుపెట్టుకుని నర్సింహారెడ్డి పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ గుర్తించింది. నర్సింహారెడ్డి రియల్ ఎస్టేట్‌తో పాటు పలు హోటల్ బిజినెస్‌లలో పెట్టుబడులు పెట్టినట్టు ఏసీబీ గుర్తించింది. చదవండి: అక్కా, బావ, ఓ బామ్మర్ది.. కుచ్చుటోపి! -
మేరే పీచే బాస్ హై!
సాక్షి, హైదరాబాద్: భూ దందాలకు పాల్పడుతున్న అవినీతి అనకొండలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు, మెదక్ మాజీ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్ తరువాత ఏసీబీ చేతికి మరో అవినీతి తిమింగలం దొరికింది. విధినిర్వహణలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని, అలా సంపాదించిన డబ్బుతో రెండు తెలుగు రాష్ట్రా ల్లో భారీగా ఆస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదులతో కేసు నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మల్కాజిగిరి ఏసీ పీ నరసింహారెడ్డిపై బుధవారం దాడులు చేశా రు. తెలంగాణ, ఏపీల్లోని 25 ప్రాంతాల్లో ఏసీ బీ ప్రత్యేక బృందాలు ఏకకాలంలో దాడులు చేసి నరసింహారెడ్డి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించాయి. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.100 కోట్లకు పైగా ఉంటుంద ని సమాచారం. రెండు రాష్ట్రాల్లో 25 ప్రాంతాల్లో... 25కు పైగా ప్రత్యేక బృందాలు ఏకకాలంలో నరసింహారెడ్డి, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో దాడులు చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. బుధవారం ఉదయం సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్‌లోని ఏసీపీ సరసింహరెడ్డి నివాసంలో హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. భారీగా బంగారు, వెండి ఆభరణాలు, కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఉప్పల్‌లో ఉన్న ఏసీపీ కార్యాలయంలో జరిగిన సోదాల్లో కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బుధవారం రాత్రి ఏసీపీ నరసింహారెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడెక్కడ సోదాలు జరిగాయంటే..! ఏసీపీ స్థాయి అధికారి కోసం 25 కంటే ఎక్కువ బృందాలు రంగంలో దిగడం ఈ కేసుపై ఏసీబీ ఏస్థాయిలో దృష్టి పెట్టిందో తెలుపు తోంది. నరసింహారెడ్డి అవినీతి విస్తరణకు అద్దం పడుతోంది. బుధవారం ఉదయం హైదరాబాద్, సికింద్రాబాద్‌లతోపాటు జన గామ జిల్లాలోని లింగాలఘణపురం మండ లం వడిచర్లలో, బచ్చన్నపేట, రఘునాధపల్లి మండలాలతో పాటు, జగిత్యాల జిల్లా గంగాధర, నల్లగొండ జిల్లా, ఏపీలోని అనంతపురం జిల్లాలో కలిపి మొత్తం 25 ప్రాంతాల్లో దాడు లు జరిగాయి. నర్సింహారెడ్డి అత్తగారి ఊరైన జనగామ జిల్లా లింగాలఘణపురం మండలంలోని వడిచర్లలో బుధవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఆ సమయంలో ఏసీపీ మామ మోతె నర్సింహారెడ్డి అక్కడే ఉన్నారు. కుర్చపల్లి గ్రామంలోని పోరెడ్డి తిరుపతిరెడ్డి అనే బంధువు ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదా చేశారు. అలాగే కొన్నె గ్రామం వద్ద సాగు భూమిని పరిశీలించారు. ఈ భూమిని బినామీ పేరిట ఏసీపీ కొన్నారని సమాచారం. మియాపూర్, బేగంపేట్, ఉప్పల్‌లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా.. చిక్కడపల్లి, మల్కాజిగిరి ఏసీపీగా పనిచేసిన నర్సింహారెడ్డి నగర శివారు ప్రాంతాలైన మియాపూర్, ఉప్పల్, మల్కాజిగిరిల్లో భూవివాదాల్లో తలదూర్చినట్లు ఆరోపణలు వచ్చాయి. అసైన్డ్ భూముల వివాదాలే కారణమా? పలు భూవివాదాల్లో తలదూర్చేవాడన్న ఆరోపణలున్న ఏసీపీని చివరికి అవే వివాదాలు ఏసీబీకి పట్టించాయని సమాచారం. హైదరాబాద్‌లో బాగా పేరు ప్రఖ్యాతలు ఉన్న ఓ ప్ర జాప్రతినిధి బినామీలతో ఏసీపీకి సంబంధా లు ఉన్నాయన్న ప్రచారం కలకలం రేపుతోంది. కొండాపూర్‌లోని అసైన్డ్ భూమిని నరసింహారెడ్డి కొనుగోలు చేశాడని, ఈ విషయాన్ని ఏసీబీ అధికారులు ఎదుట ఆయనే అంగీకరిం చారని సమాచారం. ఈ భూమిని మధుకర్ అనే వ్యక్తి ద్వారా కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులకు ఏసీపీ నరసింహారెడ్డి వెల్లడించారని తెలిసింది. జగిత్యాల జిల్లా గంగాధరకు చెందిన ఎంపీపీ మధుకర్ ఇంట్లోనూ ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఏసీబీ అధికారులను చూసి మధుకర్ పారిపోయినట్లు తెలిసింది. అసలు ఈ వివాదమే.. వ్యవహారాన్ని ఏసీబీ వరకు తీసుకెళ్లినట్లు సమాచారం. వీటితోపాటు ఘటకేసర్ సమీ పంలోని యమ్నంపేట్లో 30 ఎకరాల వివాదాస్పద భూమిని కొనుగోలు చేసినట్లు ఆరోపణలూ ఉన్నాయి. నిజాం కాలం నాటి ఈ భూమిని రాజకీయ నేతలతో కలిసి కొన్నార ని ఏసీబీ వద్ద సమాచారం ఉంది. మధుకర్ కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు. మధుకర్ ఆచూకీ దొరికితే.. అతని వెనక ఉన్న ఆ బడా రాజకీయ నేత లెవరు? ఇంతవరకూ వీరు కొనుగోలు చేసిన అసైన్డ్ భూవ్యవహారాలపై స్పష్టత వస్తుందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఏసీబీ గుర్తించిన ఆస్తులివే..! అనంతపురంలో 55 ఎకరాల వ్యవసాయభూమి, మాదాపూర్‌లోని సైబర్‌టవర్ ఎదుట 1,960 చదరపు గజాల నాలుగు ప్లాట్లు, హఫీజ్‌పేటలో మూడం తస్తుల భవనం, రెండు ఓపెన్ ప్లాట్లు, మరో రెండు ఇళ్లను గుర్తించారు. బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షల నగదు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టబడులు పెట్టినట్లు సోదాల్లో అధికారులకు ఆధారాలు లభించాయి. రెండు బ్యాంకు లాకర్లను కూడా గుర్తించారు. ఈ ఆస్తుల విలువ రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం.. రూ.7.5 కోట్లు ఉంటుందని, అయితే బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ఆయా ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు సోదాలు జరుగుతూనే ఉండటం గమనార్హం. మేరే పీచే బాస్ హై! సాక్షి, హైదరాదాబాద్: ‘నా మీద ఎన్ని ఆరోణలు వచ్చినా.. నాకేం కాదు. నా వెనక డీజీపీ ఉన్నారు.. ఆయనే నాకు గాడ్‌ఫాదర్’ అంటూ ఏసీపీ వై.నరసింహారెడ్డి పలువురి వద్ద గొప్పలకు పోయినట్లు తెలిసింది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ విషయం తెలుసుకున్న పోలీస్ బాస్ దీన్ని తీవ్రంగా పరిగణించారు. వెంటనే రహస్యంగా అంతర్గత విచారణ జరిపించారు. వరుసగా వచ్చిన ఫిర్యాదులతో నెలరోజుల ముందే నరసింహారెడ్డి ఏసీపీ ఉన్నతాధికారుల నిఘాలోకి వెళ్లాడని సమాచారం. వాస్తవానికి వనస్థలిపురం ఏసీపీ జయరాం సస్పెండ్ అయినప్పటి నుంచే ఏసీపీ నరసింహారెడ్డి వ్యవహారాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించినట్లు తెలిసింది. అప్పటి నుంచే పక్కాగా విచారణ చేసిన ఏసీబీ అదును చూసి దాడులు చేసింది. ఉప్పల్ ఠాణాలో పనిచేసిన సమయంలో ఎస్సై లింగంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా నరసింహారెడ్డి అతన్ని రక్షించే ప్రయత్నం చేశాడన్న విమర్శలున్నాయి. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో ఉన్న సదరు ఎస్సై లింగం భూవివాదంలో తలదూర్చడంతో హెచ్చార్సీలో కేసు నమోదవడం గమనార్హం. బినామీగా బార్ ఓనర్! ఏసీపీ నరసింహారెడ్డికి నగరంలోని అశోక్‌పాటిల్ అనే ఓ బార్ యజమానితో సాన్నిహిత్యం ఉందని, అతనే బినామీగా వ్యవహరిస్తున్నాడని సమాచారం. ఏసీపీ అక్రమ సంపాదనను అతడే మేనేజ్ చేసేవాడని సమాచారం. పోలీసుశాఖలో పని చేసే ఓ ఉన్నతాధికారికి నగరంలో కోట్ల రూపాయల విలువైన బంగళాను ఏసీపీ కానుకగా ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. ఈ బంగళాను బినామీ అశోక్‌పాటిల్ ద్వారా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఘట్కేసర్ తహసీల్దార్ ఓ కేసు విషయంలో చేసిన ఫిర్యాదు ఆధారంగా ఏసీపీని ఉన్నతాధికారులు మందలించారని సమాచారం. -
ఏసీపీ ఇంటిపై ఏసీబీ దాడులు
-
మల్కాజ్గిరి ఏసీపీ ఇంటిపై ఏసీబీ దాడులు
సాక్షి, హైదరాబాద్: మల్కాస్‌గిరి ఏసీబీ నరసింహారెడ్డి నివాసంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలతో ఏసీబీ సోదాలు చేపట్టింది. నరసింహారెడ్డి గతంలో ఉప్పల్ సీఐగా పని చేశారు. పలు భూ వివాదాలతో పాటు సెటిల్మెంట్లలో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో 20చోట్ల ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక ఒకే సమయంలో ఏసీబీ అధికారులు 34 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లాలో మూడు చోట్ల, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో రెండు చోట్ల, ఏపీలోని అనంతపురంలో ఒక చోట అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. మాజీ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి అల్లుడు అయిన ఏసీపీ నరసింహారెడ్డి రూ.50 కోట్ల అక్రమాస్తులు సంపాదించినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. -
హైదరాబాద్ మౌలాలిలో దారుణం
-
భర్త ప్రభాకరన్‌ను హతమార్చిన సుకన్య
సాక్షి, మల్కాజిగిరి : వారిద్దరూ పాత నేరస్తులే... భర్త బయట, భార్య జైలులో ఉండేది. ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉండటాన్ని సహించలేక అతనినే కడతేర్చింది. పోలీసులకు అనుమానం రాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించింది. వివరాలు.. చెన్నైకి చెందిన ప్రభాకరన్, సుకన్య(32) భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. చెన్నైలో మనీ బ్యాక్ స్కీమ్ ప్రారంభించిన ప్రభాకరన్ 2012లో ఆర్థిక నేరాలకు పాల్పడటంతో సీఐడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఆయన జైలుకు వెళ్లి వచ్చాడు. ప్రభాకరన్ భార్య సుకన్య కూడా అదే కేసులో ఐదు సంవత్సరాలు జైలుకు వెళ్లి వచ్చింది. భర్త సమాచారం లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రగిరిలో బంధువుల వద్ద పిల్లలతో కలిసి ఉంటోంది. జైలు నుంచి వచ్చిన ప్రభాకరన్ మౌలాలి ఆండాళ్ నగర్లో నివాసముంటున్నాడు. చర్చి పాస్టర్‌గా, సంఘ సేవకుడిగా పనిచేసేవాడు. రెండేళ్ల కిత్రం పక్షవాతం రావడంతో తనకు తోడుగా ఒక మహిళను కేర్ టేకర్‌గా ఏర్పాటు చేసుకున్నాడు. భర్త సమాచారం తెలుసుకున్న సుకన్య పది రోజుల కిత్రం భర్త వద్దకు పిల్లలతో కలిసి వచ్చింది. ఆమె వచ్చిన తర్వాత భర్తతో పాటు మరో మహిళ (కేర్ టేకర్) ఉండటంతో భర్త మీద అనుమానం వచ్చింది. దీంతో కేర్‌టేకర్‌ను మాన్పించింది. కేర్ టేకర్‌ను రప్పించాలని భార్యతో ప్రభాకరన్ గొడవపడుతున్నాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమెను, పిల్లలను చంపుతానని ప్రభాకరన్ బెదిరిస్తున్నాడు. ఈ నెల 23వ తేదీ రాత్రి కేర్‌టేకర్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో సుకన్య దిండుతో భర్త మొహం మీద ఒత్తి హత్య చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి మరుసటి రోజు ఉదయం ఆమెనే 100 నంబర్‌కు కాల్ చేసింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదు చేయడానికి సుకన్య నిరాకరించడం, సంఘటన స్థలంలో కొన్ని వస్తువులు అనుమానాస్పదంగా కనిపించడంతో సుకన్యను పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో నేరం అంగీకరించింది. ఈ నేపథ్యంలో శనివారం ఆమెను రిమాండ్‌కు తరలించాము’ అని ఇన్స్పెక్టర్ జగదీశ్వర్, ఎస్ఐ వెంకట్‌రెడ్డి వెల్లడించారు. -
వివాహేతర సంబంధం ఇంట్లో తెలియడంతో..!
సాక్షి, కామారెడ్డి: వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట్ మండలం మాసాయిపేట బంగారమ్మ ఆలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకెళ్తే.. మల్కాజిగిరి మధురానగర్ కాలనీలో నివాసముండే సంగరాజు వెంకటయ్య కుమారుడు రవికుమార్ (30), లాలగూడా ప్రాతంలో ఉండే సంతోష (29)కు మధ్య గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. అయితే.. సంతోషకు 9 సంవత్సరాల క్రితం శంకర్ యాదవ్ అనే వ్యక్తితో వివాహం కాగా ముగ్గురు కుమారులు ఉన్నారు. రవికుమార్‌కు సైతం వేరే మహిళతో వివాహం జరిగింది. కాగా.. వీరిమధ్య నడుస్తున్న అక్రమ సంబంధం విషయం ఇరుకుటుంబాలకు తెలియడంతో బైక్‌పై మాసాయిపేటకు వచ్చిన జంట.. రోడ్ పక్కన బైక్ నిలిపి రైలు పట్టాలపై పడుకోగా నిజామాబాద్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు ఢీ కొనడంతో వారు మృతి చెందారు. కామారెడ్డి రైల్వే ఎస్సై తవు నాయక్ ఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాలను పరిశీలించి.. కేసు నమోదు చేసుకున్న అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను కామారెడ్డి రైల్వే ఆసుపత్రికి తరలించారు. చదవండి: అక్క భర్తతో చనువు.. గర్భవతిగా మారి చివరకు..! -
మలక్‌పేట్ మార్కెట్లో పాటించని జాగ్రత్తలు
-
రేవంత్ మెడ చుట్టూ బిగుస్తున్న కేసుల ఉచ్చు
సాక్షి, హైదరాబాద్ : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మెడ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది. రేవంత్‌పై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 63 కేసులు నమోదు అయ్యాయి. డ్రోన్ కెమెరా కేసులో ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న ఆయన.. విడుదలను కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం ఇదివరకే కొట్టివేసింది. ఇదిలావుండగానే పీటీ వారెంట్‌పై విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు డ్రోన్ కెమెరా కేసులో రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. టీఆర్ఎస్ లోక్‌సభపక్ష నేత నామానాగేశ్వరరావు పార్లమెంట్లో ప్రస్తావించారు. దీనితో స్థానిక వ్యవహారం కాస్తా దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వంపై రేవంత్ దూకుడుగా వ్యవహరిస్తూ.. సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తుండటంతో టీఆర్ఎస్ నేతలు కూడా ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఉన్న పెండింగ్ కేసులో త్వరగతిన విచారణ జరిపించాలని ఆయన ప్రత్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. (భూ ఆక్రమణ.. వాల్టా ఉల్లంఘన!) రేవంత్‌పై నమోదైన కేసుల చిట్టా.. ఆర్వోసీ, సీబీఐతో పాటు ఎన్నికల కమిషన్ వద్ద పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటికితోడు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన.. ఓటుకు నోటు కేసుతో సహా, ఎస్టీ, ఎస్సీ అట్రాసిటి కేసులు ప్రస్తుతం విచారణలో విచారణ ఉన్నాయి. వాటితో పాటు ప్రత్యర్థులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో.. 32కేసులు ఇప్పటికే ఆయనపై నమోదై ఉన్నాయి. జూబ్లిహిల్స్ హౌజింగ్ సొసైటీలో ఫోర్జరీ చీటింగ్ కేసులు, ట్రెస్పాస్, వివిధ ప్రాంతాల్లో భూకబ్జాలకు సంబంధిన కేసులు రేవంత్‌పై ఉన్నాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై 7 కేసులు, ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘనపై మరో కేసు, కొడంగల్‌లో 9, సైఫాబాద్ 10, గచ్చిబౌలి 4, జూబ్లిహిల్స్3, బంజారాహిల్స్ 3, అబిడ్స్ 3, సుల్తాన్ బజార్ 3, మద్దూర్ 3, పంజాగుట్ట 3, ఓయు పోలీస్ స్టేషన్లో మరో కేసు రేవంత్‌పై నమోదై విచారణ దశలో ఉన్నాయి. (రేవంత్‌రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత) దీంతో రేవంత్‌రెడ్డిపై నమోదైన కేసులను త్వరితగతిన విచారణ జరపాలని న్యాయవాది రామారావు డిమాండ్ చేస్తున్నారు. అయితే వీటిల్లో ఏ కేసులో అయినా నేరం రుజువై.. శిక్ష పడితే పదవి నుంచి తొలగించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఓటుకు నోటు కేసులో ఇప్పటికే చార్జిషీట్ దాఖలై.. బలమైన సాక్షాధారాలు ఉన్నందున ఈ కేసు నుంచి రేవంత్ తప్పించుకోవడం అంత సులభంకాదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన గోపనపల్లి భూకబ్జా కేసులో అనేక అక్రమాలతో పాటు వాటికి సంబంధించిన కీలక ఆధారాలు లభ్యం కావడం తెలిసిందే. మరోవైపు రేవంత్‌రెడ్డి అరెస్టుపై లోక్‌సభ జీరో అవర్‌లో కాంగ్రెస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ సభ్యుడు మాణికం ఠాగోర్ వాయిదా తీర్మానం ఇవ్వగా దానిని సభాపతి అనుమతించలేదు. -
ఓటర్ల తుది జాబితా విడుదల
సాక్షి, మేడ్చల్‌జిల్లా: మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా శనివారం అధికారులు తుది ఓటర్ల జాబితాను కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వారిగా వెల్లడించారు. డిసెంబర్ 30న విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాపై మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయా కలెక్టరేట్లతో(జిల్లా కేంద్రాల్లో) పాటు మున్సిపాలిటీల్లో సమావేశాలు నిర్వహించి..జాబితాలో చేర్పులు, మార్పులు, తప్పొప్పులపై చర్చించారు. అలాగే, ఓటర్ల నుంచి స్వీకరించిన అభ్యంతరాలను పరిశీలించి, పరిష్కరించిన అనంతరం ఆయా మార్పులతో శనివారం అధికారికంగా తుది ఓటర్ల జాబితాను ప్రకటించారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో డివిజన్లు, వార్డుల వారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర ఓటర్లు ఎంతమందో ఫైనల్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 8వ తేదీ నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకరించే అవకాశముంది. కాగా, శనివారం విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా ప్రకారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు, తొమ్మిది మున్సిపాలిటీల్లో 115 డివిజన్లు, 189 వార్డులు ఉన్నాయి. ఈ జిల్లాలో మొత్తం 5,90,493 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 3,07,895 మంది, మహిళలు 2,82,541 మంది, ఇతరులు 57 మంది ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీల్లో 100 డివిజన్లు, 151 వార్డులు ఉన్నాయి. జిల్లాలో మొత్తం ఓటర్లు 6,40,366 ఉండగా, వీరిలో 3,29,261 మంది పురుషులు, 3,11,037 మంది మహిళలు, 68 మంది ఇతరులు ఉన్నారు. -
ప్రేమ పేరుతో వేధింపులు..
సాక్షి, మల్కాజిగిరి: ప్రేమ పేరుతో ఓ విద్యార్థినిని వేధిస్తున్న యువకుడిని మల్కాజిగిరి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఎస్ఐ లింగస్వామి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మల్కాజిగిరి వాణీనగర్‌కు చెందిన సాయిప్రసాద్(35) ప్రైవేట్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. గత కొద్ది రోజులుగా అతను అదే ప్రాంతానికి చెందిన విద్యార్థిని వెంటపడుతూ ప్రేమించాలని వేధిస్తున్నాడు. బాధితురాలు ఈ విషయాన్ని తల్లి తండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. సోమవారం దయానంద్‌నగర్ స్టేషన్ వద్ద సాయిప్రసాద్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న బాధితురాలి కుటుంబసభ్యులు అతడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
మరదలితో అసభ్య ప్రవర్తన; బావకు బేడీలు
సాక్షి, హైదరాబాద్: మరదలి పట్ల అనుచితంగా ప్రవర్తించిన బావను మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ లింగస్వామి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నేరెడ్మెట్, ఓల్డ్ సఫిల్‌గూడకు చెందిన శ్రీనివాసులు(38) కారు డ్రైవర్‌గా పని చేసేవాడు. అతడికి మరదలి వరుసయ్యే ఓ మహిళ భర్తతో మనస్పర్థలు రావడంతో ఉత్తంనగర్ ప్రాంతంలో తల్లితో కలిసి ఉంటోంది. నెల రోజులుగా శ్రీనివాసులు సదరు మహిళను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ నెల 28న ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన బుధవారం నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రేమను తిరస్కరించినందుకు పరువు తీశాడు ప్రేమను తిరస్కరించిందనే కోపంతో క్లాస్మేట్ వ్యక్తిగత ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసి ఆమె వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించిన వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జీడిమెట్లకు చెందిన మేడిశెట్టి శ్రీకాంత్ బాధితురాలితో పాఠశాల స్థాయి నుంచి కలిసి చదువుకున్నాడు. ఆ సమయంలో సన్నిహితంగా ఉన్న సమయంలో ఆమె ఫొటోలు, ఆమె వ్యక్తిగత ఫొటోలను తీశాడు. అయితే కొంతకాలంగా అమె బిజీగా ఉండటంతో శ్రీకాంత్‌తో మాట్లాడం మానేసింది. తన ఫోన్‌కాల్స్‌కు స్పందించకపోవడంతో గత నెలలో వనస్థలిపురంలోని ఆమె ఇంటికి వెళ్లి గొడవ పడ్డాడు. ఆ సమయంలో బాధితురాలి ఇంట్లో లేకపోవడంతో తల్లిదండ్రులతో ఘర్షణ పడ్డాడు. తనతో పెళ్లి చేయాలని, లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. ఆ తర్వాత బాధితురాలు అతడి ఫోన్ ఎత్తకపోవడంతో ఆమెపై పగ పెంచుకున్నాడు. గతంలో తన కెమెరాతో తీసిన పాత ఫొటోలను బయటికి తీసి తన ఫేస్బుక్ స్టేటస్‌లో పెట్టడమేగాక కామెంట్లు పెడుతూ ఆమె వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చాడు. ఈ విషయం తెలిసిన బాధితురాలు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు టెక్నికల్ డాటా ఆధారంగా నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
మూడు గంటల్లో.. 14.93 కుండపోత
సాక్షి,హైదరాబాద్: నగరాన్ని వర్షం హడలెత్తించింది. పలు ప్రాంతాల్లో క్లౌడ్‌బరస్ట్ కావటంతో కుండపోతగా వర్షం కురిసింది. శుక్రవారం తెల్లవారుజాము నుండి కురిసిన అతిభారీ వర్షంతో నగరంలో పలు కాలనీలు జలమయమై జనజీవనం స్తంభించిపోయింది. గుడిమల్కాపూర్‌లో 3 గం టల వ్యవధిలో 14.93 సెం.మీ. అత్యధిక వర్షం కురిసింది. దీంతో ఆ ప్రాంతంలోని రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిన్నది. శివరాంపల్లిలో 14.05, మోండాలో 13.95, రెడ్‌హిల్స్‌లో 13.53 విజయనగర్‌కాలనీలో 13.2, తిరుమలగిరిలో 12.48, ముషీరాబాద్‌లో 11.98, శ్రీనగర్‌కాలనీలో 11.73 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నగరమంతటా సగటున 8.97 సెం.మీ. వర్షం కురవటంతో లోతట్టు ప్రాంతాలు నీటముని గాయి. కార్వాన్, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాల్లో శుక్రవారం మధ్యాహ్నం దాకా సాధారణ జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గుడిమల్కాపూర్, నానల్‌నగర్, టోలిచౌకి ప్రధాన రహదారులపై వరద ముంచెత్తింది. కార్వాన్, గోల్కొండ డివిజన్లలోడ్రైనేజీ వ్యవస్థ దెబ్బతింది. మల్కాజిగిరిలో అవే అవస్థలు మల్కాజిగిరి, ఉప్పల్‌లో పలు కాలనీలు జలమయం కావటం, నాలాలు ఉప్పొంగటంతో జనాలు అవస్థల పాలయ్యారు. మల్కాజిగిరిలో బండచెరువు పరిసరాల్లోని కాలనీలు వరదనీటిలో మునిగిపోవటంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. నాచారం హెచ్ఎంటీ నాలా ఉధృతంగా ప్రవహించటంతో ఉప్పల్– చిలుకానగర్, ఉప్పల్ –స్వరూప్‌నగర్‌లో రాకపోకలు మధ్యాహ్నం వరకూ నిలిచిపోయాయి. ఉప్పల్, బోడుప్పల్ పరిధిలోని కాలనీల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మల్కాజిగిరి వర్షమే రికార్డ్ నగరంలో ఇప్పటివరకు మల్కాజిగిరిలోనే రికార్డు వర్షం కురిసింది. 2017 సెప్టెంబర్ 14న మల్కాజిగిరిలో కురిసిన 20.15 సెం.మీ. వర్షపాతమే ఇప్పటివరకు అత్యధికమని హైదరాబాద్ వాతావరణ శాఖ గురువారం పేర్కొంది. కూలిన గోల్కొండ సెంట్రీ గది గోల్కొండ: భారీ వర్షాలకు చారిత్రక గోల్కొండ కోట మోతీ దర్వాజాను ఆనుకొని ఉన్న సెంట్రీ గది కూలింది. కోట నిర్మించిన అనంతరం నయాఖిల్లా నిర్మాణ సమయంలో మోతీదర్వా జా వద్ద ఈ గదిని నిర్మించారు. దర్వాజా వద్ద కాపలా ఉండే సైనికులు దీనిని రెస్ట్‌రూంగా ఉపయోగించేవారు. ఈ గదిలో ఫిరంగిగుండ్లు, విషసర్పాలు, తేళ్లను కూడా ఉంచేవారు. శత్రువులు కోటపైకి దండెత్తినప్పుడు దర్వాజా బయట కందకాలలో విషసర్పాలు, తేళ్లను వదిలేవారు. శత్రువులు కందకాల నుంచి ఈదుకుంటూ లోపలికి రాకుండా ఈ విధంగా చేసేవారు. కాగా, కూలే సమయంలో గదిలో ఒక ఎద్దు, 3 ఆవులు ఉన్నాయి. కూలిన తర్వాత రెండు ఆవులు, ఎద్దును బయటకు తీశారని కోట పరిరక్షణాధికారి ఎ.భానుప్రకాష్ వర్మ తెలిపారు. -
మల్కాజిగిరి గణేష్ మండపంలో అగ్నిప్రమాదం
-
గణేష్ మండపంలో అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని మల్కాజ్‌గిరిలోని ఓ గణేష్ మండపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక విఫ్ణుపురి కాలనీలోని మైత్రీనివాస్ అపార్ట్మెంట్ సెల్లార్లో ఏర్పాటు చేసిన మండలంలో మంటలు చెలరేగడంతో రెండు కార్లు, పది ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. స్థానికుల సహాయంతో మిగితా వాహనాలను అపార్ట్మెంట్ వాసులు బయటకు తీసుకు వచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా మండపంలో ఏర్పాటు చేసిన అఖండ దీపంతో మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. కాగా ప్రాణ నష్టం తప్పడంతో అపార్ట్మెంట్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. -
మరో 'లవ్ జిహాదీ’ కలకలం
సాక్షి, హైదరాబాద్ : నగరంలో మరో లవ్ జిహాదీ వ్యవహారం వెలుగుచూసింది. ప్రేమ పేరుతో రఫిక్ అనే యువకుడు ఓ దళిత యువతిని మోసం చేసిన ఘటన మల్కాజిగిరిలో కలకలం రేపుతోంది. రఫిక్.. తనను బలవంతంగా మతం మార్చి పెళ్ళి చేసుకున్నాడని బాధితురాలు ఆరోపించారు. గర్భం దాల్చిన తర్వాత తనను మోసం చేసాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. క్రిష్ణవేణి అలియాస్ షబానా, రఫీక్ మల్కాజిగిరి మల్లికార్జున్ నగర్లో నివాసముండేవారు. వరంగల్‌కి చెందిన రఫిక్ .. 6 ఏళ్ల క్రితం క్రిష్ణవేణితో కలిసి హైదరాబాద్‌కు వచ్చాడు. మలక్‌పేటలో ఉద్యోగం చేస్తూ ఆమెను పెళ్ళిచేసుకున్నారు. అమ్మాయి హిందువు కావడంతో మతం మారితే కానీ పెళ్ళిచేసుకోనని రఫిక్ తెలపడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కృష్ణవేణి బలవంతంగా మతం మార్చుకుని షబానా గా మారింది. పెళ్లైనా తరువాత కొన్ని రోజులు కాపురం బాగానే సాగింది. కానీ కొద్ది రోజుల తరువాత అసలైన కథ మొదలైంది. పిల్లలు కావాలని రఫిక్ షబానాను బలవంతం చేయడం మొదలుపెట్టాడు. అనారోగ్యం వల్ల షబానాకు నాలుగు సార్లు అబార్షన్ అయింది. అవేమీ పట్టించుకోని రఫిక్ అప్పటినుంచి భార్యని వేధించడం మొదలుపెట్టాడు. వైద్యం కోసం పుట్టింటినుంచి డబ్బులు తేవాలని హింసించడం ప్రారంభించాడు. దీనిపై షబానా పలుమార్లు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మాత్రం కౌన్సిలింగ్ తో సరిపెట్టారు. ఆఖరికి తాజాగా షబానా గర్భందాల్చారు. అయితే రఫిక్ షబానాకు నాలుగో నెల రాగానే తనకు సంబంధం లేదని వదిలి వెళ్ళిపోయాడు. ప్రేమ పేరుతోఇలాంటి నీచపు పనులకు దిగజారే వాడిని కఠినంగా శిక్షించాలని భాదితురాలు క్రిష్ణవేణి(షబానా) డిమాండ్ చేస్తున్నారు. -
వర్క్ ఫ్రమ్ హోం పేరిట మోసం..
సాక్షి, హైదరాబాద్ : వర్క్ ఫ్రమ్ హోం పేరిట నిరుద్యోగులకు ఓ సంస్థ కుచ్చుటోపీ పెట్టింది. ఈ సంఘటనపై బాధితులు మల్కాజిగిరి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం ఎస్ వర్క్ ఫ్రమ్ హోం పేరిట కార్ఖానాలో ఉన్న ఓ సంస్థ వారం క్రితం మల్కాజిగిరి శివపురికాలనీలో కార్యాలయాన్ని ప్రారంభించింది. సంస్థలో చేరడానికి రూ.2,500, దరఖాస్తుకు రూ.500, పని చేయడానికి ఉపయోగించే షీట్స్ కోసం మరో రూ.2,500 చెల్లిస్తే నెలకు ఎనిమిది వేలు సంపాదించుకోవచ్చని నిరుద్యోగులను నమ్మించింది. దీంతో నాచారం, మల్కాజిగిరి, మౌలాలి, ఈసీఐఎల్ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులు, విద్యార్థులు సుమారు నలభైమంది రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి ఉద్యోగంలో చేరారు. ఎంతమందిని చేర్పిస్తే వారికి ఒక్కొక్కరికి ఐదు వందల చొప్పున అందజేస్తామని చెప్పడంతో చాలామంది చేరారు. సంస్థ అందచేసే షీట్స్‌లో వారు పంపించిన క్రమ సంఖ్యలో నింపి వారానికి ఒకసారి అందచేయాలి. అలా అందచేసిన షీట్లను బట్టి వారికి నగదు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. అయితే వారం దాటినా నగదు చెల్లించకపోవడంతో బాధితులు మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సెక్టార్ ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపారు. -
మల్కాజ్గిరి కోర్టు సంచలన తీర్పు
హైదరాబాద్ : తల్లిదండ్రులను వేధించే పిలల్లకు గుణపాఠంగా మల్కాజ్గిరి కోర్టు సోమవారం సంచలన తీర్పు ఇచ్చింది. తండ్రి మరణాంతరం తల్లి ఆలనపాలన చూడాల్సిన కొడుకే కర్కశంగా మారడంతో ఆ అభాగ్యురాలు పోలీసులు, కోర్టును ఆశ్రయించింది. దీనిపై నాలుగేళ్లుగా విచారణ జరిపిన కోర్టు ఇవాళ తుదితీర్పును వెలువరించింది. ఆస్తి కోసం తల్లిని వేధించిన కొడుకుతో పాటు కోడలికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు పదివేల జరిమానా విధించింది. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిల్ కాలనీలో నివాసం ఉండే ప్రేమ కుమారి (70)కి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. 2013లో భర్త చనిపోయాడు. భర్త చనిపోకముందే పిల్లల వివాహాలు జరిపించాడు. ఎవరికి వారు వేరుగా ఉంటున్నారు. భర్త చనిపోవడంతో పెద్ద కుమారుడు నుంచి తల్లికి వేధింపులు మొదలయ్యాయి. ముషీరాబాద్ లో నివాసం ఉండే పెద్ద కుమారుడు అమిత్ కుమార్ తన భార్యతో సహా తల్లి ఉండే ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించమే కాకుండా ఆమెను బయటకు పంపేందుకు రకరకాల ప్రయత్నాలు చేశాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని భార్యతో కలిసి క్రూరంగా హింసించడం మొదలుపెట్టాడు. ఇది భరించలేని తల్లి... 2015లో పోలీసులను ఆశ్రయించగా అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. నాలుగేళ్లుగా విచారణ జరిగిన ఈ కేసు తుదితీర్పు నేడు(సోమవారం) వెలువడింది. పెద్ద కుమారుడు అమిత్ కుమార్, కోడలు శోభిత లావణ్యలకు రెండేళ్ల జైలుశిక్షతో పాటు చేరో పదివేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. కోర్టు తీర్పుపై పలువురు హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ తీర్పుతోనైనా సమాజంలో మార్పురావాలని వారు అభిప్రాయపడుతున్నారు. -
ఇక్కడ పని జరగాలంటే ముందు పైసలివ్వాలి
సాక్షి, హైదరాబాద్: ఏసీబీ అధికారుల వలలో మరో అవినీతి చేప చిక్కింది. మల్కాజ్‌గిరిలో ఓ మహిళ నుంచి రూ.7వేలు లంచం తీసుకుంటూ అసిస్టెంట్ పెన్షన్ పేమెంట్ అధికారి ఫులూ నాయక్ ఏసీబీ అధికారులకు దొరికాడు. వివరాల్లోకి వెళితే.. మల్కాజ్గిరి పెన్షన్ కార్యాలయంలో ఫులూ నాయక్ అసిస్టెంట్ పెన్షన్ పేమెంట్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఓమహిళ తన పెన్షన్ డబ్బులు తీసుకోడానికి కార్యాలయానికి వెళ్లింది. పెన్షన్ డబ్బులు కావాలంటే తనకు కొంత ముట్ట చెప్పాలని ఫులూ నాయక్ ఆమహిళను డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఫులూ నాయక్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. -
నేను పార్టీ మారను : రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తాను పార్టీ మారుతానని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మీద నమ్మకంతో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ టికెట్ ఇచ్చారని, తాను పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. సోషల్ మీడియాలో వ్యాపారం కోసం ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, భువనగిరి ఎంపీ కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలసి రేవంత్ మీడియాతో మాట్లాడారు. దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గం, మినీ భారతదేశంగా పిలువబడే మల్కాజిగిరిలో ప్రజలు తనని ఆశీర్వదించారన్నారు. కొడంగల్‌లో కేసీఆర్, హరీష్ రావు తనపై కుట్రలు చేసి ఓడించారని, కానీ ప్రశ్నించేవారు ఉండాలని రేవంత్ రెండ్డిని మల్కాజిగిరి ప్రజలు గెలిపించారని తెలిపారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతను నిలబెట్టుకుంటానని, వారికిచ్చిన హామీలను నెరవేరుస్తానన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ విభజన రాజకీయాలను తిప్పి కొడతామన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వల్ల గెలిచిన బీజేపీని పార్లమెంట్లో నిలువరించి ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నారు. -
ప్రజలకు రుణపడి ఉంటాను
సాక్షి, హైదరాబాద్: ప్రజల అవసరాలు, రాష్ట్ర విభజన హక్కులపై పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకను అవుతానని మల్కాజిగిరి ఎంపీగా గెలుపొందిన ఎనుగుల రేవంత్‌రెడ్డి అన్నారు. తనను ఆశీర్వదించిన మల్కాజిగిరి ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. మల్కాజిగిరి నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు. తెలంగాణ కేసీఆర్ రాజ్యం అనుకుంటున్నారని, తండ్రీ కొడుకుల అహంకారం అణచేందుకే ప్రజలు ఈ ఫలితాలు ఇచ్చారన్నారు. కేసీఆర్ అధికారాన్ని ఆస్తులు పెంచుకునేందుకు వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ గెలుపులో తన ప్రమేయం కంటే తెలంగాణ సాధించుకున్న విద్యార్థుల పాత్ర ఎక్కువగా ఉందని తెలిపారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు కర్మాగారం, ట్రైబల్ వర్సిటీలను సాధించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆంగ్లో ఇండియన్లకు అసెంబ్లీ, పార్లమెంట్లో ఉన్న రిజర్వేషన్లు రద్దు చేసే వరకు పోరాడతానని చెప్పారు. మల్కాజిగిరిని మరో నోయిడాగా అభివృద్ధి చేస్తానని అన్నారు. కంటోన్మెంట్ బోర్డు ఎత్తేసి, గ్రేటర్ పరిధిలోకి తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. మిలటరీ అధీనంలోని రోడ్లపై ప్రజలకు స్వేచ్ఛ ఉండేలా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెప్పారు. -
మల్కాజ్‌గిరిలో రేవంత్ విజయం
సాక్షి, హైదరాబాద్ : మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి విజయం సాధించారు. హోరాహోరీగా జరిగిన పోరులో సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్‌పై 6 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాయం పాలైన రేవంత్‌కు ఈ ఫలితం ఊరట నిచ్చింది. కాగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నాలుగు చోట్ల విజయం సాధించింది. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డిని ఓడించేందుకు టీఆర్ఎస్ ఎంతగానో ప్రయత్నించింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా టీఆర్ఎస్కు అనుకూలంగానే వచ్చాయి. కానీ ఈ రోజు వెలువడిన ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయి. రేవంత్ రెడ్డితో పాటు నల్గొండలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరిలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చేవేళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి విజయం సాధించారు. -
చెక్ బౌన్స్ .. రూ.కోటి జరిమానా..!
సాక్షి, హైదరాబాద్ : చెక్‌బౌన్స్ కేసులో ఓ వ్యక్తికి మల్కాజిగిరి ఫస్ట్ సెషన్స్ కోర్టు కోటి రూపాయల జరిమానా విధించింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడంలో విఫలమవడంతో నిందితుడికి జరిమానాతో పాటు రెండు సంవత్సరాల జైలు శిక్ష కూడా పడింది. దాంతోపాటు బాధితుడికి అసలు రూ.55 లక్షలు, నష్టపరిహారంగా మరో రూ.20 లక్షలు చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. న్యాయవాది టి.నరసింహారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సైనిక్‌పురి నివాసి గూడూరు సంజీవరెడ్డి (సాయి రత్న) వ్యాపార నిమిత్తం సాకేత్ మిథిలాలో నివాసముండే మొగుల్ల విజయభాస్కర్ రెడ్డి (42) కి రూ.55 లక్షలు అప్పుగా ఇచ్చారు. అప్పు తీర్చేందుకు డెక్కన్ గ్రామీణ బ్యాంక్ (ఎస్సార్ నగర్ బ్రాంచ్)కు సంబంధించిన రు.25 లక్షల రూపాయల చెక్కును 2015, నవంబర్ 23న, రూ.30 లక్షల చెక్కును 2015, డిసెంబర్ 1న విజయభాస్కర్ రెడ్డి సంజీవరెడ్డికి ఇచ్చారు. వాటిని బ్యాంకులో డిపాజిట్ చేయగా ఫెయిల్ అయ్యాయి. దీంతో సంజీవ రెడ్డి కోర్టును ఆశ్రయించాడు. పూర్తి విచారణ అనంతరం ఇరువురి వాదనలు విన్న జడ్జి సాంబశివ మంగళవారం తీర్పు వెలువరించారు. నిందితుడు విజయ భాస్కర్ రెడ్డిపై వచ్చిన చెక్‌బౌన్స్ ఆరోపణలు రుజువైనందున రూ.కోటి జరిమానాతోపాటు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, బాధితుడికి అసలు 55 లక్షల రూపాయలతో పాటు 20 లక్షలు నష్టపరిహారం కింద చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో ఆరు మాసాల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో స్పష్టం చేశారు. తీర్పు అనంతరం విజయ భాస్కర్ రెడ్డి ని కుషాయిగూడ పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. -
కనకారెడ్డి మరణం టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు
-
మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి (68) మృతిచెందారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం కన్నుమూశారు. కనకారెడ్డి 2014లో మల్కాజ్గిరి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. అనారోగ్యం కారణంగా గత అసెంబ్లీ ఎన్నికల పోటీకి ఆయన దూరంగా ఉన్నారు. 2008లో తొలిసారి ప్రజారాజ్యంలో చేరిన ఆయన సికింద్రాబాద్ నుంచి పోటీచేసి ఓటమి చెందారు. అనంతరం 2013లో టీఆర్ఎస్లో చేరి శాసనసభ్యుడిగా గెలుపొందారు. 1951లో సికింద్రాబాద్‌లో జన్మించిన ఆయనకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి ఈటల సంతాపం మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యేగా కనకారెడ్డి చేసిన సేవలను ఆయన కొనియాడారు. కనకారెడ్డి మృతిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఈటల రాజేందర్, మల్లారెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇరిగేషనన్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ ఈద శంకర్ రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. -
నైట్‌డ్యూటీ కావడం, పాస్ అవుతానోలేదోననే బెంగతో..
మల్కాజిగిరి: మనోవేదనతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిసిన మేరకు.. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన హరిబాబు, జగదీశ్వరిలు మల్కాజిగిరి దయానంద్‌నగర్‌లో నివాసముంటున్నారు. వారి రెండో కుమారుడు అయ్యప్ప శ్రీనిధి(21) డిగ్రీ తప్పడంతో తిరిగి పరీక్షలు రాశాడు. కాల్ సెంటర్లో కూడా పనిచేస్తున్నాడు. తను చేస్తున్న ఉద్యోగం నైట్డ్యూటీకావడం, మళ్లీ పాస్ అవుతానోలేదో బెంగతో కొన్ని రోజులుగా ఇంట్లో ముభావంగా ఉంటున్నాడు. ఈ నెల 3వ తేదీ మధ్యాహ్నం అయ్యప్ప శ్రీనిధి అన్న వాచస్పతి ఉద్యోగానికి వెళ్లి రాత్రి తిరిగి వచ్చాడు. ఇంటి తలుపు తట్టినా తీయకపోవడంతో కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్ కొక్కికి ఉరివేసుకొని ఉన్న అయ్యప్ప శ్రీనీధి కనిపించాడు. గమనించగా అప్పటికే మృతి చెందాడు.మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.