ఏడో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
మల్కాజిగిరి : ఏడో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ నరసయ్య కథనం ప్రకారం...మౌలాలి గణేష్‌నగర్‌కు చెందిన రాములు కూతురు మాధవి(14) స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఏడవతరగతి చదువుతోంది. గత కొద్ది కాలంగా ఆమె ఆర్యోగం బాగాలేదు. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. తండ్రి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.