మల్కాజిగిరి(హైదరాబాద్): మెట్టినింటి వేధింపులు భరించలేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ రమేష్ కథనం ప్రకారం..వెంకటేశ్వరనగర్‌కు చెందిన బాలరాజ్ గౌడ్ కుమార్తె రోజా(30) టెక్ మహేంద్ర కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. 2012లో మల్కాజిగిరి జ్యోతినగర్‌కు చెందిన రంగ శ్రీకాంత్‌తో వివాహమైంది. లాంకోహిల్స్‌లోని సదర్‌లాండ్ గ్లోబల్ సర్వీసెస్ సంస్ధలో సాప్ట్‌వేర్ ఉద్యోగిగా శ్రీకాంత్ పనిచేస్తున్నాడు. వీరికి రెండు సంవత్సరాల కొడుకు ఉన్నాడు.పెళ్లి అయిన కొద్ది రోజులు కాపురం సజావుగా జరిగినా చీటికిమాటికి రోజాను భర్త శ్రీకాంత్ అత్త మామలు ధనలక్ష్మి, రాములు వేధించేవారు. గురువారం ఉదయం బాలరాజ్‌గౌడ్‌కు శ్రీకాంత్ ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పాడు.
దీంతో అక్కడికి వెళ్లిన బాలరాజ్‌కు రోజా ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు శ్రీకాంత్ ఇంటి ఇరుగుపొరుగు వారు చెప్పారు. వెంటనే స్టోరూమ్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించిన రోజాను తలుపు పగులగొట్టి బయటకు తీసుకు వచ్చారు. రోజాను సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. కూతురు మృతికి భర్త అత్తమామలే కారణమని కట్నకానుకల క్రింద పెళ్లి సమయంలో రూ.20 లక్షలు అప్పచెప్పామని బాలరాజ్‌గౌడ్ తెలిపారు. తరచూ వేధించేవారని కొడుకు పుట్టిన తర్వాత కూడా మారలేదని అల్లారుముద్గుగా పెంచుకున్న ఒక్కగానొక్క కూతురు దూరమైందని ముగ్గురిని కఠినంగా శిక్షించాలని బాలరాజ్‌గౌడ్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment