
సాక్షి, కామారెడ్డి: వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట్ మండలం మాసాయిపేట బంగారమ్మ ఆలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకెళ్తే.. మల్కాజిగిరి మధురానగర్ కాలనీలో నివాసముండే సంగరాజు వెంకటయ్య కుమారుడు రవికుమార్ (30), లాలగూడా ప్రాతంలో ఉండే సంతోష (29)కు మధ్య గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. అయితే.. సంతోషకు 9 సంవత్సరాల క్రితం శంకర్ యాదవ్ అనే వ్యక్తితో వివాహం కాగా ముగ్గురు కుమారులు ఉన్నారు. రవికుమార్‌కు సైతం వేరే మహిళతో వివాహం జరిగింది.
కాగా.. వీరిమధ్య నడుస్తున్న అక్రమ సంబంధం విషయం ఇరుకుటుంబాలకు తెలియడంతో బైక్‌పై మాసాయిపేటకు వచ్చిన జంట.. రోడ్ పక్కన బైక్ నిలిపి రైలు పట్టాలపై పడుకోగా నిజామాబాద్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు ఢీ కొనడంతో వారు మృతి చెందారు. కామారెడ్డి రైల్వే ఎస్సై తవు నాయక్ ఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాలను పరిశీలించి.. కేసు నమోదు చేసుకున్న అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను కామారెడ్డి రైల్వే ఆసుపత్రికి తరలించారు.
చదవండి: అక్క భర్తతో చనువు.. గర్భవతిగా మారి చివరకు..!
Comments
Please login to add a commentAdd a comment