అమర వీరులకు ప్రముఖుల నివాళులు | PM Modi And Other Leaders Paid Tribute To The Martyrs Remembered Supreme Sacrifice, Check Tweets Inside | Sakshi
Sakshi News home page

అమర వీరులకు ప్రముఖుల నివాళులు

Published Sun, Mar 23 2025 12:23 PM | Last Updated on Sun, Mar 23 2025 2:13 PM

PM modi and Other Leaders Paid Tribute to the Martyrs Remembered Supreme Sacrifice

న్యూఢిల్లీ: ఈరోజు(ఆదివారం) అమరవీరుల దినోత్సవం(Martyrs' Day). ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులను స్మరించుకున్నారు. వారి అత్యున్నత త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ, ప్రధాని నరేంద్ర మోదీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఒక వీడియోను షేర్‌ చేశారు. 

 

‘ఈ రోజు మన దేశం భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల అత్యున్నత త్యాగాలను గుర్తుచేసుకుంటోందని అన్నారు. స్వేచ్ఛ,  న్యాయం కోసం వారు ధైర్యంతో సాగించిన  ప్రయత్నం మనందరికీ స్ఫూర్తినిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
 

 

వారి పేర్లు సువర్ణాక్షరాలు: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ 
అమర వీరులు భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులకు  నివాళులు అర్పిస్తున్నానని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh)  పేర్కొన్నారు. భారతమాతను బానిసత్వ సంకెళ్ల నుండి విడిపించడానికి సర్వస్వం త్యాగం చేసిన ఈ ముగ్గురి పేర్లు సువర్ణాక్షరాలతో లిఖించబడతాయన్నారు.

వినయపూర్వక నివాళులు:అమిత్ షా 
దేశం కోసం అత్యున్నత త్యాగం చేసిన భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను స్మరించుకుంటూ, వినయపూర్వక నివాళులు అర్పిస్తున్నానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వీరు తమ జీవితాల ద్వారా దేశభక్తి కంటే గొప్ప కర్తవ్యం లేదని నిరూపించారన్నారు.

వీరి త్యాగం స్ఫూర్తిదాయకం: ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా 
అమర వీరులు భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులకు అమరవీరుల దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నానని కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా  పేర్కొన్నారు.  ఈ పరాక్రమ పుత్రుల త్యాగం, పోరాటం  దేశ ‍ప్రజలకు నిరంతరం  స్ఫూర్తినిస్తుందని ఆయన అన్నారు.

వీరి అంకితభావం అమోఘం: పీయూష్ గోయల్
విప్లవకారులు భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ పేర్లు వింటేనే బ్రిటిష్ వారు వణికిపోయేవారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్(Piyush Goyal) అన్నారు. భారతమాతకు సేవ చేయడమే తమ జీవిత అంతిమ లక్ష్యంగా భావించి, వీరు ప్రజల్లో స్వాతంత్ర్యంపై అవగాహన కల్పించారు. వీరి అంకితభావానికి ఈ దేశం  రుణపడి ఉంటుందన్నారు.

కొత్త దిశానిర్దేశం:సీఎం యోగి ఆదిత్యనాథ్
అమర అమరవీరులు భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులు తమ అజేయమైన ధైర్యం, విప్లవాత్మక ఆలోచనలతో స్వాతంత్ర్య ఉద్యమానికి కొత్త దిశానిర్దేశం చేశారని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  పేర్కొన్నారు. మాతృభూమి కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన ఈ వీరులకు  దేశం నిరంతరం వందనం చేస్తుందన్నారు.

 

ఇది కూడా చదవండి: ‘నాయక్‌ నహీ.. ఖల్‌నాయక్‌ హూ మై’.. రబ్రీ ఇంటి ముందు సీఎం నితీష్‌ పోస్టర్‌ 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement