Martyrs day
-
అస్తిత్వాన్ని తాకట్టు పెట్టారు
కోల్‌కతా: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎక్కువకాలం కొనసాగదని, త్వరలోనే కూలిపోతుందని పశి్చమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. బెదిరించి, భయపెట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. మమత ఏ పార్టీ పేరు తీసుకోకపోయినప్పటికీ ఆమె పరోక్షంగా ఎన్డీఏ కీలకపక్షాలను ఉద్దేశించే పలు ఘాటు విమర్శలు చేశారు. అమరువీరుల దినోత్సవ భారీ ర్యాలీలో మమత ఆదివారం మాట్లాడారు. ‘పిరికిపందలు, అత్యాశాపరులైన నాయకులు ఆర్థిక తాయిలాలకు లొంగిపోయారు. మంత్రిపదవులకు బదులుగా డబ్బు ఇస్తామనడం ఎప్పుడైనా విన్నామా? పార్టీలు డబ్బుకు అమ్ముడు పోవడం చూశామా? వాళ్లు (ఎన్డీఏ మిత్రపక్షాలు) పిరికిపందలు, సిగ్గులేని వారు. అత్యాశాపరులు. అస్తిత్వాన్ని తాకట్టు పెట్టారు’ అని మమత ధ్వజమెత్తారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఎక్కువకాలం కొనసాగదని, మతతత్వశక్తులకు విజయం లభించినా.. ఓటమి తప్పదని అఖిలేశ్ అన్నారు. -
ఆయన అడుగుజాడల్లో నడుస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నా: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : జాతిపిత మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా.. నివాళులు అర్పించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఈ మేరకు సోమవారం ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. రాష్ట్ర ప్రజల కోసం ఆయన అడుగుజాడల్లో నడుస్తానని, మన దేశం పట్ల ఆయన దార్శనికతను సాకారం చేసుకుందాం అని ట్వీట్ ద్వారా ఆయన పిలుపు ఇచ్చారు. ఈ అమరవీరుల దినోత్సవం సందర్భంగా మన జాతిపిత మహాత్మా గాంధీజీకి నివాళులర్పిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, మన దేశం పట్ల ఆయన దార్శనికతను సాకారం చేసేందుకు ఆయన అడుగుజాడల్లో నడుస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాకు, నా రాష్ట్రానికి, అతను ఎప్పటికీ మనకు ప్రియమైన గాంధీ తాతా అని ట్వీట్ చేశారు. జనవరి 30, 1948లో గాంధీజీ అమరులయ్యారు. దేశం కోసం మన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడానికి ఈ రోజును ‘అమరవీరుల దినోత్సవం’గా కూడా పాటిస్తారు. On this Martyrs’ Day, I pay homage to the father of our nation Mahatma Gandhi ji. For the people of Andhra Pradesh, I vow to follow in his footsteps to realise his vision for our country. For me and my state, he will forever be our beloved Gandhi Thatha. #MahatmaGandhi — YS Jagan Mohan Reddy (@ysjagan) January 30, 2023 -
వాళ్లకు మైండ్ పనిచేయట్లే.. వచ్చేవి బీజేపీ తిరస్కరణ ఎన్నికలే: మమత
కోల్‌కతా: 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఓడిపోతుందని జోస్యం చెప్పారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఆ పార్టీకి మెజారిటీ రాదన్నారు. కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ నిర్వహించిన అమరవీరుల దినోత్సవం కార్యక్రమానికి హాజరైన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అసమర్థ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించి ప్రజా అనుకూల ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని ఆకాక్షించారు . అందుకోసం వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ‘బీజేపీ తిరస్కరణ ఎన్నికలు’ కావాలని పిలుపునిచ్చారు బీజేపీ ప్రభుత్వం నిత్యావసరాలపై కూడా జీఎస్టీ వసూలు చేయడంపై ధ్వజమెత్తారు మమత. బీజేపీకి బుర్ర పనిచేయడం లేదని, మరమరాలు, స్వీట్లు, లస్సీ, పెరుగు వంటి ఆహార పదార్థాలపై కూడా జీఎస్టీ బాదితే ప్రజలు ఏం తినాలని ప్రశ్నించారు. అనారోగ్యంతో ప్రజలు ఆస్పత్రిలో చేరినా దానికి కూడా డీఎస్టీ వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా కారణంగా రెండేళ్ల పాటు అమరవీరుల దినోత్సవాన్ని టీఎంసీ నిర్వహించలేదు. మమత మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఈ కార్యక్రమం జరుగుతున్నందు వల్ల భారీగా ఏర్పాట్లు చేశారు. సభపైకి ఎల్పీజీ సిలిండర్‌ను తీసుకొచ్చి ఇంధన ధరలు భారీగా పెరిగాయని ఎన్డీఏ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు మమత. బ్యాంకులను ప్రైవేటుపరం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. బీజేపీ తమ క్యాడర్‌కు శిక్షణ ఇప్పించేందుకే అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చిందని తీవ్ర ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వచ్చిన బీజేపినుద్దేశించి విమర్శలు గుప్పించారు మమత. 'వాళ్లు ముంబైని విడగొట్టామని భావిస్తున్నారు. తర్వాత ఛత్తీస్‌గఢ్‌ను పడగొడతారు. ఆ తర్వాత బెంగాల్ వస్తారు. ఇక్కడికి రావొద్దని నేను హెచ్చరిస్తున్నా. ఇక్కడ రాయల్ బెంగాల్ టైగర్ ఉంది' అన్నారు. చదవండి: ‘కాషాయం జెండా.. మనదే శివసేన’ -
అమరవీరుల దినోత్సవం.. సీఎం జగన్ నివాళులు
సాక్షి, అమరావతి: అమరవీరుల దినోత్సవం(మార్చి 23న) సందర్భంగా బుధవారం శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో భగత్‌సింగ్ చిత్రపటానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, మంత్రి వనిత, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ కొరుముట్ల శ్రీనివాసులు, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
స్వతంత్ర భారత తొలి దళిత ప్రతిఘటన
కుల రక్కసి సృష్టించిన అసమానతల వ్యవస్థపై దేశంలో తిరుగుబాట్లెన్నో జరిగాయి. స్వతంత్ర∙భారత తొలి దళిత ప్రతిఘటనగా నిలిచిన ‘కీలవేణ్మని పోరాటం’ అందులో ఒక మహోజ్వల ఘట్టం. ‘త్రేతాయుగంలో నేను శంభూకుణ్ణి. ఇరవై రెండేళ్ళ క్రితం నా పేరు కంచికచర్ల కోటేశు. నా జన్మస్థలం కీలవేణ్మని...’ అంటూ ఆ తమిళ పల్లె ధిక్కార స్వరాన్ని అక్షరీకరించాడు కలేకూరి ప్రసాద్. 1960 దశకంలో తమిళనాడులోని కావేరీ డెల్టాలో భాగమైన పూర్వపు తంజావూరు జిల్లా సస్య శ్యామలంగా విలసిల్లేది. అయితే భూమి గల ఆసాములందరూ అగ్ర వర్ణాల వారు కాగా, రైతుకూలీలలో తొంభై శాతం నిమ్న వర్గాలకు చెందినవారే. మగవాళ్లు ఒంటి పైభాగంలో వస్త్రం వేసుకోవడం, వీధుల్లో చెప్పులేసుకుని నడవడం, దళిత స్త్రీలు వక్షస్థలాన్ని దాచుకోవడం నిషిద్ధం. ఈ నేపథ్యంలో జిల్లాలోని రైతు కూలీలు సంఘటితమై సీపీఎం నాయకత్వంలో వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 1968లో కూలీ రేట్లు పెంచాలనే ఉద్యమం ఊపందుకున్నది. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేంత వరకు పొలాలలో పనులు సాగవంటూ రైతు కూలీలు సమ్మెకు దిగారు. భూస్వాములు పోటీగా వ్యవసాయదారుల సంఘాన్ని స్థాపించారు. స్థానిక కూలీలను తొలగించి, వేరే ప్రాంతాల నుండి కూలీలను తెచ్చి పనులు చేయించడం మొదలు పెట్టారు. డిసెంబర్ 25, 1968న భూస్వాముల గూండాలు... గణ పతి, ముత్తుస్వామి అనే కార్మిక సంఘం కార్యకర్తలను కిడ్నాపు చేసి చిత్రహింసలకు గురిచేశారు. రైతు కూలీలందరూ కర్రలు, బరిసెలు పట్టుకుని ఊరేగింపుగా బయల్దేరి, భూస్వాముల ఇండ్లపై దాడి చేసి తమవారిని విడిపించుకున్నారు. ఆ దాడిలో ఒక భూస్వాముల గూండా రైతుకూలీల చేతుల్లో చనిపోవడం జరిగింది. రైతు కూలీల ప్రతిఘటన భూస్వాముల ఉక్రోషాన్ని రెచ్చగొట్టింది. పోలీసుల అండతో అదేరోజు రాత్రి దళితవాడపై దండెత్తారు. భూస్వాముల పక్షం వహించిన పోలీసులు అకార ణంగా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో కొందరు మరణిం చారు. మిగతా వారందరూ పోలీసుల దాడినుండి తప్పించు కునే క్రమంలో రైతుకూలీ రామయ్యకు చెందిన గుడిసెలో తలదాచుకున్నారు. గోపాలకృష్ణన్ నాయుడు, ఇతర భూస్వా ములూ గుడిసెపై పెట్రోల్ పోసి నిప్పంటించమని గుండాలను ఆదేశించారు. క్షణాల్లో రామయ్య గుడిసె అగ్నిగుండంగా మారింది. లోపల తలదాచుకున్న వారు ఆర్తనాదాలు చేస్తూ అగ్నికి ఆహుతయ్యారు. పసి పిల్లల్నైనా రక్షించుకుందామనే ఆశతో తగలబడుతున్న తల్లులు తమ పిల్లల్ని బయటకి గిర వాటు వేస్తే... బయటనున్న భూస్వాములు వాళ్లని మళ్లీ గుడిసె మంటల్లోకి తోశారు. తెల్లారి తీరిగ్గా వచ్చిన పోలీసులు... కాలి బూడిదైన గుడిసె పరిసరాలను పరిశీలిస్తే... 44 మంది దళిత బిడ్డల కాలిన శవాలు దర్శనమిచ్చాయి. 23 మంది పిల్లలు, 16 మంది మహిళలు, ఐదుగురు పురుషులు. కీలవేణ్మని మారణకాండ వార్త దేశమంతా దావానలంలా వ్యాపించింది. నాటి తమిళనాడు ముఖ్యమంత్రి అన్నాదురై తన మంత్రివర్గంలోని పీడబ్ల్యూడీ శాఖ మంత్రి కరుణానిధిని తక్షణం కీలవేణ్మని వెళ్లి పరిస్థితులు చక్కదిద్దాలని ఆదేశించాడు. కేరళలో పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఉన్న సీపీఎం నాయకులు జ్యోతిబసు, రణదివే, రామ్మూర్తి హుటాహుటిన కీలవేణ్మని చేరుకున్నారు. తంజావూరు జిల్లాలోని రైతు కూలీ సంఘాల కార్యకర్తలందరూ బహిరంగ సభ నిర్వహించి ప్రతీ కారేచ్ఛతో రగిలిపోయారు. పార్టీ నాయకులు వారిని శాంతింప జేసి.. చట్టప్రకారం చర్యలు తీసుకుందామని నచ్చజెప్పారు. నాగపట్టిణం జిల్లా కోర్టు గోపాలకృష్ణన్ నాయుడుతో సహా పది మందిని దోషులుగా నిర్ధారిస్తూ పదేళ్ల జైలు శిక్ష విధిస్తే.. మద్రాస్ హైకోర్టు సరైన సాక్ష్యాధారాలు లేవనే నెపంతో రద్దు చేసింది. డబ్బున్న ఆసాములు ఇళ్లలోనే ఉండి తమ మనుషు లకు ఆదేశాలు ఇస్తారు తప్ప స్వయంగా మారణకాండలో పాల్గొన్నారంటే నమ్మలేము... అనే కారణాలను న్యాయమూర్తి పేర్కొన్నారు. డీఎంకే ప్రభుత్వం సైతం బాధితులకు న్యాయం అందించడంలో ప్రేక్షక పాత్ర వహించింది. రామయ్య గుడిసె స్థానంలో ఒక స్మారక స్థూపాన్ని ఏర్పరచి 44 మంది అమర వీరుల పేర్లు చెక్కారు. మాయంది భారతి అనే స్వాతంత్య్ర సమర యోధుడు మారణకాండ జరిగిన మరుసటి రోజు మృత వీరుల అవశేషాలను గాజు గిన్నెలో సేకరించాడు. ఆ గిన్నెను స్మృతి చిహ్నంలో నిక్షిప్తం చేశారు. ఐద్వా జాతీయ నాయకురాలు మైథిలి శివరామన్ విస్తృ తంగా వ్యాసాలు రాసి... బాధితులకు బాసటగా రాష్ట్ర ప్రజ లను సమీకరించారు. ఆ ప్రతిఘటనపై ఇందిరా పార్థసారథి రాసిన ‘కురుదిప్పునల్’కు సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. 1983లో ఆ నవల ఆధారంగా ‘కన్న్ శివంతల్ మన్న్ శివక్కం’ తమిళ చిత్రం వచ్చింది. 2019లో వచ్చిన అసురన్ (తెలుగులో నారప్ప) సైతం దీన్ని ఇతివృత్తంగా తీసుకున్నదే. – ఆర్. రాజేశమ్ కన్వీనర్, సామాజిక న్యాయవేదిక ‘ 94404 43183 (నేడు కీలవేణ్మని మృతవీరుల సంస్మరణ దినం) -
అమరుల త్యాగాలు మరువలేనివి
సాక్షి, నెల్లూరు : దేశ, సమాజ రక్షణలో తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అమరవీరుల త్యాగాలు మరువలేనివని జాయింట్ కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ అన్నారు. నెల్లూరులోని జిల్లా పోలీసు కవాతు మైదానంలో సోమవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో ఉన్న జవాన్లు యుద్ధం వచ్చినప్పుడే పోరాడుతారని, పోలీసులు సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు నిత్యం కృషి చేస్తుంటారని అన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, మతతత్వం, ఫ్యాక్షనిజం వంటి విచ్ఛిన్నకర శక్తులు, అసాంఘిక శక్తులతో పోరాడే క్రమంలో ఎందరో తమ ప్రాణాలను అరి్పస్తున్నారన్నారు. వారు భౌతికంగా మృతిచెందినా అందరి హృదయాల్లో చిరస్మరణీయులుగా నిలుస్తారన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది విధి నిర్వహణలో 292 మంది మృతిచెందగా జిల్లాలో 19 మంది అమరులయ్యారని తెలిపారు. నేటి మన నిశి్చంత జీవనం వారి అవిశ్రాంత త్యాగఫలమన్నారు. వారి ఆశయ సాధనకు అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏఎస్పీ క్రైమ్స్ పి.మనోహర్‌రావు మాట్లాడుతూ అవినీతి, అక్రమాలకు దూరంగా ఉంటూ ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలను అందించడమే అమరవీరులకిచ్చే నిజమైన నివాళి అని అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలను అరి్పంచిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఒక్క పోలీసు విధులు నిర్వహించాలన్నారు. అనంతరం అమరవీరుల వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, పెయింటింగ్, కార్టూన్ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఘన నివాళి పోలీసు కవాతు మైదానంలోని అమరవీరుల స్థూపం వద్ద జాయింట్ కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్, ట్రైనీ కలెక్టర్ కల్పనకుమారి, ఏఎస్పీ క్రైమ్స్ పి.మోహన్‌రావు, మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పి.రూప్‌కుమార్‌యాదవ్, డీఎస్పీలు ఎన్.కోటారెడ్డి, బి.లక్ష్మీనారాయణ, జె.శ్రీనివాసులురెడ్డి, కె.వి.రాఘవరెడ్డి, బి.భవానీహర్ష, మల్లికార్జునరావు, వై.రవీంద్రరెడ్డి, నగర ఇన్స్పెక్టర్లు ఎన్.మధుబాబు, కె.వేమారెడ్డి, కె.రాములునాయక్, మిద్దె నాగేశ్వరమ్మ, టి.వి.సుబ్బారావు, వైవీ సోమయ్య, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దిపాటి ప్రసాదరావు, ఆర్ఐలు చంద్రమోహన్, మౌలాలుద్దీన్, రమే‹Ùకృష్ణన్, ఎస్ఐలు, సిబ్బంది పుష్పగుచ్చాలుంచి నివాళులరి్పంచారు. అనంతరం అమరవీరుల స్మృత్యర్థం పోలీసు సిబ్బంది స్మృతి పరేడ్ నిర్వహించారు. జోరువానలోనూ అక్కడ నుంచి నగరంలో ర్యాలీ నిర్వహించారు. వెంకటగిరిరూరల్: శాంతిభద్రల పరిరక్షణ కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా విడిచిన పోలీసు అమరవీరుల త్యాగం వెలకట్టలేనిదని 9వ బెటాలియన్ కమాండెంట్ ఎల్ఎస్ పాత్రుడు అన్నారు. పోలీసు అమరవీరుల దినం సందర్భంగా వెంకటగిరి మండలంలోని వల్లివేడు సమీపంలో ఉన్న 9వ బెటాలియన్‌లో సోమవారం బెటాలియన్ సిబ్బంది అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులరి్పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీలో పోలీసుల పాత్ర చాలా కీలకమైందని అన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ 9వ బెటాలియన్‌లో ప్రతి ఏటా స్మరించుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం అమరవీరుల కుటుంబసభ్యులకు స్మారక జ్ఞాపికలను అందజేశారు. గత వారం రోజులుగా నిర్వహించిన వారోత్సవాల్లో విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలైన వారికి బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ మోహన్‌ప్రసాద్, అసిస్టెంట్ కమాండెంట్ శ్రీనివాసులు, శివరామప్రసాద్, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు. -
14వేలమంది రక్తదానం చేశారు!
సాక్షి, విజయవాడ: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. రామవరప్పాడులోని శుభమ్ కళ్యాణ మండపంలో ఆదివారం మెగా రక్తదాన శిబిరాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు. రక్తదానం చేసేందుకు పోలీసు విభాగాల్లో సిబ్బంది పెద్ద ఎత్తున ముందుకొచ్చారు. రక్తదాతలను డీజీపీ గౌతం సవాంగ్ అభినందించారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించామని, మొత్తం 14వేలమంది రక్తదానం చేశారని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. తొమ్మిదివేల మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారని చెప్పారు.ప్రజలకు ప్రశాంత జీవనాన్ని కల్పించేందుకు పోలీసులు ప్రాణత్యాగానికి కూడా వెనకాడరని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రజలకు పోలీసులకు మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉందన్నారు. జర్నలిస్టులపై ఎవరు దాడి చేసినా కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. అంతకుముందు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఉదయం 3కే రన్ నిర్వహించారు. విజయవాడ బీఆర్టీయస్ రోడ్డులో నిర్వహించిన ఈ రన్లో భారీగా చిన్నారులు, యువత పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు సీపీ ద్వారకా తిరుమలరావు నగదు బహుమతితోపాటు మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రేపు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్మృతి పరేడ్‌ను నిర్వహించనున్నట్లు సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు హోంమంత్రి, డీజీపీ పాల్గొంటారని స్పష్టం చేశారు. 1959లో అమరులైన సీఆర్పీఎఫ్ పోలీసులను స్మరించుకుంటూ అమరవీరుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నామని, ఈ నెల 15 నుంచి 21 వరకు పోలీసు అమరవీరుల వారోత్సవాలను నిర్వహిస్తున్నన్నామని ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఇందులో భాగంగా 15,16 తేదీల్లో ఓపెన్ హౌస్‌లు, వెపన్స్ ప్రదర్శన, డాగ్ షో వంటి కార్యక్రమాలు నిర్వహించామని, ప్రజల కోసం, వారి రక్షణ కోసమే మేము ఉన్నామని భరోసా ఇవ్వాలని ఈ వారోత్సవాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ నెల 17,18 తేదీల్లో రక్త దాన శిబిరాన్ని నిర్వహించామని చెప్పారు. పోలీసులపై ఉన్న అపోహలను పోగొట్టాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. -
2న అమరుల ఆకాంక్షల దినం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భా వం రోజైన జూన్ 2ను అమరవీరుల ఆకాంక్షల లక్ష్యసాధన దినంగా నిర్వహించాలని సీపీఐ నిర్ణయించింది. అదేరోజున పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీ సమీపంలోని అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళి అర్పించడంతో పాటు మఖ్దూంభవన్‌లో జెండా ఎగురవేసి కార్యక్రమాలు నిర్వహించాలని, అలాగే అన్ని జిల్లాల్లోనూ అమరుల ఆకాంక్షల సాధన దినోత్సవాన్ని జరపాలని తీర్మానించింది. మఖ్దూంభవన్‌లో మంగళవారం జరిగిన పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో జాతీయ, రాష్ట్రస్థాయి రాజకీయాలు, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు తదితర అంశాలను చర్చిం చారు. క్షేత్రస్థాయిలో పార్టీని విస్తరించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను వివరించారు. ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో ఎంపీపీలతోపాటుగా గణనీయ సంఖ్యలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను పార్టీ గెలుచుకుంటుందని నాయకులు అభిప్రాయపడ్డారు. పాలన పడకేసింది.. రాష్ట్రంలో పాలన పూర్తిగా పడకేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తికాలేదన్నారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరుల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. యువత బలిదానాల తో పోరాడి తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజాస్వామ్య విలువలకు పాతరేసే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. హైకోర్టు అక్షింతలు వేసినా ఇంటర్ ఫలితాల వ్యవహారంలో దోషులను శిక్షించేందుకు, ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లింపు విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. -
కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
హైదరాబాద్: తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు గౌరవం దక్కడం లేదని, ఎవరి త్యాగాల పునాదులపై రాష్ట్రం ఏర్పడిందో ఆ అమరవీరుల కోసం ఒక రోజును కేటాయించడానికి కూడా ప్రభుత్వానికి మనసు రావడం లేదని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఆత్మబలిదానం చేసిన 3వ తేదీని అమరవీరుల దినోత్సవంగా ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు ఓ బహిరంగ లేఖ రాశారు. ‘ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశంలో తెలంగాణ కోసం తొలి ఉద్యమంలో 369 మంది, మలి ఉద్యమంలో 1200 మంది అమరులయ్యారని అధికారికంగా ప్రకటించారు. వీరి కుటుంబాలకు వ్యవసాయ భూమి, రూ.10లక్షల ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇంటిని ఇస్తామని తీర్మానం చేశారు. కానీ, అమరవీరులను గౌరవించే విషయంలో ప్రభుత్వ దృక్పథం మారినట్లు కనిపిస్తోంది. మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ 500 మంది అమరుల కుటుంబాలకు మాత్రమే సాయం చేసి చేతులు దులిపేసుకున్నారు. మిగిలిన కుటుంబాలను ఇప్పటికీ గుర్తించడం లేదు. తెలంగాణ సమాజానికి అమరవీరుల త్యాగాలను గుర్తుచేయడం ఇష్టం లేకనే ఆ కుటుంబాలను మీరు పట్టించుకోవడం లేదన్నది మా పార్టీ అభిప్రాయం’ అని ఆ లేఖలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో అమరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, హైదరాబాద్‌లో అత్యంత ఎత్తైన స్మృతి చిహ్న నిర్మాణం తక్షణమే ప్రారంభించాలని, 31 జిల్లాల్లో స్మృతి స్థూపాల నిర్మాణాలు చేపట్టాలని, ఉద్యమ సమయంలో వారిపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేయాలని రేవంత్ రెడ్డి ఆ బహిరంగ లేఖలో డిమాండ్ చేశారు. -
రేపు ఉ.11 గంటలకు అంతా స్టాండప్!
హైదరాబాద్: జనవరి 30న అమరవీరుల దినోత్సవాన్ని ప్రతిఒక్కరు తమ బాధ్యతగా జరుపుకునేలా చేయాలని నగర ట్రాఫిక్ పోలీస్ విభాగం భావిస్తోంది. రేపు ప్రతి ఒక్కరూ అమరుల త్యాగాలకు గుర్తింపుగా ఉదయం 11 గంటలకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని ఓ ప్రకటనలో వెల్లడించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరుల కోసం ఉదయం 11 గంటల నుంచి రెండు నిమిషాల పాటు రోడ్లపై ఎక్కడివారు అక్కడే ఆగిపోవాలని, మౌనం పాటించాలని వాహనదారులు పోలీసులకు సహకరించాలని నగర పోలీసులు సూచించారు. భారత స్వాతంత్ర్య పోరాట యోధుడు మహాత్మగాంధీ హత్యకు గురైన జనవరి 30ని అమరుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. జనవరి 30న ఉదయం 11గంటల ప్రాంతంలో ఎవరు ఎలాంటి పనుల్లో ఉన్నా వాటన్నింటిని నిలిపేసి ఓ రెండు నిమిషాలపాటు మౌనంపాటించి గాంధీ మహాత్ముడికి శ్రద్ధాంజలి ఘటిస్తూ అమరులందరికీ మనసులో వందనం చేసుకునేలా చేయాలని భావించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశాలు జారీచేసిన విషయం విదితిమే. -
పాకిస్థాన్ త్వరలో పది ముక్కలవుతుంది!
సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపకపోతే అదే గతి: రాజ్‌నాథ్ హెచ్చరిక శ్రీనగర్: మతం ఆధారంగా భారత్‌ను విభజించాలని పాకిస్థాన్ ప్రయత్నిస్తున్నదని, కానీ అది ఎన్నటికీ జరగబోదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అమరవీరుల దినోత్సవం సందర్భంగా జమ్మూకశ్మీర్‌లో కథువాలోని ఆయన ఆదివారం ప్రసంగించారు. ఉగ్రవాదం పిరికిపందల ఆయుధం మాత్రమేనని పాక్‌పై మండిపడ్డారు. సరిహద్దుల్లో ఎలాంటి కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడినా దీటుగా సమాధానం ఇస్తామని ఆయన తేల్చిచెప్పారు. ఉడీ ఉగ్రవాద దాడి అనంతరం భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌ను ప్రస్తావిస్తూ ‘మా ప్రభుత్వం భారత్‌ను ఎవరి ముందు తలవంచుకోనివ్వదు. పాకిస్థాన్ ఎలాంటి దాడులు చేసినా వాటిని దీటుగా తిప్పుకొడతాం’ అని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నాలుగుసార్లు భారత్‌పై పాకిస్థాన్ దాడికి దిగిందని, అన్నిసార్లు ఆ దేశానికి తగిన బుద్ధి చెప్తామని పేర్కొన్నారు. ‘(1971లో) పాకిస్థాన్ రెండు దేశాలుగా చీలిపోయింది. ఒకవేళ సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపకుంటే ఆ దేశం త్వరలోనే పదిముక్కలుగా విచ్ఛిన్నమవుతుంది’ అని రాజ్‌నాథ్ అన్నారు. -
అమరవీరులను స్మరించుకోవడం బాధ్యత
నెల్లూరు(బారకాసు): అడవుల సంరక్షణలో భాగంగా విధులు నిర్వర్తిస్తూ ప్రాణత్యాగాలు చేసిన అటవీ అమరవీరులను స్మరించుకోవడం మన బాధ్యతని అటవీ అభివృద్ధి సంస్థ(ఎఫ్డీసీ) రీజినల్ మేనేజర్ శ్రీనివాసశాస్త్రి పేర్కొన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా అటవీ కార్యాలయంలో అమర వీరుల స్తూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అటవీ సంరక్షణలో సిబ్బంది చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని సూచించారు. అడవులను కాపాడుతూ 14 మంది అటవీ సిబ్బంది తమ ప్రాణాలను కోల్పోయారని చెప్పారు. ఎఫ్డీసీ డీఎం రామకృష్ణ, నెల్లూరు రేంజర్ శ్రీకాంత్‌రెడ్డి, తెలుగుగంగ ఫారెస్ట్ రేంజర్లు అల్లాభక్షు, శ్రీదేవి, మారుతీప్రసాద్, డీఎఫ్ఓ కార్యాలయ సిబ్బంది రమేష్, సురేష్, హరికుమార్, తదితరులు పాల్గొన్నారు. -
అటవీశాఖ అధికారులకు రక్షణ అవసరం
అమర వీరుల దినోత్సవంలో డీఎఫ్ఓ శ్రీధర్‌రావు మెదక్: అటవీశాఖ అధికారులకు పూర్తిస్థాయి రక్షణ లేదని, ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి హక్కులను తమ శాఖకు అప్పగిస్తే బాగుంటుందని మెదక్ డీఎఫ్ఓ శ్రీధర్‌రావు తెలిపారు. ఆదివారం అటవీశాఖ అమర వీరుల దినోత్సవాన్ని స్థానిక డీఎఫ్ఓ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు పట్టణంలో అమర వీరులను స్మరించుకుంటూ ర్యాలీని నిర్వహించారు. ఉద్యోగ నిర్వహణలో అమరుల కుటుంబీకులను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల పాపన్నపేట మండలంలోని ఓ గ్రామంలో అటవీశాఖ అధికారులపై విచక్షణ రహితంగా దాడులు చేస్తే ఏమీ చేయలేని దుస్థితి నెలకొందన్నారు. ఇందుకు సంబంధించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కులంపేరుతో దూషించారంటూ మళ్లీ తమ అధికారులపైనే ఫిర్యాదులు చేశారన్నారు. అడవులను ఎవరు ఆక్రమించినా, తమ అనుమతి లేకుండా ఎవరు అడవిలోకి వెళ్లినా వారిపై చర్యలు తీసుకునే పూర్తిస్థాయి హక్కులను తమకు అప్పగిస్తే బాగుంటుందన్నారు. గతంలో అనేక మంది అటవీశాఖ అధికారులపై స్మగ్లర్లు, అక్రమ కలప వ్యాపారులు దాడులు చేసి చంపిన సంఘటనలు ఉన్నాయని, 2013లో నారాయణ ఖేడ్‌లో విధులు నిర్వహిస్తున్న బీట్ ఆఫీసర్ శివలాల్‌ను దారుణంగా హత్యచేసి పెట్రోల్‌పోసి చంపారన్నారు. అలాంటి అమర వీరుల త్యాగాలు మరువలేనివన్నారు. ఆయన వెంట రేంజ్ ఆఫీసర్లు చంద్రశేఖర్, బర్నోబ తదితరులు ఉన్నారు. -
'ఆ రోజు రెండు నిమిషాలు మౌనం పాటించాలి'
న్యూఢిల్లీ: అమరుల దినోత్సవాన్ని ప్రతిఒక్కరు తమ బాధ్యతగా జరుపుకునేలా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేస్తూ ఆదేశాలు పంపించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ విద్యా సంస్థలకు ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి జనవరి 30న ప్రతి ఒక్కరు ఎంతో బాధ్యతగా అమరుల దినోత్సవాన్ని పాటించేలా, ఆరోజు అందరూ అందులో పాల్గొనేలా చేయాలని ఆదేశాల్లో సూచించింది. భారత స్వాతంత్ర్య పోరాట యోధుడు మహాత్మగాంధీ 1948, జనవరి 30న హత్యకు గురైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ తేదిని అమరుల దినోత్సవంగా పాటిస్తున్నారు. అయితే, దీనిని అందరూ సక్రమంగా అనుసరించడం లేదనే అపవాదు కొద్దికాలంగా ఎదురవుతుంది. దీంతో ఈసారి జనవరి 30న ఉదయం 11గంటల ప్రాంతంలో ఎవరు ఎలాంటి పనుల్లో ఉన్నా వాటన్నింటిని నిలిపేసి ఓ రెండు నిమిషాలపాటు మౌనంపాటించి గాంధీ మహాత్ముడికి శ్రద్ధాంజలి ఘటిస్తూ అమరులందరికీ మనసులో వందనం చేసుకునేలా చేయాలని, దేశ ఐక్యత స్ఫూర్తిని ప్రజ్వరిల్లేలా చేయాలని భావించి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆ రోజు స్వాతంత్ర్య సమరయోధులకు సంబంధించిన విశేషాలతో కూడిన చర్చలు, సమావేశాలు, సభలు నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశించింది. -
మార్టిర్స్ డే మనది.. ఫొటోలు అమెరికా సైన్యానివి
న్యూఢిల్లీ: చండీగఢ్‌లోని ఓ మున్సిపల్ కార్పొరేషన్ లిమిటెడ్ అతిపెద్ద తప్పిదానికి పాల్పడింది. దేశ స్వాతంత్ర్యానికై, రక్షణకై ప్రాణాలు వదిలిన వారిని గుర్తుచేసుకునేందుకు పాటించే అమరుల దినోత్సవం రోజున ప్రచురించే చిత్రాల్లో భారత సైన్యానికి చెందిన ఫొటోను కాకుండా అమెరికా సైన్యం ఫొటోలను పెట్టింది. ఇందులో ముగ్గురు అమెరికా సైనికులు వారి దేశ జాతీయ పతాకాన్ని మోస్తూ వారి సైనిక దుస్తుల్లో కనిపిస్తూ ఆ చిత్రాల్లో ఉన్నారు. దీనిపై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పూనమ్ స్పందిస్తూ ఆ ఫొటోను ఇంటర్నెట్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే క్రమంలో పొరపాటు జరిగినట్లు తెలిపారు. ఈ విషయం తనకు నిన్ననే తెలిసిందని, సంబంధిత అధికారులతో చర్చలు జరిపానని, మరింత తీవ్రంగా పరిశీలిస్తున్నానని చెప్పారు. భారత్‌లో ప్రతి ఏటా జనవరి 30న, మార్చి 23న(భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్)లకు గుర్తుగా జాతీయ అమరుల దినోత్సవం జరుపుతారు.