న్యూఢిల్లీ: చండీగఢ్లోని ఓ మున్సిపల్ కార్పొరేషన్ లిమిటెడ్ అతిపెద్ద తప్పిదానికి పాల్పడింది. దేశ స్వాతంత్ర్యానికై, రక్షణకై ప్రాణాలు వదిలిన వారిని గుర్తుచేసుకునేందుకు పాటించే అమరుల దినోత్సవం రోజున ప్రచురించే చిత్రాల్లో భారత సైన్యానికి చెందిన ఫొటోను కాకుండా అమెరికా సైన్యం ఫొటోలను పెట్టింది. ఇందులో ముగ్గురు అమెరికా సైనికులు వారి దేశ జాతీయ పతాకాన్ని మోస్తూ వారి సైనిక దుస్తుల్లో కనిపిస్తూ ఆ చిత్రాల్లో ఉన్నారు.
దీనిపై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పూనమ్ స్పందిస్తూ ఆ ఫొటోను ఇంటర్నెట్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే క్రమంలో పొరపాటు జరిగినట్లు తెలిపారు. ఈ విషయం తనకు నిన్ననే తెలిసిందని, సంబంధిత అధికారులతో చర్చలు జరిపానని, మరింత తీవ్రంగా పరిశీలిస్తున్నానని చెప్పారు. భారత్లో ప్రతి ఏటా జనవరి 30న, మార్చి 23న(భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్)లకు గుర్తుగా జాతీయ అమరుల దినోత్సవం జరుపుతారు.
మార్టిర్స్ డే మనది.. ఫొటోలు అమెరికా సైన్యానివి
Published Mon, Mar 23 2015 10:33 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM
Advertisement