
హిరానగర్: జమ్మూ కశ్మీర్‌లోని కతూవా జిల్లాలో భారత్-పాక్ సరిహద్దు ప్రాంతమైన హిరానగర్ సెక్టార్ సన్యాల్ గ్రామంలో ఉగ్రవాదులకు, రక్షణ దళాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. పూంచ్ పోలీసులు కలిసి సంయుక్తంగా చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా భారత రక్షణ దళాల బృందంపై ఉగ్రవాదులు ఆకస్మికంగా కాల‍్పులు జరపడానికి యత్నించారు. దాంతో రక్షణ దళాలు కూడా అప్రమత్తమై ఎదురుకాల్పులకు దిగింది. కొంతమంది అనుమానితులు ఆ ప్రాంతంలో నిఘా వేసినట్లు సమాచారం అందుకున్న రక్షణ దళాలు.. ఆదివారం సాయంత్రం వేళ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులకు, రక్షణ దళాలకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది.
నిన్న భారత ఆర్మీ బలగాలు, పూంచ్ పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. సురాన్ కోట్ లో ఉగ్రవాదులు మాటు వేశారన్న సమాచారంలో ఈ జాయింట్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన విషయాన్ని పసిగట్టిన ఉగ్రమూకలు.. ఓ అటవీ ప్రాంతంలోకి జారుకున్నారు. అయితే అక్కడ ఉగ్రవాదులకు సంబంధించిన కొన్ని మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ కొనసాగింపులో భాగంగా ఆదివారం నాడు ఉగ్రవాదులు, భారత రక్షణ దళాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్‌కు సంబంధించి ఎవరైనా గాయపడ్డారా, మరణించారా అనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment