![Indian Army Stops Infiltration Bid Of Pakistan Army Men](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/jammukashmir.jpg.webp?itok=EKUX3c9q)
పూంచ్:జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు(ఎల్‌వోసీ) వద్ద ఇటీవల భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పూంచ్ జిల్లాలోని క్రిష్ణఘాటి సెక్టార్‌లో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు చొరబాటుదారులు హతమయ్యారు. మృతి చెందిన వారిలో ముగ్గురు దాకా పాకిస్తాన్ ఆర్మీ జవాన్లే కావడం గమనార్హం.
పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ సభ్యులు ఫిబ్రవరి 4 అర్ధరాత్రి సరిహద్దు ద్వారా భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. వీరిని అడ్డుకోవడానికి సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఏడుగురు చొరబాటుదారులు మృతి చెందారు. ఫిబ్రవరి5వ తేదీని కాశ్మీర్ లిబరేషన్ డేగా పాకిస్తాన్ జరుపుకుంది. ఈ నేపథ్యంలో అదే రోజు పాక్ ఆర్మీకి చెందిన జవాన్లు భారత్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించడం పట్ల సైన్యం అప్రమత్తమై వారి ప్రయత్నాన్ని అడ్డుకుంది.
ఇటీవల జమ్ముకశ్మీర్‌లో వరుస ఘటనల్లో పలువురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. ఈ ఎన్‌కౌంటర్‌లలో పలువురు జవాన్లు కూడా గాయపడ్డారు. డిసెంబర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతమైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment