సాక్షి, శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లోని బందిపూర్ ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ఉగ్రవాదులపై పై చేయి సాధించాయి. హజిన్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 5 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టు పెట్టాయి. ఈ విషయాన్ని జమ్ము కశ్మీర్ డీజీపీ కూడా ధృవీకరించారు.
చనిపోయిన ఉగ్రవాదుల్లో ఎన్‌కౌంటర్‌లో 26/11 ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి జకీర్ ఉర్ రెహమాన్ లఖ్వీ మేనల్లుడు కూడా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా మృతి చెందిన ఉగ్రవాదులంతా లష్కరే తోయిబాకు చెందిన వారని భద్రతా బలగాలు ప్రకటించాయి. ఒక ఐఏఎఫ్ కమాండర్ కూడా అమరుడైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. లష్కరే తోయిబాలో చేరిన కశ్మీర్ ఫుట్‌బాల్ ప్లేయర్ తిరిగి జనజీవన స్రవంతిలోకి చేరిన కొన్ని గంటల్లోనే భద్రతాబలగాలు ఉగ్రవాదులను ఏరివేయటం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment