జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌ కౌంటర్‌ | 5 Terrorists Killed In Encounter With Security Forces In Jammu And Kashmir, Watch Video Inside | Sakshi
Sakshi News home page

జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌ కౌంటర్‌

Dec 19 2024 8:55 AM | Updated on Dec 19 2024 11:10 AM

5 terrorists killed in encounter with security forces in jammu and kashmir

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌ కౌంటర్‌ జరిగింది. కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదాలు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో గురువారం కద్దర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.

‘ఉగ్రవాదుల ఉనికికి సంబంధించిన సమాచారం మేరకు కుల్గాం జిల్లా ఖాదర్‌లో భారత సైన్యం, జమ్మూకశ్మీర్‌ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాదులు, సైనికుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో ఐదురుగు టెర్రరిస్ట్‌లు మృతి చెందగా.. ఇద్దరు భారత సైనికులకు గాయాలయ్యాయి’అని భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్స్ విభాగం ఎక్స్‌ వేదికగా ధృవీకరించింది.  

ఉగ్రవాదుల ఏరివేతలో భారత సైన్యం
మరోవైపు, జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల్ని ఏరివేత చేయడంలో భద్రతా బలగాలు కీలక ఆపరేషన్లు చేపట్టాయి. ఈ నెల ప్రారంభంలో, జమ్మూ కాశ్మీర్‌లోని గగాంగీర్, గందర్‌బల్, ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెర్రరిస్ట్‌ను శ్రీనగర్ జిల్లాలో కాల్చి చంపారు.

గత నెలలో జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్, ఖన్యార్ ప్రాంతాల్లో ముగ్గురు ఉగ్రవాదులను, అక్టోబర్‌ నెలలో కాశ్మీర్‌లో గందేర్‌బల్‌ జిల్లాలోని గగన్‌గిర్‌ వద్ద గగన్‌గీర్‌ నుంచి సోనామార్గ్‌ వరకు చేపడుతున్న జడ్‌-మోర్హ్‌ సొరంగ నిర్మాణంలో పాల్గొన్న సిబ్బందిపై మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ జునైద్‌ అహ్మద్‌ భట్‌ బృందం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో డాక్టర్‌, ఆరుగురు కార్మికులు మృతి చెందారు. టెర్రరిస్ట్‌ల కాల్పులతో అప్రమత్తమైన భారత సైన్యం ఎదురు దాడి చేసింది. మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ జునైద్‌ అహ్మద్‌ భట్‌ను మట్టుబెట్టింది.

Advertisement
 
Advertisement
Advertisement