జమ్మూకశ్మీర్‌లో శనివారం భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. కల్గామ్ జిల్లాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులు మద్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ జవాన్ అమరవీరుడైనట్లు కశ్మీర్ జోన్ పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
జమ్మూ కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలోని మెడెర్గామ్ గ్రామంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు ఆర్మా అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో ఆ ప్రాతంలో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. వీరిని పసిగట్టిన టెర్రరిస్టులు కాల్పులు జరిపారు.
జవాన్లు సైతం ఎదురు కాల్పులు జరపడంతో ముగ్గురు ఉగ్రవాదులను వారి రహస్య స్థావరంలో మట్టుబెట్టారు. అయితే ఈ ఎన్‌కౌంటర్ ఓ సైనికులు సైతం ప్రాణాలువిడిచాడు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment