Kulgam district
-
జమ్మూకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఆర్మీ జవాన్ వీరమరణం
జమ్మూకశ్మీర్‌లో శనివారం భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. కల్గామ్ జిల్లాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులు మద్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ జవాన్ అమరవీరుడైనట్లు కశ్మీర్ జోన్ పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.జమ్మూ కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలోని మెడెర్గామ్ గ్రామంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు ఆర్మా అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో ఆ ప్రాతంలో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. వీరిని పసిగట్టిన టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. జవాన్లు సైతం ఎదురు కాల్పులు జరపడంతో ముగ్గురు ఉగ్రవాదులను వారి రహస్య స్థావరంలో మట్టుబెట్టారు. అయితే ఈ ఎన్కౌంటర్ ఓ సైనికులు సైతం ప్రాణాలువిడిచాడు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
కుల్గామ్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: కశ్మీర్‌లోని కుల్గామ్‌లో భారత బలగాలకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. ఒకపక్క రాజౌరీ జిల్లాలో 48 గంటలుగా ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతుండగానే కుల్గామ్‌లోని కుజ్జర్ ప్రాంతంలో ఉగ్రవాదుల అలజడిపై పక్కా సమాచారంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగారు. కార్డాన్ సెర్చ్‌లో భాగంగా కుల్గామ్‌లో ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా ఉన్నట్టుండి మాపై కాల్పులు జరపగా వెంటనే అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపామని ఎన్కౌంటర్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారని వారి మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపాయి కశ్మీర్ పోలీస్ వర్గాలు. ఇదిలా ఉండగా రాజౌరీ జిల్లాలోని కలకోట్ అటవీప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం అందడంతో భారత బలగాలు కార్డన్ సెర్చ్ మొదలుపెట్టాయి. ఈ సెర్చ్ ఆపరేషన్ ఇప్పటికే మూడోరోజుకు చేరుకుంది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు పారా కమాండోలతో పాటు మరో ముగ్గురు సైనికులకు గాయపడ్డారు. దీంతో భారత భద్రతా బలగాలు అప్రమత్తమై ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్న న్యూస్‌క్లిక్ అధినేత -
వామ్మో..! యాసిడ్ తాగేసిన తహసీల్దార్
జమ్మూ: విధుల్లో భాగంగా తహసీల్దార్ ఓ గ్రామానికి వెళ్లగా అక్కడ పని ముగిసిన తర్వాత దుకాణంలో నీళ్ల బాటిల్‌గా భావించి యాసిడ్ బాటిల్ తీసుకుని తాగేశాడు. వెంటనే అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని తోటి ఉద్యోగులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉంది. అయితే దుకాణదారుడు నీళ్ల బాటిల్ అనుకుని పొరపాటున యాసిడ్ బాటిల్ ఇచ్చాడు. దీంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన జమ్మూకశ్మీర్‌లో బుధవారం జరిగింది. కుల్గాం జిల్లాలోని దమాల్ హంజిపూర ప్రాంత తహసీల్దార్ నియాజ్ అహ్మద్ ఓ గ్రామంలో సాగు చేస్తున్న గసగసాల పంట పొలాలను పరిశీలించారు. అనంతరం వాటిని ధ్వంసం చేసి ఉదయం 11 గంటల సమయంలో అక్కడే ఉన్న ఓ దుకాణానికి వెళ్లారు. నీళ్ల బాటిల్ అడగ్గా దుకాణదారుడు పొరపాటున యాసిడ్ బాటిల్ ఇచ్చాడు. ఇది గమనించకుండా తహసీల్దార్ నియాజ్ అహ్మద్ తాగేశాడు. తాగిన వెంటనే ఆయన అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే తోటి ఉద్యోగులు స్థానికులతో కలిసి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన దమాల్ హంజిపురలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు దుకాణదారుడిని అరెస్ట్ చేసి అతడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చదవండి: అయ్యో పాపం.. అదా రాణి! -
కుల్గాం ఘటన లష్కరే తోయిబా పనే : ఐజీ
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో బీజేపీ నేతలపై గురువారం జరిగిన దాడి వెనుక లష్కరే తోయిబా (ఎల్ఇటి) ఉగ్రవాదులు ఉన్నారని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ ధృవీకరించారు. లష్కరే తోయిబా అనుబంధ ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ఈ దాడికి పాల్పడినట్లు ఆయన తెలిపారు. కాగా కుల్గాం జిల్లా బీజేవైఎమ్ జిల్లా కార్యదర్శి ఫిదా హుస్సేన్, కమిటీ సభ్యులు ఉమర్ హజం, ఉమర్ రషీద్ బేగ్ అనే వారిని గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. జూన్ నుంచి ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 8 మంది బీజేపీ కార్యకర్తలు బలయ్యారు. తాజా ఘటనపై కుల్గాంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ కార్యకర్తల హత్య నేపథ్యంలో భారీగా బలగాలను మోహరించారు. కుల్గం ఘటనను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఖండించారు. ఇలాంటి చర్యలను ఎంతమాత్రం సమర్థించలేమని, దోషులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. (ముగ్గురు బీజేపీ నేతల కాల్చివేత ) -
ఉగ్ర ఘాతుకం: బీజేపీ నేతల కాల్చివేత
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కుల్గాం జిల్లాలో ముగ్గురు బీజేపీ నేతలను పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనకు లష్కరే తోయిబా అనుబంధ ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) బాధ్యతగా ప్రకటించుకుంది. కుల్గాం జిల్లా బీజేవైఎమ్ జిల్లా కార్యదర్శి ఫిదా హుస్సేన్, కమిటీ సభ్యులు ఉమర్ హజం, ఉమర్ రషీద్ బేగ్ అనే వారిని గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్చి చంపారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. జూన్ నుంచి ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 8 మంది బీజేపీ కార్యకర్తలు బలయ్యారు. తాజా ఘటనపై కుల్గాంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ కార్యకర్తల హత్య నేపథ్యంలో భారీగా బలగాలను మోహరించారు. మరోవైపు ఉగ్రవాదుల తీరుపై పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి తగిన బుద్ది చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని విచారం.. కుల్గాం జిల్లాలో ముగ్గురు బీజేపీ కార్యకర్తల కాల్చివేతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీర్లో బీజేపీ ఎదుగుదలకు ఎంతోగానే శ్రమిస్తున్న యువ కార్యకర్తలను దారుణంగా హతమార్చడాన్ని ఖండించారు. బాధితులు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై జమ్మూ కశ్మీర్ లెఫ్టెనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, జాతీయ నేతలు విచారం వ్యక్తం చేశారు. కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేతకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. I condemn the killing of 3 of our young Karyakartas. They were bright youngsters doing excellent work in J&K. My thoughts are with their families in this time of grief. May their souls rest in peace. https://t.co/uSfsUP3n3W — Narendra Modi (@narendramodi) October 29, 2020 -
జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ కుల్గాం జిల్లాలోని వాన్‌పోరాలో శనివారం భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ సందర్బంగా జమ్మూ కాశ్మీర్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ (కాశ్మీర్ జోన్) విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘వాన్‌పోరా ప్రాంతంలో ముష్కరులు ఉన్నట్లు మాకు సమాచారం అందింది. దాంతో ఆర్మీ, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా నిర్బంధ తనిఖీలు నిర్వహించాయి. అనుమానిత ప్రాంతానికి వచ్చే సరికి ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఘటనాస్థలి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. మిగతా ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి’ అని తెలిపారు. -
కశ్మీర్లో మరోసారి ఉగ్రపంజా; ఐదుగురు మృతి
శ్రీనగర్ : కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి దాడికి తెగబడ్డారు. బెంగాల్‌కు చెందిన ఐదుగురు వలస కూలీలను పొట్టనబెట్టుకున్నారు. దక్షిణ కశ్మీరులోని కుల్గాం జిల్లాలో మంగళవారం ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా మరొక కూలీ తీవ్రంగా గాయపడ్డారు. కాగా వీరందరూ పశ్చిమబెంగాల్లోని ముర్షిదాబాద్ ప్రాంతం నుంచి వచ్చిన దినసరి కూలీలని కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ పేర్కొన్నారు. తమ పని ముగించుకొని ఇంటికి వెళ్లాలని సోపోర్ బస్టాండ్‌కు వచ్చిన సమయంలో ఉగ్రవాదులు వీరిపై దాడికి తెగబడ్డారని డీజీపీ తెలిపారు. కాగా, ఉగ్రవాదులు అనంత్‌నాగ్ జిల్లాలో ట్రక్కు డ్రైవర్‌ను పొట్టన బెట్టుకున్న మరుసటి రోజే ఈ దారుణానికి ఒడిగట్టారని పేర్కొన్నారు. చనిపోయిన ఐదుగురిలో షేక్ కమ్రూద్దీన్, షేక్ మహ్మద్ రఫీక్, షేక్ ముర్న్సులిన్ గా గుర్తించినట్లు తెలిపారు. దాడిలో తీవ్రంగా గాయపడిన జహోరుద్దీన్‌ను చికిత్స కోసం అనంత్‌నాగ్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ సంఘటన నేపథ్యంలో కశ్మీర్ ప్రాంతంలో భద్రతా బలగాలతో భారీ గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. యూరోపియన్ పార్లమెంటరీ కమిటీ జమ్మూ కశ్మీర్ పర్యటనకు వచ్చిన రోజే ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడడం గమనార్హం. మరోవైపు ఈ దాడిని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తీవ్రంగా ఖండించారు. అమాయక ప్రజలను బలిగొంటున్న ఉగ్రవాదులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. చనిపోయిన ఐదుగురికి తన ప్రగాడ సానభూతిని ప్రకటించిన మమత వారి కుటుంబాలకు మా ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. -
పక్కా సమాచారంతో దాడి.. ముగ్గురు జైషే ఉగ్రవాదుల హతం
న్యూఢిల్లీ : కశ్మీర్ లోయలో మరో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. కుల్గామ్ జిల్లాలోని తురిగామ్‌లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు ఆదివారం కార్డన్ సెర్చ్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీగా ఎదురు కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల దాడిని తిప్పికొట్టే క్రమంలో క్రమంలో ఓ పోలీస్ అధికారి, ఓ ఆర్మీ జవాన్ మరణించారు. ఓ ఆర్మీ మేజర్, ఇద్దరు జవాన్లు, ఒక హవల్దార్ తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించారు. అమరుడైన పోలీస్ అధికారిని డీఎస్పీ (ఆపరేషన్స్) అమన్ ఠాకూర్‌గా గుర్తించారు. ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు అసువులుబాసిన విషయం తెలిసిందే. (బాధను భరిస్తూ కూర్చోం) (చదవండి : ఇమ్రాన్.. అమాయకత్వపు ముసుగు తీసేయ్: ఒవైసీ) -
ఐదుగురు ఉగ్రవాదుల ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కుల్గామ్ జిల్లాలోని కెల్లెమ్ గ్రామంలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో భద్రతాబలగాలు ఐదుగురు ఉగ్రవాదుల్ని హతమార్చాయి. ఉగ్రవాదుల కదలికలపై నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో భద్రతాబలగాలు కెల్లెమ్‌ను చుట్టుముట్టి గాలింపును ప్రారంభించాయి. బలగాల కదలికల్ని గుర్తించిన ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి పరారయ్యేందుకు యత్నించారు. ఈ సందర్భంగా భద్రతాబలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబాతో పాటు హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన వసీమ్ అహ్మద్, అకీజ్ నజీర్ మీర్, పర్వేజ్ అహ్మద్‌భట్, ఇద్రీస్ అహ్మద్, జహీద్ అనే ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఓ జవాన్‌తోపాటు పౌరుడిని హత్యచేసిన కేసులో వీరంతా నిందితులని తెలిపారు. అనంతనాగ్, కుల్గామ్ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, భద్రతాసంస్థలపై వీరు గ్రనేడ్ దాడులకు పాల్పడ్డారని వెల్లడించారు. ఎన్కౌంటర్ అనంతరం ఘటనాస్థలం నుంచి తుపాకులతో పాటు భారీఎత్తున మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. -
కశ్మీర్లో హైటెన్షన్
సాక్షి, న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం కుల్గామ్ జిల్లాలోని హవూరా గ్రామంలో అల్లరిమూక రాళ్లదాడితో రెచ్చిపోగా.. వారిని అదుపుచేసే క్రమంలో భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఓ బాలికతోపాటు ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో పది మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం కార్డన్ సెర్చ్ చేపట్టిన భద్రతా బలగాలను అడ్డుకునే క్రమంలో అల్లరిమూక రాళ్లదాడికి పాల్పడింది. దీంతో బలగాలు కాల్పులు ప్రారంభించాయి. మృతులను షకీర్ అహ్మద్(22), ఇర్షద్ మాజిద్(20), అంద్లీబ్(16)గా గుర్తించారు. ఇక ఘటన అనంతరం పుకార్లు చెలరేగకుండా ఉండేందుకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఖుల్గాం, అనంతనాగ్, సోఫియాన్, పుల్వామా జిల్లాల్లో బలగాలను భారీ ఎత్తున్న మోహరించి పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. -
ఉగ్రవేట: ఇద్దరు లష్కరే ఉగ్రవాదుల హతం
-
పోలీస్ స్టేషన్ పై గ్రెనేడ్ దాడి
శ్రీనగర్: పోలీస్ స్టేషన్ పై గ్రెనేడ్ దాడి జరిగిన ఘటనలో ఇద్దరు పోలీసులతో పాటు ఓ పౌరునికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జమ్ము కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. దమ్హాల్ హాంజిపుర పోలీస్ స్టేషన్‌పై గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు. ఏం జరిగిందో గుర్తించే లోపే పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఓ స్పెషల్ పోలీస్ ఆఫీసర్, ఓ కానిస్టేబుల్లతో పాటు తన పని నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన పౌరుడు తీవ్రంగా గాయాపడ్డారు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
పోలీస్ స్టేషన్‌పై గ్రెనెడ్‌తో దాడి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ విరుచుపడ్డారు. కుల్గాం జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు గ్రెనేడ్‌తో దాడి చేశారు. ఈ దాడిలో ఓ పోలీస్ మరణించగా, మరో నలుగురు పోలీసులు గాయపడ్డారు. ఉగ్రవాదుల దాడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. జమ్ము కశ్మీర్లో ఇటీవల భద్రత బలగాలు హిజ్బుల్ కమాండర్ బుర్హాన్‌తో అతని ఇద్దరు సహాయకులను కాల్చిచంపిన సంగతి తెలిసిందే. ఈ ఎన్కౌంటర్ అనంతరం కశ్మీర్లో అల్లర్లు చెలరేగాయి. వేర్పాటువాదులు బంద్‌కు పిలుపునివ్వడం, నిరసనకారులు ఆందోళనకు దిగడంతో హింస చెలరేగింది. దాదాపు 30 మంది మరణించారు. పరిస్థితులు కుదుటపడుతున్న తరుణంలో ఉగ్రవాదులు మరోసారి దాడికి పాల్పడ్డారు. -
వీళ్లు పోలీసులేనా..!
అసలే దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉంది. ఉగ్రవాదులు, విద్రోహశక్తులు ఏక్షణమైనా విరుచుకుపడొచ్చని, ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ వర్గాలు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీచేస్తూనేఉన్నాయి. ఇక నిత్యం అసాధారణ స్థితిలో కొనసాగే జమ్ముకశ్మీర్ లోనైతే ఇంచు ఇంచూ వదలకుండా సోదాలు, 24x7 కాపలా తప్పనిసరి. అయితే క్షేత్రస్థాయి పోలీసులు ఇవేవీ పట్టనట్లు.. తమకు అలవాటైన సోమరితనంలోనే జోగుతున్నారు సరిహద్దు రాష్ట్రంలో. అనుమానిత ఉగ్రవాదులు గుట్టుగా వచ్చి, తుపాకులు లాక్కుపోయినా చలనంలేని వ్యవస్థను ఏమనాలి? జమ్ముకశ్మీర్ లోని కుల్గాం జిల్లా అడిజన్ చెక్ పోస్టు వద్ద కాపలాకాస్తున్న పోలీసుల చేతుల్లోనుంచి నాలుగు తుపాకులు లాక్కొన్న ఉగ్రవాదులు అడవిలోకి పరారయ్యారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సయంలో చోటుచేసుకున్న ఈ సంఘటనలో నిందితులకోసం ఇంకా గాలిస్తూనేఉన్నారు. మైనారిటీలు ఉండే ప్రాంతంలో చెక్ పోస్ట్ ను ఏర్పాటుచేసిన పోలీస్ శాఖ అక్కడ నిరంతరం నలుగురు సిబ్బందిని కాపలాగా ఉంచుతుంది. వాళ్ల పనితీరు ఎలా ఉందో నేటి ఘటనతో వెలుగులోకి వచ్చింది. దుండగులు ఎత్తుకెళ్లినవాటిల్లో రెండు ఎస్ఎల్ ఆర్ లు, రెండు ఐఎన్ఎస్ఏఎస్ రైఫిళ్లు ఉన్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామని ఉన్నతాధికారులు చెప్పారు.