శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ విరుచుపడ్డారు. కుల్గాం జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్పై ఉగ్రవాదులు గ్రెనేడ్తో దాడి చేశారు. ఈ దాడిలో ఓ పోలీస్ మరణించగా, మరో నలుగురు పోలీసులు గాయపడ్డారు. ఉగ్రవాదుల దాడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
జమ్ము కశ్మీర్లో ఇటీవల భద్రత బలగాలు హిజ్బుల్ కమాండర్ బుర్హాన్తో అతని ఇద్దరు సహాయకులను కాల్చిచంపిన సంగతి తెలిసిందే. ఈ ఎన్కౌంటర్ అనంతరం కశ్మీర్లో అల్లర్లు చెలరేగాయి. వేర్పాటువాదులు బంద్కు పిలుపునివ్వడం, నిరసనకారులు ఆందోళనకు దిగడంతో హింస చెలరేగింది. దాదాపు 30 మంది మరణించారు. పరిస్థితులు కుదుటపడుతున్న తరుణంలో ఉగ్రవాదులు మరోసారి దాడికి పాల్పడ్డారు.
పోలీస్ స్టేషన్పై గ్రెనెడ్తో దాడి
Published Fri, Jul 15 2016 7:11 PM | Last Updated on Mon, Sep 4 2017 4:56 AM
Advertisement
Advertisement